ఆ వీడియో చూపించిన టీచర్కు 20 వేల ఫైన్
న్యూయార్క్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తల నరికివేస్తున్న దృశ్యాలను స్కూల్ విద్యార్థులకు చూపించినందుకు ఓ టీచర్కు భారీ ఫైన్ వేశారు. అమెరికాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2014-15లో అమెరికాలోని సౌత్ బ్రాంక్స్ అకాడమీలో లెక్సిక్ నైజారియో అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అతడి ఏడాది సంపాధన దాదాపు రూ.60లక్షల పైనే.
ఆయన ఉగ్రవాదులకు సంబంధించిన పాఠాలు బోధిస్తూ ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక భయంకరమైన వీడియో చూపించాడు. అందులో సముద్రం ఒడ్డున కొంతమంది బందీల తలలు ఏ విధంగా ఉగ్రవాదులు నరికేస్తున్నారో రికార్డయిన దృశ్యాలు ఉన్నాయి. వాటిని చూసిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం బయటకు తెలిసి ఆ ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదుచేయగా పలు దఫాలుగా విచారించిన కోర్టు చివరకు రూ.20 వేల ఫైన్ వేసింది.