ప్రపంచంలోని అతి చిన్న క్షీరదాలలో ఒకటైన ఎట్రుస్కాన్ ష్రూ గుండె నిముషానికి 1,500 సార్లు లేదా సెకనుకు 25 సార్లు కొట్టుకుంటుంది. మనిషి గుండె నిముషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది. కాగా బ్లూ వేల్ గుండె భారీ పరిమాణం కలిగివుంటుంది.
జీవులలో అతిపెద్ద గుండె బ్లూ వేల్‌లో మాత్రమే కనిపిస్తుంది. ఈ సముద్ర జీవి రెండు బస్సులకు మించిన పొడవు కలిగివుంటుంది. దాని గుండె లవ్‌సీట్ ఆకారంలో ఉంటుంది. అది 1,000 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. దాని గుండె నిమిషానికి కనీసం రెండుసార్లు మాత్రమే కొట్టుకుంటుంది. నీటి అడుగున ఉండే ఈ నీలి తిమింగలం ఛాతీపై జెయింట్ స్టెతస్కోప్ పెట్టిన పరిశోధకులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు.
ప్రపంచంలోని అన్ని జీవులలో తిమింగలం అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. దాని గుండె చాలా పెద్దదిగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దాని గుండె కొలతలు తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు. కెనడాలోని టొరంటోలోని రాయల్ అంటారియో మ్యూజియంలో బ్లూ వేల్ గుండెను భద్రపరిచారు. ఆ గుండె బరువు 190 కిలోలు. ఈ జీవి మొత్తం బరువులో గుండె ఒక శాతం ఉంటుంది. అంటే గుండె బరువు 400 పౌండ్లు అయితే తిమింగలం మొత్తం బరువు 40,000 పౌండ్లు. చేపల బరువు పౌండ్లలో కొలుస్తారు. మనిషి గుండె బరువు 10 ఔన్సులకు సమానం. కేజీలోకి మారిస్తే 283 గ్రాములు. తిమింగలం గుండె బరువు మనిషి గుండె కంటే 640 రెట్లు అధికం.
ఇది కూడా చదవండి: అంతరిక్షంలో పొగలుకక్కే కాఫీ ఎలా తాగుతారు?
Comments
Please login to add a commentAdd a comment