కువైట్ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మీడియా, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి గారు, ఏపీఎన్‌ఆర్టీసీ అధ్యక్షులు మేడపాటి వెంకట్ గారు, ఏపీఎస్‌ఎస్‌డీసీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బీహెచ్ పాల్గొన్నారు. కువైట్ నలుమూలాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
దాదాపు 400 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. సజ్జల భార్గవ రెడ్డి గారు మాట్లాడుతూ: జగనన్న మీద అభిమానమే మనల్ని అందరినీ ఒక చోటకు చేర్చింది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రతి క్షణం జగనన్న కష్టపడుతున్నారు. దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు మనం అందరం అండగా నిలవాలి. 175/175 టార్గెట్గా అందరం కలిసి పని చేద్దాం, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
మేడపాటి వెంకట్ గారు మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు పేదల పక్షపాతి. అనుక్షణం పేదల కోసం పాటు పడుతున్నారు.. రాష్ట్ర ప్రజలకే కాదు ప్రవాసాంధ్రులకు సైతం ఎలాంటి కష్టం వచ్చినా అన్ని విధాలా అండగా ఉన్నారు, ఎల్లప్పుడూ ఉంటారని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. చల్లా మధు సూధన్ రెడ్డి గారు మాట్లాడుతూ..ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు మన సీఎం వైఎస్ జగన్ గారు తీసుకు వచ్చారు. విద్య, వైద్య రంగానికి పెద్ద పీఠ వేయడమే కాకుండా బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్న గొప్ప నాయకుడికి మనం అందరం అండగా నిలిచి రాబోయే ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు.
(చదవండి: దుబాయ్‌లో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం)
Comments
Please login to add a commentAdd a comment