Thaman S
-
అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ
'డాకు మహారాజ్'(Daaku Maharaaj) భారీ విజయం సాధించడంతో బాలకృష్ణ (Balakrishna) ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే సుమారు రూ. 130 కోట్లు సాధించింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు. సినిమా సక్సెస్‌లో భాగంగా మూవీటీమ్ తాజాగా యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే, బాలయ్యకు సండేతో(Sunday) ఉన్న ఒక సెంటిమెంట్ గురించి పంచుకున్నారు.నిజ జీవితంలో ఒక సెంటిమెంట్ అనుసరిస్తానని బాలకృష్ణ ఇలా అన్నారు. ఆదివారం రోజు నేను నలుపు రంగు దుస్తులు అసలు ధరించను. ఆదివారం అంటే నాకు బ్లాక్ డేంజర్. ఒకవేళ అలా వేసుకుంటే నాకు చాలా ప్రమాదం. నాది మూలా నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో దానిని పాటిస్తున్నాను. ప్రత్యాది దేవతలు ఉంటారనేది నమ్ముతాను. అందుకే ఆదివారం నలుపు ధరించను. అయితే, ఓసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఆదివారం బ్లాక్ డ్రెస్ ధరించాల్సి వచ్చింది. అయితే, ఈ డ్రెస్ వద్దని నేను ముందే చెప్పాను. కానీ, దర్శకులు చెప్పారు కాబట్టి తప్పలేదు. ఏదో నష్టం జరగబోతుందని ముందే గ్రహించాను. అదేరోజు రాక రాక బాలసుబ్రమణ్యం కూడా షూటింగ్ సెట్స్‌లోకి వచ్చారు. ఆయన కళ్ల ముందే కిందపడిపోవడంతో నా నడుము విరిగింది. అయితే, ఆయన రావడం వల్లే ఇలా జరిగిందనుకొని ఆ తర్వాత బాలసుబ్రమణ్యం మళ్లీ షూటింగ్ ప్రాంతంలోకి రాలేదు. ఆయన కూడా చాలా కంగారుపడ్డారు.' అని ఆదివారంతో తనకు ఉన్న సెంటిమెంట్‌ను బాలయ్య పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానున్న నయనతార, సిద్ధార్థ్ సినిమా)యాంకర్ సుమతో మూవీ టీమ్ పాల్గొన్న ఇంటర్వ్యూ చాలా సరదాగా జరిగింది. బాలకృష్ణతో పాటు ఈ సినిమా డైరెక్టర్ బాబీ, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. తాను షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్డే తింటానని బాలయ్య వెల్లడించారు. ఇంటి పక్కనే షూటింగ్ జరుగుతున్నా కూడా అక్కడి ఆహారమే తింటానని ఆయన చెప్పారు.బాలకృష్ణ జాతకాలను ఎక్కువగా నమ్ముతారనే సంగతి చాలామందికి తెలిసిందే.. ఏదైనా ఒక శుభకార్యం అంటూ మొదలుపెడితే ముహూర్తాలను అనుసరిస్తూనే ప్లాన్ చేసుకుంటారు. సినిమా రిలీజ్ డేట్, ట్రైలర్ రిలీజ్ డేట్ విషయంలో కూడా బాలయ్య సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఆయన మెడలో రుద్రాక్షతో పాటు చేతికి జాతక ఉంగరాలు ధరిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామునే తన ఇంట్లో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాతే దిన చర్య ప్రారంభిస్తారు. -
ట్రోలర్స్‌పై తమన్ ఆవేదన.. చిరంజీవి కామెంట్స్
డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్ (Thaman) చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమాను ట్రోల్ చేస్తున్న వారిని చూస్తుంటే భయంతో పాటు సిగ్గుగా ఉందని ఆయన అన్నారు. ట్రోల్స్ చేసుకుంటూ మన సినిమాను మనమే చంపేస్తున్నామని తమన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా సోషల్ మీడియా వేదికగా తమన్ కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు.'డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అనిపించింది. (ఇదీ చదవండి: కలిసి మాట్లాడుకుందాం.. నేను ఒంటరిగానే వస్తా: మనోజ్)విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఉచితమే, ఒక్కోసారి ఆ మాటలు కొందరికి స్ఫూర్తిగా నిలిస్తే.. మరొకరిని నాశనం చేస్తాయి. అయితే, ఆ మాటల ఎంపిక మాత్రం మనపైనే ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది' అని చిరు అన్నారు. ట్రోలర్స్‌పై తమన్ వ్యాఖ్యలుసినిమాలపై ట్రోలింగ్ గురించి తమన్ ఇంకా ఏమన్నారంటే.. జీవితంలో విజయం చాలా గొప్పది. అది లేకపోతే మనుషుల్ని తక్కువ చేసి చూస్తారు. మేమంతా కూడా ఆ విజయం కోసం పోరాడుతుంటాం. జీవితం ముందుకు సాగడానికి విజయం దోహదపడుతుంది. ప్రస్తుతం ఒక నిర్మాత విజయాన్ని అందుకుంటే దాని గురించి బహిరంగంగా మాట్లాడటం కష్టంగా మారింది. నిర్మాతలు మనకు దేవుళ్లతో సమానం. కాబట్టి హీరోలతో పాటు ఫ్యాన్స్, చిత్ర పరిశ్రమలో ఉన్న అందరూ వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతోంది. అలాంటి వాటి వల్ల సినిమా చాలా నష్టపోతుంది. నేను బాలీవుడ్, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు వెళ్ళినప్పుడు అక్కడివారు ఏదైనా మంచి తెలుగు సినిమా చేయాలని ఉందని నాతో అంటూ ఉంటారు. కానీ, మనవాళ్లు తెలుగు సినిమాలను చులకనగా చూస్తున్నారు. ఇది ఎంతో దారుణమైన విషయం. మనమే మన సినిమాని చంపేస్తుంటే ఎలా..? ఒక సినిమా విజయం గురించి కూడా బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. మీకేవైనా ఇబ్బందులు ఉంటే.. వ్యక్తిగతంగా మీరు మీరు తిట్టుకోండి. కానీ, సినిమాను మాత్రం చంపొద్దు' అని అన్నారు.Dear @MusicThaman నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2025"ఏం బతుకు బతుకుతున్నామో అర్థంకావట్లేదు... మనమే మన సినిమాని చంపేస్తున్నాం..." - Thaman pic.twitter.com/wmNpyakIf1— Aryan (@chinchat09) January 18, 2025 -
హీరోయిన్గా బ్రాహ్మణికి ఆఫర్.. కానీ, నో చెప్పింది: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్ ప్రారంభం అయింది. కేవలం ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో నాలుగు వేల టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్‌లలో 350 షోలు ఫస్ట్ డే పడనున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలయ్య వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ లో చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్ , నిర్మాత నాగవంశీ అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై తన పెద్ద కూతురు బ్రాహ్మిణి గురించి ఆయన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.అన్‌స్టాపబుల్ సీజన్ 4లో బాలయ్యకు ఒక ప్రశ్న ఎదురైంది. 'మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు' అని తమన్ అడిగారు. అందుకు సమాధానంగా వారిద్దరినీ చాలా గారాబంగానే పెంచానంటూ ఆయన అన్నారు. ఈ క్రమంలో బ్రాహ్మిణికి మణిరత్నం నుంచి వచ్చిన సినిమా ఛాన్స్‌ను ఆయన గుర్తు చేసుకున్నారు. 'గతంలో ఒక సినిమా కోసం హీరోయిన్గా బ్రాహ్మణి నటిస్తారా అని మణిరత్నం గారు నన్ను అడిగారు. సరే అని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పాను. నా ముఖం అంటూ సమాధానమిచ్చి వెళ్లిపోయింది. అవునూ.. నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని మళ్లీ చెప్పాను. ఫైనల్‌గా తనకు అలాంటి ఆసక్తి లేదని చెప్పేసింది. అయితే, తేజస్విని మాత్రం ఇంట్లో అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటూ నటించేది. ఆ సమయంలో తనైనా నటిగా వస్తుందని ఆశించాను. ఇప్పుడు ఈ షో కోసం ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తుంది. ఇంట్లో నేను ఎక్కువగా భయపడేది మాత్రం బ్రాహ్మిణికే' అని బాలయ్య అన్నారు.దేవిశ్రీ ప్రసాద్ కంటే తమన్ సంగీతం అంటే చాలా ఇష్టమని అదే వేదికపై బాలకృష్ణ అన్నారు. దర్శకులలో బాబీ, బోయపాటి శ్రీను ఇద్దరూ ఇష్టమేనని ఆయన తెలిపారు. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు అమెరికాలో జరగనుంది. అక్కడే ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. -
ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?
'ఆర్ఆర్ఆర్' సినిమా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ (NTR) మళ్లీ కలిశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు, తమన్.. చరణ్(Ram Charan)-తారక్‌తో దిగిన ఫొటోలని పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ వీళ్లిద్దరూ ఎక్కడ? ఎందుకు కలిశారు?(ఇదీ చదవండి: సింగర్ రమణ గోగుల 'గుండు' వెనక ఇంత స్టోరీ ఉందా?)రీసెంట్గా అమెరికాలో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer) మూవీ ఈవెంట్ జరిగింది. దీనికి చరణ్, తమన్, బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు. రిట్నర్ వస్తున్న క్రమంలోనే దుబాయిలో దిగారు. అక్కడే ఎన్టీఆర్‌ని కలిశారు. మరి తారక్ హాలీ డే కోసం వెళ్తున్నాడా? వేరే షూటింగ్ ఏమైనా ఉందా? అనేది తెలియదు. కానీ ఎన్టీఆర్ లుక్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.తారక్.. ఈ రెండు ఫొటోల్లో చాలా సన్నగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతానికైతే 'వార్ 2' చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది. ఇది పీరియాడికల్ మూవీ అని ఈ మధ్యే ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పాడు. మరి తారక్ సన్నబడింది ఈ ప్రాజెక్ట్ కోసమేనా లేదా ఇంకేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన) -
డల్లాస్‌లో ఘనంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్ రిలీజ్.. తమన్ మ్యూజిక్‌పై ప్రశంసలు
బాలకృష్ణ నటిస్తున్న 'డాకు మహారాజ్' ప్రకటన వెలువడిన సమయం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందులో తమన్ అందించిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.బాలకృష్ణ నటించిన గత మూడు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించి, ఆ ఘన విజయాలలో కీలక పాత్ర పోషించిన తమన్ 'డాకు మహారాజ్' చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి 'ది రేజ్ ఆఫ్ డాకు' పేరుతో మొదటి గీతం విడుదలైంది. బాలకృష్ణ, తమన్ కలయిక అంటే, సంగీత ప్రియుల్లో ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, తమన్ ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు. 'డాకు మహారాజ్' పాత్ర తీరుని తెలియజేసేలా గీత రచయిత అనంత శ్రీరామ్ అర్థవంతమైన, శక్తివంతమైన సాహిత్యాన్ని అందించారు. "డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా" వంటి పంక్తులతో మరోసారి తన కలం బలం చూపించారు. ఇక గాయకులు భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి. రావు, కె. ప్రణతి తమ అద్భుతమైన గాత్రంతో పాటకు మరింత అందం తీసుకొచ్చారు.లిరికల్ వీడియోలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. విజువల్‌గా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో భారీతనం కనిపిస్తోంది. అలాగే ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, బలమైన భావోద్వేగాలతో సినిమా అద్భుతమైన అనుభూతిని పంచనుందని లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'డాకు మహారాజ్' చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. -
'పుష్ప 2' చూసి భయపడ్డాను: తమన్
అల్లు అర్జున్ 'పుష్ప 2' చివరి దశ పనులు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ సహా పలువురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. తాజాగా 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ 'పుష్ప 2' కోసం పనిచేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన తమన్.. తాజాగా మరో ఇంటర్వ్యూలో మూవీ గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి-రమ్య బెహరా)'పుష్ప 2 చూసి భయపడ్డాను. ఎందుకంటే అద్భుతంగా వచ్చింది. ఈ మూవీ తర్వాత అవార్డులన్నీ బన్నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాయి. పదిహేను రోజుల్లో సినిమా మొత్తం కంప్లీట్ చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైంలో ఫస్ట్ హాఫ్‌ను దాదాపుగా కంప్లీట్ చేసి ఇచ్చాను' అని తమన్ చెప్పాడు.మ్యూజికల్ స్కూల్ కట్టాలనేది తన కోరిక అని.. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఫ్రీగా మ్యూజిక్ నేర్పించాలని అనుకుంటున్నానని తమన్ చెప్పుకొచ్చాడు. మ్యూజిక్ ఉన్న చోట క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. నేను క్రికెట్ ఆడి వస్తే వెంటనే ఓ ట్యూన్ వస్తుంది. క్రికెట్ ఆడటంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. రెండు, మూడేళ్లలో వరల్డ్ క్లాస్ స్టూడియోని ఇక్కడే కడతాను. ప్రభుత్వం తరుపున ఏమైనా సాయం చేస్తారా? అని కూడా అడుగుతాను. స్థలం ఇవ్వమని మాత్రం అడగనని తమన్ తన ఆలోచనల్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: మోసపోయిన 'కంగువ' హీరోయిన్ దిశా పటానీ తండ్రి) -
పుష్ప రాజ్ కి తమన్ హెల్ప్ చేస్తున్నాడా
-
'గేమ్ చేంజర్' నుంచి రెండో సాంగ్ ప్రోమో విడుదల
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా రెండో పాట గురించి మేకర్స్ సమాచారం ఇచ్చారు. ఈ చిత్రంలో కియారా అద్వాని హీరోయిన్. సినిమా ప్రకటన వచ్చిన సమయం నుంచి 'గేమ్ ఛేంజర్' అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 'గేమ్ చేంజర్' నుంచి విడుదలైన 'జరగండి జరగండి' అనే పాట భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.గేమ్ చేంజర్ నుంచి తాజాగా రెండో సాంగ్ ప్రోమో విడుదలైంది. పూర్తి పాటను సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'రా మచ్చా మచ్చా..' అనే లిరిక్స్‌తో మొదలైన ఈ సాంగ్‌లో సుమారు వెయ్యి మందికి పైగా డ్యాన్సర్స్ పాల్గొన్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు కూడా ఈ సాంగ్‌లో స్టెప్పులేశారట. ఇదే పాట గురించి సంగీత దర్శకుడు తమన్, డైరెక్టర్ శంకర్ చాలా ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు. క్రిస్మస్ సందర్భంగా 'గేమ్ ఛేంజర్' సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. -
ఆ దర్శకునికి ఫ్రీగా డేట్స్ ఇచ్చిన 200 Cr స్టార్ ప్రభాస్.. కారణం..!
-
15 ఏళ్ల క్రితం సూపర్ హిట్ అయిన రవితేజ సినిమా రీరిలీజ్
మాస్మహారాజా రవితేజ కెరియర్లో కిక్ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 15 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రవితేజ, బ్రహ్మానందం ట్రాక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. హల్వారాజ్ పాత్రలో బ్రహ్మానందం పండించిన కామెడీ సూపర్ హిట్ అని చెప్పవచ్చు. ఆ సినిమాలోని కామెడీ సీన్స్ ఇప్పుడు ఎక్కువగా మీమ్స్ రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కిక్ సినిమా రీరిలీజ్ కానుంది. సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 1న రీరిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందులో రవితేజకు జోడీగా ఇలియానా నటించింది. కోలీవుడ్ నటుడు శామ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అదిరిపోతుంది. కిక్ సినిమాతో థమన్, సురేందర్‌రెడ్డి,రవితేజలకు విపరీతమైన స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా కిక్ 2 కూడా వచ్చింది. కానీ అది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పటికే ఈగల్తో థియేటర్లో సందడి చేస్తున్న రవితేజ.. మార్చి 1న కిక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రీరిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరిలో రవితేజ అభిమానుల కోసం ఒక ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు. -
గుంటూరు కారం తమన్ సాంగ్స్ పై మహేష్ బాబు సీరియస్!
-
మహేష్ ఫాన్స్ ను నిరాశపరిచిన తమన్
-
Happy Birthday S Thaman: హ్యాపీ బర్త్‌డే సంగీత దర్శకుడు ఎస్ తమన్ (ఫోటోలు)
-
స్పీడ్ పెంచిన దేవీశ్రీ..దేనికో తెలుసా.!
-
గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?
తమన్ పేరు చెప్పగానే దద్దరిల్లిపోయే పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తాయి. పలు సినిమాల్ని తన సంగీతంతో ఓ రేంజులో ఎలివేట్ చేశాడు. వాటిలో 'అఖండ' ఒకటి. బాలకృష్ణ హీరో, బోయపాటి డైరెక్టర్ అయినా సరే ఈ మూవీ విషయంలో ఎక్కువ క్రెడిట్ తమన్దేనని ప్రేక్షకుల అభిప్రాయం. కానీ మొన్నీమధ్య ఓ ఇంటర్వ్యూలో తమన్ కష్టం ఏం లేదన్నట్లు మాట్లాడాడు. ఇప్పుడు ఆ కామెంట్స్‌పై స్వయంగా తమన్ పరోక్షంగా కౌంటర్ కామెంట్స్ చేశాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా 'స్కంద' మూవీ తీశారు. గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఫైట్స్ తప్ప మరే విషయంలోనూ మెప్పించలేకపోయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'అఖండ'కి తమన్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది కదా అని జర్నలిస్ట్ అడగ్గా.. 'ఆ సినిమాను ఆర్ఆర్ (రీరికార్టింగ్) లేకుండా చూసినా మీరు గర్వంగా ఫీలవుతారు. దానికి అంత దమ్ము ఉంటుంది. అదే టైంలో ఆ పర్టిక్యులర్ కల్ట్ మీద తమన్ అద్భుతంగా చేయగలిగాడు' అని బోయపాటి చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఓటీటీలో 'ప్రేమ విమానం' సినిమాకు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్) ఇలా బోయపాటి కామెంట్స్ చేసిన ఒకటి రెండు రోజుల్లోనే తమన్.. 'ఐ డోంట్ కేర్' అని ట్వీట్ వేశాడు. ఇది బోయపాటిని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ అని అందరూ అనుకున్నారు. తాజాగా 'భగవంత్ కేసరి' సక్సెస్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన తమన్.. బాలకృష్ణ ముందే బోయపాటి పరువు తీసేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 'మంచి సీన్‌ని మనం చెడగొట్టం. మనం ఇంకా దాన్ని ఎలివేట్ చేయాలనే చూస్తాం. అక్కడ సీన్లో ఎమోషన్ లేకపోతే నేను ఏం చేసినా వర్కౌట్ కాదు. ఎవడి వల్ల అవ్వదు. చచ్చిన శవం తీసుకొచ్చి బతికించమంటే ఎలా? అంతే లాజిక్ ఇక్కడ. బ్యాక్ గ్రౌండ్ స్కోరు అంటారు గానీ అక్కడ మేటర్ లేకపోతే నేనేం చేయను. అక్కడ వాళ్లు(దర్శకులు) ఇవ్వాలి' అని తమన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతా చూస్తుంటే ఈ గొడవ ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) #Thaman Comments 🤷pic.twitter.com/XDDsBF6Zk3 — CineCorn.Com By YoungMantra (@cinecorndotcom) October 25, 2023 -
బెస్ట్ టీమ్‌తో కొత్త చిత్రాన్ని ప్రకటించిన 'సిద్ధు జొన్నలగడ్డ'
'గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ ‘డి.జె టిల్లు’ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో డీజే టిల్లు సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇలా ఉండగా తాజాగా ఆయన నుంచి మరొక కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకు తెలుసు కదా అనే సరికొత్త టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. సిద్దు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నాతో పాటు కెజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తుండగా.. యువరాజ్ కెమెరామెన్ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీమ్ చాలా బలంగా కనిపిస్తోంది. సినిమా టైటిల్ వీడియో చాలా రిచ్‌గా చిత్రీకరించారు. ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో తమన్ అందించిన మ్యూజిక్ మనసును తాకేలా కూల్‌గా ఉంది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నిషియన్ శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనుండటం విశేషం. (ఇదీ చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి) టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ ఫ్యామిలీ నుంచి బాద్షా చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇండస్ట్రీకి పరిచమైన నీరజ కోన ఈ చిత్రానికి మొదటిసారి దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా గుర్తింపు పొందిన నీరజ దర్శకురాలిగా తొలిసారి మెగాఫోన్ పట్టారు. తెలుసు కదా సినిమా టీమ్ చూస్తే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. -
'గుంటూరు కారం' నుంచి తమన్ ఔట్.. త్రివిక్రమే అసలు సమస్యా?
టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసిందే. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా నాగవంశీ ఉన్నారు. సినిమా అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి ప్రేక్షకులల్లో మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాకు కేవలం డిజిటల్ హక్కులే రూ. 80 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కొన్నదని ప్రచారం జరిగింది. ఇంత పాజిటివ్ ఎనర్జీతో వస్తున్న ఈ సినిమా చుట్టూ ఏదో ఒక సమస్య క్రియేట్ అవుతూనే ఉంది. దీంతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విషయంలో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్) ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయన ప్లేస్‌లో రవి కె చంద్రన్ పేరు వినిపిస్తోంది. ఇది నిజమేనని ఇండస్ట్రీలో టాక్. తాజాగా మరో షాకింగ్ న్యూస్ అభిమానులను కలవరపెడుతోంది. గతంలో తమన్ స్థానంలో వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకుంటున్నారని వచ్చిన వార్తలపై.. అలాంటిదేమి లేదని నిర్మాత నాగవంశీతో పాటు తమన్ కూడా ఖండించారు. దీంతో ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా మళ్లీ ఇదే విషయంలో మరోసారి రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. గుంటూరు కారం పాటలకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ మహేష్ బాబుకు నచ్చలేదట. త్రివిక్రమ్ చెప్పారని మాత్రమే ఆయన్ను కొనసాగిస్తున్నారట. ఇక తప్పని పరిస్థితిలో తమన్‌ను పక్కన పెట్టాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఆయన ప్లేస్‌లోకి 'ఖుషి ఫేం హేశం అబ్దుల్ వహాబ్, భీమ్స్ సిసిరిలియో'లను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని మహేష్ బాబు ముందు ఉంచారట మేకర్స్. ఈ ప్రపోజల్‌కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఇదే నిజమైతే సినిమా పాటలు మరింత హిట్ అవుతాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు మెలడీతో ప్రేక్షకులను మెప్పిస్తే.. మరోకరు మాస్ బీట్తో దంచికొడతారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైట్ మాస్టర్స్, హీరోయిన్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ కంపోజర్, స్క్రిప్ట్‌లో మార్పు.. ఇలా మూవీకి కావాల్సిన కీలకమైన వాళ్ల విషయంలోనే ఇలాంటి ప్రచారం జరుగుతుంది.. వీటిలో ఇప్పటికే కొన్ని నిజం అయ్యాయి కూడా.. ఫైనల్‌గా గుంటూరు కారంలో ఎక్కడ తేడా కొడుతుందో అనేది ఎవరికీ అర్థం కావడం లేదని ఇండస్ట్రీలో టాక్. సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ కూడా త్రివిక్రమ్‌కు చాలా క్లోజ్. వీరిద్దరూ చాలా సినిమాలే చేశారు. అలాంటిది అతనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే అసలు సమస్య మహేష్ కాదని, త్రివిక్రమ్ ధోరణితోనే చాలా సమస్య వస్తోందని పరిశ్రమలో టాక్. ఇవన్నీ క్లియర్ కావాలంటే మహేష్‌బాబు వివరణ ఇస్తే కానీ క్లారిటీ రాదు. ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. -
'వాటిని కూడా తీసుకోవాల్సిందే'.. తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంగీత దర్శకుడిగా టాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు స్టార్ హీరోల సినిమాలకు సూపర్ హిట్స్ అందించారు. అయితే సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే తమన్.. అప్పట్లో నెగెటివిటీపై చేసిన కామెంట్స్ వైరలైన సంగతి తెలిసిందే. ఆయనను తక్కువ చేస్తూ కొందరు కామెంట్స్ చేయగా.. తనదైన శైలిలో కౌంటరిచ్చారు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ సోషల్‌మీడియా నెగెటివిటీపై మాట్లాడారు. నెటిజన్లు ప్రశంసించినప్పుడు ఎలా తీసుకుంటామో.. విమర్శలు కూడా అలాగే తీసుకోవాలని అన్నారు. (ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!) ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు తమన్ బదులిచ్చారు. 'మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ మధ్య మీపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారు. క్రికెట్ మీద పెట్టిన శ్రద్ధ మ్యూజిక్‌పై పెట్టొచ్చుగా అని అంటున్నారు? అని అడిగారు. దీనికి కూడా తమన్ తనదైన శైలిలో స్పందించారు. తమన్ మాట్లాడుతూ.. 'నాకు ఎలాంటి వ్యసనాలూ లేవు. నాకు గర్ల్‌ఫ్రెండ్స్ కూడా లేరు. నాకు ఉన్న ఒకే ఒక్క ఎమోషన్ క్రికెట్. ప్రతిరోజూ నా ఫ్రెండ్స్‌తో రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకూ క్రికెట్ ఆడి ఇంటికెళ్తా. నా టీమ్ పేరు తమన్ హిట్టర్స్. మా టీమ్‌లో మ్యూజిషియన్స్, డ్యాన్సర్స్ కూడా ఉన్నారు.. ఈ విషయంలో నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల నాపై ఒత్తిడి తగ్గుతుంది.' అని అన్నారు. కాగా.. తమన్ ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రానికి సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్!) -
మహేష్ బాబుతో విబేధాలు.. వాళ్లందరికీ ఇచ్చిపడేసిన థమన్
మహేష్ బాబు-త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ను తప్పిస్తున్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. రెండురోజులగా ఇదే టాపిక్‌పై పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా మహేష్ బాబుతో థమన్‌కు విబేధాలు వచ్చాయని, అందుకే త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి రూమర్స్‌కు తాజాగా థమన్ షాకింగ్ ట్వీట్ చేయడంతో విషయం హాట్ టాపిక్‌గా మారింది. (ఇదీ చదవండి: తల్లిదండ్రులైన రామ్ చరణ్- ఉపాసన దంపతులు) 'నా స్టూడియో దగ్గర ఒక మజ్జిగ స్టాల్‌ను ప్రారంభిస్తున్నాను. ఎవరైనా కడుపు మంట లక్షణాలతో బాధపడుతుంటే.. వారందరికి స్వాగతం. కనీసం దీనితోనైనా కోలుకుంటారు. దయచేసి నా సమయాన్ని వృధా చేయకండి.. నాకు చాలా పనులు ఉన్నాయి. గుడ్ నైట్' అంటూ ట్వీట్ ద్వారా తెలిపాడు. ట్రోల్స్ పై సెలబ్రీటీలు ఎవరూ పెద్దగా రెస్పాండ్ కారు. కాని తమన్ మాత్రం తనపై జరిగే ట్రోల్స్ కి సమాధానం చెప్పడంతో పాటు ఒక్కోసారి కౌంటర్స్ కూడా ఇదే రేంజ్‌లోనే ఇస్తాడు. దీంతో అసలు ఈ విషయం తెలియని వాళ్ళు ఏమైంది అన్నా.. అని అంటుండగా, కొందరు మాత్రం మహేష్ సినిమా మేకర్స్ అయినా స్పందిస్తే బాగుంటుంది కదా? అంటున్నారు. And also From Tom I am starting #Buttermilk Stall for free of cost at my studios people suffering with stomach burning symptoms are welcome 🙏 pls get cured 👌🏼🤠 Good nite lots of work ahead don’t want to waste my time 🕰️ 🙏 and urs also #peace & #love ♥️🫶 and some… pic.twitter.com/e2Fx7xkA6d — thaman S (@MusicThaman) June 19, 2023 (ఇదీ చదవండి: తమన్నా చేసిన పనితో ఆందోళనలో జైలర్ యూనిట్) -
హర్టయిన శాస్త్రిగారు, కానీ దానికోసం కాదట!
నందమూరి నటసింహం ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. తాజాగా ఈ సినిమా నుంచి మాస్ ఆంథెమ్ సాంగ్ జై బాలయ్య రిలీజైంది. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి పేరు అంటూ సాగే ఈ పాట ఒసేయ్ రాములమ్మ సాంగ్‌ను గుర్తు చేస్తోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు సంగీతం అందించిన తమన్‌ను కాపీ క్యాట్ అంటూ ఆడేసుకుంటున్నారు. కాపీ పాటకు లిరిక్స్ అందించావటూ రామజోగయ్య శాస్త్రిపై కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో రామజోగయ్య శాస్త్రి ఓ ట్వీట్ చేశాడు. ప్రతిపాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగినవారు మాత్రమే నాతో ప్రయాణించగలరు. అన్నట్టూ.. జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్థం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రిగా మార్చుకున్నాను. ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. ఇబ్బందిగా అనిపిస్తే ఇటు రాకండి అని రాసుకొచ్చాడు. అలా పాట రిలీజ్ అయిందో లేదో ఇలా ట్రోలింగ్ జరగడంతో రామజోగయ్య శాస్త్రి హర్ట్ అయ్యాడని పలువురూ భావించారు. దీంతో తన ట్వీట్‌కు వివరణ ఇచ్చుకున్నాడీ రచయిత. వేరే విషయం మీద ఆ ట్వీట్ చేశానని, ట్రోలింగ్ లేదు, ఏమీ లేదని స్పష్టం చేశాడు. అభిమానులందరూ నేనంటే చాలా ఇష్టపడతారని, ముఖ్యంగా జై బాలయ్య పాట పట్ల సాహిత్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని క్లారిటీ ఇచ్చాడు. ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను...దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు.. అన్నట్టు...జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి🙏 — RamajogaiahSastry (@ramjowrites) November 25, 2022 చదవండి: నా కోడలు బంగారం అంటున్న నయనతార అత్త -
గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్.. మూవీ టీమ్ స్పెషల్ చిట్ చాట్
-
గాడ్ ఫాదర్ టీంతో స్పెషల్ చిట్ చాట్
-
చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
Godfather Pre Release Photos: అనంతపురంలో ‘గాడ్‌ఫాదర్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)