Terrorism
-
ఉగ్రవాదాన్ని అంతమొందించాలంటే...
ఆధునిక మానవుడు సాధించిన ఎన్నో ఘన విజయాలకు, సాధించుకున్న సామాజిక ప్రశాంతతకు భంగం కలిగించడంలో ఉగ్రవాదం పెనుసవాలుగా మారింది. గడచిన రెండువందల ఏళ్ల కాలంలో వివిధ దేశాల్లో పుట్టుకొచ్చిన 400కు పైగా టెర్రర్ గ్రూపుల పైన, అవి రూపాంతరం చెందడం, అంతమవడం పైన సమగ్ర అధ్యయనం చేశారు ప్రొ‘‘ ఆడ్రీ కుర్త్ క్రోనిన్. ప్రస్తుతం ఆమెరికాలోని ‘కార్నెగీ మెలన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటెజీ అండ్ టెక్నాలజీ’ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గత చరిత్రను తవ్వి తీసి ఆమె చేసిన పరిశోధనలో ఉగ్ర భూతాన్ని అంతమొందించడంపై విలువైన సమాచారం ఉంది. ఆమె రాసిన ‘హౌ టెర్రరిజమ్ ఎండ్స్: అండర్స్టాండింగ్ ద డిక్లయిన్ అండ్ డిమైస్ ఆఫ్ టెర్రరిస్ట్ క్యాంపెయిన్స్’ పరిశోధన గ్రంథాన్ని ప్రిన్స్టన్ యూనివర్శిటీ ప్రెస్ 2011లో ప్రచురించింది. ఉగ్రవాద సంస్థలు అంతమయ్యే ఆరు మార్గా లను తన అధ్యయనంలో గుర్తించారామె. అవి:1) ఉగ్ర సంస్థల అగ్రనేతలను భౌతికంగా అంతమొందించడం. 2) సంప్రతింపుల ద్వారా టెర్రరిస్టు గ్రూపు డిమాండ్ల పరిష్కారం. 3) రాజ్యంపై ఉగ్రవాద సంస్థ పైచేయి సాధించడం ద్వారా తానే రాజ్యం కావడం (ఉదా: తాలిబన్ ప్రభుత్వం). 4) అంతర్గత కలహాలతో పతనమవడం. 5) మిలిటరీ దాడులతో చెల్లాచెదురవడం. 6) ఉగ్ర సంస్థ తనకు తానుగా పంథా మార్చుకుని రాజకీయ పార్టీగా అవత రించడం.ఉగ్రవాద నేతల అంతం విషయంలో ఒక పద్ధతి పైస్థాయి నేతలను అడ్డు తొలగించుకోవడం. ఉదా: ఒసామా బిన్ లాడెన్‌ను చంపడం. బిన్ లాడెన్ తర్వాత అల్‌ఖైదాకు నేతృత్వం వహించిన అల్ జవహిరిని కూడా అమెరికా 2022లో కాబూల్‌లో డ్రోన్ దాడితో అంతమొందించింది. ఇదంతా ఉగ్రవాద భూతం తల నరికేయడమన్న మాట!ఇరాన్ ఎజెండాను అమలు చేసే ప్రాక్సీ గ్రూపులు హమాస్, హెజ్బొల్లాలకు చెందిన పలువురు కీలక నేతలను మట్టుబెట్టడం ద్వారా ఇజ్రాయెల్ ఇదే పని చేస్తోంది. ఇంకో ఉదాహరణ మన పొరుగున ఉన్న శ్రీలంకకు చెందిన ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్’ (ఎల్టీటీఈ)! 2009లో వేలుపిళ్లై ప్రభాకరన్ మరణంతో ఒకప్పుడు ఆ దేశం మొత్తాన్ని గడగడ వణికించిన ఉగ్రవాద సంస్థ కాస్తా నిర్వీర్యమైపోయింది. ప్రత్యేక దేశం కోసం పంజాబ్‌లో మొదలైన ‘ఖలిస్తాన్’ ఉగ్రవాదం 1980లో పతాక స్థాయికి చేరిన విషయం అంద రికీ తెలిసిందే. 1984లో స్వర్ణ దేవాలయం నుంచి ఉగ్ర వాదులను ఏరివేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’, ఆ తరువాత 1988లో చేపట్టిన మరో మిలిటరీ చర్య ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థను నిర్మూలించాయి.ఈ మధ్యే సిరియాలో అధికార మార్పిడి జరిగింది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి రష్యాకు పారిపోయాడు. బషర్ వైరి పక్షాలకు అమెరికా, ఇజ్రా యెల్లు పరోక్ష మద్దతునివ్వడం వల్లనే ఇది సాధ్యమైంది. ఈ రెండు దేశాలూ కొన్ని గ్రూపులకు ప్రత్యక్షంగా మరి కొన్నింటికి పరోక్షంగా సాయం చేశాయి. అయితే బషర్ అల్–అసద్ పాలన అంతమై పోవడం కాస్తా ఆ ప్రాంతంలో ఇరాన్ ప్రాభవం తగ్గేందుకు కారణమైంది. ఉగ్రవాద భూతాన్ని ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం అనేందుకు ఇజ్రాయెల్ కోవర్టు ఆపరేషన్లు ఒక నిదర్శనం. ఉగ్రవాదాన్ని అణచివేసే మార్గాల్లో కీలకమైంది చర్చలు. ఉత్తర ఐర్లాండ్‌లో ‘గుడ్‌ఫ్రైడే అగ్రిమెంట్’ కావచ్చు, అఫ్గానిస్తాన్‌లోని ఇటీవలి పరిణామాలు కావచ్చు... ఉగ్రవాద సంస్థలను ప్రభుత్వ పాత్రల్లోకి మార్చే క్రమంలో వచ్చే సంక్లిష్టతలు, సమస్యలకు దర్పణం పడతాయి. అయితే సందర్భాన్ని బట్టి చేపట్టే చర్చల వ్యూహాలు, ప్రణాళికలు వాటి అమలు వంటివి జయాపజయాలను నిర్ణయిస్తూ ఉంటాయి. ఉగ్రవాద సంస్థల లోపల ఉన్న వైరుద్ధ్యాలను గుర్తించడం, ప్రజల మద్దతు లేకుండా చేయడం వంటివి సంస్థ లను విడదీసేందుకు బాగా ఉపయోగపడతాయి. ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేవారు... ఈ అంతర్గత వైరుద్ధ్యాలకు ఆజ్యం పోయగలవారై ఉండాలి. మత విశ్వాసాలే ఇంధనంగా మనుగడ సాగించే ఉగ్ర సంస్థలను కేవలం మిలిటరీ,కౌంటర్ టెర్రరిస్ట్ చర్యలతో సమూలంగా నాశనం చేయలేం. చర్చలు జరపడం, వాటి డిమాండ్లు న్యాయబద్ధమైనవైతే అంగీకరించడం, అది వీలుకాని సందర్భంలో వాటిలో చీలికలు తీసుకువచ్చి బలహీన పర్చడం చేయొచ్చు. డా‘‘ క్రోనిన్ పరిశోధన ప్రకారం... ఉగ్రవాద సంస్థల జీవిత కాలం ఐదు నుంచి పదేళ్లు మాత్రమే. కొన్ని ఇంతకంటే ఎక్కువ కాలం ఉనికిలో ఉండవచ్చు. విధాన రూపకర్తలు ఉగ్రవాద సంస్థల విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవడం మేలని ఆమె సూచి స్తున్నారు. సైబర్ టెర్రరిజమ్, దేశాలు ప్రేరేపించే ఉగ్ర వాదాల వంటి సంక్లిష్ట అంశాల విషయంలో దీని ప్రాధాన్యం మరింత ఎక్కువ.ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్న దేశాలకు డా‘‘ క్రోనిన్ పరిశోధన ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే... ఓపిక, పరిస్థితులకు అనుగుణంగా మార్చు కోవాల్సిన అవసరం, సమస్యను సమగ్రంగా అర్థం చేసు కోవడం కౌంటర్ టెర్రరిజమ్ వ్యూహాల రూపకల్పనలో చాలా కీలకమని ఈ పరిశోధన చెబుతుంది. విధాన రూపకర్తలు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆధునిక రూపం సంతరించుకున్న ఉగ్రవాద భూతానికి పగ్గాలు వేసేందుకు సమర్థమైన చర్యలు చేపట్టాలి. భారీ నెట్‌వర్క్‌లు ఉన్న వాటితోపాటు... వ్యక్తులు కూడా ఉగ్రవాదానికి పాల్పడుతున్న ఈ కాలంలో క్రోనిన్ పరిశోధన ఉగ్రవాదాన్ని పునాదులతోపాటు పెకిలించే వ్యూహానికి విలువైన సూచనలు ఇస్తోంది.బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Amit Shah: త్వరలో ఉగ్రవాద వ్యతిరేక విధానం
న్యూఢిల్లీ: ఉగ్రవాదులను ఏరిపారేయడంతోపాటు వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. త్వరలో జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక విధానం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పటిష్టమైన వ్యూహంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. ఉగ్రవాద నియంత్రణపై గురువారం ఢిల్లీలో జరిగిన సదస్సులో అమిత్ షా మాట్లాడారు. రాష్ట్రాల డీజీపీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా, నిఘా సంస్థల అధినేతలు పాల్గొన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినప్పటికీ, రాష్ట్రాలు భౌతికమైన సరిహద్దులు కలిగి ఉన్నప్పటికీ, రాజ్యాంగపరంగా కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. ఉగ్రవాదానికి అలాంటి సరిహద్దులు, పరిమితులు ఉండవని అమిత్ షా గుర్తుచేశారు. అందుకే ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వ్యూహాలు, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, పరస్పర సమన్వయం వంటి చర్యలు అవసరమని సూచించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కోసం మోడల్ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ (ఏటీఎస్), మోడల్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) తీసుకు రావాలని యోచిస్తు న్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని ఎదిరించడానికి ఇవి ఉమ్మడి వేదికలుగా ఉపయోగపడతాయని పేర్కొ న్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు రానున్న యాంటీ–టెర్రరిజం పాలసీ, స్ట్రాటజీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా సిబ్బంది, పోలీసుల పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. -
S Jaishankar: వివాదాలకు చర్చలే శరణ్యం
కజన్: వివాదాలు, విభేదాలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాల్సిందేనని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పునరుద్ఘాటించారు. యుద్ధాలతో సాధించేదీ ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, ఉద్రిక్తతలు చల్లారాలంటే చర్చలపై తక్షణమే దృష్టి పెట్టాలని సూచించారు. రష్యాలోని కజన్ నగరంలో బ్రిక్స్ ఔట్రీచ్/బ్రిక్స్ ప్లస్ సదస్సులో చివరి రోజు గురువారం జైశంకర్ మాట్లాడారు. ఇది యుద్ధాల శకం కాదంటూ భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. శాంతియుత చర్చలు, దౌత్య మార్గాలపై దృష్టి పెడితే వివాదాలు సమసిపోతాయని పేర్కొన్నారు. దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినప్పుడు వాటిని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు ఎవరైనా సరే లోబడి ఉండాలని, ఎలాంటి మినహాయింపులు ఉండొద్దని తేల్చిచెప్పారు. ప్రపంచానికి ముప్పుగా మారిన ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు. పశి్చమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. దీర్ఘకాలపు సవాళ్లను ఎదిరించే విషయంలో కొత్తగా ఆలోచించడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఐరాస భద్రతా మండలిని సంస్కరించాల్సిందే ప్రపంచీకరణ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందడం లేదని, ఈ నిజాన్ని బ్రిక్స్ వేదిక గుర్తించాలని జైశంకర్ కోరారు. కోవిడ్ మహమ్మారితోపాటు వేర్వేరు సంఘర్షణల కారణంగా గ్లోబల్ సౌత్ దేశాలపై భారం మరింత పెరిగిందన్నారు. వైద్యం, ఆహారం, ఇంధన భద్రత విషయంలో ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సరిసమానమైన ప్రపంచ క్రమం’ అవసరమని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల విషయంలో వివిధ దేశాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని, ఇవి వలసవాద పాలన నుంచి వారసత్వంగా వచ్చాయని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాలను సరి చేయాలన్నారు. సరుకుల సరఫరా కోసం దేశాల మధ్య అనుసంధానం మరింత పెరగాలన్నారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని గౌరవిస్తూ ఆ దిశగా అన్ని దేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి సంస్థలు, అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణలు తక్షణావసరమని జైశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు వెంటనే ప్రారంభించాలని అన్నారు. భద్రతా మండలిలో మరికొన్ని దేశాలకు శాశ్వత సభ్యత్వం కలి్పంచాలని డిమాండ్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్∙సదస్సుకు పదికిపైగా బ్రిక్స్ సభ్యదేశాలతోపాటు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. -
ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదు: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు అమిత్ షా నివాళులర్పించారు.అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదని తెలిపారు.2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించడానికి 36,468 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని అన్నారు. గత ఏడాది కాలంలో దాదాపు 216 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీరి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు.On #PoliceCommemorationDay, laid a wreath at the National Police Memorial and offered my solemn tributes to the martyrs of the nation’s police forces.They have scripted an indelible history of patriotism with their selfless service and supreme sacrifice. Their lives will remain… pic.twitter.com/LihvtR9CiT— Amit Shah (@AmitShah) October 21, 2024 ‘మా పదేళ్ల పాలనలో జమ్ము కశ్మీర్, వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంది. అయినా మా పోరాటాన్ని ఆపం. కశ్మీర్లో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలు, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాము’’ అని షా అన్నారు. కాగా 1959లో లడఖ్‌లో చైనా సైనికులు జరిపిన ఆకస్మిక దాడిలో మరణించిన పోలీసులు, ఇతర అధికారుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. -
S Jaishankar: ఆత్మపరిశీలన చేసుకోండి
ఇస్లామాబాద్: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. పొరుగు దేశంతో సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని పాకిస్తాన్‌కు హితవు పలికారు. పాక్ పట్ల భారత్‌కు విశ్వాసం సడలిపోవడానికి కారణాలేమిటో అన్వేíÙంచాలని సూచించారు. విశ్వాసం బలపడితేనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని తేల్చిచెప్పారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అనే మూడు భూతాలు ప్రాంతీయ సహకారానికి అతిపెద్ద అవరోధాలు అని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు భారత్–పాకిస్తాన్ మధ్య వ్యాపారం, వాణిజ్యం, ఇంధన సరఫరా, ప్రజల మధ్య అనుసంధానాన్ని నిరోధిస్తున్నాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన బుధవారం జరిగిన షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) సభ్యదేశాల కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్(సీహెచ్‌జీ) 32వ సదస్సులో జైశంకర్ మాట్లాడారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమతాన్ని తప్పనిసరిగా గౌరవిస్తేనే సంబంధాలు బలపడతాయని, వ్యాపారం, వాణిజ్యం, అనుసంధానం కొనసాగుతాయని స్పష్టంచేశారు. పరస్పరం గౌరవించుకోవడంపైనే పరస్పర సహకారం అధారపడి ఉంటుందన్నారు. పరస్పర విశ్వాసంతో కలిసికట్టుగా పనిచేస్తే ఎస్సీఓ సభ్యదేశాలు ఎంతగానో లబ్ధి పొందుతాయని సూచించారు. 3 భూతాలపై రాజీలేని పోరాటం చేయాలి ఎస్సీఓ చార్టర్‌కు సభ్యదేశాలన్నీ కట్టుబడి ఉండాలని జైశంకర్ స్పష్టంచేశారు. చార్టర్ పట్ల మన అంకితభావం స్థిరంగా ఉన్నప్పుడే ఆశించిన లక్ష్యాలు సాధించగలమని అన్నారు. ప్రాంతీయంగా అభివృద్ధి జరగాలంటే శాంతి, స్థిరత్వం అవసరమని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదంపై అందరూ రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల ఆవశ్యకతను జైశంకర్ మరోసారి నొక్కిచెప్పారు. భద్రతా మండలిని మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా మార్చాలంటే సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిందేనని వెల్లడించారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితిపై ఎస్సీఓ ఒత్తిడి పెంచాలని కోరారు. అంతకుముందు ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు జిన్నా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న జైశంకర్‌తో పాక్ ప్రధాని షరీఫ్ కరచాలనం చేసి సాదర స్వాగతం పలికారు. -
ఉగ్రవాదానికి చోటు లేదు: నెతన్యాహుతో ఫోన్లో ప్రధాని మోదీ
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాలతో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై నెతన్యాహుతో చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.‘పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడాను. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటులేదు. స్థానికంగా ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు బందీలందరిని సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారత్ కట్టుబడి ఉంది.’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.Spoke to Prime Minister @netanyahu about recent developments in West Asia. Terrorism has no place in our world. It is crucial to prevent regional escalation and ensure the safe release of all hostages. India is committed to supporting efforts for an early restoration of peace and…— Narendra Modi (@narendramodi) September 30, 2024ఇటీవల ఇజ్రాయెల్ లెబనాన్, హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా దాడులు తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లెబనాన్ రాజధాని బీరూట్‌పై జరిపిన దాడిలో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా సహా కీలక కమాండర్లను హతమార్చింది.దాంతో హెజ్బొల్లాలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. మూడు దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాది. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న పెను దాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. -
Amit Shah: ఉగ్రవాదాన్ని పాతిపెడతాం
గులాబ్‌గఢ్/కిష్ట్వార్: మళ్లీ కోలుకోనంతగా ఉగ్రవాదాన్ని బీజేపీ ప్రభుత్వం పాతాళంలోకి పాతిపెట్టనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలోని పెదర్–నగ్సేని నియోజకవర్గ పరిధిలో సోమవారం గులాబ్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ ప్రసంగించారు. ‘‘1990దశకం నుంచి ఉగ్రవాదంతో కష్టాలుపడుతున్న జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఈరోజు మాట ఇస్తున్నా. మళ్లీ ఈ గడ్డపై కనిపించనంత లోతుల్లో ఉగ్రవాదాన్ని మా ప్రభుత్వం పాతిపెడుతుంది. ఇక్కడ తమ ప్రభుత్వం ఏర్పాటైతే జైళ్ల నుంచి ఉగ్రవాదులను విడుదలచేస్తామని నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) కాంగ్రెస్ పార్టీలు హామీ ఇచ్చాయి. మచియాల్ మాత సాక్షిగా చెబుతున్నా. భారతగడ్డపై ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసే సాహసం ఇంకెవ్వరూ చేయరు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు గ్రామ రక్షణ గార్డులు, స్పెషల్ పోలీస్ అధికారులకు పాతరకం .303 రైఫిళ్ల స్థానంలో అధునాతన ఆయుధాలిచ్చాం. ఎక్కడి నుంచైనా ఇక్కడికి ఉగ్రవాదులొస్తే వారి కథ ఇక్కడి మంచుకొండల్లో ముగిసిపోతుంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా ఎన్సీ, కాంగ్రెస్‌లపై అమిత్ విమర్శలుచేశారు. ‘‘ డోగ్రాల చివరి రాజు మహారాజా హరిసింగ్‌ను వీళ్లు అవమానించారు. కశ్మీరీ పండిట్లు బలవంతంగా వెళ్లిపోవడానికి కారణం వీళ్లే. వీళ్లు మహిళ హక్కులను లాగేసుకున్నారు. అవసరమైన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా చేశారు’’ అని ఆరోపించారు. ‘‘ రువ్వేందుకు రాళ్లు పట్టుకున్న యువతకు జైళ్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ల్యాప్‌టాప్‌లు, త్రివర్ణపతాకం పట్టుకున్న యువతకు ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి’ అని షా అన్నారు. రాహుల్ కశ్మీర్లో ఐస్‌క్రీమ్ తినొచ్చురామ్బాన్లో జరిగిన ర్యాలీలోనూ అమిత్ మాట్లాడారు. ‘‘ కశ్మీర్‌ను ఎన్డీఏ సర్కార్ సురక్షితమైన ప్రాంతంగా మార్చేసింది. అయితే ఇటీవల రాహుల్ ఇక్కడి కొచ్చి లాల్‌చౌక్‌లో ఐస్‌క్రీమ్ తిన్నారు. బైక్ నడిపారు. పైగా మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారు. రాహుల్ బాబా.. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారుగానీ ఇంతటి రక్షణ వాతావరణం మా వల్లే సాధ్యమైంది. మీ ప్రభుత్వాల్లో ఇది అసాధ్యం’’ అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో హోం మంత్రిగా ఉండి కూడా లాల్‌చౌక్ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయపడేవాడినని కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలను అమిత్ గుర్తుచేశారు. ‘‘ షిండే గారూ.. ఇప్పుడు పిల్లాజెల్లాతో వచ్చేయండి. ఎంచక్కా లాల్‌చౌక్‌లో వాకింగ్ చేయండి. మీకు హాని చేసేందుకు ఎవరూ సాహసించరు’’ అని అమిత్ అన్నారు. -
వారసత్వ రాజకీయాలే పెనుశాపం
జమ్మూ: జమ్మూకశ్మిర్‌లో ఉగ్రవాదం చివరి శ్వాస పీల్చుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రకృతి సౌందర్యానికి మారుపేరైన జమ్మూకశ్మిర్‌ను ఇక్కడి వారసత్వ రాజకీయాలు దారుణంగా దెబ్బతీశాయని, పెనుశాపంగా మారి ప్రజల భవిష్యత్తును నాశనం చేశాయని మండిపడ్డారు. వారసత్వ రాజకీయ పారీ్టలు సొంత బిడ్డల సంక్షేమమే తప్ప ప్రజల బాగోగులు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. నూతన నాయకత్వాన్ని పైకి ఎదగనివ్వలేదని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలకు పోటీగా నూతన నాయకత్వాన్ని ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. 2014లో తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే ఇక్కడ నాయకత్వ నిర్మాణంపై దృష్టి పెట్టామన్నారు. శనివారం జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో భారీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అద్భుతమైన మెజారీ్టతో గెలిపించాలని ప్రజలను కోరారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ లాంటి పారీ్టలు మళ్లీ అధికారంలోకి వస్తే అధోగతేనని తేలి్చచెప్పారు. జమ్మూకశ్మిర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చనప్పుటి నుంచి జమ్మూకశ్మిర్ విదేశీ శక్తులకు టార్గెట్‌గా మారిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈ ప్రాంత భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయని స్పష్టంచేశారు. గత నాలుగు దశాబ్దాల్లో దోడా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం. సభలో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... యువ నాయకత్వానికి పెద్దపీట వేశాం ‘‘ఉగ్రవాద భూతం వల్ల జమ్మూకశ్మిర్ యు వత తీవ్రంగా నష్టపోయారు. ఇక్క డ అధికారం వెలగబెట్టిన పారీ్టలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ కుటుంబ స్వామ్యాన్ని పెంచి పోషించాయి. యు వతను రాజకీయాల్లో ప్రోత్సహించలే దు. 2000 సంవత్సరం నుంచి పంచా యతీ ఎన్నికలు నిర్వహించలేదు. 2014 తర్వాత బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్, జిల్లా డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరగలేదు. మేము అధికారంలోకి వ చ్చాక ఆయా ఎన్నికలు నిర్వహించాం. యువ నాయకత్వానికి పెద్దపీట వేశాం. వెండితెరపై మళ్లీ జమ్మూకశ్మిర్ అందాలు ఉగ్రవాద బాధితురాలు షగున్ పరిహర్కు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ కేటాయించాం. ఉగ్రవాదాన్ని పూర్తిగా పెకిలించాలన్న మా అంకితభావానికి ఇదొక ఉదాహరణ. 2018 నవంబర్‌లో షగున్ తండ్రిని, బంధువును ఉగ్రవాదులు కాలి్చచంపారు. జమ్మూకశ్మిర్‌ను ఉగ్రవాద రహితంగా, పర్యాటకుల స్వర్గధామంగా మార్చాలన్నదే మా లక్ష్యం. అంతర్జాతీయ సినిమా షూటింగ్‌లు ఇక్కడ జరిగే పరిస్థితి రావాలి. వెండితెరపై జమ్మూకశ్మీర్ అందాలు మళ్లీ కనిపించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆరి్టకల్ 370ను మళ్లీ తీసుకొస్తారట! కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ హామీల మధ్య తేడాలను ప్రజలు గమనించాలి. ఆరి్టకల్ 370ను మళ్లీ తీసుకొస్తామని ఆ మూడు పారీ్టలు చెబుతున్నాయి. అంటే ప్రజల హక్కులను మళ్లీ దోచుకుంటారట! రిజర్వేషన్లు, ఓటు హక్కును రద్దు చేస్తారట! ఆర్టికల్ 370తోపాటు ఆరి్టకల్ 35ఏ పునరుద్ధరిస్తే ఆడబిడ్డలను తీరని అన్యాయం జరుగుతుంది. మూడు పార్టీల మేనిఫెస్టో అమల్లోకి వస్తే పాఠశాలలు మళ్లీ అగి్నకి ఆహూతవుతాయి. బీజేపీ నేతలను అరెస్టు చేయడమే కాంగ్రెస్ ఎజెండానా? కాంగ్రెస్ పారీ్టకి ఏమాత్రం నిజాయతీ లేదు. అధికారంలోకి రావడానికి అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడం ఆ పారీ్టకి అలవాటే. అమెరికాలో భారతీయ జర్నలిస్టుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నోరువిప్పుతారా? అని శామ్ పిట్రోడాను ప్రశ్నించింనందుకు గదిలో బంధించి దారుణంగా కొట్టారు. ఇలా చేయడం మన దేశ గౌరవాన్ని పెంచుతుందా? కాంగ్రెస్ రాజకుటుంబం అత్యంత అవినీతిమయమైన కుటుంబం. వారసత్వ రాజకీయాలు చేస్తున్న ఆ కుటుంబం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మరో 20 సీట్లు వచ్చి ఉంటే బీజేపీ నేతలను జైలుకు పంపించేవాళ్లమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అంటే వారి ఎజెండా అదేనా? మమ్మల్ని జైల్లో పెట్టడానికే కాంగ్రెస్‌కు అధికారం కావాలా? ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అక్కర్లేదా?’’ అని ప్రశ్నించారు. -
పీఓకే ప్రజలారా.. భారత్‌లో కలవండి
జమ్మూ/బనిహాల్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రామ్‌బాన్ నియోజకవర్గంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘‘ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి యువత పిస్టల్, రివాల్వర్ పట్టుకోవడం వదిలేసి ల్యాప్‌టాప్ పట్టుకుంటున్నారు. కంప్యూటర్లు వినియోగిస్తున్నారు. బీజేపీకి మద్దతు పలికితే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఇక్కడ మరింత అభివృద్ధిని సాకారం చేస్తాం. ఇక్కడి అభివృద్ధిని చూసి పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రజలు సైతం భారత్‌తో కలిసిపోతే బాగుంటుంది అని ఖచ్చితంగా అనుకుంటారు. నాదీ గ్యారెంటీ’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పీఓకే ప్రజలను భారత్‌లో విలీనానికి పిలుపునిచ్చారు. ‘‘ పీఓకే ప్రజలకు నేను చెప్పేదొకటే. పాకిస్తాన్ మిమ్మల్ని విదేశీయుల్లా భావిస్తోంది. పాక్ ప్రభుత్వం స్వయంగా ఈ విషయం ఒప్పుకుందికూడా. ఇటీవల పాక్ అదనపు సొలిసిటర్ జనరల్ ఒక విషయంలో సమర్పించిన అఫిడవిట్లో పీఓకే అనేది ఎప్పటికీ పాక్‌కు విదేశీ భూభాగమే అని స్పష్టంగా పేర్కొన్నారు. మిమ్మల్ని భారత్ తన సొంత మనుషుల్లా చూసుకుంటుంది. అందుకే రండి. మాతో కలవండి’’ అని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఆపేస్తే చర్చలకు సిద్ధంజమ్మూకశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోయడం పూర్తిగా ఆపేస్తే ఆ దేశంతో చర్చలకు భారత్ సిద్ధమని రాజ్‌నాథ్ ప్రకటించారు. ‘‘ ఉగ్రవాదానికి మద్దతు పలకడం అనే చెడ్డపనిని పాక్ ఆపేయాలి. పొరుగు దేశాలతో సత్సంబంధాల మెరుగు కోసం ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మనం మన మిత్రుడిని మార్చుకోగలంగానీ పొరుగు దేశాన్ని కాదుకదా. పాక్‌తో బంధం బలపడాలనే కోరుకుంటున్నాం. ముందుగా పాక్ ఉగ్రవాదాన్ని వీడాలి. ఉగ్రవాదాన్ని కశ్మీర్లో ఆపినప్పుడే చర్చలు పట్టాలెక్కుతాయి. ఇక్కడ ఉగ్రవాదం కోరల్లో చిక్కుకున్న వారిలో 85 శాతం మంది ముస్లింలే ఉన్నారు. ఉగ్రఘటనల్లో ముస్లింలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఉగ్రవాదం బాటలో పయనించి ప్రాణాలు పోగొట్టుకోకండి’’ అని రాజ్‌నాథ్ హితవు పలికారు. -
PM Narendra Modi: యుద్ధాలకు సమయం కాదిది
వియన్నా: ప్రపంచం ఇప్పటికే అనేకానేక సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఇది యుద్ధాలకు సమయం కాదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రెండు రోజుల ఆ్రస్టియా పర్యటనలో భాగంగా ఆ దేశ చాన్సలర్ కార్ల్ నెహమర్‌తో బుధవారం ఆయన భేటీ అయ్యారు. పశి్చమాసియా సంక్షోభంతో పాటు ఉక్రెయిన్ యుద్ధం తదితరాలపై నేతలిద్దరూ లోతుగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని, అందుకోసం మైలిక సదుపాయాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇన్నొవేషన్లు, నీటి–వ్యర్థాల నిర్వహణ వంటి అన్ని రంగాల్లోనూ అవకాశాలనూ మరింతగా అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. శాంతియుత వాతావరణంలో చర్చలే యుద్ధాలకు ఏకైక పరిష్కారమమని పేర్కొన్నారు. అందుకు అన్నివిధాలా సహకరించేందుకు ఇరు దేశాలూ సిద్ధమని ప్రకటించారు. ఔరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సమకాలీన అవసరాలకు తగ్గట్టుగా సంస్కరణలు అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు మొదలుకుని ఉగ్రవాదం దాకా అన్ని అంశాలపైనా చర్చించినట్టు వివరించారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తుల నిర్వహణ మౌలిక సదుపాయాల కూటమి, జీవ ఇంధన కూటమి తదితరాల్లో భాగస్వామి కావాలని ఆ్రస్టియాను మోదీ ఈ సందర్భంగా ఆహా్వనించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ పాత్ర కీలకమని నెహమర్ అభిప్రాయపడ్డారు. గార్డాఫ్ ఆనర్ భారత ప్రధాని ఆ్రస్టియాలో పర్యటించడం 41 ఏళ్ల అనంతరం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బుధవారం మోదీకి వియన్నాలో గార్డాఫ్ ఆనర్ లభించింది. స్థానిక కళాకారులు వందేమాతరం ఆలపించారు. మోదీని నెహమర్ ఆలింగనం చేసుకున్నారు. ఆయనతో సెల్ఫీ తీసుకుంటూ సందడి చేశారు. ఆ ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మోదీ జీ! వియన్నాకు స్వాగతం’ అని పేర్కొన్నారు. అంతకుముందు నేతలిద్దరూ పలు అంశాలపై చాలాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నారు.సీఈవోలతో భేటీభారత్లో ఇన్ఫ్రా, ఇంధన, టెక్నాలజీ తదితర రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆ్రస్టియా కంపెనీలను మోదీ ఆహ్వానించారు. స్థానిక హాఫ్బర్గ్ ప్యాలెస్‌లో ఆ్రస్టియా, ఇండియా సీఈఓల రౌండ్‌టేబుల్ భేటీలో మోదీ, నెహమర్ పాల్గొన్నారు. ఇరు దేశాల నడుమ 2023లో 293 కోట్ల డాలర్ల మేర వర్తకం జరిగింది.అధ్యక్షునితో భేటీ ఆ్రస్టియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండెర్ బెలన్తో మోదీ భేటీ అయ్యారు. పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారంపై లోతుగా చర్చించుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తమ భేటీ అద్భుతంగా జరిగిందన్నారు. -
ఆ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే!
కశ్మీర్ వేర్పాటు వాదుల తీవ్రవాద చర్యలను సమర్థిస్తూ, భారత సైన్యంపై విషం కక్కుతూ ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యలు 14 సంవత్సరాల క్రిందటివి. 2010 అక్టోబర్ 21న దేశ రాజధాని నగరం ఢిల్లీలో ‘ఆజాది ఓన్లీ ద వే’ అనే అంశంపై కశ్మీరీ వేర్పాటు వాదులు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కశ్మీర్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్, రచయిత్రి అరుంధతీ రాయ్ భారత సైన్యానికీ, భారత ప్రభుత్వానికీ వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్ర పరిధిని అతిక్రమించాయనే చెప్పాలి. దేశభద్రతపై ఆ వ్యాఖ్యలు చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సామాజిక కార్యకర్త సుశీల్ పండిట్ ఫిర్యాదు మేరకు ‘ఉపా’ కింద 2010 అక్టోబర్ 28న ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. లౌకికవాద ముసుగు వేసుకున్న కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు కశ్మీర్ వేర్పాటువాదుల వాదనలకు వ్యతిరేకంగా విచారణ చేస్తే... ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బ తింటుందో అనే భీతితో ఆ కేసును తొక్కి పట్టారు. వాస్తవంగా దేశ భద్రతతో ముడిపడిన ఈ విషయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచే కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించి ఉండాలి. 14 ఏళ్లు ఆ కేసుపై విచారణ జరగకుండా తాత్సారం చేయడం దేశాన్ని ప్రేమించే వాళ్లకు మాత్రమే ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశ భద్రత విషయంలో కఠిన వైఖరి అవలంబించే మోదీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఈ కేసును విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేయడానికి కారణాలనూ దేశ ప్రజలకు వివరించవలసిన బాధ్యత మూడోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలదే! అనూహ్యంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ కేసు ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. దేశానికి వ్యతిరేకంగా, దేశ భద్రతకు సవాల్‌గా మారిన తీవ్రవాదులకు అనుకూలంగా గళం విప్పిన వాళ్ళ పని పట్టడానికి మూడోసారి అధికారంలో కూర్చున్న మోదీ∙ప్రభుత్వం చురుకుగా పని చేస్తుందని ముందస్తు సమాచారం ఇవ్వడంలో భాగంగానే ఈ ‘ఉపా’ కేసును తెరపైకి తెచ్చేలా కేంద్రం చేసిందా అనే అనుమానం దేశ ప్రజలకు కలగక మానదు.‘ఆజాదీ ఓన్లీ ద వే’ కాన్ఫరెన్స్‌లో అరుంధతీ రాయ్ మాట్లాడిన మాటలను, ఆమె ఉద్దేశాలను ఈ దేశ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఎవరిది? కశ్మీర్ స్వతంత్ర దేశమనీ, దాన్ని భారత ప్రభుత్వం దౌర్జన్యంగా ఆక్రమించిందనీ, కశ్మీర్ ప్రజలు స్వతంత్రంగా బతికే హక్కు ఉందనీ, ఈ హక్కు కోసం భారత సైన్యంతో పోరాడే కశ్మీరు వేర్పాటు వాదులు తన సోదరులనీ, ఈ పోరాటంలో భారత సైన్యానికి ఎదురొడ్డి నిలవడం సమర్థనీయమనీ ఆమె చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలకు తెలియనీయకుండా కనుమరుగు చేసింది ఎవరు?స్వాతంత్య్రానంతరం 562 సంస్థానాలు భారతదేశంలో విలీనమైనట్లే జమ్మూ–కశ్మీర్ సంస్థానం రాజు ‘రాజా హరి సింగ్’ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని, జమ్మూ–కశ్మీర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. నిజానికి పాకిస్తానే 1948లో కశ్మీర్లో మూడో వంతును ఆక్రమించింది. దాన్ని ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అని పిలుస్తున్నారు. అప్పటి నుంచి కశ్మీర్లో పాక్ వెన్నుదన్నుతో తీవ్రవాదులు చేసిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి పీల్చుతూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం ముక్కలు కావాలని ఎవరు కోరినా క్షమించరాని నేరమే అవుతుంది. – ఉల్లి బాలరంగయ్య, సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
ఉగ్రవాదం అంతానికి పాక్ ప్రధాని పిలుపు
ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్తాన్ పిలుపునిచ్చింది. దేశంలో తాలిబాన్ సహకారంతో పెరిగిపోతున్న ఉగ్రవాదంపై పోరుసాగించడం సమిష్టి బాధ్యత అని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఎసీ) అపెక్స్ కమిటీ సమావేశానికి ప్రధాని షరీఫ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు సాగించడం అందరి కర్తవ్యమని, దేశంలోని అన్ని సంస్థల ప్రాథమిక బాధ్యత అని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో అన్ని ప్రావిన్సులు తమ పాత్ర పోషించాలని కోరారు. గత రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ తీవ్రస్థాయిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, నేరాలు, డ్రగ్స్, స్మగ్లింగ్ మొదలైనవాటితో ఉగ్రవాదం ముడిపడి ఉన్నదని, అందుకే దీనిని అంతం చేయడం సంక్లిష్టంగా మారిందన్నారు.2014, డిసెంబర్ 16న పాక్‌లోని పెషావర్ స్కూల్‌పై దాడి తర్వాత ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి 20 పాయింట్ల ఎన్ఏపీ ఎజెండాను ప్రభుత్వం ఆమోదించింది. ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి సమ్మతి తెలిపాయి. కాగా సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ విడుదల చేసిన వార్షిక భద్రతా నివేదికలోని వివరాల ప్రకారం 2023లో పాకిస్తాన్లో జరిగిన 789 ఉగ్రవాద దాడులు, కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో 1,524 మంది మృతి చెందారు. 1,463 మంది గాయపడ్డారు. -
22 మంది అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సుమారు 22 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. పట్టుబడిన ఉగ్రవాదులు ఐఎస్ఐఎస్, టీటీపీతో పాటు ఇతర నిషేధిత సంస్థలకు చెందినట్లు గుర్తించారు.కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ శాఖ ఇచ్చిన సమాచారం ఆధారంగా పంజాబ్‌లోని వేర్వేరు జిల్లాల్లో సుమారు 152 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఐఎస్ఐఎస్, తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, లష్కరే ఈ జాంగ్వీ గ్రూపులకు చెందిన 22 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు చెప్పారు.లాహోర్, అటాక్, షేక్‌పురా, ముజాఫర్ఘర్, నాన్కానా సాహిబ్, బవల్పుర్, డీజీ ఖాన్, ఫైసలాబాద్, ముల్తాన్, భవాల్నగర్, రావల్పిండి నుంచి వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల వద్ద నుంచి 1645 గ్రామాలు పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రానేడ్లు, ఒక ఐఈడీ బాంబు, 12 డెటోనేటర్లు, పిస్తోల్, నిషేధిత సాహిత్యాన్ని సీజ్ చేశారు. అనుమానిత ఉగ్రవాదులు పంజాబ్‌లో అఘాయిత్యానికి ప్లాన్ వేశారు, రాష్ట్రంలో ఉన్న కీలక ప్రదేశాలను, వ్యక్తులను టార్గెట్ చేయాలని భావించారు.1,645 గ్రాముల బరువున్న పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక ఐఈడీ బాంబు, 12 డిటోనేటర్లు, 32 అడుగుల సేఫ్టీ ఫ్యూజ్ వైర్, ఒక పిస్టల్, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
Amit Shah: కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణచివేయండి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణచివేయడం ద్వారా ఒక కొత్త ఒరవడి సృష్టించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. జమ్మూకశీ్మర్‌లో ఇటీవల వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి, పలువురు ముష్కరులతోపాటు భద్రతా సిబ్బంది సైతం మరణించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ఆదివారం భద్రతా దళాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయాలని ఆదేశించారు. కశీ్మర్ లోయలో చేపట్టిన జీరో–టెర్రర్ ప్రణాళికలతో మంచి ఫలితాలు వచ్చాయని, జమ్మూ డివిజన్లో సైతం అమలు చేయాలని సూచించారు. ఈ నెల 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు పటిష్టమైన భద్రత కలి్పంచాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని అమిత్ షా ఆదేశించారు. యాత్ర విషయంలో అధికారుల సన్నద్ధతను సమీక్షించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకశీ్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, సీఆర్పీఎఫ్ డీజీ అనీ‹Ùదయాళ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల క్రితం సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో ఇకపై ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఉగ్రవాదం అంతానికి అమిత్‌షా ఉన్నత స్థాయి భేటీ
ఇటీవల జమ్మూలో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలు, అమర్నాథ్ యాత్రలో రక్షణ చర్యలపై సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు(ఆదివారం) ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులు జమ్మూ కశ్మీర్లో ప్రస్తుతమున్న భద్రతా పరిస్థితి, ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్న తీరును హోం మంత్రికి వివరించనున్నారు. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దీనికిముందు అమిత్ షా జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితిని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో సమీక్షించారు.జమ్మూకశ్మీర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడులపై షా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రియాసి, కథువా, దోడాలోని నాలుగు ప్రదేశాల్లో ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఒక సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికుడు వీరమరణం పొందారు. ఒక పౌరునితో పాటు ఏడుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. -
Narendra Modi: ఉగ్రనిరోధక సామర్థ్యాలను పెంచండి
న్యూఢిల్లీ/జమ్మూ: ఉగ్రవాదం పీచమణిచేలా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రనిరోధక సామర్థ్యాలను మరింతగా పెంచాలని పాలనా యంత్రాంగానికి ప్రధాని మోదీ సూచించారు. యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి, చెక్‌పోస్ట్‌పై మెరుపుదాడి వంటి ఉదంతాలు మళ్లీ పెచ్చరిల్లిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితిపై ప్రధాని మోదీ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదనపు భద్రతా బలగాల మొహరింపుతోపాటు ఉగ్రనిరోధక వ్యవస్థలను క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిస్థితిపై వివరాలను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను మోదీ అడిగి తెల్సుకున్నారు. స్థానిక యంత్రాంగంతో ఏ విధంగా వ్యూహాలను అమలుచేస్తున్నారో సిన్హా మోదీకి వివరించారు. జీ7 సదస్సు కోసం ఇటలీకి మోదీఇటలీలో నేటి నుంచి జరగబోయే జీ7 శిఖరాగ్ర సదస్సులో కృత్రిమ మేథ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంత సమస్యలపైనే దృష్టిసారించే అవకాశం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సదస్సులో పాల్గొనేందుకు మోదీ గురువారం ఇటలీకి బయల్దేరి వెళ్లారు. ‘గ్లోబల్ సౌత్’ దేశాల సమస్యలపైనా ప్రధానంగా చర్చ జరగొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇటలీలోని అపూలియో ప్రాంతంలోని విలాసవంత బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు నేటి నుంచి 15వ తేదీదాకా జరగనుంది. -
Amit Shah: ‘ఉగ్ర’ సంబందీకులకు ఉద్యోగాలు రావు
న్యూఢిల్లీ: కశ్మీర్‌పై కమ్ముకున్న ‘ఉగ్ర’ మబ్బులను చెల్లాచెదురు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ‘‘కశ్మీర్లో ఎవరైనా ఉగ్రవాద సంస్థల్లో చేరితే వారి కుటుంబసభ్యులు ఎన్నటికీ ప్రభుత్వోద్యోగాన్ని పొందలేరు. రాళ్లు రువ్వే ఘటనల్లో పాల్గొనే వ్యక్తుల కుటుంబాలకూ ఇదే వర్తిస్తుంది. అయితే అలాంటి వారి గురించి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వెల్లడించే కుటుంబానికి మినహాయింపు దక్కుతుంది. ఉగ్రవాదుల మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగిస్తే అంతిమయాత్రకు అనవసర ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే ఆ ట్రెండ్‌కు ఫుల్స్టాప్ పెట్టాం. కేవలం కుటుంబసభ్యులు, ఆప్తుల సమక్షంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినప్పుడు లొంగిపోవడానికి చాన్సిస్తాం. తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో చెప్పిస్తాం. వింటే సరేసరి. లేదంటే ప్రాణాలు పోవడం ఖాయం. కేరళలో పురుడుపోసుకున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియావంటి ముస్లిం అతివాద సంస్థలను నిషేధించి వేర్పాటువాద సిద్దాంతాల వ్యాప్తిని అడ్డుకుంటున్నాం’’ అని చెప్పారు. -
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అమెరికా స్పందన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఉగ్రవాదులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఉగ్రవాదులను హతమార్చేందుకు సరిహద్దులు దాటేందుకు భారత్ వెనుకాబోదని మోదీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ బుధవారం స్పందించారు. ‘ఈ విషయంలో ఇప్పటికే ఒకసారి స్పష్టత ఇచ్చాను. అమెరికా ఈ విషయంలో అస్సలు జోక్యం చేసుకోదు. కానీ భారత్, పాకిస్తాన్ దేశాలు సమరస్యంగా చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్యలు తీసుకోవాలి’ అని మిల్లర్ అన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు భారతదేశంలో చాలా దృఢమైన ప్రభుత్వం ఉంది. ప్రధాని మోదీ ప్రభుత్వంలో సరిహద్దులు దాటి ఉగ్రవాదులను వారి ఇళ్ల వద్ద హతమార్చడానికి కూడా వెనకాడబోము’ అని అన్నారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘భారత దేశంలోని శాంతికి భంగం కల్గిస్తే.. ఉగ్రవాదలు పాకిస్తాన్లో ఉన్నా అంతం చేస్తాం’ అని అన్నారు. మరోవైపు రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది.‘భారత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది’ అని పేర్కొంది. అంతకుముందు.. పాకిస్తాన్లో ఉగ్రవాదల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని బ్రిటన్‌కు చెందిన దీ గార్డియన్ పత్రిక ఓ నివేదిక విడుదల చేసింది. 2019 పుల్వావా దాడుల అనంతరం విదేశాల్లో ఉండే ఉగ్రవాదులను హతమార్చే విధానాలను భారత్ పాటిస్తోందని పేర్కొంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత విదేశి ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ సుమారు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపణలు చేసింది. భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారాలు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఈ నివేదిక వెల్లడించామని గార్డియన్ పత్రిక పేర్కొనటం గమనార్హం. -
మోదీవి ‘పర్ఫార్మెన్స్ పాలిటిక్స్’: అమిత్ షా
భోపాల్: కులం, అవినీతి, బుజ్జగింపు, వారసత్వ రాజకీయాలకు ప్రధాని మోదీ ముగింపు పలికారని, పనితీరు ఆధారిత రాజకీయాలతో భారత దేశ ప్రతిష్టను పెంచారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేళ్లూనుకుపోయిన మావోయిజం, ఉగ్రవాదం, తీవ్రవాదం ముగింపు దశకు చేరుకున్నాయని చెప్పారు. గత ప్రభుత్వాలతో మోదీ పాలనను పోల్చి విశ్లేíÙంచుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఆదివారం ఆయన మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. గ్వాలియర్, ఖజురహోల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. ‘‘పాండవులు, కౌరవుల మధ్య పోరు జరుగుతోంది. మోదీ సారథ్యంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని భావించే దేశభక్తుల గ్రూపు ఒకటి కాగా, వారసత్వ రాజకీయాలను పెంచిపోíÙస్తున్న గ్రూపు మరోటి’’ అన్నారు. -
ఆత్మ రక్షణ కోసమే ఆ దాడులు: భారత్ భిన్న స్వరం
ఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులపై భారత్ స్పందించింది. అది ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశమని చెబుతూనే.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, ఆ రెండు దేశాల చర్యలు స్వీయరక్షణలో భాగమై ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇది ఇరాన్, పాక్‌కు సంబంధించిన అంశం. భారతదేశానికి సంబంధించినంతవరకు.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోం. అయితే.. ఆ రెండు దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను మేము అర్థం చేసుకున్నాం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాకు తెలిపారు. ఇరాక్, సిరియా సరిహద్దుల్లో క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్.. ఆ మరుసటి రోజే పాక్ భూభాగంపై దాడులు జరిపింది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు ఈ క్షిపణి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇరాన్‌ను తప్పుబడుతున్నాయి. అయితే భారత్ మాత్రం ఇలా భిన్న స్వరం వినిపించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. జైష్ అల్ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకునే బెలూచిస్థాన్‌లోని ఆ సంస్థ స్థావరాలపై డ్రోన్స్, మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు ఇరాన్ చెబుతోంది. కిందటి నెలలో15వ తేదీన ఇరాన్ సిస్తాన్-బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌పై జైష్ అల్ విరుచుకుపడింది. ఈ దాడిలో 11 మంది పోలీసులు మరణించారు. ప్రతీకారంగానే ఆ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఈ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించినట్లు స్పష్టం అవుతోంది. ‘‘పొరుగు దేశం పాక్ మాకు ఎప్పటికీ మిత్రదేశమే. ఆ దేశ సార్వభౌమత్వాన్ని మేం గౌరవిస్తాం. అలాగని.. మా దేశ భద్రత విషయంలో మాత్రం రాజీపడబోం. కేవలం పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల్నే మేం లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాం అని ఇరాన్ రక్షణ విభాగం ప్రకటించింది. మరోవైపు పాక్ మాత్రం ఆ దాడులపై తీవ్రంగా స్పందించింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు మరణించారని ప్రకటించి.. ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇరాన్ దౌత్యవేత్తను బహిష్కరించిన పాక్.. తెహ్రాన్(ఇరాన్ రాజధాని)లోని తమ రాయబారిని వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. -
ఎవరీ ఎర్రసముద్రపు హౌతీలు!
ఎర్రసముద్రం కొంతకాలంగా అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ దన్నుతో హౌతీ ఉగ్రవాద ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలపై విచ్చలవిడి దాడులతో బెంబేలెత్తిస్తున్నాయి. యెమన్‌లో అత్యధిక భాగాన్ని నియంత్రిస్తున్న ఈ ఉగ్రవాద ముఠా సముద్ర దాడులు అంతర్జాతీయ సమాజానికి పెను సవాలుగా మారాయి. ఒకవిధంగా అంతర్జాతీయ వర్తకమే తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇంతకూ ఎవరీ హౌతీలు? వీళ్లెందుకిలా ఉన్నట్టుండి సముద్ర సవాళ్లకు దిగినట్టు...? – సాక్షి, నేషనల్ డెస్క్ గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి కనీవినీ ఎరగని రీతిలో బీభత్సం సృష్టించడం తెలిసిందే. అందుకు ప్రతీకారంగా హమాస్ నిర్మూలనే లక్ష్యంగా పాలస్తీనాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ తెర తీసింది. హమాస్‌కు దన్నుగా హౌతీల ఆగడాలు అప్పటినుంచే పెచ్చరిల్లాయి. ఇజ్రాయెల్ వైపు ప్రయాణిస్తున్న ప్రతి నౌకనూ లక్ష్యం చేసుకుంటామని హౌతీలు హెచ్చరించారు. కానీ వాస్తవానికి ఇజ్రాయెల్‌తో ఏ సంబంధమూ లేని నౌకలను కూడా వదిలిపెట్టడం లేదు. కొద్ది రోజులుగానైతే కనిపించిన నౌక మీదల్లా విచ్చలవిడిగా దాడులకు దిగుతూ కల్లోలం సృష్టిస్తున్నారు. సమీపంలోని నౌకలపై డ్రోన్లు, సుదూరాల్లో ఉన్నవాటిపై ఏకంగా బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగిస్తూ గుబులు రేపుతున్నారు. గత నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎర్రసముద్రంపై నౌకలపై హౌతీల దాడులు ఏకంగా 500 శాతం పెరిగిపోయాయి! వీటికి ఇరాన్ సహకారం కూడా పుష్కలంగా ఉందని అమెరికా ఆరోపిస్తోంది. మిత్ర రాజ్యాలతో కలిసి హౌతీల స్థావరాలపై కొద్ది రోజులుగా అమెరికా పెద్దపెట్టున క్షిపణి దాడులకు దిగుతోంది. యెమన్ సాయుధ ముఠా..! హౌతీలు యెమన్‌కు చెందిన సాయుధ ముఠా. 1990ల్లో నాటి దేశాధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలే అవినీతిని ఎదిరించేందుకంటూ పుట్టుకొచ్చారు. అక్కడి షియా ముస్లిం మైనారిటీల్లో జైదీలనే ఉప తెగకు చెందినవారు. వీరి ఉద్యమ వ్యవస్థాపక నేత హుసేన్ అల్ హౌతీ పేరిట ఆ పేరు వచ్చింది. ఈ ముఠాను తొలుత అన్సర్ అల్లా (దేవ పక్షపాతులు)గా పిలిచేవారు... హౌతీలను అణచేసేందుకు సౌదీ అరేబియా సాయంతో సలే 2003లో విఫలయత్నం చేశాడు. యెమెన్ ప్రభుత్వంపై 2014 నుంచీ వీళ్లు తీవ్ర స్థాయిలో పోరాడుతున్నారు. ఫలితంగా పదేళ్లుగా దేశం అంతర్యుద్ధంతో అట్టుడికిపోతోంది. సౌదీ, యూఏఈ, ఇతర అరబ్ దేశాలన్నీ యెమన్ ప్రభుత్వానికి దన్నుగా ఉన్నా హౌతీలు ఎదిరించి నిలుస్తున్నారు. ఈ పోరాటంలో ఇప్పటికే ఏకంగా 3.5 లక్షల మంది దాకా బలైనట్టు అంచనా! అల్లర్లకు తాళలేక అర కోటి మందికి పైగా పొట్ట చేత పట్టుకుని యెమన్ నుంచి వలస బాట పట్టారని ఐరాస పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్, పాలస్తీనా, హెబ్జొల్లా గ్రూపు తదితరాలతో కలిసి ‘ప్రతిఘటన శక్తులు’గా హౌతీలు తమను తాము చెప్పుకుంటారు. వీరికి లెబనాన్‌కు చెందిన హెబ్జొల్లా గ్రూపు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అది వీరికి 2014 నుంచీ ఆయుధాలను, పూర్తిస్థాయి సాయుధ శిక్షణను అందిస్తూ వస్తోంది. ఇరాన్ కూడా హౌతీలకు పూర్తిగా దన్నుగా నిలుస్తోందని చెబుతారు. ముఖ్యంగా వారికి బాలిస్టిక్ మిసైళ్లను సమకూర్చింది ఇరానేనని అమెరికా రక్షణ శాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి. 2019లో తమ చమురు క్షేత్రాలపై దాడులకు హౌతీలు వాడిన డ్రోన్లు, క్షిపణులను కూడా ఇరానే అందజేసిందని సౌదీ ఆరోపిస్తూ ఉంటుంది. గాజాపై యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచీ ఇజ్రాయెల్‌పై హౌతీలు పదేపదే బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉన్నారు. హౌతీల చెరలోనే యెమన్ నిజానికి రాజధాని సనాతో పాటు యెమన్ అత్యధిక భాగం హౌతీల వశంలోనే ఉంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడమే గాక వారు సొంత కరెన్సీని కూడా ముద్రిస్తున్నారు! ఇక యెమన్లోని ఎర్రసముద్ర తీర ప్రాంతం మొత్తాన్నీ హౌతీలే నియంత్రిస్తున్నారు. ఇప్పుడదే ఆ మార్గం గుండా అంతర్జాతీయ సరుకు రవాణాకు పెను సవాలుగా మారింది. 2010 నాటికే ఈ ముఠాకు కనీసం లక్ష పై చిలుకు సాయుధ బలమున్నట్టు ఐరాస అంచనా వేసింది. పెను ప్రభావం... ఆసియా, యూరప్ మధ్య సముద్ర రవాణాకు ఎర్రసముద్రమే అత్యంత దగ్గరి దారి. అంతేగాక అంతర్జాతీయ సముద్ర వర్తకంలో కనీసం 15 శాతానికి పైగా ఎర్రసముద్రం మీదుగా మద్యధరా సముద్రం, సూయ జ్ కాల్వ గుండానే సాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ హౌతీల మతిలేని దాడుల ప్రభావం అంతర్జాతీయ వర్తకంపై భారీగా పడుతోంది... ఎర్రసముద్రం గుండా ప్రయాణించే నౌకలకు బీమా ప్రీమియాన్ని కంపెనీలు పది రెట్లకు పైగా పెంచాయి! మెడిటెరేనియన్ షిపింగ్ కంపెనీ, మార్క్స్, హపాగ్–లాయిడ్, బ్రిటిష్ పెట్రోలియం వంటి పలు కంపెనీలు ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలను ఎంచుకుంటున్నాయి. దాంతో అంతర్జాతీయ సరుకు రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. అటు దాడులు, ఇటు బీమా వ్యయాలకు దడిచి పెద్ద రవాణా కంపెనీలన్నీ ఎర్రసముద్రం మార్గానికి ఓ నమస్కారం అంటున్నాయి. వెరసి ఇదంతా రవాణా వ్యయాలు బాగా పెరిగేందుకు కారణమవుతోంది. అంతర్జాతీయంగా చమురుతో పాటు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగేలా కన్పిస్తున్నాయి. -
పాకిస్థాన్ కోర్ పాలసీ ఇదే: జైశంకర్
ఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం ఉపయోగించి భారత్‌ను అంతర్జాతీయంగా చర్చకు తీసుకురావడమే పాకిస్థాన్ ప్రధాన విధానం అని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. పాక్ దుష్టవైఖరికి భారత్ అడ్డుకట్ట వేయగలిగిందని అన్నారు. 'భారత్‌ను అంతర్జాతీయ వేదికపై చర్చకు తీసుకురావడానికి పాక్ ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదం మార్గాన్ని ఎంచుకుంది. ఇందుకోసం అక్కడ ఉగ్రవాదాన్ని చట్టబద్దంగా చేసినట్లు కనిపిస్తోంది. పొరుగుదేశంతో భారత్ ఇలా ఎప్పటికీ వ్యవహరించదు.' అని జైశంకర్ అన్నారు. కెనడాలో వ్యాపిస్తున్న ఖలిస్థానీల ప్రభావం గురించి కూడా జైశంకర్ మాట్లాడారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేయడానికి కెనడాలో ఖలిస్థానీయులకు అవకాశం ఇస్తున్నారని అన్నారు. ఇదే భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడానకి కారణమైందని చెప్పారు. ఈ విధానం ఇటు.. భారతదేశానికి గానీ, కెనడాకు గానీ ఉపయోగం కానప్పటికీ ఆ దేశ రాజకీయాలు అలా ఉన్నాయని విమర్శించారు. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్‌లపై ఎగబడ్డ జనం -
భారత అనుకూల వైఖరి గెలిపించేనా?
అనుకున్నట్టే జరిగితే, 2024 ఫిబ్రవరిలో పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగాలి! ఇప్పుడున్న అంచనా ప్రకారం, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్ ) మెజారిటీ సాధిస్తుంది. ప్రధానిగా మూడు దఫాలు కూడా పదవీకాలం ముగియకుండానే ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మిలిటరీ, న్యాయవ్యవస్థ రెండూ కుమ్మక్కై తన ప్రభుత్వాన్ని ఎలా పడదోశాయో చెబుతున్న షరీఫ్ ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత్‌తో కనీస స్థాయి సంబంధాలు కలిగి ఉండాలన్న వాదన వినిపించే భారమిప్పుడు కూడా ఆయనే మోస్తున్నారని చెప్పాలి. ఇది షరీఫ్ బలమని కొందరి నమ్మకం. కొందరు బలహీనతగానూ చూస్తున్నారు. అలాగని షరీఫ్ గద్దెనెక్కగానే అంతా సమూలంగా మారిపోతుందని కూడా కాదు. మిలిటరీ, న్యాయవ్యవస్థ రెండూ కుమ్మక్కై తన ప్రభుత్వాన్ని ఎలా పడదోశాయో వివ రిస్తూ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవలి కాలంలో చేస్తున్న ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం పాక్‌లో ఉన్న పరిస్థితులు, 2024 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్ ) పార్టీని దృష్టిలో పెట్టుకుంటే ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం లభిస్తుంది. ఇంకో రెండు నెలల్లో, అంటే 2024 ఫిబ్రవరిలో అక్కడ సాధారణ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అటు మిలిటరీ, ఇటు నవాజ్ షరీఫ్ అంగీకరిస్తున్న విషయం ఏదైనా ఉందీ అంటే అది మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఎలాగైనా అధికారానికి దూరంగా ఉంచాలన్నది! భారత్‌లోనే ఎక్కువ ఆసక్తి ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, షరీఫ్ ప్రకటనలకు పాక్‌లో కంటే భారత్‌లోనే ఎక్కువ ఆదరణ లభించడం. ఎందుకిలా? పాకిస్తాన్లో అధికార పక్షానికి భిన్నంగా చేసే వ్యాఖ్యలు, వార్తలు సెన్సార్‌కు గురవుతాయి కాబట్టి అని కొందరు అంటారు. అయితే, పాకిస్తాన్ లో చాలా అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. మీడియా కూడా వాటిని జనానికి చేర్చుతుంటుంది. కానీ ప్రధాన మీడియా వర్గాలు ముట్టుకోకూడదనుకున్న అంశాలకు సోషల్ మీడియా వేదికగా నిలుస్తోంది. బహుశా మనం దూరం నుంచి పాక్ వ్యవహారాలను గమనిస్తూంటాం కాబట్టి... మన దృష్టంతా అక్కడ మిలిటరీకీ, ప్రభుత్వానికీ మధ్య ఉన్న వివాదాలపైనే ఉంటుంది. నవాజ్ షరీఫ్ ఇలాంటి విషయాల్లో పాతికేళ్లుగా కేంద్ర బిందువుగా నిలిచారు. ప్రధానిగా ఉన్న మూడు దఫాలు కూడా పదవీ కాలం ముగి యకుండానే వేర్వేరు కారణాల వల్ల ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మిలిటరీ కుట్రలు లేదా మిలిటరీ–న్యాయవ్యవస్థ కుమ్మక్కులతో అన్నమాట! పాకిస్తాన్లో షరీఫ్ ఇటీవలి ప్రకటనలను కొంచెం భిన్నమైనదృష్టితో చూస్తారేమో. నవాజ్ షరీఫ్ నడిపే రాజకీయాలకు ఇలాంటి ప్రకటనలే ఆధారం. ఇందులో సందేహం ఏమీ లేదు. మిలిటరీ వ్యతి రేకతను ఒక అంశంగా నిత్యం ఉంచుతారు ఆయన. కానీ రాజకీయ వైచిత్రి ఏమిటంటే, ఇప్పుడు మిలిటరీతో కలిసిపోయి అధికారంలోకి వచ్చేందుకు షరీఫ్ ప్రయత్నిస్తూండటం! ఇమ్రాన్ ఖాన్ తప్పటడు గులు, అతడి అనుచరుల చేష్టల పుణ్యమా అని షరీఫ్, మిలిటరీ మధ్య రాజీ కుదిరిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతం షరీఫ్ ఒక రకమైన ఇబ్బందికరమైన స్థితిలోనే ఉన్నాడని చెప్పాలి. ఒకవేళ ప్రజల్లో మిలి టరీపై వ్యతిరేకత అంటూ ఉంటే దాని ఫలాలు అనుభవించేది ఇమ్రాన్ ఖానే అవుతాడు కానీ షరీఫ్ కాదు. ఈ నేపథ్యంలోనే భారత్‌తో సంబంధాల విషయమై షరీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగాకొంత ప్రాధాన్యం ఏర్పడుతోంది. అలాగని షరీఫ్ గద్దెనెక్కగానే అంతా సమూలంగా మారిపోతుందని కూడా ఏమీ కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఎన్నికల సీజన్ , అంతే! మార్పులపై తీవ్రమైన అంచనాలు! పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏవో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయన్న అంచనాలైతే బల పడుతున్నాయి. దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే పాక్‌లోనూ ఎన్నికల ప్రక్రియ మూడు దశల్లో పూర్తవుతుంది. ఇప్పు డున్న సాధారణ అంచనా ప్రకారం షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్ ) మెజారిటీ సాధిస్తుంది. షరీఫ్‌ను నాలుగోసారి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైందని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ విషయానికి వస్తే జైల్లో ఉన్న ఈ మాజీ ప్రధానికి చెందిన పార్టీ ముక్కలు ముక్కలై ఉంది. పార్టీలో ఒకప్పుడు దిగ్గజాలుగా ఉన్నవారు ఇప్పుడు మాకేంసంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీరు గతంలో ఇమ్రాన్ వైపు మొగ్గిన సందర్భంలోనూ మిలిటరీకి వ్యతిరేకంగా ఉండాల్సి వస్తుందని ఊహించి ఉండరు. వీరిని మినహాయిస్తే మిగిలిన మద్దతు దారులు అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎందరు ఎన్నికల్లో పోటీకి దిగుతారన్నది కూడా అనుమానమే. ఇంకోపక్క ఈ వాదనకు ప్రతివాదనలు రెండు వినిపిస్తున్నాయి. ఏవీ కొట్టిపారేసేవి కాదు. అవేమిటంటే... ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉందన్న అంశం మొదటిది. ఆయన ఆశీస్సులున్న నేతలు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారన్నది రెండో విషయం. నవాజ్ షరీఫ్ చరిత్రను తరచి చూస్తే అతడేమంత నమ్మదగ్గ వ్యక్తి కాదని ఆర్మీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి చాలాకాలంగా ఉన్నవే. గతంలో ఇమ్రాన్ ఖాన్ కు చేసినట్లే ఇప్పుడు కూడా నవాజ్‌కు అడ్డంగా ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ తొలగిస్తే గతానుభ వాలు మళ్లీ ఎదురు కావన్న గ్యారెంటీ ఏమిటని ఆర్మీ వర్గాల్లో కొందరు సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది చెబుతున్నదేమిటంటే... వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ రాదూ, హంగ్ ఏర్పడుతుందీ అని! తద్వారా పగ్గాలు ఆర్మీ ఆధీనంలోనే ఉంటాయని భావిసు ్తన్నారు. ఆసక్తికరమైన ఇంకో విషయం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఈ రెండు వాదనలకు బలం చేకూరుతూండగానే... అసలు ఎన్నికలే జరగవన్న మూడో వాదన కూడా మొదలైంది. ఒకవేళ జరిగినా అవి ఫిబ్రవరిలో కాకుండా, బాగా జాప్యం తరువాతేనని అంటున్నారు. అసలు విషయాలు వేరే... ఇప్పటివరకూ చెప్పుకొన్న అంచనాలు ఎన్నికలు జరిగేంతవరకూ కొనసాగడం గ్యారెంటీ. కానీ వీటిన్నింటికంటే అతి ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఎదు ర్కోవాల్సిన సవాళ్లు ఇవి. దయనీయ స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వీటిల్లో ఒకటైతే, అంతర్గత భద్రత రెండోది. అఫ్గానిస్తాన్‌లో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతూండటం కూడా పాక్‌కు ఒక సవాలే. వచ్చే ఏడాది పాక్ భవిష్యత్తును నిర్ణయించేవి ఈ మూడు అంశాలే అన్నా అతిశయోక్తి లేదు. నవాజ్ షరీఫ్ ప్రకటనల్లో భారత్ ప్రస్తావన తరచూ వస్తోంది. పైగా ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవి కాదు. సానుకూలంగా ఉన్నవే. భారత్‌తో కనీస స్థాయి సంబంధాలు కలిగి ఉండాలన్న వాదన వినిపించే భారమిప్పుడు ఈయనే మోస్తున్నారని చెప్పాలి. ఇది షరీఫ్ బలమని కొందరి నమ్మకం. కొందరు బలహీనతగానూ చూస్తున్నారు. ఈ చర్చలో మనమూ భాగస్వాములం కాగలమా? ఎన్నికల ఫలితాల తరువాత కానీ అర్థం కాదు. భారత్, పాక్ సంబంధాలిప్పుడు కీలక దశలో ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. ఈసారి ఉగ్రవాదం, కశ్మీర్, వ్యూహాత్మకంగా ఇరుదేశాల మధ్య ఉన్న అపనమ్మకం వంటివి మును పటిలాగానే సమస్యను పీటముడి స్థాయికి తీసుకొచ్చాయి. ఇరువైపుల నుంచి చొరవ, చేతలు రెండూ ఉంటేగానీ ఈ పీటముడి విడిపడదు. ఒక్కటైతే నిజం. ఈ పీటముడి పూర్తిగా విడిపోకపోయినా, కనీసంకొంత వదులుగానైతే తప్పకుండా మారాలి. ఈ దిశగా భారత దేశమే చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనపరచాలి. దక్షిణాసియా రాజకీయాల్లో, భారత పాకిస్తాన్ చరిత్రలోనూ ఇదేమీ తెలియని అంశమైతే కాదు. - టి.సి.ఎ. రాఘవన్ వ్యాసకర్త పాకిస్తాన్లో భారత మాజీ హై కమిషనర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
భద్రతా సవాళ్ల సమీక్ష లేనందునే...
పదిహేనేళ్ల క్రితం, 2008 నవంబరు 26న దేశ ఆర్థిక రాజధానిపై జరిగిన ఉగ్రదాడి తొలిదశలో భారత భద్రతా వ్యవస్థ దాదాపుగా అచేతనమైందంటే అతిశ యోక్తి కాబోదు. నిస్సహాయులైన, నిరాయుధులైన జన సామాన్యంపై పేట్రేగిన ఉగ్రమూక వందల ప్రాణాలను బలితీసుకున్న దుర్ఘటన అది. భారతదేశ సార్వభౌమత్వం, భద్రతపై ఇంత స్థాయిలో ఎన్నడూ దాడి జరగలేదని చెప్పాలి. ఈ ఘటన జాతీయ భద్రత అంశంలోని సంస్థా గత లోపాలను ఎత్తి చూపింది. దేశం మరోసారి 26/11 లాంటి ఘటనను ఎదుర్కోరాదంటే... అంతర్గత భద్రత సవాళ్లపై సమీక్షించుకోవడం మన తక్షణ అవసరం కావాలి. ముంబై దాడుల్లో ఉగ్రవాదులు అనుసరించిన పద్ధతులు... సరిహద్దులకు అవతలి నుంచి వారికి అందిన సూచనల వంటివన్నీ మనకు అనూహ్యమైనవే. అదే సమ యంలో ఢిల్లీ, ముంబైల్లోని జాతీయ స్థాయి భద్రత వ్యవస్థలు సంపూర్ణంగా విఫలమయ్యాయి. 1999 నాటి కార్గిల్ యుద్ధంలోనూ సంస్థాగతమైన నిఘా లోపాలు బయటపడ్డాయి. దివంగత కె. సుబ్రమణ్యం నేతృత్వంలోని కార్గిల్ రివ్యూ కమిటీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘‘ఏజెన్సీల మధ్య సమన్వయానికి, నిర్దిష్ట లక్ష్యానికి అనుగుణంగా కలిసి పనిచేసేందుకు తగిన వ్యవస్థ లేకుండా పోయింది. అలాగే ఏజెన్సీ లకు పనులు చెప్పేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు, సామర్థ్యాలను పరీక్షించేందుకు, నాణ్యత ప్రమాణాలను సమీక్షించేందుకు కూడా తగిన వ్యవస్థలు లేవు. అన్ని నిఘా సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో చూసే ఏర్పాట్లు కూడా లేవు’’ అని విస్పష్టంగా పేర్కొందీ కమిటీ. ఈ రకమైన లోపాల కారణంగా భారత్ నివారించ దగ్గ ఎదురుదెబ్బలు ఎన్నో చవిచూడాల్సి వస్తోంది. గల్వాన్ లోయ సంఘటన ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక అంశం. 2020లో జరిగిన ఈ ఘటనలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు భారతీయ సైనికులను ఒకరకంగా ‘ఆశ్చర్యానికి’ గురిచేస్తూ తీవ్రస్థాయి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. మిలిటరీ సంస్కరణల ఫలితం? భద్రత వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీకి ప్రాతినిధ్యం వహించే ‘ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ మిలిటరీ సంస్కరణలను అమలు చేసే విషయంలో దశాబ్దాల సమయం తీసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పోస్ట్‌ను సృష్టించేందుకు 1990లలో పీవీ నర సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే ప్రయత్నాలు మొదల య్యాయి. ఆఖరికి ఇది 2019లో నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండగా సాకారమైంది. ఈ జాప్యం చెప్పే విషయం ఏమిటి? జాతీయ భద్రత అంశాల విషయంలో సంస్క రణలు, సంస్థాగత సమీక్షలకు కొంత నిరోధం ఉందీ అని. అది కూడా స్వప్రయోజనాల కోసం పాకులాడే వారి వల్ల అని అర్థమవుతుంది. భారతీయ నిఘా ఏజెన్సీల్లో... ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్ అండ్ ఏడబ్ల్యూ– క్లుప్తంగా ‘రా’), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్ఓ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐఏ)లు ఉన్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం,కేంద్ర హోంశాఖల కింద ఈ ఏజెన్సీలన్నీ పనిచేస్తాయి. వీటికి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ప్రతి సాయుధ దళంలోనూ తమదైన ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్లు అదనం. అంతేకాదు... రెవెన్యూ, ఆర్థిక రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు, నిఘా పెట్టేందుకు ప్రత్యే కమైన విభాగాలు కూడా ఉన్నాయి. సమాచార రంగంలో వచ్చిన సరికొత్త మార్పులను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వాలు రోజంతా తమ నిఘా కార్యక్రమాలను కొన సాగించాల్సిందే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవస రమే లేదు. చాలా ఏజెన్సీలను ఐపీఎస్‌ల నుంచి ఎంపిక చేసిన సీనియర్ స్థాయి అధికారులు నడుపుతూంటారు. సంస్కరణలు కష్టం అవుతూండేందుకు ఇది కూడా ఒక కారణం. పాతికేళ్ల నివేదికలు... మిలిటరీ సంస్కరణల విషయంలో దాదాపు 24 ఏళ్లుగా చాలా నివేదికలు వెలువడ్డాయి. నిశితంగా శ్రద్ధ పెట్టి సమీక్షిస్తే ఉన్నత స్థాయిలోని పోలీసు వర్గాలు, రాజ కీయ నాయకులు ఇప్పుడున్న పరిస్థితినే కొనసాగించాలనే స్వార్థంతో పనిచేస్తున్నట్లు స్పష్టమవుతుంది. 2024 ఎన్నికల సమయం దగ్గరపడింది. కాబట్టి వ్యవస్థాగతమైన సంస్కరణలకు ఇదేమంత మంచి సమయం కాదు. కానీ వచ్చే ప్రభుత్వం ఏదైనా ఈ విష యాన్ని కచ్చితంగా చేపట్టాల్సిందే. ఇప్పటివరకూ ఈ అంశంపై వెలువడ్డ నివేదికలన్నింటినీ కూలంకుషంగా సమీక్షించి ఒక టాస్క్‌ఫోర్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ధారించుకుని ముందడుగు వేయాలి. ఈ సంస్కరణలకు పునాదులుగా నిలిచే అంశాలు ఇరవై ఏళ్లుగా నిఘా వర్గాల్లో నైపుణ్యం సాధించిన వారి నివేదికల ఆధారంగా ఉంటాయని నమ్ము తున్నాను. వృత్తిపరమైన నిబద్ధత, వ్యక్తిగతంగా నైతిక నియ మాలున్న వారు నిఘా వ్యవస్థల్లో ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ప్రజా పరిశీలనకు దూరంగా, పారదర్శకం కాని తెర వెనకాల ఈ వ్యవస్థలు పనిచేస్తూంటాయి మరి. కాబట్టి వీరి పనితీరును బహిరంగంగా సమీక్షించడం అసాధ్యమే కాదు, వాంఛనీయం కూడా కాదు. కెనడా ఇటీవలే భారతీయ నిఘా వ్యవస్థలపై కొన్ని ఆరోపణలు గుప్పించింది. అమెరికా కూడా ఈ అంశంలో తన ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ రకమైన ఆరోపణలు ఏమంత మంచివి కాదు. 26/11 ఉగ్రదాడి మనలోని లోపాలు ఎన్నింటినో ఎత్తి చూపింది. వాటిని పరిష్కరించే విషయంలో ఇప్పటికే జరిగిన జాప్యం చాలు. ఈ విషయంలో వీలైనంత తొంద రగా సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కావడం దేశ హితం దృష్ట్యా అవసరం. సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త డైరెక్టర్, సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
శరణార్థులపై పాక్ పంజా
నిన్నటి వరకూ ఎత్తుకుని ముద్దాడినవారు హఠాత్తుగా విసిరికొడితే...? ఇప్పుడు పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అఫ్గానిస్తాన్ శరణార్థులు ఇలాంటి దుఃస్థితిలోనే పడ్డారు. ఇజ్రాయెల్ గడ్డపై హమాస్ దాడుల పర్యవసానంగా దాదాపు నెలరోజుల నుంచి గాజా స్ట్రిప్‌లో మారణహోమం సాగుతోంది. నిరాయుధ పౌరులు వేలాదిమంది పిట్టల్లా నేలరాలుతున్నారు. ఈ పరిణామాలపై అరబ్బు ప్రపంచం భగ్గుమంటోంది. కానీ ఈమూల ప్రాణాలు అరచేతపట్టుకుని వచ్చిన శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపించటానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. వారిని నరకకూపంలోకి నెట్టడం అన్యాయమని అనేకులు నచ్చజెబుతున్నా, తీవ్ర పర్యవసానాలుంటాయని తాలిబన్లు బెదిరిస్తున్నా పాక్ పాలకులు లక్ష్యపెట్టడం లేదు. చట్టవిరుద్ధంగా వుంటున్న 17 లక్షలమంది శరణార్థుల్లో సోమవారం నాటికి లక్షా 70 వేలమందిని పంపించామని పాక్ ప్రకటించింది. శరణా ర్థుల సమస్య పూర్తిగా పాకిస్తాన్ స్వయంకృతం. నిన్నటివరకూ తన మిత్రులైన తాలిబన్లతో వైరం తెచ్చుకుని, పెరుగుతున్న నేరాలకూ, అధోగతిలో వున్న దేశ ఆర్థికవ్యవస్థకూ అఫ్గాన్ శరణార్థులను కారణంగా చూపి వదుల్చుకోవాలని చూడటం పాకిస్తాన్ సైన్యం కపటనీతికి అద్దం పడుతుంది. 80వ దశకంలో అఫ్గాన్‌పై సోవియెట్ యూనియన్ సైన్యం దురాక్రమణకు దిగినప్పుడు అమెరికా అండతో అఫ్గాన్‌కు అండగా నిలిచినట్టు నటించింది పాకిస్తానే. ఆ వంకన వచ్చిపడిన నిధులు అన్నివిధాలా అక్కరకొచ్చాయి. సోవియెట్ దళాలు నిష్క్రమించాక తాలిబన్ల ఏలుబడి మొదలైనప్పుడు వారితో చెట్టపట్టాలేసుకుని వారి అరాచకాలకు అండదండలందించింది, వారిని ఉసిగొల్పి మన దేశాన్ని చికాకుపరిచింది కూడా పాకిస్తానే. 2001లో తమ దేశంపై ఉగ్రదాడి జరిగాక అమెరికా ఆగ్రహించి అఫ్గాన్‌పై దండయాత్రకు దిగింది. తాలిబన్లను తొలగించి తమ అనుకూలురను ప్రతిష్టించింది. అనంతరకాలంలో పరిమిత ప్రాంతాల్లోనైనా అంతో ఇంతో సాధారణ పరిస్థితులుండేవి. మహిళలు చదువుకోవటానికి, వృత్తి ఉద్యోగాలు చేసుకోవటానికి వీలుండేది. మన దేశం, మరికొన్ని దేశాలు అఫ్గాన్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. ఇదంతా పాకిస్తాన్‌కు కంటగింపైంది. అఫ్గాన్‌లో తమ హవా సాగటం లేదన్న దుగ్ధతో పాకిస్తాన్ అక్కడ ఏదోవిధంగా పాలకులను చికాకుపరిచేది. చివరకు అమెరికాలో ట్రంప్ హయాం వచ్చాక చడీచప్పుడూ లేకుండా తాలిబన్ల తరఫున ఆయనతో రాయబారాలు జరిపి, వారు పూర్తిగా మారిపోయారని నమ్మబలికింది. ఆ తర్వాతే అమెరికా మంచి తాలిబన్లు, చెడ్డ తాలిబన్లు అంటూ వర్గీకరించి అఫ్గాన్ నుంచి నిష్క్రమించేందుకు దారులు వెదుక్కొంది. ఈ క్రమం అంతటా పాకిస్తాన్ ఆడిన ప్రమాదకర క్రీడ అడుగడుగునా కనబడుతూనే వుంది. తీరా రెండేళ్లక్రితం తాలిబన్ల పాలన మొదలయ్యాక ఇద్దరికీ చెడింది. పాక్ సైన్యం చేతుల్లో కీలుబొమ్మలు కావటానికి తాలిబన్లు ససేమిరా అనటం, తమ సహజ వనరులను పాక్ పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి అంగీకరించకపోవటం సైన్యానికి ఆగ్రహం కలిగించింది. శరణార్థులను వెనక్కు పంపటంలోని ఆంతర్యం అదే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం పాకిస్తాన్‌లోని అఫ్గాన్ శరణార్థుల సంఖ్య 13 లక్షలు. మరో 8 లక్షల 80 వేలమంది చట్టబద్ధంగా అక్కడుంటున్నారు. వీరిలో 2021లో మళ్లీ తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నాక ప్రాణభయంతో వచ్చినవారు దాదాపు 6 లక్షలమంది. వీరుగాక 1980 ప్రాంతంలో సోవియెట్ దురాక్రమణ సమయంలో వచ్చిన 3 లక్షలమంది శరణార్థులున్నారు. కానీ పాక్ సైన్యం లెక్కలు వేరేలా వున్నాయి. 17 లక్షలమంది శరణార్థులు అక్రమంగా వుంటున్నారని అది చెబుతోంది. ఎవరి లెక్కలు ఏమైనా శరణార్థుల్లో అనేకులు దశాబ్దాలుగా ఉపాధి వెదుక్కొని ఇస్లామాబాద్ మొదలుకొని కరాచీ వరకూ అనేక నగరాల్లో స్థిరపడి అక్కడే తమకంటూ గూడు ఏర్పర్చుకున్నారు. ఆ సమాజంలో భాగమయ్యారు. వారి పిల్లలు చదువుకుంటున్నారు. ఉపాధి వెదుక్కున్నారు. కొందరు ఆస్తులు కూడబెట్టుకున్నారు. కానీ హఠాత్తుగా పాకిస్తాన్ సైన్యం పోలీసులు, సైన్యం విరుచుకుపడి వారి అధికారిక పత్రాలు స్వాధీనం చేసుకుని పొమ్మంటే ఏమై పోవాలి? తనకు అనుకూలంగా వున్నప్పుడు సమస్యను చక్కగా వినియోగించుకుని, తాలిబన్లతో తకరారు తలెత్తాక ఇన్ని లక్షలమందిని కట్టుబట్టలతో గెంటేయాలని చూడటం ఏం న్యాయం? ఇప్పుడు దేశవ్యాప్తంగావున్న అఫ్గాన్ శరణార్థులను సరిహద్దుల్లోని తోర్ఖాం ప్రాంతానికి తరలించి నరకాన్ని తలపించే గుడారాల్లో కుక్కుతోంది. కొందరిని బలూచిస్తాన్ వైపున్న చమన్వైపు తరలిస్తోంది. ఒకపక్క అమానవీయంగా ఇన్ని లక్షలమందిని నరక కూపంలోకి నెడుతూ స్వచ్ఛందంగా పోతున్నారని సైన్యం తప్పుడు ప్రచారం చేస్తోంది. 1950 ప్రాంతం తర్వాత దేశంనుంచి ఇంత పెద్దయెత్తున జనం తరలిపోవటం ఇదే ప్రథమమని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. ఉగ్రవాదం విషయంలో పాక్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరే దేశంలో ఆత్మాహుతి దాడులు, ఇతర నేరాలు పెరగటానికి కారణం. తాము మద్దతుగా నిలిచిన తాలిబాన్లే అడ్డం తిరగటంతో సైన్యానికి దిక్కుతోచటం లేదు. దానికితోడు దేశంలో పౌర ప్రభుత్వంతో పొసగటం లేదు. ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి దించినా అంతా అనుకున్నట్టు జరగలేదు. త్వరలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దేశం దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో సకల క్లేశాలకూ శరణార్థులను బాధ్యులుగా చూపి, బలిపశువుల్ని చేయటం దుర్మార్గం. అంతర్జాతీయ చట్టాలను గౌరవించి శరణార్థుల విషయంలో కనీస మానవీయత ప్రదర్శించటం అవసరమని పాక్ సైన్యమూ, పాలకులూ గుర్తించాలి. -
Police Commemoration Day: ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాద ఘటనల్లో పదేళ్లలో 65% తగ్గుదల
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో విద్రోహ చర్యలు గత దశాబ్ద కాలంలో 65 శాతం మేర తగ్గుముఖం పట్టాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోని మూడు హాట్ స్పాట్లుగా ఉన్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతం, జమ్మూకశ్మీర్‌ల్లో పరిస్థితులు ప్రశాంతంగా మారాయన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావడంతోపాటు ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తుండడమే దీనికి కారణమన్నారు. శనివారం నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి అమిత్ షా మాట్లాడారు. పోలీస్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేసి పోలీసు బలగాలను తీవ్రవాదులను ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దాదాపు 150 ఏళ్లనాటి క్రిమినల్ జస్టిస్ విధానాన్ని సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం పార్లమెంట్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి విధి నిర్వహణలో 36,250 మంది పోలీసులు ప్రాణాలర్పించారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్ట్ వరకు 188 మంది పోలీసులు విధుల్లో ఉండగా అమరులయ్యారు. పోలీసు స్మారకం కేవలం చిహ్నం కాదు, దేశ నిర్మాణం కోసం పోలీసు సిబ్బంది చేసిన త్యాగం, అంకితభావానికి గుర్తింపు’అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతర్గత రక్షణతోపాటు దేశ సరిహద్దుల భద్రతకు సైతం సమర్థమంతమైన పోలీసు విధానం అవసరం ఎంతో ఉందని చెప్పారు. -
ఉగ్రవాదమే అసలైన సమస్య.. పీ20 మీటింగ్‌లో ప్రధాని మోదీ
ఢిల్లీ: 2001 నాటి పార్లమెంట్‌పై ఉగ్రదాడిని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ప్రపంచం మొత్తం ఉగ్రవాదంతో బాధపడుతోందని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఉగ్రవాద నిర్వచనంపై ఏకాభిప్రాయం సాధించకపోవడం బాధాకరమని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మనం ఎలా కలిసి పని చేయాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్లమెంటులు ఆలోచించాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో 9వ G20 పార్లమెంటరీ స్పీకర్ల సమ్మిట్ (P20)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్ సరిహద్దులో ఉగ్రవాదంతో ఎన్నో ఏళ్లుగా పోరాడుతోందని చెప్పిన ప్రధాని మోదీ.. ఉగ్రవాదంతో ప్రపంచం మొత్తం అతిపెద్ద సవాళును ఎదుర్కొంటోందని అన్నారు. మానవత్వానికి ఇది వ్యతిరేకమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై స్పందించిన మోదీ.. ఘర్షణలు, నిర్బంధాలు సరైన ప్రపంచాన్ని సృష్టించబోవని తెలిపారు. పార్లమెంటరీ విధానాల పట్ల ప్రధాని మోదీ స్పందించారు. ప్రపంచం పార్లమెంటరీ విధానాల సంగమమని అన్నారు. ఈ విధానాలు మరింత బలోపేతమవుతున్నాయని చెప్పారు. జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ఏడాదంతా మనం సంబరాలు చేసుకున్నామని గుర్తుచేశారు. భారత్ 17 సార్వత్రిక ఎన్నికలను నిర్వహించిందని, 300 సార్లు రాష్ట్ర ఎన్నికలు జరిపినట్లు స్పష్టం చేశారు. పాన్ ఆఫ్రికన్ పార్లమెంట్ కూడా మొదటిసారి పీ20 సమ్మిట్‌లో పాల్గొంది. జీ20 విభాగంలో పాన్ ఆఫ్రికన్ ఇటీవలే చేరిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన మొదటి విమానం -
ఉగ్రవాదాన్ని నిర్దాక్షిణ్యంగా అణచేయాలి
న్యూఢిల్లీ: ఉగ్రవాదం పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దేశంలో మళ్లీ కొత్తగా ఉగ్ర గ్రూపు ఏర్పడకుండా కఠినమైన వైఖరిని అవలంబించాలని ఉగ్రవాద వ్యతిరేక విభాగాలను కోరారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు, ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకిలించివేయాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వంతోపాటు అన్ని విభాగాలు ఉమ్మడిగా ముందుకు సాగాలన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో రెండు రోజుల జాతీయ ఉగ్ర వ్యతిరేక సదస్సునును అమిత్ షా ప్రారంభించి, ప్రసంగించారు. క్రిప్టో కరెన్సీలు, హవాలా, ఉగ్ర నిధులు, వ్యవస్థీకృత నేర ముఠాలు, డ్రగ్స్– ఉగ్ర లింకులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు తొమ్మిదేళ్లుగా ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు మంచి ఫలితాలు సాధించాయని ఆయన అన్నారు. ఎన్ఐఏ, ఉగ్ర వ్యతిరేక బృందాలు, రాష్ట్రాల టాస్క్‌ఫోర్స్‌లు కేవలం కేసుల దర్యాప్తునకే పరిమితం కారాదన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తమ పరిధిని దాటి వినూత్నవిధానాలను ఆలోచించాలని కోరారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేసే క్రమంలో అంతర్జాతీయ సహకారంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల సహకారం కూడా అవసరమని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్రాలు, వివిధ ఏజెన్సీల మధ్య సహకారం ఉండాలన్నారు. ఇందుకోసం కేంద్రం పలు డేటా బేస్‌లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎన్ఐఏ పరిధిలో మోడల్ యాంటీ టెర్రరిజం నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి, కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య మెరుగైన సమన్వయం కోసం అన్ని రాష్ట్రాల్లోని ఉగ్రవాద వ్యతిరేక విభాగాల అధికార క్రమం, నిర్మాణం, విచారణ, కార్యాచరణ విధానం ఏకరీతిగా ఉండాలన్నారు. 94 శాతం కంటే ఎక్కువగా నేరారోపణ సాధించిన ఎన్ఐఏ కృషిని షా ప్రశంసించారు. ఈ ఏడాదిలో ఎన్సీబీ చేపట్టిన ఆపరేషన్ సముద్రగుప్తతో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగలిగామన్నారు. -
భారత్ కెనడా వివాదం.. జైశంకర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య విషయంలో భారత్ కెనడాల మధ్య రగులుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో కేంద్ర విదేశాంగశాఖమంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. కెనడాలో హింస, తీవ్రవాదం గణనీయంగా పెరిగిపోయిందని మండిపడ్డారు. కెనడా తీవ్రవాద శక్తులు, వేర్పాటువాదులకు ఆశ్రయం ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాలను సాధారణమైనవిగా చూడరాదని అన్నారు. ఈ సందర్భంగా భారత్-కెనడా వివాదంపై జై శంకర్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భావప్రకటనా స్వేచ్ఛ గురించి ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం భారత్‌కు లేదని తెలిపారు. ‘మాది ప్రజాస్వామ్య దేశం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో మేము ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాక్ స్వాతంత్ర్యం హింసకు దారితీయకూడదని మేము చెబుతున్నాం. అది స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే అవుతుంది. రక్షించడం కాదు అని జైశంకర్ పేర్కొన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నెలకొన్న తరుణంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కెనాడా ఆరోపణలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దీనిని రెండు దేశాలు కలిసి పరిష్కరించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. ఆరోపణలకు సంబంధించి ఏదైనా సమాచారం మాతో పంచుకునేందుకు కెనడా సిద్ధంగా ఉంటే, మేము కూడా దానిని పరిగణలోకి తీసుకుని పరిష్కరించుకునేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. అయితే భారత్‌కు వ్యతిరేకంగా హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో భాగమైన కొందరు వ్యక్తులు, సంస్థలు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని, ఈ విషయంలో తమ అభర్ధనలకు కెనడా స్పందించలేదని అన్నారు. చదవండి: Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి.. తన విధానాల ప్రకారం భారత్ ఇలాంటి చర్యలకు పాల్పడదని జైశంకర్ పేర్కొన్నారు. ట్రూడో చేసిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంతవరకు కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదన్న ఆయన.. ఒకవేళ నిజ్జర్ హత్యకు సంబంధించి తగిన సమాచారాన్ని అందిస్తే, భారత్ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కెనడాలో పరిస్థితుల కారణంగా భారత దౌత్యవేత్తలు ఎంబసీకి వెళ్లేందుకు కూడా వెనకాడుతున్నారని మంత్రి తెలిపారు. వారు బహిరంగంగా బెదిరింపులకు గురవుతుండటంతో కెనడా పౌరులకు భారత వీసాలు నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి, కెనడాలోని ఖలిస్తానీ బెదిరింపు పోస్టర్లపై ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘ మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఒకవేళ మీ రాయబార కార్యలయాలు, మీ దౌత్యవేత్తలు, మీ దేశ ప్రజలకు బెదిరింపులు ఎదురైతే మీరు ఎలా స్పందిస్తారని అడిగారు. మేము మీ దేశంపై విమర్శలు చేసాం, మీ కాన్సులేట్లపై దాడులకు పాల్పడ్డం. పోస్టర్లు పెట్టాం. దీనిని మీరు సాధారణమైనవిగా భావిస్తారా? ఇదే వేరే దేశానికి జరిగితే మీరు ఎలా స్పందిస్తారు. కెనడాలో జరుగుతున్నది జనరల్‌గా చూడవద్దు. అక్కడ ఏం జరగుతుందో బయట ప్రపంచానికి తెలియడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదం, తీవ్రవాదం, హింస మొదలైన విషయాల్లో కొన్నేళ్లుగా మాకు కెనడా, కెనడా ప్రభుత్వంతో సమస్యలు ఉన్నాయి. భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్‌లతో చర్చించాం’ అని తెలిపారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్, ఆదేశ విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తోనూ భేటీ అయ్యారు. భారత్- అమెరికా మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో విదేశాంగ ఇదరుదేశాల విదేశాంగ మంత్రులు విస్తృతంగా చర్చించారు. చదవండి: సన్నిహిత సంబంధాలకే మొగ్గు: ట్రూడో -
రాజకీయ సౌలభ్యం కోసం...ఉగ్రవాదంపై మెతక వైఖరా?
ఐక్యరాజ్యసమితి: ఖలిస్తానీ ఉగ్రవాదం విషయంలో మెతకగా వ్యవహరిస్తున్న కెనడాకు ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ చురకలంటించింది. ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసల విషయంలో కేవలం రాజకీయ సౌలభ్యం కోసం మెతక వైఖరి అవలంబించడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి అవకాశవాద ధోరణులకు దూరంగా ఉండాలని ఐరాస సభ్య దేశాలకు పిలుపునిచ్చింది. మంగళవారం ఐరాస 78వ సర్వ సభ్య సమావేశంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఈ మేరకు కుండ బద్దలు కొట్టారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ప్రదర్శిస్తున్న కొద్ది బుద్ధులను కూడా ఏకిపారేశారు. ‘ప్రాదేశిక సమగ్రత, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టరాదన్నవి కనీస మర్యాదలు. అంతే తప్ప ఇలాంటి విషయాల్లో తమ రాజకీయ స్వార్థాలకు, అవసరాలకు అనుగుణంగా ఇష్టానికి వైఖరులు మార్చుకునే తీరు సరి కాదు‘ అంటూ పాక్ తో పాటు పరోక్షంగా అమెరికా తీరును కూడా దుయ్యబట్టారు. ఐరాస వేదికగా పాక్ తాత్కాలిక ప్రధాని ఇటీవల దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలకు, దౌత్య సంక్షోభానికి దారి తీసింది. హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలతో మంటలు రాజుకున్నాయి. ఖలిస్తానీ అనుకూల పార్టీ మద్దతుతో అధికారాన్ని కాపాడుకుంటున్న ట్రూడో వారిని మంచి చేసుకునేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన సొంత పార్టీ ఎంపీలే విమర్శిస్తుండటం తెలిసిందే. అంతేగాక నిజ్జర్ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని కెనడాతో అమెరికా పంచుకుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాక్, అమెరికా తీరును పరోక్షంగా దుయ్యబడుతూ ఐరాస వేదికపై జై శంకర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పెద్ద దేశాలూ, కొద్ది బుద్ధులు! పెద్ద దేశాల పెత్తందారీ, ఏకపక్ష పోకడలకు వ్యతిరేకంగా వర్ధమాన దేశాల గొంతుకను ఐరాస వేదికపై జై శంకర్ ఈ సందర్భంగా గట్టిగా వినిపించారు. కొన్ని పెద్ద దేశాలే తమ అవసరాలకు అనుగుణంగా అజెండాను నిర్దేశించి, మిగతా దేశాలన్నీ తమను అనుసరించాలని కట్టడి చేసే రోజులకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు. ‘ఈ పోకడలు ఎల్లకాలమూ చెల్లవు. వాటినెవరూ సవాలే చేయరని అనుకోవద్దు. వ్యాక్సిన్ల విషయంలో వర్ణ వివక్షను ఇంకెప్పుడూ అనుమతించరాదు. వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడంలో పెద్ద దేశాలు తమ బాధ్యతలను తప్పించుకోరాదు. నిరుపేద దేశాలకు అందాల్సిన ఆహార, ఇంధన నిల్వలను పెద్ద దేశాలు తమ మార్కెట్ బలాన్ని ఉపయోగించి చెరబట్టరాదు‘ అంటూ శషభిషలకు తావు లేకుండా స్పష్టం చేశారు. అభివృద్ధిలోనూ, అన్నింట్లోనూ అన్ని దేశాలకూ సమాన భాగస్వామ్యం కల్పించే నూతన ప్రజాస్వామిక వాతావరణం నెలకొని తీరుతుందని మంత్రి ధీమా వెలిబుచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అన్ని రకాల నిబంధనలు అన్ని విషయాల్లోనూ అన్ని దేశాలకూ సమానంగా వర్తించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. అలీనోద్యమానికి మద్దతిచ్చిన రోజుల నుంచి విశ్వ మిత్ర (ప్రపంచ నేస్తం) స్థాయి దాకా భారత్ ఎదిగింది. మిగతా దేశాలన్నీ తమ జాతీయ ప్రయోజనాలే చూసుకుంటాయి. భారత్ మాత్రం విశ్వ శ్రేయస్సునే తన మేలుగా భావిస్తుంది‘ అని స్పష్టం చేశారు. ఆ గురుతర బాధ్యతను దృష్టిలో ఉంచుకునే జీ20 సారథ్యాన్ని భారత్ స్వీకరించిందని వివరించారు. ‘ఇతర దేశాల వాదనను సానుభూతితో వినడం, వాటి వైఖరిని గౌరవించడం బలహీనత కాదు. పరస్పర సహకారానికి సూచిక. ఐరాస లక్ష్యానికి కొనసాగింపు‘ అంటూ చైనా మితి మీరిన దూకుడుకు కూడా జై శంకర్ చురకలు వేశారు. -
ఉర్దూస్తాన్, ఖలిస్తాన్..
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రత్యేక ఖలిస్తాన్ కోసం వేర్పాటువాదం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ పెద్ద ప్రణాళికలే రచించాడు. సంబంధిత వివరాలు ఉన్న భారత నిఘా వర్గాల నివేదిక ఈ విషయాలను వెల్లడిస్తోంది. ఆ నివేదికలోని వివరాలను ఓసారి గమనిస్తే ► మతాల ప్రాతిపదికన భారత్‌ను విడగొట్టాలి అనేది పన్నూ ప్రధాన ఎజెండా. ► ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్‌సహా పలు రాష్ట్రాల్లో పన్నూపై పలు కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్న పన్నూపై భారత్‌లో చాలా రాష్ట్రాల్లో పదహారుకు పైగా కేసులు నమోదవడాన్ని బట్టి ఎస్ఎఫ్జే కార్యకలాపాలు ఇండియాలో ఎంతగా విస్తరించాయో అర్ధమవుతుంది. ► భారత భూభాగంలో ముస్లింల కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటుచేయాలనేది పన్నూ ఆలోచన. దీనికి ‘ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దూస్తాన్’ అని పేరు కూడా ఖాయం చేసుకున్నాడు. ► దేశం నుంచి కశీ్మర్‌ను వేరుచేసేందుకు కశ్మీర్‌లోని ప్రజలను విప్లవకారులుగా తయారుచేయాలని కంకణం కట్టుకున్నాడు. అందుకోసం భారత్ పట్ల వ్యతిరేకభావన ఉన్న ప్రాంతాల్లో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. కశీ్మర్లో అసంతృప్తితో రగిలిపోతున్న వారికి మరింత ఉద్రేకపరిచేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖలిస్తాన్ జెండా ఎగరేస్తానని పన్నూ గతంలో ప్రకటించాడు కూడా. అసలు ఎవరీ పన్నూ ? దేశ విభజన కాలంలో 1947లో పన్నూ కుటుంబం పాకిస్తాన్ నుంచి అమృత్సర్ దగ్గర్లోని ఖాన్కోట్ గ్రామానికి వలసవచి్చంది. అమృత్‌సర్‌లో పుట్టిన పన్నూ.. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా పుచ్చుకున్నాడు. అమెరికాలో ఉంటున్న పన్నూ అక్కడే అటారీ్నగా పనిచేస్తున్నాడు. భారత్‌లో ఖలిస్తాన్‌ను ఏర్పాటుకు కృషిచేస్తున్న ఎస్ఎఫ్జే సంస్థకు న్యాయ సలహాదారుగా ఉంటున్నట్లు పన్నూ చెప్పుకుంటున్నాడు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సాక్ష్యాధారాలతో గుర్తించిన కేంద్ర హోం శాఖ పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించింది. పన్నూ ప్రేలాపణలు.. భారత్‌లో ఖలిస్తాన్ వేర్పాటువాదంలో నిమగ్నమైన వారికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తుంటాడని పన్నూపై ఆరోపణలు ఉన్నాయి. తాను చెప్పిన పనులు చేసినా భారీ బహుమతులు ఇస్తానని గతంలో బహిరంగ ప్రకటనలుచేశాడు. ఢిల్లీలోని ప్రఖ్యా త ఇండియాగేట్ వద్ద ఖలిస్తాన్ జెండా ఎగరేస్తే 25 లక్షల డాలర్లు ఇస్తానని పిలుపునిచ్చాడు. 2021లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ మువ్వన్నెల జెండా ఎగరేయకుండా ఎవరైనా పోలీసు అడ్డుకుంటే అతనికి 10 లక్షల డాలర్లు ఇస్తానని ప్రకటించాడు. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిన పన్నూపై ఎన్ఐఏ కోర్టు 2021 ఫిబ్రవరిలో నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. -
నిజంగానే అంత చెడ్డ దేశమా?!
‘‘పాక్ పాలకులపై ఆగ్రహంతో మనం ఎందుకని పాకిస్తాన్ పౌరులకు వీసాలను తిరస్కరిస్తున్నాం? పాకిస్తానీయులందరూ జిహాదీలేనని మనం నమ్ముతున్నామా? పాకిస్తానీ జనాభాలోని 99.99 శాతం మందికి ఏ మాత్రం సంబంధం లేని ఉగ్రవాద చర్యలకు ప్రతీకారం తీర్చుకోవడానికి సంఝౌతా ఎక్స్‌ప్రెన్‌ను ఎందుకు రద్దు చేయాలి? పాకిస్తానీయులను భారతదేశంలోని తమ బంధువులతో కలవనీయకుండా చేస్తే హురియత్ తన ఆజాదీ పిలుపును విరమించుకుంటుందని నిజంగానే మనం భావిస్తున్నామా?’’... ఈ ప్రశ్నలన్నిటినీ మనం ఎదుర్కోవలసిన అవసరం ఉందని మణి శంకర్ అయ్యర్ తన ఆత్మకథలో రాశారు. కరాచీలో కాన్సుల్–జనరల్‌గా ఆయన నాలుగేళ్ల కాలాన్ని పొందుపరచిన అధ్యాయం... మనవాళ్లలో చాలామంది శత్రువుగా భావించే దేశంలోని ప్రేమ, అవగాహనలను తెలియబరుస్తుంది. మణి శంకర్ అయ్యర్ ఆత్మకథలోని మొదటి సంపుటం గురించి నా అభిప్రాయం ఏంటంటే – చెప్పడంలోని సొగసంతా క్లుప్తతలోనే ఉంటుందన్న మాటపై ఆయనకు నమ్మకం లేదని. ‘మెమోయిర్స్ ఆఫ్ ఎ మావెరిక్’లోని ప్రారంభ అధ్యాయాలు మరీ అంత మితిమీరిన సమాచారంతో ఉండవలసింది కాదు. ఉల్లాసమైనవీ విసుగు తెప్పించేవీ, ఆసక్తికరమైనవీ అసంబద్ధమైనవీ, హాస్యభరితమైనవీ నిస్సారమైనవీ... అన్నిటినీ కూడా అయ్యర్ తనకు సాధ్యమైనంతగా వివరాలతో కిక్కిరిసిపోయేలా చేశారు. అందంగా రాశారు, అందులో సందేహం లేదు. కానీ అవస రంలేని దీర్ఘమైన నిరంతరాయ సాగతీతలు ఉన్నాయి. నిజానికి ఆ విషయాన్ని ఆయన ఒప్పుకొన్నారు. అనివార్యంగా కథనంలో అంత స్సూత్రతను కోల్పోయానని తనను తాను తిట్టుకున్నారు కూడా. అయితే అంతకుమించి ఆయన్ని తప్పు పట్టేందుకేమీ లేదని వెంటనే నేను గుర్తించాను. తన జన్మనక్షత్రాలు, కుటుంబ వివరాలు, పెంపుడు జీవుల విశేషాలు, లేదా తన డూన్ స్కూల్ నాటి జ్ఞాపకాలను అలుపు తెప్పించేలా చెప్పడంలోని ఆయన స్వీయ సంతృప్తిని మీరు క్షమించాలి. కేవలం యూనియన్ (విద్యార్థి సంఘం) అంటే ఉన్న మక్కువతో మాత్రమే ఆయన కేంబ్రిడ్జిలో చేరే సమయం రాగానే పుస్త కంలోని పఠనీయ పరిస్థితులు మెరుగవుతాయనడంలో సందేహం లేదు. యూనియన్ అధ్యక్షుడవడం ఆయన ఏకైక ఆశయం. పాపం ఆ ఆశయాన్ని సాధించలేకపోయారు. వాస్తవానికి యూనియన్ అధ్యక్ష స్థానానికి చేరువయ్యే సోపాన క్రమంలో అట్టడుగున ఉండే స్థాయీ సంఘానికి ఎన్నికవడానికి కూడా ఆయనకు కష్టమయింది. కానీ ఆయన ప్రయత్నంలోని మనోహరమైన నిజాయితీ మీ మనసును గెలుచుకుంటుంది. అంతేకాదు, 21వ శతాబ్దపు తొలి దశాబ్దానికి చెందిన ఈ రాజకీయ నాయకుడు పన్నెండవ శతాబ్దపు రౌండ్ చర్చి వెనుక ఉన్న కేంబ్రిడ్జి యూనియన్ చాంబర్లో రూపొందాడన్నది స్పష్టంగా తెలుస్తుంది. బంజరు భూముల వంటి ఈ ప్రారంభ పుటలను దాటితే డిసెంబరు మాసపు మొఘల్ గార్డెన్స్‌లా పుస్తకం వికసించి కనిపిస్తుంది. హఠాత్తుగా ఆయన అలవిమాలిన సమాచారం... చూపు తిప్పని వివరాలతో కూడిన కథనంగా మారిపోతుంది. కథకు అందే ప్రతి చిన్న చేరికతో ఆయన చూపుతున్న ప్రపంచం మనల్ని మరింతగా ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి నేను పుస్తకాన్ని కింద పెట్టలేకపోయాను. రాత్రి బాగా పొద్దుపోయే వరకు కూడా, దానికి ఏదీ సాటిరాని స్కాట్లాండ్ జలాలతో బలోపేతం అయిన పేజీలను తిప్పుతూ ఉండి పోయాను. ఓ, ఢిల్లీలోని ఉష్ణో గ్రతల కారణంగా కొంచెం ఐసుతో కూడా! ఆయన ఫారిన్ సర్వీసుకు ఎప్పటికీ ఎలా చేరుకోలేక పోయా రనే గాథను పుస్తకంలోని ముఖ్యాంశంగా పత్రికలు ఇచ్చి తీరాలి. మన ప్రముఖ పత్రికలలో ఒకటేదైనా ఇస్తుందని నాకు గట్టి నమ్మకం కనుక ఆ వివరాలను ఇక్కడ వెల్లడించడం ద్వారా పాఠకుల ఆసక్తిని ముందే చెప్పి పాడు చేయలేను. ఒకటైతే చెబుతాను. పుస్తకంలోని ఈ ముఖ్యాంశాన్ని ఇవ్వకపోతే మీ అభిమాన దిన పత్రికను కొనడం మానేయండి. ఏదేమైనా, కరాచీలో కాన్సుల్–జనరల్‌గా పాకిస్తాన్‌లోని ఆయన నాలుగేళ్ల కాలాన్ని పొందుపరచిన అధ్యాయం... మనవాళ్లలో చాలా మంది శత్రువుగా భావించే దేశంలోని ప్రేమ, అవగాహనలను తెలియ బరుస్తుంది. మీలో చాలామందిని అది అక్షరాలా ఆకట్టుకునేలా ఉంటుంది. పాకిస్తాన్‌ని ఆయన ఉన్నదున్నట్లుగా లేదా, నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ అప్పట్లో ఉన్న విధంగా... మనవాళ్లు మనలో కలిగించిన, విధేయతతో సత్యం అని మనం నమ్మిన అపోహలను, అబద్ధాలను చెల్లాచెదురు చేసేలా ఆయన చిత్రీకరించారు. మర్యాదపూర్వకంగా, ఆప్యాయతతో ఉండండి, అప్పుడు పాకి స్తానీలు అదే విధమైన తమ ప్రతి స్పందనతో మిమ్మల్ని ముంచె త్తుతారు అని మణి కటువైనది కాని సూచనగా మీకు చెబుతారు. ‘‘భారతీయ శత్రుత్వం, లేదా శత్రుత్వ భావన పాకిస్తానీలను వారి ప్రభుత్వం లేదా సైన్యం వెనుక సమైక్యం అయ్యేలా చేస్తోంది’’అంటారు మణి. ఇప్పుడూ అంతే కదా... మనం వారిని వారి సైన్యం బాహువుల్లోకి విజయవంతంగా నెట్టేస్తున్నాం. మనం ఎదుర్కోవలసిన అవసరం ఉన్న ప్రశ్నలను మణి లేవ నెత్తారు. ‘‘పాక్ పాలకులపై ఆగ్రహంతో మనం ఎందుకని పాకిస్తాన్ పౌరులకు వీసాలను తిరస్కరిస్తున్నాం? పాకిస్తానీయులందరూ మన దేశంలో విధ్వంసాన్ని సృష్టించే జిహాదీలేనని మనం నిజంగా నమ్ము తున్నామా? పాకిస్తానీ జనాభాలోని 99.99 శాతం మందికి ఏ మాత్రం సంబంధం లేని ఉగ్రవాద చర్యలకు ప్రతీకారం తీర్చు కోవడానికి సంఝౌతా ఎక్స్‌ప్రెన్‌ను ఎందుకు రద్దు చేయాలి? మనం కనుక పాకిస్తానీయులను భారతదేశంలోని తమ బంధువులతో కలవ నీయకుండా చేస్తే హురియత్ తన ఆజాదీ పిలుపును విరమించు కుంటుందని నిజంగానే మనం భావిస్తున్నామా?’’ ఇందుకు ఆయన ఇచ్చిన సమాధానాన్ని నేను సమర్థిస్తాను... అది భౌగోళికంగా కచ్చితంగా లేకుండా ధ్వనిపూర్వకంగా మాత్రమే దగ్గరగా ఉన్నప్పటికీ. ‘‘పరాగ్వేలో మనం పడిపోకుండా ఉన్నాం. పొరుగు దేశమైన పాకిస్తాన్లో నిలబడలేకున్నాం.’’ మనలో చాలా మందికి తెలియని ఒక సత్యాన్ని సంగ్రహించే ఒక వాక్యాన్ని మీకు వదిలేస్తాను. అయితే కొద్ది మంది దానిని అంగీకరించరు. ‘‘శాంతి కోసం జరిగే ప్రయత్నాలు భారతదేశంలో కంటే పాకిస్తాన్‌లోనే ఎక్కువని అయిష్టంగానే నేను ముగించాల్సి వచ్చింది.’’ ఈ మాటను మీరు అంగీకరిస్తే... మీరు ఈ పుస్తకాన్ని చదివేందుకు, మీరెంత కచ్చితమైన వారో తెలుసుకునేందుకు అది మిమ్మల్ని ప్రలోభపెడుతుందని నా ఆశ. అలా కాకపోతే మీకు ఎన్నడూ చెప్పని, లేదా మీ నుండి దాచి పెట్టినవాటిని ఎదుర్కోడానికి మీలో కోపాన్నైనా రేకెత్తించనివ్వండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సైబర్ ఉగ్రవాదానికి ఇక చెక్
సాక్షి, అమరావతి: సైబర్ ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. దేశంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో సమర్థంగా వ్యవహరిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆధ్వర్వంలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) పేరిట ఈ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పనుంది. విదేశాలను కేంద్రంగా చేసుకుని దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలు పదేళ్లుగా సైబర్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ప్రధానంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. రక్షణ, పరిశోధన సంస్థలు, ఇస్రో, విద్యుత్ గ్రిడ్లు, టెలీ కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ తదితర రంగాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సైబర్ నిపుణులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో సైబర్ దాడులను నిరోధించడంలో పూర్తిగా సఫలీకృతం కాలేకపోతున్నాయి. 2018లో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలపై 70,798 సైబర్ దాడులు జరిగాయి. కాగా.. 2023లో మొదటి 6 నెలల్లోనే ఏకంగా 1.12 లక్షల సైబర్ దాడులు జరగడం పరి స్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సమాచార వ్యవస్థపై సైబర్ దాడులతో కీలక వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ గ్రిడ్స్పైనా ఉగ్రవాదం గురి లద్దాక్‌లోని విద్యుత్ గ్రిడ్లపై ఇటీవల జరిగిన సైబర్ దాడులతో చైనా సరిహద్దుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ఉన్న ముప్పును గుర్తు చేసింది. కేరళ, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థల పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అనుమానితుల నివాసాల్లో సోదాలు నిర్వహించగా.. సైబర్ దాడులకు సంబంధించిన సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా దేశం ఎదుర్కొంటున్న సైబర్ ఉగ్రవాద పెనుముప్పునకు సంకేతంగా నిలుస్తున్నాయి. అందుకే వెంటనే అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగానే ఎన్ఐఏలోనే అంతర్భాగంగా యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్(ఏసీటీయూ)ను నెలకొల్పాలని నిర్ణయించింది. రాష్ట్రాలతో అనుసంధానం.. విదేశాలతో సమన్వయం సైబర్ ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) ఏర్పాటు తుది దశకు చేరుకుంది. భారీ స్థాయిలో పోలీస్ అధికారులు, సైబర్ భద్రతా నిపుణులు, ఇతర అధికారులు, సిబ్బందితోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏసీటీయూను రూపొందించే ప్రణాళికను కేంద్ర హోం శాఖ ఆమోదించింది. దీని పరిధిలో ఆర్థిక, ఐటీ, రక్షణ, టెలి కమ్యూనికేషన్లు, ఇతర రంగాలకు సంబంధించి సైబర్ సెల్స్ ఏర్పా టు చేస్తారు. దేశంలోని అన్ని పోలీసు శాఖల ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్స్ విభాగాలతోపాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన సంస్థల సైబర్ సెల్స్‌తో ఏసీటీయూను అనుసంధానిస్తారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగాలకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఉగ్రవాద సంస్థలు విదేశాలను కేంద్ర స్థానంగా చేసుకునే సైబర్ దాడులకు పాల్పడుతున్నాయి. అందుకు ఏసీటీయూకు విదేశాలతో సమన్వయం చేసుకునేందుకు ఇంటర్ పోల్‌తోపాటు విదేశీ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు అధికారాన్ని కలి్పస్తారు. విదేశాల్లోని దర్యాప్తు సంస్థలతో సమాచార మార్పిడి, ఇతర సహకారం కోసం ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటారు. రెండు నెలల్లో ఏసీటీయూను అధికారికంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. అందుకోసం ఎన్ఐఏ తుది సన్నాహాలను వేగవంతం చేస్తోంది. -
పాకిస్తాన్లో రెచ్చిపోతున్న ఉగ్రమూకలు
పాకిస్తాన్లో రెచ్చిపోతున్న ఉగ్రమూకలు -
ఉగ్రవాద సంస్థతో లింకులు.. కరీంనగర్లో ఎన్ఐఏ దాడుల కలకలం..
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ హుస్సేనిపురా, కర్ఖానాగడ్డ, నాకా చౌరస్తాలో గురువారం ఉదయం ఎన్ఐఏ బృందం తనిఖీలు చేపట్టింది. తబ్రేజ్ అనే వ్యక్తికి పీఎఫ్ఐ అనే నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో సోదాలు జరుపుతోంది. ప్రస్తుతం తబ్రేజ్ దుబాయ్‌లో ఉంటున్నాడు. కరీంనగర్లో, ఆదిలాబాద్‌లో ఎన్ఐఏ దాడులు జరుపుతోంది. పీఎఫ్ఐ టెర్రర్ ఆక్టివిటీపై సోదాలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: మజ్లిస్ సెక్యులర్ ఎలానో కేసీఆర్ చెప్పాలి: కిషన్‌రెడ్డి డిమాండ్ -
ఇంకా రహస్య యుద్ధమే విధానమా?
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే పాకిస్తాన్ లో దాదాపు 270 ఉగ్రదాడులు జరిగాయి. పాకిస్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని తెహ్రీక్–ఎ– తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) భయంకరమైన దాడులను చేస్తోంది. తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికీ, రాజకీయ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడానికీ ఒకవైపు పాకిస్తాన్ పోరాడుతుండగా... మరొకవైపు దేశంలో భద్రతా పరిస్థితి దిగజారుతోంది. అయినా పాకిస్తాన్ తన విదేశాంగ విధాన సాధనంగా రహస్య యుద్ధానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంది. కానీ తన సొంత గడ్డపై తీవ్రవాదం నుండి నిరోధక శక్తిని కోరుకుంటోంది. ఉగ్రవాదం, టీటీపీ విస్తరణ ఆందోళనకరమైనవి. సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ కే కాకుండా ఇవి దక్షిణాసియాకు కూడా తీవ్రమైన భద్రతా సవాళ్లను విసరనున్నాయి. పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలోని బజౌర్ జిల్లాలో జూలై 30న జమీయత్ ఉలేమా– ఎ–ఇస్లాం ఫజల్ (జేయూఎల్–ఎఫ్) సమావేశంపై జరిగిన ఉగ్రదాడిలో 50 మందికి పైగా మరణించారు, దాదాపు 200 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఖురాసాన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) ప్రకటించింది. గతంలో కూడా జేయూఎల్–ఎఫ్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ స్టేట్ అనేక దాడులు చేసింది. ఈ దాడులకు ప్రధాన కారణాలలో ఒకటి, అఫ్గానిస్తాన్ తాలిబన్లతో జేయూఎల్–ఎఫ్‌కు ఉన్న అనుబంధం; మరొక కారణం, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యానికి జేయూఎల్–ఎఫ్ ఇస్తున్న మద్దతును ఇస్లామిక్ స్టేట్ వ్యతిరేకించడం అని చెప్పాలి. బలూచిస్థాన్ లోని ఝోబ్ ఆయుధాగారంపై ఇటీవల జరిగిన దాడిలో తొమ్మిది మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. పాకిస్తాన్ ఉగ్రవాద ముఖచిత్రంలో తాజా ప్లేయర్ అయిన తెహ్రీక్– ఎ–జిహాద్ పాకిస్తాన్ (టీజేపీ) ఆ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. టీజేపీ, తెహ్రీక్–ఎ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)తో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. టీటీపీ పాకి స్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తున్న భయంకరమైన సంస్థ. తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికీ, రాజకీయ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడానికీ ఒకవైపు పాకిస్తాన్ పోరాడుతుండగా... మరొకవైపు దేశంలో భద్రతా పరిస్థితి మరింత దిగజారుతోంది. గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఖైబర్ పఖ్తున్ ఖ్వా, బలూచిస్తాన్లలో టీటీపీ దాడులు పెరిగాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే పాకిస్తాన్ లో దాదాపు 270 ఉగ్రదాడులు జరిగాయి. తాలిబన్లతో చెడిన మైత్రి అఫ్గానిస్తాన్‌తో పాకిస్తాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. 2021 ఆగస్ట్‌లో కాబూల్‌ను తాలిబన్ స్వాధీనం చేసుకున్న తర్వాత మాజీ పౌర, సైనిక నాయకత్వం వ్యూహాత్మక విజయంగా భావించిన దానికి ఇది విరుద్ధంగా నడుస్తోంది. అమెరికా నిష్క్రమణ తర్వాత పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సంబంధాలలో రెండు సమస్యలు కీలకంగా ఉన్నాయి. మొదటిది, డ్యూరాండ్ రేఖను సరిహద్దుగా గుర్తించడానికి తాలిబన్లు విముఖత వ్యక్తం చేయడంతోపాటు, సరిహద్దుల్లో కంచె వేయడాన్ని వారు ప్రతిఘటించడం. రెండవది, మిలిటెంట్ గ్రూపునకు మద్దతు నిచ్చే స్థావరాన్ని విడిచిపెట్టమని పాకిస్తాన్ సైన్యం పదే పదే సందేశం పంపినప్పటికీ, టీటీపీని తాలిబన్ ప్రోత్సహిస్తోంది. పైగా కాబూల్‌లో ప్రాతినిధ్య పాలన ఓడిపోయిన తర్వాత టీటీపీ గణనీయంగా బల పడింది. తాలిబన్ తో టీటీపీ బలమైన సైద్ధాంతిక (వ్యూహాత్మక) కూటమిని పంచుకున్నందున ఇది ఊహించదగినదే. టీటీపీ అనేది అఫ్గాన్ తాలిబన్లకు సైద్ధాంతిక విస్తరణ. పైగా ఉగ్రవాదంపై అమెరికా సాగించిన యుద్ధ సమయంలో తాలిబన్లకు ఇది మద్దతునిచ్చింది. కాబట్టి తిరిగి సహాయం చేయడం కోసం టీటీపీకి తోడ్పాటును అందించాల్సిన బాధ్యత అఫ్గాన్ తాలిబన్లపై ఉంది. అయితే తాలిబన్లు తమ భూభాగంలో టీటీపీ ఉందనడాన్ని ఖండించారు. అంతేకాకుండా అఫ్గాన్ గడ్డపై దాడులను చేయరాదని పాకిస్తాన్ ను హెచ్చరించారు కూడా. అయినప్పటికీ, టీటీపీకి అఫ్గాన్ తాలిబన్లు మద్దతు ఇస్తున్నట్లు పాకిస్తాన్ సైన్యం గుర్తించింది. పైగా ఈ విషయంలో తదుపరి చర్యపై బలమైన ప్రకటనలను జారీ చేస్తోంది. ఝోబ్ దాడి తరువాత, ‘అఫ్గానిస్తాన్‌లో టీటీపీకి అందుబాటులో ఉన్న సురక్షిత స్వర్గ ధామాలు, కార్యాచరణకు చెందిన స్వేచ్ఛపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు’ పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. ఇటువంటి దాడులు సహించలేనివనీ, పాకిస్తాన్ భద్రతా దళాలు వీటిపై సమర్థవంతంగా ప్రతిస్పందిస్తాయనీ ప్రకటించింది. ఉ్రగ్ర సంస్థలు ఏకమయ్యే ప్రమాదం ఐఎస్ఐఎల్ (దాయెష్), అల్–ఖైదా, అనుబంధ గ్రూపులు, వ్యక్తులకు సంబంధించి... ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి ‘ది ఎనలిటికిల్ సపోర్ట్ అండ్ శాంక్సన్స్ మానిటరింగ్ టీమ్’ సమర్పించిన 32వ నివేదిక టీటీపీ ఒక ప్రాంతీయ ముప్పుగా మారవచ్చని పేర్కొంది. ‘తాలిబన్ నియంత్రణలో దాడి ప్రయత్నాలను తప్పించు కుంటూ, అనేక రకాల విదేశీ సమూహాలు ఏకఛత్రంగా పనిచేస్తాయి లేదా ఐక్యమవుతాయి’ అని ఈ నివేదిక తెలిపింది. అయితే టీటీపీ గురించిన సైన్యం ప్రతిస్పందనపై పుష్కలమైన ఊహాగానాలు ఉన్నాయి. గత సంవత్సరం, పౌర, సైనిక ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు జారీ చేసింది. ఈ సందర్భంలో మూడు ఎంపికలను విశ్లేషించవచ్చు: ఒకటి: పాకిస్తాన్ ప్రభుత్వం టీటీపీని తిరిగి చర్చల బల్ల వద్దకు తీసుకువచ్చి కాల్పుల విరమణకు ప్రయత్నిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న గత ప్రభుత్వం టీటీపీ గ్రూప్‌తో చర్చలు జరపడానికి ప్రయత్నించి 100 మందికి పైగా టీటీపీ ఖైదీలను విడుదల చేసింది. ఇది టీటీపీ గ్రూప్ బలాన్ని పెంచింది. ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాని డిమాండ్లపై రాజీ పడేందుకు టీటీపీ ఎలాంటి సంకేతాన్నీ చూపలేదు. తీవ్రవాద దాడుల పెరుగుదలకు ఇమ్రాన్ ఖాన్ పదే పదే బాధ్యత వహించారని చెప్పవచ్చు. రెండు: అఫ్గాన్ తాలిబన్ ను పాకిస్తాన్ విశ్వాసంలోకి తీసుకుంటుంది. తరువాత గ్రూపును నియంత్రించే బాధ్యత తీసుకుంటుంది. అయితే తాలిబన్, టీటీపీల మధ్య బలమైన సంబంధాలు, తాలిబన్ నుండి టీటీపీ ప్రేరణ పొందడం, పైగా వారిని రోల్ మోడల్‌గా చూడటం ఈ అవకాశ సాధ్యా సాధ్యాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. అయితే, పాకిస్తాన్ లోని అస్థిర పరిస్థితులను బట్టి, ఇది అక్కడి పాలనా వ్యవస్థకు సాధ్యమైన ఎంపికగానే కనిపిస్తోంది. మూడు: టీటీపీని లక్ష్యంగా చేసుకుని ప్రతి–తిరుగుబాటు చేయడం. పాక్ మిలిటరీ ఇంతకుముందు 2014లో జర్బ్–ఎ–అజ్బ్, 2017లో రద్–ఉల్–ఫసాద్ వంటి ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించింది. ఇవి టీటీపీ సంఖ్యను, ఉగ్రవాద దాడులను నిర్వహించగల దాని సామర్థ్యాన్ని ప్రభావితం చేశాయి. అయినప్పటికీ ఈ గ్రూప్ తనను తాను నిలబెట్టుకుని తాలిబన్ మద్దతుతో వృద్ధి చెందింది. అయితే నాలుగు కారణాల వల్ల పాక్ సైనిక ప్రతిస్పందనకు అవరోధం ఏర్పడింది. గిరిజన ప్రాంతాల్లో గణనీయమైన స్థానభ్రంశాలు చోటు చేసుకోవడం; భయంకరమైన ఆర్థిక సంక్షోభం (దాంతో పాటు వరదల వల్ల కలిగిన దుఃస్థితి); ఏ సైనిక చర్య అయినా దేశంపై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతర చేయడం; అఫ్గాన్ తాలిబన్ల నుండి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు అపారంగా ఉండటం. కుట్రలో భాగమా? అయితే టీటీపీ గ్రూప్ కార్యకలాపాలను నియంత్రించకపోవడం పాక్ సైన్య ఉద్దేశపూర్వక కుట్ర చర్యలో భాగమనీ, ఉగ్రవాద వ్యతిరేక సహాయాన్ని అమెరికా నుంచి ఆకర్షించడానికే ఇలా చేస్తున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఏమైనా పాక్ సైన్యం తన ఎంపికలను అప్రమత్తంగా పరిశీలిస్తుండగా, పాకిస్తాన్ మాత్రం తన వ్యూహాత్మక ఎంపికల బురదలో చిక్కుకుందనేది వాస్తవం. పాకిస్తాన్ తన విదేశాంగ విధాన సాధనంగా రహస్య యుద్ధానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంది. కానీ తన సొంత గడ్డపై తీవ్రవాదం నుండి నిరోధక శక్తిని కోరుకుంటోంది. ఉగ్రవాదం, టీటీపీ విస్తరణ ఆందోళనకరమైనవి. సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ కే కాకుండా ఇవి దక్షిణాసియాకు కూడా తీవ్రమైన భద్రతా సవాళ్లను విసరనున్నాయి. శాలినీ చావ్లా వ్యాసకర్త డిస్టింగ్విష్డ్ ఫెలో, సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
దక్షిణాసియాపై ఉగ్ర పంజా
ఉగ్రవాద బెడద ఇంకా సజీవంగానే ఉన్నదని మన పొరుగునున్న పాకిస్తాన్లో తరచు జరిగే దాడులు నిరూపిస్తుండగా మన దేశంతోపాటు బంగ్లాదేశ్, మయన్మార్‌లలో తన కార్యకలాపాలు విస్తరించుకోవటానికి అల్ కాయిదా పథకరచన చేస్తున్నదని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అనుబంధ నివేదిక హెచ్చరిస్తోంది. ఉగ్రవాద సంస్థల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ అవస రమైన ఆంక్షలను సిఫార్సు చేసే విభాగం ఈ నివేదికను రూపొందించింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అఫ్గానిస్తాన్‌లో అడుగుపెట్టి రెండు దశాబ్దాలపాటు సాగించిన పోరాటం చెప్పుకోదగ్గ ఫలితం ఇవ్వకపోగా, అన్నివిధాలా దెబ్బతిన్న అమెరికా రెండేళ్ల క్రితం అక్కడినుంచి వెనుదిరిగింది. దేశంలోని అన్ని వర్గాల మధ్యా సామరస్య సాధనకు ప్రయత్నించటం, అఫ్గాన్ సమస్యతో సంబంధంవున్న దేశాలకు శాంతిప్రక్రియలో చోటీయటం వంటివేమీ చేయకుండానే అమెరికా కాడి కింద పారేసింది. దాని ఫలితంగానే ఆ దేశంలో మహిళలను దారుణంగా అణిచేయటం, ప్రత్యర్థులను కున్నవారిని తుదముట్టించటం కొనసాగుతూనే ఉంది. ఆఖరికి తమ గడ్డపై నుంచి ఎటువంటి ఉగ్ర వాద కార్యకలాపాలనూ అనుమతించబోమని అమెరికాకు ఇచ్చిన హామీని సైతం తాలిబన్ పాల కులు తుంగలో తొక్కారు. భద్రతా మండలి తాజా నివేదిక దాన్నే ధ్రువీకరిస్తోంది. తమ భూభాగంలో అల్ కాయిదా లేనేలేదని తరచు బుకాయిస్తున్న తాలిబన్ల తీరుకు భిన్నంగా అడపా దడపా ఆ ఉగ్ర సంస్థ జాడల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో అల్ కాయిదా ముఖ్యులు దాదాపు 60 మంది వరకూ ఉండగా, ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే మరో 400 మంది ఉన్నారని భద్రతామండలి నివేదిక తెలిపింది. వీరికి మద్దతుగా నిలబడే బంధువర్గాన్నీ, సన్నిహితులనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 2,000 మంది ఉంటా రని ఆ నివేదిక అంచనా వేసింది. అల్ కాయిదా నేతృత్వంలో రూపుదిద్దుకున్న మరో ఉగ్ర సంస్థ భారత ఉపఖండ అల్ కాయిదా (ఏక్యూఐఎస్)కు ప్రస్తుతం 200 మంది ఉగ్రవాదులున్నారని, ఈ సంస్థ పాకిస్తాన్‌లోని తెహ్రీక్–ఏ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)తో విలీనమై మన దేశంలోని జమ్మూ, కశ్మీర్‌తోపాటు మయన్మార్, బంగ్లాదేశ్‌లలో కార్యకలాపాలకు సిద్ధమవుతున్నదని భద్రతామండలి నివేదిక అంటున్నది. టీటీపీ ఆనుపానులు కనిపెట్టడంలో, ఆ సంస్థను నియంత్రించటంలో పాకిస్తాన్ పదే పదే విఫలమవుతోంది. టీటీపీతో పాకిస్తాన్ ప్రభుత్వం జరుపుతున్న చర్చలు నిరుడు నవంబర్‌లో విఫలమయ్యాక ఉగ్ర దాడులు మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో ఒక మసీదుపై దాడిచేసి 95 మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు, తాజాగా ఆదివారం ఖైబర్ ఫక్తున్ఖ్వా రాష్ట్రంలో ఆత్మా హుతి దాడి జరిపి, 40 మంది మరణానికి కారకులయ్యారు. అయితే ఈ దాడుల వెనక తాము లేమని టీటీపీ చెబుతోంది. ఆ సంస్థకు దన్నుగా నిలుస్తున్న అఫ్గాన్ ప్రభుత్వం కూడా ఖండిస్తోంది. ఇరుగు పొరుగుకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ చివరకు అదే ఉగ్రవాదం సాలెగూటిలో చిక్కుకుని విలవిల్లాడటం, దాడుల కారకులెవరో కూడా గుర్తుపట్టలేని నిస్సహాయ స్థితిలో పడటం వింతేమీ కాదు. దేశంలో లెక్కకు మించిన ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు సాగిస్తు న్నాయని పాక్ సైన్యం అంచనా వేస్తోంది. ఇవన్నీ అటు సైన్యం పైనా, ఇటు పౌరుల పైనా తరచు దాడులు సాగిస్తున్నాయి. ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పుడు ఏ సంస్థా తన ప్రమేయం ఉన్నదని ప్రకటించటం లేదు. ఇప్పుడు టీటీపీ, అల్ కాయిదాలు విలీనం కాబోతున్న వార్త నిజమే అయిన పక్షంలో దక్షిణాసియా ప్రాంత దేశాలతోపాటు పాకిస్తాన్‌కు కూడా మరింత ముప్పు ఖాయం. ఈ రెండు సంస్థలూ అఫ్గాన్‌లో ఇప్పటికే శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. ఆ సంస్థలను అన్నివిధాలా కట్టడి చేస్తున్నామని భ్రమల్లో కూరుకుపోయిన ప్రపంచ దేశాలు ఒకసారి సమీక్షించుకోవటం మంచిది. తమ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించబోమని గతంలో ఇచ్చిన హామీకి తాలిబన్లు కట్టుబడటం లేదని ఈ పరిణామాలన్నీ నిరూపిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలేమిటన్న అంశంపై ఐక్యరాజ్యసమితి దృష్టి పెట్టాలి. తగినన్ని నిధులు లేకుండా, ఎవరి అండదండలూ లేకుండా ఉగ్రవాద సంస్థలు వర్ధిల్లటం ఉత్తమాట. దాదాపు 20 ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో తిష్ఠ వేసి, కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తాలిబన్ పాలకులకు తెలియదనుకోవటం భ్రమ. తమతోపాటు కలిసినడుస్తున్నట్టు కనిపిస్తున్న నేతల్లో కొందరు వేరే ఉగ్ర సంస్థలకు విధేయులుగా మసులుకుంటున్నారని, వారు వివిధ ప్రభుత్వ విభాగాల్లోకి ప్రవేశిస్తున్నారని తాలిబన్లకు తెలియదనుకోవటం అమాయకత్వం. ఆ సంస్థల నేత లను ఉద్దేశపూర్వకంగానే అధికారిక వ్యవస్థల్లోకి ప్రవేశపెడుతున్నారని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. పాకిస్తాన్ సైతం మొదట్లో టీటీపీకి, అల్ కాయిదాకు సహాయ సహకారాలందించిన మాట వాస్తవం. టీటీపీ నాయకత్వం తనకు ఎదురుతిరగటం మొదలయ్యాక దానిపై దాడులు సాగిస్తోంది. ఒక బ్రిగేడియర్‌ను కోల్పోవటంతో సహా ఎన్నో నష్టాలను చవిచూస్తోంది. అటు అమె రికాకు తప్పుడు సమాచారం అందించి తాలిబన్లను అఫ్గాన్‌లో పునఃప్రతిష్ఠించటంలో కీలక పాత్ర పోషించి దెబ్బతింది. ఏ విలువలకూ కట్టుబడని పాలకుల చేతుల్లో అఫ్గాన్ ఉండటం దక్షిణాసియా ప్రాంత దేశాలకు మాత్రమే కాదు... ప్రపంచానికే ముప్పు తెస్తుంది. కనుక తాజా నివేదికపై భద్రతా మండలి దృష్టి సారించాలి. ఇతరత్రా అంశాల్లో ఎలాంటి విభేదాలున్నా ఉగ్రవాదాన్ని కట్టడి చేయ టంలో అన్ని దేశాలూ ఏకాభిప్రాయానికి రావాలి. -
SCO Summit: ఉగ్రపోరులో ద్వంద్వ ప్రమాణాలొద్దు
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలను కఠినంగా అణచివేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. పాకిస్తాన్‌కు పరోక్షంగా చురకలు అంటించారు. కొన్ని దేశాలు ప్రభుత్వ విధానాల్లో భాగంగానే సీమాంతర ఉగ్రవాదానికి నిస్సిగ్గుగా మద్దతిస్తున్నాయని, అలాంటి దేశాలను విమర్శించడానికి ఎవరూ సంకోచించవద్దని సూచించారు. మంగళవారం షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) వర్చువల్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే శక్తులను అణచివేయడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి ఉగ్రవాదం ఒక పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముప్పు తొలగిపోవాలంటే ఎస్సీఓ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ అంతం చేయాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు. ఎస్సీఓలో సంస్కరణలకు మద్దతు ప్రపంచ దేశాలన్నీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత పెద్ద సవాలుగా మారిందన్నారు. పొరుగు దేశాలతో వివాదాలు, అంతర్గతంగా ఉద్రిక్తతలు, మహమ్మారులతో ఎన్నో దేశాలు అల్లాడిపోతున్నాయని చెప్పారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని తెలిపారు. ఆసియా, ఐరోపా ఖండాల్లో శాంతికి, సౌభాగ్యానికి, అభివృద్ధికి ఎస్సీఓ అనేది ఒక కీలకమైన వేదికగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీఓ సభ్య దేశాలతో సహకారం మరింత పెంపొందించుకుంటామని అన్నారు. స్టార్టప్‌లు, నవీన ఆవిష్కరణలు, సంప్రదాయ వైద్యం, యువజనం సాధికారత, డిజిటలీకరణ వంటి రంగాల్లో ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకుంటామని వెల్లడించారు. ఎస్సీఓలో సంస్కరణలు, ఆధునీకరణ ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థలో ఇరాన్ సైతం సభ్యదేశంగా చేరుతుండడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీఓ వర్చువల్ సదస్సులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్‌తోపాటు కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎస్సీఓ 2001లో షాంఘైలో ఏర్పాటయ్యింది. భారత్ 2005లో ఈ సంస్థలో పరిశీలక దేశంగా చేరింది. 2017లో పూర్తిస్థాయి సభ్యదేశంగా మారింది. ఆసియాలో కొత్త ప్రచ్ఛన్న యుద్ధం వద్దు: జిన్‌పింగ్ బీజింగ్: ఆసియా ప్రాంతంలో కొత్తగా ప్రచ్ఛన్న యుద్ధాన్ని సృష్టించేందుకు బయటి శక్తులు కుట్ర పన్నుతున్నాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పరోక్షంగా అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎస్సీఓ వర్చువల్ సదస్సులో మాట్లాడారు. ప్రాంతీయంగా శాంతిని కాపాడుకోవడానికి ఎస్సీఓ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఉగ్రవాదంపై కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ... ఇటీవల జరిగిన సాయుధ తిరుగుబాటును రష్యా సమాజం మొత్తం ఒక్కటై వ్యతిరేకించిందని చెప్పారు. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కంకణబద్ధులై ఉన్నారని తెలిపారు. వాగ్నర్ గ్రూప్ యత్నాలను ఆయన ప్రస్తావించారు. -
భారత్ అభివృద్ధే ప్రపంచాభివృద్ధి
వాషింగ్టన్: మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయడంలో ‘అయితే, కానీ’లకు ఎంతమాత్రం తావులేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఉగ్రవాదాన్ని నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ప్రధాని మోదీ గురువారం వాషింగ్టన్ డీసీలో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 60 నిమిషాలపాటు మోదీ ప్రసంగం కొనసాగింది. పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లతోపాటు సందర్శకుల గ్యాలరీల నుంచి వందలాది మంది భారతీయ–అమెరికన్లు మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అమెరికాలో 9/11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు, భారత్‌లో 26/11 దాడులు జరిగి దశాబ్దం పూర్తయినా ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచానికి ఇప్పటికీ సవాలు విసురుతూనే ఉన్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మతి తప్పిన సిద్ధాంతాలు కొత్తరూపును, కొత్త గుర్తింపును సంతరించుకుంటున్నాయని, అయినప్పటికీ వాటి ఉద్దేశాలు మాత్రం మారడం లేదని ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి ముమ్మాటికీ శత్రువేనని స్పష్టం చేశారు. ముష్కర మూకలను అణచివేయడంలో ఎవరూ రాజీ పడొద్దని సూచించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ పొరుగు దేశాలను ఎగుమతి చేస్తున్న దుష్ట దేశాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ఏం మాట్లాడారంటే.. భారీగానే కాదు.. వేగంగానూ అభివృద్ధి ‘‘గత దశాబ్ద కాలంలో వంద మందికిపైగా అమెరికా పార్లమెంట్ సభ్యులు భారత్‌లో పర్యటించారు. భారతదేశ అభివృద్ధిని తెలుసుకోవాలని, అక్కడి ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. భారత్ ఇప్పుడేం చేస్తోంది? ఎలా చేస్తోంది? అన్నదానిపై అందరికీ ఆసక్తి ఉంది. ప్రధానమంత్రి హోదాలో అమెరికాలో నేను మొదటిసారి పర్యటించినప్పుడు భారత్ ప్రపచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. మేము భారీగానే కాదు, వేగంగానూ అభివృద్ధి సాధిస్తున్నాం. భారత్ ప్రగతి సాధిస్తే మొత్తం ప్రపంచం ప్రగతి సాధిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం .. భూగోళంపై ఆరింట ఒక వంతు జనాభా భారత్‌లోనే ఉంది. ఇండో–పసిఫిక్‌లో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం.. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఇతర దేశాల సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి చార్టర్ సూచిస్తోంది. ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) అన్ని దేశాలూ అనుసరించాలి. చార్టర్‌ను గౌరవించాలి. కానీ, ఇండో–పసిఫిక్‌పై బలప్రయోగం, ముఖాముఖి ఘర్షణ అనే నీలినీడలు ప్రసరిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. భారత్–అమెరికా భాగస్వామ్యానికి ఇది కూడా ఒక ప్రాధాన్యతాంశమే. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ఆవశ్యకతపై అమెరికాతో మా అభిప్రాయాలు పంచుకున్నాం. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం పరిఢవిల్లాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలతో, భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. ‘క్వాడ్’ వంటి కూటములు ఈ ప్రయత్నంలో ఒక భాగమే. ఇండో–పసిఫిక్ బాగు కోసం క్వాడ్ కృషి చేస్తోంది. ఉక్రెయిన్ సంఘర్షణ ఆసియా ప్రాంతంలో సమస్యలు సృష్టించిన మాట వాస్తవమే. ఇది యుద్ధాల శకం కాదని, చర్చలు, దౌత్యమార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని సూటిగా చెప్పా. ఇదొక గొప్ప గౌరవం 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ అమెరికా పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రెండుసార్లు ఈ అవకాశం దక్కడం గర్వకారణం. మనం ఒక ముఖ్యమైన కూడలిలో ఉన్నాం. గత కొన్నేళ్లుగా కృత్రిమ మేధ(ఏఐ)లో ఎన్నో ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అదేసమయంలో మరో ఏఐ(అమెరికా, ఇండియా)లో మరిన్ని ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ శతాబ్దం ఆరంభంలో రక్షణ సహకారం విషయంలో మనం(భారత్, అమెరికా) అపరిచితులమే. పెద్దగా రక్షణ సహకారం లేదు. కానీ, ఇప్పుడు భారత్‌కు అమెరికా అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామిగా మారింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణం ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత్ తల్లిలాంటిది. భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా వర్ధిల్లుతున్నాయి. సమానత్వం, ప్రజల గౌరవానికి స్ఫూర్తినిచ్చేదే ప్రజాస్వామ్యం. ఆలోచనకు, వ్యక్తీకరణకు రెక్కలు తొడిగేది ప్రజాస్వామ్యం. ప్రాచీన కాలం నుంచి ప్రజాస్వామ్య విలువలకు భారత్ ఆయువుపట్టుగా నిలుస్తోంది. వెయ్యి సంవత్సరాల పరాయి పాలన తర్వాత భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణాన్ని పండుగలా జరుపుకుంది. ఇది కేవలం ప్రజాస్వామ్య ఉత్సవం కాదు, వైవిధ్య వేడుక. సామాజిక సాధికారత, ఐక్యత, సమగ్రత వేడుక. డిజిటల్ చెల్లింపుల అడ్డా భారత్ యువ జనాభా అధికంగా ఉన్న ప్రాచీన దేశం భారత్. సంప్రదాయాలకు పెట్టింది పేరు భారత్. నేటి యువత భారత్‌ను టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నారు. భారత్‌లో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దేశంలో ప్రత్యక్ష నగదు బదిలీల విలువ 320 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ ప్రక్రియలో 25 బిలియన్ డాలర్లు ఆదా చేశాం. భారత్‌లో ఇప్పుడు అందరూ స్మార్ట్ఫోన్ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వీధి వ్యాపారుల సైతం యూపీఐ సేవలను వాడుకుంటున్నారు. గత ఏడాది ప్రపంచంలో జరిగిన ప్రతి 100 రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 46 చెల్లింపులు భారత్‌లోనే జరిగాయి. వేలాది మైళ్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు, చౌక డేటాతో భారత్‌లో సాంకేతిక విప్లవం కొనసాగుతోంది. మహిళల సారథ్యంలో అభివృద్ధి ప్రాచీన కాలం నాటి వేదాలు నేటి మానవాళికి గొప్ప నిధి లాంటివి. మహిళా రుషులు సైతం వేదాల్లో ఎన్నో శ్లోకాలు, పద్యాలు రాశారు. ఆధునిక భారతదేశంలో మహిళలు ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ప్రజలను ముందుకు నడిపిస్తున్నారు. దేశంలో మహిళల సారథ్యంలో అభివృద్ధి జరగాలన్నదే మా ఆకాంక్ష. గిరిజన తెగకు చెందిన ఓ మహిళ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 10.5 లక్షల మంది మహిళలు వివిధ పదవులు చేపట్టారు. సైన్యం, నావికాదళం, వైమానిక దళంలోనూ విశేషమైన సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశం భారత్. అంగారక గ్రహంపైకి మనుషులను చేర్చేందుకు చేపట్టిన మార్చ్ మిషన్‌లో మహిళామణులు పనిచేస్తున్నారు. మహిళలకు సాధికారత కలి్పసే సమూల మార్పులు రావడం ఖాయం. ఆడపిల్లల చదువులు, వారి ఎదుగుదల కోసం పెట్టుబడి పెడితే వారు మొత్తం కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. సంస్కరణల సమయమిది.. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం వచి్చంది. ప్రపంచం మారుతోంది. అంతర్జాతీయ సంస్థలూ మారాల్సిందే. భారత్–అమెరికా మరింత సన్నిహితమవుతున్నాయి. పరస్పర సంబంధాల విషయంలో నూతన ఉషోదయం కనిపిస్తోంది. భారత్–అమెరికా సంబంధాలు కేవలం ఈ రెండు దేశాలనే కాదు, ప్రపంచ భవితవ్యాన్ని కూడా నిర్ధారిస్తాయి. మహాత్మా గాం«దీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌తోపాటు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం పోరాడినవారిని మేమే స్మరించుకుంటున్నాం. భారత్‌లో 2,500కు పైగా రాజకీయ పారీ్టలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలను 20 వేర్వేరు పార్టీలు పరిపాలిస్తున్నాయి. దేశంలో 22 అధికార భాషలున్నాయి. వేలాది యాసలున్నాయి. కానీ, మేమంతా ఒకే స్వరంతో మాట్లాడుతాం. ప్రపంచంలోని అన్ని నమ్మకాలు, విశ్వాసాలకు భారత్‌లో స్థానం ఉంది, వాటిని గౌరవిస్తున్నాం. వైవిధ్యం అనేది భారత్‌లో ఒక సహజ జీవన విధానం. అమెరికా పార్లమెంట్లో భారతీయ–అమెరికన్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సభలో సమోసా కాకస్ ఫ్లేవర్ ఉంది. ఇది మరింత విస్తరించాలి. భారత్‌లోని భిన్న రుచులు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నా’’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నాను. -
ఉగ్ర నెట్‌వర్క్‌లోకి చిన్నారులు, మహిళలు..!
శ్రీనగర్: భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) మరో ప్రమాదకర పన్నాగాన్ని అమలు చేస్తోంది.కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల సంప్రదాయ సమాచార నెట్‌వర్క్‌ను సైన్యం దాదాపు నిర్వీర్యం చేసింది. దీంతో ఐఎస్ఐ మరో ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఉగ్ర మూకల మధ్య సమాచార మార్పిడికి మహిళలు, బాలికలు, మైనర్లను పావులుగా వాడుకుంటోంది. ఇటీవలి కాలంలో ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు తమకు దొరికాయని శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ అమన్‌దీప్ సింగ్ అవుజ్లా తెలిపారు. ముఖ్యంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, డ్రగ్స్, ఆయుధాల రవాణాకు మహిళలు, బాలికలు, మైనర్లను వాడుకోవడం అనే కొత్త ప్రమాదం వచ్చిపడిందన్నారు. ఉగ్రమూకలు సమాచార బట్వాడాకు ప్రస్తుతం సెల్ఫోన్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయని చెప్పారు. లోయలో ప్రశాంతతకు భగ్నం కలిగించేందుకు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉగ్ర మూకలు వ్యూహాలు పన్నుతుండటంతో బలగాలు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. కశ్మీర్లో చొరబాట్లు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, పీర్ పంజాల్ దక్షిణ ప్రాంతం, పంజాబ్‌ల్లో పెరిగాయన్నారు. ఉత్తర కశ్మీర్‌లోని మచిల్‌లో ఇటీవలి చొరబాటుయత్నమే ఇందుకు తాజా ఉదాహరణ అని చెప్పారు. హింస పట్ల స్థానిక ప్రజల్లోనూ మార్పు కనిపిస్తుండటం ప్రశంసనీయమైన విషయమన్నారు. భద్రతా బలగాలకు కశ్మీర్ ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు. -
మూడు దఫలుగా హైదరాబాద్ మాడ్యూల్ ప్లాన్
-
పాక్ సైన్యం ఆగడం
రాజకీయంగా తానే పెంచి పోషించి ప్రధానిగా చేసిన ఇమ్రాన్‌ఖాన్ తనపైనే తిరుగుబాటు చేయడాన్ని జీర్ణించుకోలేక నిరుడు ఏప్రిల్‌లో పదవీభ్రష్టుణ్ణి చేసిన సైన్యం చివరకు మంగళవారం ఆయన్ను అరెస్టు చేసి పగ చల్లార్చుకుంది. అధికారం పోగానే అవినీతి, ఉగ్రవాదం, మత దూషణ, హత్య, హింసాకాండను ప్రోత్సహించటం వంటి 140 ఆరోపణల్లో చిక్కుకుని వీలుదొరికినప్పుడల్లా తమపై విరుచుకుపడుతున్న ఇమ్రాన్‌పై సైన్యం ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. అదును కోసం ఎదురుచూస్తోంది. కొన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకుని ఒక అవినీతి ఆరోపణ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరైన ఇమ్రాన్‌ను ఆ కోర్టు ప్రాంగణంలోని గది తలుపులు బద్దలుకొట్టి పారామిలిటరీ బలగాలు తీసుకుపోగలిగాయంటే సైన్యం ఎంత బరితెగించిందో అర్థమవుతుంది. ‘ఇది చట్టవిరుద్ధం కాదా? ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతపైనా, న్యాయస్థానంపైనా దాడి కాదా?’ అంటూ ఇస్లామా బాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆమర్ ఫరూక్ ఆక్రోశించటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. జనరల్ ముషార్రఫ్ ఏలుబడిలో దానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడిన న్యాయవ్యవస్థ ఇప్పుడు జస్టిస్ ఫరూక్ ఆక్రోశాన్ని వింటుందా, సైన్యంతో తలపడటానికి సిద్ధపడుతుందా అన్నది చూడాలి. నిరుడు నవంబర్‌లో జరిగిన హత్యాయత్నం నుంచి ఇమ్రాన్ క్షేమంగా బయటపడగా అప్పటినుంచీ పాక్ సైన్యం తనను చంపడానికి కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. తన అరెస్టుకు ముందు ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని పాక్ సైన్యం హెచ్చరించిన కొన్ని గంటలకే ఇమ్రాన్ అరెస్టయిన తీరు చూస్తే ఆ దేశం ఇంకా ఆటవిక న్యాయంలోనే బతుకీడుస్తోందని తెలుస్తుంది. అధికారంలో ఉన్నవారిని కూలదోయటం, నచ్చినవారిని అందలం ఎక్కించటం సైన్యానికి కొత్త గాదు. అలాగే తమ బద్ధ శత్రువులుగా మారినవారిని అంతమొందించేందుకు కూడా వెనకాడదు. ఇందుకు మాజీ ప్రధానులు జుల్ఫికర్ అలీ భుట్టో, ఆయన కుమార్తె బేనజీర్ భుట్టో ఉదాహరణలు. భుట్టోను ఒక హత్యకేసులో ఇరికించి విచారణ తంతు నడిపించి ‘చట్టబద్ధంగా’ ఉరితీస్తే, బేనజీర్‌ను ఎన్నికల ర్యాలీలో ఉండగా కాల్చిచంపారు. పాకిస్తాన్ ఏర్పడ్డాక దాదాపు పదేళ్లు ఏదోమేరకు సవ్యంగానే గడిచింది. కానీ ఎన్నికైన ప్రభుత్వంపై 1958లో తొలిసారి అప్పటి సైనిక దళాల చీఫ్ జనరల్ అయూబ్ ఖాన్ తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఆ తర్వాత జనరల్ యాహ్యాఖాన్, జనరల్ జియావుల్ హక్, జనరల్ పర్వేజ్ ముషార్రఫ్‌లు ఆ తోవనే పోయారు. మధ్య మధ్య పౌర ప్రభుత్వాలు ఏర్పడినా అవన్నీ అల్పాయుష్షు సర్కారులే. బేనజీర్ భుట్టో మూడు దఫాలు ప్రధానిగా చేసినా ఎప్పుడూ పూర్తి కాలం కొనసాగలేకపోయారు. ఆమాటకొస్తే నవాజ్ షరీఫ్ ఎంతోకొంత నయం. ఆయన తొలిసారి ప్రధాని అయిన కొంతకాలానికే ముషార్రఫ్ సైనిక తిరుగు బాటు జరిపి ప్రభుత్వాన్ని కూలదోశారు. చివరకు అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరగటంతో 2008లో ఎన్నికలు నిర్వహించక తప్పలేదు. అప్పటినుంచీ సైన్యం పంథా మార్చుకుంది. అందువల్లే ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అయిదేళ్లూ నిరాటంకంగా పాలించింది. అనంతరం 2013 ఎన్నికల్లో నెగ్గిన నవాజ్ షరీఫ్ సైతం పూర్తికాలం అధికారంలో కొనసాగారు. అలాగని ఆయన నిర్భయంగా పాలించారనడానికి లేదు. సైన్యం నీడలోనే పాలన సాగింది. భారత్‌తో చెలిమికి ఆయన ప్రయత్నించినప్పుడల్లా చొరబాటుదార్లను మన దేశంలో ప్రవేశ పెట్టి విధ్వంసాలకు దిగటం, అధీనరేఖ వద్ద కాల్పులు జరపటం సైన్యానికి పరిపాటయింది. జనంలో అంతగా పలుకుబడిలేని ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ)కు అండదండలందించి 2018 ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి దోహదపడింది. ఆ ఎన్నికల్లో సైన్యం జరిపిన రిగ్గింగ్ వల్లే అదంతా సాధ్యమైందని ఆరోపణలొచ్చాయి. కానీ మూడేళ్లు గడిచేసరికే ఇద్దరికీ చెడింది. నిరుడు ఏప్రిల్‌లో తెరవెనక తతంగం నడిపి విపక్షాలను ఏకంచేసి ఇమ్రాన్‌పై జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గేలా చేసి ఆయన్ను పదవి నుంచి దించగలిగింది. సైన్యం సాగించిన దౌష్ట్యాన్ని సామాజిక మాధ్యమాల్లో, కొన్ని చానెళ్లలో చూసిన పాక్ భగ్గుమంటోంది. పలు నగరాలు, పట్టణాలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. లాహోర్‌లోని సైనిక కోర్ కమాండర్ నివాసంపై ఆందోళనకారులు దాడి చేయగా, అనేకచోట్ల విధ్వంసం చోటుచేసుకుంది. సైనిక తిరుగుబాటులో అధికారం చేజిక్కించుకుని, బూటకపు ఎన్నికల్లో దేశాధ్యక్షుడైన జియా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి మతోన్మాదాన్ని ప్రోత్సహించిన నాటినుంచీ పాక్‌లో మతానిది పైచేయి అయింది. ఆ తర్వాత అధికారంలోకొచ్చినవారు సైతం ఆ బాటనే పోతున్నారు. మరోపక్క దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఐఎంఎఫ్ నుంచి రావాల్సిన 650 కోట్ల డాలర్ల రుణం గత నవంబర్‌నుంచి పెండింగ్‌లో పడింది. వచ్చే నెలలో అది మురిగిపోతుంది. ఇక విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పాక్ వద్ద 445 కోట్ల డాలర్లు మించి లేవు. ఆ మొత్తం మహా అయితే ఒక నెల దిగు మతులకు సరిపోతుంది. ఈ సంక్షోభాన్ని అధిగమించడ మెలాగో తెలియక ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ అయోమయంలో కూరుకుపోగా, సైన్యం ఇమ్రాన్ జోలికిపోయి చేజేతులా మంట రాజేసింది. తాజా పరిణామాల పర్యవసానంగా అది సైనిక పాలనలోకి జారుకున్నా ఆశ్చర్యం లేదు. మన పొరుగు నున్న దేశం కనుక మనం అత్యంత అప్రమత్తంగా ఉండకతప్పదు. -
ఉగ్రవాదానికి కాంగ్రెస్ వెన్నుదన్ను
సాక్షి, బళ్లారి/తుమకూరు: ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ పార్టీ ఉగ్రవాదానికి అండగా నిలుస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, వారి ముందు సాగిలపడుతోందని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారిలో శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘ద కేరళ స్టోరీ’ చిత్రం గురించి ప్రస్తావించారు. సుందరమైన రాష్ట్రంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారని అన్నారు. కాంగెస్ మాత్రం ఈ చిత్రాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. కేరళలో చోటుచేసుకున్న ఉగ్ర కుట్రలను ‘ద కేరళ స్టోరీ’ చిత్రం బట్టబయలు చేస్తోందని ప్రశంసించారు. కేవలం ఒక రాష్ట్రంలో ముష్కర మూకల ఆగడాలు, మోసపూరిత విధానాలపై ఈ చిత్రం నిర్మించారని పేర్కొన్నారు. దేశాన్ని నాశనం చేసే ఉగ్రవాదానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుండడం నిజంగా దురదృష్టకరమని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నవారికి ఆ పార్టీ వత్తాసు పలుకుతోందని, వారితో తెరవెనుక రాజకీయ బేరసారాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అసలు నైజం ఏమిటో కర్ణాటక ప్రజలు తెలుసుకోవాలని కోరారు. కర్ణాటకను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చాలంటే ఇక్కడ శాంతి భద్రతలు చాలా ముఖ్యమని ప్రధాని మోదీ చెప్పారు. ఉగ్రవాద రహిత రాష్ట్రంగా ఉండడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకున్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీకి కడుపు నొప్పి వస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించబోతున్నామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం తుమకూరులో భారీ రోడ్డు షోలో పాల్గొన్నారు. ఆ కుట్ర శబ్దాలు వినిపించవు మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఉగ్రవాదం కూడా స్వభావం మార్చుకుంటోందని, స్మగ్లింగ్, డ్రగ్స్ వ్యాపారం, మత ఘర్షణలకు ఉగ్రవాదంతో సంబంధం ఉంటోందని మోదీ గుర్తుచేశారు. గత కొన్నేళ్లలో కొత్తరకం ఉగ్రవాదం పుట్టుకొచ్చిందన్నారు. ఈ ఉగ్రవాదంలో సమాజాన్ని గుల్లబార్చే కుట్రల శబ్దాలు వినిపించవని చెప్పారు. నిశ్శబ్దంగానే కార్యకలాపాలు సాగిపోతుంటాయని, దీనిపై కోర్టులు కూడా ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. -
PM Modi:వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కేరళలో ప్రకంపనలు సృష్టించిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ఉగ్ర కుట్రల ఆధారంగా తీశారని, తీవ్రవాదానికి సంబంధించిన చేదు నిజాన్ని ఈ చిత్రంలో చూపించారని పేర్కొన్నారు. కర్ణాటక బల్లారీలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసింగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ది కేరళ స్టోరీ చిత్రంపై తొలిసారి స్పందిస్తూ దానికి మద్దతు తెలిపారు. 'కొద్ది రోజులుగా ది కేరళ స్టోరీ చిత్రంపై పెద్ద చర్చ జరుగుతోంది. కేరళలో ఉగ్ర శక్తుల గురించి ఈ చిత్రం బహిర్గతం చేసింది. ఉగ్రవాదం గురించి తెలియజేసింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయల కోసం కాంగ్రెస్ ఉగ్ర శక్తులకు మద్దతుగా నిలుస్తోంది. అంతేకాదు ఉగ్రశక్తులతో ఆ పార్టీ గుట్టుగా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి' అని మోదీ పేర్కొన్నారు. కాగా.. ది కేరళ స్టోరీ చిత్రంపై సీఎం పినరయి విజయన్ సహా చాలా మంది ప్రముఖులు విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రం గురించి ఈ సినిమాలో తప్పుగా చూపించారని, కేవలం తమపై ధ్వేషంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని మండిపడ్డారు. కేరళవ్యాప్తంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేఫథ్యంలో గురువారం కొచ్చిలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న పీవీఆర్ సినిమాస్.. షోను అర్ధాంతరంగా రద్దు చేసింది. మరోవైపు చిత్ర నిర్మాత, దర్శకులు మాత్రం దీన్ని వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించామని చెబుతున్నారు. కేరళకు చెందిన 32 వేల మంది అమ్మాయులు మతం మార్చుకుని సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇది పూర్తిగా అసత్యమని, విద్వేషంతో రూపొందించిన చిత్రమని కేరళ సహా దేశంలోని పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పించారు. చదవండి: శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించిన ఎన్సీపీ కమిటీ -
Video: పాక్ మంత్రికి నమస్కారంతో స్వాగతం పలికిన జైశంకర్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో గోవాలో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల మండలి సమావేశానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ సదస్సుకు వచ్చిన పలు దేశాల మంత్రులను భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మర్యాదపూరక్వంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో దాయాది పాక్ మంత్రి భుట్టోను కూడా నమస్కారంతో స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి ఫోటో కూడా దిగారు. ఆ తర్వాత వేదిక వద్దకు వెళ్లండంటూ భుట్టోను జైశంకర్ పంపతున్న దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 🇷🇺 🇮🇳 WATCH: India's External Affairs Minister S. Jaishankar welcomes Russian Foreign Minister Sergey Lavrov to the #SCO2023 Council of Foreign Ministers' meeting in #Goa.#India #Russia pic.twitter.com/9Z7mw9bCu9 — Sputnik India (@Sputnik_India) May 5, 2023 అనంతరం షాంఘై సదస్సులో పాక్ మంత్రి సమక్షంలోనే విదేశాంగమంత్రి జై శంకర్ ఉగ్రవాద ముప్పు, సీమాంతర ఉగ్రవాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద ముప్పు నిరాటంకంగా కొనసాగుతోందని దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించకూడదని అన్నారు. సరిహద్దు తీవ్రవాదంతో సహా దాని అన్ని రకాలైన ఉగ్రవాదాన్ని పాతరేయాలని పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎస్సీఓ ఆదేశాలలో ముఖ్యమైనదని, దీనిపై కలిసి కట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచారు. చదవండి: ఘోర ప్రమాదం.. ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి One of the best Foreign Ministers of India🇮🇳 Mr. S Jaishankar 🔥🔥 pic.twitter.com/HjdEe0nDfR — kanishka 🇮🇳 (@KanishkaDadhich) May 5, 2023 కాగా గత 12 ఏళ్లలో తర్వాత భారత్ గడ్డపై పాక్ మంత్రి అడుగుపెట్టిన వ్యక్తి బుట్టోనే కావడం విశేషం. షాంఘై రెండురోజుల పర్యటన నిమిత్తం పాక్ మంత్రి బుట్టో గురువారమే గోవా చేరుకున్నారు. ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు జైశంకర్ గురువారం రాత్రి ప్రత్యేక విందు ఇచ్చారు. .బెనాలిమ్‌లోని సముద్ర తీరంలో ఉన్న తాజ్ రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన ఈ డిన్నర్‌కు వివిదే విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. పాక్ మంత్రి బిలావల్ భుట్టోకూడా ఈ విందుకు వచ్చారు. Swag mera desi hai 🔥😎😉 (SCO Summit, Goa)#SJaishankar ji pic.twitter.com/MhL1vLdQxp — Stranger (@amarDgreat) May 5, 2023 అయితే, విందులో బిలావల్, జైశంకర్ మాట్లాడుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ.. వీరిద్దరూ షేక్‌హ్యండ్ ఇచ్చుకొని పలకరించుకున్నారని విశ్వసనీయ వర్గాల త్వారా తెలిసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే భారత ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. మరోవైపుతే భారత్- పాక్ విదేశాంగ మంత్రుల మధ్య ద్వైపాక్షిక చర్చ ఉంటుందా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. చదవండి: మణిపూర్: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి.. హెల్త్ కండిషన్ సీరియస్ -
SCO Defence Ministers Meet: ఉగ్రవాదాన్ని పెకిలిద్దాం
న్యూఢిల్లీ: ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేయాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ విషయంలో షాంఘై కో–అపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సభ్యదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రభూతం ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమేనని, దాన్ని అంతం చేయాల్సిందేనని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఎస్సీఓ సభ్యదేశాల రక్షణ శాఖ మంత్రుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదానికి అండదండలు అందించేవారి పీచమణచాలని చెప్పారు. కూటమిలోని సభ్యదేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకొనేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేయాలని అన్నారు. చైనా, పాకిస్తాన్ తీరును పరోక్షంగా ఆయన తప్పుపట్టారు. ఎస్సీఓ సదస్సుకు రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. సభ్య దేశాల నడుమ విశ్వాసం, సహకారం మరింత బలోపేతం కావాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం శాంతి, భద్రతకు ఊతం ఇవ్వాలన్నదే తమ ఆశయమని వివరించారు. ఎస్సీఓ సదస్సుకు చైనా, రష్యా తదితర సభ్య దేశాల రక్షణశాఖ మంత్రులు హాజరయ్యారు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హాజరు కాలేదు. ఆయన బదులుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రత్యేక సహాయకుడు మాలిక్ అహ్మద్ ఖాన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. షాంఘై సహకార కూటమి 2001లో షాంఘైలో ఏర్పాటయ్యింది. ఇందులో భారత్, రష్యా, చైనా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. 2017లో పాకిస్తాన్ శాశ్వత సభ్యదేశంగా మారింది. -
దక్షిణ లెబనాన్, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
జెరూసలేం: దక్షిణ లెబనాన్‌తోపాటు పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లోని హమాస్ ఉగ్రవాద శిబిరాలపై శుక్రవారం తెల్లవారుజామున వైమానిక దాడులు నిర్వహించింది. బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో యూదులు పాస్ఓవర్ అనే వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గురువారం దక్షిణ లెబనాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ వైపు 30కిపైగా రాకెట్లు ప్రయోగించారు. ఈ ఘటనలో ఇజ్రాయెల్‌లో ఇద్దరు గాయపడ్డారు. స్వల్పంగా ఆస్తి నష్టం వాటిల్లింది. రాకెట్ల ప్రయోగానికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లో పాతుకుపోయిన పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ శిబిరాలే లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. యుద్ధ విమానాల ద్వారా ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన క్షిపణులు లెబనాన్‌లో టైర్ సమీపంలోని రషీదియా పాలస్తీనా కాందిశీకుల క్యాంప్ వద్ద నేలను తాకాయని అసోసియేటెడ్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఒకరు వెల్లడించారు. లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలీషియాకు ఇరాన్ అండదండలు అందిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యంపై హిజ్బుల్లా మిలీషియా దాడులు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే, తాము కేవలం పాలస్తీనా మిలిటెంట్ల శిబిరాలపైనే వైమానిక దాడులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో పాలస్తీనా వాసి ఒకరు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
పంజాబ్‌లో పొంచి ఉన్న ముప్పు
‘రాడికల్ మతబోధకుడు’ అమృత్‌పాల్ సింగ్ గత సంవత్సరం దాకా నీట్‌గా షేవ్ చేసుకున్నాడు. తనలోని సహజ ప్రతిభలకు అవకాశం లభించనుందని గ్రహించి గడ్డం పెంచడం ప్రారంభించాడు. పోలీసులు చర్య తీసుకోవడాన్ని అడ్డుకునేందుకు గురు గ్రంథ్ సాహిబ్‌ను తన అనుచరులు నిత్యం వెంట ఉంచుకునేలా చేశాడు. ఇప్పుడు సమస్యల్లా పంజాబ్‌లో ఉగ్రవాదం తిరిగి పొడసూపే అవకాశం ఉండటమే. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మన పొరుగుదేశం మళ్లీ సరిహద్దు పొడవునా ఘర్షణలు రేపడానికి ప్రయత్నించవచ్చు. అందుకే ఆప్ సర్కారు వైఫల్యం పేరుతో తనకు స్వాగతం పలకని రాష్ట్రంలో ప్రయోజనాలు పొందడానికి కేంద్రం ప్రయత్నించకూడదు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ద్విముఖ వ్యూహం అవసరం. ‘రాడికల్ మతబోధకుడి’గా అభివర్ణిస్తున్న అమృత్‌పాల్ సింగ్ మరో భిండ్రాన్వాలే కావాలని ఆశ పడుతున్నాడు. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించడం అంత సులభం కాదు. తప్పుదోవ పట్టిన రాజకీయ తంత్రాల ఉత్పత్తి –భిండ్రాన్వాలే. నిరుద్యోగం, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, తీవ్రరూపం దాల్చిన రష్యా–ఉక్రెయిన్ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కలిగించిన ప్రభావాలు వంటి వాటి కారణంగా పంజాబ్ యువతలో ఏర్పడిన ప్రస్తుత నిస్పృహ స్థితిని వాడుకోవాలని అమృత్‌పాల్ స్పష్టంగా కోరుకుంటున్నాడు. మీడియా నివేదికల ప్రకారం, అమృత్‌పాల్ అనుయాయుల్లో ఒకరైన లవ్ ప్రీత్ సింగ్ ‘తూఫాన్’ను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. చామ్‌కౌర్ సాహిబ్‌కు చెందిన వరీందర్ సింగ్‌ను అపహరించి, దాడి చేశారనే ఆరోపణలపై అతడిని అరెస్టు చేశారు. దీనిపై అజ్నాలా పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్లో అమృత్‌పాల్ పేరు కూడా జోడించారు. లవ్‌ప్రీత్ విడుదలకు డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్ వరకు మార్చ్ చేయాలని అమృత్‌పాల్ ప్రకటించాడు. సమస్య తీవ్రతను గ్రహించడంతో చుట్టుపక్కల పోలీసు స్టేషన్ల నుంచి పోలీసు బలగాలను రప్పించి అజ్నాలా వద్ద మోహరించారు. అమృత్‌పాల్, అతడి ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు చెందిన మద్దతు దారులు భారీస్థాయిలో కత్తులు, కొందరు తుపాకులు కూడా ధరించి బారికేడ్లను ఛేదించుకుని పోలీసు స్టేషన్ లో ప్రవేశించారు. ప్రభుత్వ ఆస్తికి భారీ నష్టం కలిగించారు. గుంపు తమపై దాడిచేస్తే ఏం చేయాలనే విషయమై వందమంది శిక్షణ పొందిన పోలీసులకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చివుంటే సాధారణ పరిస్థితుల్లో వీరు గుంపుతో సమర్థంగా వ్యవహరించి వారిని చెదరగొట్టి ఉండేవారు. అయితే మూకహింసను ఎదుర్కోవడానికి ఎంతమేరకు బలాన్ని ప్రయోగించవచ్చో స్పష్టంగా వారికి చెప్పనట్లయితే, పరిస్థితి అదుపు తప్పడానికే ఆస్కార ముంటుంది. అదే జరిగింది కూడా. సదరు పోలీసు స్టేషన్లో జరిగిన ఘటన పోలీసు నాయకత్వం, రాష్ట్ర రాజ కీయ నాయకత్వం వైఫల్య మేనని నేను కచ్చితంగా చెబుతాను. వార్తల ప్రకారం సీనియర్ ఐపీఎస్ అధికారులు తర్వాత స్పందించి, అమృత్‌పాల్‌తో మాట్లాడారు. వరీందర్ కిడ్నాప్ వ్యవ హారంలో లవ్‌ప్రీత్ పాత్ర లేదని అమృత్సర్ పోలీస్ కమిషనర్, అజ్నాలా ఎస్ఎస్పీకి అమృత్‌పాల్ నచ్చజెప్పినట్లు కనబడుతోంది. దాంతో లవ్ప్రీత్ను విడుదల చేయడానికి సీనియర్ అధికారులు అంగీ కరించారు. ఇలా లొంగిపోవడం ఇకనుంచీ పోలీసు, రాజకీయ నాయ కత్వానికి సమస్యలు తీసుకొస్తుంది. తన ప్రాథమిక ఫిర్యాదులో లవ్‌ప్రీత్ పేరును వరీందర్ బయట పెట్టారు. అలాంటప్పుడు నిజంగా కిడ్నాప్ ఘటన జరిగిందా అని పోలీసులు తనిఖీ చేసివుండవలసింది. వరీందర్‌ను కొట్టిందెవరు? అమృత్‌పాల్ వ్యాఖ్యలను అతడు వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. అదే నిజమైతే, దాడి వెనుక ఉద్దేశం అర్థమవుతోంది. ఇలాంటి ముఖ్యమైన రాజకీయ పరిణామం పట్ల అజ్నాలా పోలీసులు తమ పైఅధికార్లను లూపులో పెట్టివుండవచ్చు. అయిదు పోలీసు స్టేషన్లపై అధికారం కలిగిన ఆఫీసర్ మాత్రమే సమీప పోలీసు స్టేషన్ల నుంచి అదనపు బలగాల మోహరింపునకు ఆదేశాలు ఇవ్వ గలడు. ఒకవేళ సాయుధ బటాలియన్ నుంచి రిజర్వ్ బలగాలను తరలించి ఉంటే, అలాంటి ఆదేశం రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి మాత్రమే వచ్చి ఉంటుంది. అలాంటప్పుడు ఎఫ్ఐఆర్లో పొందు పర్చిన వ్యక్తిని అరెస్టు చేయాలనే నిర్ణయం గురించి తమకు తెలీదని సీనియర్లు చెప్పుకొనే అవకాశమే లేదు. చట్టవిరుద్ధమైన డిమాండ్లకు లొంగిపోవడంలో రాజకీయ నాయకత్వం పాత్రను నేను చూస్తున్నాను. ఈ విషయాలన్నీ ముఖ్య మంత్రికి తెలీకుండా పోయే ప్రశ్నే లేదు. భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఇంకా భద్రతా రంగంపై పట్టు సాధించవలసే ఉంది. లేదంటే ఇది ‘ఆప్’ ప్రభుత్వ ఆయువు పట్టును దెబ్బకొడుతుంది. ఇప్పుడు ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, అతి సున్నిత మైన ఈ సరిహద్దు రాష్ట్రంలో ఉగ్రవాదం తిరిగి పొడసూపే అవకాశం ఉండటమే. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మన పొరుగుదేశం మళ్లీ సరిహద్దు పొడవునా ఘర్షణలు రేపడానికి ప్రయత్నించవచ్చు. 1980లలో మన పొరుగు దేశమే ఖాలిస్తానీ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆశ్రయం కల్పించింది. పైగా సరిహద్దు పొడవునా ఆయుధాలను సర ఫరా చేసింది. అమృత్‌పాల్‌తో కూడా మన పొరుగు దేశం సంబంధాలు పెట్టుకోవచ్చు. ఇప్పటికే ఆ ప్రయత్నం జరిగిందో! ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి తగిన వ్యక్తి– జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోబాల్. ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఇదంతా ఎలా జరిగింది, దీన్ని పరిష్కరించడానికి ఎవరిపై విశ్వాసం ఉంచాలి వంటి వివరాలు ఆయనకు తెలుసు. అమృత్ పాల్‌కు అసమంజసమైన ఆకర్షణ రావడాన్ని అనుమతించకూడదు. జయింపశక్యం కాని వలయం అతడి చుట్టూ ఏర్పడకముందే అతడిని అదుపు చేయాలి. అజ్నాలాలో అతడు విజయాన్ని రుచిచూశాడు. దానికి అనుగుణంగా పంజాబ్‌లో అతడికి మద్దతు పెరుగుతుంది. బీజేపీకి స్వాగతం పలకని రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనం పొందడానికి అజ్నాలాలో పంజాబ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ముందు పీటికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. అలా చేస్తే అది కూడా తప్పిదమే అవుతుంది. అప్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆప్ సిక్కు ముఖచిత్రంగా మాన్‌ను ముఖ్య మంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ కూడా కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను తన పార్టీ సిక్కు ముఖంగా తీసుకొచ్చింది. కానీ అతడి బలం పనిచేయలేదు. మోదీ ప్రభుత్వం ముందున్న తెలివైన ఎంపిక ఏమిటంటే, పంజాబ్‌ను దాని మానాన దాన్ని వదిలేయడమే. లేకుంటే తన చేతులను తానే కాల్చుకోవలసి వస్తుంది. దీనికంటే మించిన చెత్త ఎంపిక ఏమిటంటే, రాజకీయాలు ఆడటమే. ఎందుకంటే మాన్, ఆయన పార్టీని ఒక పిల్లకాకి విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేశాడు. ఇతగాడు గత సంవత్సరం దాకా నీట్‌గా షేవ్ చేసుకుని దుబాయ్‌లో ఇదమిత్థం కాని జీవితం గడుపుతుండేవాడు. తనలోని సహజ ప్రతిభలకు అవకాశం లభించనుందని గ్రహించిన అమృత్‌పాల్ అప్పటినుంచి గడ్డం పెంచడమే కాకుండా, భిండ్రాన్ వాలేను అనుకరిస్తూ దుస్తులను ధరించడం ప్రారంభించాడు. పోలీ సులు చర్య తీసుకోవడాన్ని అడ్డుకునేందుకు గురు గ్రంథ్ సాహిబ్‌ను తన అనుచరులు నిత్యం వెంట ఉంచుకునేలా చేశాడు. సమస్యను మొగ్గలోనే తుంచేసే అవకాశం లేకుండా పోయింది. రాజకీయ, పోలీసు నాయకత్వం చేయవలసిన పని కష్టతరమైంది. ఆప్ ప్రభుత్వం డోబాల్ సహాయం తీసుకోవాలి. సలహాదారుగా తన పాత్రను ప్రకటించకుండానే తెర వెనుక ఆయన చాలా చేయగలడు. ఈ సమస్యకు ద్విముఖ వ్యూహం అవసరం. పంజాబ్ జనాభాలో చాలా భాగం, ముఖ్యంగా గ్రామాల్లోని జాట్ సిక్కు రైతులు 1980, 90ల మొదట్లో ఉగ్రవాదం బీభత్సంతో తీవ్ర బాధలకు గురయ్యారు. ప్రజారాశులతో కమ్యూనికేషన్ మార్గాలు పెరిగినందున, అమృత్ పాల్, అతడి అనుయాయులను అదుపులోకి తీసుకోవాలి. రాజకీయ ప్రతిపక్షాలు, విమర్శకులకు వ్యతిరేకంగా అన్ని చట్టాలను ఉపయోగి స్తున్న బీజేపీ... రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని కాటు వేయడానికి ముందే ఉగ్రవాదంపై ఆ చట్టాలను ఉపయోగించాలి. జూలియో రిబేరో వ్యాసకర్త పోలీస్ మాజీ ఉన్నతాధికారి, ‘పద్మభూషణ్’ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఉగ్రవాదంపై ‘క్వాడ్’ కార్యాచరణ బృందం
న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో కొత్త రూపు సంతరించుకుంటున్న ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని కఠినంగా అణచివేయడానికి చేపట్టాల్సిన చర్యల కోసం ‘వర్కింగ్ గ్రూప్ ఆఫ్ కౌంటర్–టెర్రరిజం’ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ‘క్వాడ్’ దేశాల విదేశాంగ మంత్రులు ప్రకటించారు. ‘క్వాడ్’ కూటమిలో భాగమైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు ఎస్.జైశంకర్, ఆంటోనీ బ్లింకెన్, యోషిమస హయషీ, పెన్నీ వాంగ్ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రపంచమంతటా ఉగ్రవాద భూతం విస్తరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్ర మూకల ఆటకట్టించడానికి నాలుగు దేశాల కార్యాచరణ బృందం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. చట్టబద్ధ పాలన, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, శాంతియుతంగా వివాదాల పరిష్కారానికి మద్దతు కొనసాగుతుందని తేల్చిచెప్పారు. జీ7 కూటమికి జపాన్, జీ20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తుండడంతోపాటు ఈ ఏడాది ఆసియా–పసిఫిక్ ఎకనామిక్ కో–ఆపరేషన్(ఏపీఈసీ)కి అమెరికా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ‘క్వాడ్’ అజెండా అమలు కోసం సన్నిహితంగా కలిసి పనిచేయాలని తీర్మానించుకున్నట్లు వివరించారు. అనంతరం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఢిల్లీలో ‘రైజినా డైలాగ్’లో పాల్గొన్నారు. -
ఉగ్రవాదం, తీవ్రవాదం 80% తగ్గాయి: అమిత్ షా
నాగపూర్: నరేంద్ర మోదీ హయాంలో కశ్మీర్లో ఉగ్రవాదం, ఈశాన్యంలో∙వామపక్ష తీవ్రవాదం 80 శాతం దాకా తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. శనివారం ఇక్కడ మరాఠా వార్తా లోక్మత్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోదీకి ముందు దాకా దేశం పలు అంతర్గత భద్రతా సవాళ్లతో సతమతమవుతూ ఉండేదన్నారు. అలాంటిది గతేడాది కశ్మీర్ లోయను ఏకంగా 1.8 కోట్ల మంది పర్యాటకులు సందర్శించడం గొప్ప ఘనత అని అభిప్రాయపడ్డారు. ‘‘అంతేగాక గత 70 ఏళ్లలో మొత్తం కలిపి కశ్మీర్‌కు రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వస్తే గత మూడేళ్లలోనే మరో రూ.12 వేల కోట్ల పెట్టుబడులను మోదీ ప్రభుత్వం సాధించింది. పైగా కశ్మీర్లో ప్రతి ఇంటికీ నల్లా నీరు, కరెంటు అందించాం. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వామపక్ష తీవ్రవాదం పూర్తిగా అదుపులోకి వచ్చింది. 60 శాతం ప్రాంతాల్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దు చేశాం కూడా. రక్షణ రంగంలో దేశం స్వయంసమృద్ధంగా మారుతోంది. ఉపగ్రహ ప్రయోగాల్లో మనమెంతగా దూసుకెళ్తున్నదీ ప్రపంచమంతా చూస్తోంది. మన స్టార్టప్‌లు దుమ్ము రేపుతున్నాయి. ఇలా అన్ని రంగాల్లోనూ భారత్‌లో ప్రపంచంలో అత్యుత్తమ స్థానంలో చూడాలన్న ప్రధాని మోదీ ఆశయం నెరవేరేందుకు ఇంకెంతో దూరం లేదు’’ అన్నారు. అందుకు తగ్గట్టుగా వచ్చే పాతికేళ్ల అమృత కాలంలో పలు లక్ష్యాలు పెట్టుకుని ముందుకెళ్తున్నట్టు వివరించారు. -
ఆరోగ్యం ముసుగులో ఉగ్రవాదం.. పీఎఫ్ఐ చార్జిషీటులో విస్మయకర అంశాలు
సాక్షి, కరీంనగర్: రాడ్డు.. కర్ర..కత్తి ఏ ఆయుధాన్ని ఎలా వాడాలి..? ఎలా దాడి చేయాలి? మనిషి శరీరంలో ఎక్కడెక్కడ సున్నిత ప్రాంతాలు ఉంటాయి..? ఎక్కడ కొడితే ప్రాణాలు పోతాయి..? ఇవీ.. ఆరోగ్య పరిరక్షణ ముసుగులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) రహస్యంగా నిర్వహించిన కార్యకలాపాలు. శారీరక, మానసిక ఆరోగ్యం ముసుగులో పీఎఫ్ఐ చేసిన సంఘ వ్యతిరేక చర్యలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. యోగా.. కరాటే పేరుతో ఆయుధాల వినియోగం, మనుషులను సులువుగా చంపడం ఎలా..? తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారని తేలింది. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో అనేక కీలక విషయాలు వెలుగుచూశాయి. ఇవే విషయాలను ఎన్ఐఏ ఇటీవల దాఖలు చేసిన చార్జిషీటులోనూ పేర్కొంది. శారీరక ఆరోగ్యానికి, ఆత్మరక్షణ పేరిట నడిపిన కరాటే శిబిరాలు, యోగా పేరిట నడిపిన ధ్యానకేంద్రాలన్నీ ఉగ్ర కార్యకలాపాలకు నిలయంగా మారాయని చార్జిషీటులో పేర్కొంది. ఎలా బయటపడిందంటే..? పీఎఫ్ఐ కీలక సభ్యుడు, నిజామాబాద్‌కు చెందిన (స్వస్థలం జగిత్యాల) అబ్దుల్‌ఖాదర్‌ను పోలీసులు నిజామాబాద్‌లో అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఇతను నిజామాబాద్‌లో దాదాపు 200 మంది ముస్లిం యువకులకు శిక్షణ ఇచ్చినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. గతేడాది జూలై 4న పోలీసులు అబ్దుల్ ఖాదర్, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో సాదుల్లా, ఇమ్రాన్, మొబిన్‌ను మరుసటి రోజు అరెస్టు చేశారు. వీరి నెట్‌వర్క్‌ను ఏపీలోని కడప, కర్నూలు నుంచి పీఎఫ్ఐ సభ్యులు ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో నిజామాబాద్ 4వ టౌన్లో పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో నిందితుడు అబ్దుల్‌ఖాదర్ విదేశాలకు వెళ్లి రావడం, పలు దేశాల నుంచి పీఎఫ్ఐకి నిధులు తెచ్చినట్టు కూడా పోలీసులకు సమాచారం ఉంది. దీంతో ఎన్ఐఏ రంగంలోకి దిగి సెక్షన్ 120 (బి), 153(ఎ), ఐపీసీ సెక్షన్లు 17, 18, 18(ఎ), 18(బి) యూఏ(పి) యాక్ట్ కింద ఆగస్టు 26న తిరిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో అబ్దుల్ ఖాదర్ (ఆటోనగర్, నిజామాబాద్), అబ్దుల్ అహ్మద్ (ముజాహెద్నగర్, నిజామాబాద్), షేక్ ఇలియాస్ అహ్మద్ (ఖాజానగర్, నెల్లూరు), అబ్దుల్ సలీమ్ (ఇస్లాంపూర్, జగిత్యాల), షేక్ షాదుల్లా (గుండారం, నిజామాబాద్), ఫిరోజ్ ఖాన్ (శాంతినగర్, ఆదిలాబాద్), మహమ్మద్ ఉస్మాన్ (తారకరామనగర్, జగిత్యాల), సయ్యద్ యాహియా సమీర్ (ఆటోనగర్, నిజామాబాద్), షేక్ ఇమ్రాన్ (ముజాహెద్నగర్, నిజామాబాద్), మొహమ్మద్ అబ్దుల్ ముబీన్ (హబీబ్‌నగర్, నిజామాబాద్), మొహమ్మద్ ఇర్ఫాన్ (హుస్సేన్‌పురా, కరీంనగర్)పై చార్జీషీటు దాఖలు చేసింది. హింసలో సుశిక్షితులు నిజామాబాద్‌లో శిక్షణ పొందిన 200 మంది యువతను పథకం ప్రకారం ముందుగా ఆరోగ్యం, ధ్యానం పేరిట యోగా, కరాటే అంటూ పోగుచేశారు. ఆపై వారిలో దేశ వ్యతిరేక భావజాలం నింపుతూ వారి మనసులను కలుషితం చేసేందుకు యత్నించారు. యోగా క్యాంపుల ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టడం, కరాటే పేరిట దాడి చేయడంలో తర్ఫీదు ఇచ్చారని ఎన్ఐఏ చార్జిషీటులో పేర్కొంది. గొంతు, తల, ఉదరం తదితర సున్నిత ప్రాంతాలపై దాడి చేయడం, ఎక్కడ కొడితే మనిషి త్వరగా మరణిస్తాడన్న విషయాలపైనా తరగతులు ఇచ్చినట్లు కూడా ఎన్ఐఏ ఛార్జిషీటులో స్పష్టం చేసింది. కొనసాగుతున్న నిఘా.. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాపై ఎన్ఐఏ నిఘా కొనసాగుతోంది. గతంలో క్రియాశీలకంగా ఉన్న సిమి (స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) నిషేధానికి గురవడంతో పీఎఫ్ఐ ముసుగులో తిరిగి కార్యకలాపాలు మొదలుపెట్టినట్టు గుర్తించింది. అందుకే దేశవ్యాప్తంగా దీని కార్యకలాపాలకు కళ్లెం వేసేందుకు గతేడాది సెప్టెంబర్ 18న పీఎఫ్ఐ స్థావరాలపై దాడులు చేసింది. అందులోభాగంగా జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించింది. పలువురి నుంచి కీలక డాక్యుమెంట్లు, పీఎఫ్ఐ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుంది. సంస్థకు సంబంధించి ఇంకా ఎవరైనా సానుభూతిపరులు, స్లీపర్‌సెల్స్ ఉన్నారా? అన్న కోణంలో నిరంతర నిఘా కొనసాగుతూనే ఉంది. -
ఉగ్రవాదాన్ని విస్తరిస్తున్న పాకిస్తాన్‌ను ఇంకా ఏమనాలి?
వియన్నా: భారత్‌లోకి ఉగ్రవాదులను ఎగ దోస్తూ, ఉగ్రవాదాన్ని విస్తరింపజేస్తున్న పాకిస్తాన్‌పై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమర్థించుకున్నారు. ఆస్ట్రియా జాతీయ వార్తాప్రసార సంస్థ ఓఆర్‌ఎఫ్‌కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ పలు అంశాలు మాట్లాడారు. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రస్థానం పాక్‌లో ఉందని మీరు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ఒక భారతీయ దౌత్యవేత్త హోదాలో సమర్థించుకుంటారా అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు జైశంకర్ బదులిచ్చారు ‘భారత పార్లమెంట్‌పై దాడి, ముంబై వంటి నగరాల్లో దాడి చేసి భారతీయులను, విదేశీ పర్యాటకులను చంపి, రోజూ సరిహద్దు గుండా ఉగ్రవాదుల చొరబాట్లకు ప్రయత్నించే పాక్‌నుద్దేశించి ఇంకా ఏమనాలి? ఇంకాస్త పరుష పదం వాడితే బాగుండేది. ఉగ్రవాదానికి కేంద్రస్థానం అనే పదం మంచిదే’ అని వ్యాఖ్యానించారు. ‘పట్టపగలే నగరాల్లో ఉగ్రవాదులకు సైన్యం తరహాలో యుద్ధతంత్రాలు నేర్పిస్తున్నారు. ఈ విపరీతాలను యూరప్ దేశాలు ఎందుకు నిలదీయవు? భారత్, పాక్ మధ్య మళ్లీ యుద్ధం వస్తుందేమోననే భయం ప్రపంచానికి ఉంటే ముందుగా ఉగ్రవాదంపై ప్రపంచదేశాలు దృష్టిపెట్టాలి’ అని హితవు పలికారు. ఇదీ చదవండి: వీడియో: అన్నా చెల్లెలి అనురాగం.. చెల్లిపై ఉప్పోంగిన ఆప్యాయతతో.. -
డ్రగ్స్ నేరగాళ్లకు జైలే గతి
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగస్వాములైన బడా నేరగాళ్లను రాబోయే రెండేళ్లలో కచ్చితంగా జైలుకు తరలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. డ్రగ్స్ దందాలో సంపాదించిన డబ్బును దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ పాపపు సొమ్ము దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా తయారవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ సమస్యపై బుధవారం లోక్‌సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో అమిత్ షా మాట్లాడారు. మాదక ద్రవ్యాల కట్టడికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్ వ్యాపారం చేసేవారిపై కేసుల నమోదు అధికారాన్ని బీఎస్ఎఫ్, సీమా సురక్షాబల్, అస్సాం రైఫిల్స్‌కు కట్టబెట్టామని అమిత్ షా గుర్తుచేశారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. 2014 నుంచి 2022 వరకూ రూ.97,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. 2006 నుంచి 2013 దాకా రూ.23,000 కోట్ల విలువైన సరుకును స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. -
ఉగ్ర అడ్డాగా పాక్
ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదానికి పాకిస్తాన్‌ను కేంద్ర స్థానంగా ప్రపంచ దేశాలన్నీ పరిగణిస్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ‘‘పాక్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఉగ్రభూతాన్ని పెంచి పోషించడం మానుకోవాలి’’ అంటూ హితవు పలికారు. ‘‘ఉగ్రవాదం ఎక్కడ పురుడు పోసుకుందో ప్రపంచమంతటికీ తెలుసు. పామును ఇంట్లో పెంచుకుంటే ఎప్పటిౖMðనా కాటేయడం ఖాయమని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అప్పట్లో పాక్‌ను హెచ్చరించారు’’ అని గుర్తుచేశారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో ‘అంతర్జాతీయ ఉగ్రవాదం, సవాళ్లు, పరిష్కార మార్గాలు’ అంశంపై భేటీకి మంత్రి నేతృత్వం వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆసియాలో, ఇతర ప్రాంతాల్లో ఉగ్ర దాడుల వెనుక ఉన్నదెవరో అందరికీ తెలుసన్నారు. దక్షిణాసియాలో ఉగ్రవాదం ఎప్పుడు అంతమవుతుందని పాక్ జర్నలిస్టు ప్రశ్నించగా ‘మీ దేశ మంత్రులనే అడగండి’ అని బదులిచ్చారు. -
G20 Summit: నిర్ణయాత్మకంగా జీ20 ఎజెండా
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచంలో శక్తివంతమైన జీ–20(గ్రూప్–20) అధ్యక్ష బాధ్యతలను భారత్ గురువారం లాంఛనంగా చేపట్టింది. ఏడాది పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించనుంది. జీ–20 అధినేతగా భారతదేశ లక్ష్యాలను వివరిస్తూ ప్రధాని మోదీ తాజాగా పత్రికలు, వెబ్సైట్లో ఒక ఆర్టికల్(వ్యాసం) విడుదల చేశారు. పలు ట్వీట్లు చేశారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ స్ఫూర్తితో ప్రపంచదేశాలను ఏకం చేసేందుకు కృషి చేస్తామని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి వంటివి నేడు మానవళికి అతిపెద్ద సవాళ్లుగా మారాయని, అందరం కలిసికట్టుగా వాటిని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ప్రపంచంలో కొన్ని దేశాల కంఠశోషను ఎవరూ వినిపించుకోవడం లేదని ఆక్షేపించారు. జీ–20 దేశాలతోపాటు.. నిర్లక్ష్యానికి గురైన దేశాలను కూడా కలుపుకొని ముందుకెళ్తామని, అందరితో చర్చించి, తమ జీ–20 ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటామని వివరించారు. పాత ఆలోచనా ధోరణికి స్వస్తి ‘మానవ కేంద్రీకృత ప్రపంచీకరణ’కు సంబంధించిన ఒక కొత్త నమూనా కోసం ప్రపంచ దేశాల ప్రజలంతా చేతులు కలిపి, ఉమ్మడిగా కృషి చేయాలని సూచించారు. ప్రపంచ దేశాల నడుమ ఆహారం, ఎరువులు, ఔషధ ఉత్పత్తుల సరఫరాను రాజకీయ కోణంలో చూడొద్దని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో మొత్తం మానవళికి మేలు కలిగేలా మన ఆలోచనా విధానం(మైండ్‌సైట్) మార్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కొరతకు, సంఘర్షణలకు కారణమయ్యే పాత ఆలోచనా ధోరణికి స్వస్తి పలకాలని చెప్పారు. కలిసికట్టుగా ఉంటూ, సవాళ్లను ఎదిరించడానికి గాను మన ఆధ్యాత్మిక సంప్రదాయాల నుంచి స్ఫూర్తిని పొందడానికి ఇదే సరైన సమయమని వివరించారు. మనకు యుద్ధం అక్కర్లేదు మొత్తం మానవ జాతికి కనీస అవసరాలను తీర్చగలిగే ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురాగల మార్గాలు ప్రపంచంలో ఉన్నాయని, మనుగడ కోసం ఒకరిపై ఒకరు పోరాటం చేయాల్సిన అవసరం లేదని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రస్తుతం మనకు యుద్ధం ఎంతమాత్రం అవసరం లేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాల భద్రమైన జీవితాల కోసం సామూహిక జనన హనన ఆయుధాల నిర్మూలన దిశగా శక్తివంతమైన దేశాల నడుమ చర్చలకు చొరవ చూపుతామని వెల్లడించారు. ప్రపంచ శాంతి, రక్షణ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు. భారత్‌తో కలిసి నడుస్తాం: అమెరికా జీ–20 కూటమి అధ్యక్ష హోదాలో ఉన్న భారత్‌కు మద్దతు ఇవ్వడానికి, కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. ఆహారం, ఇంధన భద్రత వంటి పెనుసవాళ్లను పరిష్కరించే విషయంలో భారత్‌తో కలిసి నడవాలని అమెరికా నిర్ణయించకున్నట్లు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కెరైన్ జీన్–పియర్రీ చెప్పారు. జీ–20 దేశాల అధినేత శిఖరాగ్ర సదస్సు 2023 సెప్టెంబర్ 9, 10న ఇండియా రాజధాని ఢిల్లీలో జరుగనుంది. -
ముంబై ఉగ్రదాడులకు 14 ఏళ్లు.. ట్వీట్‌తో జైశంకర్ నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ: 26/11 ముుంబై ఉగ్రదాడులు జరిగి ఈరోజుతో 14 ఏళ్లు అవుతోంది. భారత దేశ చరిత్రలోనే చీకటి రోజుగా చెప్పే ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది, పౌరులకు నివాళులు అర్పించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. Terrorism threatens humanity. Today, on 26/11, the world joins India in remembering its victims. Those who planned and oversaw this attack must be brought to justice. We owe this to every victim of terrorism around the world. pic.twitter.com/eAQsVQOWFe — Dr. S. Jaishankar (@DrSJaishankar) November 26, 2022 ఉగ్రవాదం మానవాళికి ముప్పు. నేడు 26/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని భారత్‌తో పాటు యావత్ ప్రపంచం స్మరించుకుంటోంది. ఈ ఘటనకు బాధ్యులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడుల్లో ప్రాణాలు కల్పోయిన వారికి భారత్ సంఘీభావం తెలుపుతోంది. అని జైశంకర్ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ముంబై ఉగ్రదాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలిపారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. On the anniversary of 26/11 Mumbai terror attacks, the nation remembers with gratitude all those we lost. We share the enduring pain of their loved ones and families. Nation pays homage to the security personnel who fought valiantly and made supreme sacrifice in the line of duty. — President of India (@rashtrapatibhvn) November 26, 2022 14 ఏళ్ల క్రితం 2008లో ఇదే రోజున లష్కరే తోయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి సముద్రమార్గం ద్వారా ముంబై వచ్చి ప్రముఖ హోటల్లో చొరబడ్డారు. కన్పించిన వారిపై కాల్పులకు తెగబడి మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో18 మంది భద్రతా సిబ్బంది సహా మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: మహిళలపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు.. -
ఉగ్రవాదంపై మోదీ వ్యాఖ్యలు...పాక్, చైనాకు ఊహించని ఝలక్
No Money for Terror: పాక్ చైనాలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని అంతర్జాతీయ మంత్రివర్గ సమావేశంలో ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్సింగ్(నో మనీ ఫర్ టెర్రర్)పై మాట్లాడుతూ...."కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఉగ్రవాద వ్యతిరేక చర్యలను అడ్డుకుంటూ పరోక్షంగా మద్దుతిస్తున్నాయి. ఉగ్రవాదం పట్ల సానుభూతి చూపే సంస్థలు, వ్యక్తులను ఒంటరిని చేయాలి. ఇలాంటి విషయాల్లో క్షమాగుణం చూపకూడదు. అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేలా ప్రంపంచం ఏకం కావాలి. ఈ సందర్భంగా లష్కరే తోయిబా(ఎల్ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్‌తో సహా ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు యత్నించిన అంతర్జాతీయ ప్రయత్నాలను చైనా ఎలా విఫలం చేసిందో ప్రస్తావించారు. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాలను అరికట్టేందుకు నిధులను నిలిపేయాలి. టెర్రర్ ఫైనాన్సింగ్‌పై దాడి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతేగాదు టెర్రర్ ఫైనాన్సింగ్ కోసం కొత్తరకాల టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. అలాగే మనీలాండరింగ్, ఆర్థిక నేరాలు వంటి కార్యకలాపాలు టెర్రర్ ఫండింగ్‌కి సహయపడతాయని తెలుస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యూఎన్ఎస్సీ, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఎఫ్‌ఏలీఎఫ్) వంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాయం చేస్తున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన ఒక్క దాడి జరిగిన, ఒక్క ప్రాణం పోయినా సహించం, నిర్మూలించేంత వరకు వదిలిపెట్టం. కాశ్మీర్ తరుచుగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటుందని, పరిష్కరించడం అత్యంత ముఖ్యమని చెప్పారు. యావత్తు ప్రపంచం ఉగ్రవాదాన్ని తీవ్రంగా పరిగణించక ముందే భారదత్ తీవ్ర భయాందోళనలు ఎదుర్కొందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా వివిధ రూపాల్లో ఉగ్రవాదం భారత్‌ని దెబ్బతీయాలని చూసిన తాము ధైర్యంగా పోరాడం" అని చెప్పారు. ఈ క్రమంలో సదస్సును ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ...ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేయడమే అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఉగ్రవాదాలను తమ హింసను నిర్వహించేందుకు... యువతను రిక్రూట్ చేసుకోవడం, ఆర్థిక వనరులను పెంచుకోవడం తదితరాల ఎప్పటికప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తారన్నారు. ఉగ్రవాదుల తమ ఉనికిని దాచేలా డార్క్‌నెట్‌ని వినియోగిస్తున్నారని జాగుకతతో ఉండాలని సూచించారు. (చదవండి: వీడియో: నెహ్రూ మునిమనవడి వెంట గాంధీ మునిమనవడు.. వైరల్) -
ఉగ్రవాదమే మా ప్రధాన శత్రువు: పాక్
ఉగ్రవాదమే మా ప్రధాన శత్రువు: పాక్ ప్రధాని -
ఉగ్ర ‘టూల్‌కిట్’లో సోషల్ మీడియా
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యథేచ్ఛగా వాడుకుంటున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికలు ఉగ్రవాదుల టూల్కిట్లో ముఖ్యమైన సాధనాలుగా మారిపోయాయని చెప్పారు. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, క్రిప్టో–కరెన్సీ వంటి నూతన సాంకేతికతలను ముష్కరులు దుర్వినియోగం చేయకుండా అంతర్జాతీయంగా కఠిన చ్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రపంచదేశాలు గట్టి ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన కౌంటర్–టెర్రరిజం కమిటీ(సీటీసీ) ప్రత్యేక సమావేశంలో జైశంకర్ మాట్లాడారు. భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల ప్రతినిధులు, పలువురు అంతర్జాతీయ నిపుణులు ఈ భేటీకి హాజరయ్యారు. ఉగ్రæ చర్యలపై యూఎన్ఎస్సీ భారత్‌లో సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రపంచ మానవాళికి పెనుముప్పు ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత్ అంకితభావంతో కృషి చేస్తోందని జైశంకర్ పునరుద్ఘాటించారు. ‘ఐక్యరాజ్యసమితి ఫండ్ ఫర్ కౌంటర్–టెర్రరిజం’కు ఈ ఏడాది భారత్ స్వచ్ఛందంగా 5 లక్షల డాలర్లు ఇవ్వబోతోందని ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు చేరవేయడానికి, లక్ష్యాలపై దాడులు చేయడానికి ఉగ్రవాద సంస్థలు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు మానవ రహిత విమానాలు, డ్రోన్లు వాడుతుండడం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారిందన్నారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి పెద్ద ముప్పుగా పరిణమించిందని చెప్పారు. గ్లోబల్ యాక్షన్ కావాలి: గుటేరస్ ఉగ్రవాద సంస్థలు ఆధునిక టెక్నాలజీని వాడుకోకుండా కట్టడి చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా కృషి (గ్లోబల్ యాక్షన్) చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక సందేశాన్ని పంపారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం కొత్త టెక్నాలజీని వాడుకోవడం వేగంగా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధి రుచిరా కాంబోజ్ చెప్పారు. ‘ఢిల్లీ డిక్లరేషన్’ను 15 సభ్యదేశాల ప్రతినిధులు ఆమోదించారు. ఉగ్ర సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రైవేట్ రంగం, పౌర సమాజంతో కలిసి పనిచేయాలని ప్రభుత్వాలకు కౌంటర్–టెర్రరిజం కమిటీ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించవద్దు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భారత్ కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత దేశమేనని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఉగ్రవాద చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఉగ్రవాదులకు ప్రేరణ ఏదైనప్పటికీ వారి కార్యకలాపాలను అరికట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ముష్కర శక్తుల ఆట కట్టించే విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శిగా కొనసాగాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆధ్వర్యంలో జరిగిన కౌంటర్–టెర్రరిజం కమిటీ(సీటీసీ) సమావేశాన్ని ఉద్దేశించిన ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఉగ్రవాదంపై భారత్ అలుపెరుగని పోరాటం సాగిస్తోందని ఉద్ఘాటించారు. భారత్ ఉగ్రవాదం బారినపడిందని పేర్కొన్నారు. -
మౌలిక సదుపాయాల లేమివల్లే కశ్మీర్లో ఉగ్రభూతం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రానంతరం జమ్మూకశ్మీర్‌లో దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదని, అందుకే ఉగ్రవాదం విస్తరించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దులోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.2,180 కోట్లతో నిర్మించిన వంతెనలు, రహదారులు, హెలిప్యాడ్లు తదితర 75 నూతన ప్రాజెక్టులను ఆయన శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని దార్బుక్–ష్యోక్–దౌలత్ బేగ్ ఓల్డీలో వర్చువల్‌గా ప్రారంభించారు. రాజ్‌నాథ్ ప్రారంభించిన వంతెనల్లో.. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తున డీఎస్–డీబీఓ రోడ్డుపై నిర్మించిన 120 మీటర్ల పొడవైన ‘క్లాస్–70 ష్యోక్ సేతు’ ఉంది. వీటిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. వీటిలో 45 వంతెనలు, 27 రోడ్లు, రెండు హెలిప్యాడ్లు, ఒక ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’ ఉన్నాయి. కశ్మీర్లో 20 ప్రాజెక్టులు, లద్దాఖ్‌లో 18, అరుణాచల్ ప్రదేశ్‌లో 18, ఉత్తరాఖండ్‌లో 5, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్‌లో 14 ప్రాజెక్టులు నిర్మించారు. ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 57 మంది తల దాచుకోవచ్చు. -
‘26/11’ కుట్రదారులు ఇంకా బయటే...
ముంబై: ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడుల కుట్రధారులు, పాత్రధారులు ఇప్పటికీ రక్షణ పొందుతూనే ఉన్నారు. నిక్షేపంగా తిరుగుతున్నారు. వారికి ఏ శిక్షలూ పడడం లేదు’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు విస్తరించిందని, దానితో నష్టాల గురించి ఇతరుల కంటే భారత్‌కే ఎక్కువగా తెలుసని అన్నారు. ‘ఉగ్రవాద కార్యకలాపాలకు నూతన సాంకేతికను వాడుకోకుండా నిరోధించడం’ అనే అంశంపై 26/11 దాడులకు సాక్షిగా నిలిచిన ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడారు. దాడుల మృతులకు గబాన్ దేశ విదేశాంగ మంత్రి, యూఎన్ఎస్సీ అధ్యక్షుడు మైఖేల్ మౌసా–అడామో తదితరులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరో దేశం నుంచి వచ్చిన ముష్కరులు మారణహోమం సృష్టించారని పాకిస్తాన్‌పై ధ్వజమెత్తారు. కరడుగట్టిన ఉగ్రవాదుల విషయంలో రాజకీయ కారణాల వల్ల ఐరాస భద్రతా మండలి చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. పాక్ ఉగ్రవాదులపై ఆంక్షలు విధించకుండా చైనా çఅడ్డుకుంటోందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలంటే ఆ సంస్థలకు నిధులందకుండా చేయాలని సూచించారు. అలా చేస్తే వారి వెన్ను విరిచినట్లేనని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం ఉమ్మడిగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. -
సమష్టి కృషితోనే నేరాలకు అడ్డుకట్ట
సూరజ్‌కుండ్(హరియాణా): దేశవ్యాప్తంగా విస్తరించిన నేర సామ్రాజ్యాన్ని కూల్చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి బాధ్యత అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న అన్ని రాష్ట్రాల హోం శాఖ మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల ‘చింతన్ శిబిర్’ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. ‘ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాని మోదీ అభిలషించిన పంచప్రాణ లక్ష్యాలు, వందేళ్ల స్వతంత్రభారతం(2047 దార్శనికత)ను సాకారం చేసుకోవడానికి ఈ చింతన్ శిబిర్‌లో ఫలవంత కార్యాచరణను సంసిద్ధం చేసుకుందాం. జమ్మూకశ్మీర్, విదేశీ అక్రమ విరాళాలు, మాదకద్రవ్యాల నిరోధం, ఈశాన్యరాష్ట్రాల్లో వేర్పాటువాదుల లొంగుబాటుతో సమస్యలను అణచేసి దేశ అంతర్గత భద్రతను పెంచడంలో మోదీ సర్కార్ సఫలత సాధించింది. ‘పశుపతి(నాథ్) నుంచి తిరుపతి వరకు వామపక్ష తీవ్రవాదం ఉండేది. అదీ సద్దుమణిగింది. ఇక, రాష్ట్రంలో శాంతిభద్రత అనేది ఆ రాష్ట్ర అంశమే. కానీ, మనందరం ఉమ్మడిగా పోరాడి అన్ని రాష్ట్రాల్లో నేరాలను అణచివేద్దాం. ఇది మనందరి సమష్టి బాధ్యత’ అని హోం మంత్రులతో షా వ్యాఖ్యానించారు. ‘కొన్ని ఎన్జీవోలు మతమార్పిడి వంటి దుశ్చర్యలకు పాల్పడ్డాయి. దేశార్థికాన్ని బలహీనపరిచేలా, అభివృద్ధిని అడ్డుకునేలా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు విదేశీ నిధులను దుర్వినియోగం చేశాయి. వీటిపై విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద ఆంక్షల చర్యలు తీసుకున్నాం’ అని షా చెప్పారు. -
Police Commemoration Day: ఉగ్రవాదమే అతిపెద్ద హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: ఉగ్రవాదమే అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. విదేశీ గడ్డ నుంచి ఆన్లైన్ ద్వారా జరిగే ఉగ్ర భావజాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా గుర్తించలేమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అమిత్ షా 90వ ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ ముగింపు సమావేశంలో ప్రసంగించారు. ‘ఉగ్రవాదం, ఉగ్రవాదులకు సంబంధించిన స్పష్టమైన ఉమ్మడి నిర్వచనం ఇచ్చేందుకు అన్ని దేశాలు కలిసి రావాలి. అలా జరిగినప్పుడే ఉగ్రవాదులపైనా, ఉగ్రవాదంపైన అంతర్జాతీయంగా కలిసికట్టుగా పోరాడగలం. ఉగ్రవాదంపై చిత్తశుద్ధితో పోరాటం సాగించడం, మంచి, చెడు ఉగ్రవాదాల మధ్య తేడాను గుర్తించడం, ఉగ్ర దాడులను చిన్నవి, పెద్దవి అంటూ వర్గీకరించడం ముందుగా జరగాలి’అని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా సాగే ఉగ్రవాద సిద్ధాంతాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా భావించలేమంటూ ఆయన...ఉగ్రవాదంపై దీర్ఘకాలంలో నిబద్ధత, సమగ్రతతో కూడిన పోరాటం సాగించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. ‘చాలా దేశాల్లో ఇంటర్‌పోల్ ఏజెన్సీ, ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదంపై పోరాటం కొనసాగాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద వ్యతిరేక సంస్థలన్నీ ఏకతాటిపైకి రావాలి’అని అమిత్ షా అభిప్రాయ పడ్డారు. దీనికోసం ఇంటర్‌పోల్ శాశ్వత కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా నిఘా సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకుంటూ ఉండాలన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ అవసరమైన సాంకేతిక, మానవ వనరులను ఇంటర్‌పోల్‌తో పంచుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య ఉమ్మడి, పరస్పర సహకారం అవసరమని సీబీఐ డైరెక్టర్ సుబోధ్ జైశ్వాల్ అన్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలు తగ్గుముఖం దేశంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు హాట్స్పాట్లుగా పేరున్న చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడ్డాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అశాంతికి నెలవైన ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు నేడు 70% వరకు తగ్గుముఖం పట్టాయన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలతోపాటు జమ్మూకశ్మీర్లోనూ భద్రతాపరంగా ఇదే రకమైన పురోగతి కనిపిస్తోందని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
టెర్రరిజం కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ముందస్తు బెయిల్
ఇస్లామాబాద్: టెర్రరిజం కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు కొంత ఊరట లభించింది. ఆయనకు మూడు రోజులపాటు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత వారం రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఇమ్రాన్ ప్రసంగించారు. పోలీసులను, న్యాయ వ్యవస్థను, ప్రభుత్వ వ్యవస్థలను దూషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆయనపై యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద కేసు పెట్టారు. దీనిపై ఆయన ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ మొహిసిన్ అక్తర్ కయానీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగానే ఇమ్రాన్‌ను వేధిస్తోందని ఆయన తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇమ్రాన్‌కు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో ముందస్తు బెయిల్ ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. -
తమిళనాడు గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలంటూ వ్యాఖ్యానించారు. 2008 నవంబర్ 11న ముంబైలో పేలుళ్ల ఘటన జరిగిన నెలల్లోనే ఉగ్రవాదంపై పాకిస్థాన్‌తో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘అంతర్గత భద్రతకు సమకాలీన సవాళ్లు’ అనే అంశంపై కొచ్చిలో ఆదివారం గవర్నర్ మాట్లాడారు. నవంబర్ 11 ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులతో దేశం మొత్తం గాయపడిందన్నారు. ఉగ్రవాదుల కారణంగా దేశమంతా విషాదంలో మునిగిపోతే, ఘటన జరిగి 9 నెలలు గడవకముందే ఇరు దేశాలు (అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, పాక్ ప్రధాని) తీవ్రవాద బాధితులుగా పేర్కొంటూ సంతకాలు చేశాయని గుర్తు చేశారు. పాకిస్థాన్ మనకు మిత్రదేశమా, లేక శత్రు దేశమా ఈ అంశంలో క్లారిటీ ఉండాలని, కన్ఫ్యూజన్ ఉంకూడదని అన్నారు. పాకిస్థాన్‌పై ప్రతీకార చర్య పుల్వామా ఉగ్రదాడి ఘటన తరువాత సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పామని గవర్నర్ రవి వెల్లడించారు. పుల్వామా దాడి అనంతరం భారత యుద్ద విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని తెలిపారు. భారత్ సర్జికల్ స్ట్రైక్ పేరుతో ప్రతీకార చర్య తీసుకుందని అన్నారు. దీని ద్వారా ఎవరైనా ఉగ్రవాదానికి పాల్పడితే తిరిగి అందుకు తగిన భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. చదవండి: మంకీపాక్స్‌తో కేరళ వాసి మృతి.. కేంద్రం కీలక నిర్ణయం మన్మోహన్పై మండిపాటు మన్మోహన్ సింగ్ నాటి పాలనతో పోలిస్తే ప్రస్తుతం భారత అంతర్గత భద్రత మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన సమయంలో అంతర్గత భద్రతకు మావోయిస్టుల ముప్పు ఎక్కువగా ఉండేదని గవర్నర్ ఆరోపించారు. అప్పట్లో తీవ్రవాదుల హింస 185 జిల్లాల్లో ఉండేదని, ఇప్పుడు ఆ సంఖ్య 8 జిల్లాలకు తగ్గినట్లు వెల్లడించారు. ప్రజలు తీవ్రవాదాన్ని తిరస్కరించి సాధారణ పరిస్థితులకు సహకరించడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు కశ్మీర్‌పై రవి మాట్లాడుతూ.. హింసను సహించేది లేదని స్పష్టం చేశారు. తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలన్నారు. దేశ సమైక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడే వారితో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లలో ఎలాంటి సాయుధ గ్రూపుతోనూ చర్చలు జరపలేదని పేర్కొన్నారు. ఒకవేళ జరిగినా రాజకీయాలకు తావులేకుండా.. మావోయిస్టుల లొంగిపోవడం, పునరావాసం కోసమేనని తెలిపారు. మావో ప్రాంతాల్లోని వారికి ప్రత్యేక ఐడియాలజీ ఉంటుందని, వాళ్లు పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని నమ్మరని అన్నారు. అయితే తాము దాన్ని అంగీకరించబోమని, ఇక వాళ్లతో చర్చలు అవసరం లేదని గవర్నర్ రవి తెలిపారు. చదవండి: Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం? -
సోషల్‌గా జర జాగ్రత్త! ఉద్యోగాలకే ఎసరు
మీరు ఉద్యోగులా? లేక కొలుకు కోసం వెదుకులాటలో ఉన్నారా? అయితే సోషల్ మీడియా వాడకంలో కాస్త జాగ్రత్త. అవి ఉన్నదే అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు కదా అంటారా? అలాంటి మాటలు వాదనకే బాగుంటాయి. సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్లు చాలామంది కొలువులకు ఎసరు పెడుతున్నాయి. పనిష్మెంట్ బదిలీలకు, ప్రమోషన్ల నిలిపివేతకు కారణమవుతున్నాయి. వివాదాస్పద కామెంట్లు పెట్టేవారికి ఉద్యోగాలిచ్చేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు కూడా... ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో విమర్శించినందుకు గత అక్టోబర్‌లో ఢిల్లీలో ఓ కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయాడు. కేంద్ర మంత్రిపై విమర్శలు చేసినందుకు కర్ణాటకలో తాజాగా ఓ టీచర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సోషల్ మీడియాలో పెట్టే కామెంట్ల ప్రకంపనలు చాలా దూరం ప్రయాణిస్తున్నాయి. ఉద్యోగులు, ఉద్యోగార్థుల ‘సోషల్’ లైఫ్ మీద యాజమాన్యాలు, కంపెనీల నిఘా కొన్నేళ్లుగా బాగా పెరిగింది. అభ్యంతరకర, వివాదాస్పద కామెంట్లు చేస్తే ఉపాధికే ఎసరొస్తోంది. మరీ ముఖ్యంగా జాతి వివక్ష, జాతీయ భద్రత, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటివాటిపై సోషల్ మీడియాలో అస్సలు మాట్లాడకూడదని ఓ అంతర్జాతీయ అధ్యయనంలో తేలింది. ఈ మధ్య కాలంలో 28 శాతం మంది ఇలాంటి వాటిపై వ్యాఖ్యల వల్లే వీధిన పడ్డారట. వ్యక్తుల ఇష్టాయిష్టాలపై అనుచిత వ్యాఖ్యలు, మహిళలను ద్వేషించడం వల్ల 12 శాతం మంది ఉద్యోగాలకు ఎసరొచ్చిందట. ఆఫీసుల్లో గొడవలు పడి 17 శాతం, సోషల్ మీడియాలో కుళ్లుజోకులు, కనీస మానవత్వం లేని ప్రవర్తనతో 16 శాతం, బూతులు, హింసకు దిగుతామనే బెదిరింపులతో 8 శాతం, రాజకీయ విమర్శలతో 5 శాతం మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు!! సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలతో ఉద్యోగాలు కోల్పోయిన ఉదంతాలపై వచ్చిన వందలాది వార్తా కథనాల ఆధారంగా జరిగిన అధ్యయనంలో తేలిన విషయాలివి. మన దేశంలోనూ రాజకీయ విమర్శలు చేసినందుకు సామాజిక కార్యకర్తలు జైలుపాలవడం, కొందరిపై భౌతికదాడులు జరగడం తెలిసిందే. ఉద్యోగార్థులపై సోషల్ నిఘా గత పదేళ్లలో ఆధారంగా ఉద్యోగుల ఎంపికలో సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలను లోతుగా గమనించే ధోరణి పెరిగిందని వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్ వంటి దిగ్గజాలు జాతి వివక్ష, వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేస్తే ఎంత టాలెంటున్నా ఉద్యోగాలివ్వడం లేదు. ‘సోషల్’ హిస్టరీ బాగా లేకపోవడం వల్ల కంపెనీకి ఎంతో ఉపయోగపడతారనుకున్న ప్రతిభావంతులను కూడా వదులుకోవాల్సి వస్తోంది. ఇది బాధాకరమే అయినా తప్పడం లేదు. పని చేసే చోట ఇబ్బందులు రాకూడదు కదా! అందుకే నాయకత్వ స్థానాల్లో ఉండేవారికి ఎలాంటి బలహీనతలూ ఉండొద్దన్న నియమాన్ని కచ్చితంగా పాటిస్తున్నాం’’ అని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వర్ణవివక్షపై జరిగిన ఓ సదస్సులో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ‘సేజ్ పబ్’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కంపెనీల మానవ వనరుల విభాగాలు ఏయే అంశాలను గమనిస్తున్నాయంటే... ► ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు? ► ఏ అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్నారు? ► సొంతగా ఏమైనా బ్లాగులు రన్ చేస్తున్నారా? ► వీటితో పాటు పలు ఇతర అంశాలపైనా నిఘా పెడుతున్నారు. ► పోలీసు (20%), టీచర్లు (24%), ప్రభుత్వోద్యోగులు (14%), ఆతిథ్య, రిటైల్ రంగాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉందట. ► వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులతో ఉద్యోగాలు పోతాయని మన దేశంలో 40 శాతం మందికి భయమున్నట్టు గతేడాది ఓ అధ్యయనంలో తేలింది.నే పలు సోషల్ మీడియా పోస్టులను డిలీట్ చేసినట్లు చాలామంది అంగీకరించారు. ► పని చేస్తున్న కంపెనీ, సంస్థపై సోషల్ మీడియాలో చెడుగా రాశామని 25.7 శాతం మంది ఒప్పుకున్నారు. ► సోషల్ మీడియా పోస్టుల వల్ల తమకేమీ కాదని 46.9 శాతం మంది నమ్ముతున్నారు. భిన్నాభిప్రాయాలు సోషల్ మీడియా పోస్టులకు కెరీర్‌తో ముడి పెట్టడం సబబా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. బికినీతో ఫొటో దిగి ఇన్‌స్టాలో పెట్టినందుకు ఒకరి ఉద్యోగం పోయింది. ఇది వ్యక్తిగత జీవితంలోకి అనుచితంగా చొరబడటమేనన్న వాదన ఉంది. సున్నిత అంశాలపై వివాదాస్పదంగా పోస్టులు పెట్టకపోవడమే మేలన్నది 2021 గ్రహీత సాహిత్య నోబెల్ గ్రహీత అబ్దుల్ రజాక్ గుర్మా వంటివారి అభిప్రాయం. ఇది యువతలో అభద్రతా భావం పెంచుతున్న వాదనతో గూగుల్ హెచ్ఆర్ విభాగం హెడ్ ప్రీతి నారాయణ్ అంగీకరించారు. కానీ విశృంఖలతకు ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పడాల్సిందేనని అభిప్రాయపడ్డారు. :::కంచర్ల యాదగిరిరెడ్డి -
స్వతంత్ర భారతి: అఫ్స్పా చట్టం
తీవ్రవాదాన్ని అణచివేసి, శాంతిభద్రతలను కాపాడడమే ధ్యేయంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అస్సాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, మిజోరామ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని 1958 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సైనిక దళాలకు కొన్ని అధికారాలు దక్కాయి. ముందస్తుగా వారంట్ ఇవ్వకుండానే ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. సోదాలు నిర్వహించవచ్చు. ఎవరినైనా కాల్చి చంపినా అరెస్టు, విచారణ నుంచి ప్రత్యేక రక్షణ ఉంటుంది. అయితే ఆనాటి నుంచీ ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏఎఫ్‌ఎస్‌పీఏకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త ఇరోం చాను షర్మిళ 16 ఏళ్లపాటు నిరాహార దీక్ష కొనసాగించారు. 2015లో త్రిపురలో, 2018లో మేఘాలయాలో ఈ చట్టాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 న నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈ వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)–1958 ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. అస్సాంలో 23 జిల్లాలు, మణిపూర్‌లో 6 జిల్లాలు (15 పోలీసు స్టేషన్ల పరిధిలో), నాగాలాండ్‌లో 7 జిల్లాలకు (15 పోలీసు స్టేషన్ల పరిధిలో) ఈ చట్టం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఇదొక కీలకమైన అడుగు అని ఆయన అభివర్ణిం చారు. 2021 డిసెంబర్లో నాగాలాండ్‌లో సైనికుల దాడిలో 14 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. దాంతో అక్కడి ప్రజల వినతి మేరకు ఏఎఫ్ఎస్పీఏ (అఫ్స్పా) ను ఎత్తివేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. -
ఉగ్రవాదాన్ని మోదీ సహించరు : జై శంకర్
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికీ సహించరని, మరీ ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం పట్ల కఠినంగా ఉంటారని విదేశాంగ మంత్రి జై శంకర్ చెప్పారు. తాను రాసిన ‘‘మోదీ @20ః డ్రీమ్స్ మీట్ డెలివరీ’’ అనే పుస్తకంలో జై శంకర్ ఈ వివరాలను పేర్కొన్నారు. 2015లో తాను విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సార్క్ దేశాల పర్యటనకు వెళ్లే ముందు ప్రధాని తనతో చెప్పిన మాటల్ని జైశంకర్ ఈ పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. ‘ ‘నా అనుభవం, నా నిర్ణయం పట్ల మోదీకి ఎంతో విశ్వాసం ఉంది. అయినప్పటికీ పాకిస్తాన్ విషయంలో నాకు పలు జాగ్రత్తలు చెప్పారు. తన ముందు ప్రధానమంత్రుల్లా తాను ఉండడని, ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించనని చెప్పారు. ఉగ్రవాదం కట్టడిలో ఎలాంటి సందిగ్ధత ఉండకూదని మోదీ చెప్పారు’’ అని జై శంకర్ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. చదవండి: పాక్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత -
పరివర్తన దశలో కశ్మీర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల అసహనం పెరుగుతోందని 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్(జీవోసీ) లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే అన్నారు. లోయలో ఉగ్రవాదం ఇదివరకటి ఆకర్షణ కోల్పోయిందనీ, ప్రస్తుతం పరిస్థితులు పరివర్తన దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. కశ్మీర్ యువత, ముఖ్యంగా 20–25 ఏళ్ల వారు హింసతో సాధించేదేమీ లేదన్న విషయాన్ని అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. దీంతో, తాము చేస్తున్నది తప్పో, ఒప్పో తెలియని 16–19 ఏళ్ల టీనేజర్లను ఉగ్రవాదం ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. కొత్త రిక్రూట్మెంట్లు 2021లో మూడో వంతుకు అంటే, 142కు తగ్గి పోయాయని చెప్పారు. అక్రమ చొరబాట్లు తగ్గాయి. స్థానికుల సహకారంతో నిఘా వ్యవస్థ బలోపేతమైంది. ఫలితంగా గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 330 మంది ఉగ్రవాదులు హతం కావడమో, లొంగిపోవడమో జరిగిందన్నారు. గత 15 ఏళ్లలో ఇదే అత్యధికమని డీపీ పాండే విశ్లేషించారు. లోయలో మిగతా ఉగ్రవాదులకు కూడా సహకారం అందకుండా పోయే రోజు త్వరలోనే వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2021లో 151 మంది స్థానికులు, 20 మంది పాకిస్తానీయులు కలిపి మొత్తం 171 మంది ఉగ్రవాదులు హతం కాగా, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 10 మంది పాకిస్తానీయులతో కలిపి 45 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు గణాంకాలను వెల్లడించారు. గత ఏడాది 87 మంది ఉగ్రవాదులు, లొంగిపోవడమో, పట్టుబడటమో జరగ్గా ఈ ఏడాది 27 మంది పట్టుబడ్డారని లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే అన్నారు. -
విజయ్ 'బీస్ట్' రిలీజ్‌కు అక్కడ నిషేధం.. కారణం ఇదే..
Vijay Starrer Beast Movie Banned In Kuwait Here Is The Reason: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, బుట్టబొమ్మ జోడిగా నటించిన చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 13న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. కానీ ఈ ట్రైలర్‌తో 'బీస్ట్' చిక్కుల్లో పడ్డాడు. ఈ ట్రైలర్లో షాపింగ్ మాల్‌ను హైజాక్ చేసిన ఉగ్రవాదులను ఒక గూఢాచారి ఎలా అంతమొందిచాడనేది చూపించారు. దాదాపు ఈ సినిమా ఉగ్రవాద నేపథ్యంతో తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అయితే అరబిక్ దేశాలు ప్రోత్సహించని ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నందున గల్ఫ్ దేశాల్లో ఒకటైన కువైట్ 'బీస్ట్'ను నిషేధించింది. అరబ్ దేశాలను విలన్లుగా, టెర్రరిస్టులకు నిలయంగా చూపించే ఏ సినిమాను గల్ఫ్ దేశాలు అంగీకరించవని తెలిసిందే. టెర్రరిస్టులు ఎక్కువగా కువైట్ వంటి గల్ఫ్ దేశాల్లో దాక్కుంటారని, అందుకు అక్కడ చట్టాలు కూడా సహకరిస్తాయని టాక్ ఉంది. అయితే యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ వంటి గల్భ్ దేశాల్లో 'బీస్ట్' రిలీజ్‌కు మార్గం సుగమం అయింది. -
ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు
దుబాయ్: సౌదీ అరేబియా ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసింది. 1980లో మక్కా మసీదు స్వా«ధీనం నేరంలో 63 మంది తలలు నరికి సౌదీ మరణ శిక్ష అమలు చేసింది. శిక్ష అమలైన వారిలో మహిళలు, పిల్లల్ని చంపిన వారితో పాటు అల్ ఖాయిదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, యెమన్లోని హైతీ తిరుగుబాటుదారులకు మద్దతునిచ్చిన వారు కూడా ఉన్నారు. -
పాక్‌లో జిహాద్ పేరుతో నిధులు సేకరించొద్దు
లాహోర్: పాకిస్తాన్లో జిహాద్ పేరుతో నిధులను సేకరించేందుకు ప్రజలను ప్రేరేపించొద్దని, అలా ఎవరు చేసినా అది రాజద్రోహం కిందికి వస్తుందని లాహోర్ హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా యుద్ధాన్ని ప్రకటిస్తే అందుకు అవసరమైన డబ్బులు సేకరించడం దేశానికి సంబంధించిన పని అని వెల్లడించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ కోసం నిధులు సేకరించినందుకు దోషులుగా తేలి ఐదేళ్లు శిక్ష పడిన ఇద్దరు ఉగ్రవాదుల అప్పీళ్లను తోసిపుచ్చుతూ ఇటీవల తీర్పు నిచ్చింది. ‘తెహ్రీకీ తాలిబాన్ నిషేధిత సంస్థ. దేశానికి ఎంతో నష్టం చేసింది. దేశ ముఖ్య నాయకులు లక్ష్యంగా పని చేసింది. దేశంలో ఉగ్రవాదం పెంచడానికి ప్రయత్నింది. ఆర్థికంగా మద్దతు లేనిదే ఇదంతా సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు అందించారంటూ ఈ నెలలో అరెస్టయిన ఇద్దరు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు యాంటీ టెర్రరిస్టు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. -
ఐరాస వేదికగా పాక్‌పై విరుచుకుపడ్డ భారత్
న్యూయార్క్: ఉగ్రవాదులకు సహకరించడంలో దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన పాకిస్తాన్... ముష్కర మూకలకు ఆశ్రయం కల్పించడంపై ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై భారత్ విరుచుకుపడింది. 26/11 ముంబైపై ఉగ్రదాడులకు పాల్పడినవారికి పాకిస్తాన్ రాజభోగాలు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐరాసలో ఇస్లామాబాద్ రాయబారి మునీర్ అక్రమ్ జమ్మూ కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన తర్వాత భారతదేశం పాకిస్తాన్‌ను గట్టిగా తిప్పికొట్టింది. ప్రపంచంలోని చాలా ఉగ్రవాద దాడులకు మూలం, లేదా ఏదో ఒక రూపంలో ఆ దేశానికి సంబంధం ఉంటుందని ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి ఆర్.మధుసూదన్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ‘సాయుధ ఘర్షణల నుంచి పౌరులను రక్షించాలి’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అంతకుముందు ఐరాసలో భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి మాట్లాడుతూ, దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాదం యొక్క శాపాన్ని చవిచూసిన భారతదేశం, ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలలో ఎల్లప్పుడూ ముందంజలో ఉందని తెలిపారు. సెక్రటరీ జనరల్ నివేదిక ప్రకారం, పట్టణ ప్రాంతాలలో 50 మిలియన్లకు పైగా ప్రజలు సంఘర్షణతో ప్రభావితమయ్యారని, అఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియా, యెమెన్‌లోని ప్రజలు అంతర్గత సంఘర్షణల వల్ల కలిగే వినాశనాన్ని చూశారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద పోరు మళ్లీ పెరిగింది, ఇది కోవిడ్ మహమ్మారి కొనసాగుతుండటం వల్ల మరిం త క్లిష్టంగా మారిందని తిరుమూర్తి అన్నారు. సంఘర్షణానంతరం ఆయా ప్రాంతాల్లో సామాజికఆర్థిక పునరుద్ధరణ, శాంతిని పెంపొందించడం, పౌరులకు మౌలిక సదుపాయాల కల్పన, పునరావాసం కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. -
అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించం
జమ్మూ: జమ్మూకశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి పెట్టేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని హోం మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. సాధారణ పౌరులను ముష్కరులు హత్య చేస్తున్నారని, ఇలాంటి ఘోరాలకు చరమగీతం పాడుతామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి, అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి ప్రధాని మోదీ హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఇప్పటికే 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2022 నాటికి మరో రూ.51,000 కోట్ల పెట్టుబడులు రప్పిస్తామని, వీటితో జమ్మూకశ్మీర్‌లో 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం జమ్మూకశ్మీర్‌కు వచ్చిన అమిత్ షా ఆదివారం భగవతీ నగర్లో ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఏడు దశాబ్దాల పాటు ఇక్కడ పరిపాలన సాగించిన మూడు కుటుంబాలు ప్రజలకు చేసిందేమీ లేదని పరోక్షంగా కాంగ్రెస్, నేషనల్, కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)పై మండిపడ్డారు. ఈరోజు రూ.15,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని, ఆ మూడు కుటుంబాలు కలిసి వారి మొత్తం పాలనా కాలంలో ఇలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. అమిత్ షా ఆదివారం జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దును సందర్శించారు. విధి నిర్వహణలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లతో సంభాషించారు. మీ కుటుంబాల బాగోగులను నరేంద్ర మోదీ ప్రభుత్వం చక్కగా చూసుకుంటుందని, ఎలాంటి ఆందోళన చెందకుండా దేశ రక్షణ బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. సరిహద్దులోని చిట్టచివరి కుగ్రామం మక్వాల్‌లో అమిత్ షా పర్యటించారు. సరిహద్దు ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు గ్రామస్తులతో చెప్పారు. ఐఐటీ కొత్త క్యాంపస్ ప్రారంభం రూ.210 కోట్లతో నిర్మించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–జమ్మూ క్యాంపస్‌ను అమిత్ షా ప్రారంభించారు. -
ఉక్కుపాదం మోపాల్సిందే..!
సాక్షి , న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ ఉక్కుపాదం మోపాల్సిందేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ఆదివారం వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన మంత్రి అమిత్ షా.. సోమవారం పలు రాష్ట్రాలతో విడివిడిగా సమావేశమయ్యారు. మావోయిస్టుల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించిన తెలంగాణలోని తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. 1.40 గంటలపాటు జరిగిన ఈ సమీక్షకు సీఎం కేసీఆర్‌తోపాటు డీజీపీ మహేందర్ రెడ్డి, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అదనపు డీజీ కే.శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రణాళికలు, వ్యూహాలపై డీజీపీసహా రాష్ట్ర ఉన్నతాధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. సమీక్షలో హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ఐబీ చీఫ్ అరవిందకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చెదురుమదురు ఘటనలు రాష్ట్ర సరిహద్దుల్లో చెదురుమదురు ఘటనలు తప్ప తెలంగాణలో మావోయిస్టుల కదలికలు, కార్యకలా పాలు నామమాత్రంగా ఉన్నాయని అమిత్‌షాకు సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ సరిహద్దుల్లోని బస్తర్, గడ్చిరోలి ప్రాంతాల్లో మావోయిస్టుల కార్య కలాపాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న పరిస్థితుల్లో, అప్పుడప్పుడు వారు సరిహద్దులు దాటి వచ్చి తెలంగాణలో హింసకు పాల్పడు తున్నట్లు సీఎం వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లొంగుబాట్లు సైతం జరుగుతున్నాయని చెప్పినట్లు సమాచారం. సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు గతంలో చేపట్టిన విధంగా జాయింట్ ఆప రేషన్లు చేపడితే సత్ఫలితాలు వచ్చే అవకాశాలుంటా యని కేంద్రానికి రాష్ట్ర ఉన్నతాధికారులు సూచిం చినట్లు సమాచారం. కొత్తగా చేరే పరిస్థితుల్లేవు.. గతంలో మారుమూల ప్రాంతాల్లో పేదరికం, వెనుకబాటుతనం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అం దని కారణంగా రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం పెరిగిందని, ఈ నేపథ్యంలో గత ఏడేళ్లలో మారు మూల గ్రామాల వరకు అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేశామని సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రికి వివరించినట్లు సమాచారం. అంతే గాక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాల్లో మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు పెరి గిన కారణంగా యువత కొత్తగా మావోయిస్టుల్లో చేరే పరిస్థితులు లేవని పేర్కొన్నారని తెలిసింది. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారి వ్యవస్థను మెరుగుపర్చడంతోపాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన చేపట్టాలని సూచించారు. ఆ ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణానికి పూర్తిగా కేంద్రమే నిధులివ్వాలని కేసీఆర్ మరోసారి కేంద్రాన్ని కోరారని తెలిసింది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఆధు నీకరణకు నిధులివ్వాలని, అదనపు కేంద్రబలగా లను కేటాయించాలని కోరినట్లు సమాచారం. కాగా మావోయిస్టులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన గ్రేహౌండ్స్ వంటి బలగాల ప్రత్యక్ష కార్యాచరణతో రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గడానికి కారణమైందని గ్రేహౌండ్స్ అదనపు డీజీ శ్రీనివాసరెడ్డి వివరించారు. -
అమిత్ షాతో భేటీలో పాల్గొన్న సీఎం కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం సుచరిత
సాక్షి, న్యూఢిల్లీ: వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ ఈ కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైన ఈ సదస్సుకు వామపక్ష తీవ్రవాద ప్రభావితం ఉన్న 10 రాష్ట్రాలు హాజరయ్యాయి. తెలంగాణ, ఏపీతో పాటు చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లకు చెందిన వారు హాజరయ్యారు. సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కావాల్సి ఉండగా అస్వస్థతకు గురవడంతో ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకున్నారు. దీంతో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాలు వివరించాయి. -
ఉగ్రభూతం మిమ్మల్నీ వదలదు! పాక్‌కు ప్రధాని హెచ్చరిక
న్యూయార్క్: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు పాముకు పాలు పోస్తున్నామని అర్ధం చేసుకోవాలని, ఉగ్రవాదాన్ని రాజకీయ పనిముట్టుగా వాడే దేశాలు చివరకు అది తమను కూడా కబళిస్తుందని గ్రహించాలని ప్రధాని నరేంద్ర మోదీ దాయాది దేశానికి ఐక్యరాజ్యసమితి వేదికగా చురకలంటించారు. ఐరాస 76వ సమావేశంలో ప్రధాని మోదీ శనివారం పస్రంగించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారుతోందని పొరుగుదేశాలు గగ్గోలు పెడుతున్న సందర్భంగా ఐరాస వేదికగా ప్రధాని గట్టి హెచ్చరిక చేశారు. అఫ్గాన్, కరోనా, ఇండోపసిఫిక్, అంతర్జాతీయ సవాళ్లు.. వంటి అనేక అంశాలను ప్రధాని తన సందేశంలో ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచం తిరోగామి ఆలోచనా విధానాలు, అతివాద విధానాలతో సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచమంతా శాస్త్రీయాధారిత ధృక్పధాన్ని, పురోగామి మార్గాన్ని అవలంబించి అభివృద్ధి దిశగా పయనించాలని అభిలíÙంచారు. శాస్త్రీయ ధోరణులను పెంపొందించేందుకు భారత్ అనుభవాధారిత విద్యను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఇదే సమయంలో కొన్ని దేశాలు మాత్రం తీవ్రవాదాన్ని స్వీయప్రయోజనాలకు అనుకూలంగా వాడుకోవాలని తిరోగామి ఆలోచనలు చేస్తున్నాయని పరోక్షంగా పాక్‌పై మండిపడ్డారు. వివిధ అంతర్జాతీయ సంస్థలు చైనా విషయంలో మాటమార్చడాన్ని ప్రస్తావించారు. ఐరాస విశ్వనీయత పెంచుకోవాలని చురకలంటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా చర్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ సముద్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. అఫ్గానిస్తాన్‌ను ఎవరూ సొంత ప్రయోజనాలకు వాడుకోకూడదని హితవు చెప్పారు. ఇంకా ప్రధాని ఏమన్నారంటే... ప్రజాస్వామ్యం: ఒక టీ అమ్ముకునే వ్యక్తి స్థాయి నుంచి ఐరాసలో భారత ప్రధానిగా ప్రసంగించేవరకు సాగిన నా జీవితం భారతీయ ప్రజాస్వామిక బలానికి నిదర్శనం. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లివంటిది. ఈ ఏడాది ఆగస్టు 15న ఇండియా 75వ స్వాతంత్య్రోత్సవాలు జరుపుకుంది. భారత్‌లో భిన్నత్వమే బలమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం. వివిధ ప్రభుత్వాల అధినేతగా త్వరలో నేను 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాను. భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతమైందనేందుకు నేనే నిదర్శనం. ఐరాస: ఐక్యరాజ్యసమితి సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. వివిధ దేశాలకు ఆలంబనగా ఉండాలనుకుంటే ఐరాస విశ్వసనీయతను పెంచాలి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకుంటే విఫలమైనట్లేనన్న చాణక్య సూక్తిని గుర్తు చేసుకోవాలి. కరోనా, వాతావరణ మార్పు తదితర అంశాల్లో ఐరాస ప్రవర్తన గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. అఫ్గాన్ ఉదంతం ఐరాస తీరుపై ప్రశ్నల్లో వాడిని పెంచాయి. కరోనా పుట్టుక, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాకింగులు, అంతర్జాతీయ సంస్థల పనితీరు వంటివి అనేక సంవత్సరాల ఐరాస కృషిని, ఐరాసపై నమ్మకాన్ని దెబ్బతీశాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ఐరాసను అందరం బలోపేతం చేయాలి. అప్పుడే అంతర్జాతీయ చట్టాలు, విలువలకు రక్షణ లభిస్తుంది. కరోనా– టీకా: మహ్మమారిపై పోరు ప్రపంచప్రజలకు ఐకమత్యం విలువను తెలియజేసింది. రెండేళ్లుగా ప్రపంచ మానవాళి జీవితంలో ఒకసారి ఎదురయ్యే యుద్ధాన్ని చేస్తోంది. కలిసిఉండే కలుగు విజయమని ఈ పోరాటం మనకు తెలిపింది. దేశాల మధ్య సంపూర్ణ సహకారంతో కరోనాపై పోరు సలుపుతున్నాం. రికార్డు సమయంలో టీకాను ఉత్పత్తి చేయగలిగాం. సేవే పరమ ధర్మం అనే సూత్రంపై ఆధారపడే భారత్ కరోనా టీకా రూపకల్పనలో తొలినుంచి కీలక పాత్ర పోషించింది. వనరులు పరిమితంగా ఉన్నా సరే సమర్ధవంతంగా వాడుకొని ప్రపంచానికి తొలి డీఎన్ఏ ఆధారిత కరోనా టీకాను అందించింది. కరోనా నాసల్ టీకా అభివృద్ధిలో భారతీయ సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మానవత్వాన్ని మర్చిపోని భారత్ మరోమారు టీకాల ఎగుమతిని ఆరంభించింది. ప్రపంచంలో టీకాలు తయారుచేసే ఏ సంస్థయినా భారత్‌లో ఉత్పత్తి ఆరంభించవచ్చు. అభివృద్ధి: భారత్‌లో సంస్కరణలు ప్రపంచాభివృద్ధికి మార్గదర్శకాలు. భారత్ వృద్ధి బాటలో పయనిస్తే ప్రపంచం కూడా అదే బాటలో పయనిస్తుంది. అభివృద్ధి ఎప్పుడూ సమ్మిళితంగా అందరికీ అందేదిగా ఉండాలి. పర్యావరణం: విస్తరణ, బహిష్కరణ పోటీల నుంచి సముద్రాలను కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. సముద్ర వనరులను ఉపయోగించుకోవాలి కానీ దురి్వనియోగం చేయకూడదు. అంతర్జాతీయ వాణిజ్యానికి సముద్రాలే కీలకం. వీటిని కాపాడాలుకోవడం కోసం అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి రావాలి. నిబంధనల పాటింపు, స్వేచ్ఛాయుత నేవిగేషన్, వివాదాల శాంతియుత పరిష్కారం, ప్రజాస్వామిక విలువలు, రాజ్యాల సార్వ¿ౌమత్వం కోసం అంతా పాటుపడాలి. వాతావరణ మార్పు ప్రభావం భూగోళంపై తీవ్రంగా పడుతోంది. ప్రకృతికి అనుగుణ జీవనం సాగించడమే దీని నివారణకు మార్గం. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా భారత్ మాత్రమే తగిన చర్యలు తీసుకుంది. అఫ్గానిస్తాన్: అఫ్గాన్‌లో సున్నితమైన పరిస్థితులను ఏ దేశం కూడా తమకు అనుకూలంగా మలుచుకోకుండా చూడాలి. ఎవరూ అఫ్గాన్‌ను స్వీయ అవసరాలకు వాడుకోకుండా నిలువరించాలి. కల్లోల అఫ్గాన్‌కు అంతా సాయం అందించాలి. ఆదేశంలో మైనారీ్టలకు రక్షణ లభించేందుకు కృషి చేయాలి. ‘‘మంచి పని చేసేందుకు ధైర్యంగా ముందుకు సాగితే మార్గంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ అధిగమించవచ్చు’’ అనే రవీంద్రనాధ్ టాగూర్ వ్యాఖ్యతో ప్రధాని ప్రసంగాన్ని ముగించారు. స్వదేశానికి పయనం ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ శనివారం స్వదేశానికి తిరుగుప్రయాణం అయ్యారు. పర్యటనలో ద్వైపాక్షిక, బహులపక్ష ఒప్పందాలు కుదిరాయన్నారు. 157 కళాఖండాలను అప్పగించిన అమెరికా న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన 157 పురాతన కళాఖండాలను అమెరికా ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అప్పగించింది. ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కళాఖండాలను మోదీ తన వెంట స్వదేశానికి తీసుకురానున్నారు. పురాతన వస్తువుల దొంగతనం, అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని, ప్రయత్నాలను బలోపేతం చేద్దామని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించుకున్నారు. అమెరికా అప్పటించిన కళాఖండాల్లో 71 భారత ప్రాచీన సంస్కృతికి చెందినవి కాగా, 60 హిందూమతానికి, 16 బౌద్ధమతానికి, 9 జైనమతానికి చెందినవి ఉన్నాయని అధికార వర్గాలు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. భారత్‌కు చెందిన ఈ అరుదైన కళాఖండాలను తిరిగి అప్పగించిన అమెరికాకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. అక్రమరవాణాదారులు వీటిని గతంలో భారత్‌లో దొంగిలించి, అంతర్జాతీయ స్మగ్లర్లకు అమ్మేశారు. పలువురి చేతులు మారి చివరకు అమెరికాకు చేరుకున్నాయి. ఇందులో 10వ, 11వ శతాబ్దానికి చెందిన విలువైన లోహ, రాతి విగ్రహాలు సైతం ఉన్నాయి. 1976 నుంచి 2013 వరకూ విదేశాల నుంచి కేవలం 13 కళాఖండాలు భారత్‌కు చేరుకున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 2014లో మోదీ అధికారంలోకి వచి్చన తర్వాత వందలాది కళాఖండాలను విదేశాల నుంచి వెనక్కి రప్పించగలిగారని వివరించాయి. -
Kamala Harris: ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోండి
వాషింగ్టన్: పాకిస్తాన్లో ఎన్నో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని, వాటన్నింటిపైనా అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ హితవు పలికారు. అప్పుడే అమెరికా, భారత్‌లపై ఉగ్రవాదం నీడ పడకుండా భద్రంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తన అమెరికా పర్యటనలో భాగంగా గురువారం రాత్రి కమలా హ్యారిస్‌తో భేటీ అయినప్పుడు ఉగ్రవాదం విసురుతున్న సవాళ్ల గురించి మాట్లాడుతూ కమల తనంతట తానుగా పాక్ ప్రస్తావన తెచ్చారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీమాంతర ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా భారత్ ఉగ్రవాదానికి బాధిత దేశంగా ఎలా మారిందో వాస్తవాలన్నీ విప్పి చెప్పినప్పుడు కమలా హ్యారిస్ ప్రధాని మాటల్ని సమర్థించారు. అంతకుముందు ప్రధానితో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న కమల ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, భారత్‌లు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవాలన్నారు. ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం రెండు దేశాలు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచే చర్యలు చేపట్టాలన్నారు. ఇండో– పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ నెలకొనాలి ఇండో పసిఫిక్ ప్రాంతంలో అందరినీ కలుపుకొని పోతూ స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేలా కృషి చేయడానికి కట్టుబడి ఉండాలని భారత్, జపాన్ పునరుద్ఘాటించాయి. క్వాడ్ సదస్సుకి ముందు భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాతో ముఖాముఖి చర్చలు జరిపారు. అఫ్గానిస్తాన్ సహా ప్రపంచదేశాల్లో నెలకొన్న పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఈ భేటీలో నిర్ణయానికి వచ్చినట్టుగా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
Narendra Modi: ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం
న్యూఢిల్లీ: ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం పెచ్చుమీరుతోందనడానికి ఇటీవల అఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయని, ప్రాంతీయంగా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో అంతర్జాతీయ సమాజం ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారాన్ని అడ్డుకోవడానికి ఎస్సీఓ సమష్టిగా చర్యలు చేపట్టాలని కోరారు. మధ్య ఆసియా సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉగ్రవాద శక్తులపై పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. దేశాల మధ్య అనుసంధానం అవసరం మధ్య ఆసియాలో వివిధ దేశాల మధ్య భౌగోళికంగా అనుసంధానం ఉంటే మార్కెట్ మరింత విస్తృతమవుతుందని నరేంద్ర మోదీ వివరించారు. మధ్య ఆసియా, భారత్‌కు మధ్య కనెక్టివిటీ పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం లేకపోవడంతో వల్ల భౌగోళికంగా అడ్డుగోడలు ఏర్పడుతున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, ప్రాజెక్టుల నిర్మాణం పారదర్శకంగా జరగాలని హితవు చెప్పారు. ఎస్సీఓలో కొత్తగా చేరిన సభ్యదేశం ఇరాన్‌కు మోదీ స్వాగతం పలికారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడం సరికొత్త వాస్తవం అని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆ దేశంలో మళ్లీ ఘర్షణలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉందన్నారు. ఉగ్రవాదులకు అఫ్గాన్ ఆశ్రయం ఇవ్వదని తెలిపారు. చైనాయే తమకు నమ్మకమైన నేస్తమని ఇమ్రాన్ మరోసారి స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్ నుంచి విదేశీ బలగాలు వెళ్లిపోయాక ఒక కొత్త చరిత్ర మొదలైందని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అన్నారు. అయినప్పటికీ ఆ దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఎస్సీఓ సభ్య దేశాలు అఫ్గాన్‌కు అన్ని విధాల సహకరించాలని పిలుపునిచ్చారు. చదవండి: ఈ ఏడాది ఎక్కువ నష్టపోయిన వ్యక్తి.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్లు -
3వ బ్రిక్స్ సమావేశం: అఫ్గాన్‌ను ఉగ్ర అడ్డాగా మార్చొద్దు
న్యూఢిల్లీ: ఇతరదేశాలపై ఉగ్రదాడులు చేసేందుకు అఫ్గాన్ భూభాగం ఉపయోగపడకుండా నిరోధించాలని బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాలపై పోరాడాలని పిలుపునిచ్చాయి. ఆన్లైన్లో భారత ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 13వ బ్రిక్స్ సమావేశం జరిగింది. అఫ్గాన్‌లో పరిస్థితులతో పాటు ఇతర కీలక పరిణామాలపై సభ్యదేశాలు విస్తృత చర్చలు జరిపాయి. సమావేశంలో రష్యా అధిపతి పుతిన్, చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రమఫోసా, బ్రెజిల్ అధినేత బోల్సనారో ఆన్లైన్లో పాల్గొన్నారు. సదస్సు చివరలో అన్ని దేశాలు కలిసి ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశాయి. అఫ్గాన్‌లో పరిస్థితులు శాంతియుతంగా ముగియాలని డిక్లరేషన్‌లో కోరాయి. అఫ్గాన్‌లోని అన్ని వర్గాల మధ్య సామరస్య చర్చలు సాగాలని, తద్వారా దేశంలో శాంతి, స్థిరత్వం రావాలని ఆకాక్షించాయి. ఇటీవల కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన దాడులను బ్రిక్స్ దేశాలు ఖండించాయి. ఏవిధమైన ఉగ్రకార్యకలాపాలకు అఫ్గాన్ స్థావరంగా మారకూడదని కోరాయి. టెర్రరిజం ఏరూపంలో ఉన్నా గట్టిగా ఎదుర్కోవాలన్నదే తమ అభిమతమని చెప్పాయి. బ్రిక్స్ దేశాల భద్రతా సంస్థలు రూపొందించిన కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్‌ను ఆమోదించాయి. టెర్రరిజానికి మతం, జాతీయత, వర్గం రంగు పులమకూడదని బ్రిక్స్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై రెండు నాల్కల ధోరణిని వ్యతిరేకిస్తామని, ఐరాస నిబంధనల మేరకు రూపొందించి సీసీఐటీ అమలు చేయాలని బ్రిక్స్‌దేశాలు తమ డిక్లరేషన్‌లో కోరాయి. కౌంటర్ టెర్రరిజం ప్లాన్ బ్రిక్స్ దేశాలు రూపొందించుకున్న కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్‌కు ఆమోదం లభించిందని ప్రధాని మోదీ చెప్పారు. బ్రిక్స్ చైర్మన్‌గా భారత్ ప్రస్తుతం వ్యవహరిస్తోంది. తమ పాలనా కాలంలో ఇతర నాలుగు దేశాలు మంచి సహకారం అందించాయని ప్రధాని ప్రశంసించారు. ‘ప్రపంచంలోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ప్రభావశీల గళంగా మారాము. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు ప్రాధాన్యమివ్వడానికి బ్రిక్స్ ఉపయోగపడుతోంది’’అని మోదీ చెప్పారు. బ్రిక్స్ సాధించిన పలు విజయాలను ఆయన వివరించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, కంటింజన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్, ఎనర్జీ రిసెర్చ్ కోఆపరేషన్ ప్లాట్ఫామ్లాంటి బలమైన సంస్థలను బ్రిక్స్ దేశాలు ఏర్పరుచుకున్నాయన్నారు. వచ్చే 15ఏళ్లలో మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాజా సమావేశం బ్రిక్స్ చరిత్రలో తొలి డిజిటల్ సదస్సని గుర్తు చేశారు. నవంబర్‌లో బ్రిక్స్ దేశాల జలవనరుల మంత్రుల తొలి సమావేశం జరుగుతుందని చెప్పారు. ఐదు దేశాల కస్టమ్స్ శాఖల మధ్య సమన్వయం పెరగడంతో బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం సులభతరంమవుతోందన్నారు. గ్రీన్ టూరిజం, ఆన్లైన్ టీకా ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటువంటి వాటిపై బ్రిక్స్ దేశాలు దృష్టి పెట్టాయని చెప్పారు. ఎవరేమన్నారంటే..: బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వేదికపై గణనీయమైన శక్తిగా మారాయని చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ కొనియాడారు. సభ్యదేశాల మధ్య మరింత లోతైన సహకారం అవసరమని, అప్పుడే ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనే పటిష్టమైన భాగస్వాములుగా మారతామని చెప్పారు. ప్రజారోగ్యాలను బలోపేతం చేయడంలో సహకారం, టీకాలపై అంతర్జాతీయ సహకారం, ఆర్థిక సహకారం, రాజకీయ, రక్షణ సహకారం, ప్రజా సంబంధాలు పెంపొందించడమనే ప్రతిపాదనలతో బ్రిక్స్ బలపడుతుందని వివరించారు. అఫ్గాన్‌లో నూతన సంక్షోభానికి అమెరికా, దాని మిత్రదేశాలు కారణమయ్యాయని రష్యా అధిపతి పుతిన్ విమర్శించారు. బ్రిక్స్ దేశాలు అఫ్గాన్‌పై ప్రత్యేకశ్రద్ధ పెట్టాలని, ఉగ్రకార్యక్రమాలకు, డ్రగ్స్‌కు ఆదేశం అడ్డాగా మారకుండా చూడాలని కోరారు. కోవిడ్ కట్టడి విషయంలో సమష్టి స్పందనను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా కొనియాడారు. బ్రెజిల్, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బాగుందని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో చెప్పారు. బ్రిక్స్ విశేషాలు ► ఈ సంవత్సరం బ్రిక్స్ థీమ్ ‘‘ఇంట్రా బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యుటీ, కన్సాలిడేషన్, కన్సెస్’’. ► ప్రపంచ జనాభాలో 41 శాతం వాటా, ప్రపంచ జీడీపీలో 24 శాతం భాగస్వామ్యం, అంతర్జాతీయ వాణిజ్యంలో 16 శాతం వాటా బ్రిక్స్ దేశాలదే. ► 2006లో తొలిసారి బ్రిక్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది. ► 2009లో తొలి బ్రిక్ సమావేశం రష్యాలో జరిగింది. ► బ్రిక్ అనే పదం రూపకల్పన రూపా పురుషోత్తమన్ చేశారు. కానీ క్రెడిట్ మాత్రం జిమ్ ఓ నీల్‌కు వచ్చింది. ► బ్రిక్స్ ప్రధాన కార్యాలయం చైనాలోని షాంగైలో ఉంది. ► 14వ బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షత వహించనుంది. ► ఏటా ఒక దేశం బ్రిక్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తుంది. 2016లో మోదీ బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించారు.