Kuwait
-
శనివారం నుంచి మోదీ కువైట్ పర్యటన
న్యూఢిల్లీ: శనివారం నుంచి ప్రధాని మోదీ కువైట్‌లో రెండ్రోజులపాటు పర్యటించనున్నారు. గత 43 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఈ గల్ఫ్ దేశంలో పర్యటనకు వెళ్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు ఇండియా, కువైట్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని పర్యటిస్తున్నారని భారత విదేశాంగ శాఖ బుధవారం పేర్కొంది. పర్యటనలో భాగంగా మోదీ కువైట్ పాలకులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అక్కడ భారతీయ సంతతి వ్యక్తులతో భేటీ కానున్నారు. చివరిసారిగా 1981లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు. కువైట్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023–24లో ఏకంగా 10.47 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
కువైట్‌లో భారత ప్రయాణికులు ఇక్కట్లు.. 13 గంటలుగా ఆహారం లేక..
కువైట్: భారత ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై నుంచి మాంచెస్టర్‌కు వెళ్లే భారత ప్రయాణికులు కువైట్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో దాదాపు 13 గంటలపాటు వారంతా ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు. ప్రయాణికులకు ఆహారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముంబై నుండి మాంచెస్టర్‌కు వెళ్లున్న విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ఫ్లైట్ అత్యవసరంగా కువైట్‌లో ల్యాండ్ అయింది. దీంతో, ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయియి. తమ విమానం కువైట్‌లో దిగే ముందు యూటర్న్ తీసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రయాణికులంతా దాదాపు 13 గంటలుగా విమానాశ్రయంలోనే ఉన్నారు. వారికి ఆహారం, సాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.#Breaking l Indian passengers flying from #Mumbai to #Manchester, stuck at #Kuwait airport for 13 hours complain of severe problems including not getting "food or #help"; video on social media shows passengers of Gulf Air arguing with airport authorities.#KuwaitAirport #GulfAir pic.twitter.com/DHpgA26eR1— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) December 1, 2024మరోవైపు.. గల్ఫ్ ఎయిర్‌లోని ప్రయాణికులు ఎయిర్ పోర్టు అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ప్రయాణికులును వేధించారని, యూరోపియన్ యూనియన్, యూకే, యూఎస్ నుంచి వచ్చిన ప్రయాణికులకు మాత్రమే ఎయిర్‌పోర్టు సిబ్బంది వసతి కల్పించారని ఆరోపించారు. భారత్, పాకిస్తాన్, ఇతర ఆగ్నేయాసియా దేశ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న వారిపై పక్షపాతం చూపిస్తున్నారని, ఎలాంటి వసతులు ఇవ్వలేదని మండిపడుతున్నారు.ఈ సందర్బంగా ప్రయాణికుడు మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టులోనే 13 గంటలకు పైగా సమయం గడిచింది. దాదాపు 60 మంది ప్రయాణికులు ఇక్కడే ఉన్నారు. ఉదయం నుండి ప్రతి మూడు గంటలకు మేము ఇంటికి వెళతామని వారు మాకు చెబుతున్నారు. కానీ, ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం మాకు కూర్చోవడానికి స్థలం ఇవ్వమని మేము వారిని చాలా సార్లు అడిగాము. అందరూ నేలపై కూర్చున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్
ప్రపంచంలో అత్యధిక విలువైన కరెన్సీ అంటే అంతా అమెరికన్ డాలర్ అనుకుంటారు. అది కొంతవరకూ నిజమే. ప్రపంచంలో అత్యధిక లావాదేవీలు డాలర్‌తోనే జరుగుతాయి. అక్టోబరు 7 నాటికి.. ఒక డాలర్ విలువ మన కరెన్సీలో సుమారు రూ.84.కానీ, కొన్ని కరెన్సీలు ఒక్కో యూనిట్ కొనాలంటే ఒకటి కంటే ఎక్కువ అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాలి. అలా చూసినప్పుడు ప్రపంచంలో అత్యధిక విలువ ఉన్న కరెన్సీ కువైట్ దీనార్. ఇది ఒక యూనిట్ సుమారు రూ.274. ఒక దీనార్ కొనాలంటే 3.26 డాలర్లు ఖర్చు పెట్టాలి.ప్రపంచంలోనే అత్యంత విలువైన లేదా ఖరీదైన కరెన్సీ టైటిల్‌ను కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి వివిధ స్థానిక, అంతర్జాతీయ అంశాల సమగ్ర విశ్లేషణ అవసరం. ఈ కారకాలలో విదేశీ మారకపు మార్కెట్లలో సరఫరా, డిమాండ్ డైనమిక్స్, ద్రవ్యోల్బణం రేట్లు, దేశీయ ఆర్థిక వృద్ధి, సంబంధిత సెంట్రల్ బ్యాంక్ అమలు చేసే విధానాలు, దేశం మొత్తం ఆర్థిక స్థిరత్వం ఉన్నాయి. -
గల్ఫ్ దేశాల్లో ఎందుకు మలయాళీలు ఎక్కువ?
కేరళ ప్రజలు అత్యధికంగా గల్ఫ్ దేశాల్లో ప్రవాసం ఉండే విషయం తెలిసిందే. కువైట్‌లో ఉండే విదేశీయుల్లో 80 శాతం దాకా మన దేశంలోని కేరళ నుంచి వెళ్ళినవారే. గల్ఫ్ దేశాల్లోని అవకాశాల్ని మొట్టమొదటగా గుర్తించి వాటిని అంది పుచ్చుకోవడం వల్ల వారి ఆధిపత్యం అక్కడ అనేక రంగాల్లో కొనసాగుతోంది. 1972 నుంచి 1983 మధ్య కాలంలో వచ్చిన గల్ఫ్ బూమ్‌ను మలయాళీలు బాగా వినియోగించుకున్నారు. అక్షరాస్యత ఎక్కువగా ఉండటం, సాంకేతిక నైపుణ్యం గల కోర్సులు చేయడం వల్ల చాలామంది క్లర్కులుగా, ఆర్కిటె క్టులుగా, నిర్మాణ రంగంలో సూపర్వైజర్లుగా, ఇంజినీర్లుగా మంచి అవకాశాల్ని పొందగలిగారు. మొదటితరం వారు ఆ తర్వాత తమ బంధువుల్ని, స్నేహితుల్ని తీసుకువెళ్లారు. యూఏఈలో 7,73,624 మంది, కువైట్‌లో 6,34,728 మంది, సౌదీ అరేబియాలో 4,47,440 మంది, ఖతర్‌లో 4,45,000 మంది, ఒమన్‌లో 1,34,019 మంది, బహ్రెయిన్‌లో 1,01,556 మంది మలయాళీలు ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు పంపించే విదేశీ మారకద్రవ్యం వల్ల కేరళ రాష్ట్రపు ఆర్థిక చిత్రపటం మారిపోయిందని చెప్పాలి. ప్రతి ఏటా రమారమి 60,000 కోట్ల రూపాయలు కేరళకు వస్తుంటాయి. తాము ఆ దేశాల్లో పనిచేసి సంపాదించిన ధనంలో ప్రతి ఒక్కరు కొంత వెనక్కి తమ కుటుంబాలకు పంపిస్తుంటారు. మిగతా దేశాలతో పోలిస్తే మలయాళీ ప్రజలు గల్ఫ్‌లో ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నో శతాబ్దాల నుంచి అరబ్బు దేశాలతో కేరళకు సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం జరగడం ప్రధాన కారణం. కేరళలో పెద్ద పరిశ్రమలు తక్కువ. పర్యావరణంపై ప్రజల చైతన్యం ఎక్కువ. ట్రేడ్ యూనియన్ల ప్రభావం వల్ల పెద్ద పెట్టుబడిదారులు రావడానికి వెనకడుగు వేస్తుంటారు. కాబట్టి మంచి సంపాదన ఎక్కడ ఉన్నా సగటు మలయాళీ ప్రవాసిగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. యువతులు కూడా దూర ప్రదేశాలు వెళుతుంటారు. కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, ఇంకా దేశంలో ఎక్కడ అవకాశాలు ఉన్నా వెళుతుంటారు. ముఖ్యంగా నర్సింగ్ వృత్తి పరంగా చూస్తే దేశ విదేశాల్లో కేరళ నర్సులకు మంచి డిమాండ్ ఉంది. దేశంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రిని చూసినా అత్యంత ఎక్కువ సంఖ్యలో కేరళ నర్సులే ఉంటారు. గల్ఫ్ సంపద కేరళలో ఎంత ప్రధాన పాత్ర కలిగి ఉందంటే చాలామంది మలయాళీ కోటీశ్వరులు ఆ దేశాల్లోనే వ్యాపారం చేసి, తర్వాత మిగతా దేశాలకు తమ వ్యాపారాలను విస్తరించారు. ముథూట్ గోల్డ్ ఫైనాన్స్ గానీ, జాయ్ అలుక్కాస్ గోల్డ్ కంపెనీ గానీ గల్ఫ్ దేశాల సంపదతో విస్తరించినవే. యూసుఫ్ ఆలీ (లూలూ గ్రూప్), షంషేర్ వయలిల్ (వీపీఎస్ హెల్త్ కేర్), సన్నీ వర్కీ (జెమ్స్ ఎడ్యుకేషన్), పి.ఎన్.సి. మీనన్ (శోభ గ్రూప్) లాంటి మలయాళీ కుబేరులంతా వ్యాపారం గల్ఫ్ దేశాల్లో చేసి ఆ తర్వాత మన దేశంలో విస్తరించినవారే. ఇప్పటికీ వారి ప్రధాన కేంద్రాలు అక్కడే ఉన్నాయని చెప్పాలి. కేరళ ప్రభుత్వానికి రెవెన్యూ ద్వారా ఒక ఏడాదికి ఎంత ధనం వస్తుందో దానికి రమారమి రెండింతలు గల్ఫ్ నుంచి వస్తుంది. గల్ఫ్ నుంచి వచ్చీ పోయే ప్రయాణీకుల కోసం కేరళలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వారి బాగోగులు చూడటానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఉంది. కొచ్చి, కోజీకోడ్, మలప్పురం, కన్ననూర్ వంటి ప్రాంతాల్లో గల్ఫ్ నుంచి వచ్చే అనేక వస్తువుల్ని ధారాళంగా అమ్ముతుంటారు.గల్ఫ్ నుంచి వచ్చే ధనం వల్ల వినిమ యతత్వం బాగా పెరిగిందనే ఒక ఆరోపణ ఉన్నది. గల్ఫ్ నుంచి వచ్చిన లేదా అక్కడ పనిచేసే యువకులకు పెళ్ళి విషయంలో మంచి డిమాండ్ ఉన్నది. మరి అక్కడ విషాధ గాథలు లేవా అంటే ఉన్నాయి. స్థానికంగా ఉన్న ఆస్తి తాకట్టు పెట్టి గల్ఫ్ వెళ్ళి అనుకున్న పని దొరక్క పడరాని పాట్లు పడేవారూ ఉన్నారు. అక్కడి పత్రికల్లోనూ, టీవీ చానెళ్ళలోనూ అలాంటివారి కోసం ప్రత్యేకంగా కొంత స్పేస్ కేటాయిస్తారు. ఇటీవల వచ్చిన ‘ఆడు జీవితం’ (గోట్ లైఫ్) సినిమా అలాంటి వారి బాధల్ని చిత్రించిందన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచి, లక్షలాది మధ్య తరగతి ప్రజలకు ఉపాధి చూపిన గల్ఫ్ దేశాల చమురు నిల్వలు ఇంకా చాలా కాలం ఉండాలని ఆశిద్దాం.మూర్తి కెవివిఎస్వ్యాసకర్త రచయిత, అనువాదకుడుమొబైల్: 78935 41003 -
ఫోన్లో తలాక్ చెప్పాడు... ఫిక్స్ అయిపోయాడు!
రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం కువైట్‌కు వెళ్లి జీవిస్తున్నాడు. అయితే అతనికి పాకిస్థాన్‌కు చెందిన మహిళ పరిచయం అవ్వగా.. ఆమెను వివాహం చేసుకునేందుకు భారత్‌లోని తన భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అయితే సోమవారం అతడు జైపూర్ భారత ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాలు.. రాజస్థాన్‌లోని చురుకు చెందిన 35 ఏళ్ల రెహ్మాన్ కువైట్‌లో పనిచేస్తున్నాడు. అతడికి హనుమాన్‌గఢ్‌లోని భద్ర ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ఫరీదా బానోతో 2011లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, రెహ్మాన్‌కు పాకిస్థాన్‌కు చెందిన మెహ్విష్ అనే మహిళతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది.ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెహ్మాన్ కువైట్ నుంచి భారత్‌లో ఉంటున్న తన భార్యకు ఫోన్ ద్వారా త్రిపుల్ తలాక్ చెప్పాడు. అనంతరం సౌదీ అరేబియాలో పాక్ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె గత నెల టూరిస్ట్ వీసాపై చురుకు వచ్చి రెహ్మాన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో మొదటి భార్య ఫరీదా బానో తన భర్త రెహ్మాన్‌పై కేసు పెట్టింది. తనను అధిక కట్నం కోసం వేధించారని, ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో సోమవారం కువైట్ నుంచి జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న రెహ్మాన్‌ను హనుమాన్‌ఘర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేసినట్లు హనుమాన్‌గఢ్ డిప్యూటీ ఎస్పీ రణ్వీర్ సింగ్ తెలిపారు. -
పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. కారణం ఏంటో తెలుసా?
పెళ్లంటే నూరేళ్ల బంధం.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి.. పెళ్లి కొత్త జీవితానికి నాంది.. పెళ్లి అనేక మధురానుభూతులకు, జ్ఞాపకాలకు వేదిక.. ఇలాంటి పదాలన్నీ తరుచూ వింటుంటాం.. ఒకప్పుడు పెళ్లంటే గౌరవం, నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దంపతుల మధ్య అపార్థాలు, చిన్న సమస్యలనే పెద్దదిగా చూడటం.. ఇలా అనేక కారణాలతో పెళ్లైన వెంటనే విడాకుల బాట పడుతున్నారు.తాజాగా ఓ జంట వివాహం జరిగిన మూడు అంటే మూడు నిమిషాలకే విడాకులు తీసుకుంది. న్యాయమూర్తి సైతం ఆ జంటకు విడాకులు మంజూరు చేశాడు. వినడానికి కాస్తా ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ ఈ ఘటన కువైట్ దేశంలో జరిగింది. అయితే ఈ సంఘటన 2019 జరగ్గా.. తాజాగా మరోసారి వైరల్‌గా మారింది. కువైట్‌లో వధూవరులు, తమ వివాహ రిజిస్ట్రేషన్ కోసం న్యాయమూర్తి ఎదుట సంతకాలు పెట్టేందుకు వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న వేళ, వధువు పొరపాటున కాలు జారి కింద పడిపోయింది. దీంతో వెంటనే పక్కనే ఉన్న వరుడు ఆమెను తెలివి తక్కువదానా అంటూ పరుష పదజాలానికి దిగాడు.తనకు సాయం చేయాల్సింది పోయి, పరువు తీశావంటూ అవమానించడంతో వధువు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనితో తన జీవితం సాఫీగా ఉండదని భావించిన ఆమె, ఒక్కసారిగా జడ్జి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పి, విడాకులు కావాలని అడిగింది. దీని న్యాయమూర్తి అంగీకరించి వెంటనే విడాకులు మంజూరు చేేశాడు.అయితే పెళ్లైన మూడు నిమిషాలకే ఆ జంట విడాకులు తీసుకోవడంతో.. దేశ చరిత్రలో అతి తక్కువ సమయం వివాహంగా రికార్డులకెక్కింది. ఇదిలా ఉండగా గతంలో దుబాయ్‌లో ఓ జంట పెళ్లయన 15 నిమిషాల వ్యవధిలో విడాకులకు దరఖాస్తు చేసి, మంజూరు చేయించుకుంది. -
కువైట్‌లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం
గల్ఫ్ దేశం కువైట్‌లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ భారతీయ కుటుంబం సజీవదహనం అయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కువైట్‌లోని అబ్బాసియా ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో చోటు చేసుకుంది.వివరాలు.. కేరళకు చెందిన నాలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు రాత్రి 9 గంటలకు నిద్రపోయిన తర్వాత వారిలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే ఆ కుటుంబం మంటల్లో సజీవదహనం అయింది.Four members of a #Malayali family died in a fire accident at their residence in Abbasiya, #Kuwait. The deceased are Mathew Muzhakkal, his wife Lini Abraham, and their children Isaac and Irene, all hailing from Thiruvalla, #Kerala.The fire broke out in the second-floor… pic.twitter.com/AAa8K7jZqz— South First (@TheSouthfirst) July 20, 2024మృతి చెందినవారిని మాథ్యూ ములక్కల్ (40), అతని భార్య లిని అబ్రహం (38), వారి పిల్లలు ఇరిన్ (14),ఇస్సాక్ (9)గా గుర్తించారు. వీరు కేరళలో అలప్పుజ జిల్లాలోని నీరట్టుపురానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇటీవల వారు కేరళ వచ్చి.. శుక్రవామరే అక్కడివెళ్లారు. అంతలోనే రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనలో కుటుంబం మొత్తం మృతి చెందటంపై తల్లిదండ్రులు, కుటంబ సభ్యులు కనీరుమున్నీరు అవుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం ఇంట్లోని ఏసీ పవర్ ఫెయిల్యూర్ కారణంగా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో వారంతా విషపూరిత వాయువును పీల్చుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక.. గతనెల ఓ అపార్టుమెంట్లో భారీగా మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో మొత్తం 49 మంది మరణించగా.. 45 మంది భారతీయులేనని అధికారలు గుర్తించారు. ఇందులో కేరళ, తళమిళనాడుకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ. 5 లక్షలు పరిహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. -
కువైట్‌లో అన్నమయ్య జిల్లా వాసి ఆర్తనాదాలు
వాల్మీకిపురం: ఎన్నో ఆశలతో కువైట్‌కు వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి ఏజెంట్ చేతిలో మోసపోయాడు. ఎడారిలో తాను కష్టాలు పడుతున్నానని, కాపాడాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘ఎడారిలో మేకలు, గొర్రెలు, కుక్కలకు నేనొక్కడినే మేత వేస్తున్నా..నీళ్ల కోసం 2 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఎండలకు నా వల్ల కావడంలేదు. ఎవరైనా సాయం చేయండి.. లేదంటే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలు.. చిత్తూరు జిల్లా కల్లూరుకు చెందిన రామచంద్రరావ్ కుమారుడు శివ (40) అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం బోయపల్లికి చెందిన శంకరమ్మను 18ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి వెన్నెల, వనిత అనే కుమార్తెలు ఉన్నారు. శివ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. బిడ్డలను చదివించలేని పరిస్థితి ఉండడంతో పెద్ద కుమార్తెతో పాటు భార్యను సైతం కూలీకి తీసుకెళ్లి వచ్చిన డబ్బుతో చిన్న కుమార్తె వనితను చదివిస్తున్నాడు. ఈ క్రమంలో కువైట్ వెళ్లి డబ్బు సంపాదించి పెద్ద కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పులు చేసి డబ్బులు పోగేసుకొని రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్‌ను సంప్రదించాడు. అతని ద్వారా శివ నెలక్రితమే కువైట్‌కు వెళ్లాడు. అక్కడ ఎడారిలో గొర్రెలు, పావురాలు, బాతులు మేపడానికి బాధితుడిని పెట్టారు. అయితే అక్కడ సంబంధిత యజమానులు నాలుగు రోజులైనా గొర్రెల దగ్గరికి రాకపోగా సరిపడా ఆహారం, నీటిని అందించకపోవడంతో బాధితుడు భయపడిపోయాడు. ఈ తరుణంలో తన భార్యకు, ఏజెంట్‌కు సమాచారం అందించాడు. తిరిగి రావడానికి డబ్బులు ఎవ్వరు ఇస్తారని, నువ్వు అక్కడే పని చేయాల్సిందేనని ఏజెంటు చెప్పడంతో తన దగ్గర డబ్బులు లేవని, భార్య నిస్పహాయత చూపడంతో బాధితుడు చేసేది ఏమీలేక తనకు చావే శరణ్యమని, తనను ఎవరైనా దయగలవారు ఇండియాకు తీసుకెళ్లాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ పోస్టును చూసిన ఎంబసీ వారు స్పందించారు. బాధితుడు శివను భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.మా నాన్నను భారత్‌కు రప్పించండిమా నాన్న శివ కువైట్‌కు వెళ్లాడు. అక్కడ ఎడారిలో ఉన్నాడు. దయచేసి ఎవరైనా సహాయం చేసి మా నాన్నను భారత్‌కు రప్పించండి.– వనిత, బాధితుడి కుమార్తె -
Kuwait Fire Incident: భారత్‌కు చేరుకున్న‘కువైట్’ బాధితుల మృతదేహాలు
కొచ్చి: మూడు రోజుల క్రితం ఎడారి దేశం కువైట్‌లో వలసకార్మికులు ఉంటున్న భవంతిలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 31 మంది భారతీ యుల మృతదేహాలు స్వదేశానికి చేరుకు న్నాయి. వీరిలో అత్యధికంగా 23 మంది కేరళీయులు ఉన్నారు. మృతుల్లో కర్ణాటక సంబంధించి ఒకరు, తమిళనాడుకు చెందిన ఏడుగురి మృతదేహాలనూ తీసుకొచ్చారు. మృతదేహాలను తొలుత శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానా శ్రయానికి తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వారికి నివాళులర్పించారు. ‘‘ జీవనోపాధి కోసం విదేశం వెళ్లి విగతజీవులైన బడుగుజీవుల కష్టాలను కేంద్రప్రభుత్వం పట్టించుకోవాలి. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయం సరిపోదు’ అని సీఎం అన్నారు. కువైట్ నుంచి మృతదేహాల తరలింపు ప్రక్రియను దగ్గరుంచి చూసుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్‌తోపాటు తమిళనాడు మైనారిటీ సంక్షేమ మంత్రి కేఎస్ మస్తాన్లు సైతం పార్థివదేహాల వద్ద నివాళులర్పించారు.మృతుల్లో ముగ్గురు తెలుగువారుఅగ్నిప్రమాదంలో ముగ్గురు తెలుగువ్యక్తులు సైతం చనిపోయారని ఆంధ్రప్రదేశ్ నాన్– రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి. లోకనాథం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎం.సత్యనారాయణ, ఎం.ఈశ్వరుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని ఏపీఎన్ఆర్టీఎస్ పేర్కొంది. ‘‘ సొంత పనిమీద స్వదేశానికి వచ్చిన లోకనాథం తిరిగి కువైట్ బయల్దేరారు. స్వస్థలం నుంచి తొలుత జూన్ 5న హైదరాబాద్‌కు వచ్చి నాలుగు రోజులు ఉండి తర్వాత జూన్ 11న కువైట్ చేరుకున్నారు. ఆయన భవంతికి వచ్చి బసచేసిన అదే రోజున అగ్నిప్రమాదం జరిగి తుదిశ్వాస విడిచారు’’ అని లోకనాథం బంధువు శాంతారావు చెప్పారు. -
కువైట్ నుంచి భారత్ కు 45 మృతదేహాలు
-
Kuwait Fire వచ్చే నెలలోనే పెళ్లి... భగవంతుడా నాబిడ్డ ఎక్కడ?
కువైట్‌లోని మంగాఫ్ భవనంలో చెలరేగిన మంటలు మరణమృదంగాన్ని సృష్టించాయి. పొట్టచేతపట్టుకొని ఎడారి దేశం పోయిన శ్రమజీవులు 45 మంది భారతీయులు అగ్నికి ఆహూతైపోయారు. పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన తన బిడ్డ ఏమైపోయాడో తెలియక బిహార్‌కు చెందిన ఒక తల్లి తల్లడిల్లి పోతోంది.ఈ అగ్నిప్రమాదం గురించి విన్నప్పటి నుండి బిహార్‌లోని దర్భంగా జిల్లాలోని నైనా ఘాట్ ప్రాంతానికి చెందిన మదీనా ఖాతూన్ తన కొడుకు ఆచూకీకోసం ఆందోళన పడుతోంది. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సిన తన పెద్ద కొడుకు కాలూ ఖాన్ ఫోన్ కాల్స్‌కు స్పందించడంలేదనీ, అతని ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం తెలియడం లేదని వాపోతోంది. తన కుమారుడికి అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదంటూ భయాందోళన వ్యక్తం చేసింది. శుభవార్త అందించు దేవుడా అంటూ ఖాతూన్ కన్నీరు మున్నీరవుతోంది.కాలూ ఖాన్ ప్రమాదం జరిగిన భవనంలో నివసిస్తున్నాడని, పెళ్లి కోసం జూలై 5న రావాల్సి ఉందని చెప్పింది. "కొన్నేళ్లుగా కువైట్‌లో నివసిస్తున్న మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నేనుఫోన్లో మాట్లాడాను. వచ్చే నెలలో తన వివాహం జరగాల్సి ఉన్నందున జూలై 5న దర్భంగా వస్తానని చెప్పాడు" అని ఆమె మీడియా ప్రతినిధులకు తెలిపింది. అతని ఫోటోలను ఎంబసీ అధికారులకు పంపామనీ, అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది."ఎలక్ట్రికల్ సర్క్యూట్" కారణంగా ఘోరమైన మంటలు సంభవించాయని కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. కువైట్ మంగాఫ్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలతో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం కేరళలో ల్యాండ్ అయింది.మృతిచెందిన వారి సంఖ్య రాష్ట్రాల వారిగా కేరళ - 23 తమిళనాడు -7ఉత్తరప్రదేశ్ -3ఆంధ్రప్రదేశ్ -3ఒడిశా- 2బీహార్, వెస్ట్ బెంగాల్ పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటక, జార్ఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. రూ. 2 లక్షల పరిహారంకువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన వారికి రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. -
కువైట్ అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు.. ప్రత్యేక విమానంలో మృతదేహాలు..
-
కువైట్ నుంచి మృతదేహాలు.. కొచ్చిన్ చేరుకున్న ప్రత్యేక విమానం
Updates..👉కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారికి సీఎం విజయన్, కేంద్ర మంత్రి కృతివర్ధన్ సింగ్, ఇతర మంత్రులు నివాళులు అర్పించారు. కొచ్చిన్ విమానాశ్రయంలో సంతాపం తెలిపారు. #WATCH | Ernakulam: Kerala CM Pinarayi Vijayan, MoS MEA Kirti Vardhan Singh and other ministers pay homage to the mortal remains of the victims of the fire incident in Kuwait, at Cochin International Airport. pic.twitter.com/LvcbBEmQm8— ANI (@ANI) June 14, 2024 👉 కువైట్‌లో మరణించిన వాళ్ల మృతదేహాలను కొచ్చిన్ ఎయిర్‌పోర్టు నుంచి స్వస్థలాలకు తరలిస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది. #WATCH | Ernakulam, Kerala: The mortal remains of the 45 Indian victims in the fire incident in Kuwait arrive at Cochin International Airport. pic.twitter.com/nzl5vDNze4— ANI (@ANI) June 14, 2024 #WATCH | Ernakulam, Kerala: The mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait being taken out of the special Indian Air Force aircraft at Cochin International Airport.(Source: CIAL) pic.twitter.com/Dsn8hHhcqS— ANI (@ANI) June 14, 2024 కువైట్ మృతుల్లో తెలుగు వాళ్లు వీళ్లే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం (31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు 👉 కువైట్ నుంచి 45 మంది భారతీయుల మృతదేహాలు కొచ్చిన్ చేరుకున్నాయి. మృతుల్లో ఏపీకి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. కాగా, మృతదేహాలకు ప్రభుత్వం డీఎన్ఏ టెస్టులు నిర్వహించనుంది. #WATCH | Ernakulam: Kerala CM Pinarayi Vijayan arrives at the Cochin International Airport where the special IAF aircraft carrying the mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait will reach shortly. pic.twitter.com/oKNVYE0lcG— ANI (@ANI) June 14, 2024 👉 కొచ్చిన్ విమానాశ్రయానికి చేరుకున్న కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేష్ గోపి. మృతదేహాలను బంధువులకు అప్పగించేందకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. అంబులెన్స్‌లు సిద్ధం చేసిన కేరళ ప్రభుత్వం. #WATCH | Ernakulam: Special IAF aircraft carrying the mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait reaches Cochin International Airport. (Source: CIAL) pic.twitter.com/UKhlUROaP7— ANI (@ANI) June 14, 2024 👉ఇటీవల కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్‌కు చెందిన 45 మంది కార్మికులు మరణించారు. కాగా, వారి మృతదేహాలను భారత్‌కు తరలిస్తున్నారు. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం C-130J శుక్రవారం ఉదయం కువైట్ నుంచి కేరళకు బయలుదేరింది.👉కాగా, కువైట్‌లోని మంగాఫ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు విదేశాంగశాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. శుక్రవారం ఉదయం విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కువైట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కువైట్ అధికారులతో మాట్లాడి మృతదేహాలను వెంటనే భారత్‌కు తరలించేలా కృషి చేశారు. ఇక, భారతీయుల మృతదేహాలతో ప్రత్యేక విమానం C-130J కువైట్ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరింది. 🚨 India to repatriate remains of 45 nationals killed in Kuwait fire. Most victims are from Kerala (23), followed by Tamil Nadu (7), Andhra Pradesh (3), Uttar Pradesh (3), Odisha (2), and one each from Bihar, Punjab, Karnataka, Maharashtra, West Bengal, Jharkhand, and Haryana.… https://t.co/hLkfaxVnzl pic.twitter.com/mAxV5uzmXK— Dharmishtha (@Dharmishtha_D) June 14, 2024 అయితే, దక్షిణ కువైట్‌లోని విదేశీ కార్మికులు నివసిస్తున్న భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 50 మంది మృతిచెందగా వారిలో 45 మంది భారతీయులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 50 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది కేరళకు చెందినవారు ఉన్నారు. 24 మంది మలయాళీలు చనిపోయినట్టు సమాచారం. ఈ మేరకు ఓ అధికారి అనధికారికంగా ఓ ప్రకటన చేశారు. ప్రత్యేక విమానం కొచ్చి విమానాశ్రయానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే, మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. We have made all the required arrangements for receiving the bodies. We have coordinated with the family members of the victims: #Ernakulam Range DIG Putta Vimaladitya on mortal remains of #Kuwait fire incident pic.twitter.com/bw8u0YvO1F— DD News (@DDNewslive) June 14, 2024 -
Kuwait Fire Incident: 49లో 45 మంది భారతీయులే
కువైట్ సిటీ/ దుబాయ్: గల్ఫ్ దేశం కువైట్‌లో బుధవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో అగ్నికి ఆహుతైన 49 మందిలో 45 మంది భారతీయులేనని అధికారులు తెలిపారు. మరో ముగ్గురు ఫిలిప్పీన్స్ దేశస్తులు కాగా మరో మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మృతుల్లో మలయాళీలు 24 మంది ఉన్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఆ రాష్ట్ర వాసులు మరో ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో ఐసీయూల్లో చికిత్స పొందుతున్నట్లు గుర్తించామని వెల్లడించింది. విదేశాంగ శాఖ నుంచి ధ్రువీకరణ సమాచారం అందాక బాధితుల వివరాలను వెల్లడిస్తామని తెలిపింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్ ప్రాంతంలోని ఏడంతస్తుల భవనంలో బుధవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో 49 మంది మృతి చెందగా మరో 50 మంది వరకు గాయపడ్డారు. గురువారం కువైట్ చేరుకున్న విదేశాంగ మంత్రి కీర్తివర్థన్ సింగ్ క్షతగాత్రులైన భారతీయులతో మాట్లాడి, వారికి అవసరమైన సాయం అందేలా చూస్తున్నారు. ముబారక్ అల్‌కబీర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న భారతీయులను పరామర్శించారు. అదేవిధంగా, మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నీళ్ల ట్యాంకుపైకి దూకి..ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ఆ భవనంలో కేరళలోని త్రిక్కారిపూర్కు చెందిన నళినాక్షన్ కూడా నిద్రిస్తున్నారు. మూడో అంతస్తులో ఉన్న ఆయన జనం హాహాకారాలు విని, వెంటనే అప్రమత్తం అయ్యారు. భవనం సమీపంలోనే ఉన్న వాటర్ ట్యాంకుపైకి దూకారు. పక్కటెముకలు విరిగి, తీవ్రంగా గాయపడిన నళినాక్షన్ ట్యాంకుపైన చిక్కుకుపోయారు. కదల్లేని స్థితిలో ఆయన్ను ఉదయం 11 గంటల సమయంలో కొందరు గుర్తించి కిందికి దించి, ఆస్పత్రికి తరలించారని అతడి మామ బాలకృష్ణన్ చెప్పారు.కుమార్తెకు బహుమతిగా ఫోన్ ఇవ్వాలని..12వ తరగతి బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన తన కూతురికి ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకున్నారు లుకాస్. ఇంటికెళ్లాక కుమార్తెను స్వయంగా బెంగళూరు తీసుకెళ్లి నర్సింగ్ స్కూల్లో చేర్పిద్దామనుకున్నారు. అయితే, ఆ కల నెరవేరలేదు. కువైట్ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన వారిలో కేరళలోని కొల్లంకు చెందిన లుకాస్ కూడా ఉన్నారు. బుధవారం వేకువజామున ప్రమాదం జరిగిన సమయంలో లూకాస్ తమ సొంతూళ్లోని చర్చి ఫాదర్‌తో ఫోన్లో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా ఫోన్ డిస్ కనెక్టయ్యింది. తర్వాత చర్చి ఫాదర్ ఫోన్ చేసినా లూకాస్ లిఫ్ట్ చేయ్యలేదు. 18 ఏళ్లుగా కువైట్‌లో ఉంటున్న లూకాస్‌కు వృద్ధులైన తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. -
వలస పోయిన మందహాసం
కువైట్ దక్షిణ ప్రాంతంలోని మంగఫ్ నగరంలో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 49 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా గాయాల పాలవడం విషాదం. మృతుల్లో 43 మంది స్వదేశంలోని కుటుంబాలను పోషించడం కోసం కడుపు కట్టుకొని వలస వెళ్ళిన మన భారతీయులే కావడం మరింత విషాదం. వలస కార్మికులు ఎక్కువగా నివసించే ఆ ప్రాంతంలో ఆరంతస్థుల అల్–మంగఫ్ అపార్ట్మెంట్ల భవనంలో ఒక్కసారిగా రేగిన మంటలు ఇంతటి ఘోర ప్రమాదానికి దారి తీశాయి. కేరళ, తమిళనాడు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన దాదాపు 200 మంది కార్మికులు నివసిస్తున్న ఆ భవనం మన కేరళకు చెందిన వ్యక్తిది కాగా, మృతుల్లో ఎక్కువ (24) మంది కేరళ వారే! చీకటి వేళ సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో అత్యధికులు ఆ మంటలు, పొగలో చిక్కుకొని ఊపిరి ఆడక చనిపోయారు. ఓ వంట గదిలో మంటలు మొదలయ్యాయనీ, అవి భవనమంతటికీ వ్యాపించాయనీ స్థానిక మీడియా కథనం. ఈ ఘటనపై కూలంకషంగా దర్యాప్తు జరిపి, ఎవరు బాధ్యులనేది నిర్ణయిస్తామని కువైట్ చెబుతోంది. కారణాలు ఏమైనా బాధిత కుటుంబాల కన్నీళ్ళు ఆగేవి కావు. కష్టపడి నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించి, ఊళ్ళోని కుటుంబాలను బాగా చూసుకోవాలని బయలుదేరిన పలువురి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. కువైట్‌లో అగ్ని ప్రమాదాల చరిత్ర గమనిస్తే, 2009లో రెండో పెళ్ళి చేసుకుంటున్న తన భర్తపై ప్రతీకారంతో ఓ కువైట్ మహిళ వివాహ విందులో గుడారానికి నిప్పు పెట్టినప్పుడు 57 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆ దేశంలో ఇదే అతి పెద్ద ఘోరకలి. 2022 మార్చిలోనూ కువైట్‌లో పేరున్న ముబారకియా మార్కెట్ వాణిజ్యప్రాంతంలో ఇప్పటిలానే అగ్నిప్రమాదం సంభవించింది. మళ్ళీ ఇప్పుడీ తాజా ప్రమాదం. జాగ్రత్తలు తీసుకుంటామంటూ అధికారులు చెబుతున్నా అవేవీ వాస్తవ రూపం ధరించడం లేదు. ఈ ఘటనల వెనుక స్థానికంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, దురాశ లాంటివెన్నో ఉన్నాయనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఒక్క కువైట్‌లోనే కాదు, మధ్యప్రాచ్యంలోని అనేక ప్రాంతాల్లోనూ వలస కార్మికులు అవస్థలు, వారి అమానవీయ జీవన పరిస్థితులు అనేకం. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వల్లో ఆరో స్థానంలో ఉన్న కువైట్ మొత్తం 42 లక్షల పైగా జనాభాలో స్థానికుల కన్నా పని చేయడానికి వలస వచ్చినవారే ఎక్కువ. ఆ దేశంలో మన ప్రవాసీయుల సంఖ్య పది లక్షల పైనే! ఇంకా చెప్పాలంటే, కువైట్ మొత్తం జనాభాలో 21 శాతం మనవాళ్ళే! అక్కడి శ్రామిక వర్గంలో 30 శాతం మంది మనమే. 1990 – 91లో గల్ఫ్ యుద్ధ ప్రభావంతో లక్షలాది భారతీయులు కువైట్ నుంచి వెనక్కి వచ్చేసినా, అనంతరం భారీగా తరలివెళ్ళారు. ఒకప్పుడు అధికంగా ఉన్న పాలస్తీనియుల్ని మనం మించిపోయాం. వడ్రంగులు, తాపీ మేస్త్రీలు, పనివాళ్ళు, డ్రైవర్ల దగ్గర నుంచి ఫుడ్, కొరియర్ బాయ్స్ దాకా కువైట్‌లో అధికశాతం భారతీయులే. ఇంజనీర్లు, డాక్టర్ల లాంటి వృత్తి నిపుణులున్నా ఎక్కువ మంది అన్–స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులే. ఇలాంటి కార్మికులకు అక్కడ డిమాండ్ ఎక్కువ. అందుకు తగ్గట్టే మన దేశంతో పోలిస్తే, అక్కడ ఆదాయమూ అధికమే. కువైట్, యూఏఈ, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ అనే అరడజను గల్ఫ్ దేశాలకు మన వలసలకదే కారణం. తాజా ఘటనలో చనిపోయిందీ ఇలాంటి వలసజీవులే! అందరూ 20 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసు వారే! కేంద్ర మంత్రి, కేరళ ఆరోగ్య మంత్రి సహా పలువురు హుటాహుటిన కువైట్‌కు పయనమయ్యారు. బాధిత కుటుంబాలకు కేంద్రం, కేరళ ప్రభుత్వాలు తోచిన నష్టపరిహారం ప్రకటించాయి. కానీ, కేవలం ఇది సరిపోతుందా అన్నది బేతాళ ప్రశ్న. కూలి కోసం, కూటి కోసం విదేశాలకు వెళ్ళి, అక్కడ సంపాదించిన సొమ్మును స్వదేశంలోని ఇంటికి పంపి, పరోక్షంగా మన ఆర్థిక వ్యవస్థ పురోగతికి అండగా నిలుస్తున్న తోటి భారతీయుల పట్ల మన అక్కర అంత మాత్రమేనా? గల్ఫ్ సహా వివిధ ప్రాంతాలకు వెళ్ళే వలస కార్మికులు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ, ఇవాళ్టికీ వీరి వెతల గురించి అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు పట్టించుకొనేది తక్కువే. వెళ్ళినవారు అనుకోకుండా ఏ చిక్కుల్లో పడినా, ఆఖరుకు ప్రాణాలే కోల్పోయినా ప్రవాస తెలుగు, తమిళ, మలయాళీ సంఘాల లాంటి ప్రైవేట్ సంస్థలే చొరవ తీసుకొని సాయపడుతున్నాయి. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్క కువైట్‌లోనే 2014 నుంచి 2018 మధ్య 2932 మంది భారతీయులు మరణించారు. 2023లో 708 మంది చనిపోయారు. అనూహ్య ప్రమాదాలప్పుడు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే తప్ప, అసలీ వలస కార్మికులు, ప్రవాస భారతీయుల కష్టనష్టాలను నిరంతరం గమనించేందుకు మనకంటూ ఇప్పటికీ పటిష్ఠమైన వ్యవస్థ, ప్రత్యేక మంత్రిత్వ శాఖ లాంటివి లేవు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నిబంధనల మేరకు గల్ఫ్ వెళ్ళే భారత కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలనే భరోసా, కువైట్ వలస కార్మికులకు రూ. 10 లక్షల ప్రవాసీ భారతీయ బీమా పథకం ఉన్నా, విదేశాంగ శాఖలో నమోదు చేసుకొని, అన్ని పత్రాలూ ఉన్నవారికే అవి వర్తిస్తాయి. కానీ, అవేవీ పాటించకుండా పొట్టకూటి కోసం దళారుల్ని ఆశ్రయించి వెళ్ళే బడుగు జీవులే మన దగ్గర ఎక్కువ. పశ్చిమాసియాలోని మన వలస బిడ్డల సంపూర్ణ రక్షణకై ఇప్పటికైనా మన ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. సరైన నివాస వసతి సహా కనీస సౌకర్యాలతో జీవించే ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వాలతో కలసి కృషి చేయాలి. ఆర్థిక వ్యవస్థను ప్రపంచ పటంలో ఉన్నతంగా నిలుపుతున్న ఈ కనిపించని శ్రామిక శక్తి పట్ల అది కనీస కర్తవ్యం. జీవితంలో వారు, దేశంగా మనమూ గెలవడం సరే... ముందు హుందాగా బతకడం ముఖ్యం. -
కువైట్‌లో మన బతుకు చిత్రం (ఛిధ్రం)
-
కువైట్ అగ్ని ప్రమాదంపై కమల్, మమ్ముట్టి దిగ్భ్రాంతి
కువైట్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందడం పట్ల హీరోలు కమల్ హాసన్, మమ్ముట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 42 మంది భారతీయులు సహా మొత్తం 50 మంది మృత్యువాత పడ్డారు. బాధితుల్లో ఎక్కువమంది కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. వీరంతా ఉపాధి కోసం కువైట్ వెళ్లి అగ్నికి ఆహుతి అయ్యారు. குவைத் நாட்டின் மங்கஃப் நகரில் உள்ள அடுக்குமாடிக் குடியிருப்பில் நேரிட்ட தீ விபத்தில் இந்தியர்கள் உள்பட 50-க்கும் மேற்பட்டோர் உயிரிழந்த செய்தி மிகுந்த அதிர்ச்சியையும் வேதனையையும் அளிக்கிறது. உயிரிழந்தோர் குடும்பத்தினருக்கு ஆழ்ந்த இரங்கலையும், ஆறுதலையும் தெரிவித்துக் கொள்கிறேன்.…— Kamal Haasan (@ikamalhaasan) June 13, 2024 ఈ విషాద ఘటన పట్ల కమల్ స్పందిస్తూ.. ‘కువైట్‌లోని మంగాఫ్‌లో అపార్ట్మెంట్ అగ్నిప్రమాదంలో భారతీయులు సహా 50 మందికి పైగా మరణించారనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ ఘోర ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధిత భారతీయులకు అవసరమైన సహాయం అందించడానికి, మరణించిన వారి మృతదేహాలను మాతృదేశానికి తీసుకురావడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరుతున్నాను’అని కమల్ ట్వీట్ చేశాడు.Heartfelt condolences to the families of those affected by the Kuwait fire accident. I pray that you gather courage and find solace in this difficult time.— Mammootty (@mammukka) June 12, 2024‘కువైట్ అగ్ని ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో మీకు ధైర్యం, ఓదార్పునివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను’అని మమ్ముట్టి ఎక్స్‌లో రాసుకొచ్చాడు. -
Kuwait: భారతీయ మృతులపై నో క్లారిటీ: విదేశాంగ శాఖ
దుబాయ్: కువైట్ ఘోర అగ్నిప్రమాదం మృతుల లెక్కపై స్పష్టత రావాల్సి ఉంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 49 మంది చనిపోతే, అందులో 41 మంది భారతీయులే ఉన్నారు. అయితే మృతుల సంఖ్యపై కచ్చితత్వం.. అందులో భారతీయులు ఎందరు?.. వాళ్ల పేర్లు, స్వస్థలం .. ఇతర వివరాలు ఏంటి? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ మేరకు అగ్ని ప్రమాద సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షించడానికి విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్దన్ సింగ్ కువైట్ బయల్దేరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు తాను అక్కడికి వెళ్తున్నానంటూ కువైట్‌కు బయలుదేరే ముందు కీర్తివర్ధన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.#WATCH | Kuwait fire incident | Delhi: Before leaving for Kuwait from Delhi Airport, MoS MEA Kirti Vardhan Singh says, "We had a meeting last evening with the PM... The situation will be cleared the moment we reach there... The situation is that the victims are mostly burn… pic.twitter.com/ijqW3QQADM— ANI (@ANI) June 13, 2024‘కువైట్ ప్రమాదంపై ప్రధాని మోదీతో బుధవారం సాయంత్రం సమావేశం అయ్యాం. అక్కడి చేరుకోగానే అక్కడ నెలకొన్న పరిస్థితులపై స్పష్టత వస్తుంది. ప్రమాదంలో చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. మృతదేహాలను గుర్తుపట్టడానికి డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఎయిర్‌ఫోర్స్ విమానం కూడా సిద్ధంగా ఉంది. మృతదేహాలను గుర్తించిన వెంటనే ఎయిర్ పోర్స్ విమానంలో మృతదేహాలను భారత్‌కు తరలిస్తాం. ఇప్పటివరకు అందినసమాచారం మేరకు 49 మంది మృతి చెందారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు’ అని అన్నారు.గల్ఫ్ దేశం కువైట్‌లో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుక్ను ఘటనలో ఏకంగా 49 మంది మరణించారు. వీరిలో ఏకంగా 40 నుంచి 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారని సమాచారం. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తొలుత వంటగది నుంచి మంటలు వ్యాపించినట్లు తెలియజేశారు. ఈ భవనంలో 200 మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు నివసిస్తున్నారు.వివిధ దేశాల నుంచి వలస వచ్చిన వీరంతా ఎన్బీటీసీ గ్రూప్ అనే నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. కార్మికుల వసతి కోసం ఈ సంస్థ సదరు భవనాన్ని అద్దెకు తీసుకుంది. మృతులు 20 నుంచి 50 ఏళ్ల లోపు వారేనని అరబ్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కార్మికులు నిద్రలో ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించారు.అగ్నిప్రమాదంలో చాలామంది భారతీయులు మరణించడంపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్ +965–65505246 ఏర్పాటు చేసింది. సహాయం, సమాచారం అవసరమైన వారు తమను సంప్రదించాలని సూచించింది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించింది.కువైట్ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం(10 లక్షలు) ఉంటారు. కువైట్‌లోని మొత్తం కార్మికుల్లో 30 శాతం మంది(దాదాపు 9 లక్షలు) భారతీయులే కావడం విశేషం. అగ్నిప్రమాదంలో మరణించినవారికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మాంగాఫ్ ప్రాంతంలోని ఘటనా స్థలాన్ని భారత రాయబారి ఆదర్శ్ స్వాయికా సందర్శించారు. గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయులను పరామర్శించారు. తగిన సాయం అందిస్తామని భరోసా కల్పిచారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో కువైట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బాధితుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా, మరికొందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. మాంగాఫ్ భవన యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ అల్–యూసుఫ్ అల్–సబా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు తగిన భద్రత కల్పించని భవన నిర్మాణ కంపెనీ యజమానికి సైతం అరెస్టు చేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కంపెనీ యాజమాన్యంతోపాటు భవన యజమాని దురాశ వల్ల అమాయకులు బలయ్యారని ఆయన విమర్శించారు. ఒకే భవనంలో పెద్ద సంఖ్యలో కార్మికులు నివసించడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అగ్నిప్రమాదానికి బాధ్యులుగా గుర్తించి పలువురు అధికారులను కువైట్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. -
Kuwait Building Fire: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం... 49 మంది దుర్మరణం
దుబాయ్: గల్ఫ్ దేశం కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 49 మంది మరణించారు. వీరిలో ఏకంగా 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారని సమాచారం. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తొలుత వంటగది నుంచి మంటలు వ్యాపించినట్లు తెలియజేశారు. ఈ భవనంలో 200 మందికిపైగా భవన నిర్మాణ కారి్మకులు నివసిస్తున్నారు. వివిధ దేశాల నుంచి వలస వచి్చన వీరంతా ఎన్బీటీసీ గ్రూప్ అనే నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. కారి్మకుల వసతి కోసం ఈ సంస్థ సదరు భవనాన్ని అద్దెకు తీసుకుంది. మృతులు 20 నుంచి 50 ఏళ్ల లోపు వారేనని అరబ్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కారి్మకులు నిద్రలో ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించారు.క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అగ్నిప్రమాదంలో చాలామంది భారతీయులు మరణించడంపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్ +965–65505246 ఏర్పాటు చేసింది. సహాయం, సమాచారం అవసరమైన వారు తమను సంప్రదించాలని సూచించింది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించింది. కువైట్ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం(10 లక్షలు) ఉంటారు. కువైట్‌లోని మొత్తం కారి్మకుల్లో 30 శాతం మంది(దాదాపు 9 లక్షలు) భారతీయులే కావడం విశేషం. అగ్నిప్రమాదంలో మరణించినవారికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాంగాఫ్ ప్రాంతంలోని ఘటనా స్థలాన్ని భారత రాయబారి ఆదర్శ్ స్వాయికా సందర్శించారు. గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయులను పరామర్శించారు. తగిన సాయం అందిస్తామని భరోసా కలి్పంచారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో కువైట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బాధితుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా, మరికొందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. యాజమాన్యం దురాశకు అమాయకులు బలి మాంగాఫ్ భవన యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ అల్–యూసుఫ్ అల్–సబా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు తగిన భద్రత కలి్పంచని భవన నిర్మాణ కంపెనీ యజమానికి సైతం అరెస్టు చేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కంపెనీ యాజమాన్యంతోపాటు భవన యజమాని దురాశ వల్ల అమాయకులు బలయ్యారని ఆయన విమర్శించారు. ఒకే భవనంలో పెద్ద సంఖ్యలో కారి్మకులు నివసించడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అగ్నిప్రమాదానికి బాధ్యులుగా గుర్తించి పలువురు అధికారులను కువైట్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిహుటాహుటిన కువైట్‌కు మంత్రి రాజవర్ధన్ సింగ్కువైట్ అగ్నిప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయినవారికి సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నట్లు చెప్పారు. కువైట్ భారత రాయబార కార్యాలయం సహాయక చర్యల్లో నిమగ్నమైందని ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. ఈ ఉదంతంపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని ఆదేశాల మేరకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్దన్ సింగ్ కువైట్‌కు బయలుదేరారు. సహాయ చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారు. మృతుల్లో మలయాళీలు ఎక్కువగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అప్రమత్తమయ్యారు. కేంద్రం వెంటనే తగిన సాయం అందించాలని, బాధితులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు లేఖ రాశారు. -
Kuwait Fire: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో భారతీయులు
కువైట్ సిటీ: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం (జూన్12) తెల్లవారుజామున 3 గంటలకు సదరన్ అహ్మదిలోని మంగాఫ్‌లో ఉన్న ఆరు ఫ్లోర్ల అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్లోని ఒక గదిలో ఉన్న కిచెన్ నుంచి ముందుగా మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మంటల్లో మొత్తం 53 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 40 మంది దాకా భారతీయులే. తీవ్రంగా గాయపడిన మరో 40కి పైగా మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగినపుడు అపార్ట్మెంట్లో 160 మంది దాకా ఉన్నట్లు సమాచారం. వీరంతా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న నిర్మాణ రంగ కార్మికులని సమాచారం. అగ్ని ప్రమాద ఘటనపై కువైట్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ విచారం వ్యక్తం చేశారు. -
సునీల్ ఛెత్రి వీడ్కోలు
కోల్‌కతా: రెండు దశాబ్దాలుగా భారత ఫుట్‌బాల్ ముఖచిత్రంగా ఉన్న సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం కువైట్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌ను సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకుంది.నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. నాలుగో నిమిషంలో కువైట్ ప్లేయర్ ఈద్ అల్ రషీది కొట్టిన షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నిలువరించాడు. అనంతరం 11వ నిమిషంలో అన్వర్ అలీ కొట్టిన హెడర్ షాట్ లక్ష్యాన్ని చేరలేకపోయింది. 48వ నిమిషంలో భారత ప్లేయర్ రహీమ్ అలీ ‘డి’ ఏరియాలోకి వెళ్లినా అతను కొట్టిన షాట్లో బలం లేకపోవడంతో బంతి నేరుగా కువైట్ గోల్‌కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు జట్లకు గోల్ చేసేందుకు ఒకట్రెండు అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాయి. భారత్ తన చివరి మ్యాచ్‌ను జూన్ 11న ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో ఆడనుంది. 2005లో జాతీయ సీనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన సునీల్ ఛెత్రి ఓవరాల్‌గా భారత్ తరఫున 151 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 94 గోల్స్ సాధించాడు. ఇందులో నాలుగు ‘హ్యాట్రిక్’లున్నాయి. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాలర్స్ జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 206 మ్యాచ్‌ల్లో 128 గోల్స్), అలీ దాయ్ (ఇరాన్; 149 మ్యాచ్‌ల్లో 109 గోల్స్); లయనెల్ మెస్సీ (అర్జెంటీనా; 180 మ్యాచ్‌ల్లో 106 గోల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. రికార్డుస్థాయిలో ఏడుసార్లు జాతీయ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్ అవార్డు గెల్చుకున్న సునీల్ ఛెత్రికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ (2021లో)... అర్జున అవార్డు (2011లో), పద్మశ్రీ (2019లో) లభించాయి. -
భారత్ తరఫున చివరిసారి బరిలోకి సునీల్ ఛెత్రి... నేడు కువైట్‌తో భారత్ పోరు
ప్రపంచకప్ 2026 ఫుట్‌బాల్ టోర్నీ రెండో రౌండ్ ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా నేడు కువైట్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మూడో రౌండ్‌కు అర్హత పొందే అవకాశాలు మెరుగవుతాయి. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి జరగనున్న ఈ మ్యాచ్ భారత దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్లో చివరి మ్యాచ్ కానుంది. 2005లో తొలిసారి భారత సీనియర్ జట్టుకు ఆడిన 39 ఏళ్ల ఛెత్రి ఇప్పటి వరకు 150 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 94 గోల్స్ సాధించాడు. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాలర్స్ జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 206 మ్యాచ్‌ల్లో 128 గోల్స్), అలీ దాయ్ (ఇరాన్; 149 మ్యాచ్‌ల్లో 109 గోల్స్); లయనెల్ మెస్సీ (అర్జెంటీనా; 180 మ్యాచ్‌ల్లో 106 గోల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఆసియా క్వాలిఫయర్స్ గ్రూప్ ‘ఎ’లో ప్రస్తుతం ఖతర్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్, అఫ్గానిస్తాన్ జట్లు నాలుగు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. -
టీసీఎస్‌కు కువైట్ బ్యాంక్ డీల్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రముఖ కువైట్ బ్యాంకు డీల్‌ను దక్కించుకుంది. కువైట్‌లోని ప్రముఖ వాణిజ్య బ్యాంకు అయిన బుర్గాన్ బ్యాంక్ యొక్క కోర్ బ్యాంకింగ్ టెక్నాలజీని ఆధునీకరించడానికి డీల్ కుదుర్చుకున్నట్లు టీసీఎస్ ప్రకటించింది.ఈ డీల్‌లో భాగంగా బుర్గాన్ బ్యాంక్ బహుళ స్వతంత్ర లెగసీ అప్లికేషన్లను సమకాలీన సార్వత్రిక బ్యాంకింగ్ సొల్యూషన్‌గా ఏకీకృతం చేయడంలో టీసీఎస్ సహాయం చేస్తుంది. 160కి పైగా శాఖలు, 360 ఏటీఎంల ప్రాంతీయ నెట్‌వర్క్‌తో కువైట్‌లోని అతి తక్కువ కాలంలో ఏర్పాటైన వాణిజ్య బ్యాంకులలో బుర్గాన్ బ్యాంక్ ఒకటి. అధిక లావాదేవీల వాల్యూమ్లను నిర్వహించడానికి, ఆటోమేషన్‌ను మెరుగుపరచడానికి, సిబ్బంది ఉత్పాదకతను మెరుగుపరచడానికి టీసీఎస్ అందించే పరిష్కారాన్ని బుర్గాన్ బ్యాంక్ అమలు చేయనుంది.బుర్గాన్ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోనీ డాహెర్ మాట్లాడుతూ కస్లమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తమ కోర్ సిస్టమ్‌ల ఆధునికీకరణపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. బుర్గాన్ బ్యాంక్ వంటి ప్రగతిశీల సంస్థతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని టీసీఎస్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ గ్లోబల్ హెడ్ వెంకటేశ్వరన్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. -
‘ఆ రోజు నేను ఏడుస్తూనే ఉంటా’
‘‘కఠిన శ్రమకోర్చే.. ఓ మంచి ఆటగాడిగా అందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలని మాత్రమే కోరుకుంటా. చూడటానికి చక్కగా కనిపించే హార్డ్ వర్కర్ ఉండేవాడని నన్ను గుర్తుంచుకుంటే చాలు’’ అని భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి అన్నాడు. అదే తాను ఇక్కడ విడిచి వెళ్తున్న జ్ఞాపకంగా మిగిలిపోవాలని పేర్కొన్నాడు.కాగా భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన విషయం తెలిసిందే. జూన్ 6న తన చివరి మ్యాచ్ ఆడబోతున్నానని 39 ఏళ్ల ఛెత్రి గురువారం ప్రకటించాడు.ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్‌లలో కొనసాగుతావచ్చే నెల 6న ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా కువైట్‌తో జరిగే మ్యాచే తన కెరీర్లో చివరిదని ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.అయితే ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్‌లలో కొనసాగుతానని ఛెత్రి స్పష్టం చేశాడు. 2005లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ ఫుట్‌బాలర్ దాదాపు రెండు దశాబ్దాల పాటు (19 ఏళ్లు) భారత జట్టుకు సేవలందించాడు. ఢిల్లీకి చెందిన ఆర్మీ అధికారి కేబీ ఛెత్రి, సుశీల దంపతులకు 1984, ఆగస్టు 3న సికింద్రాబాద్ (తెలంగాణ)లో జన్మించిన ఛెత్రి భారత ఫుట్‌బాల్‌లో అసాధారణ ఫార్వర్డ్ ఆటగాడిగా ఎదిగాడు. తదనంతరం నాయకత్వ పటిమతో విజయవంతమైన సారథి అయ్యాడు. భారత ఫుట్‌బాల్ చరిత్రలో చురుకైన దిగ్గజంగా వెలుగొందుతున్నాడు. ఆరోజు ఏడుస్తూనే ఉంటాఇక తన రిటైర్మెంట్ ప్రకటన నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సునిల్ ఛెత్రి.. ‘‘జూన్ 6న నేను రిటైర్ అవుతాను.. జూన్ 7 మొత్తం ఏడుస్తూనే ఉంటాను. జూన్ 8న కాస్త రిలాక్స్ అవుతాను. జూన్ 8 నుంచి బ్రేక్ తీసుకుని నా కుటుంబానికి సమయం కేటాయిస్తాను’’ అని తెలిపాడు.సునిల్ ఛెత్రి సాధించిన ఘనతలు 👉150 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన సునీల్ 94 గోల్స్ కొట్టాడు. భారత్ తరఫున టాప్ స్కోరర్ కాగా... ఓవరాల్‌గా ఫుట్‌బాల్ చరిత్రలో జాతీయ జట్టు తరఫున ఎక్కువ గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో టాప్–3లో ఉన్నాడు. క్రిస్టియానో రోనాల్డో (128 గోల్స్; పోర్చుగల్), మెస్సీ (106 గోల్స్; అర్జెంటీనా) తర్వాతి స్థానం మన ఛెత్రిదే! 👉మూడు సార్లు భారత జట్టు నెహ్రూ కప్ అంతర్జాతీయ టోర్నీ (2007, 2009, 2012) టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 👉దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత్ మూడు (2011, 2015, 2021) టైటిల్ విజయాలకు కృషి చేశాడు. 👉2008లో ఏఎఫ్సీ చాలెంజ్ కప్‌ను గెలిపించిన ఛెత్రి, ఏడుసార్లు ‘ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. భారత్‌లోని ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌లైన ఈస్ట్ బెంగాల్, డెంపో, ముంబై సిటీ ఎఫ్‌సీ, బెంగళూరు ఎఫ్‌సీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయా జట్లకు లీగ్ ట్రోఫీలు అందించాడు.‘అతనో ఫుట్‌బాల్ శిఖరం’ భారత బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లి, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తదితరులంతా ఛెత్రి ఘనతల్ని కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా వారంతా అతనొక రియల్ లెజెండ్‌గా కితాబిచ్చారు. బీసీసీఐ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సైతం ఛెత్రి సేవలకు సెల్యూట్ చేశాయి.నాకు ముందే తెలుసుఛెత్రి రిటైర్మెంట్ గురించి తనకు ముందే తెలుసన్నాడు క్రికెటర్ విరాట్ కోహ్లి. అతడిని చూసి తాను గర్వపడుతున్నానని.. ఏదేమైనా బాగా ఆలోచించిన తర్వాత సునిల్ ఛెత్రి ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. కాగా కోహ్లి, సునిల్ ఛెత్రి మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.చదవండి: IPLలో రూ. 20 లక్షలు.. అక్కడ అత్యధిక ధర! నితీశ్ రెడ్డి రియాక్షన్ ఇదే -
చేపల పడవలో దేశాలే దాటారు
ముంబై: పరాయి దేశంలో పడరాని పాట్లు పడి, యజమాని పెట్టే హింసలు భరించలేక స్వదేశం వెళ్లే సాహసం చేశారు ముగ్గురు భారతీయులు. అనుకున్నదే తడవుగా యజమాని పడవనే తమ ప్రణాళికకు ప్రధాన ఆయుధంగా వాడుకున్నారు. ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా కువైట్ నుంచి బయల్దేరి సముద్ర మార్గం గుండా నేరుగా ముంబై తీర ప్రాంతానికి చేరుకున్నారు. పుట్టినగడ్డపై కాలుమోపేలోపే పోలీసులు అరెస్ట్‌చేశారు. ముగ్గురు తమిళనాడు వ్యక్తుల సాహసోపేత అక్రమ అంతర్జాతీయ సముద్ర ప్రయాణ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో అరేబియా సముద్ర జలాల మీదుగా ముంబైలో అడుగుపెట్టిన పాక్ ముష్కరులు మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. దీంతో సముద్రజలాల మీద గస్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంగళవారం ఉదయం ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది. సంబంధిత వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. జనవరి 28న ప్రయాణం షురూ తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల విజయ్ వినయ్ ఆంటోనీ, 29 ఏళ్ల జె.సహాయట్ట అనీశ్, రామనాథపురానికి చెందిన 31 ఏళ్ల నిట్సో డిటోలు రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లారు. వీరి వృత్తి చేపలుపట్టడం. కువైట్‌లోనూ అదే పనిచేసేవారు. కేరళలోని త్రివేండ్రమ్ నుంచి వీరు కువైట్‌కు వెళ్లారు. యజమాని నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భారత్‌కు రానీయకుండా వారి పాస్‌పోర్టులను దాచేశాడు. ఎలాగైనా కువైట్ నుంచి బయటపడాలని నిర్ణయించుకుని అందుకు ఓనర్ చేపల బోటును ఎంచుకున్నారు. జనవరి 28వ తేదీన ప్రయాణం మొదలెట్టి సౌదీ అరేబియా, ఖతర్, దుబాయ్, మస్కట్, ఒమన్, పాకిస్తాన్ మీదుగా భారత జలాల్లోకి ప్రవేశించారు. రంగంలోకి నేవీ, పోలీసులు మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ముంబైలోని యెల్లో గేట్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేపట్టారు. ససూన్ డాక్ ప్రాంతంలో వీరి రాకను గమనించారు. ఈ చేపల పడవ నిర్మాణం భారతీయ పడవలతో పోలిస్తే విభిన్నంగా ఉండటంతో అనుమానమొచ్చి అడ్డుకున్నారు. అందులోని ముగ్గురికీ మరాఠా, హిందీ అస్సలు రాకపోవడం, పొడిపొడిగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతుండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే నేవీ అధికారులతోపాటు పోలీసులు మూడు పడవల్లో హుటాహుటిన చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది సైతం రప్పించి తనిఖీలు చేయించారు. పేలుడుపదార్థాలు ఏవీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారంటూ పాస్‌పోర్టు సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదుచేసి అరెస్ట్‌చేశారు. ముంబైలోని కోర్టులో హాజరుపరచగా ఫిబ్రవరి 10వ తేదీదాకా పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. విదేశీ గడ్డపై వీళ్లు ఏదైనా నేరానికి పాల్పడ్డారో తెల్సుకోండని పోలీసులకు సూచించారు. పడవలో జీపీఎస్ స్వాధీనం చేసుకున్న పడవను బాంబు స్వా్కడ్ క్షుణ్ణంగా తనిఖీచేసింది. ఒక జీపీఎస్‌ను గుర్తించారు. సువిశాల సముద్రంలో దారి తప్పకుండా ఉండేందుకు వారు జీపీఎస్‌ను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీళ్లను కువైట్‌కు తీసుకెళ్లిన ఏజెంట్‌ను కెప్టెన్ మదన్‌గా పోలీసులు గుర్తించారు. ‘‘అబ్దుల్లా షర్హీద్ అనే మాస్టర్ దగ్గర పనిచేసేవాళ్లం. జీతాలు సరిగా ఇచ్చేవాడు కాదు. అదేంటని అడిగితే చితకబాదేవాడు. ఇదే విషయమై కువైట్‌లోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాం. ఇండియన్ ఎంబసీలోనూ మా గోడు వెళ్లబోసుకున్నాం. ఫలితం శూన్యం. అందుకే ఇలా పారిపోయి వచ్చాం’’అని ఈ ముగ్గురు పోలీసులకు చెప్పారు. వీళ్ల కుటుంబీలకు ఇప్పటికే వీరి రాక సమాచారం చేరవేశామని పోలీసులు వెల్లడించారు.