సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బెయిలు కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటి షన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖ లు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కు కూడా బెయిలు దక్కుతుందని బీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. సిసోడియాకు బెయి లు ఇచ్చిన సమయంలో.. సత్వర విచారణ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించిన నేపథ్యంలో కవిత బెయిలు అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment