ప్రపంచంలో అనేక వింత జీవులు ఉన్నాయి. వీటిని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.అటువంటి వాటిలో ఒకటే ప్లాటిపస్. చూసేందుకు ఈ జీవి ఎంతో విచిత్రంగా ఉంటుంది. దీని ముఖం బాతు ముఖాన్ని పోలివుంటుంది. దీని శరీరం సీలు చేప మాదిరిగా ఉంటుంది. ఇది క్షీరద జాతికి చెందిన జీవి. ఇది పాలిచ్చి పెంచే జంతువు అయినప్పటికీ.. గుడ్లను కూడా పెడుతుంది. ఇది మిశ్రమ జీవిలా కనిపిస్తుంది. ఇలాంటి మిశ్రమ జాతి జీవులు ప్రపంచంలో ఐదు రకాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్లాటిపస్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
శాస్త్రవేత్తలు దీనిని నమ్మలేదు
1799లో తొలిసారి ఈ ప్లాటిపస్ శాస్త్రవేత్తల కంటికి చిక్కింది. దీనిని చూడగానే వారు తెగ ఆశ్చర్యపోయారు. దీని శరీరం, ముఖం ఎంతో వింతగా.. పొంతన లేని విధంగా కనిపించింది. ఇలాంటి జీవి భూమిపై ఉందనే విషయాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. తొలుత దీనిని రెండు జీవులుగా భావించిన శాస్త్రవేత్తలు తమపరిశోధనల ద్వారా అది ఒక జీవేనని తేల్చారు. తరువాత అటువంటి జీవి సజీవంగానే లభ్యం అయ్యింది.
రక్షణ కోసం విషం జిమ్ముతూ..
ప్లాటిపస్ ఇతర జీవుల నుంచి రక్షణ కోసం విషం జిమ్ముతుంటుంది. దాని వెనుక కాళ్లలో ఒక ముల్లులాంటిది ఉంటుంది. దానిలో విషం ఉంటుంది.తన రక్షణకు అది ఆ ముల్లును ఇతర జీవులకు గుచ్చుతుంది. అయితే మనిషికి ప్లాటిపస్ ముల్లు గుచ్చుకోవడం వల ఎటువంటి హాని జరగను. అయితే తట్టుకోలేకంత నొప్పి కలుగుతుంది.
ఇది కూడా చదవండి: మన వర్సిటీలు ప్రపంచంలో మేటి
Comments
Please login to add a commentAdd a comment