
రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ యాక్టర్‌గా కెమెరా ముందుకు వస్తున్నారు ఎస్. తమన్(Thaman). శంకర్ దర్శకత్వంలో సిద్ధార్థ్, భరత్, మణికందన్, నకుల్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బాయ్స్’. 2003లో విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత తమన్ యాక్టర్‌గా కొనసాగలేదు.
‘మళ్ళీ మళ్ళీ (2009)’ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి, ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరిగా కొనసాగుతున్నారు తమన్. ఇప్పుడు మళ్లీ లీడ్ యాక్టర్‌గా ఓ సినిమా చేయనున్నారు. అధర్య హీరోగా ఆకాశ్ భాస్కరన్ స్వీయ దర్శక నిర్మాణంలో ‘ఇదయమ్ మురళి’ అనే తమిళ మూవీ రానుంది. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో నట్టి, తమన్, ఎన్‌ఎమ్ నిహారిక, ప్రగ్యా, సుధాకర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నట్లు తెలిపారు మేకర్స్. ఇలా రెండు దశాబ్దాల తర్వాత తమన్ మళ్లీ ఓ సినిమాలో లీడ్ రోల్ చేస్తుండటం కన్ఫార్మ్ అయిపోయింది. 2003లో వచ్చిన ‘బాయ్స్’లో ఓ లీడ్ రోల్‌లో నటించిన తమన్ ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్స్‌లో మాత్రమే నటించారు. పూర్తి స్థాయి నటుడిగా తమన్ మళ్లీ నటిస్తున్నది ‘ఇదయమ్ మురళి’ చిత్రంలోనే.
Comments
Please login to add a commentAdd a comment