
బాలీవుడ్ టాప్ హీరోలలో సన్నీ డియోల్ ఒకరు అని తెలిసిందే.. ఆయనతో మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘జాట్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ బాలీవుడ్ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో ఆయన పాత్రను చూపుతూ ఒక గ్లింప్స్‌ను విడుదల చేశారు.
జాట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు భారీ బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ వేసవిలో ఏప్రిల్ 10న జాట్ సినిమా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీతో గోపీచంద్ మలినేని క్రేజ్ మరింత స్థాయికి పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. 2023లో వీరసింహారెడ్డి చిత్రం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జాట్' కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment