జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన | Bone Cancer Patient Kaushik Mother Says Jr NTR Did Not Helped Me, See Her Comments On This | Sakshi
Sakshi News home page

Jr NTR మాట తప్పారంటూ అభిమాని తల్లి ఆవేదన.. సాయం చేయమని వేడుకోలు

Published Mon, Dec 23 2024 2:16 PM | Last Updated on Mon, Dec 23 2024 3:12 PM

Bone Cancer Patient Kaushik Mother Says Jr NTR Did Not Helped Me

ఆదుకుంటానని హామీ ఇచ్చిన హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు మాట తప్పారంటోంది ఓ అభిమాని తల్లి మహిళ. ఇప్పటివరకు అతడి దగ్గరి నుంచి ఏ సాయమూ అందలేదని వాపోయింది. కాగా తారక్‌ అభిమాని కౌశిక్‌ బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. దేవర సినిమా చూసి చనిపోవాలనుందని, అదే తన చివరి కోరిక అంటూ అప్పట్లో అతడు చేసిన కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. 

ఎలాంటి సాయం అందలేదు
ఇది చూసిన తారక్‌.. చావుబతుకుల మధ్య ఉన్న అతన్ని ఆదుకుంటానని గతంలో హామీ ఇచ్చాడు. ఈమేరకు వీడియో కాల్‌ ద్వారా మాట్లాడి కౌశిక్‌కు గుండెధైర్యం చెప్పాడు. అయితే ఇంతవరకు తమకు ఎలాంటి సాయం అందలేదని, తన కొడుకును కాపాడాలని కౌశిక్‌ తల్లి మీడియా ముందుకు వచ్చింది. సోమవారం నాడు ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ.. జూనియర్‌ ఎన్టీఆర్‌ దగ్గరి నుంచి మాకు ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. ఆయన అభిమానులు మాత్రం రూ.2.5 లక్షలు ఇచ్చారు.

ఎటువంటి స్పందన లేదు 
సీఎం సహాయక నిధి నుంచి రూ.11 లక్షలు, టీటీడి నుంచి రూ.40 లక్షలు రాగా, ఈ డబ్బుతో అతడికి ఆపరేషన్‌ చేయించాం. అయితే ఇంకా రూ.20 లక్షలు ఇస్తేనే నా కొడుకును డిశ్చార్జ్‌ చేస్తాంటుమన్నారు. సహాయం చేస్తానని మాటిచ్చిన ఎన్టీఆర్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసినా స్పందన లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

చదవండి: షో చేస్తున్నావేంటి? నీ కంటికి మా హీరోయిన్‌ ఎలా కనిపిస్తోంది?'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement