end
-
సకలం.. సంగమం..
భాగ్యనరం వేదికగా మూడు రోజుల పాటు జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ ఆదివారంతో ముగిసింది. ఇందులో అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు, ఎన్జీవోలు తమ అభిప్రయాలను తమ తమ కళలు, రచనలు, ప్రసంగాల ద్వారా సందర్శకులతో పంచుకున్నారు. ఓ రకంగా ఇది సకలం.. సంగమం అన్నట్లు.. సందర్శకులతో సందడిగా మారింది. ఈ ప్రదర్శన ఎంతో గొప్ప అనుభూతిని పంచిందని పలువురు సందర్శకులు చెబుతున్నారు. కాగా ఇందులో ప్రముఖులతో పాటు సినీ తారలు కూడా భాగస్వామ్యం కావడం గమనార్హం. నగరం వేదికగా నిర్వహించిన సాహితీ కళల సంగమం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ముగిసింది. కేవలం కళలు, కవితలకు మాత్రమే కాదు సంగీత వేదికలు, సేవా సంస్థల కార్యక్రమాలు, ఇంకా మరెన్నో విశేషాలకు ఈ ఫెస్ట్ చిరునామాగా నిలిచింది. మూడు రోజుల పాటు సందర్శకులకు వైవిధ్యభరిత అనుభూతులు పంచిన ఈ ఈవెంట్లో తమతమ కళలు, కార్యక్రమాల ద్వారా పాల్గొన్నవారితో సాక్షి జరిపిన చిరు ముచ్చట..వారి అనుభూతులు వారి మాటల్లోనే.. ప్రముఖులకు చేరువగా.. నేను ఆర్ట్ కళాశాల విద్యార్థిని. మా పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు. అక్కడ నేను చిన్ననాటి నుంచి చూసిన చాట తదితర వస్తువులు, వ్యవసాయ పరికరాలను ఉపయోగించి కళాత్మక వస్తువును తయారు చేశాను. హెచ్ఎల్ఎఫ్లో ఈ కళను ప్రదర్శించడంలో అనేక మంది ప్రముఖుల ప్రశంసలు లభించడం సంతోషాన్ని ఇచి్చంది. – అనూఖ్య, పెద్దపల్లి కరీంనగర్రాతి.. విలువ తెలిపేలా..తెలంగాణలోని రాతి శిలలు చాలా వైవిధ్యమైనవి. 2500 యేళ్ల నాటి అరుదైన, అపురూపమైనవి. వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శిలలను పోగొట్టుకుంటే నీటి వనరులు, పక్షులతో సహా చాలా కోల్పోతాం. వీటిపై నగరవాసులకు అవగాహన లేదు. యేటా జరిగే హెచ్ఎల్ఎఫ్లో క్రమం తప్పకుండా పాల్గొంటాం. ఈ వేదిక ద్వారా యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కలి్పస్తున్నాం. – పద్మిని పటేల్, జాయింట్ సెక్రెటరీ, సేవ్ రాక్స్ సంస్థబంజారా కళకు గుర్తింపుగా.. మేం బంజారాలం. నేను ఫైన్ ఆర్ట్స్‌కి వచ్చాక బంజారా హస్తకళలు నేర్చుకున్నాను. క్రాఫ్ట్తో చిత్రం రూపొందించే ఆలోచనతో ఇది చేశాను. దీనిని గమనిస్తే బంజారా క్రాఫ్ట్, వస్త్రధారణ విలువ తెలుస్తుంది. కనెక్టింగ్ ఫ్యామిలీ.. అనే థీమ్‌తో తల్లిదండ్రులు మన కోసం చేసే త్యాగం ఎలాంటిది? దానిని మనం ఎలా గుర్తించాలి? అనే థీమ్‌తో ఈ కళారూపాన్ని తీర్చిదిద్దాను. బంజారా హస్తకళలను ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేయడం ఆనందంగా ఉంది. – నవీన్‌నాయక్, సంగాగుడి తాండా, మెదక్ జిల్లాపేదల విద్యకు అండగా..నిరుపేద విద్యార్థులకు ఖరీదైన విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పడిన ఎన్జీవో మాది. విదేశాల నుంచి తిరిగి వచి్చన మహిళ శోభ భన్సాలీ దీన్ని ప్రారంభించారు. ప్రైవేట్ స్కూల్స్‌లో ఉండే బుక్స్, ఇతర విశేషాలను ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని చిన్నచిన్న ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు పరిచయం చేయడం మా సంస్థ లక్ష్యం. దీనిలో భాగంగా.. స్టోరీ టెల్లింగ్ సెషన్, వర్క్‌షీట్స్, కలరింగ్ నిర్వహిస్తాం. మొబైల్ లైబ్రరీ ద్వారా పుస్తకాలను అందించడం, ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెంపొందించడమే లక్ష్యం. నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 53 పాఠశాలలకు చెందిన చిన్నారులు మా ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. దీని ద్వారా మరింత మందికి చేరువవ్వాలనేదే లక్ష్యం. – రాజేశ్వరి, పుస్తకారానేషన్స్ రాక్ బీట్.. శ్రియా గుప్తా అనే కార్పొరేట్ ఉద్యోగిని క్రియేటివ్ ఆర్ట్ హౌస్ ప్రారంభించారు. ఇందులో ఉండే మేమంతా వీకెండ్స్‌లో మాత్రమే ఆరి్టస్టులం. మిగిలిన రోజుల్లో కార్పొరేట్ ఉద్యోగులం. వారాంతాల్లో రెండు రోజుల పాటు కళాత్మక హృదయాల కోసం పనిచేస్తాం. ఈ నేషన్స్రాక్ బీట్స్‌లో వివిడ్, ఇండి ఎక్స్‌ప్రెస్, రాగా.. తదితర పేర్లతో 7 బ్యాండ్స్ ఉన్నాయి. మా ఈవెంట్స్‌లో మ్యూజిక్, డ్యాన్స్, స్టోరీ టెల్లింగ్, పొయెట్రీ, స్టాండప్ కామెడీ.. ఉంటాయి. హెచ్ఎల్ఎఫ్లో వచ్చే యంగ్ బ్లడ్ కోసం ఏర్పాటైందే యంగిస్తాన్ నుక్కడ్.. హెచ్ఎల్ఎఫ్ ప్రారంభం నుంచీ పెర్ఫార్మ్ చేస్తున్నాం. – రజత్, సింగర్, గిటారిస్ట్మూగజీవుల దాహం తీరుస్తాం.. మాది ఏడబ్ల్యూబీపీ (యానిమల్ వాటర్ బౌల్ ప్రాజెక్ట్) ఎన్జీవో. లక్ష్మణ్ మొల్లేటి అనే హైదరాబాద్ వాసి దీనిని స్థాపించారు. జంతువులు, మూగజీవుల దాహార్తి తీర్చేందుకు అవసరమైన వాటర్ బౌల్స్ ఉచితంగా అందిస్తాం. కుక్కలు, ఆవులు వంటి జంతువులు దాహంతో అలమటిస్తూ ఉండడం మనం గమనిస్తాం. చెన్నై, ముంబయి తదితర నగరాల్లోనూ మా కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఈ ఫెస్టివల్ ద్వారా మూగజీవుల సమస్యపై అవగాహన కలి్పస్తున్నాం. – ఏడబ్ల్యూబీపీ ప్రతినిధినా కళకు పట్టం కట్టింది.. కార్పెంటరీ కుటుంబానికి చెందిన వాడిని. ఉడ్ ఆర్టుగా సామాజిక స్థితిగతులు, జీవనశైలి, అలంకరణ, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా చెక్కాను. కళపై ఇష్టంతో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరాను. ప్రస్తుతం మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాను. గ్రామీణ ఇతివృత్తాలను, జీవనశైలిని విశ్వవ్యాప్తం చేయాలనేదే లక్ష్యం. ఈ ప్రయాణంలో నాన్నే నాకు స్ఫూర్తి. – సాయి కుమార్, లోయపల్లి, రంగారెడ్డి జిల్లాడిప్రెషన్ నుంచి పుట్టిన ప్యాషన్.. నా మెటీరియల్ శానిటరీ ప్యాడ్. ఎంబ్రాయిడరీ అనే మీడియంతో పీరియడ్స్ అనే అంశం పైనే ఈ ఆర్ట్ వర్క్ చేశాను. ఇంట్లో ఆ సమయాన్ని అంటరానిదిలా చూస్తుంటారు. అలాంటి సమయంలో మెనుస్ట్రువల్ డిప్రెషన్‌కు ఎంతగా గురవుతాం అనేది నేను వ్యక్తిగతంగా అనుభవించా. అది అందరికీ అర్థం కావాలనే ఉద్దేశ్యంతో అలాంటి బాధ మరెవరికీ రాకూడదనే హెచ్ఎల్ఎఫ్ ద్వారా ప్రచారం ప్రారంభించా. – సాహితి, జేఎన్ఎఫ్యూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి -
2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం
బాబా వంగా.. దివ్యదృష్టి కలిగిన బల్గేరియన్ కాలజ్ఞాని. ఈమెను ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’ అని కూడా పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం లాంటి ప్రధాన సంఘటనలను ఈమె ముందుగానే ఊహించారని చెబుతారు. రాబోయే సంవత్సరం అంటే 2025లో జరగబోయే ఒక ఘటన గురించి బాబా వంగా ముందుగానే చెప్పారు.2025లో ఐరోపాలో జరిగే ఒక భారీ యుద్ధం గురించి వంగా ముందుగానే హెచ్చరించారు. ఇది ప్రపంచ జనాభాకు భారీ చేటు తీసుకురానున్నదని ఆమె పేర్కొన్నారు. 5079 నాటికి మానవజాతి పూర్తిగా నాశనమవుతుంది.. అందుకు 2025లో ప్రపంచం అంతమయ్యేందుకు బీజం పడుతుందని బాబా వంగా తీవ్రంగా హెచ్చరించారు. 2043 నాటికి యూరప్ ముస్లిం పాలనలోకి వస్తుందని, 2076 నాటికి కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుందని ఆమె అంచనా వేశారు.2025 నాటికి భూమిపై గ్రహాంతర జీవులు కనిపిస్తాయని, ఈ జీవులు భూమిపై తమ ఉనికిని చాటుకుంటాయని ఆమె పేర్కొన్నారు. కాగా 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ కూడా ఇదే విధమైన అంచనాలు అందించారు. ఆయన 2025లో జరగబోయే యూరోపియన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. బాబా వంగా భవిష్యత్‌లో జరగబోయే వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కరువు, అడవులలో కార్చిచ్చు తదితర పర్యావరణ విపత్తులను ముందుగానే అంచనా వేశారు. 1911 అక్టోబర్ 3న జన్మించిన బాబా వంగా తన 84వ ఏట 1996 ఆగస్టు 11న కన్నుమూశారు. నిజమైన బాబా వంగా అంచనాలురెండవ ప్రపంచ యుద్ధం: విధ్వంసం, భారీ మరణాల అంచనాసోవియట్ యూనియన్ విచ్ఛిన్నం: యూఎస్ఎస్ఆర్ పతనాన్ని 1991కి ముందే ఊహించారు.చెర్నోబిల్ విపత్తు: 1986లోనే బాబా వంగా అంచనా వేశారు.స్టాలిన్ మరణం: బాబా వంగా ముందుగానే చెప్పారు.కుర్స్క్ జలాంతర్గామి విపత్తు: 2000కి ముందుగానే వంగా ఊహించారు. సెప్టెంబర్ 11 దాడులు: ‘ఉక్కు పక్షులు’ అమెరికాపై దాడి చేస్తాయని బాబా వంగా ముందుగానే అంచనా వేశారు. 2004 సునామీ: హిందూ మహాసముద్రంలో విధ్వంసకర సునామీ ప్రమాదం.1985 భూకంపం: ఉత్తర బల్గేరియాలో భూకంపం.9/11 దాడులతో సహా పలు ముఖ్యమైన సంఘటనలలో బాబా వంగా భవిష్య అంచనాలు 85శాతం వరకూ నిజమయ్యాయని కొందరు నిపుణులు చెబుతుంటారు.ఇది కూడా చదవండి: బ్యాటరీలు, బ్లేడ్లు సహా పొట్టలో 56 వస్తువులు -
2026కల్లా నక్సలిజం అంతం
న్యూఢిల్లీ/షహీబ్‌గంజ్ (జార్ఖండ్): దేశంలో నక్సలిజం 2026 మార్చి నాటికి పూర్తిగా అంతమైపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘2026 మార్చి 31లోగా నక్సల్స్ హింసను, భావజాలాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. అంతకంటే ముందే నక్సలిజాన్ని అంతం చేస్తాం’’ అని పేర్కొన్నారు. హింసను విడనాడి ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. నక్సల్ హింసకు గురైన 55 మంది బాధితులనుద్దేశించి బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా దళాలు భారీ విజయాలు సాధించాయి. సమస్య ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి (ఏపీ) దాకా కారిడార్ ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ఒకప్పుడు అనుకున్నారు. కానీ ఆ ప్రణాళికలను మోదీ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర హోం శాఖ త్వరలో సంక్షేమ పథకం రూపొందిస్తుంది. ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర రంగాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాయం చేస్తుంది’’ అని వెల్లడించారు. జార్ఖండ్‌లో జేఎంఎం–కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను విపరీతంగా ప్రోత్సహిస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. దీనికి అడ్డుకట్ట వేయని పక్షంలో మరో పాతికేళ్లలో చొరబాటుదారులే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా మారిపోతారని హెచ్చరించారు. స్థానిక గిరిజన సంస్కృతిని వాళ్లు సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్‌లోని గిరి«ద్లో పరివర్తన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. వీటి దెబ్బకు సంతాల్ పరగణాల్లో స్థానిక గిరిజనుల జనాభా 44 శాతం నుంచి 28 శాతానికి తగ్గిందన్నారు. -
ఉగ్రవాదం అంతానికి అమిత్‌షా ఉన్నత స్థాయి భేటీ
ఇటీవల జమ్మూలో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలు, అమర్నాథ్ యాత్రలో రక్షణ చర్యలపై సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు(ఆదివారం) ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులు జమ్మూ కశ్మీర్లో ప్రస్తుతమున్న భద్రతా పరిస్థితి, ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్న తీరును హోం మంత్రికి వివరించనున్నారు. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దీనికిముందు అమిత్ షా జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితిని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో సమీక్షించారు.జమ్మూకశ్మీర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడులపై షా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రియాసి, కథువా, దోడాలోని నాలుగు ప్రదేశాల్లో ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఒక సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికుడు వీరమరణం పొందారు. ఒక పౌరునితో పాటు ఏడుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. -
భూమి అంతానికి నాలుగు కారణాలు!
పుట్టిన ప్రతీదీ గిట్టక తప్పదని అంటారు. ఈ సృష్టిలో ఉద్భవించిన భూమి కూడా ఏదో ఒకరోజు అంతమవుతుందని చెబుతుంటారు. మరి భూమి ఎప్పుడు అంతమవుతుంది? ప్రస్తుతం భూమిపై నెలకొన్ని విపత్కర వాతావరణ పరిస్థితులు భూమి అంతానికి దారి తీస్తున్నాయా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ‘సూపర్ ఖండం’తో పెనుముప్పు గడచిన 500 మిలియన్ సంవత్సరాలలో మన గ్రహం లెక్కలేనన్నిసార్లు భారీ ప్రళయాలను చవిచూసింది. ఆయా ప్రళయకాలాల్లో భూమిపై ఉన్న జాతులలో 90 శాతం జాతులు అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఈ ప్రళయాలు ‘సూపర్ కాంటినెంట్’ ఏర్పడేందుకు దారితీస్తున్నాయి. రాబోయే 250 మిలియన్ సంవత్సరాలలో భూ ఖండాలు మళ్లీ కలిసి ‘పంగియా అల్టిమా’ అని పేరుతో ‘సూపర్ ఖండం’గా ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది భూమధ్యరేఖకు సమీపంలో ఉంటుంది. అలాగే ఇది అత్యంత వేడి ఖండంగా ఉండబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని లీడ్స్ యూనివర్శిటీ, యూఎస్‌లోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం ‘పాంగియా అల్టిమా’ పరిస్థితులు క్షీరదాల మనుగడకు ప్రతికూలంగా మారనున్నాయి. మనుగడ కోసం పోరాటంలో.. అమరత్వం అనేది కథల వరకే పరిమితం. అంతరించిపోవడం అనేది కాదనలేని సత్యం. జీవ పరిణామక్రమంలో వివిధ జాతుల మనుగడ కోసం ఒత్తిళ్లు పెరుగుతాయి. జన్యు ఉత్పరివర్తనలు సంభవించినప్పుడు పలు సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ఉత్పరివర్తనలు ఒక నిర్దిష్ట సమయంలో జీవిపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా, మనుగడ సాగించడానికి ప్రయోజనకరంగానే ఉంటాయి. ఆ జన్యువులు తరువాతి తరానికి తరలే అవకాశం ఉంది. వైవిధ్యం, అనుకూలత అనేవి జీవులు జీవించడానికి కావాల్సిన లక్షణాలు. తక్కువ వైవిధ్యం, అననకూల పరిస్థితులు ఉన్పప్పుడు మానవ జనాభా అంతరించిపోయే అవకాశం ఉంది. పరిమిత వనరుల మధ్య.. భూమిపై వనరులు పరిమితం అవుతుండటానికి తోడు అణు, రసాయన, జీవ ఆయుధాలు, అంతుచిక్కని వ్యాధులు మొదలైనవి మానవ మనుగడకు ముప్పుగా మారనున్నాయి. ఇదేవిధంగా భారీ గ్రహశకలాల దాడి కూడా భూమి అంతరించిపోయేందుకు కారణం కావచ్చు. అలాంటి సంఘటన సంభవించినా, సంభవించకున్నా ఏదో రూపంలో మానవాళికి ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. భౌగోళిక, ఖగోళ పరిశోధన ఫలితాల ప్రకారం చూస్తే, ఈ విపత్తు సమీపంలోనే ఉందనే అంచనాలున్నాయి. వేడెక్కుతున్న మహాసముద్రాలు వేడెక్కుతున్న వాతావరణం కారణంగా మహాసముద్రాలు వేడెక్కుతున్నాయి. ఇవి భూమి మనుగడకు మప్పుగా పరిణమిస్తున్నాయి. అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనలో 580 అమెరికన్, 216 సెంట్రల్ యూరోపియన్ నదుల డేటాతో వర్షపాతం, నేల రకం, సూర్యకాంతి తదితర అంశాలను పరిశీలించారు. భవిష్యత్తులో నదులలో ఆక్సిజన్ తగ్గే ఆక్సిజన్ రేటు జీవ వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించనుంది. అధ్యయనంలోని శాంపిల్స్ రాబోయే 70 సంవత్సరాలను అంచనా వేశాయి. తక్కువ ఆక్సిజన్ కారణంగా కొన్ని జాతుల చేపలు పూర్తిగా అదృశ్యమవుతాయి. దీని వల్ల జల వైవిధ్యానికి భారీ నష్టం వాటిల్లుతుంది. మానవులతో సహా అనేక జాతుల మనుగడకు ఇది పెను ముప్పుగా పరిణమించనుంది. -
నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు
సాక్షి, అమరావతి/విశాఖ స్పోర్ట్స్: రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. మట్టిలోని మాణిక్యాలను ఒడిసిపట్టే మహాయజ్ఞం విశాఖ సాగర తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. గ్రామ స్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఫైనల్ దశకు చేరుకుంది. మంగళవారం విశాఖపట్నంలోని వైఎస్సార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఇకపై ఏటా ఆడుదాం.. మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ మెగా టోర్నీని నిర్వహించింది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి. మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులున్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లను ప్రభుత్వం అందించింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 3.30 లక్షలు, మండల స్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గ స్థాయిలో 7,346, జిల్లా స్థాయిలో 1,731, రాష్ట్ర స్థాయిలో 260 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించింది. వివిధ దశల్లో విజేతలకు రూ.12.21 కోట్ల నగదు బహుమతులిస్తోంది. తొలి ఏడాది పోటీలు విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మరింత ఎక్కువ మంది గ్రామీణ క్రీడాకారులను పరిచయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇకపై ప్రతి ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహించేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. భారీగా నగదు బహుమతులు విశాఖ వేదికగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. మెన్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ మంగళవారం విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది. ముగింపు వేడుకలకు హాజరవుతున్న సీఎం జగన్ చివరి ఐదు ఓవర్లను వీక్షించనున్నారు. అనంతరం క్రీడల వారీగా విజేతలకు సీఎం జగన్ నగదు బహుమతులను అందజేస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు రూ.5 లక్షల చొప్పున, రన్నరప్‌లకు రూ.3 లక్షలు, సెకండ్ రన్నరప్‌లకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలు రూ.2 లక్షలు, రన్నరప్ రూ.లక్ష, సెకండ్ రన్నరప్ రూ.50 వేలు అందుకోనున్నారు. ప్రతిభకు ప్రోత్సాహం.. ఈ మెగా టోర్నీ ద్వారా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెన్నై సూపర్ సింగ్స్(సీఎస్కే)తో పాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా క్రికెట్లో టాలెంట్ హంట్ నిర్వహించింది. ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్ వాలీబాల్ ఫ్రాంచైజీలతో పాటు ఏపీకి చెందిన ఖోఖో, కబడ్డీ క్రీడా సంఘాలు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుల బృందాలు కూడా ఈ ఎంపికలో భాగస్వామ్యులయ్యాయి. ఎంపికైన క్రీడాకారులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దనుంది. -
ముగిసిన రాజశ్యామల యాగం
మర్కూక్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం శుక్రవారం ముగిసింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు యాగం చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శుక్రవారం నర్తనకాళి అలంకారంతో దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే రాజశ్యామల, సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాల హవనం ప్రారంభమైంది. మహాపూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులతో పాటు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు. పూర్ణాహుతిలో వినియోగించే పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో కేసీఆర్ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్ పాదపూజ చేసి పుష్పాభిషేకంతో గురువందనం సమర్పించారు. -
ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది?
మానవులు భూమిపై అనేక విపత్తులను చవిచూశారు. ప్రతి సంవత్సరం లెక్కలేనంత జనాభా.. భూకంపాలు, వరదలకు బలవుతూవస్తోంది. ఇటీవలి కరోనా విధ్వంసం లక్షలాదిమంది ప్రాణాలను బలిగొంది. అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న విధ్వంసం గురించి విన్నప్పుడు ఎవరికైనా సరే కాళ్ల కింద భూమి కంపించినట్లవుతుంది. నాటి ఆ విపత్తు తీవ్రతకు ఈ భూమండలంపై కేవలం 1,280 మంది మాత్రమే మిగిలారు. ఈ పెను విపత్తు ఎప్పుడు సంభవించింది? మనం చెప్పుకోబోతున్న ఈ సంఘటన తొమ్మిది లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. అంతటి విపత్తులో తమను తాము రక్షించుకోగలిగిన 1,280 మంది మాత్రమే మిగిలారు. వారి కారణంగానే ఈ రోజు ఈ భూమిపై ఎనిమిది బిలియన్ల మంది ప్రజలు జీవించి ఉన్నారని చెబుతారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం జర్మన్ న్యూస్ వెబ్సైట్ డీడబ్ల్యు తెలిపిన వివరాల ప్రకారం మనిషి పూర్వీకులు ఒకప్పుడు విపత్తులకు చాలా దగ్గరగా ఉండేవారు. ఈ విషయాన్ని జన్యు విశ్లేషణ ఆధారంగా జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. మానవ జనాభా దాదాపు అంతరించిపోయిన కాలం ఒకప్పుడు ఏర్పడిందని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిశోధన రెండు లక్షల సంవత్సరాల క్రితం దొరికిన ఆదిమ మానవుల అవశేషాలపై జరిగింది. ఈ పరిశోధన ఎవరు సాగించారంటే.. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన షాంఘై ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఈ పరిశోధన చేసింది. తొమ్మిది లక్షల ముప్పై వేల సంవత్సరాల క్రితం భూమిపై తలెత్తిన ఆ విపత్తు అనంతరం భూమిపై కేవలం 1280 మంది మాత్రమే మిగిలారని పరిశోధకులు కంప్యూటర్ మోడలింగ్ ద్వారా కనుగొన్నారు. నాటి భీకర విపత్తులో 98.7 శాతం మానవ జనాభా నాశనమైందని ఈ పరిశోధన నిర్వహించిన ప్రధాన పరిశోధకుడు హైపెంగ్ లీ వివరించారు. ఇంతకీ నాడు భూమిపై ఏమి జరిగింది? ఈ పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం మంచు యుగంలో భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గడం వల్ల ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది. ఈ మంచు యుగంలో మానవులు దాదాపు అంతరించిపోయారు. అయితే అంతటి దుర్భర పరిస్థితిలోనూ తమను తాము రక్షించుకోవడంలో కొందరు మానవులు విజయం సాధించారు. ఈ మానవులే తదుపరి మానవ నాగరికత అభివృద్ధికి కారణమయ్యారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: తల తీయడం మొదలు తుపాకీతో కాల్చడం వరకూ.. ఏ దేశంలో ఎటువంటి మరణశిక్ష? -
వినాయకుని కోసం మంగళహారతి పాట
శీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం! నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణి వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ‘‘జయ‘‘ సురుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ‘‘ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ‘‘ జయ‘‘ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ‘‘ జయ ‘‘ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి " జయ ‘‘ పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ‘‘ జయ ‘‘ కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మిదానపువ్వు గరిక మాచిపత్రి మంచి మొలక ‘‘ జయ ‘‘ అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ‘‘ జయ ‘‘ పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ‘‘ జయ ‘‘ బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు " జయ ‘‘ పట్టుచీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ‘‘ జయ ‘‘ -
‘డూమ్స్‌డే క్లాక్’ అంటే ఏమిటి? 1947లోనే యుగాంతానికి దూరమెంతో తెలిసిపోయిందా?
కొంతమందికే తెలుసు.. ప్రపంచంలో అలాంటి స్మార్ట్ వాచ్ ఉందని.. అది 1947 నుండి మనకు ప్రమాదాలను సూచిస్తోందని... ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత కొన్నేళ్లుగా ఈ వాచ్ తన స్పీడ్‌ని పెంచింది. అంటే మనం ఇప్పుడు గతంలో కంటే వేగంగా ప్రళయకాలానికి దగ్గరవుతున్నామని దాని అర్థం. ఇప్పుడు మనం ‘డూమ్స్‌డే క్లాక్’ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది సింబాలిక్ క్లాక్.. మహమ్మారి, అణు దాడులు, వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచ విధ్వంస అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుంది. ప్రళయానికి ముందు మనుషులను కాపాడేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ గడియారం అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇది ప్రళయకాలాన్ని తెలియజేస్తోంది. 1945లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం, కొంతమంది అణు శాస్త్రవేత్తలు కలిసి డూమ్స్‌డే వాచ్‌ను రూపొందించారు. ప్రపంచ మనుగడకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో చెప్పడానికే డూమ్స్‌డే క్లాక్ రూపొందించారు. ఈ గడియారాన్ని 13 మంది నోబెల్ బహుమతి విజేతలతో కూడిన శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ గడియారంలో టైం మారుతుంటుంది. ఆ ఏడాదిలో జరిగిన సహజ మార్పులు, మానవాళికి జరిగిన నష్టం ఆధారంగా ఈవాచ్‌లో టైమ్ మారుతుంటుంది. దీనిని తొలిసారిగా 1947లో సృష్టించినప్పుడు మానవాళికి ఉన్న ఏకైక ముప్పు అణు దాడి. దీనిని రూపొందించినప్పుడు ఈ గడియారపు సమయాన్ని 10 సెకన్లు తగ్గించారు. దీని ప్రభావం మూడేళ్లలో కనిపించింది. దీని వేగం సాధారణ గడియారాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. అయితే కాలానుగుణంగా సహజ, మానవ వాతావరణ మార్పుల కారణంగా ఇది వేగవంతం అవుతుంది. బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అనే సంస్థ ఈ గడియారాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ అణు దాడులు, జీవ రసాయన ఆయుధాలు, సైబర్ భద్రత, వాతావరణ మార్పులను పర్యవేక్షిస్తుంది. కరోనా వైరస్, ఎబోలా వ్యాప్తి, సిరియా దాడులు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత డూమ్స్‌డే సమయం నిరంతరం తగ్గుతూవస్తోంది. ప్రపంచం ముందున్న సవాళ్లను ఇకనైనా అరికట్టకపోతే ప్రళయం మరింత వేగంగా ముంచుకువస్తుందని ఈ డూమ్స్‌డే గడియారం మానవాళిని హెచ్చరిస్తోంది. ఇది కూడా చదవండి: బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అంటే ఏమిటి? 70 వేల మందిని బురద ఎందుకు చుట్టుముట్టింది? -
ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ.. ఇక ఆ విధానానికి చెక్!
కరోనా మహమ్మారి భారతదేశంలో విస్తృతంగా వ్యాపించిన తరువాత లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విద్యార్థులతో పాటు ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో జూమ్ (Zoom) యాప్ ఎంతగానో ఉపయోగపడింది. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి చాలా కంపెనీకి స్వస్తి పలికాయి. కాగా ఇప్పుడు జూమ్ కంపెనీ వంతు వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, జూమ్ కంపెనీ తన ఉద్యోగులను తిరిగి ఆఫీసుకి రావాలని కోరింది. ఆఫీసుకి 50 కిమీ దూరంలో ఉన్నవారు రిపోర్ట్ చేయాలనీ, ఇంకా దూరం ఉన్నట్లయితే వారానికి కనీసం రెండు రోజులు రావాలని విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా పోస్ట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: సంతకం చేయలేకపోయిన ఉద్యోగి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు! కొంతమంది జూమ్ వీడియో ప్లాట్‌ఫాంకు ఆఫీస్ ఉందా అంటూ.. మరి కొందరు ఆఫీస్ ఉన్నా వారు అక్కడికెళ్లి ఏం చేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు RIP వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ కామెంట్ చేశారు. కంపెనీ అధికారిక వెబ్సైట్ ప్రకారం, జూమ్ యునైటెడ్ స్టేట్స్లో డెన్వర్ అండ్ కాలిఫోర్నియాలో రెండు కార్యాలయాలను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! Zoom tells employees to return to office for work pic.twitter.com/v6X5Bo88vr — Daily Loud (@DailyLoud) August 6, 2023 -
ఆగస్టులో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకలు
సాక్షి, అమరావతి : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో భాగంగా ఆగస్టు 9–15 తేదీల మధ్య ‘మేరీ మిట్టి మేరా దేశ్’ నినాదంతో దేశవ్యాప్తంగా 2.50 లక్షల గ్రామ పంచాయతీలు, 7,500 బ్లాకులు, 90 వేల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. అదే నెల 29, 30 తేదీల్లో ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ముగింపు వేడుకల గ్రాండ్ ఫినాలే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. వీటి నిర్వహణ, ఏర్పాట్లపై శనివారం ఆయన రాష్ట్రాల సీఎస్‌లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఏపీ తరఫున జవహర్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కీలక అంశాలపై కార్యక్రమాలు.. ఆయా గ్రామాలు, పట్టణాల నుంచి దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధులు, రక్షణ దళాల విశ్రాంత సిబ్బంది, కేంద్ర ఆర్మ్డ్ రిజర్వు పోలీసు, రాష్ట్ర పోలీసు దళాలకు చెందిన వారికి సంఘీభావాన్ని తెలియజేయాలి. వివిధ తాగునీటి వనరుల వద్ద శిలాఫలకాలను ఏర్పాటుచేయాలి. జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలాపన చేయాలి. ప్రతి పంచాయతీలో వసుధ వందన్ కింద కనీసం 75 మొక్కలను నాటాలి. అలాగే, వీరన్ కా వందన్ కింద స్వాతంత్య్ర సమరయోధులు, అమర వీర సైనిక కుటుంబాలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలి. -
యుగాంతం వస్తే .. భూమ్మీద నిలిచే సజీవ సాక్ష్యాలివే
-
ముగింపు దశకు కరోనా! అయినా నిర్లక్ష్యం వద్దు.. బూస్టర్ డోసు తీసుకోవాల్సిందే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ఈసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ ముగింపు దశకు చేరుకుందని, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని చెప్పారు. అయితే వైరస్‌ను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెంది(మ్యుటేషన్లు) బలహీన పడుతోందని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. ఇప్పుడు వైరస్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఇంకా కొన్ని మ్యూటేషన్ల అనంతరం కరోనా పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌పై ఈ ఏడాది జనవరిలో తొలిసారి వెలుగుచూసిన ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ కూడా అంత ప్రమాదకరం కాదని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. గత మూడు నెలల్లో దేశంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదుకాకపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. 'XBB.1.16 అనేది రీకాంబినెంట్ వైరస్. ఇది మానవ శరీరంలో అనుకోకుండా తయారవుతుంది. రెండు వేర్వేరు వేరియంట్లు మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, పునరుత్పత్తి సమయంలో జన్యు పదార్ధం మిక్స్అప్ అయినప్పుడు అవి తయారవుతాయి.' అని ఆయన వివరించారు. బూస్టర్ డోసులు, మాస్కులు దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున ఇంకా బూస్టర్ డోసు టీకా తీసుకోని వారు, ఆలస్యం చేసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని డాక్టర్ సూచించారు. అలాగే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు. పిల్లలు అనారోగ్యానికి గురైతే వాళ్లను స్కూళ్లకు అసలు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఒకవేళ వారికి సోకింది కరోనా అయితే అది ఇతర విద్యార్థులకు, టీచర్లకు, సిబ్బంది సోకి మరింత మందికి వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. చదవండి: మాక్‌డ్రిల్‌తో అప్రమత్తమైన భారత్.. కొత్తగా 5,676 కేసులు, 15 మరణాలు -
బిగ్ క్వశ్చన్ : షెడ్డుకు సైకిల్..
-
ఐకానిక్ బేబీ పౌడర్‌కు గుడ్‌బై!
సాక్షి, ముంబై: జాన్సన్ & జాన్సన్ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. పలు వివాదాల నేపథ్యంలో ఇకపై జాన్సన్ బేబీ పౌడర్ విక్రయాలకు స్వస్తి పలకే ఆలోచనలో ఉంది. వివిధ దేశాల్లో చట్టపరమైన సవాళ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ బేబీ పౌడర్ ఉత్పత్తులను నిలిపివేయాలని యోచిస్తోంది. (ఫెస్టివ్ సీజన్: పలు కంపెనీల కార్లపై డిస్కౌంట్ బొనాంజా) కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ 2023 నాటికి టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ ప్రపంచవ్యాప్తంగా విక్రయాలను నిలిపివేయనున్నట్టు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించింది. ఈమేరకు హెల్త్‌కేర్ దిగ్గజం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో ఉత్పత్తి విక్రయాలను ముగించిన రెండు సంవత్సరాల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్త పోర్ట్‌ఫోలియో మదింపులో భాగంగా, కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ పోర్ట్‌ఫోలియోకు మారాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో విక్రయిస్తున్నామని పేర్కొంది. అమెరికా, కెనడాలలో బేబీ పౌడర్ అమ్మకాలను 2020లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. జాన్సన్ టాల్కం పౌడర్‌పై వినియోగదారులకు తప్పుడు సమాచారం అందించిందనీ, ప్రమాదకరమైన, కలుషిత పదార్థాలు ఉన్నాయని పలుపరిశోధనల్లో తేటతెల్లమైంది. దీంతో యూరప్‌లో డిమాండ్ పూర్తిగా పడిపోయింది. 1894 నుండి జాన్సన్ బేబీ పౌడర్ ఐకానిక్ సింబల్‌గా మారింది. అయితే ఆ తరువాతికాలంలో జాన్సన్ పౌడర్ వల్లనే కేన్సర్‌కు గురైమయ్యామని, బాధితులు, చనిపోయిన వారి బంధువులు కోర్టుకెక్కారు. అలాగే టాల్క్ ఉత్పత్తులలో ఆస్బెస్టాస్ కేన్సర్ కారకం ఉందని దశాబ్దాలుగా కంపెనీకి తెలుసని 2018 రాయిటర్స్ పరిశోధన వాదించింది. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన జాన్సన్ అండ్ జాన్సన్ తమ ఉత్పత్తులు సురక్షితమైనవనీ, అస్బెస్టాస్-రహితమైనవని ఇప్పటికీ వాదిస్తోంది. పలు వినియోగ దారులు, ప్రాణాలతో బయటపడినవారు, బంధువులకు చెందిన సుమారు 38వేల వ్యాజ్యాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇప్పటికే పలుకోర్టులు కస్టమర్లకు సానుకూలంగా తీర్పునిచ్చాయి. 22 మంది మహిళలకు 2 బిలియన్ల డాలర్లకుపైగానే పరిహారం అందించింది కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ అమ్మకాలను నిలిపి వేయాలని కోరుతూ చాలా మంది కోర్టులో దావా వేశారు. ఈ క్రమంలో టాల్కం పౌడర్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేయాలనే చూస్తోంది. -
Amnesia Pub Incident: ఐదుగురు మైనర్లకు ముగిసిన పోలీస్ కస్టడీ
-
కరోనా అంతమయ్యేది అప్పుడే: బిల్ గేట్స్
Bill Gates Predicted Covid Pandemic: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పీడ నుంచి ఎప్పుడు ఉపశమనం లభిస్తుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితులు, కోవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వాక్సిన్ల వాడకం దృష్ట్యా మహమ్మారి తీవ్రమైన దశ 2022లో ముగుస్తుందని ఈ విషయాన్ని తన బ్లాగులో చెప్పారు. కరోనా కొత్త వేరియంట్లతో వ్యాప్తి చెందడం, ప్రజలకు పూర్తిగా టీకాలు వేయడం అంత త్వరగా జరిగే పని కాదు గనుక మహమ్మారి ముగింపు తాను ఆశించినంత దగ్గరగా లేదని బిలియనీర్ చెప్పాడు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ఆందోళన తప్పదని అందులో ఎటువంటి సందేహం లేదని ఆయన అన్నారు. కొత్త వేరియంట్లను ప్రభావాన్ని వేగంగా గుర్తించడం, వ్యాక్సిన్లు, యాంటీవైరల్ డ్రగ్స్‌లో అభివృద్ధితో కలిపి, 2022లో కోవిడ్ తీవ్రత నుంచి బయటపడే అవకాశాలు ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రతి సీజన్లో కోవిడ్, ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రమాదకరమైన వేరియంట్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని, మహమ్మారి అంతమయ్యేవరకు పోరాటం ఆపకూడదని సూచించారు. చదవండి: ఆ గ్రామంలో వింత సంప్రదాయం.. మా ఊరికి రావొద్దు.. -
‘నేను భారత్‌లో అడుగుపెడితేనే కరోనా అంతం’
దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ సమీపంలో ఓ ద్వీపంలో నివసిస్తున్న నిత్యానంద స్వామి భారతదేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభించడంపై ఆయన స్పందిస్తూ భారత భూభాగంలో తాను అడుగుపెడితే ఆ వైరస్ ఇక అంతమవుతుందని ప్రకటించారు. ఈ విషయాన్ని తన శిష్యులతో మాట్లాడినట్లు తెలిసింది. కరోనా పోవాలంటే తాను భారత్‌లో అడుగుపెట్టాలని శిష్యులకు చెప్పాడు. ‘కైలాస’ అని తనకు తాను ఓ దేశాన్ని రూపొందించుకుని అక్కడే ఉంటున్న నిత్యానంద తరచూ భారతదేశానికి సంబంధించిన అంశాలపై స్పందిస్తున్నాడు. తాజాగా భారత్‌లో కరోనా విజృంభణపై స్పందించాడు. భారత్‌ను కరోనా ఎప్పుడు విడిచిపోతుందని ఓ శిష్యుడు అడిగిన ప్రశ్నకు ‘నేను భారత భూభాగంపై ఎప్పుడు అడుగు పెడతానో అప్పుడే కరోనా అంతం అవుతుంది’ అని నిత్యానంద తెలిపారు. నిత్యానంద స్వామి లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కున్నాడు. అనంతరం 2019లో గుట్టుచప్పుడు కాకుండా భారత్‌ను విడిచి పారిపోయాడు. అనంతరం ఈక్వెడార్ సమీపంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసుకుని దానికి ‘కైలాస’ అని పేరు పెట్టుకున్నాడు. రాజకీయాలు లేకుండా హిందూ దేశంగా రూపొందించినట్లు నిత్యానంద తెలిపారు. ఆ దేశానికి ప్రత్యేక జెండా, పాస్‌పోర్టు, జాతీయ చిహ్నం రూపొందించుకున్నాడు. రిజర్వ్ బ్యాంక్ కూడా ఏర్పాటుచేసుకున్నాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కొన్ని దేశాల రాకపోకలపై నిషేధం విధించాడు. తన దేశాన్ని గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి లేఖ కూడా రాశాడు. -
మార్చిలో మరో యుగాంతం!
వాషింగ్టన్: భూమి అంతం.. పెను ప్రళయం.. యుగాంతం.. అంటూ ప్రతిఏటా ఎవరో ఒకరు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట చెబుతూనే ఉంటారు. 2020లో కరోనా వచ్చినప్పుడైతే ఈ ఊహాగానాలకు అంతులేకుండా పోయింది. అయితే అనూహ్యంగా కరోనాను మానవాళి జయించడంతో ఈ అంచనాలన్నీ తప్పిపోయాయి. దీంతో తాజాగా వచ్చే నెల్లో భూగోళానికి పెను ముప్పు పొంచి ఉందని అమెరికాలో అబద్ధపు ప్రచారం మొదలైంది. మార్చిలో ఇప్పటివరకు చూడనంత పెద్ద ఆస్టరాయిడ్(గ్రహశకలం) భూమికి సమీపంలోకి రానున్న తరుణంలో కొన్ని ఫేక్ సైట్లు ఈ శకలం భూమిని ఢీకొట్టబోతోందంటూ ప్రాపగాండా చేస్తున్నాయి. అయితే సైంటిస్టులు అలాంటిదేమీ లేదని భరోసా ఇస్తున్నారు. మార్చి 21న భారీ ఆస్టరాయిడ్(పేరు:2001 ఎఫ్ఓ32) భూమికి సమీపంలోకి రానున్నమాట వాస్తవమేనని, కానీ భూమిని ఢీకొట్టడమనేది అబద్ధమని చెబుతున్నారు. ఈ ఆస్టరాయిడ్ పలు ఎన్ఈఓ(నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్)ల్లో ఒకటని, ఇవన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని వివరించారు. ఇలాంటివి అనేకం.. భూ కక్ష్యకు 3 కోట్ల మైళ్ల లోపు దగ్గరకు వచ్చే శకలాలను ఎన్‌ఈఓలు అంటారు. ఇప్పటివరకు దాదాపు 25వేల ఎన్‌ఈఓలను గుర్తించారు. వీటిలో అధిక శాతం ఆస్టరాయిడ్స్ కాగా కొన్ని మాత్రం తోకచుక్కలు. ఈ 25వేల ఎన్‌ఈఓల్లో 2100 ఎన్‌ఈఓలను పొటన్షియల్లీ హజార్డియస్(ప్రమాదం కలిగించే శక్తి కలవి)గా వర్గీకరించారు. భూకక్ష్యకు 46 లక్షల మైళ్ల దూరంలోకి వచ్చేవి, వ్యాసార్ధంలో 460 అడుగుల కన్నా పెద్దవైన శకలాలను ఈ కేటగిరీలో చేరుస్తారు. అంతమాత్రాన ఇవన్నీ భూమిని తాకుతాయని కాదని, కానీ వీటిని పరిశీలిస్తూ ఉంటామని సెంటర్ ఫర్ ఎన్ఈఓ డైరెక్టర్ పాల్ చోడస్ చెప్పారు. ప్రస్తుతం వస్తున్న ఆస్టరాయిడ్ వ్యాసార్ధం దాదాపు 2,526–5,577 అడుగులుంటుందని చెప్పారు. మార్చి 21 ఉదయం 11గంటలకు ఈ శకలం భూమికి 13 లక్షల మైళ్ల దగ్గరకు వస్తుంది. ఈ సమయంలో ఆస్టరాయిడ్ గంటకు 76,980 మైళ్ల వేగంతో పయనిస్తుంటుంది. భూమికి దగ్గరగా వచ్చిన అనంతరం తిరిగి ఈ గ్రహశకలం తన దోవలో తను పోతుందని, భూమిని ఢీకొట్టే అవకాశం లేదని పాల్ తెలిపారు. కాబట్టి.. యుగాంతం జాతకాలు చెప్పేవాళ్లు ఇంకో కొత్త సంగతి చూసుకోవాల్సిందే! -
2020 యుగాంతం: అంతా ఉత్తుత్తిదే
న్యూఢిల్లీ: డూమ్స్‌డే ప్రవచనాలు, మయాన్ క్యాలెండర్ ప్రకారం జూన్ 21, 2020 నాటికి ప్రపంచం అంతమైపోతుందని కొంతమంది సిద్దాంతకర్తలు పేర్కొడనంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అదేరోజు అమావాస్య, సూర్యగ్రహణం కూడా రావడంతో ఇది నిజమే అయ్యింటుందని భావించి ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. నిన్న(ఆదివారం) 2020 జూన్ 21 ముగియడంతో అదంతా ఉత్తుత్తిదే అని తెలీంది. అయితే ఈ ఏడాది 2020లో విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు సోకి.. లక్షల్లో మరణించడంతో మయాన్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ప్రపంచం అంతమైపోతుందని సిద్దాంతకర్తలు అంచనా వేశారు. ఇంతకుముందు కూడా మయాన్ క్యాలెండర్ ప్రకారం 2012లో ప్రపంచం ముగియనుందంటూ పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జూన్ 21 ముగియడంతో 2012 మాదిరిగానే మాయాన్ క్యాలెండర్ అంతా అబద్ధమేనని మరోసారి రుజువైంది. (2012 కాదు, 2020లో యుగాంతం!) ఈ మాయాన్ క్యాలెండర్ అనేది 1582 సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది. అయితే దీనికి ముందు తేదీలను కనుగొనడానికి వివిధ క్యాలెండర్లను ఉపయోగించాల్సి వచ్చిందని సిద్దాంతకర్తలు తెలిపారు. అయితే ఆ సమయంలో ప్రజలు ఎక్కువగా మయాన్, జూలియన్ క్యాలెండర్లను అనుసంరించేవారని సమాచారం. ప్రస్తుతం ప్రపంచ దేశ ప్రజలు ఎక్కువగా గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తున్నారు. ఈ వింతైన సిద్ధాంతం ప్రకారం జూలియన్ క్యాలెండర్ మరో క్యాలెండర్‌కు మార్చబడుతున్న సమయంలో ఈ క్యాలెండర్ నుంచి సంవత్సరంలోని 11 రోజులు పోయాయాని నిపుణులు పేర్కొన్నారు. ఈ తర్వాత రోజులు ఆ రోజులు జతచేయబడ్డాయి. కానీ దీని ప్రకారం ప్రస్తుతం మనం 2020లో కాకుండా 2012లో ఉన్నామని నిపుణులు చెబుతున్నారు. (తూచ్.. యుగాంతం ఉత్తదే!) దీని గురించి పాలో తగలోగుయిన్ అనే శాస్త్రవేత్త ఈ సిద్దాంతాన్ని సోషల్ మీడియాలో వివరిస్తూ... ‘జూలియన్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం మనం సాంకేతికంగా 2012లో ఉన్నాము. గ్రెగోరియన్ క్యాలెండర్‌లోకి మారడం వల్ల సంవత్సరంలో కోల్పోయిన 11 రోజులను కొల్పోయాం. గ్రెగోరియన్ క్యాలెండర్ బట్టి (1752-2020) సార్లు 11 రోజులు = 2,948 రోజులు ఉపయోగించి 268 సంవత్సరాలు. 2,948 రోజులు / 365 రోజులు (సంవత్సరానికి) = 8 సంవత్సరాలు’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం మనం జూన్ 21, 2020 అనేది కి డిసెంబర్ 21, 2012 అవుతుంది. దీంతో కొంతమంది సిద్ధాంతకర్తలు 2012 డిసెంబర్ 21ని ప్రపంచ అంతంగా ప్రతిపాదించారు. . -
2020లో యుగాంతం, తెరపైకి కొత్త వాదన!
2020 ఈ ఏడాదిలో అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ సంవత్సరం గురించి ఎవరిని అడిగిన ఇలాంటి భయంకరమైన ఏడాదిని ఎప్పుడు చూడలేదనే చెబుతారు. ఈ ఏడాదిలోనే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రకృతి విపత్తులు, కరోనా వైరస్ దాడి, భూకంపాలు సంభవించి మానవ జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. అందుకే చాలా మంది 2020లోనే యుగాంతం కాబోతుందా? భూమి అంతరించిపోతుందా అని ఇంటర్నెట్లో తెగ వెతుకుతున్నారు. ఈ ఏడాదే యుగాంతం, త్వరలో భూమి అంతరించపోబోతుంది, అందరూ చనిపోతారు అంటూ ఎన్నో వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే 2012 డిసెంబర్ 21న మయాన్ క్యాలెండర్ ప్రకారం భూమి అంతమవుతుందనే వాదన అప్పట్లో గట్టిగా వినిపించింది. దాని మీద ‘2012’ అనే పేరుతో హాలివుడ్లో భారీ బడ్జెట్ సినిమాను కూడా తీశారు. అయితే 2012 వెళ్లిపోయి కూడా నేటికి 8 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం మనం 2020లో ఉన్నాం. అయితే మనం గ్రెగోరియన్ క్యాలండర్‌ను అనుసరిస్తున్నామని, మయాన్ క్యాలండర్ తప్పని శాస్త్రవేత్త, పండితుడు పాలో తగలోగుయిన్ ఒక ట్వీట్ చేశారు. దానిలో ‘జూలియన్ క్యాలెండర్ తరువాత, మనం సాంకేతికంగా 2012లో ఉన్నాం. గ్రెగోరియన్ క్యాలెండర్‌లోకి మారడం వల్ల సంవత్సరంలో కోల్పోయిన రోజులు 11... 268కి గ్రెగెరియన్ క్యాలెండర్ (1752-2020) సార్లు 11 రోజులు = 2,948 రోజులు. 2,948 రోజులు / 365 రోజులు (సంవత్సరానికి) = 8 సంవత్సరాలు’ అని పేర్కొన్నాడు. చదవండి: (తూచ్.. యుగాంతం ఉత్తదే!) దీనిని బట్టి చూస్తే జూలియన్ క్యాలెండర్ ప్రకారం టెక్నికల్ గా మనం 2012లోనే ఉన్నాం. జూలియన్ క్యాలెండర్ నుంచి మనం గ్రెగోరియన్ క్యాలెండర్‌లోకి రావడం వల్ల ఏడాదికి 11 రోజులు తగ్గుతుంది. 1752 నుంచి 2020 వరకు అంటే 268 సంవత్సరాలు. సంవత్సరానికి 11 రోజులు చొప్పున తగ్గాయి కాబట్టి 268ని 11తో గుణిస్తే 2948 రోజులు వస్తాయి. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి, ఆ 2948ని 365తో భాగిస్తే 8 సంవత్సరాలు అవుతుంది. ఆ లెక్కన 2020లో 8 సంవత్సరాలు తీసేస్తే 2012లోనే ఉన్నట్టు లెక్క అని పాలో తగలోగుయిన్ వాదిస్తున్నారు. మయాన్ క్యాలెండర్లో 2012 గ్రెగోరియన్ క్యాలండర్లో 8 సంవత్సరాల తరువాత ఉంది. దీని ప్రకారం 2020 జూన్ 21న ఈ భూమి అంతం కానుందని పాలో తగలోగుయిన్ తెలిపారు. అయితే ఈ పోస్ట్‌ను వెంటనే ట్విటర్ తొలగించింది. అయినప్పటికి దీనిపై కొంత మంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీని ఆధారంగా సోషల్‌మీడియా వేదికగా రకరకాల చర్చలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఆధారం లేని వాదనలని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కొట్టిపడేసింది. -
తుదిదశకు ‘హాజీపూర్’ విచారణ
బొమ్మలరామారం: హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం విదితమే. ఈ కేసుపై కొన్ని రోజులుగా నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది. కాగా, గురువారం నిందితుడిని విచారించారు. వందమందికి పైగా సాక్షులు, అధికారులను విచారించిన కోర్టు, మరో రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెలాఖరుకు తీర్పు వెలువడే అవకాశం ఉంది. -
చట్టం వేరు.. ప్రభుత్వ విధాన నిర్ణయాలు వేరు
సాక్షి, హైదరాబాద్: నిజమైన ప్రజాస్వామ్యం అంటే న్యాయపరమైన సంయమనం, రాజకీయ స్వేచ్ఛ, చట్టబద్ధపాలన ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. ఈ విధంగా జరిగినప్పుడే ప్రజాతంత్ర వ్యవస్థ నిజమైన మనుగడ సాధ్యం అవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ అధికారుల శిక్షణ ముగింపు సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ‘ఆధునిక ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ పాలన’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. వ్యక్తి పాలనకు, చట్టబద్ధ పాలనకు తేడా ఉంటుందని, చట్టపాలనకు కచ్చితంగా ప్రభుత్వ విధానాలతో పెనవేసుకుని ఉండనవసరం లేదని, ఈ తేడాను విధి నిర్వహణలో గుర్తించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుందన్నారు. చట్టబద్ధ పాలనకు న్యాయసమీక్ష మూలాధారం అవుతుందన్నారు. విధి నిర్వహణలో నిజాయితీగా, చట్టబద్ధంగా వ్యవహరించాలని, ఇలాంటి సమయంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని, వాటన్నింటినీ అధిగమించినప్పుడే సమర్ధత బయటపడుతుందని యువ ఐపీఎస్ అధికారులకు సూచించారు. మాతృభూమికి సేవలు అందించేందుకు కదనరంగంలోకి దిగే సమయంలో ఎదురయ్యే సవాళ్లను చట్టబద్ధంగానే అధిరోహించాలన్నారు. మీకున్న అధికారాలను నీతి, నిజాయితీతో సహేతుకంగా వినియోగించుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. దేశంకోసం సరిహద్దుల్లోనూ, ఇతర చోట్ల ప్రాణాలను ఫణంగా పెట్టిన సైనికుల సేవలకూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే పోలీసులకు పెద్దగా తేడా లేదని, రెండు త్యాగాలూ వెలకట్టలేనివే అని జస్టిస్ రంజన్ గొగోయ్ కొనియాడారు. పోలీస్ అకాడమీ 1983లో ఏర్పాటైందని, ఆ తర్వాత ఏడాది ఆనాటి జమ్మూకాశ్మీర్ గవర్నర్ బీకే నెహ్రూ నుంచి ఎంతో మంది ప్రముఖులు ఇదే వేదిక నుంచి ప్రసంగించారని అకాడమీ డైరెక్ట్టర్ డాక్టర్ అభయ్ చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 2018 బ్యాచ్‌కు చెందిన తొలి దశ శిక్షణలో ఉన్న 156 మంది ఐపీఎస్‌లు హాజరయ్యారు. -
కాసేపట్లో ముగియనున్న తుది దయ పోలింగ్
-
ముగిసిన తెలంగాణ రెండో విడత పరిషత్ ఎన్నికలు
-
ముగిసిన ఉద్యోగ సంఘాల బేటీ
-
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
కెరమెరి : ఈ నెల 15 నుంచి ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి. మండలంలోని కెరమెరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడి ఆశ్రమ ఉ న్నత పాఠశాలల్లో మొత్తం 302 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రారంభం నుంచి చివరి వరకు ఎలాంటి అటుపోట్లకు తావు లేకుండా నిర్వహించారు. రెబ్బెన : మండలంలో గత 15వ తేదీన ప్రారంభం అయిన పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు గంగాపూర్ జెడ్పీ హైస్కూల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మండలంలో 418 మంది విద్యార్థులు పరీక్షలకు హాజర య్యారు. తిర్యాణి: పదో తరగతి పరీక్షలు బుధవారంతో ముగిశాయి. పరీక్ష కేంద్రంలో 234 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. బుధవారం పరీక్ష కేంద్రాన్ని స్క్వాడ్ జబ్బార్ ఖాన్ తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు ముగియడంలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఇళ్లకు తరలివెళ్లారు. దీంతో విద్యార్థులు హుషారుగా తమ ఇళ్లకు పయనమయ్యారు. -
షట్డౌన్కు తెర:మార్కెట్ల జోష్
రిపబ్లికన్, డెమోక్రాట్ల మధ్య సయోధ్య నేపథ్యంలో అమెరికాలో షట్‌డౌన్ వివాదానికి తెరపడింది. అమెరికా ప్రతినిధుల సభ ఫిబ్రవరి 8 న ఫెడరల్ ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తూ సెనేటర్లు తమ ఆమోదంతెలిపారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నామని ప్రకటించడంతో మూడురోజుల ప్రభుత్వ షట్డౌన్కు ముగింపు పడింది. దీంతో అమెరికా ప్రభుత్వ సేవలు ప్రారంభమవుతాయని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. యూఎస్ సెనేటర్లు ఫెడరల్ ప్రభుత్వ , మూడు రోజుల షట్డౌన్కు స్వస్తి పలుకుతూ 266-150 ఓట్లతో డీల్‌కు ఒకే చెప్పారు. ఫిబ్రవరి 8వరకూ అవాంతరాలు లేకుండా ప్రభుత్వం నడిచేందుకు వీలుగా ఫండింగ్ లెజిస్లేషన్‌కు మద్దతును ప్రకటిచారు. ముఖ్యంగా చిల్డ్రన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ (చిప్) ను ఆరు సంవత్సరాల పొడిగింపు సహా ఇతరాలతో స్టాప్ గ్యాప్ బిల్లును ఆమోదించింది. కానీ డెమొక్రాట్ల "డ్రీమర్" వలసదారులకు రక్షణకు సంబంధించిన బిల్లు పెండింగ్‌లో ఉంది. దీంతో అమెరికా మార్కెట్లలో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సోమవారం డోజోన్స్ 66 పాయింట్లు(0.25 శాతం) పురోగమించి 26,137 వద్ద ముగియగా.. ఎస్అండ్పీ 13 పాయింట్లు(0.5 శాతం) బలపడి 2,824 వద్ద స్థిరపడింది. నాస్డాక్ సైతం 49 పాయింట్లు(0.7 శాతం) పురోగమించి 7,385 వద్ద ముగిసింది. మరోవైపు దేశీయస్టాక్‌మార్కెట్లు కూడా లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలతో 36వేల కీలక స్థాయిని అధిగమించగా, నిఫ్టీ కూడా చరిత్రలో తొలిసారి 11వేల మార్క్‌ను దాటి రికార్డ్ హైని నమోదు చేసింది. అటు జపాన్ మార్కెట్ నిక్కీ కూడా మంగళవారం గరిష్ట స్థాయిలోనే ముగిసింది. -
జింబాబ్యేలో ముగాబే పాలనకు తెర..?
-
ముగిసిన సుబ్బరాజు సిట్ విచారణ
-
మణిపూర్‌లో ముగిసిన ప్రచారం
మణిపూర్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెర పడింది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్ధానాలు ఉండగా.. 38 స్ధానాలకు తొలిదశలో ఎన్నికలు జరిగాయి. 84 శాతం మంది ప్రజలు తొలిదశ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఈ నెల 8వ తేదీన మిగిలిన 22 స్ధానాలకు పోలింగ్ జరగనుంది. మణిపూర్ ఉక్కుమహిళగా పేరుగాంచిన ఇరోమ్ చాను షర్మిళ కూడా రెండో దశ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. మొత్తం 98 మంది అభ్యర్థులు రెండో దశ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. కాగా, రాష్ట్ర రాజకీయాల్లోని హేమాహేమీలందరూ రెండో దశ ఎన్నికల్లో తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. వీరిలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబొబి సింగ్, డిప్యూటీ సీఎం గైకన్గమ్‌లు కూడా ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా మణిపూర్‌లో విజయపతాకం ఎగరేస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. -
ముగిసిన విశాఖ ఉత్సవ్
విశాఖపట్టణం: విశాఖపట్టణం ఉత్సవ్ వేడుకలు ఆదివారం ముగిశాయి. వేడుకలకు మంత్రి గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ఉత్సవ్ జరుగుతున్న సమయంలో కరెంటు నిలిచిపోయింది. దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావు చీకట్లోనే ప్రసగించాల్సి వచ్చింది. కరెంటు సదుపాయం లేకపోవడంతో కొన్ని కార్యక్రమాలను అర్ధాంతరంగా ముగించారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్, క్రికెట్ పోటీలు
అండర్–14 బాలుర క్రికెట్ విభాగంలో తూర్పుగోదావరి జట్టు విజేత అండర్–14,17 బాలుర అథ్లెటిక్స్ విభాగంలో వైఎస్సార్ కడప జట్లు విజేతలు అండర్ 14 బాలికల విభాగంలో శ్రీకాకుళం జట్టు విజేత అండర్ 17 బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి జట్టువిజేత గుంటూరు స్పోర్ట్స్ : 62వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్, క్రికెట్ పోటీలు ముగిశాయి. అండర్–14 బాలుర క్రికెట్ విభాగంలో తూర్పు గోదావరి జట్టు విజేతగా నిలువగా, అనంతపురం జట్టు ద్వితీయ, విజయనగరం తృతీయ స్థానాలు సాధించాయి. అండర్–14 బాలుర అథ్లెటిక్స్ విభాగంలో వైఎస్సార్ కడప జట్టు విజేత నిలువగా, బాలికల విభాగంలో శ్రీకాకుళం విజేతగా నిలిచింది. అండర్–17 బాలుర విభాగంలో వైఎస్సార్ కడప జిల్లా జట్టు విజేతగా నిలువగా, బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం బ్రహ్మనందరెడ్డి స్టేడియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామకృష్ణ, మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్యఅతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ కార్యదర్శి కరీముల్లారావు, అధ్యక్షుడు కాంతరావు, అబ్జర్వరర్ విజయ్, స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి గణేష్, శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన క్రికెట్ అసోసియేషన్ ఎన్నికిలు
-
ముగిసిన సందడి...
-
షటిల్ బ్యాడ్మింటన్ విజేతలు వీరే..
ముగిసిన ఆంధ్రప్రదేశ్ బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు రసవత్తరంగా సాగిన ఫైనల్స్ తెనాలి: బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2016 పోటీలు ముగిశాయి. అండర్–13, అండర్–15 కేటగిరీల్లో బాలబాలికలకు ఇక్కడి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలు శుక్రవారం సాయంత్రం జరిగిన రసవత్తరంగా సాగాయి. అండర్–15 ఫైనల్స్ పోటీల్లో బాలుర డబుల్స్ విభాగంలో గుంటూరుకు చెందిన సాయిచరణ్ కోయ–చరణ్‌నాయక్ జట్టు విన్నర్స్‌గా నిలిచింది. వీరు కర్నూలు క్రీడాకారులు సాయినాథ్‌రెడ్డి–అర్షద్‌పై 21–11, 21–15 స్కోరుతో విజయం సాధించారు. ఇదే కేటగిరీ బాలికల విభాగంలో మేఘ (కర్నూలు)–వెన్నెల (కడప) 21–14, 21–18 స్కోరుతో పశ్చిమ గోదావరి జిల్లా ఎన్.జాహ్నవి–కె.మేఘనపై జట్టుపై గెలుపొందారు. సింగిల్స్ మ్యాచ్ బాలుర విభాగంలో షేక్ అర్షద్ (కర్నూలు) విన్నర్ కాగా, షేక్ ఇమ్రాన్ (అనంతపురం) రన్నర్‌గా నిలిచాడు. బాలికల విభాగంలో కర్నూలు క్రీడాకారిణి పి.మేఘ, చిత్తూరు క్రీడాకారిణి గీతాకృష్ణ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. అండర్–13 కేటగిరీలో... అండర్–13 కేటగిరీ బాలుర డబుల్స్‌లో అనంతపురం ద్వయం బీ విజయ్–పి.రాహుల్ విన్నర్స్, ఎ.నిధిభట్ (కర్నూలు)–షేక్ నుమెయిర్ (ప్రకాశం) జంట రన్నర్‌గా నిలిచారు. బాలికల విభాగంలో విశాఖ జట్టులోని ఆయేషాసింగ్–కేపీఎస్ ప్రజ్ఞ విన్నర్స్, ఎ.నయనవి రెడ్డి (పశ్చిమగోదావరి)– కె.రిషిక (కృష్ణా) జంట రన్నర్స్ స్థానాలు సాధించారు. ఇదే కేటగిరీ బాలుర సింగిల్స్‌లో బి.విజయ్ (అనంతపురం), ఎ.వంశీకృష్ణ (పశ్చిమగోదావరి), విన్నర్, రన్నర్‌గా నిలిచారు. బాలికల విభాగంలో విశాఖ క్రీడాకారిణి ఆయేషాసింగ్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దోబచర్ల చిరుహాసిని మధ్య పోటాపోటీగా సాగిన మ్యాచ్‌లో 19–21, 21–16, 21–17 ఆయేషాసింగ్ గెలుపొందారు. సీడింగ్ అర్హత కలిగిన క్రీడాకారులే కాకుండా కొత్తగా పాల్గొన్నవారు వందకుపైగా ఉన్నారు. వీరికి సీడింగ్ అర్హత కోసం రోజున్నర పోటీలు నిర్వహించారు. స్థానిక ఇండోర్ స్టేడియం, వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో పోటీలు సాగాయి.. మొత్తం 8 ఈవెంట్లలో తణుకులోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు ఐదు ఈవెంట్లలో ఫైనల్స్‌కు చేరుకున్నట్టు అకాడమీ కోచ్ సమ్మెట సతీష్‌బాబు చెప్పారు. టోర్నమెంటు రిఫరీగా షేక్ జిలానీబాషా (కడప), డిప్యూటీ రిఫరీగా షేక్ హుమయూన్ కబీర్ (ప్రకాశం) వ్యవహరించారు. -
ముగిసిన లాన్ టెన్నిస్ పోటీలు
గుంటూరు రూరల్ : గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో అండర్ 14 విభాగం లాన్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లయోలా పాఠశాల పూర్వ విద్యార్థి డాక్టర్ అన్వర్ పాల్గొని మాట్లాడారు. క్రీడలతో మానసిక పరిపక్వత సాధిస్తారని చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటలతో విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. పోటీల్లో బాలికల సింగిల్స్ విభాగంలో నల్లాపాడు కేంద్రియ విద్యాలయానికి చెందిన అశ్రిత ప్రథమ స్థానం సాధించింది. విజయవాడ చైతన్య పాఠశాలకు చెందిన సీహెచ్ ప్రవల్లిక ద్వితీయ స్థానం గెలుపొందింది. సింగిల్స్ బాలుర విభాగంలో విజయవాడకు చెందిన భాష్యం విద్యార్థి జయకృష్ణ వంశీ ప్రథమ స్థానం, నిర్మల హైస్కూల్ విద్యార్థి కె.గిరీష్ కైవశంచేసుకున్నారు. బాలికల డబుల్స్ విభాగంలో నల్లపాడు కేంద్రియ విద్యాలయానికి చెందిన అశ్రిత, విజయవాడ చైతన్య విద్యార్థి సీహెచ్ ప్రవల్లిక ప్రథమస్థానం, ఎన్ఎస్ఎమ్ స్కూల్ విజయవాడకు చెందిన విద్యార్థి ఎస్.యశస్వీ, కృష్ణవేణి పాఠశాల విద్యార్థిని లావణ్య ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలుర డబుల్స్ విభాగంలో గుంటూరు చైతన్య విద్యార్థి షేక్ ఫరాజ్, విజయవాడ భాష్యం విద్యార్థి జయకృష్ణవంశీ ప్రథమ స్థానం, విజయవాడ నిర్మల హైస్కూల్ విద్యార్థి గిరీష్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి మాధవ్‌లు ద్వితీయ స్థానంలో నిలిచారు. -
‘ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి’
ఆదిలాబాద్ రిమ్స్ : ఆదిలాబాద్‌లో నిర్వహించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని హిందూ సమాజ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జంగిలి ఆశన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్మీడియా ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గణేశ్ ఉత్సవాలు విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రజలకు, పోలీసులకు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందికి కతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఆనందోత్సహాల మధ్య పండుగ నిర్వహించుకున్నారన్నారు. అందరి సహకారంతోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వేడుకలు ముగిశాయని పేర్కొన్నారు. సమావేశంలో సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రపుల్ వఝే, నాయకులు శ్రీరాంశర్మ, సామ రమేశ్‌రెడ్డి, మేస్రం రాజేశ్వర్, నరేందర్, సంతోష్‌రెడ్డి ఉన్నారు. -
నేడు తిరంగా యాత్ర ముగింపు సభ
- హన్మకొండ జేఎన్ఎస్లో సాయంత్రం నాలుగు గంటలకు.. - హాజరుకానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా - పూర్తికావొచ్చిన ఏర్పాట్లు హన్మకొండ : బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తిరంగా యాత్ర ముగింపు సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హన్మకొండ జేఎన్ఎస్లో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొననుండగా.. సభను విజయవంతం చేసేందుకు బీజేపీ అర్భన్, రూరల్ జిల్లా శాఖలు తీవ్రంగా శ్రమించాయి. గత అయిదు రోజులుగా వర్షం కురుస్తుండడంతో శనివారం జరుగనున్న సభకు అటంకం కలుగకుండా ఉండేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ నిర్వహించనున్న జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వర్షం కురిసినా సభకు హాజరైన వారు తడవకుండా రూ.28 లక్షల వ్యయంతో రేకులతో పెద్ద ఎత్తున షెడ్ వేశారు. 50 వేల మంది సభకు హాజరవుతారని పార్టీ నాయకులు భావిస్తున్నారు. నిజాం పాలన నుంచి విమోచనం పొందిన రోజును తెలంగాణ స్వాతంత్య్ర దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ గత కొనేళ్లుగా డిమాండ్ చేస్తోంది. అయితే, పాలకులు స్పందించకపోవడంతో బీజేపీ ఆధ్వర్యాన ఏటా సెప్టెంబర్ 17న జాతీయ పతాకాన్ని అవిష్కరిస్తూ తెలంగాణ విమోచన దినంగా నిర్వహిస్తునఆనరు. అయితే, ఈసారి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్న సందర్భంగా ఆనాడు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న పోరాట యోధులు, స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడం, జీవించి ఉన్న వారిని సన్మానించేందుకు తిరంగా యాత్ర చేపట్టారు. అయితే, ఈ యాత్ర ఆగస్టులో ముగియాల్సి ఉన్నా తెలంగాణకు సెప్టెంబర్ 17న స్వాతంత్య్ర దినం రావడంతో అప్పటి వరకు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు యాత్ర కొనసాగించారు. అయితే, తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీ నాయకులు తిరంగా యాత్ర, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణకు ప్రధాన కేంద్రంగా ఉన్న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. రోడ్డు మార్గాన సభకు.. హన్మకొండలో శనివారం జరగనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రోడ్డు మార్గాన రానున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గాన వస్తారు. కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సభలో పాల్గొనున్న నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, కమిషనర్ జి.సుధీర్‌బాబు జేఎన్ఎస్లో ఏర్పాట్లను ఏసీపీ శోభన్‌కుమార్, సీఐ సంపత్‌రావుతో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. -
ముగిసిన శ్రీమద్భాగవత సప్తాహం
కొల్లూరు: వందో∙ఏట నిర్విఘ్నంగా నిర్వహించిన శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞ శతవర్ష మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. కొల్లూరు వేణుగోపాలస్వామి ఆలయంలో శంకర సేవా సమితి ఆధ్వర్యంలో వారం రోజులుగా భాగవత సప్తాహం, పారాయణం వంటి పలు కార్యక్రమాలు జరిగాయి. చివరిరోజైన శుక్రవారం మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి, దుర్భా శ్రీరామచంద్రమూర్తి సప్తాహం, పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీమద్భాగవత సప్తాహ సావనీరును ప్రముఖుల ఆధ్వర్యంలో శంకర సేవాసమితి సభ్యులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సేవాసమితి అధ్యక్షులు భాగవతుల మధుసూదనశర్మ, కల్లూరి వెంకటసూర్యనారాయణమూర్తి, పోలేపెద్ది కామశాస్త్రి, భాగవతుల సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
వర్షం వచ్చినా ఆటంకం కలుగకుండా ఏర్పాట్లు
రేపు జేఎన్ఎస్లో తిరంగా యాత్ర ముగింపు సభ నాటి పోరాట యో«ధులను సన్మానించనున్న అమిత్‌షా బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రాజేశ్వర్‌రావు హన్మకొండ : వర్షం వచ్చినప్పటికీ శనివారం హన్మకొండ జేఎన్ఎస్లో జరగనున్న తిరంగా యాత్ర ముగింపు సభ కు ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజే పీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు తెలిపారు. హన్మకొండలోని వేద బాంక్వెట్‌హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం సాయంత్రం 4 గంటలకు హన్మకొండలోని జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగనున్న తిరంగాయాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనున్నారన్నారు. ఈ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వర్షం కురిసిన ప్రజలు తడువకుండా ఉండేందుకు పాలిథీ¯ŒS కవర్లతో పై కప్పు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సభలో నాటి పో రాట యోధులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సన్మానించనున్నరన్నారు. అదే విదంగా నిజాం కాలంలో నిజాం సేనలు, రజాకార్ల మూకలు చేసిన అకృత్యాలు వివరించేలా దృశ్యకావ్యాన్ని ప్రదర్శించనున్నట్లు తెలి పారు. నిజాం పాలనలో వరంగల్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడ తిరంగా యాత్ర ముగింపు సభ ఏర్పాటుచేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను ఆహ్వానిం చినట్లు రాజేశ్వర్‌రావు వివరించారు. కాగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, అకాంక్షలు నెరవేర్చేందుకు, చిరకాల స్వప్నం అయిన సెప్టెంబర్ 17న తెలంగాణ స్వాతంత్య్ర దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ స్వాతంత్య్ర దినా న్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కుటుంబ స భ్యులు, టీఆర్ఎస్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జూన్ 2న తెలంగాణ వచ్చిందని, ఇక సెప్టెంబర్ 17న జరుపుకోవాల్సిన అవసరం లేదని, తమ ఉద్యమ చరిత్ర మరుగున పడుతుందని సీఎం కేసీఆర్, కూతురు కవిత అనడం సరికాదని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈనెల 17వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినాన్ని గ్రామగ్రామాన, వాడ వాడలా జరుపుకుంటామని, జాతీయ పతాకాలను ఎగురవేస్తామన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, కార్యదర్శి రావు పద్మ, నాయకులు చింతాకు ల సునీల్, వన్నాల శ్రీరాములు, సురేష్ పాల్గొన్నారు. -
ఎంసెట్ ప్రశాంతం
కేయూ క్యాంపస్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన టీఎస్ ఎంసెట్ –3 ప్రశాంతంగా ముగిసింది. వరంగల్‌లో ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, కేయూలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల, యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, హ్యుమానిటీస్ భవనం, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల, సీకేఎం ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, వరంగల్‌లోని ఎల్బీ కళాశాల కే ంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. కేయూలో నాలుగు కేంద్రాలు ఉండగా.. అభ్యర్థులు, వారి వెంట వచ్చిన వారితో సందడిగా మారింది. కొందరు అభ్యర్థులు ఉరుకులు పరుగుల మీద కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటోలు తీశారు. పరీక్ష ఉదయం 10 గంటలకు కాగా, 9 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. నిర్ణీత సమయం తర్వాత నిమిషం ఆలస్యం గా వచ్చినా అనుమతించలేదు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కాలేజీ కేంద్రం వద్ద నిర్దేశిత సమయం తర్వాత వచ్చిన ముగ్గురు అభ్యర్థులు ప్రవళిక, రూప, నరేష్‌ను లోనికి అనుమతించలేదు. దీంతో వారు పరీక్ష రాయలేక విలపిస్తూ వెనుదిరిగారు. 8 పరీక్ష కేంద్రాల్లో కలిపి మొత్తం 4,710 మందికి గాను 3,497 మంది(74 శాతం) హాజరయ్యారని రీజినల్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు.8 మంది చీఫ్సూపరింటెండెంట్లు, 12 మంది అబ్జర్వర్లతోపాటు జేఎన్టీయూ నుంచి మరో నలుగురు ప్రత్యేక పరిశీలకులు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న, ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బెనర్జీ తదితరులు తనిఖీ చేశారు. -
యాగం.. పరిసమాప్తం
అలంపూర్/అలంపూర్ రూరల్: వారం రోజులుగా అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న చంyీ యాగం బుధవారం పూర్ణాహుతి ఘట్టంతో ముగించారు. కలెక్టర్ టీకే శ్రీదేవి చేతులమీదుగా ఈ కార్యక్రమం సాగింది. ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే సంపత్‌కుమార్ హాజరయ్యారు. యాగానికి పెద్దఎత్తున వచ్చిన రుత్వికులు ‘పూర్ణాహుతిఉత్తమాం జుహోతి’ అంటూ మంత్రోచ్ఛరణ చేస్తూ పూర్ణాహుతిని యజ్ఞేశ్వరుడికి సమర్పించారు. ఆహుతులను కూడా ఉత్తమత్వాన్ని చేకూర్చే ఆహుతి పూర్ణాహుతి అంటారని వేదపండితుడు వెంకటకృష్ణ తెలిపారు. నాగార్జున తంత్రంలో చెప్పిన విశేషమైన వనమూలికలతో ఆహుతి అందజేశారు. అదేవిధంగా చండీదేవికి ప్రీతికరమైన ఎర్రటివస్త్రాన్ని ఆహుతిలో వేశారు. పాడిపంటలు అభివృద్ధి చెందాలని, వర్షాలతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, జలం సమృద్ధిగా ఉండాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ నమక చమకాలు పఠించారు. పూర్ణాహుతి ఫలం ఇది.. రాజభయ, అగ్నిభయ, చోరభయ.. అనే మూడు రకాల భయాలతో పాటు ప్రకతి ప్రకోపాల నుంచి రక్షించేందుకు సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా ఈ చండీహోమాలు ఫలాన్నిస్తాయి. ఇందులో సత్వగుణం సరస్వతీ దేవి, రజోగుణం లక్ష్మీదేవి, తమోగుణం కాళీకాదేవి అనుగ్రహిస్తుంది. సత్వగుణం తెలుపునకు ప్రతీకగా, రజోగుణం, పసుపుకు ప్రతీకగా, తమో గుణం నలుపునకు ప్రతీకగా నిలుస్తాయని శతాధికయాగ ప్రతిష్టాచార్య వెంకటకష్ణ విశేషప్రాధాన్యాలను వివరించారు. సప్తమాత్రిక (బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, చాముండి, మహాలక్ష్మి) దేవతలను ఆరాధిస్తూ రాష్ట్రంలోని ప్రజలందరికీ నవగ్రహ ఈతిబాధలు తొలగాలని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిని ప్రాణ ప్రతిష్ట చేసి శతచండీ యాగం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, ప్రత్యేకాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీఓ లింగ్యానాయక్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామకష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బి.కృష్ణ, ఈఓ గురురాజ, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మంజుల పాల్గొన్నారు. -
పుష్కర జ్ఞాపకం
-
ముగిసిన అంత్యపుష్కర ఘట్టం
-
రేపటితో అంత్యపుష్కరాల ముగింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి అంత్యపుష్కరాలు గురువారంతో ముగియనున్నాయి. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో పుష్కరుడికి వీడ్కోలు కార్యక్రమం నిర్విహంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6:30 గంటలకు పుష్కరఘాట్‌లో నిర్వహించే హారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. పుష్కరుడికి వీడ్కోలు కార్యక్రమాన్ని ఆయన తిలకిస్తారు. -
ముగిసిన జిల్లాస్థాయి చదరంగ పోటీలు
కరీంనగర్ స్పోర్ట్స్ :జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పెన్షనర్ల భవన్లో జరిగిన జిల్లాస్థాయి అండర్ 19, 25 చదరంగ పోటీలు ముగిశాయి. పోటీలకు జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అండర్ 25 విభాగంలో కె.విశ్వనాథ్, కె.శ్రీనివాస్, స్రవంతి, సుష్మారెడ్డి, మధురవాణి ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా చదరంగ సమాఖ్య బాధ్యులు పాల్గొన్నారు. -
'మహా దీక్షకు గుడ్‌బై'
-
'మహా దీక్షకు రేపు గుడ్‌బై'
ఇంపాల్: ఎట్టకేలకు తన పదహారేళ్ల అకుంటిత దీక్షకు మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల ముగింపుపలుకుతున్నారు. మంగళవారం ఉదయం ఆమె తన దీక్షను విరమించేందుకు సర్వం సిద్థం చేసుకున్నారు. ప్రముఖ హక్కుల కార్యకర్త అయిన ఇరోమ్ షర్మిల నాజల్ ట్యూబ్ ద్వారా మాత్రమే ద్రవ పదార్థం ఆహారంగా తీసుకుంటూ వచ్చారు. మణిపూర్ లో అమలుచేస్తున్న ప్రత్యేక సాయుధ బలగాల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో ఆమె 2000 సంవత్సరం నుంచి ఈ దీక్షను ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె పోలీసుల అదుపులోనే ఓ ఆస్పత్రిలో ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఆమెను జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె తన దీక్షను విరమించినట్లు ప్రకటించగానే కోర్టు ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగిసినట్లుగా ప్రకటించనుంది. అనంతరం ఆమె తన మద్దతుదారులతో సమావేశం కానున్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇప్పటికే వార్తా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. -
పీజీసెట్ వెబ్ ఆప్షన్లకు ముగిసిన గడువు
l 10న సీట్ల కేటాయింపు కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ఆప్షన్ల ఇచ్చుకునే ప్రక్రియ ఆది వారం ముగిసింది. ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎంసీజే, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, మైక్రోబయాలజీ, జియాలజీ, ఎంఏ సోషియాలజీ, ఎంఏ హిస్టరీ, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ, పీజీ సెరికల్చర్ డిప్లొమా, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జువాలజీ, ఫిజిక్స్, ఎంఏ ఇంగ్లిష్, పొలిటికల్‌సైన్స్, ఎంఈడీ, ఎంఎస్డబ్లూ్య, ఎంఏ తెలుగు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జెండర్æస్టడీస్, ఎమ్మెస్సీ బాటనీ, ఎంపీఈడీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది. ఈనెల 10న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఏఏ కళాశాలలో సీటు వచ్చిందో ఆయా విద్యార్థులకు సెల్ఫోన్లకు మెస్సేజ్తోపాటు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఎన్ని రోజుల్లో తమకు కేటాయించిన కళాశాలల్లో జాయిన్ కావాలో కూడా అభ్యర్థులకు సమాచారం పంపుతారు. ఇదిలా ఉండగా ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్ల కేటాయింపు ఈనెల 10న ఉండడం లేదని తెలుస్తోంది. -
ముగిసిన అంతర్ జిల్లాల హ్యాండ్‌బాల్ పోటీలు
l విజేతగా ఖమ్మం జట్టు l నాలుగో స్థానంలో నిలిచిన వరంగల్ వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ హ్యాండ్‌బాల్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని జ వహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ని ర్వహించిన అంతర్ జిల్లాల సబ్ జూనియర్స్ బాలికల హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. హోరాహోరీగా కొనసాగిన పోటీ ల్లో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. రన్నరప్ స్థానాన్ని నిజామాబాద్ జట్టు దక్కించుకోగా, మూడో స్థానంలో హైదరాబాద్, నాలుగో స్థా నంలో వరంగల్ జట్లు నిలిచాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ముగింపు సభకు స్థానిక కార్పొరేటర్ సోబియా సబహత్ ముఖ్యఅతిథిగా హాజరైవిజేతలకు ట్రోఫీలు అందజేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోట ములు సహజమన్నారు. ఓటమితో కుంగి పోకుండా.. మరింత పట్టుదలతో సాధన చేయాలని సూచించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి ఇందిర, హన్మకొండ సీఐ అవిర్నేని సంపత్‌రావు, ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కైలాస్‌యాదవ్, ఇంద్రసేనారెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లాస్థాయి 33వ సబ్‌జూనియ ర్స్ బాలికల ఎంపిక పోటీలను నిర్వహించా రు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 200 మంది క్రీడాకారిణిలు హాజరైనట్లు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన పి.అర్చన, డి.స్వప్న, పి.నవ్య, ఎం.వెన్నెల లు (జెడ్పీఎస్ఎస్ నందిగామ), ఇ.మేఘన. జి.శిరీ ష (జెడ్పీఎస్ఎస్ తిమ్మంపేట), శిరీష (జెడ్పీఎస్ఎస్ ధర్మసాగర్), బి.సాయిసృజన(ఓరుగల్లు హైస్కూల్), ఎంపికయ్యారు. అలాగే ఎ.అమూల్య(జెడ్పీఎస్ఎస్ లక్నెపల్లి), ఎం.వర్ష (గ్రీన్వుడ్ హైస్కూల్), స్పందన(జెడ్పీఎస్ఎస్ పైడిపెల్లి), టి.అనూష(జెడ్పీఎస్ఎస్ ఆకునూరు) ఎం.సాత్విక ఏంజిల్(ఆక్స్ఫర్డ్ హై స్కూల్), బిసుప్రియ( జెడ్పీఎస్ఎస్ ఆకూనూరు), ఎ ఐశ్వర్య(ఎస్ఆర్ డిజీ స్కూల్), డి రవళి(ఓరుగల్లుహైస్కూల్)లు ఎంపికైనట్లు తె లిపారు. వీరు ఈ నెల 6,7,8 తేదీల్లో జేఎన్ఎస్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ పో టీల్లో పాల్గొంటారని పవన్‌కుమార్ తెలిపారు. -
ముగిసిన జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ ఎంపికలు
కరీంనగర్ స్పోర్ట్స్ : జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ స్టేడియంలో సబ్‌జూనియర్ బాలికలకు నిర్వహించిన జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ముగిశాయి. ఈ ఎంపిక పోటీలకు జిల్లా వ్యాప్తంగా గుల్లకోట, రామడుగు, గోపాల్రావుపేట, చింతకుంట, రామడుగు, బెజ్జంకి, ధర్మపురి, గర్రెపల్లి నుంచి దాదాపు 80 మంది క్రీడాకారిణిలు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఆగష్టు 6 నుంచి 8 వరకు హన్మకొండలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. పీఈటీలు జిట్టబోయిన శ్రీనివాస్, లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. జట్టు ఇదే.. జి.రోషిణి, ఎండీ సనా, మౌనిక, బి.స్వర్ణలత, ఎ.రాజేశ్వరీ, చేతన, వి.నాగ, అనూష, రవళి, కల్పన, బి.లావణ్య, నాగజ్యోతి, స్టాండ్‌బైగా కె.రవళి, అంజలి సంఘమిత్ర, అఖిల, రమాదేవి. -
ముగిసిన జయతీర్థుల ఆరాధనోత్సవాలు
సాక్షి, తిరుమల : అశాంతిని శ్రీవారి నామసంకీర్తనం ఒక్కటే దూరం చేయగలదని కర్ణాటకలోని కోలార్ జిల్లా తంబిహళ్లిలోని మాధవ తీర్థం మఠాధిపతులు విద్యాసాగర మాధవతీర్థ, విద్యాసింధు మాధవ తీర్థులు అన్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్థానిక ఆస్థాన మండపంలో మూడురోజుల పాటు సాగిన జయతీర్థుల ఆరాధనోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా మఠాధిపతులు భక్తులకు మంగళశాసనాలు అందించి, ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలని, కష్టకాలంలో అదే కాపాడుతుందని హితబోధ చేశారు. భక్తిమార్గంతోనే మానవులకు మనఃశ్శాంతి చేకూరుతుందన్నారు. కలియుగ రక్షకుడు శ్రీవేంకటేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో సేవిస్తే శాంత స్వభావం అలవడుతుందన్నారు. దాస భక్తులు భజన కార్యక్రమాల ద్వారా శ్రీవారిని కీర్తించి తరించాలని సూచించారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో సుమారు 3వేల మంది భక్తులు పాల్గొన్నారు. -
జ్యోతిష్మతిలో ముగిసిన శిక్షణ శిబిరం
తిమ్మాపూర్ : మండలంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనలియర్ విద్యార్థులకు తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహించిన ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ శిక్షణ శిబిరం గురువారంతో ముగిసింది. టాస్క్ సీనియర్ ట్రైనర్లు బెన్నీ జార్జ్, రాజరాజేశ్వరి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇందులో లక్ష్యాలను నిర్ధారించుకోవడం, సృజనాత్మకత, వాక్చాతుర్యం, రచనల్లో నైపుణ్యాలు పెంపొందించడం, సమయపాలన, మర్యాదక్రమాలు, నీతి విలువలు, వాణిజ్య సంబంధ ఆంగ్లంలో నిపుణత సాధించడం వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు సూచించారు. ప్రిన్సిపాల్ విజేంద్రకుమార్, లెక్చరర్లు వైశాలి, గోపాల్‌రెడ్డి, విశ్వప్రకాష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన గోవిందుడి జ్యేష్టాభిషేకం
ముగిసిన గోవిందుడి జ్యేష్టాభిషేకం శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్టాభిషేకం ఘనంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి నిత్యకైంకర్యాలు చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. శతకలశ స్నపనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామృతం, చెరకు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మహాశాంతి హోమం, తిరుమంజనం, సమర్పణ, ఆరగింపు, అక్షతారోహరణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. సాయంత్రం ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. టీటీడీ స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు. -
కేజ్రీవాల్ ఇంటి ముందు దీక్ష విరమించారు
న్యూఢిల్లీ: బీజేపీ ఎమ్మెల్యే మహీష్ గిర్రీ మంగళవారం సాయంత్రం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు నిరహార దీక్షను విరమించారు. న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ అధికారి ఎమ్ ఎమ్ ఖాన్ మరణానికి కారణం గిర్రీనేనని కేజ్రీవాల్ చేసిన ఆరోపణను నిరూపించాలని గిర్రీ ఆదివారం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కొన్నాట్ ఫోర్ స్టార్ హోటల్ ను లీజ్ కు ఇవ్వడానికి ముందురోజు మే 16న ఎమ్ఎమ్ ఖాన్ ను దుండగులు కాల్చి చంపారు. కాగా, ఈ కేసులో హోటల్ ఓనర్ రమేష్ కక్కర్ తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అధికారిని హత్య చేసిన వ్యక్తితో గిర్రీకి సంబంధాలు ఉన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది. ఈ విషయంపై రమేష్ గిర్రీ ద్వారా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారిని తొలగించాలని హత్యకు ముందే లేఖ రాసినట్లు పేర్కొంది. -
ఒకేసారి 22 ఉపగ్రహాలను పంపుతారట!
బెంగళూరు: ఒకేసారి 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సిద్ధమవుతోంది. తాజాగా రీ-యూజబుల్ లాంచింగ్ వెహికల్(ఆర్ఎల్వీ) ప్రయోగంలో తొలి అడుగు విజయవంతంగా వేసిన ఇస్రో జూన్ నెలలో ఈ ప్రయోగానికి సన్నద్ధమవుతున్నట్లు చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ కేసీసీఐ) సమావేశంలో మాట్లాడిన ఆయన 22 ఉపగ్రహాల్లో కేవలం మూడు మాత్రమే భారత్ కు చెందినవి వివరించారు. జూన్ ఆఖరి వారంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. యూఎస్, కెనడా, ఇండోనేషియా, జర్మనీ తదితర దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(పీఎస్ఎల్వీ)-సీ34 ను వినియోగించనున్నట్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ కే శివన్ వివరించారు. ఇస్రో 2008లో ఒకేసారి 10 శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం పూర్తయిన వెంటనే స్కాటరోమీటర్ ప్రయోగాన్ని, ఆ తర్వాత ఇన్ శాట్-3డీఆర్ లను ప్రయోగించనున్నట్లు కిరణ్ చెప్పారు. -
బెంగాల్ లో ముగిసిన రెండో దశ పోలింగ్
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివారం రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో విడతలో భారీ పోలింగ్ నమోదైంది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని అధికారులు చెప్పారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ నిర్వహించారు. అలీపురుందర్, జల్పౌగురి,నార్త్ దీనాజ్ పూర్, సౌత్ దీనాజ్ పూర్, డార్జీలింగ్, మాండ్లా జిల్లాల్లో పోలింగ్ జరిగింది. కడపటి సమాచారం మేరకు దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. ఈ రోజు 56 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించారు. 33 మంది మహిళా అభ్యర్థులతో సహా మొత్తం 383 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. -
ఖేడ్.. ష్..!
♦ ముగిసిన ప్రచారం నేతల తిరుగుపయనం ♦ పోలింగ్‌కు సర్వంసిద్ధం162 గ్రామాల్లో 286 కేంద్రాలు ♦ 119 సమస్యాత్మక కేంద్రాలు భారీ బందోబస్తు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/నారాయణఖేడ్: నారాయణఖేడ్‌లో ఎన్నికల ప్రచారం ముగిసింది. మరోవైపు పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రచారం కోసం వచ్చిన వివిధ పార్టీల నాయకులు నియోజకవర్గాన్ని వదిలివెళ్లిపోయారు. టీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానై నడిపిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సాయంత్రం నాలుగు గంటలకే పటాన్‌చెరుకు వెళ్లారు. కాంగ్రెస్ నాయకులు దామోదర రాజనర్సింహతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిననేతలు కూడా నియోజకవర్గాన్ని వదిలి వెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు నియోజకవర్గాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. నియోజకవర్గంలోని 162 రెవెన్యూ గ్రామాల్లో 1.89 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ల కోసం 286 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 1,174 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. నియోజకవర్గాన్ని 33 సెక్టార్లుగా విభజన చేసి ప్రతి సెక్టార్‌కు ఒక రూట్ అధికారి, ఒక సెక్టార్ అధికారికి, మోడల్ కోడ్‌ఆఫ్ కండక్ట్ అధికారి, ఫ్లయింగ్ స్క్వాడ్‌ను నియమించారు. సెల్ ఫోన్సిగ్నిల్స్ అందిన 282 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం కోసం 300మంది విద్యార్థులను సిద్ధం చేశారు. 125 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని వీడియో తీస్తామని ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. 286 పోలింగ్ కేంద్రాలకు 286 ఈవీఎంలను సిద్ధం చేశారు. ఎక్కడైనా ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తితే అత్యవసర సమయంలో ఉపయోగించుకోవడానికి మరో 100 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. వీటిని ప్రస్తుతానికి నారాయణఖేడ్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. శుక్రవారం ఉదయం పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌రూం నుంచి ఈవీఎంలను ఎన్నికల అధికారులకు అప్పగిస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ అధికారి, ముగ్గురు సిబ్బందిని నియమిస్తున్నారు. ఈవీఎంల సాంకేతిక సమస్య తక్షణ నివారణకు ఐదుగురు ఇంజనీర్లను అందుబాటులో ఉంచారు.. 20 మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు నియోజకవర్గంలో 20 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించనున్నారు. ఓటువేసేందుకు వెళ్ళిన ప్రతి ఓటరుకు గులాబిపువ్వు ఇచ్చి అధికారులు స్వాగతం పలుకుతారు. షెల్టర్‌తోపాటు, తాగేందుకు మంచినీళ్లు, మజ్జిగ అందుబాటులో ఉంచుతున్నారు. 95 శాతం పోలింగ్ నమోదైన పంచాయతీకి రూ.2లక్షల నజరానా ఇవ్వనున్నట్లు రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలపై నిఘా నియోజకవర్గంలో 54 అత్యంత సమస్యాత్మక, మరో 65 సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. అతి సమస్యా త్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలు, సివిల్, సాయుధ పోలీసులను నియమిస్తున్నారు. మొబైల్ పోలింగ్ బలగాలు ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తుంటాయి. ఇప్పటివరకు 1398 మందిని బైండోవర్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులకు వారు ఆర్ఓకే సమాధానం ఇచ్చినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. -
ముగిసిన సిరిమానోత్సవం
-
ముగిసిన సిరిమానోత్సవం
మక్కువ (విజయనగరం జిల్లా) : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శంబర పోలమాంబ ఉత్సవం సోమవారం ప్రారంభమైన సంగతి తెల్సిందే. పోలమాంబ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం మంగళవారం ముగిసింది. సిరిమాను పూజారి జన్నిపేకాకు రామారావు మధ్యాహ్నం 3.27 గంటలకు అధిరోహించారు. ఈ ఏడాది ఈ ఉత్సవాలను తిలకించడానికి సుమారు లక్షన్నర మంది భక్తులు వచ్చారని నిర్వాహకుల అంచనా. గతేడాది సుమారు 3 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. -
గాంధీభవన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
-
ముగిసిన కాకినాడ బీచ్ ఫెస్టివల్
-
నేటితో ముగియనున్న స్కైఫెస్ట్
-
ప్రతిపక్షాలకు అభ్యర్థులు కరువు
హైదరాబాద్: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. మిగితా చోట్లలో అభ్యర్థులను వెతికినా దొరకని పరిస్థితి ఆ పార్టీకి ఎదురైంది. ఇక చాలా జిల్లాల్లో టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. బీజేపీ కూడా తన ఉనికి చాటేందుకు కాస్తంత హడావిడి చేసినా చివరకు తన తరుపున అభ్యర్థులను నిలబెట్టేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొత్తంగా ప్రధాన పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ పోటీ చేయని చోట్ల ఏకగ్రీవానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన టీఆర్ఎస్ పార్టీ మొత్తంగా 11 స్థానాల్లో తమదే విజయమని భరోసాగా ఉంది. ఒక్క నల్లగొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ తరుపున చిన్నపరెడ్డిని బరిలోకి దించారు. అయితే, నల్లగొండలో కూడా తాము విజయం సాధిస్తామని, అక్కడ కూడా తమ పార్టీకి గట్టి మద్దతు ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది. -
ఎమోషనల్ గా బందీనయిపోయా
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తాను నటిస్తున్న థ్రిల్లర్ మూవీ 'ఫ్యాన్' కి ఎమోషనల్ గా బౌండ్ అయిపోయాడట. ఈ సినిమా షూటింగ్ ఇంకా ఉంటే బావుండు అని బాద్ షా కు అనిపిస్తోందిట. ఫ్యాన్ సినిమాతో తన ప్రయాణం ఇంత తొందరగా ముగిసిపోతుందని ఎప్పుడూ అనుకోలేదంటూ సోషల్ మీడియాలో షారుక్ షేర్ చేశాడు. తాను మానసికంగా ఫ్యాన్ సినిమాకు బాగా బందీ అయినట్లు షారుక్ ఖాన్ పేర్కొన్నాడు. జీవితం, ప్రేమ, హాస్యం లాంటి మంచి సంగతులు తొందరగా ముగియడం విచారకరమంటూ శుక్రవారం ట్విట్ చేశాడు. కొన్ని సినిమాల్లో నటిస్తున్నపుడు షూటింగ్ లో మమేకమైపోతామని, ఇంకా షూటింగ్ ఉంటే బావుండు అనే ఫీలింగ్ కలుగుతుందన్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న ఫ్యాన్ చిత్రం కూడా అలాంటిదేనన్నాడు. కాగా మనీశ్ శర్మ దర్శకత్వంలో ఒక సూపర్ స్టార్ గా, ఆ సూపర్ స్టార్ కి సూపర్ గా షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో ప్రఖ్యాత మోడల్ వలుశ్చా డిసౌజా, మరో హీరోయిన్గా శ్రీయా పిల్గౌంకర్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫ్యాన్ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. 2016, ఏప్రిల్15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నేడు ఘనంగా పుష్కరాల ముగింపు
బాసరలో అధికారిక వేడుకలు ఇప్పటికే 6 కోట్ల మంది స్నానాలు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన ప్రభుత్వం ముగింపు వేడుకలను కూడా అంతే ఘనంగా జరపనుంది. ఈ నెల 14న పుష్కరాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ప్రారంభించడం తెలిసిందే. ముగింపు వేడుకలను శనివారం ఆదిలాబాద్ జిల్లా బాసరలో నిర్వహించనున్నారు. బాసర సరస్వతీ అమ్మవారికి హారతి ఇచ్చాక ఆలయం నుంచి గోదావరి ఒడ్డు వరకు ఊరేగింపు జరుపుతారు. అక్కడ గోదావరికి మహాహారతి ఇచ్చి పుష్కరాలను అధికారికంగా ముగిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 నుంచి 7.30 దాకా ‘గోదావరి సంబురాలు’ పేర బాసర ఒడ్డున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న ఈ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే తెలంగాణలోని ఐదు గోదావరి పరీవాహక జిల్లాల్లోనూ ప్రధాన పుష్కర ఘాట్లలో నదీమతల్లికి మహాహారతి ఇవ్వనున్నారు. ఈ 11 రోజుల్లో తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 5.98 కోట్ల మంది పుష్కర స్నానాలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజైన శనివారం కూడా భక్తులు పోటెత్తవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ దృష్ట్యా ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలను సీఎం ఆదేశించారు. -
ప్రశాంతంగా ముగిసిన జేసీజే పరీక్షలు
హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) నియామక పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణకు సంబంధించిన ఒకేఒక్క సెంటర్ హైదరాబాద్ మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్షలను నిర్వహించారు. 3,069 మంది న్యాయవాదులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 2,386 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ముగ్గురు డీసీపీల పర్యవేక్షణలో 200 మంది రిజర్వ్ పోలీసులతో గట్టి బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ న్యాయవాదుల నిరసన ఉమ్మడి హైకోర్టును విభజించి వెంటనే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు కోర్టులకు సంబంధించిన ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆదివారం పరీక్షలను అడ్డుకోబోయారు. పరీక్ష కేంద్రమైన టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకొని కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై నిరసనకారులను విడిచి పెట్టారు. -
ముగిసిన నామినేషన్లు
నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల మండలి స్థానానికి నామినేషన్లు పర్వం ముగిసింది. మూడు జిల్లాల నుంచి వివిధ పార్టీలకు చెందిన 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కొందరు అభ్యర్థులు రెండు, మూడు చొప్పున నామినేషన్లు వేశారు. దీంతో 27 మంది అభ్యర్థులకు గాను 44 సెట్లు దాఖలయ్యాయి. చివరి రోజైన గురువారం 21 మంది అభ్యర్థులు 28 సెట్లు వేశారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ తరపున తీన్మార్ మల్లన్న, వామపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థి సూరం ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 2వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంది. -
రానా, త్రిషల సీక్రెట్ ఎఫైర్ కటీఫ్!
టాలీవుడ్ యువ హీరో రానా దగ్గుబాటి, నటి త్రిషల సీక్రెట్ ఎఫైర్ ముగిసిందా? పలు కార్యక్రమాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన ఈ జంట విడిపోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సైమా అవార్డుల కార్యక్రమంలో రానా, త్రిష ఇద్దరూ పాల్గొన్నారు. వీరిద్దరూ కలసే మలేసియాకు వెళ్లినట్టు సమాచారం. రానా, త్రిష కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు టాలీవుడ్ వర్గాల కథనం. ఈ జంట ఈ రూమర్లను ఖండించినా.. రహస్యంగా ప్రేమాయణం సాగిస్తున్నట్టు టాలీవుడ్ కోడైకూస్తోంది. అయితే ఇదంతా గతం. రానా, త్రిష తమ బంధాన్ని తెంచుకున్నట్టు తాజా సమాచారం. రానా వేరే అమ్మాయిలతో ఎఫైర్ సాగిస్తున్నాడనే కారణంతో వీరిద్దరూ విడిపోయినట్టు తెలుస్తోంది. రానా, త్రిష ట్విట్టర్లో పరస్పరం ట్వీట్ చేసుకునేవారు. అయితే కొంతకాలంగా ట్వీట్స్ చేసుకోవడం మానేశారు. ' ఓ కథకు ఎప్పుడూ మూడు కోణాలుంటాయి. నీవైపు, ఎదుటి వారి తరపున వారి వాదనలుంటాయి. నిజమన్నది ఈ రెండింటికీ భిన్నంగా ఉంటుంది" అని ఇటీవల రానా ట్వీట్ చేయగా, 'ఓ వ్యక్తిని మరచిపోవడం సులభం, అయితే మరోసారి ఆ వ్యక్తిని నమ్మడమంటూ ఉండదు" అని త్రిష ట్వీట్ చేశారు. 'నేను బంధాన్ని తెంచుకుంటే, దానికి గల కారణాలను నీవే కల్పించావు' అని త్రిష మరోసారి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్‌ను బట్టి రానా, త్రిషల మధ్య సీక్రెట్ ఎఫైర్ ముగిసిపోయిందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
-
‘ప్రజా’పాలన షురూ
ఏలూరు (ఆర్ఆర్ పేట), న్యూస్‌లైన్ : ఆం ధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరడంతో ఆరు నెలలుగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనకు తెరపడింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రజాపాలన మొదలు కానుంది. దీంతో పాలన గాడిన పడనుంది. కొత్త ప్రజాప్రతినిధులు ఎప్పుడు వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తారని ఆశగా ఎదురుచూసిన జిల్లా ప్రజల కోరిక నెరవేరనుంది. గతేడాది రాష్ట్ర విభజన పరిణామాలతో ఆరు నెలలకు పైగా పాలన స్తంభించగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరలా ఈ ఏడాదిలో ప్రాదేశిక, మునిసిపల్, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కారణంగా గత మూడు నెలలుగా ప్రజలకు పూర్తిస్థాయిలో అధికారులు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో పలు కార్యక్రమాలు నిలిచి ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం కొలువు తీరడంతో తమ సమస్యలను పరిష్కరించే నాథులు కనిపించారనే ఆనందంలో ప్రజలు ఉన్నారు. మంత్రులదే అభివృద్ధి బాధ్యత రాష్ట్ర కేబినెట్లో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించడంతో జిల్లాలో అభివృద్ధిపై ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర విభజన అనంతరం పదవి చేపడుతున్న నూతన ప్రభుత్వానికి ఎదురుకానున్న సవాళ్లకు జిల్లా మంత్రులు ఏవిధంగా స్పందిస్తారోనని ఎదురుచూస్తున్నారు. జిల్లాకు సమీపంలోని విజయవాడ-గుంటూరు మధ్య రాష్ట్ర రాజధాని ఏర్పాటులో జిల్లా మంత్రులు తమ వాణిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వినిపించి ఆ మేరకు సఫలీకృతం కావాలని కోరుకుంటున్నారు. త ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో జిల్లా మంత్రులు కీలక పాత్ర పోషిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
దేశవ్యాప్తంగా ప్రచారం సమాప్తం
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారం దేశ వ్యాప్తంగా ముగిసింది. శనివారం సాయంత్రం ఆరు గంటలతో ప్రచార గడువుకు తెరపడింది. సోమవారం తుది విడత లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 41 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎనిమిది విడతలుగా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకూ 502 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించారు. మరో విడత మాత్రమే మిగిలుంది. సోమవారంతో సుదీర్ఘ ప్రకియకు ముగింపు కార్డు పడనుంది. ఈ నెల 16న లోక్‌సభ, తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. -
ప్రచారం పరిసమాప్తం
సీమాంధ్రలో రేపే ఎన్నికలు నిర్భయంగా ఓటేయండి.. 90 శాతానికిపైగా పోలింగ్ నమోదు చేసి రికార్డు సృష్టించండి ఓటర్లకు సీఈవో భన్వర్‌లాల్ పిలుపు ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం.. టీవీ, రేడియో, ఎస్ఎంఎస్ల ప్రచారంపై కూడా.. సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు మరో 24 గంటల్లో పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియటంతో మైకులన్నీ మూగబోయాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సీమాంధ్రలో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదు చేసి రికార్డు సృష్టించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగించటం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించటం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ హెచ్చరించారు. పోలింగ్ రోజు సిబ్బందితో పాటు పోలీసు యంత్రాంగం అంతా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. పక్షపాతంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇవీ ఏర్పాట్లు... సీమాంధ్ర జిల్లాలోని నక్సలైట్ ప్రభావిత అరకు వ్యాలీ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం, పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మిగతా 165 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు లైన్లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ భద్రత కోసం 3.5 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 272 కంపెనీల కేంద్ర సాయుధ బల గాలు విధుల్లో నిమగ్నమయ్యాయి. మొత్తం 40,708 పోలింగ్ కేంద్రాల్లో 12,000 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. 23,184 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. మిగతా చోట్ల వీడియో చిత్రీకరణతోపాటు, స్టాటిక్ కెమేరాలు, మైక్రో పరిశీలకుల ఏర్పాటు. మండల, నియోజకవర్గ, సమీపంలోని పట్టణ కూడళ్ల లో తెరలపై పోలింగ్‌సరళి ప్రదర్శిస్తారు. అభ్యర్థులు, పార్టీ నాయకులు, ప్రజలు పోలింగ్ సరళిని తెలుసుకోవచ్చు. 7వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలు, ఐటీ సంస్థలు, దుకాణాలన్నింటికి పెయిడ్ సెలవుగా ప్రకటించారు. అత్యవసర సేవలందించే ఆసుపత్రుల్లో కూడా ఒక షిఫ్ట్ సెలవు ఇవ్వాల్సిందే. సెలవు ఇవ్వని యాజమాన్యాలపై కేసు నమోదు చేస్తారు. ఏడాది పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. సీమాంధ్ర జిల్లాల్లో మొత్తం ఓటర్లు సంఖ్య 3,67,62,975. పురుష ఓటర్లు 1,82,49,310 కాగా మహిళా ఓటర్లు సంఖ్య 1,84,69,027. ఇతర ఓటర్లు 3,227 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 41,405 ఉన్నారు. ఎన్నారై ఓటర్లు ఆరుగురున్నారు. పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఓటర్లు కాని వారు ఎవరూ ఉండరాదు. కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జిలను తనిఖీ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఓటర్ల స్లిప్ ఉంటే దాన్నే గుర్తింపు కార్డుగా పరిగణించాలి. మరో గుర్తింపు కార్డు కోసం ఓటర్లను అడగరాదని ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ. ఓటర్ స్లిప్‌లు అందకపోయినా జాబి తాలో పేరు ఉంటే ఓటు వేయవచ్చు. ఏదైనా గుర్తింపు కార్డు చూపితే చాలు. పోలింగ్ కేంద్రాల దగ్గర బూత్‌స్థాయి ఆఫీసర్ల నుంచి కూడా ఓటర్ స్లిప్‌లు తీసుకోవచ్చు. పోలింగ్ కేంద్రం ప్రాంతాన్ని తెలుసుకోవడానికి 9246280027 నంబర్‌కు ‘వోట్’ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ గుర్తింపు కార్డు నంబర్‌తో ఎస్ఎంఎస్ చేయాలి. వెంటనే పోలింగ్ కేంద్రం వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా తెలియచేస్తారు. అభ్యర్ధులు పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల అవతల 10/10 సైజు మించకుండా టెంట్ వేసుకోవచ్చు. టెంట్, కుర్చీలు, టేబుల్‌కు అయ్యే వ్యయాన్ని అభ్యర్ధి ఖాతాలో జమ చేస్తారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఒక్కొక్కరికి పోలింగ్ రోజు లోక్‌సభ అభ్యర్థులు తిరగడానికి 8 వాహనాలకు అనుమతిస్తారు. అసెంబ్లీ అభ్యర్థులకు మూడు వాహనాలకు అనుమతిస్తారు. అభ్యర్థులు కాని వారు పోలింగ్ రోజు సెక్యురిటీతో ఓటు వేయడానికే వెళ్లాలి. ఓటు వేసి వచ్చి ఇంట్లో కూర్చోవాలి. బయ ట తిరిగితే అలాంటి వారిని గృహ నిర్బంధం చేస్తారు. సెక్యూరిటీ ఉన్న అభ్యర్థుల వెంట 24 గంటలు షాడో బృందాలతో నిఘా ఏర్పాటు చేస్తారు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల లోపు అభ్యర్థులు ఎటువంటి ప్రచారం నిర్వహించరాదు. ్హ పోలింగ్ రోజు ఎగ్జిట్, ఒపీనియన్ పోల్ నిర్వహించరాదు. పోలింగ్ ముగిసే వరకు ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఎస్ఎం ఎస్‌లు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించరాదు. పోలింగ్ రోజు అభ్యర్థులనుగానీ, ఓటర్లను గానీ ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్వ్యూలు చేయరాదు. ఓటు ఎవరికి వేశారని పోలింగ్ రోజు అడగరాదు. అలా అడిగితే వారిపై కేసు నమోదు చేయడంతో పాటు చర్యలు తీసుకుంటారు. పత్రికల్లో ప్రచారంపై ఎటువంటి నిషేధం లేదు. అయితే ఆ ప్రచారానికయ్యే వ్యయాన్ని అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తారు. పోలింగ్ ముగిసే వరకు మద్యం విక్రయాలపై నిషేధం, దుకాణాలు వెనక నుంచి విక్రయాలు జరిపితే అరెస్టు చేసి కేసు నమోదు చేస్తారు. సరిహద్దులోని తెలంగాణ నియోజకవర్గాల్లో కూడా మద్యం విక్రయాలపై నిషేధం. మద్యం, డబ్బు పంపిణీపై రాత్రి నుంచి గట్టి నిఘా. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు 8790499899, 7680898833 నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా, 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వచ్చు. పోలింగ్ రోజు నాలుగు హెలికాప్టర్లు, ఒక ఎయిర్ అంబులెన్స్‌ను వినియోగిస్తున్నారు. పాడేరులోనే రెండు హెలికాప్టర్లను, ఎయిర్ అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతారు. బుధవారం సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పోలింగ్ నిర్వహణకు 1,29,930 బ్యాలెట్ యూనిట్లు, 1,00,622 కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తారు. ఈవీఎంలు మొరాయించకుండా ముందే జాగ్రత్త చర్యలు. మంగళవారమే ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఒక్కో ఈవీఎంలో వంద ఓట్లు వేసి తనిఖీ చేస్తారు. తనిఖీల్లో మొరాయిస్తే అదనపు ఈవీఎంలను సిద్ధం చేస్తారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. -
నేటితో ‘తెర’
సాక్షి, చెన్నై: ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గం టల్లో తెర పడనున్నది. దీంతో ఆగమేఘాలపై అభ్యర్థులు ఓట్ల వేటలో మునిగారు. సరిగ్గా మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసేలా ఈసీ కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అయింది. బయటి వ్యక్తుల్ని నియోజకవర్గాల నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంది. ఇక, సోమవారం తన ఎన్నికల ప్రచారాన్ని సీఎం జయలలిత ముగించారు. టీ నగర్ వేదికగా అభ్యర్థులందరినీ ఓటర్లకు పరిచయం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు సమీపించింది. ఒంటరి పయనాలతో తమసత్తాను చాటుకునే పనిలో అన్నాడీఎంకే, కాం గ్రెస్‌లు ముందుకు కదిలాయి. డీపీఏ కూటమిగా డీఎంకే, ఎన్డీఏ కూటమిగా బీజేపీ బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, కాంగ్రెస్‌లు పుదుచ్చేరితోపాటుగా రాష్ట్రంలో 40 స్థానాల్లో అభ్యర్థులను దించాయి. డీఎంకే 35 స్థానాల్లో, ఆ కూటమిలోని మిత్రులు ఐదు స్థానాల్లో అభ్యర్థులను దించారు. బీజేపీ 8 చోట్ల, ఆ కూటమిలోని డీఎండీకే 14 స్థానాల్లో, పీఎంకే 8, ఎండీఎంకే 7, ఐజేకే, కొముకాలు తలా ఓ చోట అభ్యర్థులను రంగంలోకి దించాయి. పంచముఖ సమరం నెలకొనడంతో ఓట్ల వేటలో రాజకీయ పక్షాలు తీవ్రంగానే కుస్తీలు పట్టాయి. తమ అభ్యర్థులకు మద్దతుగా సీఎం జయలలిత ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ పార్టీకి మద్దతుగా నటీ నటులు అనేక మంది ప్రచారంలో కదిలారు. తమ అభ్యర్థులకు మద్దతుగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు. పార్టీ అధినేత కరుణానిధి అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. డీఎంకే కూటమికి మద్దతుగా మిత్ర పక్షాల నేతలు, పార్టీల నాయకులు, సినీ నటీ నటులు రోడ్ షోల రూపంలో అలరించారు. కాంగ్రెస్‌కు సోనియా, రాహుల్ తలా ఓ చోట ప్రచార సభలతో అటు కన్పించి, ఇలా మాయం అయ్యారు. తమ మద్దతు దారులను గెలిపించుకోవడం లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్లు చిదంబరం, జికే వాసన్, ఈవీకేఎస్ తదితరులు తీవ్రంగానే కుస్తీలు పట్టారు. బీజేపీ కూటమికి మద్దతుగా ఆ పార్టీ పీఎం అభ్యర్థి నరేంద్ర మోడీ, సీనియర్లు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, గడ్కారీలు ప్రచారంలో మెరిశారు. డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థుల కోసం ఓటర్ల వద్దకు వెళ్లే, ఆ కూటమిలోని వైగో, రాందాసులు తమ అభ్యర్థులు బరిలో ఉన్న చోటకే పరిమితం అయ్యారు. సీపీఎం, సీపీఐలకు మద్దతుగా ఆ పార్టీల జాతీయ నాయకులు ప్రకాష్‌కారత్, సీతారామం ఏచూరి, రాజాలు కార్మికులను ఆకర్షించే యత్నం చేశారు. రేయింబవళ్లు సాగిన ప్రచార హోరు మరి కొన్ని గంటల్లో ముగియనున్నది. దీంతో చివరి రోజు ఆగమేఘాలపై ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పక్షాల అభ్యర్థులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ప్రచారం ముగించిన జయలలిత: అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఎన్నికల ప్రచారాన్ని ఒక రోజు ముందుగానే ముగించారు. సోమవారం సాయంత్రం టీ నగర్ వేదికగా జరిగిన సభలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ముందుగా తమ పార్టీ అభ్యర్థులు 40 మందిని ఆగమేఘాలపై చెన్నైకు రావాలని ఆదేశించారు. దీంతో విమానాల్లో ఎక్కి చెన్నైలో అభ్యర్థులు వాలారు. అందరినీ పోయేస్ గార్డెన్‌కు పిలిపించి మంతనాల్లో మునిగారు. ఆయా నియోజకవర్గాల ఎన్నికల ఇన్‌చార్జ్‌లు సైతం సమావేశానికి పిలిపించడంతో ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఎన్నికలకు ఒక రోజు మాత్రమే సమయం ఉన్న వేళ ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సాయంత్రం టీ నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులందరినీ ఒకే వేదిక మీదకు పిలిపించి ఓటర్లకు పరిచయం చేశారు. ఇంత వరకు అభ్యర్థులు వేదిక మీదకు పిలిపించి జయలలిత ప్రచారం చేయలేదు. ఇందుకు కారణం తన ఎన్నికల ఖర్చును అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తామంటూ ఈసీ హెచ్చరించడమే. దీంతో ప్రచారం ముగించే వేళ అభ్యర్థులందరినీ ఒకే వేదిక మీదకు జయలలిత పిలిపించారు. ఇక, డీఎంకే అధినేత ఎం కరుణానిధి, స్టాలిన్ మంగళవారం చెన్నైలో ప్రచారం ముగించనున్నారు. ఉత్తర, దక్షిణ, సెంట్రల్ చెన్నైలను కలుపుతూ రోడ్ షోకు కరుణానిధి నిర్ణయించారు. సోమవారం జరిగిన ప్రచార సభలో అన్నాడీఎంకేకు గుణ పాఠం నేర్పుదామని ఓటర్లకు ఆయన పిలుపు నిచ్చారు. డీఎంకేకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. నేడు ఆఖరు : ప్రచారానికి మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో తెర పడనున్నది. దీంతో అన్ని నియోజకవర్గాల్ని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకుంది. నియోజకవర్గాల్లో తిష్ట వేసి ఉన్న నాయకులు, ఆయా ప్రాంతాలకు సంబంధం లేని వ్యక్తులను ఖాళీ చేసి వెళ్లి పోవాలంటూ ఈసీ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. నియోజకవర్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటుగా నగదు బట్వాడా అడ్డుకట్టకు డేగ కళ్లతో నిఘా బృందాలు గస్తీని ముమ్మరం చేశాయి. ఓటర్లకు ఓటు విలువ తెలియజేయడం లక్ష్యంగా ఎస్ఎంఎస్, ఆన్లైన్ ప్రచారానికి నిర్ణయించారు. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు మైకులు, లౌడ్ స్పీకర్లు, ప్రచార రథాలు ఎక్కడికక్కడే నిలుపుదల చేయకుంటే, కొరడా ఝుళిపించాల్సి ఉంటుందని ఈసీ హెచ్చరించింది.