creature
-
ఈ వింతజీవి గురించి మేరెప్పుడైనా విన్నారా..!?
బల్లిలా కనిపించే ఈ వింతజీవి పేరు ‘ఆక్సలోటల్’. ఇది ఉభయచర జీవి. ఎక్కువగా మెక్సికోలో కనిపిస్తుంది. ఇవి పుట్టిన తర్వాత శైశవ దశలో నేల మీద ఉన్నా, పెరిగిన తర్వాత పూర్తిగా నీటిలోనే జీవిస్తాయి. పెద్ద తల, రెప్పలులేని కళ్లతో ఉండే ఈ జీవులు చూడటానికి చాలా వింతగా కనిపిస్తాయి.నీటిలోని చేపలు, చిన్న చిన్న కీటకాలను వేటాడి తింటాయి. వీటికి ఒక అరుదైన శక్తి ఉంది. గాయాల వల్ల వీటిలోని ఏ శరీరభాగం తెగిపోయినా, కొద్దికాలంలోనే వాటిని పూర్తిగా పునరుజ్జీవింప చేసుకోగలవు. బల్లుల వంటి జీవులకు ఈ శక్తి చాలా పరిమితంగా ఉంటుంది. బల్లులకు తోక తెగిపోతే, అది తిరిగి పెరుగుతుంది. ‘ఆక్సలోటల్’కు తోక ఒక్కటే కాదు, శరీరంలోని ఏ అవయవం తెగిపోయినా, కొద్దికాలంలోనే అది పూర్తిగా తిరిగి పెరుగుతుంది.ఇవి పాలిపోయిన తెలుపు, గులాబి, నలుపు, లేత బూడిద రంగు, ముదురు నీలి రంగుల్లో ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మెదడు వంటి అంతర్గత అవయవాలను కూడా ఇవి తిరిగి పెంచుకోగలవు. వీటికి గల పునరుజ్జీవ శక్తికి కారణాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు జరుపుతున్నారు.ఇవి చదవండి: అద్వైత: బజ్ మంటున్న అలారం శబ్దానికి? -
ఏపీలో అరుదైన క్షీరదం గుర్తింపు
అనంతపురం: కొత్త చిట్టెలుక జాతికి చెందిన క్షీరదాన్ని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జువాలజీ విభాగానికి చెందిన టీచింగ్ అసిస్టెంట్ డాక్టర్ బాలసుబ్రమణ్యం గుర్తించారు. అరుదైన జాతికి చెందిన క్షీరదంగా నిర్ధారించారు. పొడుచుకు వచ్చినట్టు ఏనుగు తొండంలా, కదలికలు గల మూతి భాగం(రోష్ట్రం) నిర్మాణ శైలిని కలిగి వెడల్పాటి చెవులు, ఒంటె మూపురం వంటి దేహ నిర్మాణం కలిగి ఉంది.సొరిసిడే కుటుంబానికి చెందిన ఈ క్షీరదం భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. దీని సహజ నివాసం ఉష్ణ లేదా ఉష్ణమండల పొడి అడవులు మాత్రమే. డీఎన్ఏ అనాలిసిస్ కోసం వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డెహ్రాడూన్)కు పంపించారు. ఇప్పటి దాకా పేరు లేని జీవి» ప్రస్తుతం గుర్తించిన ఈ అరుదైన జీవికి ఇప్పటి దాకా ఎలాంటి పేరు లేదు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ 465 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో జీవ వైవిధ్యం పెంపొందించేలా మియావాకీ అడవులను పెంచుతున్నారు. ఇందులోనే దీనిని గుర్తించారు. » ఈ జాతి అటవీ ప్రాంతాలు, వ్యవసాయ భూములు, మానవ కార్యకలాపాలకు సంబంధించిన ప్రాంతాలలో అరుదుగా కనిపిస్తుంది. రక్షిత ఆవాసాలలో గూడు కట్టుకుని నివసిస్తుంది. ఆకులు, అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర గూడు పదార్థాలను సేకరించి, ఆపై గూడును నిర్మించడానికి ఒక రహస్య ప్రాంతాన్ని కనుగొంటాయి. » చిట్టెలుకలు ప్రధానంగా కీటకాహారులు. ఇవి 82 శాతం కీటకాలను తింటాయి. కొన్ని సార్లు మొక్కలను, విత్తనాలను తింటాయి. అలాగే అనేక రకాల అకశేరుకాలు, మానవ ఆహార పదార్థాలను కూడా తింటాయి. » ఇవి రాత్రి పూట ఎక్కువగా అడవులు, సాగు చేసిన పొలాలు, మానవ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఆహారం తీసుకుంటాయి. కీటకాలు, తెగుళ్లు రాకుండా అరికడతాయి. రైతులకు కీటకాలను నియంత్రించడంలో దోహదం చేస్తాయి.పొడి అడవుల్లో మాత్రమేజీవించే అరుదైన జీవికొత్త చిట్టెలుక జాతికి చెందిన క్షీరదాన్ని ఎస్కేయూలో గుర్తించాం. పొడి అడవుల్లో మాత్రమే జీవించే అరుదైన జీవి ఇది. డీఎన్ఏ అనాలిసిస్ కోసం వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డెహ్రాడూన్)కు పంపాము.– డాక్టర్ బాలసుబ్రమణ్యం, జువాలజీ విభాగం టీచింగ్ అసిస్టెంట్, ఎస్కేయూ -
భూమిపై అత్యంత విషపూరిత జంతువులు ఫోటో గ్యాలరీ
-
మనిషి... మనుగడ
మనుగడ అనేది ప్రతి మనిషికీ ఉంటుంది. మనిషికి మాత్రమే మనుగడ ఉంటుందా? ప్రతి జీవికీ మనుగడ ఉంటుంది. ఏ జీవి మనుగడ దానిదే. కొన్ని జంతువుల మనుగడ మనిషికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి మనిషి మనుగడా తనకు, సమాజానికి ప్రయోజనకరంగానే ఉండాలి; ప్రయోజనకరంగా ఉండేందుకు మనిషి తన మనుగడను ఒక అవకాశంగా తీసుకుని, చేసుకుని ప్రయత్నించాలి. మనుగడ ప్రయోజనకరంగా పరిణమించడానికి ఏ మనిషికి ఐనా మెదడు, మనసు ఈ రెండూ కీలకం ఐనవి. మనసు తిన్ననైంది కాకపోవడం మాత్రమే మనిషికి లోటు కాదు; మెదడు సరిగ్గా పనిచెయ్యక పోవడం మాత్రమే మనిషికి లోటు కాదు. మెదడుకు మనసు లేకపోవడమే, మనసుకు మెదడు లేకపోవడమే మనిషికి లోతైన లోటు! మెదడుకు మనసు ఉండాలి; మనసుకు మెదడు ఉండాలి. మెదడు, మనసు కలిసి ఉద్యుక్తం ఐతే, ఉన్ముఖం ఐతే, ఉద్యమిస్తే ఉన్నతం ఐన ఫలితం వస్తుంది. మనుగడ ఉచ్చస్థితికి చేరుతుంది. సగటు మనిషి తన చేతిలోనే తాను ఓడిపోతూ ఉంటాడు; తన ప్రవర్తనవల్ల తాను సరిగ్గా ఉండడం జరగదు సగటు మనిషికి; చేసిన లేదా జరిగిన తప్పులు దిద్దుకోబడడం ఉండదు చాలమంది విషయంలో; చెడిపోవడం అన్నది చెరిగిపోవడం జరగడం లేదు పలువురిలో. వీటికి కారణం మెదడుకు మనసు లేకపోవడమే; మనసుకు మెదడు లేకపోవడమే. మనిషి మెదడు, మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. ఏవేవో, ఎన్నెన్నో వాటిలో ఉంటూ ఉంటాయి. అవసరం ఐనవి తక్కువగా, ఎక్కువగా అనవసరం ఐనవి మెదడు, మనసుల్లో ఉండి మనిషి మనుగడ మందమైపోవడానికి, మొద్దుబారిపోవడానికి కారణాలు ఔతూ ఉంటాయి. మెదడు, మనసుల పనితీరువల్లే మనిషికి మేలు, కీడులు కలుగుతూ ఉంటాయి; మనిషిని పనికి వచ్చేట్టుగానూ, పనికిరానట్టుగానూ చేసేవి మెదడు, మనసులే. మెదడుకు మనసును, మనసుకు మెదడును నేర్పుతో అనుసంధానం చేసుకోవడమూ, ఆ అనుసంధానంతో దైనందిన జీవనాన్ని ఎదుర్కోవడమూ తెలిసిన మనిషికి అభివృద్ధి అలవడుతుంది. మనిషి అభివృద్ధిని అలవాటు చేసుకోవాలి; మనిషికి అభివృద్ధిలో అభినివేశం ఉండి తీరాలి. అభివృద్ధిలేని మనిషి అక్కరకురాని మనిషి ఔతాడు ఆపై అక్కర్లేని మనిషి ఔతాడు. మనిషి మనుగడ అనవసరం ఐంది, పనికిరాంది కాకూడదు; మనిషి మనుగడ వెలవెలపోకూడదు. మనిషి మనుగడ విలువైంది కావాలి. మనిషి తన మనుగడకు తానే విలువను, వన్నెను సమకూర్చుకోవాలి. మెదడు, మనసుల్ని సంయుక్తంగా సంప్రయోగించి మనిషి తన మనుగడను విజయవంతంగా నడుపుకోవాలి. ‘తిండిని వెతుక్కుంటూ రోజూ తిని/ ఏవేవో అల్పమైన కథలు చెప్పుకుని/ మనసు ఒడిలి బాధల్ని అనుభవించి/ ఇతరుల్ని బాధించేవెన్నో చేసి/ తల నెఱుపు వచ్చి ముసలితనాన్ని పొంది/ ఘోరమైన మరణానికి బలై / మాసిపోయే పలు విదూషకుల్లా నేను కూలిపోతాననుకున్నావా?’ అని, అని తమిళ్ కవి సుబ్రమణియ బారతి పేలవంగా ఉండడాన్ని తిరస్కరించారు. కూలిపోయేందుకు కాకుండా, విదూషకత్వంతో కాకుండా, మాసిపోయేందుకు కాకుండా, ఇతరుల్ని బాధించేందుకు కాకుండా, బాధల్ని అనుభవిస్తూ ఉండేందుకు కాకుండా, అల్పుడుగా కాకుండా, ఏదో తింటూ కాలం గడిపేందుకు కాకుండా మిన్నగా మసలేందుకు, మిన్నులా ఎత్తుల్లో నిలిచేందుకు మెదడుతో మనసును, మనసుతో మెదడును సంయుక్తం చేసుకుని మనిషి కార్యాచరణకు పూనుకోవాలి. మనిషి మనుగడ ప్రయోజనకరంగా ఎందుకు ఫలించకూడదు? మనిషి తన మనుగడను పట్టుదలతో ప్రయోజనకరం చేసుకోవాలి. మెదడు, మనసుల సమన్వయంతో, సంయోగంతో మనిషి సంపూర్ణంగా సఫలం అవాలి. మనిషి తన మనుగడకు సత్ప్రయోజనాన్ని సాధించుకోవాలి; సమాజానికీ సాధ్యం ఐనంత ప్రయోజనకరంగా మనిషి మెదులుతూ ఉండాలి. మనిషికి మెదడు, మనసు ఉంటాయి. అవి సరిగ్గా, మెరుగ్గా ఉంటే మనిషి సరిగ్గా, మెరుగ్గా ఉంటాడు; అవి మేలుగా ఉంటే మనిషి మేలుగా ఉంటాడు. మెదడు, మనసు రెండూ కలిసి జతగా పనిచేస్తూ ఉంటేనే మనిషి గొప్ప స్థితిని, స్థాయిని, గతిని ఆపై ప్రగతిని పొందుతూ ఉంటాడు. – రోచిష్మాన్ -
అది అత్యంత విచిత్ర జీవి.. పాలివ్వడమే కాదు.. గుడ్లు కూడా పెడుతుంది!
ప్రపంచంలో అనేక వింత జీవులు ఉన్నాయి. వీటిని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.అటువంటి వాటిలో ఒకటే ప్లాటిపస్. చూసేందుకు ఈ జీవి ఎంతో విచిత్రంగా ఉంటుంది. దీని ముఖం బాతు ముఖాన్ని పోలివుంటుంది. దీని శరీరం సీలు చేప మాదిరిగా ఉంటుంది. ఇది క్షీరద జాతికి చెందిన జీవి. ఇది పాలిచ్చి పెంచే జంతువు అయినప్పటికీ.. గుడ్లను కూడా పెడుతుంది. ఇది మిశ్రమ జీవిలా కనిపిస్తుంది. ఇలాంటి మిశ్రమ జాతి జీవులు ప్రపంచంలో ఐదు రకాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్లాటిపస్కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు దీనిని నమ్మలేదు 1799లో తొలిసారి ఈ ప్లాటిపస్ శాస్త్రవేత్తల కంటికి చిక్కింది. దీనిని చూడగానే వారు తెగ ఆశ్చర్యపోయారు. దీని శరీరం, ముఖం ఎంతో వింతగా.. పొంతన లేని విధంగా కనిపించింది. ఇలాంటి జీవి భూమిపై ఉందనే విషయాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. తొలుత దీనిని రెండు జీవులుగా భావించిన శాస్త్రవేత్తలు తమపరిశోధనల ద్వారా అది ఒక జీవేనని తేల్చారు. తరువాత అటువంటి జీవి సజీవంగానే లభ్యం అయ్యింది. రక్షణ కోసం విషం జిమ్ముతూ.. ప్లాటిపస్ ఇతర జీవుల నుంచి రక్షణ కోసం విషం జిమ్ముతుంటుంది. దాని వెనుక కాళ్లలో ఒక ముల్లులాంటిది ఉంటుంది. దానిలో విషం ఉంటుంది.తన రక్షణకు అది ఆ ముల్లును ఇతర జీవులకు గుచ్చుతుంది. అయితే మనిషికి ప్లాటిపస్ ముల్లు గుచ్చుకోవడం వల ఎటువంటి హాని జరగను. అయితే తట్టుకోలేకంత నొప్పి కలుగుతుంది. ఇది కూడా చదవండి: మన వర్సిటీలు ప్రపంచంలో మేటి -
ఆ జీవులతో ‘ఎన్ని గుండెలు నీకు’ అనలేరు.. కారణమిదే!
సజీవంగా ఉండాలంటే ప్రతీ జీవికి గుండె ఎంతో అవసరం. గుండె అనేది శరీరం అంతటికీ రక్తం సరఫరా చేయడంతోపాటు పలు విధులు నిర్వహిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఒకటి కన్నా ఎక్కువ గుండెలు కలిగిన జీవుల గురించి తెలుసుకుందాం. ఈ ప్రపచంలో అనేక జీవజాతులు ఉన్నాయి. వీటిలో కొన్ని భూమిపైన, కొన్ని భూమి కింద, మరొకొన్ని చెట్ల మీద నివాసం ఏర్పరుచుకుంటాయి. వీటిలో కొన్ని జీవులకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ గుండెలు ఉంటాయి. వీటిలో ఆక్టోపస్‌కు 3 గుండెలు ఉంటాయనే సంగతి చాలామందికి తెలుసు. అయితే ఆక్టోపస్తోపాటు మరి ఏ జీవులకు అత్యధిక గుండెలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆక్టోపస్ ఇది సముద్ర జీవి దీనికి 3 గుండెలు, 8 కాళ్లు ఉంటాయి. దీని రక్తం నీలి రంగులో ఉంటుంది. దీని జీవిత కాలం 6 నెలలు మాత్రమే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. స్క్విడ్ ఈ చేప చూసేందుకు ఆక్టోపస్ మాదిరిగానే కనిపిస్తుంది. దీనికి కూడా 3 గుండెలు ఉంటాయి. దీనిలో ఒక గుండె దాని శరీరానికంతటికీ రక్తం సరఫరా చేస్తుంది. మిగిలిన రెండు గుండెలు గిల్స్‌లో ఆక్సిజన్ పంప్ చేస్తాయి. గిల్స్ అనేది చేపకు ఆక్సిజన్ అందించే అవయవం. ఎర్త్‌వార్మ్ ఎర్త్‌వార్మ్ అంటే వానపాము. ఇది వ్యవసాయదారులకు ఎంతో మేలు చేస్తుంది. దీనికి కూడా పలు గుండెలు ఉంటాయి. దీని హృదయం పనిచేసే విధానాన్ని ‘ఎరోటిక్ ఆర్చ్’ అని అంటారు. ఇది పంపింగ్ ఆర్గాన్ మాదిరిగా పనిచేస్తుంది. శరీరం అంతటికీ ఇది రక్తాన్ని సరఫరా చేస్తుంది. కాక్రోచ్ కక్రోచ్కు ఒకే గుండె ఉన్నప్పటికీ దానికి 13 చాంబర్లు ఉంటాయి. దీని గుండెలోని ఒక చాంబర్‌కు గాయమైతే, మిగిలిన చాంబర్లు యాక్టివేట్ అవుతాయి. ఫలితంగా హృదయానికి గాయమైనా అది చనిపోదు. ఇది కూడా చదవండి: పిల్లాడి టైమ్ టేబుల్.. చదువుకు కేటాయించిన టైమ్ చూస్తే నవ్వాపుకోలేరు! -
విశాఖ తీరంలో అరుదైన జీవి.. రాలిన ఆకులా చదునైన శరీరం, ఇదే ప్రత్యేకత
సాగర గర్భం ఎన్నో వింతలకు, మరెన్నో విశేషాలకు నిలయం. ఎన్నో అంతుచిక్కని జీవరాశులకు ఆలవాలం. సముద్రం లోతుపాతుల్ని అన్వేషిస్తున్న క్రమంలో అప్పుడప్పుడు శాస్త్రవేత్తలు, మెరైన్ బయాలజిస్టులకు అరుదైన సముద్ర జీవరాశుల ఉనికి లభ్యమవుతోంది. తాజాగా అలాంటి అత్యంత అరుదైన ‘ఫ్లాట్‌వార్మ్’ జాడ భారతదేశ తూర్పు తీరంలో విశాఖలో తొలిసారిగా వెలుగు చూసింది. ఇది అచ్చం రాలిన ఆకును పోలి ఉండి చదునైన శరీరాన్ని కలిగి ఉంది. రక్తనాళాలు లేని ఈ జీవి లేత, ముదురు నీలి రంగు, మధ్యలో పొడవైన పసుపురంగు వెన్నుతో కనువిందు చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా సముద్ర తీరంలో ఆటుపోట్లు సంభవించే (ఇంటర్ టైడల్) ప్రాంతంలో వివిధ రకాల సముద్ర జీవులు కనిపిస్తుంటాయి. వీటిలో అరుదైన జాతులు/జీవులపై పరిశోధనలు చేసేవారు వీటిని రికార్డు చేస్తున్నారు. విశాఖకు చెందిన ఈస్ట్‌కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ (ఈసీసీటీ) సభ్యులు ఆంధ్రప్రదేశ్ తీరంలో ప్రతి రెండు వారాలకు మెరైన్ వాక్ చేపడుతున్నారు. ఇందులో ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇలా ఈసీసీటీ, గ్రీన్ పా సంస్థలకు చెందిన మెరైన్ బయాలజిస్టులు ఇంటర్ టైడల్ బయోడైవర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులో భాగంగా విశాఖ రుషికొండ బీచ్‌లో గతేడాది జూలైలో వాక్ చేస్తున్నప్పుడు మూడు సెంటీమీటర్ల పొడవున్న మెరైన్ ఫ్లాట్‌వార్మ్ (సాంకేతిక నామం సూడోసెరోస్ గలాథీన్సిస్ –Pseudoceros galatheensis) కనిపించింది. ఏదైనా అరుదైన జీవి కనిపించినప్పుడు దాని గురించి సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. ఇలా ఈ ఫ్లాట్‌వార్మ్ గురించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రియేటివ్ రీసెర్చ్ థాట్‌కు పంపగా ఈ జూలై మొదటి వారంలో ప్రచురించింది. తూర్పు తీరంలో మరెక్కడా లభించని ఉనికి.. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ఫ్లాట్‌వార్మ్ జాతులు ఉన్నా ఐదేళ్ల క్రితం వరకు వీటి జాడ భారతదేశంలో ఎక్కడా లభ్యం కాలేదు. 2017లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ) నిపుణులు అండమాన్‌లో పాలిక్లాడ్ వర్గానికి చెందిన ఈ ఫ్లాట్‌వార్మ్ ఉనికిని మొదటిసారి కనుగొన్నారు. తూర్పు తీరంలో మరెక్కడా ఇప్పటిదాకా ఈ జీవి ఉనికి కనిపించలేదు. దీంతో తొలిసారిగా దేశంలోని తూర్పు తీరంలోని విశాఖలో ఫ్లాట్‌వార్మ్ జాడ లభించినట్టైంది. విశాఖలో మెరైన్ బయాలజిస్టు శ్రీచక్ర ప్రణవ్ నేతృత్వంలోని విమల్‌రాజ్, మనీష్ మానిక్, పవన్‌సాయిలు ఈ ఫ్లాట్‌వార్మ్‌ను గుర్తించి రికార్డు చేశారు. విష పూరితాలు కూడా.. ఈ ఫ్లాట్‌వార్మ్‌లు విషపూరితాలు. వీటికున్న రంగుల ద్వారా ఇతర జంతువులు వాటిని విషపూరితాలుగా గుర్తించి దగ్గరకు రానీయవు.. వెళ్లవు. ఇవి చిన్న చిన్న పీతలను, వీటికన్నా చాలా చిన్న జీవులను, రాళ్లపై ఉండే స్పంజికలు, అసిడియన్లు వంటి జీవరాశులను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పగడపు దిబ్బలు, లోతు లేని సముద్రంలోని రాతి ప్రాంతాల్లో ఉంటాయి. ఈ ఫ్లాట్‌వార్మ్‌లు రెండు మడతలను కలిగి ఉండి ప్రతి మడతపై 12 కళ్ల మచ్చలుంటాయి. అవి కాంతిని గ్రహించడానికి ఉపయోగపడతాయని మెరైన్ బయాలజిస్టులు చెబుతున్నారు. కాగా వీటి జీవిత కాలం ఎంత అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రజల భాగస్వామ్యంతో మరిన్ని.. ప్రజల భాగస్వామ్యంతో కొత్త సముద్ర జీవరాశుల ఉనికి మరింతగా తెలుస్తుంది. అందుకే మేం ఆసక్తి ఉన్న ప్రజలతో కలిసి మెరైన్ వాక్ చేస్తున్నాం. ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తాం. ప్రజలు ముందుకొస్తే ఇంకా చాలా జాతులను కనుగొనవచ్చు. విశాఖ రుషికొండ తీరంలో కనుగొన్న ఫ్లాట్‌వార్మ్ తూర్పు తీరంలోనే మొట్టమొదటిదిగా రికార్డయింది. దీంతో పాటు మరో రెండు జాతులను చూశాం. అవి ఏంటనేది త్వరలో తెలుస్తుంది. మా ప్రాజెక్టు ద్వారా విశాఖ తీర ప్రాంతంలో ఇప్పటిదాకా 130కి పైగా సముద్ర జాతులను కనుగొన్నాం. – శ్రీచక్ర ప్రణవ్, మెరైన్ బయాలజిస్టు, ఈస్ట్‌కోస్ట్ కన్జర్వేషన్ టీమ్, విశాఖపట్నం -
పసిఫిక్ మహాసముద్రంలో వింత ‘పుష్ప’ జీవి గుర్తింపు
న్యూఢిల్లీ: అచ్ఛంగా విచ్చుకున్న పుష్పంలాగా ఉన్న కొత్త జీవిని పసిఫిక్ మహాసముద్రంలో పరిశోధకులు గుర్తించారు. ఓషియన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన పసిఫిక్ అడుగు భాగాన అన్వేషిస్తుండగా, ఈ జీవి దర్శనమిచ్చింది. సంబంధిత వీడియో దృశ్యాలను ఓషియన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్టు విడుదల చేసింది. సముద్ర ఉపరితలం నుంచి 9,823 అడుగుల(2,994 మీటర్లు) లోతున ఈ జీవి కనిపించిందని పరిశోధకులు చెప్పారు. పువ్వుకు ఉన్నట్టుగానే దీనికి కాండం, రేకుల (తంతువుల) లాంటివి ఉండడం విశేషం. కాండం వంటి భాగం 7 అడుగులు (2 మీటర్లు) కాగా, ఒక్కో తంతువు 16 అంగుళాలు (40 సెం.మీ.) పొడవున్నాయట! ఇదో భారీ సముద్ర జీవి అని చెబుతున్నారు. అయితే ఇతర సముద్ర జీవజాతుల తరహాలో కాకుండా భిన్నంగా కనిపిస్తుండడం దీని ప్రత్యేకత. ఇలాంటి వింత జీవి ఒకటి కనిపిస్తుందని ఎప్పుడూ ఊహిచలేదని పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే.. -
అటవీ అధికారుల కంటపడ్డ వింతజీవి.. కాటేస్తే డౌటే!
రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని మునిగుడ సమితి లోదిపొంగ అడవుల్లో అటవీశాఖ అధికారులకు ఓ వింతజీవి తారసపడింది. దీనిని చాకచక్యంలో పట్టుకుని అటవీశాఖ కేంద్రానికి తరలించారు. శనివారం రాత్రి కొంతమంది అటవీశాఖ సిబ్బంది అడవిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ జీవి కనిపించిందని అటవీశాఖ అధికారి ప్రసన్నకుమార్ మిశ్రొ తెలిపారు. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పేరుతో పిలుస్తారనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అయితే ఇది విషపూరితమైన జీవమని, మనుషులపై దాడి చేసి, కాటు వేస్తుందని వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి చెందిన తెలిపారు. దాడి చేసే స మయంలో శరీరంలోకి విషం ఎక్కి, ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని సమాచారం. దీనిపై వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: సామూహిక లైంగిక దాడి చేసి.. ఆమెకు ఇలా వెల కట్టారు -
24 వేల ఏళ్లుగా గడ్డకట్టే మంచులోనే పడిఉంది... కానీ ఆ జీవి బతికే ఉంది!
Cold grave for nearly 24,000 years without eating or drinking: చాలా షాకింగ్ ఘటనలు చూస్తే అసలు అదేలా సాధ్యం అని కూడా అనుకుంటాం. నిజానికి ఈ విశాలా విశ్వంలో మన ఊహకు అందని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కాకపోతే అసాధ్యం అనుకునేవి జరిగేంత వరకు కూడా మనం అంత తేలిగ్గా నమ్మం. అచ్చం అలాంటి సంఘటనే ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఆర్కిటిక్‌లో మైనస్ డిగ్రీల ఉష్టోగ్రత ఉంటుంది. పైగా చాలా దారుణమైన గడ్డకట్టుకుపోయేంత చలి. అలాంటి ప్రాంతంలో మంచు తుపానులో చిక్కుకున్న లేదా కూరుకుపోయిన బతికే ఛాన్స్ లేనే లేదు. కానీ శాస్త్రవేత్తలు ఆర్కిటిక్‌లోని గడ్డకటట్టే చలిలో పరిశోధనలు చేయడానికి వెళ్లినప్పుడూ వారికి ఒక ఊహించని షాకింగ్ ఘటన ఎదురైంది. అక్కడ మంచులో కూరుకుపోయి పడి ఉన్న ఒక వింత జీవిని చూశారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది నిక్షేపంగా బతికే ఉంది. అయితే ఆ జీవి దాదాపు 24 వేల ఏళ్లుగా ఏమి తినకుండా, తాగకుండా మంచులోనే పడి ఉంది. ఇలాంటి వాటిని మైక్రో-జోంబీ జీవులు అంటారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి జంతువులు 50 మిలియన్ల ఏళ్ల క్రితం వివిధ నీటి ప్రాంతాల్లో కనుగొన్నారని చెప్పారు. అయితే ఈ జీవి చర్మం మంచు ప్రభావం ఏ మాత్రం కనిపించలేదని చెప్పారు. ఇది మాత్రమే కాదు, వీటిని లేడ్ రోటిఫర్స్ లేదా వీల్ యానిమల్స్ అని కూడా పిలుస్తారని అన్నారు. అయితే వీటి చర్మంపై చాలా కణాలతో కూడిన సూక్ష్మ జీవుల ఉంటాయని, పైగా నోటి చుట్టూ దట్టంగా వెంట్రుకలు ఉంటాయని అన్నారు. ఇంతకుముందు రష్యన్ శాస్త్రవేత్తలు -20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పది సంవత్సరాల వరకు జీవించగల అటువంటి రోటిఫర్‌లను కనుగొన్నారని కూడా చెప్పారు. అయితే ఇవి జన్మనివ్వవని, అలైంగికమైనవని తెలిపారు. అయితే శరీరం పొడవుగా ఉంటుందన్నారు. వాటి పొడవు 0.04 నుంచి 2 మిల్లీమీటర్ల వరకు ఉంటుందని, కానీ చాలా వరకు 0.5 మిల్లీమీటర్లకు మించి పెరగవు అని వెల్లడించారు. పరిమాణంలో చిన్నది అయినప్పటికీ వారి శరీరంలో చాలా క్లిష్టమైన అవయవాలు ఉన్నాయని వాటిని మైక్రోస్కోప్ లేకుండా చూడలేమని చెబుతున్నారు. ఈ రోటిఫర్‌లను చూస్తే ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింత జీవులు ఉన్నాయని అనిపిస్తుంది కదా (చదవండి: ఇంతకీ ఐపీఎస్ అధికారి సూట్ కేస్‌లో ఏముందో తెలుసా!) -
ఈ చిన్న జీవి బలం ఎంతో తెలుసా?
న్యూయార్క్ : పరిమాణంలో చిన్నగా.. చూడగానే ఒళ్లు కొద్దిగా జలదరించేలా ఉండే ‘డయాబోలికల్ ఐరన్ క్లాడ్ బీటిల్’ అనే జీవి శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగకారిగా మారింది. పెద్ద కారును దాని మీదనుంచి పోనిచ్చినా బ్రతికి ఉండగలిగే శరీర నిర్మాణం దాని సొంతం. అందుకే దానిపై పరిశోధనలు చేయటం మొదలుపెట్టారు ‘పర్డ్యు యూనివర్శిటీ’ శాస్త్రవేత్తలు. ఉక్కు లాంటి దాని శరీర నిర్మాణంతో ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుంటున్నారు. తద్వారా బలమైన విమానాలు, ఇతర వస్తువుల తయారీ, భవంతుల నిర్మాణంలో అది సహాయపడుతుందని భావిస్తున్నారు. సౌత్ కాలిఫోర్నియాలోని అడవుల్లో నివసించే ఈ జీవి దాని శరీర బరువుకంటే 39 వేల రెట్ల అధిక బరువును తట్టుకోగలదని చెబుతున్నారు. ( యూట్యూబ్‌లో దూసుకుపోతున్న కలెక్టర్ భక్తి పాట ) డయాబోలికల్ ఐరన్ క్లాడ్ బీటిల్ శరీర అంతర్ నిర్మాణం అదే ప్రాంతంలో నివసించే మరికొన్ని జీవులు వాటి శరీర బరువు కంటే మూడు రెట్ల బరువును మాత్రమే తట్టుకోగలిగాయని చెప్పారు. ఐరన్ క్లాడ్ బీటిల్ శరీరం అంత బలంగా ఎలా ఉందో తెలుసుకోవటానికి సీటీ స్కాన్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లను ఉపయోగించారు. ప్రత్యేక, జిగ్‌షా ఆకారంలోని శరీర బంధనాల నిర్మాణం, పొరలే ఇందుకు కారణమని తేల్చారు. సదరు జీవి శరీరంపై తీవ్రమైన ఒత్తిడి కలిగించినపుడు దాని శరీరం ఒకే సారి ముక్కలవకుండా.. కొద్ది కొద్దిగా పగుళ్లు ఏర్పరచిందని పేర్కొన్నారు. -
బీచ్ రక్తపు మయం: గగుర్పాటుతో పరుగులు
-
బీచ్ రక్తపు మయం: గగుర్పాటుతో పరుగులు
దాదాపు 50 అడుగులు పొడవున్న ఓ వింత జంతువు మృతదేహం గత వారం ఇండోనేషియాలోని బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కొట్టుకువచ్చిన చనిపోయిన భారీ ఆకారం నుంచి రక్తం వస్తుండటంతో బీచ్ మొత్తం రక్తపు నీటిగా మారిపోయింది. గగుర్పాటుకు గురి చేస్తున్న దాని ఆకారాన్ని చూసి బీచ్‌కు వచ్చిన సందర్శకులు అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ వింత ఆకారంపై శాస్త్రవేత్తల దృష్టి పడింది. గతంలో ఎన్నడూ చూడని ఈ ఆకారం ఏంటా అని పరిశోధకులు తలలు పట్టుకుంటున్నారు. కొందరు ఇది ఒక రకమైన సముద్రపు వేల్ అని అంటున్నారు. చనిపోయిన వేల్ శరీరం కుళ్లిపోతుండటంతో జంతువు ఆకారం మరి వికారంగా తయారవుతోందని పరిశోధకులు భావిస్తున్నారు. సున్నిత మనస్కులు బీచ్‌లో రక్తపు నీటిని చూసి వణికిపోతుంటే.. ధైర్యం కలిగిన వారు సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
థాయ్ గ్రామంలో వింత ఆకారం...
ఓ వింత రూపం థాయ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. థాయ్ ల్యాండ్ లోని మారు మూల గ్రామంలో కనిపించిన ఆ వింతను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. ఆ రూపం పుట్టింది గేదెకైనా దానికి మొసలి ఆకారం మిళితమై ఉండటాన్ని వింతగా చూస్తున్నారు. చూసేందుకు నల్లని ఆకారంతో కాళ్ళు గేదె రూపాన్ని సంతరించుకున్నా... శరీరం మాత్రం పొలుసులుదేరి మొసలిని తలపించడంతో అంతా ఆ వింతను చూసి విస్తుపోతున్నారు. ఇది సంకర జాతి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ఈ వింత జన్మ తమ గ్రామానికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతున్నారు. అయితే పుట్టిన కొద్ది సమయానికే మృతి చెందిన ఆ జంతువుకు.. వింత ఆకారం ఎలా వచ్చింది అన్న దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.