![Vijay Starrer Beast Movie Banned In Kuwait Here Is The Reason - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/5/beast.jpg.webp?itok=7YLBo6Ue)
Vijay Starrer Beast Movie Banned In Kuwait Here Is The Reason: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, బుట్టబొమ్మ జోడిగా నటించిన చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 13న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. కానీ ఈ ట్రైలర్‌తో 'బీస్ట్' చిక్కుల్లో పడ్డాడు. ఈ ట్రైలర్‌లో షాపింగ్ మాల్‌ను హైజాక్ చేసిన ఉగ్రవాదులను ఒక గూఢాచారి ఎలా అంతమొందిచాడనేది చూపించారు. దాదాపు ఈ సినిమా ఉగ్రవాద నేపథ్యంతో తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
అయితే అరబిక్ దేశాలు ప్రోత్సహించని ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నందున గల్ఫ్ దేశాల్లో ఒకటైన కువైట్ 'బీస్ట్'ను నిషేధించింది. అరబ్ దేశాలను విలన్లుగా, టెర్రరిస్టులకు నిలయంగా చూపించే ఏ సినిమాను గల్ఫ్ దేశాలు అంగీకరించవని తెలిసిందే. టెర్రరిస్టులు ఎక్కువగా కువైట్ వంటి గల్ఫ్ దేశాల్లో దాక్కుంటారని, అందుకు అక్కడ చట్టాలు కూడా సహకరిస్తాయని టాక్ ఉంది. అయితే యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ వంటి గల్భ్ దేశాల్లో 'బీస్ట్' రిలీజ్‌కు మార్గం సుగమం అయింది.
Comments
Please login to add a commentAdd a comment