థాయ్ గ్రామంలో వింత ఆకారం... | Mysterious creature which appears to be a hybrid | Sakshi
Sakshi News home page

థాయ్ గ్రామంలో వింత ఆకారం...

Published Tue, Oct 6 2015 3:51 PM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

థాయ్ గ్రామంలో వింత ఆకారం...

థాయ్ గ్రామంలో వింత ఆకారం...

ఓ వింత రూపం థాయ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. థాయ్ ల్యాండ్ లోని మారు మూల గ్రామంలో కనిపించిన ఆ వింతను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. ఆ రూపం పుట్టింది గేదెకైనా దానికి మొసలి ఆకారం మిళితమై ఉండటాన్ని వింతగా చూస్తున్నారు.

చూసేందుకు నల్లని ఆకారంతో కాళ్ళు గేదె రూపాన్ని సంతరించుకున్నా... శరీరం మాత్రం పొలుసులుదేరి మొసలిని తలపించడంతో అంతా ఆ వింతను చూసి విస్తుపోతున్నారు. ఇది సంకర జాతి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  మరి కొందరు ఈ వింత జన్మ తమ గ్రామానికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతున్నారు. అయితే పుట్టిన కొద్ది సమయానికే మృతి చెందిన ఆ జంతువుకు.. వింత ఆకారం ఎలా వచ్చింది అన్న దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement