నేడు ప్రత్యేక కోర్టు ముందుకు కవిత | Kavithas three day CBI custody is over | Sakshi
Sakshi News home page

నేడు ప్రత్యేక కోర్టు ముందుకు కవిత

Published Mon, Apr 15 2024 3:02 AM | Last Updated on Mon, Apr 15 2024 3:02 AM

Kavithas three day CBI custody is over - Sakshi

ముగిసిన మూడురోజుల సీబీఐ కస్టడీ

కేటీఆర్, అనిల్‌ భేటీ 

సాక్షి, న్యూఢిల్లీ:  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడు రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు సోమవారం ఆమెను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు­పరచనున్నారు. ఉదయం పది గంటలకు న్యా­య­మూర్తి కావేరి బవేజా ముందు కవితను ప్రవేశ పెట్టనున్నారు.

ఆదివారం విచారణలో భాగంగా ఆడిటర్‌ బుచ్చిబాబు ఫోను ద్వారా సేకరించిన చాట్‌లు, మహబూబ్‌నగర్‌లో భూమి ఒప్పందం, ఆప్‌ నేతలకు ప్రాక్సీ ద్వారా సొమ్ములు చేర్చడం, ఈ క్రమంలో బెదిరింపులకు పాల్పడడం తదితర అంశాలపై కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా సీబీఐ కార్యాలయంలో ఉన్న కవితతో ఆమె భర్త అనిల్, సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్‌రావులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలు చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయగా, ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిలు నిరాకరించింది. రెగ్యులర్‌ బెయిలుపై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఇటీవల సీబీఐ కూడా కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement