కోల్‌కతా: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే తన విద్యార్ధిని పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. కోల్‌కతాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అదే స్కూల్లో చదువుతున్న ఆరేళ్ల విద్యార్ధినిని రేప్ చేశాడు. దారుణ విషయం తెల్సుకున్న బాలిక కుటుంబసభ్యులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. పాఠశాలకు వెళ్లే మార్గంలో ఆందోళన చేపట్టారు.
పాఠశాలలోకి వెళ్లేందుకు బాలిక బంధువులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డకున్నారు. దీంతో బంధువులు, స్థానికులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో 10 మంది పోలీసు సిబ్బంది, ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడినట్లు డీసీపీ కల్యాణ్ ముఖర్జీ తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment