ఇటీవల జమ్మూలో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలు, అమర్‌నాథ్ యాత్రలో రక్షణ చర్యలపై సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు(ఆదివారం) ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో సంబంధిత అధికారులు జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుతమున్న భద్రతా పరిస్థితి, ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్న తీరును హోం మంత్రికి వివరించనున్నారు. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దీనికిముందు అమిత్ షా జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో సమీక్షించారు.
జమ్మూకశ్మీర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడులపై షా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రియాసి, కథువా, దోడాలోని నాలుగు ప్రదేశాల్లో ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఒక సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికుడు వీరమరణం పొందారు. ఒక పౌరునితో పాటు ఏడుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment