ముగిసిన జయతీర్థుల ఆరాధనోత్సవాలు | end by jayanteerthula aradhanothsavalu | Sakshi
Sakshi News home page

ముగిసిన జయతీర్థుల ఆరాధనోత్సవాలు

Published Mon, Jul 25 2016 9:51 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

ముగిసిన జయతీర్థుల ఆరాధనోత్సవాలు

ముగిసిన జయతీర్థుల ఆరాధనోత్సవాలు

సాక్షి, తిరుమల : అశాంతిని శ్రీవారి నామసంకీర్తనం ఒక్కటే దూరం చేయగలదని కర్ణాటకలోని కోలార్‌ జిల్లా తంబిహళ్లిలోని మాధవ తీర్థం మఠాధిపతులు విద్యాసాగర మాధవతీర్థ, విద్యాసింధు మాధవ తీర్థులు అన్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్థానిక ఆస్థాన మండపంలో మూడురోజుల పాటు సాగిన జయతీర్థుల ఆరాధనోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా మఠాధిపతులు భక్తులకు మంగళశాసనాలు అందించి, ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలని, కష్టకాలంలో అదే కాపాడుతుందని హితబోధ చేశారు. భక్తిమార్గంతోనే మానవులకు మనఃశ్శాంతి చేకూరుతుందన్నారు. కలియుగ రక్షకుడు శ్రీవేంకటేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో సేవిస్తే శాంత స్వభావం అలవడుతుందన్నారు. దాస భక్తులు భజన కార్యక్రమాల ద్వారా శ్రీవారిని కీర్తించి తరించాలని సూచించారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో సుమారు 3వేల మంది భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement