
బెంగళూరు: కర్ణాటకలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. విద్యార్ధులకు మంచి బుద్దులు నేర్పించాల్సిన టీచార్.. చిన్నారుల పట్ల నీచంగా ప్రవర్తించాడు. తరగతి గదిలోనే 11 ఏళ్ల విద్యార్థినిపై ఓ టీచర్ అత్యాచారానికి యత్నించాడు. కలబురగి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈఘటన చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. అలంద్ తాలూకాలోని నింబర్గా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి యత్నించాడు. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసి తరగతి గదికి వెళ్లిన సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక క్లాస్‌లో ఒంటరిగా ఉంది. అరిస్తే చంపేస్తానంటూ బెదిరించి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.
అయితే బాలిక ధైర్యంగా పోరాడింది. సాయం కోసం గట్టిగా కేకలు వేయడంతో వెంటనే నిందితుడు స్కూల్ నుంచి పరారయ్యాడు. భయంతో ఇంటికి వెళ్లిన బాధితురాలు జరిగిన విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే పాఠశాల ప్రిన్సిపల్‌ను కలిసి దీనిపై ప్రశ్నించారు. ఆ తరవాత తల్లిదండ్రులు నింబర్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment