appears
-
కలలో పాములు కనిపిస్తే దేనికి సంకేతం ?
నాకు తరచు కలలో పాములు కనిపిస్తుంటాయి. ఇది దేనికి సంకేతం?కలలో పాములు కనిపిస్తున్నాయని మీరు ఆందోళన పడనక్కరలేదు. ఇది శుభానికే సంకేతం. మీకు త్వరలో ఆకస్మిక ధన ్రపాప్తి కలగబోతోందనడానికి సూచన అది. అంతేకాదు, మీకు సంతానం కలగబోతోందనడానికి కూడా సంకేతం కావచ్చు. సాధారణంగా కలలో పాములు కనిపించడం అనేది తీరని కోరికలకు సంకేతం. ఒకోసారి ఆ కోరికలు కార్యరూపం దాల్చబోతున్నాయనడానికి కూడా సూచికగా తీసుకోవచ్చు.దిష్టి తీయడానికి ఎర్రనీళ్లనే ఎందుకు ఉపయోగిస్తారు?వివాహాది శుభకార్యాలలో, నూతన వధూవరుల గృహప్రవేశ సమయంలోనూ, ఇంటిలో ఎవరైనా జబ్బుపడి లేచి స్వస్థత చేకూరి ఇంటికి వచ్చేటప్పుడూ ఎర్రనీళ్లతో దిష్టితీస్తారు. పసుపు, సున్నం నీళ్లు కలిపితే ఎర్రనీళ్లు తయారవుతాయి. ఈ ఎర్రనీళ్లను పళ్లెంలో పోసి దిష్టి తీస్తారు. ఆ నీళ్లను ఎవరూ తొక్కనిచోట పారబోస్తారు. గృహప్రవేశానికి ముందు తియ్యగుమ్మకు చిన్న రంధ్రం చేసి పారాణి ముద్దను ఉంచుతారు. దాన్ని దిష్టితీసి పగలగొడతారు. కొంతమంది ఎండుమిరపకాయలతో, మరికొందరు నూనెలో తడిపి వెలిగించిన గుడ్డపీలికలతోటీ దిష్టి తీస్తారు. ఘాటైన పదార్థాలు, ఎర్రని వస్తువులు దిష్టిని పోగొట్టడంలో శక్తిమంతంగా పని చేస్తాయని ఇలా చేస్తారు.ఇంటిలోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?తులసి చెట్టు, నిమ్మ, వేప వంటివి ఇంటిలోకి దుష్టశక్తులను రానివ్వకుండా చేస్తాయని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా దిష్టి తగలకుండా ఉండడం కోసం వాకిలి వద్ద కొంతమంది బూడిద గుమ్మడి కాయలు కట్టుకుంటారు. అదేవిధంగా పటికను ఎర్ర లేదా నల్లటి వస్త్రంలో మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు. ఇష్టదైవానికి సంబంధించిన చిన్న పటాలను గుమ్మానికి తగిలించడం కూడా మంచిదే. -
హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..!
డెహ్రాడూన్: నైరుతి రుతుపవనాలు ఉత్తరాదిలో బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖండ్‌లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే.. గత నాలుగు రోజులుగా ఆకాశం మేఘావృతమైన నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ఓ వింతైన దృగ్విశయం ఆవిషృతమైంది. సునామీ అలవలె కనిపించిన దట్టమైన మేఘాలు హరిద్వార్‌ను ముంచెేస్తాయా.! అనేలా గోచరించాయి. చూపరులకు కనువిందుగా కనిపించే ఈ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హిమాలయాల అంచున ఉన్న పవిత్రమైన హరిద్వార్ అది. ఆద్యాత్మికతకు పెట్టింది పేరు. ఎక్కడ చూసినా అందమైన, ఎత్తైన కొండ ప్రాంతాలే ఉంటాయి. నాలుగు రోజులుగా వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆకాశమంతా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. సముద్రుడే మీద పడిపోతున్నాడా అనేంతగా పెద్ద అలల వలె కనిపిస్తున్న మేఘాలు ఒక్కసారిగా దూసుకొచ్చేశాయి. చూపరులకు కనువిందుగా కనిపించినప్పటికీ ఆ దృశ్యాలు భీతికొల్పేవిగా ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Massive shelf cloud appears in Haridwar, Uttarakhand. pic.twitter.com/vl7lU5yFjf — Anshul Saxena (@AskAnshul) July 11, 2023 భారీ వర్షాలు కురుస్తున్నందున వరద నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఆకస్మిక వరదల్లో వాహనాలు, రహదారులు కొట్టుకుపోయాయి. పంటపొలాలు, నివాసప్రాంతాలు నీటమునిగాయి. ఢిల్లీలో యమునా నది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక యంత్రాంగాలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక కార్యక్రమాలను చేపట్టాలని ప్రధాని కోరారని పీఎంవో తెలిపింది. ఇదీ చదవండి: Himachal Pradesh Heavy Rains: ఉత్తరాది అతలాకుతలం.. మూడో రోజూ భారీ వర్షాలు, ప్రమాదస్థాయికి చేరుకున్న యమున -
జడ్జి ముందు సికింద్రాబాద్ ఆందోళనకారులు
-
తల్లి మందలించిందని పారిపోయిన యువతి.. చివరికి ఏమైందంటే..
తిరుపతి అర్బన్: తల్లి మందలించడంతో అలిగి వచ్చిన యువతిని తిరుపతి బస్టాండ్ భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని సేలంకు చెందిన సుందర పాండ్యన్ కుమార్తె హాసిని(20) బెంగళూరులో చదువుకుంటోంది. సెలవుల నేపథ్యంలో ఇటీవల ఇంటికి వెళ్లింది. ఇంటి వద్ద చిన్నపాటి పనులు కూడా చేయకుండా సోమరిగా ఉండడంతో, ఆదివారం ఉదయం ఆమె తల్లి కల్యార్సీ మందలించింది. దీంతో అలిగిన హాసిని ఇంటి నుంచి బయల్దేరి వచ్చేసింది. హాసిని తల్లిదండ్రులు సేలం పోలీస్‌స్టేషన్‌లో కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం 8గంటలకు హాసిని తిరుపతికి చేరుకుంది. తిరుపతి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువతిని భద్రతా సిబ్బంది షేకా ఖాజా రహంతుల్లా గుర్తించారు. వెంటనే దిశ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో ఆ యువతి వివరాలను తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు మధ్యాహ్నం 1.30గంటల సమయంలో తిరుపతి బస్టాండ్‌కు చేరుకుని వారి కుమార్తెను కలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ భద్రతా సిబ్బందికి, దిశ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ముంబై పోలీసుల విచారణకు హాజరైన కంగనా రనౌత్
-
శబరిమలలో కనిపించిన మకర జ్యోతి
-
కెనడా ఇమ్మిగ్రేషన్ సైట్ క్రాష్?
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ శ్వేతసౌథం రేసులో దూసుకుపోతూ ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ట్రంప్ టోర్నడో ఎఫెక్ట్ కెనడా ప్రధాన ఇమ్మిగ్రేషన్ సైట్ ను భారీగా తాకినట్టు తెలుస్తోంది. www.cic.gc.ca/ కెనడా సైట్ ను మంగళవారం రాత్రి చెక్ చేసినపుడు ఎర్రర్ మెసేజ్ వస్తోందని, రాయిటర్స్ నివేదించింది. అమెరికా, కెనడా, ఆసియా యూజర్లకు ఇంటర్నెల్ సర్వీస్ ఎర్రర్ అనే సందేశం కనిపిస్తోందని తెలిపింది దీనిపై స్పందించడానికి సంబంధిత అధికారులు తక్షణం అందుబాటులో లేరని పేర్కొంది. బహుశా దేశ ఉద్యోగాలపై ట్రంప్ వ్యాఖ్యలతో చాలామంది కెనడా వైపు చూడనున్నారనే అంచనాలతో ఈ పరిణామం సంభవించినట్టు వ్యాఖ్యానించింది. అటు వెబ్ సైట్ క్రాష్ పై ట్విట్టర్ లో కూడా కమెంట్లు వెల్లువెత్తాయి. కాగా వైట్ హౌస్ ట్రంప్ కు స్వాధీనం అయితే తాము కెనడా పారిపోతామని గతంలోనే చాలామంది ట్విట్టర్ లో చలోక్తులు విసిరారు. అలాగే గత ఫిబ్రవరిలో ట్రంప్ ఎన్నుకోబడితే చాలామంది అమెరికన్లు కెనడా అట్లాంటిక్ తీరంలోని కేప్ బ్రెటన్ ద్వీపానికి శరణార్థులుగా పారిపోతారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. -
1938లో డిగ్రీ.. 2016లో పీజీ..
పాట్నాః 'పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ' అన్న చందంగా ఉంది ఆ వృద్ధుడి ప్రయత్నం. 97 ఏళ్ళ వయసులోనూ చదువంటే సై అంటున్నాడు. ఎప్పుడో ఏడున్నరు దశాబ్దాల క్రితం గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు మళ్ళీ ఎకనామిక్స్ లో ఎం.ఏ పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యాడు. కుటుంబ బాధ్యతలతో డిగ్రీతోనే ఆపేయాల్సి వచ్చిన చదువును తిరిగి కొనసాగిస్తున్నాడు. బీహార్ కు చెందిన రాజ్ కుమార్ వైశ్యా ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ కోసం గతేడాది ఎన్ రోల్ చేసుకున్నాడు. 97 ఏళ్ళ వయసులోనూ మూడు గంటలపాటు ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని మరీ ఆంగ్లంలో సమాధానాలను రాశాడు. 1938 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాజ్ కుమార్.. అప్పట్లో కుటుంబ బాధ్యతలతో పై చదువులు చదువలేక పోయాడు. అందుకే ఇప్పడు తన కోర్కెను తీర్చుకునేందుకు సన్నద్ధమయ్యాడు. నలందా ఓపెన్ యూనివర్శిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందేందుకు 97 ఏళ్ళ వయసులో పరీక్షలు రాశాడు. ఎం.ఏ ఎకనామిక్స్ లో మొదటిభాగం పరీక్ష రాసేందుకు ఆయన సుమారు 23 పేపర్ షీట్లను వినియోగించినట్లు వర్శిటీ అధికారులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా మూడు గంటలపాటు పరీక్షా కేంద్రంలో కూర్చొని మరీ పరీక్షలు రాయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఆయనతోపాటు పరీక్షలు రాసిన వారంతా ఆయన మనవలకంటే కూడ చిన్నవారేనట. మాడ్చేస్తున్న ఎండలకు భయపడి జనం ఇళ్ళనుంచి బయటకు రాలేని సమయంలో ఆ వృద్ధుడు మిగిలిన యువ విద్యార్థులతో కలసి ఉత్సాహంగా పరీక్షలు రాశాడని వర్శిటీ అధికారులు చెప్తున్నారు. అయితే వైశ్యా ఈ వయసులో ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలన్న పట్టుదలకు వెనుక రెండు కారణాలున్నాయట. ఒకటి తాను ఎం.ఏ పూర్తి చేయాలన్న కోరిక, రెండోది భారత్ ఎందుకు ఆర్థిక ప్రకగతిని సాధించి, సమస్యలను అధిగమించలేకపోతోందో తెలుసుకోవాలన్న ఆరాటమూనట. అందుకే ఇప్పుడు పరీక్ష రాసిన రాజ్ కుమార్...తన కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 1920 లో ఉత్తర ప్రదేశ్ బరెల్లీ పట్టణంలో పుట్టిన రాజ్ కుమార్ వైశ్యా... జార్ఘండ్ లో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ 1980 లో పదవీవిరమణ పొందారు. ఆగ్రా యూనివర్శిటీలో 1938 లో డిగ్రీ పూర్తి చేసి, 1940 లో లా పట్టాను కూడ పొందారు. అయితే కుటుంబ బాధ్యతలతో తాను మాస్టర్స్ డిగ్రీని పొందలేకపోయానన్న కోరిక అలాగే ఉండిపోయిందని, ఇప్పుడా కోరిక తీరిందని వైశ్యా చెప్తున్నారు. పదేళ్ళ క్రితం భార్య చనిపోయిన అనంతరం వైశ్యా.. పాట్నా రాజేంద్రనగర్ కాలనీలోని చిన్న కుమారుడు సంతోష్ కుమార్ వద్ద ఉంటున్నాడు. సంతోష్ కుమార్ పాట్నాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేసి రిటైరయ్యారు. ఆయన భార్య భారతి కూడ పాట్నా యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైరయ్యారు. 97 ఏళ్ళ వయసులోనూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్న వైశ్యా... భారత శాఖాహార భోజనాన్నే ఇష్టపడతాడట. ఎప్పుడూ వేపుళ్ళను తిననని, మితంగానే భుజిస్తానని కూడ చెప్తున్నాడు. -
థాయ్ గ్రామంలో వింత ఆకారం...
ఓ వింత రూపం థాయ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. థాయ్ ల్యాండ్ లోని మారు మూల గ్రామంలో కనిపించిన ఆ వింతను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. ఆ రూపం పుట్టింది గేదెకైనా దానికి మొసలి ఆకారం మిళితమై ఉండటాన్ని వింతగా చూస్తున్నారు. చూసేందుకు నల్లని ఆకారంతో కాళ్ళు గేదె రూపాన్ని సంతరించుకున్నా... శరీరం మాత్రం పొలుసులుదేరి మొసలిని తలపించడంతో అంతా ఆ వింతను చూసి విస్తుపోతున్నారు. ఇది సంకర జాతి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ఈ వింత జన్మ తమ గ్రామానికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతున్నారు. అయితే పుట్టిన కొద్ది సమయానికే మృతి చెందిన ఆ జంతువుకు.. వింత ఆకారం ఎలా వచ్చింది అన్న దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. -
జ్యోతి రూపంలో అయ్యప్ప దర్శనం?