Massive Shelf Cloud Appears in Haridwar Uttarakhand - Sakshi
Sakshi News home page

హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..!

Published Tue, Jul 11 2023 5:48 PM | Last Updated on Tue, Jul 11 2023 6:20 PM

Massive Shelf Cloud Appears in Haridwar Uttarakhand - Sakshi

డెహ్రాడూన్‌: నైరుతి రుతుపవనాలు ఉత్తరాదిలో బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖండ్‌లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే.. గత నాలుగు రోజులుగా ఆకాశం మేఘావృతమైన నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ఓ వింతైన దృగ్విశయం ఆవిషృతమైంది. సునామీ అలవలె కనిపించిన దట్టమైన మేఘాలు హరిద్వార్‌ను ముంచెేస్తాయా.! అనేలా గోచరించాయి. చూపరులకు కనువిందుగా కనిపించే ఈ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.  

హిమాలయాల అంచున ఉన్న పవిత్రమైన హరిద్వార్ అది. ఆద్యాత్మికతకు పెట్టింది పేరు. ఎక్కడ చూసినా అందమైన, ఎత్తైన కొండ ప్రాంతాలే ఉంటాయి. నాలుగు రోజులుగా వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆకాశమంతా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. సముద్రుడే మీద పడిపోతున్నాడా అనేంతగా పెద్ద అలల వలె కనిపిస్తున్న మేఘాలు ఒక్కసారిగా దూసుకొచ్చేశాయి. చూపరులకు కనువిందుగా కనిపించినప్పటికీ ఆ దృశ్యాలు భీతికొల్పేవిగా ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

భారీ వర్షాలు కురుస్తున్నందున వరద నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఆకస్మిక వరదల్లో వాహనాలు, రహదారులు కొట్టుకుపోయాయి. పంటపొలాలు, నివాసప్రాంతాలు నీటమునిగాయి. ఢిల్లీలో యమునా నది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు స్థానిక యంత్రాంగాలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక కార్యక్రమాలను చేపట్టాలని ప్రధాని కోరారని పీఎంవో తెలిపింది.

ఇదీ చదవండి: Himachal Pradesh Heavy Rains: ఉత్తరాది అతలాకుతలం.. మూడో రోజూ భారీ వర్షాలు, ప్రమాదస్థాయికి చేరుకున్న యమున

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement