list
-
మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన మహావికాస్ అఘాడి, మహాయుతి పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మొత్తం మూడు జాబితాలతో కలిపి కాంగ్రెస్ ఇప్పటివరకు 87 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.కాంగ్రెస్ మూడో జాబితాలో డిగ్రాస్ నుంచి మాణిక్‌రావ్ ఠాక్రేను పార్టీ బరిలోకి దించింది. బాంద్రా వెస్ట్ నుంచి ఆసిఫ్ జకారియా, అంధేరీ వెస్ట్ నుంచి సచిన్ సావంత్‌లకు పార్టీ టిక్కెట్ ఇచ్చింది. మాలెగావ్ సెంట్రల్ నుండి కాంగ్రెస్ ఎజాజ్ బేగ్‌కు అవకాశం కల్పించింది. అయితే సమాజ్ వాదీ పార్టీ ఈ సీటు కోసం పట్టుపడుతున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ తన రెండో జాబితాలో 23 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, తొలి జాబితాలో 48 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.మరోవైపు మహా వికాస్ అఘాడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకానికి సంబంధించిన ఫార్ములాను ప్రకటించింది. దీని ప్రకారం శివసేన (యూబీటీ), కాంగ్రెస్- ఎన్సీపీ (ఎస్పీ) చెరో 85 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కొన్ని సీట్ల విషయంలో ఇంకా ప్రతిష్టంభన నెలకొంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 20న జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది.ఇది కూడా చదవండి: వంట నూనె ధరలకు రెక్కలు -
యూపీ ఉపఎన్నికల బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కర్హల్ సీటులో లాలూ యాదవ్ అల్లుడు, అఖిలేష్ మేనల్లుడు అయిన తేజ్ ప్రతాప్ యాదవ్(ఎస్పీ)పై పోటీకి బీజేపీ అనుజేష్ యాదవ్‌ను నిలబెట్టింది. కాన్పూర్‌లోని సిస్మౌ, మిర్జాపూర్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.బీజేపీ ప్రకటించి అభ్యర్థుల జాబితా ప్రకారం కుందర్కి నుంచి రాంవీర్ సింగ్ ఠాకూర్, ఘజియాబాద్ నుంచి సంజీవ్ శర్మ, ఖైర్ (ఎస్సీ) నుండి సురేంద్ర దిలేర్, కర్హల్ నుంచి అనుజేష్ యాదవ్, ఫుల్పూర్ నుంచి దీపక్ పటేల్, కాటేహరి నుండి ధర్మరాజ్ నిషాద్, మజ్వాన్ నుండి సుచిస్మిత మౌర్య పోటీ చేస్తున్నారు.నవంబర్ 13న ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. యూపీలోని 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కారణంగా మిల్కీపూర్ ఉప ఎన్నికల తేదీని ప్రకటించలేదు. ఇది కూడా చదవండి: అదే జరిగితే.. రష్యా బలహీతకు సంకేతం: అమెరికా -
దేశంలోని ఐదు ప్రముఖ కాళీమాత మందిరాలు
కోల్‌కతా: దేశంలో దేవీ నవరాత్రుల వైభవం కొనసాగుతోంది. ఈ నవరాత్రులలో ఏడవ రోజున కాళికాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దుర్గాదేవి రూపం మహిళా సాధికారతకు చిహ్నంగా పరిగణిస్తారు. కాళికా రూపాన్ని పూజించడం ద్వారా శత్రుబాధ నివారణ అవుతుందని, దుఃఖాలు నశించిపోతాయని చెబుతుంటారు.దేశంలో పలు కాళీమాత ఆలయాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆసక్తికర చరిత్రలు ఉన్నాయి. వీటిలో ఐదు దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కాలిబడి(ఆగ్రా)ఆగ్రాలోని కాలిబడి కాళికా ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ ఉన్న అద్భుత ఘాట్‌లోని నీరు ఎప్పటికీ ఎండిపోదని, అందులో క్రిమికీటకాలు పెరగవని స్థానికులు చెబుతుంటారు.జై మా శ్యామసుందరి(కోల్‌కతా)మరో కాళీ దేవాలయం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉంది. దాని పేరు జై మా శ్యామసుందరి కాళీ మందిరం. ఈ ఆలయంలో కాళీదేవి సంచరిస్తుందని స్థానికులు చెబుతుంటారు. ప్రతీరోజూ ఉదయం ఆలయ తలుపు తెరిచినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయని అంటారు.కాళీఘాట్(పశ్చిమ బెంగాల్)మూడవ కాళీ దేవాలయం కూడా పశ్చిమ బెంగాల్లో ఉంది. కాళీఘాట్‌లోని ఈ కాళీ దేవాలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో కాళీదేవి నాలుక బంగారంతో తయారు చేశారు.కాళీ ఖో(ఉత్తరప్రదేశ్)నాల్గవ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో వింధ్య పర్వతంపై కాళీ ఖో పేరిట ఉంది. ఈ ఆలయం ధ్యాన సాధనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారికి సమర్పించే ప్రసాదం మాయమవుతుండటం వెనక కారణం ఏమిటో నేటికీ వెల్లడి కాలేదని భక్తులు చెబుతుంటారు.మాతా బసయ్య(మొరెనా) ఐదవది ఉత్తరప్రదేశ్‌లోని మొరెనాలో ఉన్న మాతా బసయ్య ఆలయం. ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల క్రితం నాటిది. నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ద్వారా భక్తుల తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇది కూడా చదవండి: కైలాస్నాథ్... చరణాద్రి శిఖరం -
మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ సినిమా.. ఆ లిస్ట్‌లో ఏకంగా రెండో స్థానం!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ 'భ్రమయుగం'. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రాహుల్ సదాశివన్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్వైట్లోనే రూపొందించడం మరో విశేషం. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను దక్కించుకుంది.ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హారర్ ఫిల్మ్స్‌లో ఈ మూవీకి చోటు దక్కింది. ప్రముఖ మూవీ రివ్యూ రేటింగ్స్ ఇచ్చే లెటర్ బాక్స్ డీ సంస్థ తాజాగా జాబితాను రిలీజ్ చేసింది. 2024లో వచ్చిన బెస్ట్ 25 హారర్ ఫిల్మ్స్ లిస్ట్‌ను వెల్లడించింది. ఈ లిస్ట్‌లో మొదటిస్థానంలో ది సబ్‌స్టాన్స్ నిలవగా.. జపనీస్ మూవీ చిమే మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా డెడ్ టాలెంట్స్ సొసైటీ, యువర్ మాన్స్టర్, ఏలియన్ రొమ్యూలస్, ది గర్ల్ విత్ ది నీడిల్, స్ట్రేంజ్ డార్లింగ్, ఎక్స్హ్యుమా, ఐ సా ది టీవీ గ్లో చిత్రాలు టాప్-10లో నిలిచాయి. ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రద్ధాకపూర్ హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2 23వ స్థానం దక్కించుకుంది. (ఇది చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ)‘భ్రమయుగం’ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన దేవన్(అర్జున్ అశోకన్) మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిరి తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్), మరొకరు యజవానమి కుడుమన్ పొట్టి(మమ్ముట్టి). దేవన్‌కి కుడిమన్ పొట్టి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. తక్కువ కులం వాడు అని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన అతిథి అని తనతో సమానంగా చూడాలని వంట మనిషికి ఆదేశిస్తాడు.అయితే అక్కడ జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దేవన్ ఆ భవనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. అసలు కుడిమన్ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు. అతని గురించి అన్నీ తెలిసినా వంటమనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు? దేవన్ని బంధీగా ఎందుకు మార్చారు? చివరకు ఆ ఇంటి నుంచి దేవన్ తప్పించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే భ్రమయుగం చూడాల్సిందే. ప్రస్తుతం భ్రమయుగం సోనిలీవ్‌లో అందుబాటులో ఉంది.Letterboxd’s Top 10 Horror Films of 2024 (so far) 👻See the full list of The Official Top 25 Horror Films of 2024 here: https://t.co/x95L2cdqNZ pic.twitter.com/uL0wziJIMB— Letterboxd (@letterboxd) October 1, 2024 -
ఆ రెండు స్కూళ్లలో వాళ్లని కాల్చి చంపేస్తా!
ఫ్లోరిడా: రెండు స్కూళ్లలో కాల్పులు జరిపి, చంపాల్సిన ‘కిల్ లిస్ట్‌ను తయారు చేసుకున్నాడు. అందుకు రకరకాల రైఫిళ్లు, పిస్టళ్లతోపాటు, కత్తులను సైతం సిద్ధం చేసుకున్నాడు. కిల్ లిస్ట్‌తోపాటు ఆయుధ సామగ్రి ఫొటోలను ఆన్లైన్లో తన క్లాస్మేట్లకు గొప్పగా చూపించుకున్నాడు. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన 11 ఏళ్ల బాలుడి ఘన కార్యమిది. .! అసలే స్కూళ్లలో కాల్పుల ఘటనలతో జనం గగ్గోలు పెడుతున్న సమయం. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. దీంతో, వారు ‘కార్లో కింగ్స్టన్’ డొరెల్లి’ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారు. అతడు పోగేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ‘క్రీక్ సైడ్ మిడిల్ స్కూల్లో చదువుకుంటున్న కార్లో అనే బాలుడు క్రీక్ సైడ్, సిల్వర్ శాండ్ మిడిల్ స్కూళ్లలో వాళ్లను కాల్చి చంపేందుకు పథకం వేశాడు. పేర్లు, లక్ష్యాలతో జాబితాను సైతం సిద్ధం చేసుకున్నాడు. వీటిని ఆన్లైన్లో పెట్టాడు. ఇదేమని అడిగితే ఒట్టి జోక్ మాత్రమే అంటున్నాడు’ అని ఒలూసియా కౌంటీ షరీఫ్ మైక్ చిట్వూడ్ తెలిపారు. అధికారులు బాలుడికి సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్తున్న వీడియోను ఆయన ‘థ్రెడ్’లో షేర్ చేశారు. అతడిపై శిక్షార్హమైన నేరం కింద కేసు నమోదు చేశామన్నారు. ‘ఉత్తుత్తిగా లేదా నిజంగానే బెదిరింపులకు గురిచేసే పిల్లల ఫొటోలతో వివరాలను బహిర్గతం చేస్తాం. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి’అని తల్లిదండ్రులను హెచ్చరించారు. -
ధనవంతుల జాబితాలో వెనక్కి తగ్గిన అంబానీ (ఫోటోలు)
-
మన దేశంలో అత్యంత చెత్త వంటకాలు ఇవే..! అందులో ఉప్మా..!
అంతర్జాతీయ సంస్థ టేస్ట్ అట్లాస్ మన దేశంలో చెత్త వంటకాల జాబితాను విడుదల చేసింది. అలాగే మనదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల జాబితాను విడుదల చేసింది. ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారాలు, ఇష్టంలేని ఆహారాలు అనేవి కచ్చితంగా ఉంటాయి. వాటి గురించి వివరాలు సేకరించి... ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల జాబితాను, ఎక్కువ మంది తినడానికి ఇష్టపడని వంటకాల జాబితాను సిద్ధం చేస్తుంది ‘టేస్ట్ అట్లాస్’ సంస్థ. టేస్ట్ అట్లాస్ అనేది ఆన్లైన్ ఫుడ్ పోర్టల్. ఇది ప్రపంచంలోని బెస్ట్ వంటకాలు, బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ప్రకటిస్తుంటుంది. అలానే తాజాగా మనదేశంలో ఎక్కువశాతం ప్రజలు ఇష్టపడే వంటకాలు, ఇష్టపడని వంటకాల గురించి టేస్ట్ అట్లాస్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్ పదిలో ఉన్న చెత్త , ఉత్తమ రేటింగ్ పొందిన భారతీయ వంటకాల వివరాలను వెల్లడించింది. చెత్త వంటకాలు ఇవే…టేస్ట్ అట్లాస్ జాబితా ప్రకారం చెత్త రేటెడ్ ఫుడ్స్ ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వేసవిలో ఎంతో మంది ఆరోగ్యాన్ని కాపాడే జల్జీరా… ఈసారి చెత్త వంటకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తర భారతదేశంలో ఈ పానీయాన్ని విపరీతంగా తాగుతారు. అలాంటిది మనదేశంలోని చెత్త వంటకాల జాబితాలో మొదటి స్థానంలో నిలవడం షాక్‌కి గురిచేస్తుంది. చెత్త వంటకాల్లో రెండో స్థానంలో శీతాకాలంలో అతిగా తినే గజ్జక్ ఉంది. మూడో స్థానంలో దక్షిణ భారత వంటకం తెంగై సదం, నాలుగో స్థానంలో ఒడిశాకు చెందిన ప్రసిద్ధ పంతా బాత్, ఐదో స్థానంలో ఆలూ వంకాయ కర్రీ, ఆరో స్థానంలో తండాయ్ ఉన్నాయి. దీని తరువాత, కేరళ వంటకం అచ్చప్పం ఏడవ స్థానంలో, ప్రసిద్ధ హైదరాబాదీ మిర్చి కా సలాన్ ఎనిమిదో స్థానంలో, తీపి వంటకం మల్పువా తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇక దక్షిణ భారతదేశంలో అల్పాహారంలో అధికంగా తినే ఉప్మా పదో స్థానంలో నిలిచింది. ఉప్మాను అధికంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తింటారు.బెస్ట్ ఫుడ్ ఇవే..మనదేశంలో బెస్ట్ ఫుడ్ జాబితాలో ఏ ఆహారాలు నిలిచాయో టేస్ట్ అట్లాస్ వివరించింది. ఆ ఫుడ్ లిస్ట్‌లో ఉన్న రుచికరమైన మామిడి లస్సీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మసాలా చాయ్ రెండో స్థానంలో, బటర్ గార్లిక్ నాన్ మూడో స్థానంలో ఉన్నాయి. నాలుగో స్థానంలో అమృత్ సర్ కుల్చా, ఐదో స్థానంలో బటర్ చికెన్, ఆరో స్థానంలో హైదరాబాదీ బిర్యానీ, ఏడో తేదీన షాహి పనీర్, ఎనిమిదో స్థానంలో అందరికీ ఇష్టమైన చోలే భటురే నిలిచాయి. ఆ తర్వాత తందూరీ చికెన్ తొమ్మిదో స్థానంలో, కోర్మా పదో స్థానంలో నిలిచాయి. సాధారణంగా హైదరాబాదీ బిర్యానీ మొదటి స్థానంలో ఉంటుంది. కానీ ఈసారి బిర్యానీ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.టేస్టీ అట్లాస్ నిర్వాహకులు తమ పోర్టల్‌లో ఎవరికి ఏ ఆహారం అధికంగా నచ్చుతుందో, ఏ ఆహారం నచ్చదో చెప్పమని అడుగుతారు. మనదేశంలోని ఎవరైనా ఆ పోర్టల్ రెస్పాండ్ కావచ్చు. ఈ సర్వేలో పాల్గొన వచ్చు. ఆ విధంగా ఎక్కువ ఓట్లు పడిన వంటకాల జాబితాను సిద్ధం చేసి విడుదల చేస్తారు.(చదవండి: ఎలాంటి ఆహారం తీసుకుంటే హెల్తీగా ఉంటారు? నిపుణులు ఏమంటున్నారంటే..) -
కుంభమేళా నుంచి హత్రాస్ వరకు.. మహా విషాదాలు
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన సత్సంగ్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 116 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దేశంలో ఇలాంటి విషాదాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2005లో మహారాష్ట్రలోని మంధరాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది మృతి చెందారు. 2008లో రాజస్థాన్‌లోని చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 250 మంది మృత్యువాత పడ్డారు. 2008లో హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటుచేసుకున్న ఈ తరహా విషాదాలు..2023, మార్చి 31: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామ నవమి వేళ ఒక ఆలయం స్లాబ్ కూలిపోవడంతో 36 మంది మృతి చెందారు.2022, జనవరి 1 : జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది కన్నుమూశారు.2015, జూలై 14: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో పుష్కరాల మొదటి రోజున గోదావరి నది ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు.2014, అక్టోబర్ 3: బీహార్‌లోని పట్నాలో దసరా వేడుకల సందర్భంగా గాంధీ మైదాన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 32 మంది మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు.2013, అక్టోబరు 13: మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలోని రతన్‌ఘర్ దేవాలయం సమీపంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మృతి చెందారు. 100 మందికి పైగా జనం గాయపడ్డారు.2012, నవంబర్ 19: బీహార్‌లోని పట్నాలో గంగా నది ఒడ్డున అదాలత్ ఘాట్ వద్ద ఛత్ పూజలు నిర్వహిస్తుండగా తాత్కాలిక వంతెన కూలిపోవడంతో తొక్కిసలాట జరిగి 20 మంది మరణించారు.2011, నవంబర్ 8: హరిద్వార్‌లోని గంగా నది ఒడ్డున హర్కీ పైడి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందారు.2011, జనవరి 14 : కేరళలోని ఇడుక్కి జిల్లాలోని పులమేడు వద్ద విషాదం చోటుచేసుకుంది. శబరిమల ఆలయాన్ని సందర్శించి వస్తున్న భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 104 మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు.2010, మార్చి 4: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో కృపాలు మహారాజ్ రామ్ జానకి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 63 మంది మరణించారు.2008, సెప్టెంబరు 30 : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గల చాముండా దేవి ఆలయంలో బాంబు పేలుడు వదంతుల కారణంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 250 మంది కన్నుమూశారు. 60 మందికి పైగా జనం గాయపడ్డారు.2008, ఆగస్ట్ 3: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోని నైనా దేవి ఆలయంలో కొండ చరియలు విరిగి పడ్డాయనే వదంతులు రావడంతో జరిగిన తొక్కిసలాటలో 162 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు.2005, జనవరి 25: మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మంధరాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు.2003, ఆగష్టు 27: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో సింహస్థ కుంభమేళా పవిత్ర స్నానాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందారు. 140 మంది గాయపడ్డారు. -
2024 ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితా
ఫోర్బ్స్ తన 30 అండర్ 30 ఆసియా తొమ్మిదవ ఎడిషన్‌ను ప్రకటించింది. ఇందులో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 300 మంది యువ పారిశ్రామికవేత్తలు, లీడర్స్, ట్రయల్బ్లేజర్లు ఉన్నారు. వీరి వయసు 30 ఏళ్లకంటే తక్కువ.అండర్ 30 ఆసియా క్లాస్ ఆఫ్ 2024లో ది ఆర్ట్స్, ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్, మీడియా మొదలైన 10 విభాగాల్లో 300 మంది ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్నవారిలో కే-పాప్ గర్ల్, సింగపూర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ వెరోనికా శాంతి పెరీరా, అషియా సిటీకి చెందిన జపాన్ యొక్క అతి పిన్న వయస్కుడైన మేయర్ రియోసుకే తకాషిమా మొదలైనవారు ఉన్నారు."30 అండర్ 30 ఆసియా" జాబితాసియాన్ డాసన్ - ఆస్ట్రేలియా: ది ఆర్ట్స్మెటల్ బ్యాండ్ - ఇండోనేషియా: ఎంటర్టైన్మెంట్ & స్పోర్ట్స్అలీనా నదీమ్ - పాకిస్తాన్ : ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్ఎరికా ఎంగ్ - మలేషియా: మీడియా, మార్కెటింగ్ & అడ్వర్టైజింగ్యూమీ హ్వాంగ్ - సౌత్ కొరియా: రిటైల్ & ఇకామర్స్జు యుయాంగ్ - చైనా: ఎంటర్ప్రైజ్ టెక్నాలజీఅక్షిత్ బన్సల్ & రాఘవ్ అరోరా - ఇండియా: ఇండస్ట్రీ, మాన్యుఫ్యాక్టరింగ్ & ఎనర్జీజాంగ్ జికియాన్ - చైనా: హెల్త్‌కేర్ & సైన్స్భాగ్య శ్రీ జైన్ - ఇండియా: సోషల్ ఇంపాక్ట్జాన్సన్ లిమ్ - సింగపూర్: కన్స్యూమర్ టెక్నాలజీ -
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆమ్ఆద్మీపార్టీ శనివారం(మే4)విడుదల చేసింది. ఈ లిస్టులో 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లను చేర్చింది.ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా జైలులో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్‌జైన్ పేర్లను లిస్టులో చేర్చడం గమనార్హం. వీరితో పాటు కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్ ఎంపీలు రాఘవ్చద్దా, సందీప్‌పాఠక్ ఢిల్లీ మంత్రులు, అతిశీ, సౌరభ్ భరద్వాజ్, గోపాల్‌రాయ్ తదితరులను స్టార్ క్యాంపెయినర్లుగా ఆప్ ప్రకటించింది. -
ఎన్నికల గుర్తుల్లో బుల్డోజర్ను ఎందుకు తొలగించారు?
దేశంలో లోక్‌సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఇదిలావుండగా ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే ఎన్నికల గుర్తుల జాబితా నుంచి బుల్డోజర్ చిహ్నాన్ని తొలగించింది. అయితే దీని వెనుక గల నిర్దిష్ట కారణాన్ని ఎన్నికల సంఘం వెల్లడించలేదు. గత కొన్ని సంవత్సరాలుగా బుల్డోజర్ ఒక ప్రత్యేక వర్గానికి గుర్తింపుగా మారిందనే భావన అందరిలో ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే దానిని తొలగించాల్సి వచ్చిందని తెలుస్తోంది. కాస్మోటిక్స్, పిల్లల బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులతో సహా పలు వస్తువులను ఎన్నికల గుర్తుల జాబితాలో చేర్చారు. ఈ జాబితాను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఇందులో 190 ఎన్నికల గుర్తులు ఉన్నాయి. వీటిలో బూట్లు, చెప్పులు, సాక్స్‌లు కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్, ముత్యాల హారం, చెవిపోగులు, ఉంగరం మొదలైనవాటిని జోడించారు. ఎన్నికల చిహ్నాల జాబితాలో ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఆపిల్, ఫ్రూట్ బాస్కెట్, బిస్కెట్లు, బ్రెడ్, కేక్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, కొబ్బరి, అల్లం, ద్రాక్ష, పచ్చిమిర్చి, ఐస్‌క్రీం, జాక్‌ఫ్రూట్, లేడీఫింగర్, నూడుల్స్, వేరుశెనగ, బఠానీలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో వాల్నట్, పుచ్చకాయను కూడా చేర్చారు. అలాగే బేబీ వాకర్, క్యారమ్ బోర్డ్, చెస్ బోర్డ్, కలర్ ట్రే బ్రష్, హ్యాండ్ కార్ట్, స్కూల్ బ్యాగ్, టోఫీలు, లూడో, లంచ్ బాక్స్, పెన్ స్టాండ్, పెన్సిల్ బాక్స్, షార్పనర్లు కూడా ఎన్నికల గుర్తుల జాబితాలో ఉన్నాయి. హార్మోనియం, సితార్, ఫ్లూట్, వయోలిన్ కూడా ఈ జాబితాలో కనిపిస్తాయి. కొన్ని ఎన్నికల చిహ్నాలు వాడుకలో లేకుండా పోయాయి. వీటిలో హ్యాండ్ మిల్లు, డోలీ, టైప్‌రైటర్, మంచం, బావి, టార్చ్, స్లేట్, టెలిఫోన్, రోకలి, బ్లాక్ బోర్డు, చిమ్నీ, పెన్ నిబ్, గ్రామోఫోన్, లెటర్ బాక్స్ మొదలైనవి ఉన్నాయి. ఎన్నికల గుర్తులకు సంబంధించిన ఆధునిక పరికరాల జాబితాలో ఎయిర్ కండీషనర్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, మౌస్, కాలిక్యులేటర్, సీసీ కెమెరా, డ్రిల్ మెషిన్, వాక్యూమ్ క్లీనర్, పెన్ డ్రైవ్, బ్రెడ్ టోస్టర్, రిమోట్, స్పానర్, స్టెప్లర్, స్టెతస్కోప్, ఎక్స్టెన్షన్ బోర్డ్, మైక్ , మిక్సర్, స్విచ్ బోర్డ్, సిరంజి, ఫ్రైయింగ్ పాన్, హెడ్ఫోన్లు, హెల్మెట్, రోబోట్, రూమ్ కూలర్, హీటర్ మొదలైనవి ఉన్నాయి. వీటికి తోడు ఎన్నికల చిహ్నాలలో అల్మారా, ఆటో రిక్షా, బెలూన్, బ్యాట్, బ్యాట్, బెల్ట్, బెంచ్, సైకిల్ పంప్, బైనాక్యులర్స్, సెయిలింగ్ బోట్, బాక్స్, ఇటుకలు, బ్రీఫ్‌కేస్, బ్రష్, బకెట్, డీజిల్ పంప్, డిష్ యాంటెన్నా, గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ , ప్రెస్, కెటిల్, కిచెన్ సింక్, పాన్, పెట్రోల్ పంప్, ఫోన్ ఛార్జర్, ప్రెజర్ కుక్కర్, పంచింగ్ మెషిన్, కత్తెర, కుట్టు మిషన్, నీటి పాత్ర, సబ్బు డిష్, సోఫా, ఊయల, టేబుల్, టెలివిజన్, ట్యూబ్ లైట్ మొదలైనవి కూడా ఉన్నాయి. -
Forbes: డబ్బున్నోళ్ల లిస్ట్.. అందరికంటే రిచ్ ఈ పెద్దాయనే..
అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్వీఎంహెచ్ (LVMH) బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఆయన కుటుంబం 233 బిలియన్ డాలర్లు (రూ. 19.43 లక్షల కోట్లు) సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. 2024లో రికార్డు స్థాయిలో 2,781 మంది బిలియనీర్లు ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 141 ఎక్కువ. 2021లో నమోదైన రికార్డు కంటే 26 ఎక్కువ. ఈ లిస్ట్‌లోని బిలియనీర్ల మొత్తం సంపద 14.2 ట్రిలియన్ డాలర్లు (11.8 కోట్ల కోట్లు) అని పేర్కొంది. ఆర్నాల్ట్, ఆయన కుటుంబం తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 195 బిలియన్ డాలర్ల (రూ. 16.26 లక్షల కోట్లు) నికర సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. ఈయన తర్వాత అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ 194 బిలియన్ డాలర్ల (రూ. 16.17 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌తో మూడవ స్థానంలో ఉన్నారు. ఇక భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 116 బిలియన్ డాలర్ల (రూ. 9.67 లక్షల కోట్లు) సంపదతో టాప్ టెన్‌లో 9వ స్థానంలో నిలిచారు. ఈకాగా ఈసారి ఫోర్బ్స్ లిస్ట్‌లో కొత్తగా పలువురు సెలబ్రిటీలు చేరారు. పాప్ సంచనం టేలర్ స్విఫ్ట్ ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో అడుగు పెట్టింది. అక్టోబర్‌లో బిలియనీర్ హోదాకు చేరుకున్న ఈ పాప్ సూపర్ స్టార్, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రిహన్న, కిమ్ కర్దాషియాన్, ఓప్రా విన్ఫ్రే, స్టార్ వార్స్ సృష్టికర్త జార్జ్ లూకాస్లతో కలిసి చేరారు. 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,169 కోట్లు) భారీ నెట్‌వర్త్‌తో స్విఫ్ట్ 14వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ టాప్ టెన్ లిస్ట్ ఇదే.. -
జేడీయూ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్
పాట్నా: లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను బిహార్‌లో అధికార పార్టీ జేడీయూ ఆదివారం(మార్చ్ 24) విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 16 సీట్లలో జేడీయూ పోటీ చేస్తోంది. పార్టీ మాజీ చీఫ్ రాజీవ్ రంజన్(లలన్) సింగ్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. ఈయన ముంగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్లు నిరాకరించారు. ఇద్దరు కొత్తవారికి పోటీ చేసే అవకాశం కల్పించారు. పార్టీలో చేరిన మరుసటిరోజే విజయ లక్ష్మి కుషావహాకు టికెట్ కేటాయించారు. ఆర్జేడీ నుంచి ఇటీవలే జేడీయూలోకి వచ్చిన లవ్లీ ఆనంద్ కూడా ఈసారి పార్టీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాగా, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఇటీవలే ఆర్జేడీతో పొత్తు నుంచి వైదొలిగి బీజేపీతో కలిసి బిహార్‌లో మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె -
బీజేపీ: వరుణ్ గాంధీకి టికెట్ దక్కేనా?
లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సమావేశమైంది. బీహార్, రాజస్థాన్‌తో పాటు యూపీలోని మిగిలిన 24 స్థానాలతో సహా ఇతర రాష్ట్రాల అభ్యర్థుల విషయమై చర్చించారు. అలాగే వరుణ్ గాంధీకి పిలిభిత్ స్థానం కేటాయించాలా వద్దా? అనేదానిపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది. అన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని, అయితే వీటిని దశలవారీగా విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం యూపీలో మొదటి దశలో మిగిలిన మూడు స్థానాలైన పిలిభిత్, మొరాదాబాద్, సహరన్పూర్ స్థానాల అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేయవచ్చని తెలుస్తోంది. యూపీలో మొదటి దశలో మొత్తం ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వీటిలో సహారన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్ మరియు పిలిభిత్ ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. పిలిభిత్, సహరన్పూర్, మొరాదాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పిలిభిత్ స్థానానికి అభ్యర్థిని నిర్ణయించడంపై సీఈసీ సమావేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వరుణ్ గాంధీ ప్రస్తుతం ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అయితే ఈ సారి ఆయనకు టిక్కెట్ కేటాయించకుండా, కొత్తవారిని రంగంలోకి దింపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో సొంత పార్టీపై చేసిన విమర్శలే ఇందుకు కారణమని చెబుతున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు పాల్గొన్నారు. యూపీకి సంబంధించిన మిగిలిన 24 సీట్ల జాబితాను ఒకేసారి విడుదల చేయకుండా దశలవారీగా విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. -
ఒకే ఓటీటీలో 15 సినిమాలు.. పూర్తి జాబితా ఇదిగో! (ఫోటోలు)
-
నంద్యాలలో YSRCP జెండా ఎగరేస్తాం
-
పశ్చిమగోదావరి YSRCP MLA అభ్యర్థుల జాబితా
-
YSRCP ప్రకాశం జిల్లా అభ్యర్థులు వీళ్లే
ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
పంజాబ్ లోక్‌సభ ‘ఆప్’ అభ్యర్థుల జాబితా విడుదల
పంజాబ్ లోక్‌సభ ఎన్నికలకు ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితా లోని వివరాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ అమృత్సర్ నుంచి కుల్దీప్ సింగ్ ధాలివాల్, ఖండూర్ సాహిబ్ నుంచి లాల్జీత్ సింగ్ భుల్లర్, జలంధర్ నుంచి సుశీల్ కుమార్ రింకు, ఫతేగఢ్ సాహిబ్ నుంచి గురుప్రీత్ సింగ్ జీపీ, ఫరీద్కోట్ నుంచి కరమ్‌జీత్ అన్మోల్, బటింఠా నుంచి గుర్మీత్ సింగ్ ఖాడియన్, సంగరూర్ నుంచి గుర్మీత్ సింగ్ మీత్, పటియాల నుంచి డా. బల్బీర్ సింగ్‌లను లోక్ సభ ఎన్నికల అభ్యర్థులుగా ప్రకటించింది. -
బెస్ట్ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు!
ప్రపంచంలోనే అత్యుత్తమ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు దక్కింది. టాప్ 20 బెస్ట్ శాండ్విచ్లో ఈ భారతీయ వంటకం ఒకటిగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని అత్యుత్తమ శాండ్విచ్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతీయ స్ట్రీట్ ఫుడ్ అయిన వడ పావ్క చోటు దక్కింది. ఆ జాబితాలో ఈ రెసిపీ 19వ స్థానంలో నిలవడం విశేషం. టేస్ట్ అట్లాస్ ప్రకారం..ఈ ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్ తయారీ ముంబైలోని ఓ వీధి వ్యాపారి నుంచి మొదలయ్యిందని పేర్కొంది. 1960-1970లలో దాదర్ రైలు స్టేషన్ సమీపంలో పనిచేసిన ఆశోక్ వైద్య అనే వీధి వ్యాపారీ ఈ వంటకాన్ని తయారు చేసినట్లు వెల్లడించింది. ఆయన అక్కడ పనిచేసే కార్మికుల ఆకలి తీర్చేలా మంచి వంటకాన్ని తయరు చేయాలని, అలాగే అది సులభంగా త్వరిగతిన చేయగలిగేలా ఉండాలని అనుకున్నారట. అప్పుడే ఈ రుచికరమైన వడాపావ్‌ని తయారు చేసినట్లు తెలిపింది. అలాఅలా ఇది వీధి స్టాల్స్ నుంచి ప్రుమఖ రెస్టారెంట్ల వరకు ప్రతి చోటా తయారయ్యే మంచి రుచికరమైన చిరుతిండిగా పేరుగాంచింది. ఈ జాబితాలో థంబిక్ డోనర్, బన్హమీ, షోర్మా వంటి చిరుతిండ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అందుకు సంబంధించిన పూర్తి జాబితాను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది టేస్టీ అట్లాస్. అలాగే ఇటీవల టేస్టీ అట్లాస్ విడుదల చేసి అత్యుతమ కాఫీ జాబితాలో భారతీయ ఫిల్టర్ కాఫీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: మన దేశంలోని టాప్ మహిళా చెఫ్‌లు వీరే!) -
ఉగ్రవాదిగా ఆ దిగ్గజం! ఇది పుతిన్ ఆడే చదరంగం
ప్రత్యర్థుల అణచివేతకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎందాక అయినా వెళ్తారని కళ్లారా చూస్తున్నదే!. నావల్నీ మరణం.. అందుకు ఒక ఉదాహరణ. తాజాగా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్Garry Kasparovను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చడం.. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించడమే అందుకు ప్రధాన కారణమని ఇక్కడ చెప్పనక్కర్లేదు. అసలు 'ఉగ్రవాదులు, తీవ్రవాదులు' లిస్టులో చేరడానికి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఎలాంటి విధానాలు పాటిస్తోంది?.. ఉగ్రవాదులు-అతివాదుల జాబితాలో చేరడానికి ప్రత్యేకించి అర్హతలేమీ అక్కర్లేదు. పుతిన్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే చాలూ. ఇలాగే ఇప్పుడు కాస్పరోవ్ పేరును తీవ్రవాదులు-ఉగ్రవాదుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను సైతం ఈ చెస్ మాజీ ఛాంపియన్ బహిరంగంగానూ ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రోస్‌ఫిన్‌మానిటరింగ్ (రష్యా ఆర్థిక పర్యవేక్షణా సంస్థ) విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలోకి గ్యారీ కాస్పరోవ్ పేరు చేరింది. గ్యారీ కాస్పరోవ్ ప్రభుత్వ అణచివేత విధానాలకు భయపడి 2014లోనే ఆయన రష్యా నుంచి వెళ్లిపోయారు. పదేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. 2022లో రష్యా న్యాయశాఖ ఆయనపై విదేశీ ఏజెంట్ అనే ముద్ర కూడా వేసింది. తాజాగా.. ఈ జాబితాలో ఆయన పేరును చేర్చడం వల్ల ఆయన ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ఆంక్షల్ని విధించేందుకు రష్యాకు అవకాశం ఉంటుంది. కాగా, గ్యారీ కాస్పరోవ్‌పై పుతిన్ సర్కార్ తీసుకున్న చర్యలను హక్కుల సంఘాలు తప్పుబడుతున్నాయి. అణచివేతకు ఈ ఆంక్షలను రష్యా ప్రభుత్వం ఆయుధంగా ఉపయోగిస్తుందని మండిపడుతున్నాయి. -
శ్రీవల్లి అరుదైన ఘనత.. ఆ జాబితాలో అగ్రస్థానం!
ఇటీవలే యానిమల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. తాజాగా ఈ కన్నడ భామ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా- 30- అండర్- 30 జాబితాలో స్థానం సంపాదించుకుంది. కాగా.. ప్రతి సంవత్సరం పలు రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇవాళ విడుదల చేసిన జాబితా 30 ఏళ్లలోపు ఉన్నవారిలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసింది. ఈ లిస్ట్‌లో రష్మిక నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. కాగా.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ సరసన పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Gratitude.. 🤍#Forbes30under30 pic.twitter.com/u0YliOF0g9 — Rashmika Mandanna (@iamRashmika) February 15, 2024 -
YSRCP 4th లిస్ట్ పై మంత్రి బొత్స క్లారిటీ
-
10 ఒళ్లు గగుర్పొడిచే దారుణాలు.. 2023 మిగిల్చిన చేదు గురుతులు!
కొంతమందికి 2023వ సంవత్సరం ఆనందంగా గడిస్తే, మరికొందరికి వారి జీవితంలో అత్యంత భయంకరమైన అనుభవాలను మిగిల్చింది. 2023వ సంవత్సరంలో దేశంలో చోటుచేసుకున్న 10 అత్యంత దారుణాల గురించి ఇప్పుడు చూద్దాం. 1. ఉమేష్ పాల్ హత్య దేశంలో అత్యంత చర్చనీయాంశమైన హత్య కేసుల్లో ఉమేష్ పాల్ హత్య ఒకటి. యూపీలోని ప్రయాగ్‌రాజ్ పరిధిలోని ధుమన్‌గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకు ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్ తుపాకీ తూటాలకు హతమయ్యాడు. ఇది యూపీలో గ్యాంగ్ వార్‌ను మరోమారు గుర్తుచేసింది. ఉమేష్ పాల్‌పై బుల్లెట్లు, బాంబులతో దాడి చేసినట్లు సీసీటీవీలో స్పష్టంగా కనిపించింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది. 2. అతిక్, అష్రాఫ్ హత్యలు పూర్వాంచల్ మాఫియా లీడర్లుగా పేరొందిన అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లు ప్రయాగ్‌రాజ్ మెడికల్ కాలేజీ సమీపంలో హత్యకు గురయ్యారు. పోలీసుల సంరక్షణలో ఉన్న అతిక్, అష్రఫ్ అహ్మద్‌లపై దుండగులు అనేక రౌండ్లు కాల్పులు జరిపి హత్యచేశారు. పోలీసు కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్‌తో ఒక జర్నలిస్టు మాట్లాడుతుండగా నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులు పోలీసులకు పట్టబడ్డారు. 3. నిక్కీ యాదవ్ దారుణ హత్య ఢిల్లీలో నిక్కీ యాదవ్ హత్య.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ఫిబ్రవరి 10న నిక్కీ యాదవ్‌ను ఆమె ప్రియుడు సాహిల్ గొంతుకోసి హత్య చేశాడు. సాహిల్ ఫిబ్రవరి 10న ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న నిక్కీ అతనితో గొడవ పడింది. సాహిల్ కోపంతో నిక్కీని గొంతుకోసి హత్య చేశాడు. తరువాత నిక్కీ మృతదేహాన్ని తన దాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. అనంతరం రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ కేసు దర్యాప్తులో ఉంది. 4. రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుని హత్య రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. సుఖ్‌దేవ్ సింగ్‌ను అంతమొందించే ప్లాన్‌తో వచ్చిన ఇద్దరు ముష్కరులు అతని ఇంటిలో కాసేపు కూర్చుని మాట్లాడారు. తరువాత వారిద్దరూ తమ తుపాకీలను తీసి సుఖ్‌దేవ్ సింగ్‌పై కాల్పులు జరిపారు. దీంతో సుఖ్‌దేవ్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంతలో నిందితులు అక్కడి నుండి పారిపోయారు. అయితే నిందితులను చండీగఢ్‌లోని సెక్టార్ -22లో ఉన్న హోటల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. 5. మైనర్ బాలిక దారుణ హత్య ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో ఓ మైనర్ బాలిక దారుణ హత్య దేశాన్ని కుదిపేసింది. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. దానిలో నిందితుడు మైనర్ బాలికపై కత్తితో దాడి చేస్తున్నా అక్కడున్న ఎవరూ పట్టించుకోకపోవడం కనిపిస్తుంది. నిందితుడు సాహిల్ ఈ 16 ఏళ్ల మైనర్‌పై 20 సార్లు కత్తులతో దాడి చేశాడు. తరువాత ఆ బాలికను రాయితో మోది హత్య చేశాడు. 6. డియోరియా ఊచకోత యూపీలోని డియోరియా జిల్లా రుద్రాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సహా మొత్తం ఆరుగురి హత్య దేశాన్ని కుదిపేసింది. భూ వివాదాల కారణంగానే ఈ హత్య జరిగింది. ఇందులో ఒక పార్టీకి చెందిన సత్య ప్రకాష్ దూబే, ఆయన భార్య కిరణ్, కుమార్తె సలోని, నందిని, కుమారుడు గాంధీ హత్యకు గురయ్యారు. జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు ప్రేమ్ యాదవ్ కూడా హత్యకు గురయ్యారు. 7. కానిస్టేబుల్ కాల్పులు జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో ఆర్పిఎఫ్ జవాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటన ఈ సంవత్సరం కలకలం రేపింది. జూలై 31 ఉదయం, జైపూర్-ముంబై రైలులో ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన సీనియర్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన వాపి, బోరివాలి మీరా రోడ్ స్టేషన్ల మధ్య జరిగింది. 8. లక్నో కోర్టులో బుల్లెట్ల శబ్దం యూపీలోని లక్నోలోని కోర్టులో గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను కాల్చి చంపారు. జూన్ 7న విచారణ కోసం గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను లక్నో కోర్టుకు తీసుకువచ్చారు. ఇంతలో లాయర్ల వేషంలో వచ్చిన దుండగులు కోర్టు ఆవరణలోనే సంజీవ్ జీవాపై కాల్పులు జరిపారు. సంజీవ్ జీవా అక్కడికక్కడే మృతిచెందాడు. సంజీవ్ జీవా ముజఫర్‌నగర్ నివాసి. లక్నో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 9. రూ.350 కోసం దారుణ హత్య కేవలం రూ.350 కోసం 16 ఏళ్ల యువకుడు మరో టీనేజర్‌ను అత్యంత దారుణంగా అంతమొందించాడు. ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. టీనేజర్ తల, మెడపై నిందితుడు 60 సార్లు కత్తితో పొడిచాడు. ప్రాణాలు కోల్పోయిన టీనేజర్‌ను చూసి ఆ యువకుడు డ్యాన్స్ చేయటం సీసీటీవీ వీడియోలో కనపడింది. ఈ దారుణ హత్యకు పాల్పడిన 16 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10. పట్టపగలు దుకాణదారుని హత్య పంజాబ్‌లోని భటిండాలో పట్టపగలు ఓ దుకాణదారుని కాల్చి చంపిన ఉదంతం దేశాన్ని కుదిపేసింది. ఈ హత్య ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో దుకాణదారుడు హర్జిందర్ సింగ్ అలియాస్ మేలా తన దుకాణం ముందు కుర్చీలో కూర్చున్నట్లు ఈ సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తుంది. ఇంతలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుండగులు వచ్చి పిస్టల్స్‌తో హర్జిందర్‌పై కాల్పులు జరిపారు. దుండగులిద్దరూ ముఖాలకు మాస్క్‌లు కప్పుకున్నారు. ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం దుండగులిద్దరూ బైక్‌పై పారిపోయారు. బాధితుడు హర్జిందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇది కూడా చదవండి: 2023 సామాన్యునికి ఏమిచ్చింది? -
ఆ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాతోనే శ్రీదేవి ముద్దుల కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. (ఇది చదవండి: ‘మహా’ సీఎంను కలిసిన రామ్‌చరణ్ దంపతులు..!) ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మన యంగ్ టైగర్ మరో ఘనత సాధించారు. 2023లో ఆసియాలో టాప్ 50లో నిలిచిన నటుల జాబితాలో చోటు సంపాదించారు. ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో తారక్ 25వ స్థానలో నిలిచారు. ఈ జాబితాను ఈస్టర్న్ ఐ 2023 వెల్లడించింది. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప్లేస్ దక్కించుకున్న ఏకైక హీరో జూనియర్ కావడం విశేషం. అయితే ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా.. మరికొందరు బాలీవుడ్ తారలు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా జోనాస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. రణ్‌బీర్ కపూర్ 6వ, దళపతి విజయ్ 8వ స్థానంలో సాధించారు. కాగా.. ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర పార్ట్-1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆయన పేరుతో ఏకంగా!)