కొంతమందికే తెలుసు.. ప్రపంచంలో అలాంటి స్మార్ట్ వాచ్ ఉందని.. అది 1947 నుండి మనకు ప్రమాదాలను సూచిస్తోందని... ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత కొన్నేళ్లుగా ఈ వాచ్ తన స్పీడ్‌ని పెంచింది. అంటే మనం ఇప్పుడు గతంలో కంటే వేగంగా ప్రళయకాలానికి దగ్గరవుతున్నామని దాని అర్థం. ఇప్పుడు మనం ‘డూమ్స్‌డే క్లాక్’ గురించి తెలుసుకోబోతున్నాం.
ఇది సింబాలిక్ క్లాక్.. మహమ్మారి, అణు దాడులు, వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచ విధ్వంస అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుంది. ప్రళయానికి ముందు మనుషులను కాపాడేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ గడియారం అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇది ప్రళయకాలాన్ని తెలియజేస్తోంది. 1945లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం, కొంతమంది అణు శాస్త్రవేత్తలు కలిసి డూమ్స్‌డే వాచ్‌ను రూపొందించారు. ప్రపంచ మనుగడకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో చెప్పడానికే డూమ్స్‌డే క్లాక్ రూపొందించారు.
ఈ గడియారాన్ని 13 మంది నోబెల్ బహుమతి విజేతలతో కూడిన శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ గడియారంలో టైం మారుతుంటుంది. ఆ ఏడాదిలో జరిగిన సహజ మార్పులు, మానవాళికి జరిగిన నష్టం ఆధారంగా ఈవాచ్‌లో టైమ్ మారుతుంటుంది. దీనిని తొలిసారిగా 1947లో సృష్టించినప్పుడు మానవాళికి ఉన్న ఏకైక ముప్పు అణు దాడి. దీనిని రూపొందించినప్పుడు ఈ గడియారపు సమయాన్ని 10 సెకన్లు తగ్గించారు. దీని ప్రభావం మూడేళ్లలో కనిపించింది.
దీని వేగం సాధారణ గడియారాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. అయితే కాలానుగుణంగా సహజ, మానవ వాతావరణ మార్పుల కారణంగా ఇది వేగవంతం అవుతుంది. బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అనే సంస్థ ఈ గడియారాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ అణు దాడులు, జీవ రసాయన ఆయుధాలు, సైబర్ భద్రత, వాతావరణ మార్పులను పర్యవేక్షిస్తుంది. కరోనా వైరస్, ఎబోలా వ్యాప్తి, సిరియా దాడులు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత డూమ్స్‌డే సమయం నిరంతరం తగ్గుతూవస్తోంది. ప్రపంచం ముందున్న సవాళ్లను ఇకనైనా అరికట్టకపోతే ప్రళయం మరింత వేగంగా ముంచుకువస్తుందని ఈ డూమ్స్‌డే గడియారం మానవాళిని హెచ్చరిస్తోంది.
ఇది కూడా చదవండి: బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అంటే ఏమిటి? 70 వేల మందిని బురద ఎందుకు చుట్టుముట్టింది?
Comments
Please login to add a commentAdd a comment