29న తీర్పు వెలువరించనున్న ప్రత్యేక కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మరికొందరిపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషిటుపై ఈనెల 29న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవడంపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా రెండోరోజూ మంగళవారం ఈడీ వాదనలు విన్నారు. ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా ఈ కేసులో కవిత పాత్రపై మరోసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
శరత్‌రెడ్డి, బుచి్చబాబు, శ్రీనివాస్‌ల వాంగ్మూలం ఆధారంగా కుంభకోణంలో కవిత కింగ్‌పిన్‌గా వ్యవహరించిన ట్లు తెలిసిందన్నారు. హవాలా రూపంలో డబ్బులు తరలించడంలో ఎవరెవరి పాత్ర ఏంటనేది వివరించారు. వాదనల అనంతరం ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషిటును పరిగణనలోకి తీసుకొనే అంశంపై ఈ నెల 29న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి కావేరి బవేజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment