Thaman Music Festival In Kuwait: రెండున్నర సంవత్సరాల తరువాత 'కోవిడ్' అనంతరం మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యక్ష సంగీత కార్యక్రమం 'సుస్వర తమనీయం'. కువైట్లో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జూన్ 3 సాయంత్రం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు యస్.యస్. తమన్ బృందంతోపాటు సుమారు 1500 మందికిపైగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తమన్ బృందమైన గాయని గాయకులు శ్రీ కృష్ణ, సాకేత్, పృథ్వీచంద్ర, విమల రోషిని, శ్రీ సౌమ్య, శృతి రంజని, మనీష, హరిక నారాయణ్ తదితరులు తమ పాటలతో అలరించారు. దాదాపు యాభై పాటలతో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం దద్దరిల్లింది. సభ్యులందరు కేరింతలు,నృత్యాలు, ఆనందో త్సాహాలతో కన్నుల పండుగగా తమన్ 'సుస్వర తమనీయం' ఆద్యతం అలరించింది.
చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు
అనంతరం స్పాన్సర్స్.. తమన్ను, వారి బృందాన్ని, మిగతా సంస్థల అధ్యక్షులను, ఇండియన్ ఎంబసీ ముఖ్య అతిధి శ్రీ కమల్ సింగ్ రాథోడ్ను "తెలుగు కళా సమితి" కార్యవర్గం జ్ఞాపికలతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో "తెలుగు కళా సమితి" స్మారక చిహ్నమైన 'సావెనీర్' వార్షిక సంచికను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment