బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. ఈ ఏడాది క్రూ, సింగం అగైన్ వంటి హిట్ చిత్రాలతో అలరించింది. ఓ పక్క స్టార్ హీరోలతో జత కడుతూనే మరోపక్క క్రూ, ద బకింగ్‌హామ్ మర్డర్స్ వంటి మహిళా ప్రాధాన్యత సినిమాలు చేస్తోంది. 44 ఏళ్ల వయసులోనూ పడుచు హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. అయితే ఓ పాకిస్తాన్ నటుడు మాత్రం ఆమెకు వయసు పెరిగిపోయిందంటున్నాడు.
ఆమెకు కుమారుడిగా మాత్రమే నటిస్తా
పాక్ నటుడు ఖాఖన్ షానవాజ్ ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. మీరు కరీనా కపూర్‌తో నటిస్తే చూడాలనుందని మనసులో మాట బయటపెట్టాడు. అందుకతడు.. అవునా.. సరే, నేను ఆమెకు కుమారుడిలా నటిస్తాను. అలాంటి ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను. కరీనా వయసులో చాలా పెద్దది. కాబట్టి నేను కేవలం ఆమె కుమారుడిగా మాత్రమే నటించగలను అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా బెబో (కరీనా కపూర్) ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నటుడిపై ట్రోలింగ్
'నువ్వు ఆమెతో కనీసం స్టేజీ కూడా పంచుకోలేవు. అలాంటిది ఏకంగా తనతో సినిమా చేస్తాననుకుంటున్నావా? ఇంకో విషయం తనకు కేవలం 44 ఏళ్లు మాత్రమే..', 'తనతో నటించే ఛాన్స్ నీకెవరు ఇస్తారు?', 'పెద్ద గొప్పలు పోతున్నావ్ కానీ ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చేయ్..', 'ఏజ్ షేమింగ్ చేస్తున్నావేంటి? ఒకసారి కరీనా కుమారుడిని చూసి నీ ముఖం అద్దంలో చూసుకోపో.',.' ఫ్లాప్ హీరోయిన్స్ కూడా నీతో కలిసి పని చేయాలనుకోరు' అంటూ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: 'పుష్ప2' ఘటన.. వాళ్లకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్: విజయశాంతి
Comments
Please login to add a commentAdd a comment