న్యూఢిల్లీ: ఇండియాలో పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు అంతగా పాపులర్ కాలేదు. చాలావరకు నామమాత్రపు చెల్లింపులే ఉంటాయి. చెప్పాలంటే ఒక్కోసారి ఇంటర్న్‌లే కంపెనీకి తిరిగి చెల్లించాల్సి అవసరం కూడా ఉంది. కానీ అదృష్టవశాత్తూ ప్రతీచోటా ఇలాంటి పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక సాంకేతిక సంస్థలు ఇంటర్న్‌కి ఒక సగటు భారతీయ ఉద్యోగి జీతం కంటే మంచి వేతనాన్ని అందిస్తాయి. ముఖ్యంగా దేశీయ టెక్ దిగ్గజాల సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లకు లభించే వేతనం కంటే ఎక్కువ చెల్లించే కంపెనీలున్నాయి. కంపెనీలను సమీక్షించే ప్లాట్‌ఫారమ్ గ్లాస్‌డోర్ అత్యధిక చెల్లింపు ఇంటర్న్‌షిప్స్ ఇచ్చే టాప్ 25 సంస్థల జాబితాను సిద్ధం చేసింది.
విద్యార్థులు, కొత్త గ్రాడ్యుయేట్లకు, ఇంటర్న్‌లకు టాప్ డాలర్‌ను చెల్లించే కంపెనీలను గుర్తించడంలో సహాయపడటానికి అత్యధికంగా చెల్లించే 25 కంపెనీలకు గ్లాస్‌డోర్ ఈ ర్యాంకులు ఇచ్చింది. ముఖ్యంగా గ్లోబల్‌గా అనేక టెక్, ఇతర కంపెనీల్లో లేఆఫ్‌లు ఆందోళన రేపుతున్న తరుణంలో ఇంటర్న్‌షిప్ ద్వారా అడుగుపెట్టాలని ఆశించే వారికిఇది ఊరటనిస్తుందని కంపెనీ తెలిపింది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు)
గ్లాస్‌డోర్ నివేదిక ప్రకారం, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డిజిటల్ చెల్లింపుల సంస్థ స్ట్రైప్ ఈ జాబితాలో టాప్‌లో నిలిచింది. ఇంటర్న్‌కు నెలవారీ రూ. 7.40 లక్షల (9,064 డాలర్లు ) స్టైఫండ్‌ను ఆఫర్ చేసింది. అంటే ఒక ఇంటర్న్ ఏడాదికి రూ. 81 లక్షల కంటే ఎక్కువ సంపాదించగలడు.
మెటా, స్నాప్, టిక్‌టాక్ వంటి సామాజిక దిగ్గజాల నుండి స్ట్రైప్, కాయిన్‌బేస్ వంటి ఫిన్‌టెక్ కంపెనీల వరకు, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాల దాకా ఈ జాబితాలో 16 టెక్ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇంకా సిటీ, క్యాపిటల్ వన్ వంటి ఐదు ఫైనాన్స్ కంపెనీలు, బెయిన్ అండ్ కంపెనీ, మెకిన్సే సహా మూడు కన్సల్టింగ్ సంస్థలు, ఏకైక సంస్థ ఆటో కంపెనీ రివియన్ ఉండటం విశేషం. (వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్!)
Comments
Please login to add a commentAdd a comment