massive
-
కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన
-
వాయుగుండాలు.. పెనుగాలులు.. క్లౌడ్ బరస్ట్!
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లా ఏటూరునాగారం–తాడ్వాయి అటవీ ప్రాంతంలోని 332 హెక్టార్ల పరిధిలో ఆగస్టు 31న సుమారు 50 వేల చెట్లు నేలకూలడానికి గల శాస్త్రీయ కారణాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు అటవీశాఖ అధికారులతో చర్చించారు. మంగళవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో పీసీసీఎఫ్ డోబ్రియాల్ ఆధ్వర్యంలో ఈ అంశంపై వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), జాతీ య వాతావరణ పరిశోధన ప్రయోగశాల (ఎన్ఏఆర్ఎల్), ఎ¯న్జీఆర్ఐ, ఐఎండీ శాస్త్రవేత్తలు, ఎ¯న్ఐటీ వరంగల్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏకకాలంలో ఏర్పడిన వాయుగుండాల వల్ల పెను గాలులు వీయడంతోపాటు కుంభవృష్టి (క్లౌడ్ బరస్ట్ ) వర్షాలు కురవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలోని సారవంతమైన నేల కూడా భారీ స్థాయిలో చెట్లు కుప్పకూలేందుకు దారితీసిందని భావిస్తున్నట్లు చెప్పారు. అక్కడి నేలలో చెట్లు త్వరగా ఎదగడం వల్ల వాటి వేర్లు భూమి లోపలకు బదులు అడ్డంగా విస్తరించడం వల్ల చెట్లు 130– 140 కి.మీ. వేగంతో వీచిన పెను గాలులను తట్టుకోలేక పడిపోయి ఉండొచ్చన్నారు. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే చెట్లు కూలిన ప్రదేశంలో సారవంతమైన భూమి ఉన్నందున చెట్ల పునరుజ్జీవనానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలో కేంద్ర, రాష్ట్రాలకు నివేదిక.. పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ మాట్లాడుతూ చెట్లు నేలకొరిగిన ప్రాంతంలో కలుపు మొక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని తద్వారా చెట్లు త్వర గా పెరిగే అవకాశం ఉంటుందని అటవీ సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు ములుగు డీఎఫ్‌వో రాహుల్ కిషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అటవీ నష్టాన్ని శాస్త్రవేత్తలకు వివరించారు. వర్క్‌షాపులో వెల్లడైన అభిప్రాయాలు, సూచనలతో త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
వింత శబ్దాల మిస్టరీ వీడింది
సరిగ్గా ఏడాది క్రితం ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా దాకా ప్రపంచమంతటా 9 రోజులపాటు తరచుగా వినిపించిన వింత శబ్దాల రహస్యం వీడిపోయింది. ఈ శబ్దాలకు భూప్రకంపనలు కారణం కాదని పరిశోధకులు తేల్చారు. గ్రీన్లాండ్లోని మారుమూల ప్రాంతం డిక్సన్ ఫోర్డ్లో భారీగా మంచు చరియలు విరిగిపడడం వల్ల భూమి స్వల్పంగా కంపించడంతో ఉత్పత్తి అయిన శబ్దాలుగా గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. భూకంపాలను అధ్యయనం చేసే పరిశోధకులు 2023 సెపె్టంబర్లో రహస్య శబ్ద సంకేతాలను గుర్తించారు. గతంలో ఇలాంటి సంకేతాలు ఎన్నడూ కనిపెట్టలేదు. ఇవి సాధారణ భూప్రకంపనల్లాంటివి కాకపోవడంతో వారిలో ఆసక్తి పెరిగింది. ఒకే వైబ్రేషన్ ప్రీక్వెన్సీతో శబ్దాలు వినిపించాయి. దీనిపై అధ్యయనం కొనసాగించి, గుట్టు విప్పారు. డిక్సన్ ఫోర్డ్లో మంచు కొండల నుంచి విరిగిపడిన మంచు, రాళ్లతో 10 వేల ఒలింపిక్ ఈత కొలనులు నింపవచ్చని తెలిపారు. మంచు చరియల వల్ల మెగా సునామీ సంభవించి, సముద్రంలో 200 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడ్డాయని చెప్పారు. లండన్‌లోని బిగ్ బెన్ గడియారం కంటే రెండు రెట్ల ఎత్తుకు అలలు ఎగిశాయని వెల్లడించారు. భారీ అలల ప్రభావం ఏకంగా 9 రోజులపాటు కొనసాగిందని అన్నారు. దీనికారణంగానే వింత శబ్దాలు వినిపించినట్లు స్పష్టంచేశారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గ్రీన్లాండ్లో మంచు కరుగుతోంది. సముద్రంలో దశాబ్దాలపాటు స్థిరంగా నిలిచి ఉన్న భారీ మంచు పర్వతాలు సైతం చిక్కిపోతున్నాయి. అవి బలహీనపడి, మంచు ముక్కలు జారిపడుతున్నాయి. వాతావరణ మార్పులు, భూతాపం వల్ల హిమానీనదాలు గత కొన్ని దశాబ్దాల్లో పదుల మీటర్ల పరిమాణంలో చిక్కిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూ ధ్రువ ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడడం, సునామీలు ఇక సాధారణ అంశంగా మారిపోతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. భూగోళం వేడెక్కడం ఇంకా కొనసాగితే అవాంఛనీయ పరిణామాలు సంభవించడం తథ్యమని పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి!
దేశరాజధాని ఢిల్లీలోని షహ్దారాలోగల శాస్త్రి నగర్ ప్రాంతంలోని ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు, వారి తల్లిదండ్రులు ఊపిరాడక మరణించారు. మృతులను మనోజ్ (30), అతని భార్య సుమన్ (28), ఐదు, మూడేళ్ల వయసున్న ఇద్దరు బాలికలుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఫైర్ సర్వీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. నాలుగు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. సీనియర్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ఘటనలో నలుగురు ఊపిరాడక మృతి చెందారని తెలిపారు. నాలుగు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించిందని, పార్కింగ్‌లో మంటలు చెలరేగడంతో భవనం అంతటా పొగలు వ్యాపించాయన్నారు. రోడ్డు ఇరుకుగా ఉన్నప్పటికీ అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక
Philippines Massive Earthquake Tsunami Warning ఫిలిప్సీన్స్‌లో మరోసారి భారీగా భూమి కంపించింది. మిండనావోలో శనివారం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూకంపం 63 కిమీ (39 మైళ్లు) లోతులో ఉందని EMSC తెలిపింది. దీంతో జనం భయకంపితులయ్యారు. 50కి పైగా నివాసాలు, ఇతర భవనాలను ధ్వంసమైనాయి. దీంతో అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నవంబరు 17న సంభవించిన భూకంపంలో సారంగని, సౌత్ కోటాబాటో, దావో ఆక్సిడెంటల్ ప్రావిన్సులో కొంత ప్రాణ నష్టం జరిగింది. కాగా పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉన్న ఫిలిప్పీన్స్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ ప్రాంతాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రపంచంలో అత్యంత భూకంప , అగ్నిపర్వత క్రియాశీల జోన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. PHIVOLCS has issued a #Tsunami Warning for the #Philippines after the powerful #earthquake (#lindol) in #Mindanao. People in the Philippines and nearby countries need to check local authorities for local tsunami information and the aftershocks of the earthquake. #sismo #quake https://t.co/YEsbKT3sVs pic.twitter.com/TlCo8Y0lsR — 🌊 Earthquake Updates Worldwide - #StopWar 🎗️ (@InfoEarthquakes) December 2, 2023 -
బంజారాహిల్స్‌లో భారీగా హవాలా నగదు పట్టివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో హైదరాబాద్ సహా జిల్లాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. తాజాగా, బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టుకున్నారు. రూ.3.35 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, దీనిలో భాగంగా వాహన తనిఖీలు విస్తృతంగా చేపడుతున్నామని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ తెలిపారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ స్పోర్ట్స్ పోలీసులతో పాటు బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారని, రోడ్ నెంబర్-3 వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న కియా కారును తనిఖీ చేయగా మూడు కోట్ల 35 లక్షల నగదు పట్టుబడిందని డీసీపీ వెల్లడించారు. ‘‘పట్టుబడిన నగదు హవాలా మనీగా గుర్తించాం.. హనుమంతరెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాములు రెడ్డి, ఉదయ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు. హనుమంత్ రెడ్డి సూచన మేరకు ప్రభాకర్, శ్రీ రాములు, ఉదయ్ కుమార్ హవాలా మనీ సేకరిస్తూ ఉంటారు. ఇందుకోసం అరోరా కాలనీలో సాయి కృప బిల్డింగ్ ప్లాట్ నెంబర్ 583 తమ కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారు. సేకరించిన హవాలా డబ్బులు తమ కార్యాలయానికి తీసుకెళ్తుండగా సీజ్ చేశాం. కోటి హవాలా మనీకి 25,000 కమిషన్‌గా తీసుకుంటారు. ఇవాళ ఉదయం ప్రభాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి.. బేగంబజార్, నాంపల్లి, గోషామహల్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో మూడు కోట్ల 35 లక్షలను కలెక్ట్ చేశారు. పట్టుకున్న నగదును కోర్టులకు అప్పగిస్తాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహన తనిఖీలు మరింత విస్తృతంగా చేస్తామని డీసీపీ పేర్కొన్నారు. రంగా రెడ్డి జిల్లాలో.. వాహన తనిఖీల్లో 6.55 లక్షల రూపాయలను ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. పూర్తిస్థాయి విచారణ నిమిత్తం నగదను ఇబ్రహీంపట్నం ఆర్డీవోకి అప్పగించారు. కాగా, ఎన్నికల్లో అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, నాకా బందీలు పెట్టి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. రాజధాని పరిధిలో... ►సోమవారం.. బషీర్‌బాగ్ నిజాం కళాశాల వద్ద వాహన తనిఖీల్లో ఓ బంగారం దుకాణానికి చెందిన, ఎలాంటి పత్రాల్లేని 7 కిలోల బంగారం, 295 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 7.5 కోట్లు ఉండొచ్చని చెప్పారు. పురానాపూల్ వద్ద బేగంబజార్‌కు చెందిన ఒకరి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ►హైదరాబాద్‌లోని చైతన్యపురి పరిధిలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ.25 లక్షలను స్వాదీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో షాద్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి సంతోష్ చంద్రశేఖర్ (48) నుంచి రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ►రంగారెడ్డి జిల్లా లాల్‌పహాడ్ చౌరస్తా వద్ద తనిఖీల్లో 2 కిలోల బంగారం, రూ. 1.22 లక్షలు పట్టుబడ్డాయి. ఆగాపురా హమీద్ కేఫ్ చౌరస్తాలో షాహీన్ నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ నుంచి రూ. 5 లక్షలు, బేగంబజార్‌కు చెందిన దినేష్ ప్రజాపతి నుంచి రూ.12 లక్షల నగదు స్వాధీనం. ►షేక్‌పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ కారులో తరలిస్తున్న రూ. 30 లక్షలు సీజ్. ►వనస్థలిపురం పరిధిలో ఓ కారులో సంరెడ్డి భరత్‌రెడ్డి తీసుకెళ్తున్న రూ. 5.16 లక్షలు స్వాధీనం. ►గోపాలపురం పీఎస్ పరిధిలోని ఓ లాడ్జీలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డ రూ. 4 లక్షలు. ►పంచశీల క్రాస్ రోడ్స్ వద్ద గోపి అనే వ్యక్తి నుంచి రూ. 9.3 లక్షలు స్వాధీనం. -
‘స్కిల్’ స్కామ్ సామాజిక, ఆర్థిక నేరం
సాక్షి, అమరావతి : గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ను భారీ కుట్రకు సంబంధించిన సామాజిక, ఆర్థిక నేరంగా గతంలో విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు అభివర్ణించింది. బెయిల్ మంజూరు చేసే సమయంలో న్యాయస్థానాలు ఇలాంటి కేసులను ప్రత్యేక దృష్టి కోణంలో చూడాలని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తు చేసింది. ఈ స్కామ్‌లో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులపై ఉన్నవి తీవ్ర ఆరోపణలని తెలిపింది. ఈ స్కామ్‌లో రూ.371 కోట్ల ప్రజాధనం ముడి పడి ఉందని, చాలా తీవ్రత ఉందని హైకోర్టు తెలిపింది. ఈ స్కిల్ కుంభకోణంలో ఇద్దరు కీలక నిందితులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా, హైకోర్టు వారి పిటిషన్లు కొట్టేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు వేర్వేరు న్యాయమూర్తులు వేర్వేరు సందర్భాల్లో ఈ మేరకు తీర్పు ఇచ్చారు. షెల్ కంపెనీల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను దర్యాపు అధికారులు కోర్టు ముందు ఉంచలేదన్న నిందితుల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆ విషయాలన్నీ తుది ట్రయల్‌లో చెప్పుకోవాలని స్పష్టం చేసింది. కేసు రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. షెల్ కంపెనీల కొనుగోలు జరిగిన తీరును గమనించింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, వారి బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది. రిమాండ్ తిరస్కరణ సరికాదు.. ఇదే కుంభకోణంలో కీలక నిందితుడి రిమాండ్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని కూడా హైకోర్టు తప్పు పట్టింది. రిమాండ్ సమయంలో కింది కోర్టు మినీ ట్రయల్ నిర్వహిస్తూ ఫలానా సెక్షన్ వర్తించదంటూ తేల్చేయడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. రిమాండ్ సమయంలో మినీ ట్రయిల్ తగదని స్పష్టం చేసింది. నిందితునిపై నమోదు చేసిన కేసు విచారణకు స్వీకరించదగ్గదా.. కాదా.. అన్నది మాత్రమే చూడాలని స్పష్టం చేసింది. నేరంలో నిందితుల పాత్ర గురించి క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరం లేదంది. 41ఏ సీఆర్పీసీ కిందకు రాని నేరాలకు కూడా 41ఏ ఇవ్వాలని చెప్పడం సరికాదంది. ఈ మొత్తం కేసులో ఐపీసీ 120బి ప్రకారం నేరపూరిత కుట్ర ఉందన్న విషయాన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టు విస్మరించిందని హైకోర్టు ఆక్షేపించింది. రిమాండ్ తిరస్కరిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. -
కింగ్ కోబ్రాకు కిస్.. నెటిజన్లు ఫైర్.. వీడియో వైరల్..
ఫేమస్ అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పోస్టు చేసి లైక్స్, వ్యూస్ చూసి తమ పలుకుబడి ఎంత ఉందో అంచనా వేసుకుంటారు. రాత్రికి రాత్రే ఫేమస్ కావడానికి ప్రాణాల మీదకు వచ్చే పనులు కూడా చేస్తుంటారు. అయితే.. ఇందులో కొందరు సహజంగా విభిన్నమైన టాలెంట్‌ను ప్రపంచానికి చూపించే వారు కూడా ఉండకపోరు. తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు కిస్ పెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాములంటే ఎంత భయం. చూడగానే వన్నులో వణుకు వస్తుంది. కానీ కొందరు వాటితో కూడా స్నేహం చేసే వారు ఉంటారు. ఈ కోవకే చెందిన వ్యక్తేనేమో నిక్. తను ఓ కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు. చాలా పొడవు ఉన్న ఆ పాము పడగ విప్పిన వేళ.. దానికి వెనకు నుంచి ధైర్యంగా ముద్దు పెట్టాడు. కానీ ఆ కింగ్ కోబ్రా ఆయన్ని ఏమీ అనలేదు. ఈ వీడియోను నిక్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. నిక్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు కొంత మంది నెటిజన్లు. పాములపై తమ భయాన్ని వెలిబుచ్చారు మరికొందరు. 'పోతావ్ రేయ్..' అంటూ మరికొంత మంది క్రేజీగా స్పందించారు. ఏదేమైనా పాములకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ వీడియోకు వారం రోజుల్లోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని.. -
హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..!
డెహ్రాడూన్: నైరుతి రుతుపవనాలు ఉత్తరాదిలో బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖండ్‌లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే.. గత నాలుగు రోజులుగా ఆకాశం మేఘావృతమైన నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ఓ వింతైన దృగ్విశయం ఆవిషృతమైంది. సునామీ అలవలె కనిపించిన దట్టమైన మేఘాలు హరిద్వార్‌ను ముంచెేస్తాయా.! అనేలా గోచరించాయి. చూపరులకు కనువిందుగా కనిపించే ఈ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హిమాలయాల అంచున ఉన్న పవిత్రమైన హరిద్వార్ అది. ఆద్యాత్మికతకు పెట్టింది పేరు. ఎక్కడ చూసినా అందమైన, ఎత్తైన కొండ ప్రాంతాలే ఉంటాయి. నాలుగు రోజులుగా వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆకాశమంతా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. సముద్రుడే మీద పడిపోతున్నాడా అనేంతగా పెద్ద అలల వలె కనిపిస్తున్న మేఘాలు ఒక్కసారిగా దూసుకొచ్చేశాయి. చూపరులకు కనువిందుగా కనిపించినప్పటికీ ఆ దృశ్యాలు భీతికొల్పేవిగా ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Massive shelf cloud appears in Haridwar, Uttarakhand. pic.twitter.com/vl7lU5yFjf — Anshul Saxena (@AskAnshul) July 11, 2023 భారీ వర్షాలు కురుస్తున్నందున వరద నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఆకస్మిక వరదల్లో వాహనాలు, రహదారులు కొట్టుకుపోయాయి. పంటపొలాలు, నివాసప్రాంతాలు నీటమునిగాయి. ఢిల్లీలో యమునా నది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక యంత్రాంగాలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక కార్యక్రమాలను చేపట్టాలని ప్రధాని కోరారని పీఎంవో తెలిపింది. ఇదీ చదవండి: Himachal Pradesh Heavy Rains: ఉత్తరాది అతలాకుతలం.. మూడో రోజూ భారీ వర్షాలు, ప్రమాదస్థాయికి చేరుకున్న యమున -
తిరుపతిలో లావణ్య ఫోటో ఫ్రేమ్స్ షాపులో భారీగా మంటలు..!
-
Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల్లో ఉద్యోగాల కోత ప్రకంపనలు రేపుతోంది. అనేక దిగ్గజ కంపెనీలు సహా స్టార్టప్ కంపెనీలు కూడా వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా యూకేకు చెందిన అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్, టెలికాం కంపెనీ బీటీ గ్రూపు భారీగా ఉద్యోగులను తీసివేయాలని యోచిస్తోంది. కాస్ట్కట్లో భాగంగా 55 వేల లేఆఫ్‌లను ప్రకటించనుంది. లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బ్రిటీష్ బహుళజాతి టెలికమ్యూనికేషన్స్ హోల్డింగ్ కంపెనీ బీటీ గ్రూప్, ఫైబర్-ఆప్టిక్ బ్రాడ్‌బ్యాండ్ 5 జీ మొబైల్ నెట్‌వర్క్‌లు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇపుడిక ఎక్కువ మంది కార్మికులు అవసరం లేదని చెప్పింది. ఖర్చులను తగ్గించే క్రమంలోనే కాంట్రాక్టర్లతో సహా మొత్తం 55,000 ఉద్యోగాలను తొలగించాలని యోచిస్తున్నట్లు గురువారం తెలిపింది. ఈ దశాబ్దం చివరికి లీనియర్ బిజినెస్‌తో బ్రైటర్ ఫ్యూచర్‌గా బీటీ గ్రూప్ రూపాంతరం చెందుతుందని, బెస్ట్ అండ్ టాప్, నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్‌లకు ఉత్తమమైన కస్టమర్ సర్వీస్, సొల్యూషన్లతో కనెక్ట్ అవుతుందని గ్రూప్ సీఈవో ఫిలిప్ జాన్సెన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) కాగా బీటీ గ్రూపులో ప్రస్తుతం సిబ్బంది, కాంట్రాక్టర్లతో సహా 130,000 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలి ఆదాయ ప్రకటనల సమయంలో 2028-2030 నాటికి తమ ఉద్యోగుల సంఖ్య 75-90వేల మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించడం గమనార్హం. మరిన్ని ఇంట్రస్టింగ్ అప్డేట్స్, వార్తల కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
ఇటలీ మిలన్లో భారీ పేలుడు..అగ్నికి కార్లు ఆహుతి
ఉత్తర ఇటలీలోని మిలన్లో గురువారం ఓ వీధిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అనేక వాహానాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లను రవాణా చేస్తున్న వ్యాన్‌లో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్లు పక్కల ఉన్న కార్లకు సైతం మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఐతే సంఘటనా స్థలంలోనే పాఠశాల, నర్సింగ్ హోం ఉండటంతో..అందులో ఉన్న వారిని ఖాళీ చేయించారు అధికారులు. ఐతే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి త్వరితగతిన మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు అధికారులు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవ్వుతున్నాయి. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: పాక్ చరిత్రలో ఆ రోజు చీకటి అధ్యాయం: పాక్ ఆర్మీ) -
బెంగళూరులో ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
-
నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!
న్యూఢిల్లీ: ఇండియాలో పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు అంతగా పాపులర్ కాలేదు. చాలావరకు నామమాత్రపు చెల్లింపులే ఉంటాయి. చెప్పాలంటే ఒక్కోసారి ఇంటర్న్లే కంపెనీకి తిరిగి చెల్లించాల్సి అవసరం కూడా ఉంది. కానీ అదృష్టవశాత్తూ ప్రతీచోటా ఇలాంటి పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక సాంకేతిక సంస్థలు ఇంటర్న్‌కి ఒక సగటు భారతీయ ఉద్యోగి జీతం కంటే మంచి వేతనాన్ని అందిస్తాయి. ముఖ్యంగా దేశీయ టెక్ దిగ్గజాల సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లకు లభించే వేతనం కంటే ఎక్కువ చెల్లించే కంపెనీలున్నాయి. కంపెనీలను సమీక్షించే ప్లాట్‌ఫారమ్ గ్లాస్‌డోర్ అత్యధిక చెల్లింపు ఇంటర్న్షిప్స్ ఇచ్చే టాప్ 25 సంస్థల జాబితాను సిద్ధం చేసింది. విద్యార్థులు, కొత్త గ్రాడ్యుయేట్లకు, ఇంటర్న్‌లకు టాప్ డాలర్‌ను చెల్లించే కంపెనీలను గుర్తించడంలో సహాయపడటానికి అత్యధికంగా చెల్లించే 25 కంపెనీలకు గ్లాస్‌డోర్ ఈ ర్యాంకులు ఇచ్చింది. ముఖ్యంగా గ్లోబల్‌గా అనేక టెక్, ఇతర కంపెనీల్లో లేఆఫ్‌లు ఆందోళన రేపుతున్న తరుణంలో ఇంటర్న్‌షిప్ ద్వారా అడుగుపెట్టాలని ఆశించే వారికిఇది ఊరటనిస్తుందని కంపెనీ తెలిపింది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) గ్లాస్‌డోర్ నివేదిక ప్రకారం, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డిజిటల్ చెల్లింపుల సంస్థ స్ట్రైప్ ఈ జాబితాలో టాప్‌లో నిలిచింది. ఇంటర్న్‌కు నెలవారీ రూ. 7.40 లక్షల (9,064 డాలర్లు ) స్టైఫండ్‌ను ఆఫర్ చేసింది. అంటే ఒక ఇంటర్న్ ఏడాదికి రూ. 81 లక్షల కంటే ఎక్కువ సంపాదించగలడు. మెటా, స్నాప్, టిక్‌టాక్ వంటి సామాజిక దిగ్గజాల నుండి స్ట్రైప్, కాయిన్‌బేస్ వంటి ఫిన్‌టెక్ కంపెనీల వరకు, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాల దాకా ఈ జాబితాలో 16 టెక్ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇంకా సిటీ, క్యాపిటల్ వన్ వంటి ఐదు ఫైనాన్స్ కంపెనీలు, బెయిన్ అండ్ కంపెనీ, మెకిన్సే సహా మూడు కన్సల్టింగ్ సంస్థలు, ఏకైక సంస్థ ఆటో కంపెనీ రివియన్ ఉండటం విశేషం. (వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్!) -
అమెరికాలో టోర్నడోల విధ్వంసం..23 మంది మృతి
అమెరికాలో కనివినీ ఎరుగని విధంగా టోర్నోడోలు పెను విధ్వంసం సృష్టించాయి. ఈ మేరకు మిస్సిస్సిపిలో శుక్రవారం అర్థరాత్రి బలమైన గాలులు, ఉరుములతో కూడిన తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో పరిసర ప్రాంతాలన్ని చిగురుటాకులా వణికిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 23 మంది దాక ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది జనాలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ టోర్నోడోల కారణంగా భారీ నష్టం జరిగిందని సుమారు 160 కి.మీ వరకు ప్రభావం చూపిందని అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ టోర్నడో విధ్వంసం అనంతరం రెస్క్యూ బృందాలు, అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ వెస్ట్రన్ మిస్సిస్పిప్పిలోని సిల్వర్సిటీలో దాదాపు 200 మంది నివశిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ తుపాను తర్వాత ప్రాణాలతో బయటపడిన వారి ఆచూకి కోసం రెస్కూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఐతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని చెప్పారు. మరోవైపు ఈ విధ్వంసం తర్వాత సుమారు నలుగురు వ్యక్తులు తప్పిపోయినట్లు మిస్సిస్సిప్పి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ వరుస ట్వీట్లలో తెలిపింది. అలాగే సమీపంలోని మరోప్రాంతం.. సుమారు 17 వందల మంది జనాభా ఉన్న రోలింగ్ ఫోర్క్ కూడ తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ కూడా సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే స్థానికులు మాత్రం ఇలాంటి టోర్నడోలను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. ఈ తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో శుక్రవారం రాత్రంతా జనం అంధకారంలోనే మగ్గిపోయారు. అలాగే ఈ ఘటనలో గాయపడ్డవారిని అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ టోర్నడాల కారణంగా పలు భవనాలు, వాహనాలు దారుణంగా దెబ్బతిన్నాయి. F5 tornado strikes Rolling Fork, Mississippi, seven dead reported, but toll likely to rise pic.twitter.com/N6GUl2NcVz — Malinda 🇺🇸🇺🇦🇵🇱🇨🇦🇮🇹🇦🇺🇬🇧🇬🇪🇩🇪🇸🇪 (@TreasChest) March 25, 2023 (చదవండి: గర్లఫ్రెండ్‌కి సాయం చేయాలన్న ఇంటెన్షనే పోలీసులకు పట్టించింది..చివరికి..) -
పాకిస్తాన్: రైలులో పేలుడు, ఇద్దరు మృతి
-
