నిన్నే పెళ్లాడుతా.. బాలికపై ఉపాధ్యాయుడి వేధింపులు | Teacher Sexually Harassed 6th Class Girl Student In Karnataka - Sakshi
Sakshi News home page

నువ్వు చీరలో చాలా అందంగా ఉన్నావు..

Published Thu, Dec 21 2023 10:01 AM | Last Updated on Thu, Dec 21 2023 11:12 AM

teacher molestation on girl - Sakshi

కర్ణాటక: వసతి పాఠశాల విద్యార్థినితో ఒక ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన తుమకూరు తాలూకా హెబ్బూరులోని నరసాపుర మొరార్జీ వసతి పాఠశాలలో జరిగింది. ఇటీవల జరిగిన ఒక స్వాగత వేడుకలో ఆరో తరగతి చదువుతున్న బాలికతో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు రవీంద్ర అసభ్యంగా ప్రవర్తించాడు.

నువ్వు చీరలో చాలా అందంగా ఉన్నావు, వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటూ రవీంద్ర వేధించాడు. పదే పదే వెంటబడి వేధిస్తున్న రవీంద్ర పోరు తట్టుకోలేక బాలిక ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించింది. తరువాత తన సోదరుడు, మామతో పాటు మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు సదరు కీచకున్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement