Buchi Babu
-
నాన్నా.. చరణ్ సినిమాకు అలా అడగాల్సిన పనిలేదు: బుచ్చిబాబు
ఉప్పెన(2021) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu Sana). తొలి సినిమాతోనే రూ.100 కోట్లుకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించాడు. అయితే ఈ సినిమా రిలీజై నాలుగేళ్లు అవుతున్నా.. బుచ్చిబాబు నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్(Ram Charan)తో సినిమా చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. రామ్ చరణ్ కెరీర్లో ఇది 16వ సినిమా(RC16). ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్ చిత్రం డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా బుచ్చి బాబు సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. తమ హీరోకి ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందించాలని కోరుతున్నారు. ఫ్యాన్స్ ఊహించినదానికంటే ఎక్కువ హిట్టే అందిస్తానని చెబుతున్నాడు బుచ్చిబాబు. తాజాగా ఓ ఈవెంట్ రామ్ చరణ్ సినిమాపై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బ్రహ్మాజీ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘బాపు’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన బుచ్చిబాబు మాట్లాడుతూ..‘మా నాన్న రైతు. చాలా కష్టపడి మమ్మల్ని పెంచాడు. వ్యవసాయం గురించి మా నాన్న నాతో ఓ మాట చెప్పాడు. ‘పేకాట ఆడితే డబ్బులు మనకో లేదా పక్కోడికో వస్తాయిరా..కానీ వ్యవసాయం చేస్తే ఎవడికి వస్తాయో తెలియదు..అంతా పోతాయి’ అని అనేవాడు. నిజంగానే ఏడాదంతా కష్టపడితే ఏకరం మీద రైతుకు మిగిలేది కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది’ అని బుచ్చిబాబు అన్నారు. అలాగే తన నాన్న గురించి మాట్లాడుతూ..‘ఉప్పెన రిలీజ్ సమయంలో మా నాన్న థియేటర్ బయటే నిలబడి ‘సినిమా బాగుందా’ అని వచ్చిన వారందరినీ అడిగేవాడట. ఆయన సినిమా కూడా చూడకుండా థియేటర్‌కు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆయన మా నుంచి బౌతికంగా దూరమై ఏడాది అవుతోంది. ప్రస్తుతం నేను చరణ్‌తో తీస్తున్న సినిమా బాగుందా అని ఎవరినీ అడగాల్సిన పని లేదు నాన్నా.. అది కచ్చతంగా హిట్ అవుతుంది’ అని బుచ్చిబాబు ఎమోషనల్‌గా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. -
బర్త్ డే స్పెషల్
‘ఉప్పెన’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu) సానా ద్వితీయ చిత్రాన్ని హీరో రామ్‌చరణ్(Ram Charan)తో చేసే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ఆర్సీ 16’ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా శనివారం (ఫిబ్రవరి 15) బుచ్చిబాబు బర్త్ డే.ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ‘ఆర్సీ 16’ యూనిట్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకని నిర్వహించారు. రామ్‌చరణ్ కూడా బుచ్చిబాబుతో కలిసి ఉన్న ఫొటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. ‘ఆర్సీ 16’ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది.రామ్ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు బుచ్చిబాబు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. -
పెద్ది షూటింగ్ షురూ
రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెలాఖరున హైదరాబాద్‌లోప్రారంభం కానుందని తెలిసింది. హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్లో రామ్‌చరణ్‌తో పాటు ఈ సినిమా ప్రధాన తారాగణం పాల్గొననుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట.అంతేకాదు... ఈ సినిమాలో ఒకే ఒక్క క్రీడ కాకుండా రెండు మూడు రకాల క్రీడలకు సంబంధించిన ప్రస్తావన ఉంటుందట. ఈ చిత్రంలో రామ్‌చరణ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ‘తంగలాన్’ సినిమాకు వర్క్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబరంను ఈ సినిమాలో భాగం చేశారు. దీంతో రామ్‌చరణ్ లుక్స్ కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుందని తెలిసింది. -
రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సినిమా.. జగపతి బాబు లుక్ చూశారా?
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్లో చెర్రీ నటించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. షూట్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూట్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్ షేర్ చేశారు.ఈ చిత్రంలో తన పాత్ర కోసం మేకోవర్ చేస్తున్న వీడియోను జగపతిబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'చాలాకాలం తర్వాత బుచ్చిబాబు ఆర్సీ 16 కోసం మంచి పని పెట్టాడు..గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది'అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్సీ16గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాను బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతమందిస్తున్నారు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Chaala Kaalam tharavaatha @BuchiBabuSana #RC16 ki manchi pani pettaadu.. get up choosina tharavaatha Naaku chaala thrupthi ga undhi. pic.twitter.com/aaiQ8HPErp— Jaggu Bhai (@IamJagguBhai) January 16, 2025 -
ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?
'ఆర్ఆర్ఆర్' సినిమా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ (NTR) మళ్లీ కలిశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు, తమన్.. చరణ్(Ram Charan)-తారక్‌తో దిగిన ఫొటోలని పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ వీళ్లిద్దరూ ఎక్కడ? ఎందుకు కలిశారు?(ఇదీ చదవండి: సింగర్ రమణ గోగుల 'గుండు' వెనక ఇంత స్టోరీ ఉందా?)రీసెంట్గా అమెరికాలో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer) మూవీ ఈవెంట్ జరిగింది. దీనికి చరణ్, తమన్, బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు. రిట్నర్ వస్తున్న క్రమంలోనే దుబాయిలో దిగారు. అక్కడే ఎన్టీఆర్‌ని కలిశారు. మరి తారక్ హాలీ డే కోసం వెళ్తున్నాడా? వేరే షూటింగ్ ఏమైనా ఉందా? అనేది తెలియదు. కానీ ఎన్టీఆర్ లుక్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.తారక్.. ఈ రెండు ఫొటోల్లో చాలా సన్నగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతానికైతే 'వార్ 2' చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది. ఇది పీరియాడికల్ మూవీ అని ఈ మధ్యే ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పాడు. మరి తారక్ సన్నబడింది ఈ ప్రాజెక్ట్ కోసమేనా లేదా ఇంకేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన) -
స్టార్ హీరోలను మెప్పిస్తున్న యంగ్ డైరెక్టర్స్
సినిమాలో కంటెంట్ బాగుంటే చిన్నా పెద్దా అనే తేడాల్లేవ్. ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తున్నారు. అలాగే కథలో బలం ఉందని హీరో–నిర్మాతలు నమ్మితే చాలు చిన్నా పెద్దా తేడాల్లేవ్, అనుభవం లెక్కలోకి రాదు. స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతారు. కథ కోసం బడ్జెట్ కేటాయింపులకు నిర్మాతలు సిద్ధమైపోతారు. ఇలా తమ కలంతో స్టార్ హీరోలను ఒప్పిస్తున్న యువ దర్శకుల జాబితా టాలీవుడ్లో పెరిగిపోతోంది. స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో బలమైన కథలు సిద్ధం చేసుకున్నారు కొందరు యువ దర్శకులు. ఆ కథలతో స్టార్ హీరోలను మెప్పించి, సినిమా చేస్తున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.ఇద్దరు యువ దర్శకులతో... నూటయాభైకి పైగా సినిమాలు చేసిన చిరంజీవి వంటి అగ్రహీరో వరుసగా యువ దర్శకులకు చాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకు వశిష్ఠ దర్వకత్వం వహిస్తున్నారు. ‘విశ్వంభర’కు ముందు వశిష్ఠ చేసింది ఒక్కటే సినిమా. అదే ‘బింబిసార’. తన ప్రతిభతో మెప్పించి, చిరంజీవి వంటి టాప్ హీరోతో సినిమా చేసే చాన్స్ దక్కించుకున్నారు వశిష్ఠ. అలాగే ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. శ్రీకాంత్ ఓదెల కథను మెచ్చి, ఈ యువ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాకు హీరో నాని ఓ నిర్మాతగా ఉండటం విశేషం. ‘ప్యారడైజ్’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. సంక్రాంతి తర్వాత... ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరి చయం చేశారు నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్‌గా చెప్పుకునే ‘శివ’ సినిమాతో రామ్‌గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు. ఇంకా నాగార్జున పరిచయం చేసిన దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. ఈ విధంగా యువ దర్శకులతో పని చేయడానికి నాగార్జున ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ‘హుషారు, రౌడీబాయ్స్, ఓం భీమ్ బుష్’ సినిమాలు తీసిన దర్శకుడు హర్ష కొనుగంటితో సినిమా చేసే ఆలోచన చేస్తున్నారట నాగార్జున. అలాగే తమిళంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నవీన్ అనే దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేశారట. ఈ యువ దర్శకులతో నాగార్జున చేయాల్సిన సినిమాలపై సంక్రాంతి తర్వాత ఓ స్పష్టత వస్తుంది. పెద్ది ‘రాజమౌళి, శంకర్’ వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలు చేసిన రామ్‌చరణ్ తన తర్వాతి సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు చేతుల్లో పెట్టారు. దర్శకుడిగా బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అంతేకాదు... తన రెండో సినిమాకే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ను ఒప్పించగలిగారు బుచ్చిబాబు. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. డీజే టిల్లు దర్శకుడితో... యువ హీరో సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు విమల్ కృష్ణ. కాగా విమల్ రెడీ చేసిన ఓ కథను అగ్ర హీరో వెంకటేశ్ ఆల్మోస్ట్ ఓకే చేశారట. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, వీరి కాంబినేషన్లోని సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత రానుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. కథ విన్నారా? ‘హాయ్ నాన్న’ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఓ కథను సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఎన్టీఆర్‌కు వినిపించగా, శౌర్యువ్‌కి అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారు శౌర్యువ్. ఫైనల్ కథతో ఎన్టీఆర్‌ను శౌర్యువ్ మెప్పించగలిగితే, దర్శకుడిగా ఆయన కెరీర్ నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్తుందని ఊహించవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తారు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఎన్టీఆర్‌కు ఓ కమిట్మెంట్ ఉంది. కాబట్టి... ఎన్టీఆర్–శౌర్యువ్‌ల కాంబినేషన్ సినిమాకు మరింత సమయం పట్టనుంది. మైల్స్టోన్ ఫిల్మ్‌కెరీర్‌లో మైల్స్టోన్ ఫిల్మ్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంటారు హీరోలు. అలాంటిది తన 75వ సినిమాను ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని భాను భోగవరపు చేతిలో పెట్టారు రవితేజ. తన కథతో తొలి సినిమానే రవితేజతో చేసే చాన్స్ దక్కించుకున్నారు భాను భోగవరపు. ‘మాస్ జాతర’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇలా బలమైన కథలతో స్టార్ హీరోలను మెప్పిస్తున్న మరికొంతమంది దర్శకులు ఉన్నారు. -
కథ రాశారు... స్టార్‌ని పట్టారు
సినిమాలో కంటెంట్ బాగుంటే చిన్నా పెద్దా తేడాల్లేవ్. ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తున్నారు. కథలో బలం ఉందని హీరో నిర్మాతలు నమ్మితే చాలు చిన్నా పెద్దా తేడాల్లేవ్, అనుభవం లెక్కలోకి రాదు. స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతారు. కథ కోసం బడ్జెట్ కేటాయింపులకు నిర్మాతలు సిద్ధమైపోతారు. ఇలా తమ కలంతో స్టార్ హీరోలను ఒప్పిస్తున్న యువ దర్శకుల జాబితా టాలీవుడ్లో పెరిగిపోతోంది. స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో బలమైన కథలు సిద్ధం చేసుకున్నారు కొందరు యువ దర్శకులు. ఆ కథలతో స్టార్ హీరోలను మెప్పించి, సినిమా చేస్తున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.ఇద్దరు యువ దర్శకులతో... 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి లాంటి అగ్రహీరో వరుసగా యువ దర్శకులకు చాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాకు వశిష్ఠ దర్వకత్వం వహిస్తున్నారు. ‘విశ్వంభర’కు ముందు వశిష్ఠ చేసింది ఒక్కటే సినిమా. అదే ‘బింబిసార’. తన ప్రతిభతో మెప్పించి, చిరంజీవి వంటి టాప్ హీరోతో సినిమా చేసే చాన్స్ దక్కించుకున్నారు వశిష్ఠ. ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. శ్రీకాంత్ ఓదెల కథను మెచ్చి, ఈ యువ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాకు హీరో నాని ఓ నిర్మాతగా ఉండటం విశేషం. సంక్రాంతి తర్వాత... ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరిచయం చేశారు నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్‌గా చెప్పుకునే ‘శివ’ సినిమాతో రామ్‌గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు. నాగ్ పరిచయం చేసిన దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. ఈ విధంగా యువ దర్శకులతో పని చేయడానికి నాగార్జున ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ‘హుషారు, రౌడీబాయ్స్, ఓం భీమ్ బుష్’ సినిమాలు తీసిన దర్శకుడు హర్ష కొనుగంటితో సినిమా చేసే ఆలోచన చేస్తున్నారట నాగార్జున. తమిళంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నవీన్ అనే దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేశారట. ఈ యువ దర్శకులతో నాగార్జున చేయాల్సిన సినిమాలపై సంక్రాంతి తర్వాత ఓ స్పష్టత వస్తుంది. పెద్ది ‘రాజమౌళి, శంకర్’ వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలు చేసిన రామ్‌చరణ్ తన తర్వాతి సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు చేతుల్లో పెట్టారు. దర్శకుడిగా బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అంతేకాదు... తన రెండో సినిమాకే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ను ఒప్పించగలిగారు బుచ్చిబాబు. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. డీజే టిల్లు దర్శకుడితో... యువ హీరో సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు విమల్ కృష్ణ. కాగా విమల్ రెడీ చేసిన ఓ కథను అగ్ర హీరో వెంకటేశ్ ఆల్మోస్ట్ ఓకే చేశారట. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, వీరి కాంబినేషన్లోని సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత రానుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా.కథ విన్నారా? ‘హాయ్ నాన్న’ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఓ కథను సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఎన్టీఆర్‌కు వినిపించగా, శౌర్యువ్‌కి అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారు శౌర్యువ్. ఫైనల్ కథతో ఎన్టీఆర్‌ను శౌర్యువ్ మెప్పించగలిగితే, దర్శకుడిగా ఆయన కెరీర్ నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్తుందని ఊహించవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తారు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఎన్టీఆర్‌కు ఓ కమిట్మెంట్ ఉంది. కాబట్టి... ఎన్టీఆర్-శౌర్యువ్‌ల కాంబినేషన్ సినిమాకు మరింత సమయం పట్టనుంది. మైల్స్టోన్ ఫిల్మ్ కెరీర్లో మైల్స్టోన్ ఫిల్మ్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంటారు హీరోలు. అలాంటిది తన 75వ సినిమాను ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని భాను భోగవరపు చేతిలో పెట్టారు రవితేజ. తన కథతో తొలి సినిమానే రవితేజతో చేసే చాన్స్ దక్కించుకున్నారు భాను భోగవరపు. ‘మాస్ జాతర’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇలా బలమైన కథలతో స్టార్ హీరోలను మెప్పిస్తున్న మరికొంతమంది దర్శకులు ఉన్నారు.– ముసిమి శివాంజనేయులు -
అఫీషియల్: చరణ్ సినిమాలో 'మీర్జాపుర్' మున్నా భయ్యా
ఓటీటీలో 'మీర్జాపుర్' వెబ్ సిరీస్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో ఉన్నవి బూతులే కానీ ఆడియెన్స్ వాటిని ఎంజాయ్ చేశారు. మరీ ముఖ్యంగా మున్నా భయ్యా అనే క్యారెక్టర్‌కి బోలెడంత మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ నటుడు తెలుగు సినిమాలో నటించేస్తున్నాడు.(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'గేమ్ ఛేంజర్' మూవీని రెడీ చేసిన రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నాడు. 'RC16' పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కొన్నిరోజుల క్రితమే మైసూరులో మొదలైంది. ఇందులో కన్నడ స్టార్ హీరో శివన్న, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. ఇప్పుడు తనకెంతో ఇష్టమైన పాత్ర అని చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు.. మున్నా భయ్యా చరణ్ మూవీలో నటిస్తున్నట్లు ప్రకటించాడు.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో చరణ్-బుచ్చిబాబు మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. బహుశా వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2026 ప్రారంభంలో మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)Our favourite 'Munna Bhayya' will light up the big screens in a spectacular role tailor made for him ❤️🔥Team #RC16 welcomes the incredibly talented and the compelling performer @divyenndu on board ✨#RamCharanRevoltsGlobal Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor… pic.twitter.com/Q4I8w9Vqhh— Vriddhi Cinemas (@vriddhicinemas) November 30, 2024 -
రామచ్‌రణ్‌పై విమర్శలు.. స్పందించిన ఉపాసన
మెగాహీరో రామ్‌చరణ్ కడప పెద్ద దర్గాను సందర్శించారు. అక్కడ 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, కొద్దిరోజుల క్రితం నుంచి స్వామి మాలలో ఉన్న చరణ్ దర్గాకు వెళ్లడంతో పలువురు విమర్శించారు. కానీ, కొందరైతే అందులో తప్పేముందని చరణ్‌కు సపోర్ట్‌గా కామెంట్లు చేశారు. ఈ క్రమంలో తాజాగా రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సోషల్‌మీడియా వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేసింది.రామ్‌చరణ్‌పై విమర్శులు చేయడాన్ని ఉపాసన తప్పపట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్ ఫోటోను షేర్ చేస్తూ సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా అనే గీతాన్ని జోడించారు. చరణ్ అన్ని మతాలను గౌరవిస్తారని ఆమె తెలిపారు. దేవుడిపై విశ్వాసం ఉంటే అందరినీ ఏకం చేస్తుందని ఆమె చెప్పారు. 'భక్తి ఎవరినీ చిన్నాభిన్నం చేయదు. మేము అన్ని మతాలను గౌరవిస్తాం. ఐక్యతలోనే మన బలం ఉంది. వన్ నేషన్.. వన్ స్పిరిట్' అని తెలిపారు.రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కడప దర్గా కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో వారిద్దరూ కలిసి కొత్త సినిమా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంటిమెంట్‌గా వారు అక్కడకు వచ్చారు. గతంలో మగధీర విడుదల సమయంలో కూడా చరణ్ దర్గాను సందర్శించి అక్కడి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సినిమా చరణ్ కెరిర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. దీంతో కడప దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చరణ్ పేర్కొన్నారు. జనవరి 10న శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కానుంది. -
అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?
మెగాహీరో రామ్ చరణ్ సోమవారం రాత్రి కడప వెళ్లారు. పెద్ద దర్గాను సందర్శించుకున్నారు. సాధారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ ప్రస్తుతం చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. అయినా సరే పెద్ద దర్గాను దర్శించుకోవడం వెనక ఓ కారణముంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇలా చేసినట్లు స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు.రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ప్రస్తుతం మ్యూజిక్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈయన మూడు నెలల క్రితం రామ్ చరణ్‌ని పెద్ద దర్గాను సందర్శించాలని కోరారు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నా సరే చరణ్.. రెహమాన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.(ఇదీ చదవండి: అక్కినేని వారి పెళ్లిసందడి.. మూడుముళ్లు వేసే టైమ్ వచ్చేసింది)కడప దర్గాలో 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్ జరిగింది. ఈ దర్గాకు రెహమాన్.. ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటారు. ఈ సంవత్సరం జరిగే ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ని తీసుకొస్తానని అక్కడి వాళ్లకు మాటిచ్చారట. అలా ఏఆర్ రెహమాన్ ఆహ్వానం మేరకు ఓ వైపు బిజీ షెడ్యూల్, మరోవైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. 'ఏఆర్ రెహమాన్.. ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని మూడు నెలల ముందే చెప్పారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. చరణ్‌తోపాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు 'శంకర్' షాక్.. ఆ సినిమా రీషూట్ కోసం రూ. 100 కోట్లు)#ARRahman గారు ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ మూడు నెలల ముందే ఆహ్వానించారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను. - @AlwaysRamCharan pic.twitter.com/4l7CSysAtq— Rajesh Manne (@rajeshmanne1) November 18, 2024 -
మైసూర్లో రామ్‌చరణ్,జాన్వీకపూర్ ప్రయాణం
హీరో రామ్‌చరణ్ ఓ వైపు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మరోవైపు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్సీ 16’(వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు ఈ నెలలో మైసూర్ వెళ్లనున్నారాయన. తొలి చిత్రం ‘ఉప్పెన’ తో బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ద్వితీయ చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేసే అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ‘ఆర్సీ 16’ ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన శివ రాజ్‌కుమార్ పవర్ఫుల్ రోల్ పోషించనున్నారు. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ ఈ నెల 22 నుంచి కర్నాటక రాష్ట్రంలోని మైసూర్లో మొదలవుతుందని సమాచారం. రామ్ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారట బుచ్చిబాబు. అక్కడ నాన్‌స్టాప్‌గా 15 రోజుల పాటు షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటి పూనమ్ కౌర్ గొడవ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా అటు త్రివిక్రమ్, ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఆమె వరుస ట్వీట్స్ చేస్తారు. వారిద్దరు కలిసి తనకు చేసిన అన్యాయం గురించి బహిరంగానే వెల్లడిస్తారు. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని, వారి కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారనేది పూనమ్ ఆరోపణ. అయితే ఆమె ట్వీట్స్‌పై అటు త్రివిక్రమ్ కాని, ఇటు పవన్ కాని స్పందించలేదు కానీ, ఇండస్ట్రీ ప్రముఖుల్లో కొంతమంది పూనమ్‌కి నిజంగానే అన్యాయం జరిగిందని అంటారు. మరికొంతమంది ఏమో ఫేమ్ కోసమే వారిపై ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అంటున్నారు. సినీ నిర్మాత చిట్టి బాబు కూడా పూనమ్ ట్వీట్స్‌పై స్పందించాడు. (చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందంటూ మాల్వీ మల్హోత్రా)తాజాగా ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ..‘పూనమ్ ఫిర్యాదు ఇవ్వమని పిలిస్తే రాదు కానీ.. పిచ్చి పిచ్చిగా ట్వీట్స్ వేస్తారని’అన్నారు ఏం జరిగిందో కమిటికీ ఫిర్యాదు చేస్తే తెలుస్తుంది కానీ..ఇలా ట్వీట్స్ చేస్తే ఏం లాభం’అని చిట్టి బాబు అన్నారు. నిర్మాత వ్యాఖ్యలపై పూనమ్ కౌర్ మండి పడింది. మీకు త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? అని నిలదీసింది.‘మీరు త్రివిక్రమ్‌ను ప్రశ్నించరు.. ప్రశ్నించలేరు.. నేను మీలా వెన్నుమొక లేని దాన్ని అయితే కాను. నా మీద కామెంట్ చేయడం కాకుండా.. త్రివిక్రమ్‌ను అడిగే దమ్ముందా? అంటూ నిర్మాతను ప్రశ్నించింది. దీనిపై చిట్టి బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. పూనమ్ విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. It’s trivikram Srinivas who doesn’t and will not be questioned- I am not spineless like these men who run their show to project their fake masculinity- I dare him to question the director rather than commenting on me .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 7, 2024 -
పల్లె బాట పట్టిన టాలీవుడ్ హీరోలు.. హిట్ కొట్టేనా?
పల్లె కథలు, మట్టి కథలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. గత ఏడాది థియేటర్స్‌లోకి వచ్చిన నాని ‘దసరా’, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, సందీప్ కిషన్ ‘ఊరిపేరు భైరవకోన’, కార్తికేయ ‘బెదురు లంక 2012’, ప్రియదర్శి ‘బలగం’ వంటి పూర్తి స్థాయి పల్లెటూరి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద హిట్స్‌గా నిలిచాయి. ఇటీవల హిట్స్‌గా నిలిచిన ‘ఆయ్, కమిటీ కుర్రోళ్ళు’ కూడా పల్లె కథలే. దీంతో ఓ హిట్‌ని ఖాతాలో వేసుకోవడానికి పల్లెకు పోదాం చలో... చలో అంటూ కొందరు హీరోలు పల్లె కథలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక ఏయే హీరోలను పల్లె పిలిచిందో తెలుసుకుందాం. పల్లె ఆట రామ్‌చరణ్ కెరీర్‌లోని పర్ఫెక్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ‘రంగస్థలం’. 2018లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ‘రంగస్థలం’కు దర్శకత్వం వహించిన సుకుమార్ వద్ద ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన బుచ్చిబాబు సాన ఇప్పుడు రామ్‌చరణ్‌తో సినిమా చేసేందుకు ఓ పల్లెటూరి కథను రెడీ చేశారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలిసింది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా సాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనులతో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కథ రీత్యా పాత్ర కోసం బరువు పెరుగుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నారు. దసరా తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న చిత్రం ఇది. జాన్వీకపూర్ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.తెలంగాణ కుర్రాడు తెలంగాణ పల్లెటూరి అబ్బాయిలా హీరో శర్వానంద్‌ను రెడీ చేస్తున్నారు దర్శకుడు సంపత్ నంది. వీరి కాంబినేషన్లో ఓ పల్లె కథ తెరకెక్కనుంది. కేకే రాధామోహన్ నిర్మిస్తారు. యాక్షన్, ఎమోషన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రం 1960 కాలంలో సాగుతుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెలంగాణ–మహారాష్ట్రల సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో కథనం ఉంటుంది. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 38వ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా లుక్కు సంబంధించిన మేకోవర్ పనుల్లో ఉన్నారు శర్వానంద్. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తారు. బచ్చల మల్లి కథ వీలైనప్పుడల్లా సీరియస్ కథల్లోనూ నటిస్తుంటారు హీరో ‘అల్లరి’ నరేశ్. అలా ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ సన్నివేశాలు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో దొంగగా పేరుగాంచిన బచ్చలమల్లి అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. పల్లె బాటలో తొలిసారి... హీరో విజయ్ దేవరకొండ పల్లెటూరి బాట పట్టారు. కెరీర్లో తొలిసారిగా పల్లెటూరి కుర్రాడిగా సెట్స్‌కు వెళ్లనున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణివారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. పక్కా పల్లెటూరి యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్ చిత్రీకరణ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా సెట్స్‌లోకి అడుగుపెడతారు విజయ్ దేవరకొండ. పల్లెటూరి పోలీస్ పల్లెటూరి రాజకీయాల్లో విశ్వక్ సేన్ జోక్యం చేసుకుంటున్నారు. విశ్వక్ సేన్ హీరోగా ఓ విలేజ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ తెరకెక్కనుంది. విశ్వక్ కెరీర్‌లోని ఈ 13వ సినిమాతో శ్రీధర్ గంటా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ సంపద హీరోయిన్గా కనిపిస్తారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. విశ్వక్ కెరీర్లో పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అమ్మాయి కథ యాక్షన్... లవ్‌స్టోరీ... పొలిటికల్... ఇవేవీ కాదు... భార్యాభర్తల అనుబంధం, స్త్రీ సాధికారత వంటి అంశాలతో సరికొత్తగా ఓ సినిమా చేస్తున్నారు తరుణ్ భాస్కర్. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్‌తో పాటు ఈషా రెబ్బా మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాను సంజీవ్ ఏఆర్ దర్శకత్వంలో సృజన్ యరబోలు, వివేక్ కృష్ణ, సాధిక్, ఆదిత్య పిట్టీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత రానుంది. కాగా మలయాళ సూపర్ హిట్ ‘జయ జయ జయ జయ హే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిందనే టాక్ వినిపిస్తోంది. కాలేజ్ సమయంలో ప్రేమించి, మోస΄ోయిన ఓ అమ్మాయి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అత్తింట్లో కొత్త సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ తర్వాత భర్తకు ఎదురు తిరిగి, సొంతంగా వ్యాపారం పెట్టుకుని జీవితాన్ని ఎలా లీడ్ చేస్తుంది? అనే అంశాలతో ‘జయ జయ జయ జయ హే’ సినిమా కథనం సాగుతుంది. పోస్ట్‌మ్యాన్ స్టోరీ‘క’ అనే ఓ డిఫరెంట్ టైటిల్‌తో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేశారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఓ గ్రామంలో సాగే ఈ సినిమా కథలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మ్యాన్ రోల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే హీరో క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. ఇలా పల్లెటూరి కథలతో రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
రామ్ చరణ్ కొత్త సినిమా.. అప్పుడే మొదలెట్టేశాడు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ డిసెంబర్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే మరో సినిమాకు రామ్ చరణ్ సిద్ధమైపోయాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఆర్సీ16 చిత్రంలో నటించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.(ఇది చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'ను ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి సినిమా)అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రత్యేకమైన లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ప్రముఖ ఫిట్నెస్ కోట్ శివోహంతో కలిసి సాధన మొదలెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు మెగా హీరో. బీస్ట్ మోడ్ ఆన్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న చిత్రం కావడంతో అథ్లెట్ లుక్ కోసం చెర్రీ కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఫిట్నెస్ ట్రైనర్ రామ్ చరణ్‌తో పాటు అమితాబ్ బచ్చన్, జాక్వెలిన్ లాంటి స్టార్స్‌కు సైతం కోచ్‌గా పనిచేశారు. Beast mode on 🔥#RC16 loading… @Shivohamshivfit pic.twitter.com/6Oz3bXpySp— Ram Charan (@AlwaysRamCharan) September 16, 2024 -
ఒక్క సెట్ కోసం అన్ని కోట్లా..?
-
మరోసారి రంగస్థలం తరహాలో మూవీ ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్
-
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. మూడు సినిమాలు ఒకేసారి!
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. స్టార్ హీరోలంతా ఇప్పుడు తమ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ బరిలో మాత్రం ఇతర పెద్ద సినిమాలు లేకుండా ప్లాన్ చేసుకొని సినిమాను విడుదల చేస్తున్నారు. కల్కి 2898 మూవీ కూడా ఇక్కడ సోలోగానే విడుదలై హిట్ కొట్టింది. అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలు కూడా దాదాపు సోలోగానే రిలీజ్ కాబోతున్నాయి. కానీ వీటి తర్వాత ఈ స్టార్ హీరోలు నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య 2026లో బక్సాఫీస్ వార్ జరిగే అవకాశం మెండుగా ఉంది.(చదవండి: మహేష్ – రాజమౌళి మూవీ: విలన్‌గా స్టార్ హీరో!)కల్కి 2898 తర్వాత ప్రభాస్ ‘రాజా సాబ్’గా రాబోతున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలయ్యే అవకాశం ఉంది. 2025 చివరల్లో లేదా 2026 సంకాంత్రికి విడుదలయ్యే అవకాశం ఉంది. (చదవండి: నా బిడ్డను పైకి పంపించేయాలనుకున్నా.. ఏడుస్తూ భర్తకు చెప్పా: పాక్ నటి)మరోవైపు గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్..బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాలి. కానీ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం కావడంతో బుచ్చిబాబు మూవీ పట్టాలెక్కలేదు. సెప్టెంబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం రెహమాన్ కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేశాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది చివరిలో ఈ చిత్రం రీలీజ్ అయ్యే అవకాశం ఉంది. దేవర తర్వాత ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 2026 ప్రారంభంలో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దాదాపు ఈ ముగ్గురు హీరోల సినిమాలు ఒకేసారి ప్రారంభం అవుతున్నాయి. పెద్ద సినిమాలు కాబట్టి ఏడాది వరకు నిర్మాణంలో ఉండడం సర్వసాధారణం. ఈ లెక్కన చూస్తే..మూడు సినిమాలు వారం అటు ఇటుగా ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ ముగ్గురు బాక్సాఫీస్ వార్‌లో ఉంటారా లేదా సోలోగానే వచ్చి హిట్ కొడతారా అనేది తెలియాలంటే కొన్నాళ్ల పాటు ఆగాల్సిందే. -
చరణ్ బుచ్చిబాబు మూవీపై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
-
ఆట కాదు సుమా!
క్రీడాకారుడి పాత్ర చేయడం అంటే ఆట కాదు సుమా అనాలి. ఎందుకంటే ఆ క్రీడ మీద ఎంతో కొంత అవగాహన సంపాదించాలి. అలాగే ఆ క్రీడకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవాలి. రామ్‌చరణ్ త్వరలో ఈ పని మీదే బిజీ కానున్నారు. బుచ్చిబాబు సన (ఆర్సీ 16) దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నారని... కాదు రన్నర్‌గా కనిపిస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.ఏది ఏమైనా క్రీడాకారుడి పాత్రలో కనిపించడం ఖాయం. ఇందుకోసం రామ్‌చరణ్ కండలు పెంచాలనుకుంటున్నారట. ఈ మేకోవర్ కోసం ఆస్ట్రేలియా వెళతారని సమాచారం. అక్కడ దాదాపు రెండు నెలలు శిక్షణ తీసుకుంటారని భోగట్టా. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసి, ఆస్ట్రేలియా ప్రయాణమవుతారని తెలిసింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ‘ఆర్సీ 16’ షూటింగ్‌ని సెప్టెంబర్ లేదా అక్టోబరులో ఆరంభించేలా యూనిట్ ప్లాన్ చేస్తోందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్నారు. -
ఆస్ట్రేలియా వెళ్లనున్న రామ్ చరణ్.. కారణం ఇదేనా..?
పాన్ ఇండియా హీరో రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా రోజులైంది. రీసెంట్గా పూజా కార్యక్రమం కూడా జరిగింది. కానీ, రెగ్యులర్ షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు..? ఇతర నటీనటులు ఎవరు..? వంటి అప్డేట్స్ గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న RC16 ప్రాజెక్ట్ ఇక పట్టాలెక్కడమే ఆలస్యం అని తెలుస్తోంది.ఈ చిత్రం కోసం రామ్ చరణ్ పూర్తిగా తన మేకోవర్‌ను మార్చుకోనున్నారట. ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్లు కనిపించాలంటే మరింత కసరత్తులు తప్పవని ఆయన భావించారట. అందుకోసం ఆస్ట్రేలియా వెళ్లేందుకు చరణ్ సిద్ధం అవుతున్నారట. గేమ్ చేంజర్ చిత్రం పూర్తి అయిన వెంటనే వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ చరణ్ ఫిజికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత RC16 షూటింగ్ అక్టోబర్‌లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. స్పోర్ట్స్ డ్రామాగా, గ్రామీణ నేపథ్యంలో కథ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్‌చరణ్ సరికొత్తగా కనిపిస్తారని, అందుకోసం ప్రత్యేక మేక్ఓవర్ తప్పదని మేకర్స్ ప్లాన్ చేశారని టాక్. రామ్ చరణ్ కోరుకున్న శారీరక రూపాన్ని పొందాలంటే కనీసం రెండు నెలలపాటు కఠినమైన శిక్షణ తీసుకోవాల్సిందేనని సూచించారట. దానికి కోసం ఆస్ట్రేలియాను ఎంపిక చేశారట.జాన్వీకపూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. రెహమాన్ సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. RC16 పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు 'పెద్ది' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. -
స్టార్ హీరో పాదాలకు నమస్కరించిన టాలీవుడ్ డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం మహారాజా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్‌లోనూ మహారాజా చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి హైదరాబాద్‌లో పర్యటించారు. ఓ హోటల్ జరిగిన ఈవెంట్లో విజయ్, టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా పాల్గొన్నారు. విజయ్ సేతుపతి ఈ కార్యక్రమానికి వస్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఉప్పెన మూవీలో కలిసి పనిచేసిన బుచ్చిబాబు ఏకంగా విజయ్ సేతుపతి కాళ్లకు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. బుచ్చిబాబు తదుపరి చిత్రం రామ్ చరణ్‌తో కలిసి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
ఉప్పెన కేవలం ఆయన కోసమే చేశా: విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఆయన మహారాజా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పెన చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'ఉప్పెన సినిమా కేవలం నేను బుచ్చిబాబు కోసమే చేశా. ఆయనకున్న ప్యాషన్ చూసి నేను ఒప్పుకున్నా. చాలా తక్కువ రెమ్యునరేషన్‌కే ఉప్పెన సినిమా చేశా. మామూలుగా అయితే నాలాంటి యాక్టర్స్ చేయడానికి వెనుకాడతారు. కానీ సినిమా పట్ల బుచ్చిబాబుకున్న ప్యాషన్ చూసే ఆ చిత్రంలో నటించా' అని అన్నారు. I did #Uppena only because of @BuchiBabuSana , Less Remuneration కి ఆ సినిమా చేశాను - #VijaySethupathi pic.twitter.com/qRBIGwwFho— Rajesh Manne (@rajeshmanne1) June 10, 2024 -
భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?
-
విలేజ్...సెట్...గో...
గెట్... సెట్... గో అంటారు. అయితే రామ్‌చరణ్ విలేజ్... సెట్... గో అంటూ పల్లెటూరికి వెళ్లనున్నారు. విలేజ్‌లో స్పోర్ట్స్ ఆడేందుకు రెడీ అవుతున్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారు. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో అన్నదమ్ముల్లా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారట.ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ ఫిల్మ్ చిత్రీకరణకు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో విలేజ్ సెట్‌ను రెడీ చేయిస్తున్నారు మేకర్స్. ఈ సెట్ పూర్తి కాగానే ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. మేజర్ షూటింగ్ ఈ విలేజ్ సెట్లోనే ప్లాన్ చేశారట. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇదిలా ఉంటే... దర్శకుడు బుచ్చిబాబు తండ్రి గురువారం మరణించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. -
దర్శకుడు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి పెదకాపు అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. పెదకాపు మరణంతో బుచ్చిబాబు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కాగా బుచ్చిబాబు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడన్న విషయం తెలిసిందే! ఈయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ఉప్పెన. ఫస్ట్ చిత్రంతోనే రూ.100 కోట్లు కొల్లగొట్టి బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.చదవండి: 45 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కనున్న నటుడు! వచ్చే వారమే ముహూర్తం! -
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన రామ్ చరణ్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేటు పెంచేశాడు. తాను ఇప్పటివరకు తీసుకుంటున్న పారితోషికం ఒకెత్తయితే తర్వాత చేయబోయే మూవీ కోసం మాత్రం ఊహించని మొత్తం అందుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ విషయం ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకీ చరణ్ రెమ్యునరేషన్ ఎంత పెంచాడు? ఏంటి సంగతి? అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: బాలకృష్ణ చీప్ బిహేవియర్.. హీరోయిన్ ని తోసేసి, మద్యం తాాగుతూ)'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. దీని తర్వాత చేస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. దాదాపు మూడేళ్ల నుంచి సెట్స్‌పైనే ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది అస్సలు అర్థం కాలేదు. అయితే ఈ ఏడాది అక్టోబరులోనే ఉండొచ్చని దిల్ రాజు కూతురు తాజాగా రివీల్ చేసింది. ఇకపోతే ఈ మూవీలో చేస్తున్నందుకు గానూ రూ.90 కోట్ల పారితోషికం చరణ్ అందుకుంటున్నాడట.దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తాడు. 'RC16' వర్కింగ్ టైటిల్. జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ మూవీ కోసం చరణ్‌కి ఏకంగా రూ.125 కోట్ల మేర పారితోషికం ఇవ్వబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లలో చరణ్ ఒకడు అవుతాడు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
నేడు ప్రత్యేక కోర్టు ముందుకు కవిత
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడు రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు సోమవారం ఆమెను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. ఉదయం పది గంటలకు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు కవితను ప్రవేశ పెట్టనున్నారు. ఆదివారం విచారణలో భాగంగా ఆడిటర్ బుచ్చిబాబు ఫోను ద్వారా సేకరించిన చాట్లు, మహబూబ్‌నగర్‌లో భూమి ఒప్పందం, ఆప్ నేతలకు ప్రాక్సీ ద్వారా సొమ్ములు చేర్చడం, ఈ క్రమంలో బెదిరింపులకు పాల్పడడం తదితర అంశాలపై కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా సీబీఐ కార్యాలయంలో ఉన్న కవితతో ఆమె భర్త అనిల్, సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్‌రావులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలు చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయగా, ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిలు నిరాకరించింది. రెగ్యులర్ బెయిలుపై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఇటీవల సీబీఐ కూడా కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
కవిత కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన ఆడిటర్ బుచ్చిబాబు
-
RC 16 Launching Ceremony: గ్రాండ్‌గా ప్రారంభమైన బుచ్చి బాబు-రామ్ చరణ్ సినిమా (ఫొటోలు)
-
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబో.. గ్రాండ్‌గా పూజా కార్యక్రమం!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించిన రామ్ చరణ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే ఈ సినిమా తర్వాత చెర్రీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌కు ప్రముఖ దర్శకుడు శంకర్, సుకుమార్, చిరంజీవి, అల్లు అరవింద్, బోనీకపూర్,సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం రామ్‌చరణ్ మాట్లాడారు. బుచ్చిబాబు రాసిన కథ తనకెంతో నచ్చిందన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారని చెర్రీ అన్నారు. కాగా.. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిదే. స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించనుండగా... మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాను వర్కింగ్ టైటిల్ ఆర్సీ16తో రూపొందించనున్నారు. The stunning #RC16 pair looks soo adorable 😍✨@AlwaysRamCharan #JanhviKapoor #RC16PoojaCeremony #GameChanger pic.twitter.com/cdmMcnLajZ — Aℓω︎α︎yѕ🕊️ (@ALWAYSRAM16) March 20, 2024 They Called him a Mad Mann 🔥#RC16 #RC16PoojaCeremony pic.twitter.com/QipGxd9nzx — Raees (@RaeesHere_) March 20, 2024 -
రామ్‌చరణ్ పెద్ది?
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తారు. కాగా ఈ నెల 20న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరగనుందని తెలిసింది. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, ఈ నెల 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌పై స్పష్టత వచ్చే చాన్స్ ఉందని భోగట్టా. అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతున్న ‘గేమ్‌చేంజర్’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. -
ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్!
మెగా హీరో, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే 'గేమ్ ఛేంజర్' తర్వాత చెర్రీ మరో చిత్రానికి ఓకే చెప్పారు. ఉప్పెన్ ఫేమ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో జతకట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు ఆర్సీ16 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా నిలవనుంది. ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇవాళ డైరెక్టర్ బుచ్చిబాబు సనా బర్త్‌డే కావడంతో పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలిపారు. తాజాగా రామ్ చరణ్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ఏడాదిలో మీరు మరింత ప్రేరణ, ఆవిష్కరణలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ చేశారు. ఆర్సీ16 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని.. సరికొత్త ఉత్సాహంతో పనిచేద్దామని ట్విటర్లో రాసుకొచ్చారు. అంతకుముందే ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Warmest birthday wishes to @BuchiBabuSana 🎉 Here's to a year brimming with inspiration and innovation. Let's stir up some excitement with our next film #RC16 ✨ — Ram Charan (@AlwaysRamCharan) February 15, 2024 -
రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్?
హిందీలో నటిగా నిరూపించుకున్న జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగులోనూ సత్తా చాటాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ కపూర్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్లో ఆల్రెడీ పాల్గొన్నారు జాన్వీ. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. కాగా ‘దేవర’ చిత్రం తొలి భాగం విడుదల కాకముందే తెలుగులో మరో పెద్ద సినిమాకు జాన్వీ కపూర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ వేసవిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ ఫైనలైజ్ అయ్యారని తాజా సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెల్లడి కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే అఖిల్ హీరోగా నటించనున్న కొత్త సినిమాలో హీరోయిన్గా జాన్వీ పేరు వినిపిస్తోంది. ఇలా వరుస సినిమాలతో జాన్వీ తెలుగులో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రంగస్థలాన్ని మించి రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ
-
ఆలియా భట్, రామ్ చరణ్ జోడీ రిపీట్?
రాజమౌళి దర్శకత్వంలోని ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం) సినిమాలో రామ్‌చరణ్, ఆలియా భట్ ఓ జంటగా నటించి మెప్పించారు. ఈ ఇద్దరూ మళ్లీ జోడీ కట్టనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఆలియా భట్ పేరు వినిపిస్తోంది. మరి.. రామ్‌చరణ్, ఆలియా భట్ జోడీ రిపీట్ అవుతుందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుందని తెలిసింది. రామ్‌చరణ్ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటించనున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమన్ స్వరకర్త. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్లతో కలిసి వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. -
రామ్‌చరణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో!
రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌ను సంప్రదించింది యూనిట్. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో భాగంగా శివ రాజ్‌కుమార్ వెల్లడించారు. అయితే టాలీవుడ్ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ సినిమాలో రామ్ చరణ్ మెంటర్‌గా శివరాజ్ కుమార్ కనిపించబోతున్నారట. ఈ స్పోర్ట్స్ డ్రామాలో శివన్న గురువు లాంటి పాత్ర పోషిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆయన పాయింటాఫ్ వ్యూలోనే ఫ్లాష్ బ్యాక్ లో కథ ఓపెన్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం. -
బిగ్ బాస్ అర్జున్‌కు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..!
బిగ్ బాస్‌తో వచ్చిన గుర్తింపు కొందరికి వరంలా మారుతుంది. వారి జీవితాన్ని కూడా ఉన్నతస్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పటికే కొందరి విషయంలో అది నిజమైంది కూడా.. ఈ సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌కు ఊహించని అవకాశం దక్కింది. ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్ బాస్ వేదికపైకి గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో అర్జున్‌కు సినిమా ఛాన్స్ ఇచ్చాడు బుచ్చిబాబు... తను రామ్ చరణ్‌తో తీయబోయే సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో అర్జున్ ఎగిరిగంతేశాడు. దీపావళి సందర్భంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన బుచ్చిబాబు.. అర్జున్ ఆట తీరును మెచ్చుకున్నారు. తన కోసం వచ్చినందుకు బుచ్చిబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు అర్జున్. 'మీ ఉప్పెన సినిమాకు అవార్డు వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడానికి రెండు మూడుసార్లు ఆఫీస్‌కు వచ్చాను. కానీ మీరు చెన్నై వెళ్లారని చెప్పారు. ఫోన్ చేద్దామనుకున్నా కుదరలేకపోయింది. ఈలోగా ఉన్నపలంగా బిగ్‌బాస్‌కు రావాల్సి వచ్చింది' అని అర్జున్ అన్నారు. దీనిపై స్పందించిన బుచ్చిబాబు.. 'రామ్ చరణ్ సర్ మూవీలో నువ్వొక సూపర్ పాత్ర చేయబోతున్నావ్. ఫిక్స్ అయిపో' అంటూ పండగ వేళ అర్జున్‌కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్నట్లు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు. దీంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్లు అందరూ కేరింతలు కొట్టారు. గేమ్ చేంజర్ తర్వాత RC 16 షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంబటి అర్జున్ కూడా పలు సీరియల్లతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అర్ధనారి, సుందరి వంటి సీరియల్స్లలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. అంతేకాకుండా గోపీచంద్ 'సౌఖ్యం'లో విలన్‌గానూ మెప్పించాడు. క్రీడా నేపథ్యంలో రూపొందనున్న రామ్ చరణ్ సినిమాలో అర్జున్‌కు ఛాన్స్ దక్కడం గొప్ప విషయమేనని చెప్పవచ్చు. -
నీతోనే నేను..
సూర్య భరత్ చంద్ర, విషిక కోట జంటగా బాబా పీఆర్ దర్శకత్వంలో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. ‘ఎ గేమ్ విత్ క్రైమ్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఐ యామ్ విత్ యూ’ (నీతోనే నేను) పాట లిరికల్ వీడియోను దర్శకుడు బుచ్చిబాబు విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘ఈ పాట కమర్షియల్‌గా ఉంది. సూర్య, విషిక చాలా బాగా చేశారు. సినిమా హిట్ కావాలి’’ అన్నారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జాక్సన్ విజయన్. -
ఏడేళ్ల తర్వాత తెలుగు సినిమాకు ఏఆర్ రెహమాన్!
రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను సెప్టెంబరులో ప్రారంభించాలని యూనిట్ సన్నాహాలు చేస్తోంది. హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, జాన్వీకపూర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ పేరు తాజాగా వినిపిస్తోంది. గతంలో తెలుగులో ‘సూపర్ పోలీస్’,‘నాని’, ‘ఏమాయ చేసావె’ ‘కొమురం పులి’ ‘సాహసం శ్వాసగా సాగిపో’(2016) సినిమాలకు సంగీతం అందించారాయన. ఏడేళ్ల తర్వాత ఏఆర్ రెహమాన్ మరోసారి తెలుగు సినిమాకు సంగీతం అందించనున్నారని టాక్. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. -
ఆసక్తికరంగా 'ప్రత్యర్థి' ట్రైలర్
రవి వర్మ, రొహిత్ బెహల్, అక్షత సోనవానెలు ప్రముఖ పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రత్యర్థి’. శంకర్ ముడావత్ దర్శకత్వ వహించిన ఈ చిత్రాన్ని గాలు పాలు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సంజయ్ సాహ నిర్మించారు. జనవరి 6న రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. నగరంలో జరిగిన మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ఎస్ఐ చనిపోయవడం, ఆ కేసును పరిష్కరిచేందుకు పోలీసులు రంగంలోకి దిగడం వంటివి చూపించడం వల్ల మొదట్లోనే కట్టిపడేసినట్టు అయింది ట్రైలర్. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ట్విస్టులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూడ్‌ను మెయింటైన్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ పాల్ ప్రవీణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. -
బుచ్చిబాబు తో రామ్ చరణ్ సినిమా ..?
-
లైగర్ ఎఫెక్ట్... ఉప్పెన డైరెక్టర్ కథను రిజెక్ట్ చేసిన విజయ్?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఫలితంగా విజయ్ చేయబోయే తర్వాతి ప్రాజెక్ట్స్‌పై కూడా ఈ ప్రభావం గట్టిగానే పడింది. లైగర్ ఫ్లాప్ తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడట ఈ రౌడీ బాయ్. దీంతో ఎంత పెద్ద దర్శకుడైనా సరే కథ నచ్చితే తప్పా సైన్ చేయకూడదని విజయ్ ఫిక్స్ అయ్యాడట. ఈ కారణంగానే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన కథకు కూడా విజయ్ నో చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. కథలో కొన్ని లోపాలు ఉండటంతో సున్నితంగా ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించాడట విజయ్. మరి విజయ్ఘే డైరెక్టర్‌కి ఛాన్స్ ఇవ్వనున్నారో త్వరలోనే తెలియనుంది. -
బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు.. ఇలా సైలెంట్ అయ్యారేంటి?
ఓ సినిమా సెట్స్‌పై ఉండగా లేదా విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలోనే తర్వాతి సినిమా గురించి అనౌన్స్ చేస్తుంటారు కొందరు దర్శకులు. అయితే కొందరు డైరెక్టర్స్ మాత్రం మూడు నాలుగేళ్లుగా తమ తర్వాతి ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ‘వాట్ నెక్ట్స్?’ అనే చర్చ జరగడం కామన్ . మరి ఆ ప్రశ్నకు ఆయా దర్శకులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగులో తమ తర్వాతి సినిమాలపై ఓ క్లారిటీ ఇవ్వని శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, విజయ్ కుమార్ కొండా, సంతోష్ శ్రీనివాస్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, సుజిత్, బుచ్చిబాబు వంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం. లవ్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి హిట్ అందుకున్నారు శ్రీను వైట్ల. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, మంచు విష్ణు, రామ్.. వంటి హీరోలతో వరుసగా చిత్రాలు తీసిన ఆయన నాలుగేళ్లుగా నెమ్మదించారు. వరుణ్ తేజ్‌తో తీసిన ‘మిస్టర్’ (2017), రవితేజతో తెరకెక్కించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (2018) చిత్రాల తర్వాత మంచు విష్ణుతో శ్రీను వైట్ల ‘ఢీ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఢీ అండ్ ఢీ’ని ప్రకటించారు. అయితే ఆ సినిమాని ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ మధ్యలో మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాని పూర్తి చేశారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే.. సున్నితమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎవెషన్స్ యాడ్ చేసి తొలి సినిమాతోనే (కొత్తబంగారు లోకం) హిట్‌కొట్టారు. ఆ తర్వాత వెంకటేశ్, మహేశ్‌బాబులతో మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ‘ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప’ వంటి చిత్రాలు తీశారాయన. వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘నారప్ప’ గత ఏడాది జూలై 20న ఓటీటీలో విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రిలీజై ఏడాది దాటినా తర్వాతి ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు శ్రీకాంత్ అడ్డాల. సేమ్ ఇలానే దర్శకుడు విజయ్ కుమార్ కొండా కూడా ఏడాదికిపైనే అయినా తాజా చిత్రాన్ని ప్రకటించలేదు. నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్రాన్ని తెరకెక్కిం బ్లాక్‌బస్టర్ అందుకున్నారు విజయ్ కుమార్ కొండా. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే’ వంటి సినిమాలు తెరకెక్కించారు. రాజ్ తరుణ్‌తో తీసిన ‘పవర్ ప్లే’ చిత్రం 2021 మార్చి 5న రిలీజ్ అయింది. ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర్ర అవుతున్నా ఆయన తర్వాతి సినిమాపై ఎలాంటి స్పష్టత లేదు. శ్రీకాంత్ అడ్డాల, విజయ్‌కుమార్‌లా తదుపరి చిత్రంపై ఏడాది అవుతున్నా స్పష్టత ఇవ్వని మరో దర్శకుడు ‘బొమ్మరిల్లు భాస్కర్’. అందమైన కుటుంబ కథకి ప్రేమ, భావోద్వేగాలు కలగలిపి ‘బొమ్మరిల్లు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు భాస్కర్. ఆ సినిమానే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ త్రం ఏ రేంజ్లో ఆయనకి గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో ‘పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త’ చిత్రాలు తీశారు. అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ త్రాన్ని తెరకెక్కించారు. 2021 అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే తన నెక్ట్స్ సినిమాపై భాస్కర్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక కెమెరామేన్ నుంచి దర్శకునిగా మారిన సంతోష్ శ్రీనివాస్ కూడా తదుపరి చిత్రం ప్రకటించని దర్శకుల జాబితాలో ఉన్నారు. ‘కందిరీగ, రభస, హైపర్, అల్లుడు అదుర్స్’ వంటి త్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కింన ‘అల్లుడు అదుర్స్’ (2021 జనవరి 15న విడుదలైంది) తర్వాత తన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది? అనే స్పష్టత ఇవ్వలేదాయన. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. సీనియర్లే కాదు.. యువ దర్శకుడు సుజీత్ కూడా మూడేళ్లయినా తన తదుపరి త్రం ప్రకటించలేదు. తొలి చిత్రం ‘రన్ రాజా రన్(2014)’ తో మంచి హిట్ అందుకున్నారు సుజిత్. ఆ సినిమా ఇచ్చిన హిట్‌తో స్టార్ హీరో ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ చిత్రం 2019 ఆగస్టు 30న విడుదలైంది. యాక్షన్, టెక్నికల్ పరంగా అత్యున్నత విలువలతో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఉన్న భారీ అంచనాలను అందుకోలేకపోయింది. ‘సాహో’ విడుదలై మూడేళ్లు అవుతున్నా తన తర్వాతి సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సుజిత్. అయితే పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారని, ఇప్పటికే కథ వినిపించారని టాక్. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రేమకథతో టాలీవుడ్‌కి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు బుచ్చిబాబు. డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా చేసిన బుచ్చిబాబు తొలి చిత్రంతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ చిత్రంతో హీరో హీరోయిన్లుగా పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతీశెట్టి ఫుల్ బిజీ అయిపోయారు. 2021 ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాదిన్నర్ర కావస్తున్నా బుచ్చిబాబు తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. అయితే తన తర్వాతి మూవీ ఎన్టీఆర్‌తో ఉంటుందని, ఇందుకోసం కథ కూడా సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి.. కానీ, దీనిపై అధికారిక ప్రకటన లేదు. వీరితో పాటు వేణు శ్రీరాం, రాహుల్ సంకృత్యాన్, రాధాకృష్ణ కుమార్, పరశురామ్ వంటి దర్శకుల తర్వాతి మూవీస్పైనా క్లారిటీ రావాల్సి ఉంది. వీరిలో వేణు శ్రీరామ్ హీరో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నారని టాక్. నాగచైతన్య హీరోగా పరశురామ్ ఓ మూవీ చేయనున్నారని సమాచారం. -
పుష్ప 2కి శిష్యుడి సాయం.. అంత సీన్ లేదన్న ఉప్పెన డైరెక్టర్
గురుశిష్యులిద్దరూ స్టార్ హీరోల సినిమాలు పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. సుకుమార్ పుష్ప 2 స్క్రిప్ట్ మీద, బుచ్చిబాబు ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ మీద కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు కలిసి చర్చిస్తున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో పుష్ప 2 కోసం సుకుమార్ బుచ్చిబాబు సలహాలు తీసుకుంటున్నాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్స్‌పై బుచ్చిబాబు స్పందించాడు. 'తన గురువుతో కలిసి దిగిన ఫొటో షేర్ చేస్తూ.. ఈ ఫొటో నేను తర్వాత చేయబోయే నా సినిమా కథ గురించి చర్చిస్తున్న సందర్భంలోది. మా గురువుగారు సుకుమార్ సర్ నా కోసం, నా సినిమా కథ కోసం సాయం చేయడానికి వచ్చారు. సుకుమార్ సర్ సినిమా కథలో కూర్చుని చర్చించేంత స్థాయి నాకు లేదు, రాదు. ఆయన నుంచి నేర్చుకోవడమే తప్ప ఆయనకు ఇచ్చేంత లేదు' అని క్లారిటీ ఇచ్చాడు. ఇక పుష్ప సీక్వెల్ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని ఆగస్టులో మొదలుపెట్టాలని భావించారు. కానీ నిర్మాతల మండలి ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్ అని పేర్కొనడంతో చిత్రీకరణ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ photo నేను తరువాత చేయబోయే నాసినిమాకథ Discussion సందర్భంలోది మాగురువుగారు@aryasukku సుకుమార్ Sir నా కోసం నా సినిమా కథ కోసం Help చేయడానికి వచ్చారు. సుకుమార్ Sir సినిమా కథలో కూర్చుని Discussion చేసేంత స్థాయి నాకు లేదు రాదు.ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప , ఆయనకి ఇచ్చేంత లేదు pic.twitter.com/KN7qmbLg6X — BuchiBabuSana (@BuchiBabuSana) July 28, 2022 చదవండి: చైతూతో కలిసి ఉన్న ఇంటినే ఎక్కువ రేటుకు కొనుక్కున్న సామ్ విజయ్ పాడిన ‘లైగర్’ యాటిట్యూడ్ సాంగ్ విన్నారా? చితక్కొట్టేశాడుగా.. -
జోరు పెంచిన ఎన్టీఆర్.. ఇక వరుస సినిమాలతో సందడి
మూడేళ్లుగా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాడు తారక్.ఇప్పుడు ఈ సినిమా పూర్తైంది.సరైన సమయంలో మూవీ రిలీజ్ కానుందని యూనిట్ ప్రకటింది.చరణ్ ఇప్పటికే శంకర్ మేకింగ్ లో కొత్త సినిమా స్టార్ట్ చేసాడు.మరి టైగర్ సంగతి ఏంటి? కొరటాల తో సినిమా ఎప్పుడు? దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ పూర్తైంది. దీంతో రామ్ చరణ్‌తో పాటు ఎన్టీఆర్ కూడా ఫ్రీ అయిపోయాడు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి కొరటాల మేకింగ్ లో ప్యాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేయనున్నాడు.ఈ సినిమాలో టైగర్ స్టూడెంట్ లీడర్‌గా నటించబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. హీరోయిన్ గా ఆలియా భట్ పేరు వినిపిస్తోంది.కొరటాలతో మూవీ తర్వాత చాలా మంది దర్శకులను లైన్ లో పెట్టాడు తారక్. ఇప్పటికే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు మేకింగ్ లోనూ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే సిరీస్ లో తమిళ దర్శకుడు వెట్రీమారన్ మేకింగ్ లోనూ నటించబోతున్నాడట. ఈ మూవీతో కోలీవుడ్ మార్కెట్ ను సీరియస్ గా టార్గెట్ చేయబోతున్నాడు జూనియర్. వడా చెన్నై, అసురన్ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు వెట్రీమారన్. ప్రస్తుతం సూర్యతో వాడివసల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత తారక్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట. -
‘ఉప్పెన’దర్శకుడు స్పీడ్ ఎందుకు తగ్గినట్లు? బుచ్చిబాబు ధైర్యం ఏంటి?
ఉప్పెనతో టాలీవుడ్ కు కనీవినీ ఎరుగని డెబ్యూట్ ఇచ్చాడు దర్శకుడు బుచ్చిబాబు. ఒక కొత్త సినిమాతో ఇటు దర్శకుడు, అటు హీరో హీరోయిన్ అందరూ,ఇండస్ట్రీ షేక్ అయ్యే హిట్ అందుకున్నారు. మెగా హీరో వైష్ణవ్ ఇప్పటికే చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరో వైపు హీరోయిన్ కృతి శెట్టి కూడా టీటౌన్ లో లీడింగ్ యాక్ట్రెస్ గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు మాత్రం పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో దర్శకుడు బుచ్చిబాబు మూవీ కన్ ఫామ్ చేసుకున్నాడని, చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. కాని తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూట్‌తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొరటాలతో సినిమా చేయనున్నాడు. ఆ వెంటనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మూవీ చేయాల్సి ఉంది. అయితే తారక్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ, బుచ్చిబాబు కోసం డేట్స్ కేటాయిస్తాను అని చెప్పాడట.కెరీర్ లో రెండో మూవీకి యంగ్ టైగర్ లాంటి టాప్ స్టార్, డేట్స్ కన్ ఫామ్ చేడయంతో వెయిట్ చేయడంలో తప్పులేదని,ప్రస్తుతానికి తాను రాసుకున్న కథకు మెరుగులు దిద్దుతున్నాడట బుచ్చిబాబు.నెక్ట్స్ ఇయర్ జులై నుంచి వీరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. -
జూ.ఎన్టీఆర్‌కు బుచ్చిబాబు బర్త్‌డే విషెస్, ఫ్యాన్స్‌కు డైరెక్టర్ సర్ప్రైజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు, దర్శకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేగాక ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను వరుసగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి కోమరంభీం ఇంటెన్స్ లుక్‌ను చిత్ర యూనిట్ విడదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా ‘ఉప్పెన’ ఫేం బుచ్చి బాబు సానా ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ అభిమానులకు క్రేజీ అప్డేట్ను అందించాడు. కాగా కొంతకాలం వీరిద్దరి కాంబినేషన్లో ఓ మూవీ వస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామ నేపథ్యంలో రానున్న ఈ మూవీలో ఎన్టీఆర్ 60 ఏళ్ల మాజీ ఆటగాడిగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంత వరకు స్ఫష్టత లేదు. ఈ క్రమంలో ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా బుచ్చిబాబు ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘హ్యాపీ బర్త్‌డే నందమూరి తారకరామరావు గారు. లోకల్ స్టోరీని ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సృష్టించడానికి వెయింటింగ్ సార్’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. అది చూసిన అభిమానులు త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా మూవీ రాబోతుందని అంచన వేస్తూ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఓ మూవీ చేస్తున్నాడు. అంతేగాక ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్‌తో కలిసి ఓ యాక్షన్ ఎంటర్టైన్ చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాతే బుచ్చిబాబుతో సినిమా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Happy Birthday Nandamuri Taraka Ramarao garu Waiting sir..... LET'S CREATE A TREND telling a LOCAL STORY GLOBALLY Thanks for unconditional love and affection sir...@tarak9999 ❤️❤️🤗 pic.twitter.com/3K3SR9zdPL — BuchiBabuSana (@BuchiBabuSana) May 20, 2021 -
ఆ డైరెక్టర్ నేను మంచి స్నేహితులం: అనసూయ
ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ బుల్లితెర యాంకర్‌గా రాణిస్తునే ఇటూ వెండితెరపై అందాలు ఆరబోస్తూ ఉంటుంది. తనదైన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ రంగస్థలం మూవీతో ఒక్కసారిగా స్టార్డమ్ పెంచెసుకుంది. అందులో రంగమ్మత్తగా అనసూయకు ఎంతటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన అనసూయను మోకాళ్లపైకి చీరకట్టుతో రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయిన ఆమెను చూసి అందరూ షాకయ్యారు. అయితే రంగస్థలం షూటింగ్ సమయంలో తనని అందరూ రంగమ్మత్త అని పిలిచేవారని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో మరోసారి ఈ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంది. ఈ సందర్భంగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా గురించి ఓ అసక్తికర విషయం చెప్పింది. అయితే బుచ్చిబాబు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగస్థలం సెట్లో డైరెక్టర్ సుకుమార్‌తో సహా అందరూ తనని రంగమమ్మత్తానే పిలిచేవారని, బుచ్చిబాబు కూడా అత్త అనే పిలిచేవాడని చెప్పింది. మూవీ సెట్లో ఇద్దరం చాలా సరదాగా ఉండేవారమని, రంగస్థలం సమయంలో బుచ్చితో మంచి స్నేహం ఏర్పడిందని చెప్పింది. ‘రంగస్థలం షూటింగ్ నుంచి బుచ్చి, నేను మంచి స్నేహితులమయ్యాం, నా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటుంటాను. చెప్పాలంటే ఇండస్ట్రీలో నాకంత క్లోజ్ అయిన వ్యక్తి కూడా ఆయనే. ఈ క్రమంలో ఉప్పెన షూటింగ్ ఓ సారి మా ఇంటి సమీపంలోనే జరిగింది. అప్పుడు అత్త నేను మీ ఇంటి దగ్గర్లోనే ఉన్నా షూటింగ్ జరుగుతోంది. విజయ్ సేతుపతి కూడా ఉన్నారు ఆయనను కలవోచ్చని రమ్మని పిలిచాడు. వెంటనే నేను షూటింగ్ స్పాట్‌కు వెళ్లాను. అక్కడే విజయ్ సేతుపతిని కలిశాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేగాక విజయ్ సేతుపతి అంటే పిజ్జా సినిమా నుంచే ఇష్టమని, ఆ తర్వాత 96 చూశాకా.. రామ్ పాత్రలో ఆయన ఇంకా నచ్చేశాడని చెప్పింది. అలా జరిగిన పరిచయంతోనే చెన్నైకి వెళ్లినప్పుడు కూడా ఆయనను కలిశానని అనసూయ పేర్కొంది. చదవండి: రెచ్చిపోయిన అనసూయ, ఏకంగా వీధుల్లో ఇలా.. -
ఈ డైరెక్టర్ రూటే సెపరేటు..ఏకంగా రెండో సినిమాకే
తొలి సినిమా ఉప్పెనతోనే హిట్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్.. టాలీవుడ్‌కు వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేశాడు. ఉప్పెనతో హీరో, హీరోయిన్లకు ఎంత క్రేజ్ వచ్చిందో డైరెక్టర్ బుచ్చిబాబుకు సైతం అంతే పేరు ప్రఖ్యాతలు దక్కాయి. దీంతో బుచ్చిబాబుతో పని చేసేందుకు స్టార్ హీరోలు, నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఉప్పెన బంపర్ హిట్‌తో ఇదివరకే డైరెక్టర్ బుచ్చిబాబుకు కాస్ట్లీ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమ బ్యానర్లో ఇంకో సినిమా చేయమని మైత్రీమూవీ మేకర్స్ బుచ్చిబాబును సంప్రదించారట. ఇందుకోసం ఆయనకు 10 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో రెండో సినిమాకే ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోనున్న అతి కొద్దిమంది దర్శకుల్లో ఒకరిగా బుచ్చిబాబు నిలిచారు. తాజా సమాచారం ప్రకారం బుచ్చి తన రెండో సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తో చేయనున్నట్లు సమాచారం. ఇందుకుఓసం ఇప్పటికే స్ర్కిప్ట్‌ను సిద్దం చేశాడట. పిరియాడికల్ స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం హిందీ మూవీ దంగల్ తరహాలో ఉండనుందట. ఇందులో ఎన్టీఆర్ 60 ఏళ్ల మాజీ ఆటగాడి పాత్ర చూట్టు ఈ కథ తిరగనుంది. కాగా ఇటీవల ఎన్టీఆర్‌ను కలిసి బుచ్చి కథ వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు దీనిపై ఎన్టీఆర్ స్పందించలేదని ఆయన గ్రీన్ సిగ్నిల్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమచారం. చదవండి : 'ఉప్పెన' దర్శకుడికి బెంజ్ కారు గిఫ్ట్ అత్యాచారం జరిగితే అది అమ్మాయి తప్పు కాదు : చిన్మయి -
ఎన్టీఆర్ కొత్త సినిమా: 60 ఏళ్ల మాజీ వృద్ధ ఆటగాడిగా..!
దర్శకుడు బుచ్చిబాబు సన మొదటిసారిగా దర్శకత్వం వహించి తెరకెక్కించిన ‘ఉప్పెన’ చిత్రం ఇటీవల విడుదలైన బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో బుచ్చిబాబుతో పని చేసేందుకు స్టార్ హీరోలు, నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో బుచ్చి డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ మూవీ రూపొందనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం బుచ్చి ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బెస్డ్ స్ర్కిప్ట్‌ను సిద్దం చేశాడట. పిరియాడికల్ స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం హిందీ మూవీ దంగల్ తరహాలో ఉండనుందట. ఇందులో ఎన్టీఆర్ 60 ఏళ్ల మాజీ ఆటగాడి పాత్ర చూట్టు ఈ కథ తిరగనుంది. కాగా ఇటీవల ఎన్టీఆర్‌ను కలిసి బుచ్చి కథ వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు దీనిపై ఎన్టీఆర్ స్పందించలేదని ఆయన గ్రీన్ సిగ్నిల్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమచారం. ఒకవేళ అంతా ఒకే అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ సంస్థ నిర్మించనుంది. కాగా బుచ్చి బాబు ఇప్పటికే కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని కోసం ఓ మంచి ప్రేమకథ సిద్దచేయమని బచ్చిబాబుకు ప్రపోజల్ పెట్టినట్లు కడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళీ డైరెక్షన్లో మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ చివరి దశలో ఉండటంతో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్‌తో చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ప్యాన్ ఇండియా రేంజ్లో ఎన్టీఆర్ మూవీ..?! భార్య, కూతురు ఫొటో షేర్ చేసిన బన్నీ ‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’ -
'ఉప్పెన' దర్శకుడికి బెంజ్ కారు గిఫ్ట్
తొలి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్ హిట్ అందించాడు బుచ్చిబాబు. భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ టాలీవుడ్‌కు వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా వంద కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడంతో ఉప్పెన నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ హీరోహీరోయిన్లకు భారీ ఎమౌంట్ గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో వైష్ణవ్ తేజ్‌కు కోటి రూపాయలు, హీరోయిన్ కృతీ శెట్టికి రూ.25 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు బుచ్చిబాబుకు కారు లేదా ఇల్లును ఆఫర్ చేయగా ఆయన కారు తీసుకునేందుకు ఆసక్తి చూపారట. దీంతో తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ బుచ్చిబాబుకు బెంజి జీఎల్సీ కారును బహుమతిగా ఇచ్చారు. దీని విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక కారు తన చేతికి రాగానే తన గురువు సుకుమార్‌ను ఎక్కించుకుని హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొట్టాడు బుచ్చి బాబు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా వుంటే ఆయన తర్వాతి సినిమా కూడా ఇదే బ్యానర్లోనే చేయనున్నాడు. Blockbuster #Uppena Director@BuchiBabuSana is now a proud owner of the luxurious Benz GLC, gifted by his producers @MythriOfficial. The first ride was reserved for his mentor @aryasukku. #BuchiBabu is committed to work for another film under Mythri Movie Makers. pic.twitter.com/pQMbuQzcBN — BARaju (@baraju_SuperHit) March 25, 2021 చదవండి: ఉప్పెన విజయం: వైష్ణవ్, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్ నన్ను పెళ్లి చేసుకుంటావా?: విజయ్ సేతుపతి -
ఉప్పెన విజయం: వైష్ణవ్, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్
డెబ్యూ మూవీతోనే భారీ హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు ‘ఉప్పెన’ హీరో, హీరోయిన్, దర్శకుడు. వైష్ణవ్ తేజ్, ‘బేబమ్మ’ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఉప్పెననే తొలి చిత్రం. భారీ అంచానాల మధ్య విడుదలైన ఈ చిత్రం అదే రేంజ్లో కలెక్షన్స్ సాధించింది. ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉప్పెన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ హీరో, హీరోయిన్లకు ఊహించని.. భారీ సర్ప్రైజ్ ఇచ్చారట. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో వీరిద్దరికి భారీ ఎమౌంట్ గిఫ్ట్‌గా ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో హీరో వైష్ణవ్ తేజ్‌కి కోటి రూపాయలు.. హీరోయిన్ కృతీ శెట్టికి 25 లక్షల రూపాయలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఇప్పటికే చెక్స్‌ని హీరో, హీరోయిన్లకు ఇచ్చినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుకు కూడా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారట. గతంలో బుచ్చి బాబుకు కారు లేదా ఇల్లుని ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘ఉప్పెన’ చిత్రానికి గాను వైష్ణవ్ తేజ్ 50 లక్షల రూపాయల పారీతోషికం తీసుకోగా.. గిఫ్ట్‌గా అంతకు రెట్టింపు అందుకోవడం విశేషం. ఏది ఏమైనా ఉప్పెన విజయం ఈ మెగా హీరోకు ఇండస్ట్రీలో బలమైన పునాది వేసిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రం నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో అల్లు అర్జున్ పుష్ప, మహేష్ బాబు సర్కార్ వారి పాట వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఉన్నాయి. చదవండి: బాలీవుడ్లో రీమేక్ కానున్న ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే? -
‘ఉప్పెన’ మేకింగ్ వీడియో కూడా అదుర్స్!
మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పలు రికార్డులను తిరగరాసింది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ను లాభాల్లో ముంచెత్తింది. లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగానూ నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయానికి ప్లస్ అయింది. విలన్ పాత్రలో కనిపించిన విజయ్ సేతుపతి యాక్టింగ్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగానూ ఉప్పెన రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఉప్పెన మేకింగ్ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొదటి సినిమాతోనే ఎంతో పరిణతితో నటించిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా టీజర్లు, పాటలు సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. కరోనా నిబంధనల సడలింపుతో ఉప్పెన 100 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైంది. ఇలా ప్రతీ అంశం ఉప్పెన విజయంలో భాగమై సునామీలా వసూళ్లు కురిపిస్తుంది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి : (ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు) (వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే?) -
'ఉప్పెన' డైరెక్టర్ రెండో సినిమా హీరో అతడే!
కరోనా భయాన్ని ఉప్పెనలా తరిమి కొట్టాడు బుచ్చిబాబు సానా. లాక్డౌన్ తర్వాత సగటు ప్రేక్షకుడు కరోనా భయంతో థియేటర్‌కు వస్తాడో లేదోనన్న అనుమానాలను ఆయన తన సినిమాతో పటాపంచలు చేశాడు. కథ బాగుంటే కనీస జాగ్రత్తలు పాటించైనా బొమ్మ చూసేందుకు థియేటర్‌కు పరుగెత్తుకుంటూ వస్తారని ఉప్పెన నిరూపించింది. అప్పటివరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న బుచ్చిబాబు సానా తన తొలి చిత్రంతోనే హిట్ డైరెక్టర్‌గా మారిపోయాడు. తనకు భారీ సక్సెస్‌ను తెచ్చిపెట్టిన మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్లోనే మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. అయితే బుచ్చిబాబు రెండో సినిమా ఎవరితో చేస్తారనేది టాలీవుడ్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. అప్పట్లో ఈయన రెండో చిత్రం జూనియర్ ఎన్టీఆర్‌తో అన్న టాక్ వినిపించినప్పటికీ తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య పేరు వినిపిస్తోంది. ఈ మేరకు ఆయనకు కథ వినిపించాడని, అది నచ్చిన చైతూ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం నాగ చైతన్య, సాయిపల్లవితో కలిసి లవ్‌స్టోరీలో నటిస్తున్నాడు. ఇందులో చై, సాయి పల్లవి తెలంగాణ యాసలో సంభాషణలు చెప్తారట. ఏప్రిల్ 16న ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు విక్రమ్ కుమార్ డైరెక్షన్లో థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. చదవండి: ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు ముంబైలో కాస్ట్లీ ఫ్లాట్ కొన్న రష్మిక! -
‘ఉప్పెన’పై మహేశ్ బాబు రివ్యూ
మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచమైన చిత్రం ‘ఉప్పెన’. ఈ నెల 12న విడుదలై అద్భత విజయాన్ని అందుకున్న ఈ మూవీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. ఈ సినిమాపై ఇప్పటికే బాలయ్య మొదలు చాలా మంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ జాబితాలో తాజాగా సూపర్ స్టార్ మహేశ్ కూడా చేరాడు. ఇటీవల ‘ఉప్పెన’ సినిమాను వీక్షించిన మహేశ్.. ఇదో అద్భుత సినిమా అంటూ చిత్ర యూనిట్‌ని కొనియాడాడు. ఉప్పెన సినిమాకు పని చేసిన వాళ్లలో ఒక్కొక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ‘ఉప్పెన.. ఒక్క మాటలో చెప్పాలంటే క్లాసిక్! బుచ్చిబాబు సానా.. మీరు కలకాలం గుర్తుండిపోయే అరుదైన చిత్రాన్ని రూపొందించారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది’, ‘కొత్త వాళ్లైన వైష్ణవ్, కృతిశెట్టి అద్భుత నటన నా మనసును హత్తుకుంది’, ‘ఉప్పెనకు హార్ట్ దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా ఆల్‌టైమ్ గ్రేట్ మ్యూజిక్ స్కోర్స్‌లో ఒకటిగా గుర్తుండిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు అందించిన సంగీతంలో ఇది అత్యుత్తమం డీఎస్పీ. ఇలానే మంచి మ్యూజిక్ అందిస్తూ ఉండండి’, ‘ఇక చివరిగా ఉప్పెన లాంటి సినిమాను నిర్మించిన సుకుమార్ గారికి, మైత్రీ మూవీ మేకర్స్‌కి హ్యాట్సాఫ్. నేను చెప్పినట్టుగా ఇది కలకాలం గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి. మీ అందరినీ చూసి నాకు చాలా గర్వంగా ఉంది’అని ట్విటర్ వేదికగా ఉప్పెన టీంను ప్రశంసించాడు. ఇక సూపర్ స్టార్ మహేశ్ ప్రశంసతో ఉప్పెన టీం గాల్లో తేలిపోతుంది. #Uppena... One word... CLASSIC! @BuchiBabuSana you've made one of those rare timeless films... Proud of you! — Mahesh Babu (@urstrulyMahesh) February 22, 2021 It’s really heartwarming when you see two newcomers come up with stellar performances.... #VaisshnavTej and @IamKrithiShetty... you guys are stars! — Mahesh Babu (@urstrulyMahesh) February 22, 2021 And finally hats off to @aryasukku garu and @MythriOfficial for backing a project like Uppena. Like I said it’s one of those timeless films... Proud of you guys! — Mahesh Babu (@urstrulyMahesh) February 22, 2021 చదవండి : ‘ఉప్పెన’ మూవీ రివ్యూ డీఎస్పీ, కృతీశెట్టికి చిరంజీవి స్పెషల్ సర్ప్రైజ్ -
‘ఉప్పెన’ దర్శకుడికి మరో బంపర్ ఆఫర్
క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చి బాబు సన మొదటిసారిగా దర్శకత్వం వహించి తెరకెక్కించిన ‘ఉప్పెన’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో పరిశ్రమలో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆయనకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నుంచి బుచ్చి బాబుకు భారీ స్థాయిలో బహుమతులు అందనున్న సంగతి తెలిసిందే. ‘డియర్ కామ్రేడ్’, ‘సవ్య సాచి’ చిత్రాల పరాజయం, ఆ తర్వాత లాక్‌డౌన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నష్టాలు చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారిని ‘ఉప్పెన’ లాభాల బాట పట్టించడంతో నిర్మాతలు బుచ్చిబాబును ఇళ్లు కావాలో, కారు కావాలో నిర్ణయించుకోమని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతేగాక ఆయనతో పనిచేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలు క్యూ కడుతున్నారంట. ఇప్పటికే కింగ్ నాగార్జున తన తనయుడు అఖిల్ అక్కినేని కోసం ఓ మంచి ప్రేమకథ సిద్దచేయమని బచ్చిబాబుకు ప్రపోజల్ పెట్టినట్లు వార్తలు వస్తుండగా.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసేందుకు ఆయనకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘నాన్నకు ప్రేమతో..’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాడు. ఈ సమయంలో యంగ్ టైగర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ మంచి స్నేహితులు కూడా అయ్యారంట. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బుచ్చిబాబుతో మూవీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీని కూడా మైత్రీ మూవీస్ మేకర్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో భారీ బడ్జేత్ ఈ చిత్రాన్ని బుచ్చిబాబు రూపొందించనున్నట్లు సమచారం. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాలి మరి. (చదవండి: Mythri Movies: ఉప్పెన దర్శకుడికి బంపరాఫర్!) (మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తారు!) -
'ఉప్పెన' విజయోత్సవ వేడుక ఫోటోలు
-
ఉప్పెన సాంగ్: ఆశి-బేబమ్మల డ్యాన్స్
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: కరోనాతో ఏడాదిగా సినీ పరిశ్రమ పూర్తిస్థాయిలో నష్టపోయిన తరుణంలో ‘ఉప్పెన’ సినిమా విడుదలవడం, అభిమానులు, ప్రేక్షకులు దానిని పెద్దహిట్ చేయడం తెలుగుసినీ ఇండస్ట్రీకి ప్రాణం పోసినట్టయ్యిందని మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అన్నారు. బుధవారం రాత్రి స్థానిక వీఎల్‌పురంలో మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్‌లో శ్రేయాస్ మీడియాస్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఉప్పెన’ సినిమా విజయోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ సారధ్యంలో ఒక్కొక్కపాట సినిమాకు ప్రాణం పోసిందన్నారు. విజయసేతుపతి, హీరోయిన్ కృతిశెట్టి వారి నటనతో ఆకట్టుకున్నారన్నారు. తొలి సినిమా ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు మంచి దర్శకుడిగా, వైష్ణవ్‌తేజ్ మంచినటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. హీరో వైష్ణవ్‌తేజ్ మాట్లాడుతూ సినిమాను పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు, మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ హలో రాజమండ్రి, అందరికీ నమస్కారం బాగున్నారా.. మీరిచ్చిన సపోర్టుకు చాలా థ్యాంక్స్ అన్నారు. Watch Aasi-Bebamma Dance For Nee Kannu Neeli Samudram #UppenaBlockbusterCelebrations Watch Live here - https://t.co/JhAdRek5XV#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @aryasukku @ThisIsDSP @SukumarWritings @MythriOfficial pic.twitter.com/3IMsR44J5x — BARaju (@baraju_SuperHit) February 17, 2021 దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ తన గురువు సుకుమార్, రామ్‌చరణ్ ఇచ్చిన సపోర్టు వల్లే ఉప్పెన సినిమా పెద్ద హిట్ సాధించిందన్నారు. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా ‘నీలిసముద్రం.. ప్రేక్షకుల మనస్సు అందులో పడవ ప్రయాణం’ అంటూ పాడి అలరించారు. రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్‌విప్ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ మార్గాని ఎస్టేట్ గ్రౌండ్లో ఉప్పెన సినిమా విజయోత్సవసభ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. హీరో రామచరణ్‌ను చిరంజీవి ఫ్యాన్స్ తరఫున యేడిద బాబి ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. ముందుగా యాంకర్ శ్యామల వ్యాఖ్యాతగా వ్యవహరించగా, శ్రేయాస్ మీడియా సీఈవో శ్రీనివాస్, డిస్ట్రిబ్యూటర్లు వింటేజ్ శివకుమార్, రామకృష్ణ, ఎల్వీఆర్, సతీష్ పాల్గొన్నారు. చదవండి: Mythri Movies: ఉప్పెన దర్శకుడికి బంపరాఫర్! -
హృతిక్ రోషన్ రికార్డులను బ్రేక్ చేసిన 'ఉప్పెన’
వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమైన ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మెదటి రోజే ఈ మూవీ రికార్డు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టగా.. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు రూ.50 కోట్లు వసూలు చేసి రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగా ఉప్పెన నిలిచింది.ఇప్పటి వరకు డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు రామ్ చరణ్ పేరు మీదే ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన చిరుతతో చరణ్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే 14 ఏళ్లుగా ఆ రిక్డార్డును ఎవరూ టచ్ చేయలేకపోయారు. తాజాగా మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో వారసుడే చిరుత కలెక్షన్లను పూర్తిగా తుడిచేశాడు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. ఉప్పెన సినిమాతో ఆల్ ఇండియా రికార్డులను బ్రేక్ చేశాడు. హృతిక్ రోషన్ తొలి చిత్రం ‘కహో నా ప్యార్ హై’ సినిమా ఇండియా వైడ్‌గా రూ.41 కోట్లు (నెట్) వసూలు చేసింది. భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ఇప్పుడు ఉప్పెన బద్దలుకొట్టింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఏప్పెన రూ.42 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి కొత్త రికార్డులను నమోదు చేసింది. చదవండి : (గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే.) (Mythri Movies: ఉప్పెన దర్శకుడికి బంపరాఫర్!) -
కారు లేదా ఇల్లు: ఉప్పెన దర్శకుడికి ఆఫర్!
కంటెంట్ బాగుంటే చాలు, కొత్త, పాత, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన "ఉప్పెన" చిత్రం బాక్సాఫీస్ మీద దాడి చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తన ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తీసిన ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్ అందుకుంటుందని దర్శకుడు సుకుమార్ గతంలోనే చెప్పాడు. ఇప్పటికైతే హాఫ్ సెంచరీని అవలీలగా దాటేయగా, ఈ సినిమా చాలా బాగుందంటూ పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా వుంటే 'డియర్ కామ్రేడ్', 'సవ్యసాచి' సినిమాలతో నిండా మునిగిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ను ఉప్పెన సునామీలా వచ్చి ఆదుకుంది. ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని పూడ్చుతూ లాభాల బాట పట్టించింది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి.. దర్శకుడు సానా బుచ్చిబాబుకు ప్రత్యేక బహుమతిచ్చేందుకు రెడీ అయ్యారట. ఇల్లు లేదా కారులో ఏది కావాలో కోరుకోమని బుచ్చిబాబును అడిగినట్లు సమాచారం. అయితే ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌కు ఆ రెండూ ఇచ్చినా తప్పు లేదని అంటున్నారు. కాగా మంచి విజయాలు నమోదు చేసుకున్న ఛలో, ప్రతిరోజు పండగే సినిమాలకుగానూ దర్శకులు వెంకీ, మారుతిలకు కార్లు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పది సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బిజీబిజీగా మారింది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో ఓ సినిమా చెయ్యనున్నారు. నేచురల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయతో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్‌తో చేస్తున్న సినిమా ఇటీవలే ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్, నటసింహా నందమూరి బాలకృష్ణ – గోపిచంద్ మలినేని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్, విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబు సానా తన తర్వాతి రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీస్ బ్యానర్లోనే చేయనున్నట్లు సమాచారం. చదవండి: ‘నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా‘నా’బుచ్చిబాబు’ మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తారు! -
‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్ రూ. 50 కోట్లు
మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఈ మూవీ రికార్డు స్టాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. అదే రికార్డు స్థాయిలో వీకెండ్‌కు కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇవాళ దర్శకుడు బుచ్చిబాబు సన పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు మైత్రీ మూవీస్ ట్విటర్ వేదికగా భాకాంక్షలు తెలుపుతూ ‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్లను వెల్లడించింది. ‘మా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, అలాగే ‘ఉప్పెన’ 50 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సందర్భంగా ఆయనకు అభినందనలు’ అంటూ మైత్రీ మూవీస్ ట్వీట్ చేసింది. కాగా క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుని సక్సెస్ టాక్‌తో ముందుకెళుతుంది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. Wishing our Director @BuchiBabuSana a Very Happy Birthday ♥ What better gift than a 50Cr Gross Blockbuster Weekend 🌊 - Team #Uppena #HBDBuchiBabuSana pic.twitter.com/by376EaiEo — Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2021 చదవండి: గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే ‘ఉప్పెన’ ఫస్ట్ డే కలెక్షన్లు.. ఆల్‌టైమ్ రికార్డు -
మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తారు!
‘‘నేను ఎప్పుడూ మా ఇంటి గడప నుంచే కథ వెతుకుతాను. మా ఇంటి లోపల ఏదైనా కథ ఉందా? మా వీధి, మా ఊరు, మా స్నేహితులు.. ఇలా ముందు నా దగ్గర కథే వెతుక్కుంటాను. కల్మషం లేని భావోద్వేగాలతో కూడిన కథే మట్టి కథ. ‘ఉప్పెన’ అలాంటి సినిమాయే’’ అన్నారు బుచ్చిబాబు. వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉప్పెన’. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన విశేషాలు.. ► నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సుకుమార్‌గారు నా లెక్కల మాస్టర్. సినిమాల్లోకి వెళ్లబోతున్నానని చాలా తక్కువమంది స్టూడెంట్స్‌తో ఆయన చెప్పుకునేవారు. వారిలో నేను ఒకడిని. సుకుమార్‌గారు ఇండస్ట్రీకి వచ్చి ‘ఆర్య’ సినిమా తీశారు. డైరెక్ట్‌గా సినిమా అంటే మా ఇంట్లో పంపించరని, నేను ఎమ్బీఏ చదువుకుంటూ సుకుమార్‌గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలు చేశాను. ► కొన్ని తమిళ సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి కథలను మన కంటెంట్‌తో కూడా చెప్పవచ్చు కదా అనిపిస్తుంటుంది. లక్కీగా ‘ఉప్పెన’ సినిమా అలాంటిదే. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అల్లుకున్న ఫ్యామిలీ డ్రామా ‘ఉప్పెన’ సినిమా. కూతురిది ఉప్పెనంత ప్రేమ. తండ్రిది ఉప్పెనంత కోపం. ప్రేమకు హద్దులు లేవని చెప్పడమే ఈ సినిమా కథ. ► చిరంజీవిగారికి ఈ కథ చెప్పినప్పుడు ‘హిట్ ఫార్ములా. నువ్వు తీయడాన్ని బట్టి ఉంటుంది. వైషూ (వైష్ణవ్‌తేజ్) నువ్వు చేస్తావా? లేక నన్ను చేయమంటావా?’ అని వైష్ణవ్ తేజ్‌తో అన్నారు. అంటే.. ఆయన సినిమా చేస్తారని కాదు. అదొక కాంప్లిమెంట్. సినిమా కథ బాగుందని చెప్పడం చిరంజీవిగారి అభిప్రాయం. ► క్యాస్ట్ గురించిన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కానీ పరిధి మేరకు ఉన్నాయి. సెన్సార్ వారు ఒక్క కట్ కూడా చెప్పలేదు. దాదాపు 70మందికి పైగా ఈ సినిమా చూశారు. సినిమా బాగోలేదని ఎవరూ చెప్పలేదు. ‘ఇప్పుడు నా కొడుకు చిన్నవాడు. భవిష్యత్‌లో డైరెక్టర్ అవుతాడో లేదో తెలీదు. నా పెద్దకొడుకు (బుచ్చిని ఉద్దేశించి) సినిమా తీశాడనుకుంటాను’ అని సుకుమార్ అన్నారు. సుకుమార్‌గారితో నాది 20 ఏళ్ల పరిచయం. మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తుంటారు. ఒక డైరెక్టర్‌గా కన్నా కూడా సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నాకు పేరువస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. ► ‘నాన్నకు ప్రేమతో...’ సినిమా షూటింగ్ స్పెయి¯Œ లో జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్‌కు కథ చెప్పాను. అది ‘ఉప్పెన’ కథ కాదు. మైత్రీమూవీ మేకర్స్ సంస్థలో మరో సినిమా చేయబోతున్నాను. -
ఉప్పెన కథ విని షాకయ్యా: చిరంజీవి
‘‘ఉప్పెన’ చూసిన వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి అందరికీ ఈ సినిమా గురించి చెప్పాలనిపించింది. ఈ సినిమా అంత బాగా నచ్చింది. అతిశయోక్తి కాదు.. ఇది దృశ్యకావ్యం’’ అన్నారు చిరంజీవి. వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు నిర్మించాయి. ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ – ‘‘సంవత్సరం పాటు చీకట్లో ఉంది ఇండస్ట్రీ. థియేటర్స్ మూసేయాల్సిన పరిస్థితి. మబ్బు కమ్ముకున్నట్లు అనిపించింది. మళ్లీ శుభారంభం వచ్చింది. థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. కానీ థియేటర్స్‌కి ప్రేక్షకులు వస్తారా? లేదా? అని మేం ఆలోచిస్తుంటే.. ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చారు. సినిమాయే ప్రథమ వినోదం అని నిరూపించారు. ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు. ‘ఉప్పెన’ గురించి చెప్పాలంటే... ఈ కథ విన్నప్పుడు షాకయ్యాను. కరెక్షన్స్ చేయడానికి, ఇన్‌ఫుట్స్ ఇవ్వడానికి ఏమీ లే దు. ఈ కథ అంత బాగా చేశారు. ఎన్నో ప్రేమకథలు చూశాం. కానీ ఇందులో ఉన్న ఎమోషన్స్ మనల్ని కట్టిపడేస్తాయి. మైత్రీ వాళ్లకు ఇది మరో ‘రంగస్థలం’ అవుతుంది. బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభను మెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. ఈ సినిమా తమిళ దర్శకుడు భారతీరాజాను గుర్తు చేసింది. మన మట్టికథలు, నేటివ్ కథలు రావాలి. ‘ఉప్పెన’ మన నేటివ్ కథ. విజయ్ సేతుపతి విలక్షణ నటుడు. హీరోగానే కాదు... పాత్ర బావుంటే ఏ పాత్రైనా చేస్తాడు. మొదటి సినిమాలోనే కృతి బాగా చేసింది. కచ్చితంగా సూపర్‌స్టార్ అవుతుంది. వైష్ణవ్ మా అందరికీ గర్వకారణం. అంత బాగా చేశాడు. బుచ్చిబాబు తనలోని నటనను రాబట్టుకోవడమే కాకుండా, పరిశ్రమకు మంచి నటుడిని అందించారు. వైష్ణవ్ కళ్లల్లో కళ ఉంటుంది. ‘శంకర్ దాదా’లో చిన్న వేషం వేశాడు. అప్పుడే అనిపించింది.. వీడు మంచి యాక్టర్ అవుతాడని. మొదటి సినిమాకే ఇలాంటి సంస్థలో యాక్ట్ చేయడం వైష్ణవ్ అదృష్టం. ఈ సినిమాను పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లింది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. తన పాటలతో సినిమాపై ప్రత్యేక ఆసక్తిని తీసుకొచ్చాడు దేవి. మైత్రీ మూవీస్ అందరికీ నచ్చిన నిర్మాణ సంస్థ. త్వరలోనే వాళ్ల బ్యానర్లో, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. లవ్ యు బుచ్చీ సుకుమార్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. ఈ సినిమా కథను ఆరు గంటలు కూర్చొని చర్చించారు. ఆయన్ను మహావృక్షం అంటారు... అది ఎందుకో అర్థం అవుతోంది. మెగాఫ్యామిలీలో ఆయన జడ్జ్మెంట్ వల్లే చాలామంది హీరోలు రావడం జరిగిందని ‘ఉప్పెన’ సినిమా కథను డిస్కస్ చేసిన తర్వాత అర్థం అయ్యింది. ఆయన చెప్పిన కొన్ని కరెక్షన్స్‌తో ఇంత మంచి సినిమా వచ్చింది. వైష్ణవ్తేజ్ది మంచి ఎక్స్‌ప్రెసివ్ ఫేస్. వైష్ణవ్ మాట్లాడిన తీరు చూస్తుంటే భవిష్యత్‌లో మంచి పొలిటిషియన్ కూడా అవుతాడేమో. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసి, డైరెక్టర్స్ అయిన అందరికీ ఒకటి చెబుతుండేవాడిని. ఎవర్నీ కూడా నేను నా శిష్యులుగా చెప్పుకోలేను అని. ఎవరు వచ్చినా నాకు ఏదో ఒకటి నేర్పి వెళ్లిపోతున్నారు. బుచ్చిబాబుని మాత్రం శిష్యుడని చెప్పుకుంటాను. ఎందుకంటే లెక్కలు చెప్పాను కాబట్టి. అదే నిజం అయ్యింది. తన తోటివారు ఉద్యోగులై బాగా సంపాదించుకుంటున్నారు. వీడు ఏమైపోతాడో అని వాళ్ల అమ్మగారు కంగారు పడుతుండేవారు. నేను ఆవిడను ఓదార్చేవాడిని. నాకు బుచ్చి ‘ఉప్పెన’ కథ చెప్పగానే నా రూమ్ అంతా గంభీరం అయిపోయింది. అంత అద్భుతంగా చెప్పాడు. అప్పుడే రవిగారికి ఫోన్ చేసి, ఇది చిన్న సినిమా కాదు. వందకోట్ల సినిమా అని చెప్పాను. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడని కాదు. వాడికి లెక్కలు చెప్పినందుకు గర్వపడుతున్నాను. లవ్ యూ బుచ్చి. బుచ్చిబాబు ఏం కావాలంటే అది జరిగింది సినిమాలో. దేవి ఇచ్చిన ఒక్కో సాంగ్ ఒక్కో ఆణిముత్యం. ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట ‘ఫేస్ ఆఫ్ ది మూవీ’. నిర్మాతలు బడ్జెట్‌కు వెనకాడలేదు. అందుకే ఇది ఇంతమంచి సినిమా అయ్యింది’’ అన్నారు. మా మావయ్యలకు రుణపడి ఉంటాం వైష్ణవ్‌తేజ్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మగారి గురించి మాట్లాడాలి. ఐ లవ్ యూ మా. నువ్వు చేసిన అన్ని త్యాగాలకు థ్యాంక్స్. నువ్వు లేకపోతే మేం (సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్) లేం. అలాగే మా ముగ్గురు మావయ్యలు మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, నాగేంద్ర మావయ్యలు లేకపోతే నేను, మా అన్నయ్య (సాయిధరమ్‌తేజ్) లేం. మాకు ఏం కావాలన్నా చేసి పెడుతూ ఉండేవారు. నేను, మా అన్న మా ముగ్గురు మావయ్యలకు రుణపడి ఉంటాం. ఈ సినిమాకు కథే హీరో. నేను ఓ క్యారెక్టర్ చేసానంతే. మంచి కథను నా దగ్గరకు తెచ్చినందుకు బుచ్చిసార్కు థ్యాంక్స్. ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన నిర్మాతలకు, హీరోయిన్ కృతీశెట్టితో పాటు టీమ్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకు సోల్ దేవిశ్రీ ప్రసాద్‌గారు. ఆయన పాటల వల్లే మాకు ఇంతమంచి గుర్తింపు. చంద్రబోస్, లిరిసిస్ట్ శ్రీమణిగార్లకు థ్యాంక్స్. సినిమాలో ఉప్పెనంత ప్రేమ, ఉప్పెనంత ఎమోషన్స్ ఉన్నాయి. అందరూ ఇంటికి తీసుకుని వెళ్తారని అనుకుంటున్నాను. ఈ సినిమా నాకు చాలా నేర్పించింది’’ అన్నారు. బుచ్చిబాబు మాట్లాడుతూ – ‘‘సుక్కూ సార్... థ్యాంక్యూ. మీ వల్లే నేను దర్శకుడినయ్యాను. ఎలా రాశానో అలానే తీసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. చిరంజీవిగారు ‘ఉప్పెన’ కథ విని మంచి సలహాలు ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్‌గారికి, మా టీమ్ అందరికీ ధన్యవాదాలు. పవన్ కల్యాణ్‌లా పెద్ద స్టార్ అవుతాడు వైష్ణవ్’’ అన్నారు. ‘‘మొదటి సినిమాకే ఇలాంటి అవకాశం రావడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. వైష్ణవ్ బెస్ట్ కో స్టార్’’ అన్నారు కృతీ శెట్టి. విజయ్ సేతుపతి, కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్, చంద్రబోస్, బాబీ, వెంకీ కుడుముల, శివ నిర్వాణ తదితరులు మాట్లాడారు. గోపీచంద్ మలినేని, హరీశ్ శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (చదవండి: ఉప్పెన ట్రైలర్ వచ్చేసింది..) (చదవండి: ‘ఉప్పెన’ మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ) -
వైఎస్సార్ సీపీలో చేరిన దేవినేని అవినాష్
సాక్షి, తాడేపల్లి: ఇసుక కొరత అంటూ దీక్షకు దిగిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కృష్ణాజిల్లాలో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు యువత అధ్యక్ష పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో దేవినేని అవినాష్‌తో పాటు టీడీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు వైఎస్సార్ సీపీలో చేరారు. వారిద్దరికీ ముఖ్యమంత్రి... కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ...‘రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు. నవరత్నాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నచ్చే పార్టీలో చేరా. వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగు జాడల్లోనే నడుస్తా. టీడీపీలో మా వర్గం నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరిగింది. ఎన్నిసార్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు’ అని అన్నారు. కాగా దేవినేని అవినాష్ ఇవాళ తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ‘గత రెండు నెలలుగా మీడియాతో పాటు సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో నేను టీడీపీని వీడుతున్నాను అంటూ పలు వదంతులు వచ్చాయి. అవి వచ్చాయి అనడం కంటే సృష్టించబడ్డాయి అంటే సబబుగా ఉంటుంది. మరో పక్క ఈ రెండు నెలలు నేను పార్టీ నాకు అప్పగించిన బాధ్యతలు తూచా తప్పకుండా నిర్వహిస్తూనే ఉన్నాను. ఆ వదంతుల వెనుక ఎవరు ఉన్నారు అనేది పార్టీ అధిష్టానానికి పలుసార్లు విన్నవించడం కూడా జరిగింది. ఈ రోజు వరకూ మా సొంత ప్రయోజనాల గురించి ఏరోజూ ఆలోచించకుండా పార్టీ ఎక్కడికి వెళ్లి పోటీ చేయమంటే అక్కడికి వెళ్లి పోటీ చేసి పార్టీ ఆదేశాలే శిరోధార్యంగా నడుచుకున్న విషయం మీకు తెలియంది కాదు. ఇదంతా పక్కన పెడితే మేము మొదటి నుంచి అడిగింది కానీ ఈ రోజు అడుగుతుంది కానీ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఉన్న మా సొంత క్యాడర్‌కి ఏ రోజున అక్కడి స్థానిక నాయకత్వం సముచిత స్థానం కల్పించకపోగా పలు ఇబ్బందులకి గురి చేశారు. ఈ విషయంపై పలుసార్లు మీకు ఇప్పటికే విన్నవించాను. చదవండి: టీడీపీకి దేవినేని అవినాష్ గుడ్‌బై చెప్పిన ప్రతిసారీ తగిన న్యాయం చేస్తాం అని మీరు చెప్పినా వాస్తవ పరిస్థితుల్లో అది కార్యరూపం దాల్చకపోగా ఇక మీదట న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం కూడా ఏ కోశానా కనిపించని పరిస్థితుల్లో, వేలాదిగా ఉన్న మా సొంత అనుచరగణం పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉండటమే కాక ఇకపై పార్టీలో జరిగే అవమానాలు తట్టుకునే ఓపిక లేదు అని పలుమార్లు నా వద్ద వారు విన్నవించుకున్నారు. గత నలభై ఏళ్లుగా మా కుటుంబానికి అండగా నిలబడి మమ్మల్ని నడిపిస్తున్న అనుచరుల మనోభావాలే మాకు అత్యంత ముఖ్యమయిన వారివల్లే నేను కానీ మా కుటుంబం కానీ ఇక్కడ ఉన్నాం. నాకున్న హై కమాండ్ మా కుటుంబ అభిమానులు మాత్రమే అని మరొక్కసారి తెలియచేసుకుంటూ నా తెలుగు యువత అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నన్ను టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించి గుడివాడ తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని దేవినేని అవినాష్ తన లేఖలో పేర్కొన్నారు. -
చంద్రబాబుకు యువనేత షాక్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇసుక దీక్ష చేస్తుండగానే ఆయనకు భారీ షాక్ తగిలింది. యువనేత దేవినేని అవినాష్ గురువారం తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఆయనతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు కూడా టీడీపీ రాజీనామా చేశారు. చంద్రబాబు, లోకేశ్ వైఖరి నచ్చకపోవడంతో వీరు టీడీపీని వీడినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో సరైన ప్రాతినిథ్యం దక్కలేదని కొంతకాలంగా అవినాష్ అసంతృప్తితో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. సీనియర్లతో పాటు యువ నాయకులు టీడీపీని వదిలివెళ్లడం తెలుగు తమ్ముళ్లను కలవరపరుస్తోంది. కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత నెలలో ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీకి రాజీనామా చేసి ఇటీవలే బీజేపీలో చేరిపోయారు. టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా కొద్దిరోజుల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలందరూ తమ పార్టీలోకి వచ్చేస్తారని, త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు బుధవారం వ్యాఖ్యానించారు. (చదవండి: చంద్రబాబు ఎంత కష్టపడినా లాభం లేదు) -
ఇక్కడ అందం అమ్మబడును
అద్దంలో మొహం చూసుకున్నాడు. ఏ మార్పూ లేదు. అనుకున్నంత వికృతమైన మొహం కాదు. అందులో కొంత అందం లేకపోలేదు. పొట్లం విప్పాడు. అందులో అట్టపెట్టె– ఆరంగుళాల పొడవు, నాలుగంగుళాల వెడల్పు. మూత తీశాడు– గుప్పున కొట్టింది. ఇంట్లోకి సరుకులు తెద్దామని బజారుకి బైలుదేరాడు పరంధామయ్య. చల్లబడిన తర్వాత వెడతానన్నాడు. వెంటనే వెళ్లమంది పార్వతమ్మ. అతనికి వెళ్లాలనే వుంది. కాని భార్య తొందరగా వెళ్లమంది కాబట్టి కొంచెం ఆలస్యం చెయ్యడంలో కాస్తంత తృప్తి. సెలవు కోసం వారం అంతా ఎదురుచూస్తూ, తీరా వొచ్చిం తర్వాత ఏమీ చెయ్యక వృథాగా గడిపేశామే అని బాధపడుతూ మళ్లా పని ప్రవాహములో కొట్టుకుపొయ్యే మధ్యతరగతి వ్యక్తి పరంధామయ్య. సెలవు రోజున తన వ్యక్తిత్వానికి అనువైన పని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలో తెలియదు. తనూ, భార్య యింకెవ్వరూ లేకుండా, అలా షికారు తిరిగి సినిమాకెళ్లి, ఏ హోటల్లోనో భోంచేసి, పార్కులో పెళ్లినాటి సంఘటనలు స్మరించుకుని, ఆమె తొడమీద తల ఆనించి పడుకుని ఆకాశంలో నక్షత్రాలకేసి నిశ్చలంగా చూస్తూ విశ్వంలోని నిశ్చలత్వాన్ని తనలో నింపుకుని క్రొత్త సౌందర్యాన్ని, ఆనందాన్ని పొంది... అదే పేచీ–వారి జీవితాల్లో ఆనందం, సౌందర్యం లేవు. శారీరక సౌందర్యం అంత ముఖ్యమైంది కాదంటారు. మరేదో శీలంలో సౌందర్యంట– మనస్సులో వుంటుందిట. బాహ్య సౌందర్యం వుంటేనే ఆ మిగతావి కూడా వుంటాయి. సౌందర్యం ఎట్లా వొస్తుంది? డబ్బుంటే అదే వొస్తుంది. శాస్త్రజ్ఞులు కనుక్కొన్న పరికరాల ద్వారా అందాన్ని కూడా పొందవచ్చు.తన అందం గూర్చి పరంధామయ్యకి బోలెడన్ని శంకలు. అందం స్త్రీది, తెలివి పురుషుడిదీ అనుకునే రోజులు వెళ్లిపోయినై. కొంచెం పొడుగాటి ముక్కు. కాస్తంత పొట్టిదిగా వుంటే ఎంత బావుండును. పెదవులు కొంచెం వంకర. జుత్తు పాపిడ తిన్నగారాదు. కాఫీ హోటలుకు చేరుకున్నాడు. ఆలోచనలతో దూరమే తెలియలేదు. టీ త్రాగాడు. బైలు దేరాడు. తన మాట వొదిలేద్దాం. పార్వతమ్మ అందం విషయం ఆలోచించు. ఆమె అందంగా వుండదు. కనుబొమ్మలకి ఆకారం లేదు. అర్ధచంద్రాకారం ఆకృతి కలిగి దట్టంగా, నల్లగా, స్ఫుటంగా వుండాలి. అలా లేవు. ఆ ముక్కు? కాస్తంత పొట్టిదనే వొప్పుకోవాలి. తన ముక్కులో పొడుగైన ఆ కాస్త భాగం కోసేసి, ఆవిడ ముక్కు మొనకి అతికించివేస్తే ఎంత బాగుంటుంది! ఇంతకీ తను ఎక్కడికి నడుస్తున్నట్లు? సరుకుల కోసం. ముందు ఆ కొట్లో కెడదాం. ఆ సందు మలుపులో. సందు మలుపు తిరగగానే, ఒకరి వెనుక ఒకరు వరుసగా నిలబడ్డ జనం– రోడ్డంతా కమ్మేశారు. ఏం జనం, ఏం జనం? ఏదేనా ఊరోగింపు కాబోలు. వరుసగా నిలబడడం దేనికో? ఇవతల ప్రక్క మొగాళ్ల క్యూ ఫర్లాంగు. అవతల స్త్రీల క్యూ. ఎందుకు నిలబడ్డారో? ‘ఏ అబ్బాయ్– ఏమిటిదంతా?’’ సమాధానం చెప్పకుండా, ఆ కుర్రాడు పరుగెత్తుకెళ్లి క్యూలో కూరుకుపొయ్యాడు. తనకెందుకు? తన దోవను తను పోక. ఇందరు మనుషుల్ని ఒదిలి ఎలా వెళ్లడం? అదే మానవత్వం అంటే. తోటి మానవుడి రహస్యాన్ని పంచుకోవడం. క్యూ ప్రభావం సుడిగాలిలా పరంధామయ్యని చుట్టేసింది. మానవ హృదయం దేన్నో ఆశించి రోదిస్తుంటే తాను చెవులు మూసుకోగలడా! ‘క్యూ చివరలో ఏముందబ్బాయి?’ క్యూ సమరంలో గాయపడి వెనక్కి తిరిగొచ్చిన బాలవీరుడు.‘‘అందం అమ్ముతున్నారుటండి’’ అని బాలవీరుడు కుంటుకుంటూ నిష్క్రమించాడు. పరంధామయ్య పరధ్యానం కట్టిబెట్టి ఒక్క గంతేసి క్యూ చివరలో స్థావరం ఏర్పరచుకున్నాడు. ఒక మజిలీ గడిచింది. మదీనా చేరాడు. మక్కాకి పోవాలి. వెనక మరో పదిగజాల జనం గొలుసు కట్టేసుకున్నారు. తను సౌందర్యం గురించి ఆలోచించటం, సౌందర్యం లభ్యం కావటం– క్యూలో కాలక్షేపం కాదు. ముందువాడి వెన్ను ఎంతసేపని చూడగలం? వెనక్కి తిరిగితే, ఆసామీ మీసాల మధ్య నలిగిన చుట్ట. ఆయన కనుబొమ్మలు చూడు– అదొక పిల్ల అడివి. ఆడాళ్లకి వేరే క్యూ పెట్టారు. పౌరసత్వ బాధ్యతలు గుర్తెరింగిన ప్రజ, ఏమీ తోచకపోతే స్త్రీలకేసి చూస్తూ కూర్చోవచ్చు. క్యూలో నిలబడిం తర్వాత ముందువారిని, వెనక వారిని ఈ క్యూ ఎందుకని అడిగే అధికారం లేదు. చివరిదాకా అనుభవించి, తనకు తానే సత్యం తెలుసుకుని హతమవ్వాలి. అయినా, అందం అమ్మడం ఏమిటో! సరిగ్గా విన్నానా? లేకపోతే యింతమంది స్త్రీలు, పురుషులు యీ క్యూలో అవతరించరు. అందం అమ్మడమేమిటి నా నెత్తి. అందంగా చేసే పరికరాన్ని అమ్మడం అని. వాక్యంలో ఏదో లోపించింది. క్యూలో అడుగు ముందుకు కదిలింది. ఆ ముసలమ్మకి అందం ఎందుకు? వార్ధక్యం, జాడ్యం, మృత్యువు లేకుండా చేసే మార్గం కనుక్కునేటందుకే సిద్ధార్థుడు సంసారం త్యజించి, ధ్యానం సాగించి బుద్ధుడుగా అవతరించాడట. నిజంగా బుద్ధుడు సాగించినది సౌందర్యాన్వేషణే– అది సాధ్యం కాకపోయినప్పుడు, వేరే లోపల అందం, నిర్యాణము, శాంతి అంటూ తత్వచింతనలో పడ్డాడు. మరో రెండు గజాలు పురోగమనం. మరో మూడు. ప్రజ యింక ఆగరు. అందం ఆకలై ముందుకు నెట్టివేస్తోంది. ఏదో వాసన. ఏమిటి చెప్మా! ‘‘కలరా వుండలా?’’ ‘‘ఏమో. గసగసాలు’’. ‘‘అబ్బే కర్పూరం దండలండి’’ ‘‘చమురు కంపు’’ ఒక్కసారి పదిగజాలు. అమ్మయ్య! ఆవిడెవరు? రమణయ్యగారి చెల్లెలా. ఆవిడే. చాలా అందమైంది. ఈమధ్యనే భర్త కాలం చేశాడు. అంత అందమైన భార్యకు భర్తగా వుండేందుకు తగనని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకుంటారు. ఆవిడకేం కావాలో? రెండు గజాల దూరంలో శిఖరం, దైవం సాక్షాత్కారం. కొబ్బరికాయ కొట్టి పూజారి పళ్లెంలో అణా వుంచినట్లు ప్రతివాడూ ఆ కిటికీముందు నిలబడటం, డబ్బు సమర్పించుకోడం, వాడిచ్చిన ప్రసాదం కళ్ల కద్దుకొని– పత్రి పూలూ వగైరా మాదిరి బిల్లు చీటీ యిస్తాడు– దాన్ని చెవులో బదులు జేబులో వుంచుకొని బైటపడటం– అల్లా జరుగుతోంది. ఒక్కొక్క భక్తుడే దూరంగా వెళ్లిపోతున్నాడు. వారి మొహాలలో శాంతి ఆనందం తాండవిస్తున్నాయా? ఇంక ముందు యిద్దరే వున్నారు. పరంధామయ్య సింహద్వారం చేరుకున్నాడు. ఎదురుగా గోడ. దానిలో వో కంత. చెంపలు వేసుకో, కళ్లు మూసుకో, పర్సు తీ– చిల్లర. ‘‘పావలా’’ అన్నాడు దైవం. ఇంత పొట్లం ఏదో చేతిలో పెట్టాడు. పెద్దదే– ఏదో వాసన. దూరంగా, తొందరగా నడిచి వెళ్లాడు. ముందు విశ్రాంతి కావాలి. దాహంగా వుంది. మనుషుల వాసన చొక్కాలో ప్రవేశించింది. ఇందాక హటల్లోకి చేరుకున్నాడు. అద్దంలో మొహం చూసుకున్నాడు. వెనకటిదే. ఏ మార్పూ లేదు. అనుకున్నంత వికృతమైన మొహం కాదు. అందులో కొంత అందం లేకపోలేదు. పొట్లం విప్పాడు. అందులో అట్టపెట్టె– ఆరంగుళాల పొడవు, నాలుగంగుళాల వెడల్పు. మూత తీశాడు– గుప్పున కొట్టింది. అందులో వున్నది ఇంగువ. దాన్ని వర్ణిస్తూ కాగితం. అందం మార్కు ఇంగువనే ఎల్లప్పుడూ వాడండి. సువాసన, నూతనమైన మూలికలు, అత్తరులు జోడించి సమకూర్చిన పరిమళం. భుజించిన మొన్నాడు కూడా దాని పరిమళం వదలదు. మీ వంటకాలలో వాడితే మీ ఇల్లాలి పట్ల ప్రేమ, ఆదరణ పెరుగుతాయి. పరంధామయ్య చాలా సేపటి వరకూ తేరుకోలేదు. కాని తనొక్కడే కాడు. వేలమందిలో తను వొక్కడు. వాళ్లందరూ చేసినపనే తనూ చేశాడు. కించపడటానికేముంది? సరుకులు కొనుక్కుని మెల్లిగా ఇంటికి చేరుకునేటప్పటికి పార్వతమ్మ వంటింట్లో వుంది.‘‘ఇంత ఆలస్యమైందేం?’’ ‘‘ఏమీ లేదు. మెల్లిగా నడుచుకుంటూ వొచ్చాను’’ ‘‘ఇదేమిటి– యి పొట్లం?’’ ‘‘చూడు.’’ ఆవిడ మొహంలో చిరునగవు లేదు. అసంతృప్తిని వొక్క చూపులో వ్యక్తం చెయ్యగల కళాజీవి. ‘‘ఇంత ఇంగువ తెచ్చుకుంటారా ఎవరేనా?’’ ‘‘అంతే యిచ్చాడు వాడు.’’ ‘‘చిన్న పొట్లం అడగలేక పొయ్యారా?’’ ‘‘చిన్న పొట్లం వుంటుందని నాకు తెలియదు.’’ ‘‘ఇంకెప్పుడూ ఇట్లాంటి పని చెయ్యకండి’’ అని పార్వతమ్మ వంటింట్లో కెళ్లింది. సుళువుగా బైట పడినందుకు లోలోన సంతోషపడ్డాడు. ‘‘ఇదిగో చూడండి. నేను తీసుకొచ్చాను– చిన్న పొట్లం’’ అన్నదామె. ‘‘నువ్వూ ఆ క్యూలో నిలబడ్డావా?’’ ‘‘ఆహా. పనిపిల్ల చెప్పింది. ఇంగువ చవగ్గా అమ్ముతున్నారని. ఇదేమిటో చూద్దామని దాన్ని తీసుకొని బైలుదేరాను. క్యూలో నుంచోవడం లేదు ఏం లేదు. ఎలాగో సందు చేసుకొని యీ పొట్లం లాక్కుని వొచ్చింది. ఈ చిన్న పొట్లం దానికిస్తాను. మీరు తెచ్చింది మనకుంటుంది.’’పార్వతమ్మ ఎంతవరకూ నిజం చెప్పిందో పరంధామయ్యకి తెలుసు. తనెంత నిజం చెప్పాడో ఆమె కూడా అంతే. ఇది అన్యోన్యం కాక మరేమిటి కలంపేరు బుచ్చిబాబుతో ప్రసిద్ధులైన శివరాజు వెంకట సుబ్బారావు (1916–1967) ‘సౌందర్యాన్వేషణ’ కథకు సంక్షిప్త రూపం ఇది. స్త్రీ పురుష సంబంధాలు, మానసిక చైతన్యం మీద బుచ్చిబాబు ఎక్కువ దృష్టి పెట్టారు. నన్ను గురించి కథ వ్రాయవూ?, అరకు లోయలో కూలిన శిఖరం, బీ, నిప్పు లేని పొగ ఆయన కథల్లో కొన్ని. ఆయన రాసిన ఒకే ఒక్క నవల ‘చివరకు మిగిలేది’ తెలుగు సాహిత్యంలో ఎన్నదగినది. ‘నా అంతరంగ కథనం’ పేరిట పాక్షిక ఆత్మకథ వెలువరించారు. -
క్రీడాకారులు ఎవ్వరు అధైరపడవద్దు..
సాక్షి, విజయవాడ : క్రీడాకారులు ఎవ్వరు అధైరపడవద్దు.. ఎవ్వరికి అన్యాయం జరగకుండా చూస్తామని కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన చైర్మన్ కడియాల బుచ్చిబాబు చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గతంలో కబడ్డీ అసోసియేషన్‌లో తలెత్తిన వివాదాల కారణంగా స్వచ్చందంగా జిల్లా అసోసియేషన్‌ను రద్దు చేశామన్నారు. ‘ మే 29న కర్నూలులో ఏపీ కబడ్డీ అసోసియేషన్ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా కృష్ణాజిల్లాకు నూతనంగా హడక్ కమిటీని నియమించారు. నూతన అసోసియేషన్‌కు చైర్మన్‌తో పాటు మరో ఆరుగురిని సభ్యులను ఎంపిక చేశారు. ఇంకా వివాదాలకు తావు లేకుండా అసోసియేషన్‌ను ముందుకు తీసుకువెళ్తాం. కబడ్డీలో కృష్ణా జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని’ బుచ్చిబాబు పేర్కొన్నారు. ‘ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్న అసోసియేషన్ రూమ్‌ను హడక్ కమిటీ స్వాధీనం చేసుకుంటుంది. అసోసియేషన్‌లో ఉన్న విభేదాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.. ఇంకా వారు చూసుకుంటారు. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్న హడక్ కమిటీ దృష్టికి తీసుకురావచ్చని’ కడియాల బుచ్చిబాబు తెలిపారు. -
ప్రతిధ్వనించే పుస్తకం
అసలు జీవితానికి అర్థమేమై వుంటుంది?ఈ చింతనే ప్రధానంగా సాగుతుంది ‘చివరికి మిగిలేది’. వ్యక్తిగతమైన విముక్తి ప్రధాన ప్రేరణగా దీన్ని రాసినట్టు బుచ్చిబాబు చెప్పుకున్నారు. తెలుగులో వచ్చిన గొప్ప మనో వైజ్ఞానిక నవలగా ఇది ఆయనకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. ప్రధానంగా కథకుడైన బుచ్చిబాబు రాసిన ఏకైక నవల ఇది. తొలుత ధారావాహికగా వచ్చి 1952లో పుస్తకరూపం దాల్చింది. శీలపు మరకను కలిగివున్న తల్లి గత చరిత్ర దయానిధిని జీవితాంతం వేదనకు గురిచేస్తుంది. తల్లి చేసిన తప్పేమిటో స్పష్టంగా తెలియదు, లేదా రచయితే తెలియనివ్వడు. అంతర్ముఖుడైన దయానిధిలాగే నవలంతా ఒక గుప్తమైన మార్మికత పరుచుకుని ఉంటుంది. అయినప్పటికీ తనకు ఎదురయ్యే దేన్ని కూడా తరచి చూడకుండా దయానిధి ఉండడు. కళ, సౌందర్యం, ప్రకృతి, సమాజం, స్త్రీ, రాజకీయం, అమలిన శృంగారం అన్నింటినీ స్పృశిస్తాడు. దయానిధి తన సుదీర్ఘ జీవిత ప్రయాణంలో అమృతం, కోమలి, ఇందిర, సుశీల, నాగమణి లాంటి స్త్రీల సామీప్యానికి వెళ్తాడు; వెళ్లలేకపోతాడు. వజ్రం రూపంలో సంపద వస్తుందీ పోతుందీ. మనుషుల ద్వేషాన్నీ, దానికి గల కారణాన్నీ అర్థం చేసుకుంటాడు. తనకేం కావాలో తెలియనప్పుడు మానవుడు ద్వేషిస్తాడు. మనిషికి కావాల్సింది మతాలు, దేవుళ్లు, మొక్కుబళ్లు, రాజకీయాలు కావు; మానవుడికి కావాల్సినది దయ, అని తేల్చుకుంటాడు. అమృతం, కోమలి పాత్రలు గుర్తుండిపోతాయి. కథనం తాబేలు నడకలా సాగుతుంది. ఏమీ ప్రత్యేకించి పరుగులు పెడుతూ జరగదు. ప్రతి వాక్యాన్నీ, ప్రతి గమనింపునీ కవితాత్మకంగా మలవాలన్న శైలి బుచ్చిబాబు బలమూ, బలహీనతా రెండూ. జీవితం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటావు, జీవించవు అన్న స్నేహితుడి వాక్యం దయానిధికి పూర్తిగా వర్తిస్తుంది. జీవితంలో మునిగిపోవడానికి మించిన వేరే పరమార్థం జీవితానికి ఏమీలేదు. అలాగని దీని గురించి జిజ్ఞాసువులు మీమాంస పడకుండా ఉండటమూ కష్టమే. జీవితానికి అర్థమేమిటన్నదానికి ప్రత్యేకించి సమాధానం ఏమీ లేదు. ఆ సమాధానాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమూ, అందులో భాగంగా కలిగే కొన్ని అనుభవాలూ, అవి కాగలిగే జ్ఞాపకాలూ, తనతో తాను మనిషి సమాధాన పడటమూ మాత్రమే చివరికి మిగిలేవి. -
అంతరంగమే ఆయన కథనరంగం
జూన్ 14న బుచ్చిబాబు జయంతి కథని, నవలని కళాప్రక్రియగా తీర్చిదిద్దిన ప్రారంభ ఆధునిక రచయితల్లో బుచ్చిబాబు ఒకడు. ఆధునిక రచయితకు వ్యక్తి బాహ్య జీవితం కాదు ప్రధానం. వొక వ్యక్తి బాహ్య జీవితాన్ని అతని ఆంతరంగిక జగత్తు– ఆ జగత్తులోని విభిన్న శక్తులకు కుదిరిన సయన్వయం నిర్ణయిస్తుంది. ఆ సమన్వయం సాధించే వరకు తనతో తానూ, బాహ్య ప్రపంచంతోనూ యేదోరకంగా సంఘర్షణ పడ్తూనే ఉంటాడు. ఆ సంఘర్షణని చిత్రించే ప్రయత్నం చేస్తారు ఆధునిక రచయితలు. ఆధునిక తెలుగు వచన సాహిత్యంలో అతి నవీన మార్గం త్రొక్కిన రచయిత బుచ్చిబాబు. ఆయనకు ముందు ప్రచారంలో ఉన్న వచన సాహిత్యమంతా– ముఖ్యంగా కథ, నవల, కాల్పనికోద్యమంతో ముడిపడినట్టివే. తను నివసిస్తున్న సమాజాన్ని రచయిత నిరసించటం, తను నమ్మిన విధంగా ఈ సమాజాన్ని సంస్కరించాలనే ఆవేశంతో వ్రాయటం కాల్పనికోద్యమ ముఖ్య లక్షణాలు. రచయిత నమ్మిన అభిప్రాయాల్ని ప్రచారం చెయ్యటానికి సాహిత్యం ఒక సాధనంగా ఉండేది. ఈ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో ఎంతో మందిని ప్రభావితం చేసిన ఇద్దరు ముఖ్యులైన రచయితలు – విశ్వనాథ సత్యనారాయణ, గుడిపాటి వెంకటాచలం. వీరిద్దరూ ప్రచారం చేసిన భావాల్లో ఎంతో తీవ్రమైన వైరుధ్యం కన్పించినా– స్థూలంగా వీరిద్దరూ వొకే తరగతికి చెందిన రచయితలు. ధర్మాన్ని పునరుద్ధరించాలని విశ్వనాథ, స్త్రీ స్వాతంత్య్రం, లైంగిక స్వాతంత్య్రం కావాలని చలం కథలూ, నవలలూ రాశారు. అంతేకాని కథని, నవలని కళాప్రక్రియలుగా వాళ్ళు భావించలేదు. నిజమైన కళ ప్రచారం చెయ్యదు. జీవితాన్ని చిత్రిస్తుంది. ఆ చిత్రణ ఒక రసానుభూతిని కల్గిస్తుంది. ఒక జీవిత సత్యాన్ని పాఠకుడిలో ఉద్ధీపింపజేస్తుంది. ఆ చిత్రణ, ఆ రసానుభూతి, ఆ జీవిత సత్యం సమాజ శ్రేయస్సుకు పరోక్షంగా ఉపకరించవచ్చు. బుచ్చిబాబు కథని, నవలని ఇలాంటి కళాప్రక్రియగా తీర్చిదిద్దిన ప్రారంభ ఆధునిక రచయితల్లో ఒకడు. బుచ్చిబాబు తన కథల ద్వారా, నవల ద్వారా యేదోవొక భావాన్ని ప్రచారం చెయ్యటం ఆశయంగా పెట్టుకోలేదు. మానవ జీవితంలోని వొకానొక అంశాన్ని చిత్రించే కళాస్వరూపాలుగా వాటిని స్వీకరించాడు. ఇది కాల్పనికోద్యమం తర్వాత తెలుగులో వచ్చిన ఆధునిక మార్గం. కాల్పనికోద్యమం నుండి తెలుగు సాహిత్యం యెక్కిన మరో మెట్టు. ఇది ఆధునిక యుగం కాబట్టి ఈ యుగంలో వచ్చిన సాహిత్యమంతా ఆధునిక సాహిత్యం కాదు. ఆధునిక రచయితలకు అంతర్ దృష్టి ప్రధానం. జీవితాన్ని స్థూలంగా కాదు– సూక్ష్మంగా పరిశీలించి, అనాది నుండి నేటి వరకు మానవుడు వివిధ రంగాల్లో సాధించిన విజ్ఞానం ద్వారా వివిధ దృక్కోణాల నుండి చూడాలి. ఇదివరకు రచయితలు తమ పాత్రల బాహ్య జీవితంపై దృష్టి ఎక్కువగా కేంద్రీకరించేవాళ్ళు. ఆధునిక రచయితకు వ్యక్తి బాహ్య జీవితం బాహ్య చేష్టలు కాదు ప్రధానం. వ్యక్తుల ఆంతరంగిక జగత్తులో యెన్నో శక్తులు పరస్పరం పోట్లాడుకుంటాయి. వొక వ్యక్తి బాహ్య చేష్టలకు ఈ ఆంతరంగిక జగత్తుతో సంబంధం వుంది. వొక వ్యక్తి బాహ్య జీవితాన్ని అతని ఆంతరంగిక జగత్తు– ఆ జగత్తులోని విభిన్న శక్తులకు కుదిరిన సయన్వయం నిర్ణయిస్తుంది. ప్రతీ వ్యక్తి తన ఆంతరంగిక జగత్తులో– అనగా తనలో తాను వొక సమన్వయాన్ని కుదుర్చుకోవటం, బాహ్యప్రపంచంతోనూ అలాంటి సమన్వయాన్నే కుదుర్చు కోవటం ద్వారా నిజమైన శాంతి సౌఖ్యాలను సాధించగల్గుతాడు. ఆ సమన్వయం సాధించే వరకు తనతో తానూ, బాహ్య ప్రపంచంతోనూ యేదోరకంగా సంఘర్షణ పడ్తూనే ఉంటాడు. ఆ సంఘర్షణని చిత్రించే ప్రయత్నం చేస్తారు ఆధునిక రచయితలు. ఈ ఆధునికోద్యమం 1914 తర్వాత ఆంగ్ల సాహిత్యంలో వచ్చింది. జేమ్స్ జాయిస్, వర్జీనియా ఉల్ఫ్, డి.హెచ్.లారెన్స్ మొదలైన రచయితలు ఈ ఉద్యమాన్ని నడిపి ముఖ్యంగా నవలని గొప్ప కళాప్రక్రియగా తీర్చిదిద్దారు. ఈ ఉద్యమాన్నే 1940 తర్వాత తెలుగులో ప్రవేశపెట్టిన రచయితల్లో ముఖ్యుడు బుచ్చిబాబు. ఆయన ‘చివరకు మిగిలేది’ తెలుగు ఆధునిక నవలా సాహిత్యంలో వొక మైలురాయి. ‘చివరకు మిగిలేది’ బుచ్చిబాబు వ్రాసిన యేకైక నవల. పరవళ్ళు త్రొక్కే గొప్ప భావోద్వేగంతో వ్రాయబడిన నవల. తనని కలవరపెట్టిన కొన్ని సమస్యల నుండి విముక్తి పొందడానికి ఇది వ్రాసానని రచయిత చెప్పుకున్నాడు. చివరకు మిగిలేది వ్రాసి పది సంవత్సరాలు వట్టిపోయాను అన్నాడు. తన ఊహాశక్తిని, సృజనాత్మక శక్తిని, భావనాజగత్తుని సంపూర్ణంగా ‘చివరకు మిగిలేది’కి సమర్పించుకున్నాడు. బుచ్చిబాబు ఇంకో నవల రాయలేకపోయాడంటే ఆశ్చర్యం లేదు. ఒక చోట సోమర్సెట్ మామ్ అన్నాడు: ‘రచయిత తనకున్న సృజనాత్మక శక్తి అనే ఆస్తిని ఎంతో పొదుపుగా వాడుకోవాలి. ఒకే రచనలో ఆ ఆస్తినంతా ఖర్చుపెడితే మరో రచనకు ఏమీ మిగలదు’. బుచ్చిబాబు లేఖిని నుండి మరో నవల రూపకల్పన చేసుకుంటుందని ఎందరు ఎంత ఆశించినా రెండో నవలకు ప్రయత్నమే చెయ్యలేదాయన. ‘చివరకు మిగిలేది’ 1946లో వ్రాయబడినా, పుస్తక రూపంలో 1952లో వచ్చింది. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది యువ రచయితల్ని, విమర్శకుల్ని ప్రభావితం చేసింది. ఎన్నిసార్లు చదివినా క్రొత్త అర్థాల్ని, క్రొత్త ధ్వనుల్ని స్ఫురింపజేసే నవల ఇది. యేదో ఒక భావాన్ని పాఠకుడి మీద రుద్దటం కాకుండా జీవితాన్ని వివిధ దృక్కోణాల నుండి చూపెడుతుంది. బుచ్చిబాబు ఒక నవల, కొన్ని నాటకాలు, ఎన్నో వ్యాసాలు రచించినప్పటికీ ఆయన ప్రధానంగా కథకుడు. 80కి పైగా కథలు రచించాడు. ఏ ఇతర తెలుగు కథకుడు స్పృశించని ఇతివృత్తాల్ని బుచ్చిబాబు తన కథలకు స్వీకరించాడు. ఆయన కథలన్నింటిలోనూ పాత్రల అంతరంగాలు, అధోలోకాలే చిత్రించబడ్డాయి. ఆయన స్పృశించిన పురుష పాత్రల్లోనూ, స్త్రీ పాత్రలోనూ ఏదో ఒక మానసిక సమస్య ఉంటుంది. ఆ సమస్యేమిటో ఆ పాత్రలకు తెలియదు. రచయిత కూడా ఆ సమస్యల గూర్చి స్పష్టంగా చెప్పడు. చెప్పీ చెప్పనట్లుగా చెప్పి ఆ సమస్యేమిటో పాఠకులను అర్థం చేసుకొమ్మంటాడు. ‘కొందరు రచయితలు తమ పాత్రల మనస్తత్వాలను పూర్తిగా పరామర్శించి, వితర్కించి, ప్రతీది బైట పెట్టడం ఒక ఫ్యాషన్‌గా పరిగణిస్తున్నారు. కానీ ఇది పొరపాటనుకుంటాను. ఎవరూ ఎవరికి పూర్తిగా అర్థమవరు. అర్థం అవకపోవడంలోనే ఒక వైచిత్రి ఉంది. ఈ వైచిత్రిని ప్రదర్శించాలన్న లక్ష్యాన్ని రచయిత వొదులుకోకూడదు’ అంటాడు బుచ్చిబాబు ‘కథ దాని కమామీషు’ వ్యాసంలో. బుచ్చిబాబు రచించిన చాలా కథల్లో మానవ ప్రవృత్తిలోని ఈ వైచిత్రినే చిత్రించాడు. ఈ చిత్రణ ఎక్కడా వాచ్యంగా ఉండదు. ‘కథ మళ్లీ మళ్లీ చదివించే ఖండకావ్యంలా ఉండా’లనేది బుచ్చిబాబు దృఢ అభిప్రాయం. అందుకే ఆయన కథలన్నింటిలోనూ కళ్లు జిగేలుమనిపించే ప్రకృతి వర్ణనలుంటాయి. శబ్దాలతో రమణీయ చిత్రాలను నిర్మించడం ఉంటుంది. ఆయన స్వయంగా చిత్రకారుడు కావడం వల్ల కుంచెతోటే కాదు, కలం నుండి జాలువారే శబ్దాలతో కూడా చిత్రాల్ని పాఠకుడి కళ్ల ముందు ఎలా ఆవిష్కరించాలో ఆయనకు తెలుసు. బుచ్చిబాబు కథల్లో కనిపించే మరో లక్షణం మానవ జీవితాన్ని గూర్చిన అనేక వ్యాఖ్యానాల్ని, సూక్తుల్ని పాత్రల నోటివెంట వినిపించడం. ‘అసలు ఈ లోకంలో ఎవరూ ఎవర్ని ప్రేమించలేరు. మనుషులకి కావాల్సింది ప్రేమ కాదు. ప్రేమ శరీరానికి కావాలి. హృదయం కోరేది కాస్తంత దయ, కొంచెం ఆప్యాయత, ఆదరణ అంతే’ అంటాడు కరుణాకారం ‘నిరంతర త్రయం’ కథలో. ఇలాంటి వ్యాఖ్యానాలు ఆయన కథలన్నింటిలోనూ కనిపిస్తాయి. తిలక్ అన్నట్టు ఆయన కథల్లో పాత్రల అంతరాంతర జ్యోతిస్సీమలు బహిర్గతం అవుతాయి. ‘ఎల్లోరాలో ఏకాంత సేవ’, ‘అరకులోయలో కూలిన శిఖరం’, ‘మేడమెట్లు’, ‘కాగితం ముక్కలు – గాజు పెంకులు’, ‘ఆశాప్రియ’, ‘నన్ను గూర్చి కథ వ్రాయవు!’, ‘బీ’, ‘తడిమంటకి పొడినీళ్లు’ మొదలైన కథలు తెలుగు పాఠకుల హృదయాల్లో తరతరాల వరకు పలుకుతూనే ఉంటాయి. - అంపశయ్య నవీన్ -
కథకుడు, నవలాకారుడు
ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక మంచికథకి కావాల్సిన ‘అనుభవం’, సంఘటన, వస్తువు వుండి తీరతాయి. వ్యక్తి సంస్కారాన్ని బట్టి, ఆ అనుభవం వత్తిడి వైశాల్యం నిర్ణీతమవుతాయి. ఆ రెంటికీ సమన్వయం కుదిరినప్పుడు ఒక కథ వూడిపడొచ్చు. గొప్పకథ కాకపోయినా ఆ కథ మంచి కథ కావచ్చు. కానీ అది రచించిన వ్యక్తిని కథకుడు అనలేము. మరి ఎవరు కథకుడు? జీవితంలో తాను తెలుసుకున్న విషయాలను కుదించి, తాను పొందిన అనుభూతిని కళగా మార్చి యితరులతో పంచుకునేటందుకు కృషి చేసేవాడు కథకుడు. కుదించడం, సంక్షిప్తం చెయ్యడం ముఖ్యం. అది లేకుంటే నవలా రచయిత అవగలడు. నవలాకారుడికి కుదించడం అవసరం లేదని కాదు. నవలకీ స్వరూపం, అంతం వుంటాయి. కథకి మల్లేనే నవలాకారుడి అభిమాన పాత్రలు ‘కాలం’, ‘స్థలం’ అనేవి. ఈ రెంటి సమన్వయం సాధించిన పరిణామంతో నిమిత్తం వున్నవాడు నవలాకారుడు. అతని జగత్తు సముద్రం అయితే కథకుడి జగత్తు అందులో ఒక కెరటం. ఎక్కడో మధ్యలో ఎప్పుడు లేస్తుంది– కదుల్తుంది– చుట్టూ వున్న మరికొన్ని తుంపరలని, పిల్ల కెరటాలని తనతో లాక్కుపోతుంది– వెళ్లినకొద్దీ ఆకృతి పెంచుకుంటుంది. దానికొక శిఖరం ఏర్పడుతుంది. మనం చూస్తూ వుండగానే తుంపరల కింద విడి, అవతారం చాలించుకుంటుంది. ఆ క్షణికమైన దృశ్యం చూసేవారిలో ఒక అనుభూతిగా నిలిచిపోతుంది. కెరటాన్ని లేవదీసేవాడు కథకుడు. (బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు మొదటి సంపుటం లోంచి; ప్రచురణ: నవచేతన పబ్లిషింగ్ హౌస్) -
చెట్టూ చేమా.... రచన...
పుస్తకం నుంచి... తుపాను హెచ్చరికలు వినిపిస్తే తప్ప ఆకాశం వైపు చూడని రోజులొచ్చాయి. గ్రహణం రోజు తప్ప చంద్రుణ్ణి పరికించే తీరిక లేని దురదృష్టం. పాఠకులు సరే. రచయితలన్నా చూస్తున్నారా? పాఠకులను అటు చూడమని చెప్తున్నారా. అలాంటి పాత్రలు సృష్టిస్తున్నారా? ఊరటనిచ్చే జీవితాన్ని ప్రేరేపించే ప్రకృతి ప్రేమని బుచ్చిబాబు పలుమార్లు రాశారు. ఆయన ఆత్మకథ ‘నా అంతరంగ కథనం’ నుంచి ఈ వ్యాసఖండం. ‘‘మేం బాపట్లలో ఉన్న రోజులు. స్కూల్లో భూగోళ శాస్త్ర పాఠాలు తప్ప, స్కూలు పాఠాలు నాకెక్కలేదు. పొపకాటు పటల్, సవానా, సస్కాచివాన్, నయగారా, అమెజాన్ అడవులు, జాంబెసి... ఈ పేర్లు మధురంగా ఉండేవి. తరచూ పేలే వెసూవియస్ అగ్నిపర్వతం, దోవ తప్పి ప్రవహించే చైనాలో నదులు, భూకంపాలకు గురి అయ్యే జపాన్, తెల్లవారు చూడని టిబెట్ ప్రాంతం, ట్రాన్స్ సైబీరియన్ రైల్వే- ఇవన్నీ అద్భుతంగా తోచేవి. అగ్నిపర్వతాలు, భూకంపాలు, టార్పెడొలు, ఉత్తర ధ్రువంలో మంచుకొండలు, హిమాలయ శిఖరాల మీద నుండి జారే మంచు నదులు ఇవన్నీ ప్రత్యక్షంగా చూడాలనిపించేది. బాపట్లలోనే కొన్ని రోజులు మా అమ్మమ్మ ఉండేది మాతో. ఆ ఊళ్లో ఆలయంలో ఒక నెలరోజుల పురాణ కాలక్షేపమూ, హరికథలూ జరిగేవి. వాటిని వినేటందుకు బండి మీద అమ్మమ్మను తీసుకు వెళ్లేవాడిని. ఏసూ బేగ్ అనే మా నౌకర్ కూడా మాకు తోడుగా వచ్చేవాడు. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ వచ్చేవారు. స్త్రీలలో చాలామంది వితంతువులే. ఈ హరికథలు, పురాణ కాలక్షేపాలు కేవలం వితంతువుల కోసమే అనుకొనేవాడిని. మొదటి రోజుల్లో నిద్రపోయినా రాను రాను హరిదాసు ఛలోక్తులతో, పిట్టకథలతో ఆకర్షించి, లేచి కూర్చునేటట్టు చేసేవారు. రామాయణ కథలో సీత, ఊర్మిళ, మండోదరి మొదలైన స్త్రీలకి ప్రాముఖ్యం ఉండేది. సీత ఒక గొప్ప వ్యక్తిగా, మహా ఇల్లాలుగా నాలో ఒక అభిప్రాయం ఏర్పడింది. అమెలో హుందాతనం, నమ్రత, అమాయకత్వంతో కూడుకున్న వ్యక్తిత్వం- నాకెంతో గొప్పలక్షణంగా కనబడ్డాయి. ఎందుకా అని అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాను. రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆమె నిరాడంబర జీవి. ఆభరణాలు విడిచేసి మేడలు, మిద్దెలు వదిలేసి నార చీరతో భర్తతో అడవులకు సిద్ధమైంది. రెండు- నాకు మల్లే సీతకి పూరి గుడిసెలు, చెట్లు, మొక్కలు, సెలయేళ్లు, పక్షులు, జంతువులు ఇష్టం. అరటి చెట్లు, లేళ్లు, సెలయేర్లు, పూలు, పిట్టలు- ప్రకృతి కావాలి. ఆమెకి నాగరికత అక్కర్లేదు. అందుకే సీతంటే గౌరవం. ఇలా నాగరికత నుండి ప్రకృతిలోకి పారిపోయే వ్యక్తులన్నా, అట్టివారిని గూర్చిన కథలన్నా నాకెంతో ఇష్టం. అలా నాకు ఇష్టుడైన రచయిత రాబర్టు లూయీ స్టెవెన్సన్. ఈయన గాడిద మీద అడవుల్లో సంచరించాడు. ఒక్కడూ నట్టడివిలో, కొండలోయల్లో, నక్షత్రాలకేసి చూస్తూ, గడ్డిలో పడుకుని, మిణుగురు పురుగుల మైత్రి చేశాడు. సోమర్సెట్ మామ్ రచనలంటే నాకిష్టం ఏర్పడ్డానికి ఆయన ఇల్లాంటి వ్యక్తులని గురించి ఎక్కువగా రాయడమే కారణమనుకుంటాను. ‘మూన్ అండ్ సిక్స్ పెన్’ అనే నవలలో నాయకుడు, పెళ్లాం పిల్లలు- సంసారం త్యజించి నాగరికతకే దూరమైన, నిర్జనమైన స్థలంలోకి పారిపోతాడు. ‘రేజర్స్ ఎడ్జి’ అనే నవలలో నాయకుడు పెద్ద హోదాగల ఉద్యోగం, విద్యాధికురాలై తన్ను ప్రేమించిన స్త్రీని విడిచేసి దేశదిమ్మరై దేన్నో అన్వేషిస్తూ తిరుగుతాడు. అయితే అందరు ఇల్లాగ ప్రకృతిలోకి పారిపోవాలి అనను. కొందరం బస్తీలలో ఉండి నాగరికతను పెంపొందించే సామాజిక విలువల్ని సాధించి, పాటుపడి నిత్య జీవితపు రథచక్రాల్ని నెట్టాల్సిందే. కాని కొందరు ఇల్లా ఉండలేరు. వారికి ప్రశాంత వాతావరణం కావాలి. పోటీ పడలేరు. దానితో వచ్చే పలుకుబడి, హోదా వారికి అక్కరలేదు. విశ్వాన్ని తిలకించడంలో ఆనందం ఉంది. ఆ ఆనందం వారికి కావాలి. సీత ఈ మహదానందాన్ని అనుక్షణమూ అనుభవించగలిగిన మహా ఇల్లాలు. నాగరికత పరాకాష్ఠనందుకున్న ఉన్నత దశలో ద్రౌపది లాంటి స్త్రీ ఆ నాగరికతకి ప్రతినిధిగా బైలుదేరొచ్చుగాని సీత వంటి స్త్రీలు అప్పుడవతరించరు. దీన్నొక ప్రాచీనతత్వం (ప్రిమిటివిజమ్) అనుకున్నా తప్పులేదు. మట్టిలోంచి పుట్టింది. మళ్లా మట్టిలోకే చేరుకుంటుంది సీత. భూగర్భంలో ఉద్భవించి మళ్లా భూదేవిలో ఐక్యం అయినట్లు చూపడం మహా ప్రతిభాశాలికే సాధ్యమౌతుంది. ఆమె జీవితం అంతా ఉద్యానవనాలలోనూ, అడవుల్లోనూ గడిపింది. లంక నుండి తిరిగి వచ్చాక ఎన్నో రోజులు రాజభవనంలో ఉండలేదు. నీ కోర్కె ఏమిటంటే- రుష్యాశ్రమంలోకి వెళ్లాలని ఉందని చెప్పుకుంది. అట్లా కోరిందని ఊహిస్తేనే నా కళ్లంట నీళ్లు తిరుగుతాయి. రేడియోలు, సినిమాలు, కార్లు, విమానాలు, నగలు, చీరలు, పుట్టింటివారికి కానుకలు- ఇవేవీ అడగలేదు. తోటలో, పాకలో ఉండాలని ఉందిట. కంచర్ల గోపన్న (రామదాసు) వెర్రివాడు. సీతమ్మకి చేయిస్తి చింతాకు పతకాము అని రాముడితో మొరెట్టుకున్నాడు. ఆయన రామభక్తుడు. సీతను ఎరగడు. ఎరిగి ఉంటే సీతమ్మకు వేయిస్తి మామిడి తోపు అని పాడి ఉండును. నాగరికతను విడిచేసి ప్రకృతిలోకి పారిపోవాలన్నది పాశ్చాత్య దేశాలలో ఉద్యమంగా లేవ దీసింది ‘రూసో’. టాల్‌స్టాయ్ ఆస్తినంతా వప్పగించేసి, వేరే ఆశ్రమం ఏర్పరుచుకున్నాడు. గాంధీగారు ఆఫ్రికాలో ఫీనిక్స్ ఆశ్రమం ఏర్పరుచుకున్నారు. మనవారిలో వేమన్న ప్రకృతిలోకి పారిపోయి నగ్నంగా జీవించాడు. జవహర్లాల్ నెహ్రూ తన చివరి రోజుల్లో ‘నాలోన కొండల నడుమ తిరుగాడే ఆటవికుడు వొక్కడున్నాడు’ అని ఎక్కడో చెప్పుకున్నాడు. ఆయన కుమార్తె ఇందిరాగాంధీకి ఆటవికుల మధ్య గడపాలన్న కోరిక ఉండేది. అది సాధ్యం కాక ఆటవికులని గురించిన పుస్తకాలు చదవడంలో తృప్తి పడింది. ఈ ప్రాచీనతత్వం ఛాయలు నన్ను కూడా ప్రేరేపించాయి. అందుకే యెంకి, నాయుడుబావల ప్రేమ కథనంగా ‘ఉత్తమ ఇల్లాలు’ నాటకం రాశాను.’’ (ఈ పుస్తకం విశాలాంధ్రలో లభ్యం. వెల: రూ. 55)