RBI Report: ఏపీలో జీతభత్యాల వ్యయం భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వేతనాలు, జీతాల వ్యయం గత నాలుగేళ్లలో భారీగా పెరిగింది. ఎంతగా అంటే.. 67.26 శాతం మేర పెరిగింది. ఇదే సమయంలో మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గడచిన నాలుగేళ్లలో ఈ వ్యయం కేవలం 39.34 శాతం మాత్రమే పెరిగింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై చేసిన అధ్యయన నివేదిక వెల్లడించింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అధికంగా రూ.25,086.3 కోట్ల మేర వేతనాలు, జీతాల రూపంలో వ్యయం అవుతోందని నివేదిక పేర్కొంది. అంటే.. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లో జీతభత్యాల రూపంలో అధికంగా 84.5 శాతం వ్యయం అవుతోంది. అలాగే, రాష్ట్రంలో ఈ వ్యయం ఒక్క ఆర్థిక ఏడాదిలోనే ఏకంగా రూ.10 వేల కోట్లు పెరిగింది. చంద్రబాబు హయాం 2018–19లో వేతనాలు, జీతాల వ్యయం రూ.32,743.4 కోట్లు ఉండగా వైఎస్ జగన్ హయాంలో 2019–20లో రూ.42,673.8 కోట్లకు పెరిగింది. ఈ గణాంకాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బడ్జెట్ అకౌంట్లను అధ్యయనం చేసిన తరువాత ఆర్బీఐ పేర్కొంది. అలాగే, 2018–19లో వేతనాలు, జీతాల రూపంలో అకౌంట్స్ ప్రకారం రూ.32,743 కోట్లు వ్యయం కాగా.. 2022–23లో బడ్జెట్ అంచనాల ప్రకారం రూ, 54,768.4 కోట్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. అంటే నాలుగేళ్లలో రూ.22,025 కోట్ల మేర జీతభత్యాల వ్యయం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. కొత్త ఉద్యోగాలు, చిరుద్యోగుల వేతనాలు పెంపుతోనే.. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హమీ మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. అలాగే, వివిధ రంగాల్లోని 3.01 లక్షల మంది చిరుద్యోగుల వేతనాలనూ భారీగా పెంచారు. దీంతోపాటు 11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల అమలు, వైద్య ఆరోగ్యశాఖతో పాటు వివిధ శాఖల్లో వేల సంఖ్యలో కొత్తగా ఉద్యోగాలు భర్తీ.. అలాగే, గ్రామ, వార్డు సచివాలయాల్లో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించడంతో రాష్ట్రంలో జీతభత్యాల వ్యయం భారీగా పెరిగినట్లు ఆర్బీఐ తన నివేదికలో స్పష్టంచేసింది. -
ఎనిమిదివేల కిలోల భారీ ఏనుగును మీరు ఎప్పుడైనా చూశారా
-
శాంసంగ్ యూజర్లకు షాకింగ్ న్యూస్, భారీగా డేటా లీక్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన యూజర్లకు భారీ షాకిచ్చింది. శాంసంగ్ ఫోన్లనుంచి భారీఎత్తున డేటా లీక్ అయిందని తాజాగా తెలిపింది. ఇందులో ప్రధానంగా యూజర్ల పుట్టినరోజులు, కాంటాక్ట్ డేటా లాంటి వ్యక్తిగత డేటా ఉల్లంఘన జరిగినట్టు తెలిపింది. ఈ మేరకు కొంతమంది యూజర్లను ఈమెయిల్ ద్వారా అలర్ట్ చేస్తోంది. ఈ ఏడాది జులైలో జరిగిన డేటా ఉల్లంఘనలో అమెరికాలోని శాంసంగ్ యూజర్ల డేటా బహిర్గతమైంది. దీనికి సంబంధించి శాంసంగ్ కంపెనీ ఒక బ్లాగ్‌పోస్ట్ సమాచారంలో తెలిపింది. అనధికారిక థర్డ్ పార్టీ ద్వారా అమెరికా సిస్టమ్‌ల నుంచి వినియోగదారుల ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, ఇమెయిల్ లాంటి డేటాను లీక్ చేసినట్టు సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ పేర్కొంది. జులై 2022 చివరలో ఇది చోటు చేసుకుంది. ఆగస్ట్ 4, 2022న నిర్దిష్ట కస్టమర్ల వ్యక్తిగత డేటా ప్రభావితమైందని తేలింది. దీనిపై విచారణ చేయగా భారీ డేటా బహిర్గతమైందని గుర్తించినట్టు 30 రోజుల తర్వాత ఈ పరిమిత సమాచారాన్ని పూర్తిగా విడుదల చేసింది. వెల్లడించింది. అయితే ఇది ఇతర సోషల్ సెక్యూరిటీ నంబర్లు క్రెడిట్, డెబిట్ కార్డ్ నంబర్లను ప్రభావితం చేయ లేదని శాంసంగ్ నిర్ధారించింది. డేటా లీకైన సిస్టమ్‌లను సేఫ్‌గా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారని బ్లాగ్‌లో పేర్కొంది. అలాగే ఈ విషయం గురించి కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నామని తెలిపింది. అయినా వ్యక్తిగత సమాచారం కోసం అడిగే లేదా వ్యక్తిగత సమాచారం కోసం అడిగే వెబ్ పేజీలకు డైవర్ట్ చేసే లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండమని వినియోగ దారులను కోరింది. అనుమానాస్పద లింక్‌లు లేదా అనుమానాస్పద ఇమెయిల్‌ల నుండి అటాచ్మెంట్లపై క్లిక్ చేయడం మానుకోవాలని వినియోగదారులను కోరింది. -
ఎలక్ట్రిక్ స్కూటర్ యూజర్లకు భారీ షాకిచ్చిన బజాజ్
సాక్షి, ముంబై: బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్‌కి షాక్ ఇచ్చింది. భారతదేశంలో తన ద్విచక్ర వాహనాల పోర్ట్ ఫోలియోలో చాలా వాటిపై భారీగా ధరలను పెంచింది. పల్సర్ అవెంజర్ బైక్‌లతోపాటు, ఎలక్ట్రిక్ స్కూటర్ - చేతక్ ధరలను కూడా గణనీయంగా పెంచింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్‌పై ధరను 9 శాతం పెంచింది. దీని ధరను 12,749 రూపాయలు పెంచింది. పుణేలో (ఎక్స్-షోరూమ్) 1.41 లక్షలతో రూపాయలతో పోలిస్తే ప్రస్తుత ధర 1.54 లక్షలుగా ఉంది. అయితే, ధర పెరిగినప్పటికీ, ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలింగ్, ఫీచర్లును అలానే ఉన్నాయి. కాగా 2019లో బజాజ్ అకుర్దిలోని పూణే ప్లాంట్‌లో చేతక్ ఎలక్ట్రిక్ ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం భారతదేశంలోని 75 కంటే ఎక్కువ నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. అప్పటినుంచి 14,000 యూనిట్లను విక్రయించినట్టు తెలుస్తోంది. -
రాకాసి బిలం.. సెకనులో భూమినే మింగేసేంత పవర్ఫుల్
ఈ విశ్వంలో ఎలాంటి వస్తువునైనా, అది ఎంత భారీదైనా తనలోకి లాక్కునేంత శక్తి ఉంది.. ఒక్క బ్లాక్‌హోల్(కృష్ణ బిలం)కే. స్పేస్‌టైమ్ ప్రాంతంగా పేరున్న బ్లాక్ హోల్ నుంచి.. ఏ కణమూ, చివరికి కాంతి లాంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏవీ తప్పించుకోలేవు. అలాంటిది భూమి లాంటి పరిమాణంలో ఉన్నవాటిని.. ఒక సెకనులో మింగేసేంత శక్తి ఉంటే.. ?.. ఈ భూమిని సెకనులోనే మింగేసేంత భా...రీ బ్లాక్‌హోల్‌ను గుర్తించారు ఖగోళ శాస్త్రవేత్తలు. పైగా సుమారు 900 కోట్ల సంవత్సరాల వయసున్నదిగా భావిస్తున్న ఆ బ్లాక్‌హోల్ సైజు కూడా జెట్ స్పీడ్‌తో పెరుగుతోంది. అది ఎంతలా అంటే.. సెకనులోనే భూమి సైజు ఉన్నంత పరిణామాన్ని అమాంతం మిగేసేంతగా.. అలాగని బ్లాక్ హోల్స్‌తో ఈ భూమికి వచ్చే ప్రమాదం ఏదీ లేదు!. ► స్కై మ్యాపర్ అనే టెలిస్కోప్ ద్వారా.. ఒకదాని వెంట మరొకటి జంటగా తిరిగే ‘బైనరీ స్టార్స్’ను గుర్తించే ప్రయత్నంలో.. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ భారీ బ్లాక్ హోల్‌ను కనిపెట్టారు. ► పాలపుంత కన్నా.. 500 రెట్లు భారీగా ఉందని చెప్తున్నారు. మొత్తం పాలపుంత నుంచి వెలువడే కాంతి కంటే.. ఏడువేల రెట్ల కాంతివంతంగా ఈ బ్లాక్ హోల్ ఉందంట. భారీ పరిణామం, ఊహించనిదని వర్ణించారు డాక్టర్ క్రిస్టోఫర్ ఆన్కెన్. ► శక్తివంతంగా.. ప్రకాశవంతంగా కనిపించిన ఈ బ్లాక్ హోల్ సైజు పెరగడానికి కారణం ఏంటన్న దానిపై నిర్ధారణకు రాలేకపోయారు. కాకపోతే.. రెండు భారీ పాలపుంతలు ఒకదాన్నొక్కటి ఢీకొడితే.. వెలువడ్డ మెటీరియల్ ఈ బ్లాక్‌హోల్‌లోకి ప్రవేశించి సైజును పెంచుతూ పోతుందని భావిస్తున్నారు. ► యాభై ఏళ్లకొకసారి ఈ తరహా వింతలు కనిపించినప్పటికీ.. ఇన్నేళ్లలో ఇంత ప్రకాశవంతమైన భారీ బ్లాక్‌హోల్‌ను గుర్తించడం ఇదే మొదటిసారని చెప్తున్నారు. ► మూడు బిలియన్ల సూర్యులు కలిస్తే ఎంత సైజు ఉంటుందో ఈ బ్లాక్ హోల్ సైజు అంతగా ఉందట!. పైగా పోను పోను మరింత భారీ సైజులో పెరుగుతూ పోతుందట. ఆర్ఎక్స్ఐవీ డేటాబేస్‌లో ఈ పరిశోధనను పొందుపరచగా.. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఈ కథనం పబ్లిష్ చేశారు. ► 14.5 విజువల్ మాగ్నిట్యూడ్ ఉన్న టెలిస్కోప్‌తో ఈ భారీ బ్లాక్ హోల్‌ను ఎవరైనా చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చదవండి: అంతరిక్షం నుంచి మిస్టరీ రేడియో సిగ్నల్స్.. ఇది రెండోసారి -
లాహోర్‌లోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
-
అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు.. 100 మందికి పైగా మృతి
కాబుల్: ఉత్తర అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. కుందూస్ నగరంలోని షియా మసీదులో పేలుడు చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడులో 100 మందికి పైగా మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు.శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా పేలుడు సంభవించింది. దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్‌గా అనుమానం వ్యక్తమవుతోంది. కొద్దిరోజులుగా షియాలకు ఐసిస్ ఖొరాసాన్ హెచ్చరికలు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఐసిస్ ఖొరాసాన్.. తాలిబన్ల నాయకుడి తలనరికిన విషయం తెలిసిందే. -
మెక్సికోలో భారీ భూకంపం, వణికిపోయిన జనం
మెక్సికోలో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. భూకంప కేంద్రం గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్‌కి ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు (ఏడు మైళ్లు) దూరంలో కేందద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా రాజధాని నగరంలో భారీ భూకంపంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు. వరుస ప్రకంపనలతో పర్యాటకులు హోటళ్లను ఖాళీ చేశారు. కంపన తీవ్రతకు వందలాది కిలోమీటర్ల దూరంలో పలు భవనాలు కొన్ని సెకన్ల పాటు కదిలిపోయాయి. ముందుగా నైరుతి మెక్సికోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బామ్ తెలిపారు. ఒక వ్యక్తి మరణించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఒక వీడియో సందేశంలో తెలిపారు. కొయుకా డి బెనిటెజ్ నగరంలో యుటిలిటీ పోల్ పడి ఒక వ్యక్తి మరణించాడని, గెరెరో రాష్ట్ర గవర్నర్ హెక్టర్ అస్తుడిల్లో మిలెనియో టీవీకి చెప్పారు. అకాపుల్క్ మేయర్ అదెలా రోమన్ మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందుతున్నారనీ, చాలా ప్రాంతాలలో గ్యాస్ లీకేజీలు వార్తలు వచ్చినట్టు తెలిపారు. భూకంపం మెక్సికో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. స్నానం చేస్తుండగా, చాలా బలమైన కంపనలు రావడంతో చాలా భయపడిపోయా.. గట్టిగా అరిచాను.. చివరికి బాత్ టవల్‌తో మాత్రమే బయటపడ్డానంటూ ఒక పర్యాటకుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. "నేను మా అమ్మతో వచ్చాను. హోటల్ 11 వ అంతస్తులో మేముండగా ఒక్కసారిగా కంపించింది. అమ్మ భయపడిపోయింది అంటూ ఏడుస్తున్న తన 86 ఏళ్ల తల్లిని అక్కున చేర్చుకున్నారు. కాగా ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల సరిహద్దులో ఉన్న మెక్సికో ఒకటి. 1985, సెప్టెంబర్ 19 న మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది భవనాలను ధ్వంసమయ్యాయి. మళ్లీ 2017, సెప్టెంబర్‌లో వచ్చిన 7.1 భూకంపం కారణంగా 370 మంది మరణించారు. Power flashes from the earthquake in #Mexico. 🎥 @franz_gomez pic.twitter.com/ESXPpIgmSE — Michael Armstrong (@KOCOMichael) September 8, 2021 This is how #earthquakes look in the sky from an 11th floor ⚡ What you hear is the building crashing against the one next to it 🤯#earthquakeinthesky #Mexico #surreal pic.twitter.com/XNJESUdOew — elian huesca 🌋⚡ (@elianhuesca) September 8, 2021 A powerful earthquake struck southwestern Mexico near the beach resort of #Acapulco on Tuesday night, causing rock falls and damaging buildings, though there were no immediate reports of casualties. M7.0 #earthquake (#Sismo) strikes 18 km NE of Acapulco de Juárez (#Mexico) pic.twitter.com/f8LisWFmfx — DailyNews/BreakingNews (@DailyNe25683877) September 8, 2021 -
బిగ్‌బాస్ విన్నర్ మరణం: షాక్‌లో బాలీవుడ్
సాక్షి,ముంబై: యువనటుడు, బిగ్‌బాస్-13 విన్నర్ సిద్ధార్థ శుక్లా (40) హఠాన్మరణంపై బాలీవుడ్, టీవీ పరిశ్రమ పెద్దలు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి లోనయ్యారు. తీవ్రమైన గుండెపోటుతో సిద్దార్థ కన్నుమూశాడన్న వార్తతో నిద్రలేచిన బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సిద్ధార్థ్ గుండెపోటు కారణంగా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్టు ముంబైలోని కూపర్ హాస్పిటల్ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. సిద్ధార్థ్ మరణంపై పలువురు నటీ నటులు, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు. దీంతో ట్విటర్ ఆర్ఐపీ సిద్ధార్థ్ శుక్లా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. నమ్మకలేకపోతున్నామంటూ ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్, నటి మోడల్ మల్లికా షెరావత్ ట్వీట్ చేశారు. ప్రముఖ టీవీ, సినీ నటి రేణుకా సహానే, మున్మున్ దత్తా తదితరులు సిద్ధార్థ్ ఆకస్మిక మరణంపై సంతాపం వ్యక్తంచేశారు. చదవండి : Sidharth Shukla: బిగ్‌బాస్ విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం కాగా1980, డిసెంబర్ 12న ముంబైలో జన్మించిన సిద్ధార్థ్ శుక్లా మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. బాబుల్ కా ఆంగన్ చూటే నా అనే టెలివిజన్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యాడు. జానే పెహచానే సే, యే అజ్నబీ, లవ్ యు జిందగీ లాంటి సీరియల్స్‌లో నటించాడు. ముఖ్యంగా పాపులర్ టీవీ సీరియల్ ‘బాలికా వధు’ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. 2014లో కరణ్ జోహార్ నిర్మించిన హంప్టీ శర్మకి దుల్హానియాతో బాలీవుడ్‌కీ ఎంట్రీ ఇచ్చాడు. చదవండి : నేను అమ్మకూచిని: బిగ్‌బాస్ విన్నర్ With a broken heart and sadness in in my soul I miss you more every day. Rest in peace#SiddharthShukla absolutely heartbroken I don't know what to say totally blank I miss you your jabra fan ❤️❤️ pic.twitter.com/NFy9gsJjth — Dhruvvvv🌟 (@dhruvda7) September 2, 2021 Too young to go💔 #SiddharthShukla RIP 🙏🙏 pic.twitter.com/78AW1l8Gsd — Mallika Sherawat (@mallikasherawat) September 2, 2021 Shocked and numb. No Words 🙏🙏🙏 #SiddharthShukla — Munmun Dutta (@moonstar4u) September 2, 2021 I cannot process that Siddharth Shukla has passed away. Life is just too unpredictable. RIP Siddharth. My condolences to his family and friends and to all his devastated fans 🙏🏽🙏🏽🙏🏽😢 — Renuka Shahane (@renukash) September 2, 2021 Hello bollywood !!! Is it really a heart attack ??? Remember SSR.#SiddharthShukla 😓😨💔 pic.twitter.com/6TSfBe9hlS — Diptiman Yadav (@Dipti_6450) September 2, 2021 I cannot process this news that I just came across. Is this true? Please no. No… #SiddharthShukla — ARMAAN MALIK (@ArmaanMalik22) September 2, 2021