'ఆర్ఆర్ఆర్' సినిమా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ (NTR) మళ్లీ కలిశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు, తమన్.. చరణ్(Ram Charan)-తారక్‌తో దిగిన ఫొటోలని పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ వీళ్లిద్దరూ ఎక్కడ? ఎందుకు కలిశారు?
(ఇదీ చదవండి: సింగర్ రమణ గోగుల 'గుండు' వెనక ఇంత స్టోరీ ఉందా?)
రీసెంట్‌గా అమెరికాలో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer) మూవీ ఈవెంట్ జరిగింది. దీనికి చరణ్, తమన్, బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు. రిట్నర్ వస్తున్న క్రమంలోనే దుబాయిలో దిగారు. అక్కడే ఎన్టీఆర్‌ని కలిశారు. మరి తారక్ హాలీ డే కోసం వెళ్తున్నాడా? వేరే షూటింగ్ ఏమైనా ఉందా? అనేది తెలియదు. కానీ ఎన్టీఆర్ లుక్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.
తారక్.. ఈ రెండు ఫొటోల్లో చాలా సన్నగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతానికైతే 'వార్ 2' చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది. ఇది పీరియాడికల్ మూవీ అని ఈ మధ్యే ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పాడు. మరి తారక్ సన్నబడింది ఈ ప్రాజెక్ట్ కోసమేనా లేదా ఇంకేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన)
Comments
Please login to add a commentAdd a comment