Delhi Liquor Scam
-
రాజ్యసభ ఎంపీ మిలింద్ దేవ్రాను బరిలో దింపుతున్న ఏక్నాథ్ షిండే
-
ఢిల్లీ లిక్కర్ కేసు: విచారణ నవంబర్ 8కి వాయిదా
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. లిక్కర్ కేసు సీబీఐ ఛార్జ్ షీట్ జరిగిన విచారణకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా , ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్ హాజయ్యారు. శనివారం సీబీఐ ఛార్జ్ షీట్‌పై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా.. అనంతరం కేసును వాయిదా వేశారు. తదుపరి కేసు విచారణ నవంబర్ 8వ తేదీన చేపట్టనున్నట్లు కోర్టు పేర్కొంది.చదవండి: టమాటాలకు పోలీసు బందోబస్తు -
ఢిల్లీ లిక్కర్ కేసు: అభిషేక్ బోయిన్‌పల్లికి ఊరట
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన అభిషేక్ బోయినపల్లికి ఊరట లభించింది. సోమవారం ఆయనకు సుప్రీంకోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. అభిషేక్‌కు ఈ ఏడాది మార్చి 6న సుప్రీం కోర్టు.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆయన మధ్యంతర బెయిల్‌ను పొడగిస్తూ వచ్చింది.తాజాగా అభిషేక్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీ కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. “కేసులోని మిగతా నిందితులందరూ బెయిల్‌పై ఉన్నారు. ఈ విషయం అంత వివాదాస్పదం ఏం కాదు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మేం అభిషేక్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నాం’’ అని తీర్పు ఇచ్చింది.బెయిల్ కోసం షరతులు విధించటంపై ట్రయల్ కోర్టు జడ్జికి అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది.2023, జూలై 3వ తేదీన ఢిల్లీ హైకోర్టు అతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అభిషేక్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. మార్చిలో అభిషేక్ సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా.. దానిని చివరిసారిగా ఆగస్టులో పొడిగించింది. -
ఢిల్లీ సీఎం ఆతిశి
సాక్షి, న్యూఢిల్లీ: సస్పెన్స్ వీడింది. ఢిల్లీ సీఎం పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు ఆతిశీ మార్లీనాకు దక్కింది. పార్టీ శాసనసభాపక్షం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. అనంతరం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన రాజీనామా లేఖ అందజేయడం, ఆ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎల్జేకు ఆతిశి లేఖ సమరి్పంచడం వెంటవెంటనే జరిగిపోయాయి. వారంలోగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం 26, 27 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో లాంఛనంగా మెజారిటీ నిరూపించుకుంటారు. కేజ్రీవాల్ కేబినెట్లో ఆరి్ధకం, విద్య, సాగు నీరు సహా 14 శాఖల బాధ్యతలను మోస్తూ వచి్చన ఆతిశి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల దాకా సీఎంగా ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఢిల్లీకి ఆమె మూడో మహిళా సీఎం. గతంలో బీజేపీ దిగ్గజం సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ సీఎంలుగా చేశారు. మమతా బెనర్జీ (పశి్చమ బెంగాల్) తర్వాత ప్రస్తుతం దేశంలో రెండో మహిళా సీఎం కూడా ఆతిశే కానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఐదు నెలల పై చిలుకు కారాగారవాసం నుంచి కేజ్రీవాల్ వారం క్రితం బెయిల్‌పై బయటికి రావడం, సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. దాంతో తదుపరి సీఎంగా ఆతిశితో పాటు కేజ్రీవాల్ భార్య సునీత తదితర పేర్లు రెండు రోజులుగా తెరపైకొచ్చాయి. మంగళవారం ఆప్ ఎల్పీ భేటీలో కేజ్రీవాల్ సూచన మేరకు ఆతిశి పేరును పార్టీ సీనియర్ నేత దిలీప్ పాండే ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా నిలబడి ఆమోదం తెలిపారు. 2013లో ఆప్ ఆవిర్భావం నుంచి పారీ్టలో ఆతిశి క్రియాశీలంగా ఉన్నారు. 2015 నుంచి కేజ్రీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018 దాకా నాటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చూసిన విద్యా శాఖకు సలహాదారుగా ఉన్నారు. 2020లో కాల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి గెలుపొందారు. మద్యం కుంభకోణంలో మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత ఆమె మంత్రి అయ్యారు. కీలకమైన ఆర్ధిక, విద్య, తాగునీరు సహా 14 శాఖలు చూస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అటు పారీ్టని, ఇటు ప్రభుత్వాన్ని సర్వం తానై నడిపించారు. కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే మా ఏకైక లక్ష్యం: అతిశిఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యాక ఆతిశి మీడియాతో మాట్లాడారు. తన గురువు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యత కట్టబెట్టారు. ఎమ్మెల్యేను చేశారు. మంత్రిని చేశారు. ఇప్పుడిలా సీఎంనూ చేశారు. ఇది ఆప్‌లో మాత్రమే సాధ్యం. సామాన్య కుటుంబం నుంచి వచి్చన నా వంటివారికి మరో పారీ్టలో అయితే కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదు. ఢిల్లీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో సాగుతా. ఆయన్ను తిరిగి సీఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తాం’’ అన్నారు. నిజాయితీపరుడైన కేజ్రీవాల్‌పై తప్పుడు అభియోగాలు మోపారన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించి ఆయన్ను మళ్లీ సీఎం చేయాలని ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం అవి వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మహారాష్ట్రతో పాటే నవంబర్లోనే జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయడం తెలిసిందే. ఆ అవకాశం లేదని ఈసీ వర్గాలంటున్నాయి.మారింది ముఖమే: బీజేపీ సీఎంగా ఆతిశి ఎంపికపై బీజేపీ పెదవి విరిచింది. కేవలం ముఖాన్ని మార్చినంత మాత్రాన పార్టీ స్వభావం మారబోదని పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేందర్ సచ్దేవ అన్నారు. ఈ రాజకీయ జూదంతో కేజ్రీవాల్‌కు లాభించేదేమీ ఉండబోదని ఆయన జోస్యం చెప్పారు. -
ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా మంత్రి అతిషి మర్లేనాను ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ప్రస్తుత సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమె పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో.. కేజ్రీవాల్ సాయంత్రంలోపు తన పదవికి రాజీనామా చేయనున్నారు.ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేడు అపాయింట్మెంట్ కోరారు. సాయంత్రం 4 గంటలకు ఎల్జీతో భేటీ కానున్నారు. గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. అయితే ఎల్జీ ఎంతవేగంగా కేజ్రీవాల్ రాజీనామాపై నిర్ణయం తీసుకుంటే.. అతిషి సీఎంగా ఎప్పుడు ప్రమాణం చేస్తారనేదానిపై స్పష్టత వస్తుంది.ఇక.. ఆప్ నుంచి కొత్త ముఖ్యమంత్రి రేసులో కేజ్రీవాల్ సతీమణి సునీత సహా పలువురి పేర్లు వినిపించాయి. చివరకు అతిషి మర్లెనకు అవకాశం దక్కింది. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ జైలుకు వెళ్లాక.. పాలన కుంటుపడకుండా అతిషీనే చూసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటారని ఆమెకు పేరుంది. ప్రస్తుతం ఆమె విద్యాశాఖతో పాటు పలు మంత్రిత్వ శాఖలు చూసుకుంటున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. తిహార్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మళ్లీ విజయం సాధించిన తర్వాతే సీఎం పదవిని చేపడతానని కేజ్రీవాల్ ప్రకటించారు. ‘ప్రజలు తమ తీర్పును ప్రకటించే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనని స్పష్టం చేశారు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తుగా ఈ నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. నవంబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ ఇప్పటికే డిమాండ్ చేశారు. దీంతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇదీ చదవండి: రాజీనామా వ్యూహమిదే! -
Arvind Kejriwal: రెండ్రోజుల్లో రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల తర్వాత రాజీనామా చేయబోతున్నట్లు వెల్లడించారు. తాను నిజాయతీపరున్ని అని ప్రజలు తీర్పు ఇచ్చేదాకా సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలవడం తెలిసిందే. ఆదివారం భార్య సునీతతో కలిసి ఆయన ఆప్ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రెండు రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశమై కొత్త సీఎంంను ఎంపిక చేస్తానని వెల్లడించారు. కేజ్రీవాల్ ఇంకా ఏమన్నారంటే... నేరస్తుడినని భావిస్తే నాకు ఓటేయకండి ‘‘దేశ ప్రజలను, ఢిల్లీవాసులను అడగాలనుకుంటున్నాను. కేజ్రీవాల్ నిజాయితీపరుడా? లేక నేరస్తుడా? ప్రజలే తీర్పు చెప్పాలి. కొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. ప్రతి గల్లీకి, ప్రతి గడపకూ వెళ్తాను. నిజాయితీపరుడని అనుకుంటే నాకు ఓటేయండి. నేరస్తుడినని భావిస్తే వేయకండి. మీరు వేసే ప్రతి ఓటూ నా నిజాయతీకి సర్టిఫికెట్. ఆప్‌కు ఘనవిజయం కట్టబెట్టడం ద్వారా మీరు నన్ను గెలిపించినప్పుడే నేను ముఖ్యమంత్రి పీఠంపై, మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాం. మా ఇద్దరి విషయంలో నిర్ణయాధికారం ఇక మీ చేతుల్లోనే ఉంది. ఢిల్లీలో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిని మహారాష్ట్రతో పాటు వచ్చే నవంబర్లోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా.సీతలా నాకు అగి్నపరీక్ష ‘‘14 ఏళ్ల వనవాసం తర్వాత సీతాదేవి అగి్నపరీక్ష ఎదుర్కోవాల్సి వచి్చంది. జైలు నుంచి వచ్చాక నేను కూడా అగి్నపరీక్షకు సిద్ధంగా ఉన్నాను. కేజ్రీవాల్ చోర్, అవినీతిపరుడు, భరతమాతకు ద్రోహం చేశాడంటూ నిందలేస్తున్నారు. నేను ‘డబ్బుతో అధికారం, అధికారంతో డబ్బు’ అనే ఆటాడేందుకు రాలేదు. దేశానికి మంచి చేద్దామని వచ్చా. ఆప్‌ను విచి్ఛన్నం చేసేందుకే నన్ను జైలుకు పంపించారు. ఎమ్మెల్యేలను డబ్బుతో కొనడం, సీబీఐ, ఈడీలతో భయపెట్టడం, తప్పుడు కేసులు, జైళ్లకు పంపడం, ప్రభుత్వాలను పడగొట్టడం, చివరికి సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం.. ఇలా ఒక ఫార్మూలా రూపొందించుకున్నారు. నన్ను జైలుకు పంపితే ఢిల్లీలో ఆప్ విచ్ఛిన్నమై ప్రభుత్వం పడిపోతుందని, బీజేపీ ప్రభుత్వం వస్తుందని అనుకున్నారు. కానీ మా పార్టీ, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు విచ్ఛిన్నం కాలేదు. కుట్రలకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యం ఆప్‌కు ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే జైలులో ఉండగా పీఎం పదవికి రాజీనామా చేయలేదు’’.భార్యను సీఎం చేయడానికే డ్రామాలు: బీజేపీ భార్య సునీతను సీఎం చేయడానికి కేజ్రీవాల్ నాటకాలాడుతున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘‘సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగా రాజకీయంగా లబ్ధి కోసమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలా డ్రామాకు తెర తీశారు’’ అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. రాజీనామా చేస్తా అనటమంటే మద్యం కుంభకోణంలో నేరాన్ని ఒప్పుకున్నట్లేనని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. ఆప్‌లో అంతర్గత ఘర్షణలను తట్టుకోలేకే రాజీనామా ప్రకటన చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ఆప్ కొత్త సీఎం ఎవరు? కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న దానిపై చర్చ ప్రారంభమైంది. రేసులో కేజ్రీవాల్ భార్య సునీత, మంత్రులు అతిశీ, గోపాల్ రాయ్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఆప్ వర్గాలు అధికారికంగా స్పందించకున్నా సునీతకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పార్టీ నాయకుడొకరు చెప్పారు. కేజ్రీవాల్ మాదిరిగానే ఐఆర్ఎస్ అధికారిగా చేసిన ఆమెకు ప్రభుత్వాన్ని నడిపే విధానం క్షుణ్ణంగా తెలుసన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో దళితులు, ముస్లింల ప్రాబల్యంగా అధికం గనుక ఆ వర్గాల నుంచి సీఎంను ఎంచుకున్నా ఆశ్చర్యం లేదు’’ అని పరిశీలకులు అంటున్నారు. -
టపాసులతో కేజ్రీవాల్‌కు స్వాగతం.. పోలీసుల కేసు నమోదు
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడంతో శుక్రవారం జైలు నుంచి విడుదల అయిన విషయం తెలిసిందే. ఆప్ ముఖ్య నేతలు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకొని సీఎంకు ఘన స్వాగతం పలికారు.కాగా సీఎం విడుదలపై ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నార్త్ ఢిల్లీలోని సివిల్స్ లైన్స్‌లో సీఎం ఇంటి వద్ద పెద్ద ఎత్తున టపాలు కాల్చి కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు. ఈ క్రమంలో సీఎం నివాసం వెలుపల బాణాసంచా పేల్చడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.బాణసంచా వినియోగంపై ఢిల్లీలో నిషేధం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు అధికారి తెలిపారు.ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యాక స్వాగతం పలికేందుకు ఆయన నివాసం వెలుపల పటాకులు పేల్చడంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.చదవండి: దంచికొట్టిన వానలు.. మెరుగుపడిన ఢిల్లీ గాలి నాణ్యతకాగా లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆరునెలల పాటు జైలుజీవితం గడిపిన ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.. రూ.10లక్షల బాండ్ సమర్పించాలని, కేసు విషయంలో ఎక్కడా మాట్లాడొద్దని.. కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకావాలంటూ సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. -
కేజ్రీవాల్ విడుదల
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ స్కాం కేసులో.. ఇవాళ సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కడంతో ఆప్ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది. భారీగా తీహార్ జైలు వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. వాళ్లకు అభివాదం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘వర్షంలోనూ నా కోసం ఎదురు చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నన్ను జైల్లో బంధించి నా మనోస్థైర్యం దెబ్బ తీయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు నా బలం, నాలో ధైర్యం వంద రేట్లు పెరిగింది’’ ఆయన పేర్కొన్నారు. నేను నిజాయితీపరుడిని కాబట్టే దేవుడు నాకు మద్దతుగా నిలిచాడునన్ను జైల్లో వేస్తే బలహీనపడతానని అనుకున్నారుజైలు గోడలు నన్ను బలహీనపర్చలేవు దేశాన్ని అమ్మే.. విచ్ఛిన్నం శక్తులకు వ్యతిరేకంగా పోరాడతాదేశానికి నా సేవ కొనసాగిస్తాకేజ్రీవాల్కు స్వాగతం పలికిన వాళ్లలో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, మంత్రి అతీషి, సీనియర్ నేత మనీష్ సిసోడియా, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.. తదితరులు ఉన్నారు. #WATCH | Delhi CM and AAP national convener Arvind Kejriwal greets party workers and leaders outside Tihar Jail in DelhiThe Supreme Court granted him bail in the Delhi excise policy case today pic.twitter.com/Ydwlmu6CLN— ANI (@ANI) September 13, 2024 లిక్కర్ స్కాం కేసులో.. మనీలాండరింగ్ అభియోగాలపై ఈ ఏడాది మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది.లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేయగా.. జైలు నుంచి విడుదలయ్యారు.ఆ గడువు ముగియడంతో జూన్ 2న తిరిగి లొంగిపోయారు.ఈ కేసులో జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు దిల్లీ సీఎంకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది.అయితే.. దీనిపై ఈడీ (ED) అభ్యంతరం వ్యక్తంచేయడంతో మరుసటి రోజే దిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది.అనంతరం జూన్ 25న బెయిల్‌పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జులైలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఇక.. ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ.. ఆయన సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉండాల్సి వచ్చింది.దాదాపు ఆరు నెలలపాటు లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కేజ్రీవాల్.. ఎట్టకేలకు బయటకు వచ్చారు. -
సీబీఐపై ఘాటు వ్యాఖ్యలు.. సుప్రీం నోట మళ్లీ అదే మాట!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. ఈ మేరకు సుప్రీంకోర్టు జస్టిస్‌లు సూర్యకాంత్, ఉజ్జల్ భూయన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేజ్రీవాల్‌కు శుక్రవారం పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.బెయిల్‌పై విచారణ సందర్భగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐను ఉద్ధేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. దేశంలో సీబీఐ పరిస్థితిని వర్ణిస్తూ.. ‘పంజరంలో ఉన్న చిలుక (caged parrot) మాదిరి వ్యవహరించకూడదని సూచించారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్సీబీఐ అంటే స్వతంత్రంగా వ్యహరించడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థగా పనిచేస్తుందనే అర్థంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సీబీఐ.. కేంద్ర ప్రభావంతో పనిచేసే ‘బోనులో ఉన్న చిలుక’ కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ అంటే ‘స్వేచ్ఛగా విహరించే చిలుకలా’ వ్యవహరించాలని తెలిపారు. తనపై వ్యక్తం అయిన అనుమానాలను సీబీఐ నివృత్తి చేసుకోవాలన్నారు. అలాగే సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విధానంపై జస్టిస్ భూయాన్ విమర్శలు గుప్పించారు. ఆయన్ను కేవలం జైలులో ఉంచి వేధించాలన్న ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం అరెస్ట్ జరిగినట్లు కనిపిస్తోందన్నారు. అయితే ‘పంజరంలో బంధించిన చిలుక’ పదాన్ని 2013లో సీబీఐపై సుప్రీంకోర్టు ఉపయోగించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రమైనది కాదని కేంద్ర ప్రభుత్వ ప్రభావంతో పని చేస్తుందని వ్యాఖ్యానించింది. కోర్టు పరిశీలనతో ఏకీభవించిన అప్పటి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా.. ఈ వ్యాఖ్యను అంగీకరించారు. సీబీఐ విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న భావనతో ప్రతిపక్షాలు సీబీఐని ‘పంజరంలో చిలుక’ అనే మాటను తరచుగా ఉపయోగిస్తుంటాయి. తాజాగా సుప్రీంకోర్టు విచారణతో ఈ పదబంధం మళ్లీ తెరపైకి వచ్చింది.చదవండి: ఆరు నెలల తర్వాత బయటకు మరోవైపు విచారణ సందర్భంగా బెయిల్‌పై జస్టిస్ సూర్యకాంత్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ అరెస్టు సక్రమైందని తెలిపిన న్యామూర్తి.. సుదీర్ఘంగా జైలులో నిర్బంధించడం అంటే.. వ్యక్తి హక్కులను హరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదని.. ఈడీ కేసులో బెయిల్ లభించిన వెంటనే సీబీఐ అరెస్ట్ చేయడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 21 ప్రకారం సాధారణంగా కోర్టులు స్వేచ్ఛ వైపే మొగ్గుచూపుతాయని తెలిపారు.కాగా లిక్కర్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసులో తొలుత కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అదుపులోకి తీసుకుంది. అనంతరం జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఈడీ కేసులో సీఎంకు జూలై 12న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. సీబీఐ కేసులో ఇప్పటి వరకు బెయిల్ రాకపోవడంతో ఆయన జైలులోనే ఉన్నారు.సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ, బెయిల్ కోసం అభ్యర్థిస్తూ రెండు పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఈ నెల 5న విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్ బయటకు రానున్నారు.ఇదీ చదవండి: అభయ కేసు.. సీబీఐ సంచలన నిర్ణయం -
రేపే కేజ్రీవాల్ బెయిల్ తీర్పు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీం కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు వెల్లడించనుంది. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. రేపు బెయిల్ మంజూరు అయితే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన చేపట్టిన విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం బెయిల్ తీర్పును రిజర్వ్ చేసి రేపు (సెప్టెంబర్ 10)న వెల్లడిస్తామని పేర్కొంది.చదవండి: కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీంలో వాడీవేడి వాదనలు -
కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే..!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆయన జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 25 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. అంతకముందు విధించిన క స్టడీ నేటితో ముగియడంతో తీహార్ జైలు అధికారులు కేజ్రీవాల్‌ను నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. వాదనల అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఇకఇదే కేసులో ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత జూలైలో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. అయితే ఈడీ కేసులో సుప్రీంకోర్టు జూలై 12న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో మాత్రం ఇంకా జైల్లోనే కొనసాగుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత తదితరులు బెయిల్‌పై బయటకి వచ్చారు. -
Supreme Court: బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిలు పిటిషన్‌పై విచారణలో భాగంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వి, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. తొలుత ఎస్వీ రాజు వాదనలు ప్రారంభిస్తూ... ఈ అంశాన్ని తొలుత ట్రయల్ కోర్టు విచారించాలని కోరారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల బెయిల్ ప్రస్తావన తీసుకొస్తూ....బెయిల్ మంజూరుకు ట్రయల్ కోర్టుకు వెళ్లమనడం సరికాదని సింఘ్వి పేర్కొన్నారు. బెయిల్ కోసం మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడం వైకుంఠపాళి ఆటలా ఉంటుందని సిసోడియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై ఎస్వీ రాజు అభ్యంతరం చెబుతూ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లి మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారని కేజ్రీవాల్ కూడా పద్ధతి ప్రకారం వ్యవహరించాల్సిందేనని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టును బైపాస్ చేయడం కేవలం ప్రత్యేక పరిస్థితుల్లోనే జరుగుతుందని ఇక్కడ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం తప్ప ఇంకేం లేదని రాజు తెలిపారు. బెయిల్ కోసం కేజ్రీవాల్ నేరుగా హైకోర్టుకు వెళ్లారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, సీబీఐ వైకుంఠపాళి ఆట ఆడాలని చూస్తోందని సింఘ్వి ఆరోపించారు. సుప్రీంకోర్టు ఒకవేళ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తే.. అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు నైతికస్థైర్యాన్ని అది దెబ్బతీస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అన్నారు. ‘అలా అనకండి. బెయిల్ ఇస్తే హైకోర్టును తక్కువ చేసినట్లు కాదు. ఎలాంటి ఆదేశాలు జారీచేసినా హైకోర్టుకు భంగం కలగనివ్వం’ అని ధర్మాసనం రాజుకు హామీ ఇచ్చింది. అనంతరం తీర్పు రిజర్వుచేస్తున్నట్లు ప్రకటించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
‘ఈరోజుల్లో ట్రంప్ అంటే’.. సుప్రీం కోర్టులో సరదా ఘటన
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజీవాల్ బెయిల్ పిటిషన్‌తో పాటు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జరిపింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు వింటున్న సమయంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. విచారణ సందర్భంగా వాదనలు మళ్లీ ప్రారంభించాలని కేజ్రీవాల్ పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పట్టుపట్టారు. జీవించే హక్కు, స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఇలా మాట్లాడుతున్న క్రమంలో ట్రంప్ (అమెరికా మాజీ అధ్యక్షుడు) ప్రస్తావన వచ్చింది. దీంతో ఆయన చాకచక్యంగా ఈ రోజుల్లో ట్రంప్ అనే పదం చాలా ప్రమాదకరంగా మారిందని చమత్కరించారు. ట్రంప్ అనే పదంపై సీనియర్ న్యాయవాది చేసిన వ్యాఖ్యతో ఒక్కసారిగా కోర్టు హాలులో ఉన్న న్యాయవాదులు నవ్వారు.ఇక.. ఈ పిటిషన్‌పై ఇరు వర్గాల నుంచి సుధీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేజ్రీవాల బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 10న తీర్పు వెల్లడించనుంది. -
కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీంలో వాడీవేడి వాదనలు.. తీర్పు రిజర్వు
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజీవాల్ బెయిల్ పిటిషన్‌తో పాటు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదించారు. ఇరు వర్గాల నుంచి సుధీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేజ్రీవాల బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 10న తీర్పు వెల్లడించనుంది.ఎలాంటి ఆధారాలు లేకుండా సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిందని అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. ఇది అరుదైన సంఘటనగా అభివర్ణించారు. కఠినమైన మనీలాండరింగ్ చట్టం కింద ఢిల్లీ ముఖ్యమంత్రి రెండుసార్లు బెయిల్ పొందారని, కానీ సీబీఐ ఆయన్ను ‘బీమా అరెస్టు’(ముందస్తు) చేసిందని మండిపడ్డారు.సింఘ్వీ వాదనలు..ఈ కేసులో రెండేళ్ల తర్వాత కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మూడు కోర్టు ఉత్తర్వులు మాకు అనుకూలంగా ఉన్నాయి. అయినా బీమా అరెస్టు కింద( ఆకస్మిక) సీబీఐ కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకుంది. కాబట్టి ఆయన్ని ఎప్పటికీ జైలులో ఉంచవచ్చని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.41ఏ కింద కేజ్రీవాల్‌ను నిందితుడిగా విచారించాలని సీబీఐ దరఖాస్తు చేసుకుంది. అరెస్ట్ చేయాలని ముందుగా అనుకోలేదు. కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నప్పుడు కేవలం ఆయన్ను విచారించేందుకు మాత్రమే కోర్టు అనుమతించింది.41ఏ దరఖాస్తు ప్రకారం సీబీఐ సీఎంను మూడు గంటలు విచారించారు. కానీ వారి దగ్గర 41ఏ నోటీసు లేదు. మరి అంత అకస్మాత్తుగా కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట చేశారు. ఇది బీమా అరెస్ట్, హడావిడి అరెస్ట్ కాకుంటే మరెంటీ?కేజ్రీవాల్ దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందా? సాక్ష్యాలను తారుమారు చేస్తాడా? అతను సాక్షులను ప్రభావితం చేస్తాడా? సుప్రీంకోర్టు మూడు ప్రశ్నల గురించి సుప్రీంకోర్టు ఆలోచించాలి.సీబీఐ అరెస్టుకు ప్రధాన కారణం కేజ్రీవాల్ సహకరించకపోవడమే. ఒక వ్యక్తి తనను తాను నేరారోపణ చేసుకోవాలని ఎలా అనుకుంటారు.అరవింద్ కేజ్రీవాల్ ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి. ఎక్కడికి పారిపోలేడు. ట్యాంపరింగ్ కుదరదు, లక్షల డాక్యుమెంట్లు ఉన్నాయి, ఐదు చార్జిషీట్లు దాఖలయ్యాయి. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం కూడా ఉండదు. బెయిల్ కోసం మూడు తీర్పు మాకు అనుకూలంగా ఉన్నాయి.కేజ్రీవాల్‌కు రెండుసార్లు బెయిల్ పొందారు. పీఎంఎల్ఏ సెక్షన్ 45 కింద సుప్రీంకోర్టు ఓసారి బెయిల్ ఇచ్చింది. కేవలం ఇన్సురెన్స్ (ముందస్తు, హడావిడీ) అరెస్టు మాత్రమే. అతని అరెస్ట్‌ను సమర్ధించేందుకు అంతకుముంచి దర్యాప్తు సంస్థ కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు చూపించలేదు. ఈ కేసులో మిగతా నిందితులందరూ(విజయ్ నాయర్, మనీష్ సిసోడియా, బుచ్చి బాబు, సంజయ్ సింగ్, కవిత) విడుదలయ్యారు.లిక్కర్ పాలసీకి సబంధించిన ఈడీ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా.. సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘ఒకరు కస్టడీలో ఉన్నప్పుడు .. మళ్లీ అరెస్ట్ చేయాలంటే కోర్టు అనుమతి కావాలి. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్‌లో ఏదో ఉంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.సీబీఐ సెక్షన్ 41, 41ఏ లను పాటించకుండా అర్నేష్ కుమార్, యాంటిల్ తదితర తీర్పులను ఉల్లంఘించి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది.సీబీఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ కోసం ముందు మనీష్ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లారు కానీ కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ఆ పని చేయవలేదని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి కేసుల్లో తాము జోక్యం చేసుకోలేం తిరిగి ట్రయల్ కోర్టుకు వెళ్లండి అంటూ సుప్రీంకోర్టు చెప్పిన కేసులు చాలా ఉన్నాయని పేర్కొన్నారు.కేజ్రీవాల్ ను సెషన్స్ కోర్టుకు వెళ్లకుండానే హైకోర్టును ఆశ్రయించాడు. ఇది నా ప్రాథమిక అభ్యంతరం. మెరిట్ల దృష్ట్యా ట్రయల్ కోర్ట్ దీనిని మొదట విచారించాల్సి ఉంది. అసాధారణమైన కేసుల్లో మాత్రమే హైకోర్టు పరిశీలిస్తుంది. సాధారణ కేసుల్లో ముందుగా సెషన్స్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.కేజ్రీవాల్ ముందు సుప్రీంకోర్టుకు వచ్చారు. తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారు, ఇప్పుడు ఇక విషయాన్ని ఈ కోర్టు నిర్ణయించాలి. ఈ మేరకు కవిత కేసును ప్రస్తావిస్తూ.. ముందుగా ఆమె ట్రయల్ కోర్టుకు వెళ్లారు. అక్కడ తిరస్కరణ ఎదురవ్వడంతో హైకోర్టు మెట్లెక్కారు. అక్కడా ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు.ఎస్పీ రాజు వాదనలపై జస్టిస్ కాంత్ స్పందిస్తూ..ఒకరిని ట్రయల్ కోర్టుకు పంపాలనుకుంటే అప్పుడే హైకోర్టు నిర్ణయాత్మకంగా ఆలోచించాల్సి ఉండేది. ఇక్కడ మెయింటెనబిలిటీకి సంబంధించిన ప్రశ్న కూడా నిర్ణయించుకోవాలి.చట్టం ముందు అందరూ సమానులే. ఎవరూ ప్రత్యేక వ్యక్తులు కారు. ఏ వ్యక్తికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఉండదు. కేవలం ముఖ్యమంత్రి కావడం వల్లే కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. సాధారణ ప్రజలు ట్రయల్ కోర్టుకు వెళతారు. వారంతా సుప్రీంకోర్టుకు రాలేరు.కేజ్రీవాల్ రిమాండ్ దరఖాస్తును అందించాం, అందులో అరెస్టుకు సంబంధించిన వివరణాత్మక ఆధారాలు ఉన్నాయి. సాక్ష్యాలను తారుమారు చేసిప్పుడు లేదా సాక్షులను బెదిరించినప్పుడు. వారెంట్ లేకుండా సరైన దర్యాప్తు కోసం అరెస్టు చేయవచ్చు. ఈ కేసు ఆ వర్గంలోకి వస్తుంది.అరవింద్ కేజ్రీవాల్ ఛార్జ్ షీట్ కాపీని జతచేయలేదు. దానిని దాచినందున అతని బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలిఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తే, అది ఢిల్లీ హైకోర్టును నిలదీసినట్టే’ అంటూ వాదనలు వినిపించారు.అయితే లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో సీఎంకు సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ కేసులోనూ సుప్రీం ముఖ్యమంత్రి బెయిల్ మంజూరు చేస్తే కేజ్రీవాల్ ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: విజయ్ నాయర్‌కు సుప్రీంకోర్టు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కమ్యూనికేషన్ ఇంచార్జి, వ్యాపారవేత్త విజయ్ నాయర్‌కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘకాలం పాటు జైలు శిక్ష, విచారణలో జాప్యాన్ని కీలక కారణాలుగా చూపుతూ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.కాగా లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న నాయర్.. 23 నెలలుగా తిహార్ జైల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అండర్ ట్రయల్‌గా అతన్ని ఎక్కువ కాలం జైలులో ఉంచలేరని, విచారణ శిక్షగా మారకూడదని సుప్రీం న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. న్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ సకాలంలో విచారణను పూర్తి చేయలేకపోయిందని, దాదాపు 350 మంది సాక్షులను విచారించాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు ఈ కేసులో ఇతర నిందితులైన మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు పరిగణలోకి తీసుకుంది.‘30 అక్టోబర్ 2023న 6 నుంచి 8 నెలల్లో విచారణ ముగిస్తామని ఈడీ కోర్టుకు హామీ ఇచ్చింది. అయితే విచారణ ఇంకా ప్రారంభం కాలేదని అర్థం అవుతోంది.ఈ కేసులో దాదాపు 40 మందిని నిందితులుగా చేర్చారు. దాదాపు 350 మంది సాక్షులను విచారించాలని ప్రాసిక్యూషన్ కోరుతోంది.ఈ కేసులో పిటిషనర్ 23 నెలల పాటు కస్టడీలో ఉన్నాడు. విచారణ ప్రారంభించకుండా అతనిని అండర్ ట్రయల్‌గా నిర్బంధించడం శిక్షా విధానం కాదు. పిటిషనర్‌ను విచారణ ప్రారంభించకుండానే జైలులో ఉంచితే బెయిల్ రూల్, జైలు మినహాయింపు అనే సార్వత్రిక నియమం ఓడిపోతుంది.ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛా హక్కు అనేది ఒక పవిత్రమైన హక్కు. ఇది పీఎంఎల్ఏ వంటి ప్రత్యేక చట్టాల ప్రకారం కఠినమైన నిబంధనలు రూపొందించబడిన సందర్భాల్లో కూడా దీనిని గౌరవించాల్సిన అవసరం ఉంది’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ, ఈడీ కేసులో విజయ్ నాయర్ నిందితుడిగా ఉన్నారు. నవంబర్ 2022లో సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. కానీ ఈడీ కేసులో గతేడాది జూలైలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంను ఆశ్రయించారు. -
బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై తాను చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలకు సంబంధించి పత్రికల్లో వచి్చన కథనాలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తనకు న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉందని, కోర్టు భావనను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘భారత న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆగస్టు 29, 2024న పలు పత్రికల్లో నా పేరిట వచి్చన వార్తల ఆధారంగా గౌరవ న్యాయస్థానం విచక్షణను నేను ప్రశ్నించినట్టుగా కోర్టు భావించడాన్ని అర్థం చేసుకోగలను. న్యాయ ప్రక్రియ పట్ల నాకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని మరోమారు తెలియజేస్తున్నాను. పత్రికల్లో ఆ వ్యాఖ్యలను అసందర్భంగా నాకు ఆపాదించారు. న్యాయవ్యవస్థ, ఆ వ్యవస్థకున్న స్వతంత్రతపై నాకు అపార గౌరవం ఉంది. రాజ్యాంగాన్ని సంపూర్ణంగా విశ్వసించే నేను న్యాయ వ్యవస్థ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాను..’ అని సీఎం పేర్కొన్నారు. -
కవిత కేసు వాదించిన లాయర్ ఎవరు?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ సర్కార్ లేకపోతే కాంగ్రెస్ దేశాన్ని ఏడు ముక్కలు చేసేదని సంచలన కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. రాష్ట్రం కోసం త్యాగం చేసిన ప్రతీ ఒక్కరినీ బీఆర్ఎస్ మర్చిపోయిందన్నారు. కార్యకర్తల త్యాగాల పునాదుల మీద బీజేపీ నిర్మాణం జరిగిందని చెప్పుకొచ్చారు.కాగా, బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ పార్టీలో కొత్త తరం రావాలి. పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతీ కార్యకర్త భాగస్వామ్యం కావాలి. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల కష్టం వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 76 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. ఎంఐఎపీ లేకుండా చేయాలంటే పాతబస్తీలో బీజేపీ సభ్యత్వం పెరగాలి. బీజేపీ లేకుంటే దేశాన్ని కాంగ్రెస్ ఏడు ముక్కలు చేసేది. చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి అన్నదే బీజేపీ పార్టీ లక్ష్యం. కార్యకర్తల త్యాగాల పునాదుల మీద బీజేపీ నిర్మాణం జరిగింది. పార్టీ కోసం త్యాగం చేసిన ప్రతీ కార్యకర్తను బీజేపీ గుర్తుంచుకుంటుంది. సభ్యత్వం చేయాలని కోరే హక్కు బీజేపీకి మాత్రమే ఉంది. సభ్యత్వ నమోదు చేసిన వారికే భవిష్యత్ ఉంటుంది. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కోసం త్యాగం చేసిన కార్యకర్తలను ఆ పార్టీ నేతలు గుర్తించుకోరు. త్యాగం చేసిన ప్రతి ఒక్కరినీ బీఆర్ఎస్ మరిచిపోయింది. కాంగ్రెస్‌కు గుర్తుకువచ్చేది కేవలం నెహ్రూ, రాజీవ్ గాంధీలే. బీఆర్ఎస్కు గుర్తుకు వచ్చేది కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ రావులే. ప్రస్తుతం తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా కంపెనీ అంటూ సెటైర్లు వేశారు.కవితకు బెయిల్ రావడం బీజేపీకి ఏం సంబంధం?. రాజకీయ నాయకులు భయపడేది కేవలం న్యాయస్థానాలకే. వ్యక్తులు చెబితే న్యాయస్థానాలు బెయిల్ ఇస్తాయా?. న్యాయస్థానాలను అగౌరవపరచవద్దు. కవిత బెయిల్ కోసం వాదించింది అభిషేక్ సింఘ్వీ. ఆయననే ఎందుకు రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది?. బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందనే అభిషేక్ సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాట ముచ్చట అయిపోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసిపోవడం ఖాయం. బీజేపీ కొట్లడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం అంశంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. అలాగే, న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉంది అంటూ సీఎం కామెంట్స్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం ఉంది. నా వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు వక్రీకరించాయి. సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశ్యం నాకు లేదు. ఇలా జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. పత్రికల్లో వార్తల పట్ల బేషరతుగా నా విచారం వ్యక్తం చేస్తున్నాను. అలాంటి తప్పుడు వ్యాఖ్యలను నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. I have the highest regard and full faith in the Indian Judiciary. I understand that certain press reports dated 29th August, 2024 containing comments attributed to me have given the impression that I am questioning the judicial wisdom of the Hon’ble Court.I reiterate that I am…— Revanth Reddy (@revanth_anumula) August 30, 2024 ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందన్న రేవంత్ వ్యాఖ్యలను, ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీని ప్రశ్నించింది. రాజకీయాల్లోకి కోర్టులను ఎందుకు లాగుతారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు జారీ చేయాలా? అని నిలదీసింది. తమ ఆదేశాలపై రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోబోమని తేల్చిచెప్పింది. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. -
నా బిడ్డొచ్చింది.. కవితను హత్తుకుని భావోద్వేగానికి గురైన శోభమ్మ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ/శంషాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం ఢిల్లీలో సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, భర్త అనిల్, కుమారుడితో పాటు పార్టీ కీలక నేతలతో కలిసి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరిన కవిత.. సాయంత్రం 5.30కు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఎయిర్ పోర్టు వద్ద కవితకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. సీఎం.. సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన కవిత సాయంత్రం ఏడు గంటలకు బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.అమ్మకు పాదాభివందనం.. సోదరుడికి రాఖీ.. కవిత రాకకు మునుపే ఆమె నివాసానికి కేసీఆర్ సతీమణి శోభమ్మ, కేటీఆర్ సతీమణి శైలిమ ఇతర కుటుంబ సభ్యులు చేరుకున్నారు. కవితను కలిసేందుకు నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావడంతో సందడి నెలకొంది. డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్యాల నడుమ ఇంటికి చేరుకున్న కవితకు శోభమ్మ, శైలిమతో పాటు ఇతర కుటుంబ సభ్యులు గుమ్మడి కాయతో దిష్టితీసి హారతి పట్టారు. తల్లి, వదినను కవిత ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. శోభమ్మకు పాదాభివందనం చేశారు. కేటీఆర్ సోదరి కవిత చేయిపట్టుకుని కార్యకర్తల నినాదాల నడుమ ఇంట్లోకి తోడ్కొని వెళ్లారు. సోదరుడు కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు కవిత గురువారం ఎర్రవల్లి నివాసానికి వెళ్లనున్నారు. సుమారు ఐదున్నర నెలల తర్వాత కేసీఆర్‌తో కవిత భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. కాగా ఆమె రెండు రోజుల పాటు ఎర్రవల్లి నివాసంలో తన తల్లిదండ్రులతోనే ఉండనున్నారు. మరోవైపు గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో పార్టీ ముఖ్య నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే నేతలకు విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.ప్రజాక్షేత్రంలో బలంగా పనిచేస్తా: కవితప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తాను ఏ విషయంలోనూ, ఎలాంటి తప్పు చేయలేదని, అన్ని అపవాదుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. న్యాయం, ధర్మం ఖచ్చితంగా గెలిచి తీరుతుందని, నిజం నిలకడ మీద ప్రజలకు తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసమస్యలపై జరిగే పోరాటంలో పాల్గొంటానని చెప్పారు. తాను కేసీఆర్ బిడ్డనని వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. తనకు వెన్నుదన్నుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తనపై కుట్ర చేసిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని అన్నారు. నా చెల్లెలు ఫైటర్అంతకుముందు బుధవారం ఉదయం కవిత హస్తినలో బిజీబిజీగా గడిపారు. ఆమె విడుదల విషయాన్ని తెలుసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం ఉదయం జిల్లాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో ఆమె కొద్దిసేపు ముచ్చటించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదున్నర నెలల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు. కేటీఆర్, కవితలతో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర భేటీ అయ్యారు. కవిత జైలు నుంచి విడుదల కావడంతో తనకెంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఇటీవలి పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన విశేషాలను వివరించారు. హైదరాబాద్ బయలుదేరే ముందు సోదరుడు కేటీఆర్‌తో కవిత కొద్దిసేపు ముచ్చటించారు. మరోసారి కవితను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా చెల్లెలు ఫైటర్ .. పట్టు వదలని విక్రమార్కురాలు..’ అంటూ ఆశీర్వదించారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణ వాయిదా
ఢిల్లి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు వేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణను సెప్టెంబర్ 11 తేదీకి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. బుధవారం ట్రయల్ కోర్టు చేపట్టిన విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కొన్ని డాక్యుమెంట్స్ సరిగా లేవని, కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీతో ఉన్న పత్రాలను ఇవ్వాలని నిందితుల న్యాయవాదులు కోర్టును కోరారు. సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్లను వారికి అందజేయాలని జడ్జి కావేరి భావేజా అదేశించారు. -
కేటీఆర్‌తో కలిసి హైదరాబాద్ బయలుదేరిన కవిత..
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ నుంచి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు బయలుదేరారు. కేటీఆర్, భర్త అనిత్, కుటుంబ సభ్యులతో కలిసి కవిత విమానాశ్రయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. నా పోరాటం కొనసాగుతుంది. నిజం కచ్చితంగా గెలుస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకోవాల్సి ఉంది. సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యావాదాలు. జై తెలంగాణ’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | BRS leader K Kavitha along with party leader and her brother KT Rama Rao in Delhi(Video source: BRS) pic.twitter.com/xYedikX7Ee— ANI (@ANI) August 28, 2024నేడు 500 కార్లతో భారీ ర్యాలీ కవిత జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో సందడి నెలకొంది.జైలు నుంచి విడుదల..ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజులపాటు ఢిల్లీ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరుచేసింది. ఈ క్రమంలో తీహార్ జైలు నుంచి విడుదల అనంతరం కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..‘నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను, కార్యకర్తల్ని, మీడియాను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఒక తల్లిగా పిల్లల్ని వదిలేసి ఐదున్నర నెలలు ఏనాడూ ఉండలేదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సరైన సమయానికి సరైన సమాధానం చెబుతాను. కష్టకాలంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకూ నా కృతజ్ఞతలు. ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేసీఆర్ బిడ్డను. తెలంగాణ బిడ్డను. కమిట్మెంట్తో పనిచేస్తాను, న్యాయపరంగా ఎదుర్కొంటాను, రాజకీయంగా కొట్లాడతాను. నేను మాములుగా కాస్త మొండిదానిని, మంచిదానిని, నన్ను అనవసరంగా జైలుకు పంపి ఇప్పుడు జగమొండిని చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, బీఆర్ఎస్, కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేయడానికే ఇలా చేశారు’ అంటూ కామెంట్స్ చేశారు.నా తప్పు లేకున్నా.. కేవలం రాజకీయాల కోసం నన్ను జైల్లో పెట్టారు. ఈ విషయం దేశం మొత్తానికి తెలుసు.నేను తెలంగాణ బిడ్డను.. కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు.రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతా.. తప్పకుండా నిర్దోషిగా నిరూపించుకుంటా.- ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/3RTl9uPaFS— BRS Party (@BRSparty) August 27, 2024 -
ఎంపీ మాగుంటను నిందితుడిగా ఎందుకు చేర్చలేదు?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత నిందితురాలు అయినప్పుడు.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకే కేసులో ఉన్న ఇద్దరిలో ఆమె నిందితురాలు అయినప్పుడు ఆయన సాక్షి ఎలా అవుతారో తెలపాలంది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదని, ఆ విషయంలో భిన్నంగా వ్యవహరించారని దర్యాప్తు సంస్థల్ని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు బదులిస్తూ.. కవిత ఫోన్లు ధ్వంసం చేయడానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో మాట్లాడటమే కారణం అని తెలిపారు. మేజి్రస్టేట్ ముందు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాంగ్మూలంతోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు బయటకు వచ్చి0దన్నారు. పాలసీలో భాగస్వామ్యం కావడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎంపీ మాగుంట కలిశారని, అయితే కవితను కలవాలని కేజ్రీవాల్ సూచించారని తెలిపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో తన నివాసానికి కవిత రమ్మని ఫోను చేశారంటూ ఎంపీ మాగుంట వాంగ్మూలంలో పేర్కొన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కవిత ఫోను ధ్వంసం చేయాల్సి వ0చ్చిదని ఎస్వీ రాజు తెలిపారు. పాలసీ అనుకూలంగా ఉండడానికి ఆప్ నేతలకు రూ. 100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని రూ. 50 కోట్లు తనకు ఇవ్వాలని కవిత చెప్పారని మాగుంట వాంగ్మూలంలో పేర్కొన్నట్లు రాజు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే అభిõÙక్ బోయినపల్లి, బుచ్చిబాబులకు తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా రూ. 25 కోట్లు అందజేశారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మరి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదు అని ప్రశ్నించింది. కవిత నిందితురాలు అయినప్పుడు మాగుంట సాక్షి ఎలా అవుతారో చెప్పాలంది. ఈ సమయంలో కవిత తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కల్పించుకొని మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారడంతోనే బెయిలు వచ్చి0దన్నారు. ఇలాంటి ఆరోపణలే తప్ప ఎలాంటి ఆధారాలు లేవని రోహత్గి తెలిపారు. ఈ సమయంలో కేజ్రీవాల్‌కు ఏ కేసులో బెయిలు వచ్చి0దనే విషయాలు జస్టిస్ బీఆర్ గవాయి ఆరా తీశారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారని మాగుంట రాఘవ రూ. 25 కోట్లు బుచ్చిబాబు, అభిõÙక్కు ఇచ్చారని అంటున్నారు మరి మనీలాండరింగ్ కేసులో రాఘవ లేరని ఎలా అంటారని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. నేరారోపణ చేసిన వ్యక్తినే సాక్షిగా మార్చారు? రేపు ఇష్టానుసారం మరో వ్యక్తిని తీసుకొస్తారా? ఇదా దర్యాప్తు సంస్థల పారదర్శకత అని ప్రశి్నంచారు.కవితకు బెయిల్ మంజూరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట దక్కింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఒక మహిళగా కవిత బెయిలుకు అర్హురాలని తేల్చి చెప్పింది. పీఎంఎల్ఏ సెక్షన్ 45ను అర్థం చేసుకోవడంలో ఢిల్లీ హైకోర్టు విఫలమైందని పేర్కొంది. సహ నిందితులు, సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్లు కాకుండా నేరంలో కవిత పాత్ర ఉందన్న ఆధారాలు ఇంకేమీ దర్యాప్తు సంస్థలు చూపకపోవడాన్ని గుర్తు చేస్తూ బెయిలు మంజూరు చేస్తున్నామని పేర్కొంది. ముఖ్యంగా.. దర్యాప్తు పూర్తి, చార్జిషీటు దాఖలు, మహిళ అనే మూడు అంశాల ఆధారంగా బెయిలు మంజూరు చేస్తున్నామని పేర్కొంది. ఈడీ, సీబీఐ కేసుల్లో హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. సుమారు గంటన్నరకు పైగా సుదీర్ఘంగా ఇరుపక్షాలు వాదించాయి. ఇరుపక్షాల వాదనల అనంతరం షరతులతో కూడిన బెయిలును ధర్మాసనం మంజూరు చేసింది. ‘‘జులై 1న ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు క్వాష్ చేస్తున్నాం. రెండు కేసుల్లోనూ చెరో రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలి. సాక్షుల్ని బెదిరించడం, ఆధారాలు ట్యాంపర్ చేయడం చేయరాదు. ట్రయల్ కోర్టులో పాస్‌పోర్టు డిపాజిట్ చేయాలి. పిటిషనర్ ట్రయల్ కోర్టుకు రెగ్యులర్‌గా హాజరవుతూ.. దర్యాప్తు వేగవంతానికి సహకరించాలి’’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. -
కేసీఆర్ బిడ్డను.. తప్పు చేయను: కవిత
మంగళవారం రాత్రి 9.11 గంటలు.. తిహార్ జైలు ప్రాంగణం.. అంతటా ఉద్వేగపూరిత వాతావరణం.. సుమారు ఐదున్నర నెలల తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై విడుదలై.. జైలు నుంచి బయటకు వచ్చారు. ఎన్నడూ ఇంతకాలం పిల్లలను, కుటుంబాన్ని వదిలి ఉండలేదంటూ.. కుమారుడిని, భర్తను, అన్న కేటీఆర్‌ను హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ‘నేను కేసీఆర్ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. ఐదున్నర నెలలు అక్రమంగా జైలులో పెట్టారు. వారికి వడ్డీతో సహా చెల్లిస్తా’నంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటితోనే పిడికిలి బిగించి ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు..కవితకు బెయిల్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈడీ, సీబీఐల దర్యాప్తు పూర్తయి, చార్జిïÙట్లు దాఖలైనా ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని తప్పుపడుతూ.. సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ పది నిమిషాలకోసారి కేటీఆర్, హరీశ్‌రావులకు ఫోన్ చేస్తూ.. ఆమె బయటికి ఎంతసేపట్లో వస్తుంది, వెంట ఎవరెవరు ఉన్నారంటూ ఆరా తీస్తూనే ఉన్నారు. జైలు బయట భర్తతో కలసి అభివాదం చేస్తున్న కవిత బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తిహార్ జైలు వద్దకు చేరుకుని.. ‘డాటర్ ఆఫ్ ఫైటర్.. కవితమ్మా.. మేమంతా నీకు అండగా ఉన్నాం’ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత ఢిల్లీ వసంత్ విహార్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ నేతలతో భేటీ అయ్యారు. నేడు (బుధవారం) మధ్యాహ్నం 2.45 గంటలకు కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి 500 కార్లతో భారీ ర్యాలీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ఇన్ని రోజులు ఒక తల్లిగా పిల్లలకు ఏనాడూ దూరంగా ఉండలేదు. నన్ను ఈ పరిస్థితికి తెచ్చిన వారికి కచ్చితంగా వడ్డీతో సహా సమాధానం చెబుతాను’’ అంటూ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగంతో అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజులపాటు ఢిల్లీ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరుచేసింది. రాత్రి సరిగ్గా 9.11 గంటలకు తీహార్ జైలు నుంచి పిడికిలి బిగించి, జై తెలంగాణ అంటూ బయటకు వచ్చిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గేటు బయటకు రాగానే పెద్ద కుమారుడు ఆదిత్యను చూసిన కవిత భావోద్వేగానికి గురై ఆలింగనం చేసుకున్నారు. పక్కనే ఉన్న సోదరుడు కేటీఆర్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకోగా, కేటీఆర్ కవిత నుదిటిపై ముద్దుపెట్టారు. భర్త అనిల్, హరీశ్‌రావులతో ఆలింగనం అనంతరం అక్కడున్న బీఆర్ఎస్ నేతలు సునీత లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మాలోతు కవిత తదితరులను ఆప్యాయంగా పలకరించారు. కవిత విడుదల అవుతున్నారని తెలుసుకున్న ఢిల్లీలోని తెలంగాణ ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ‘డాటర్ ఆఫ్ ఫైటర్, కవిత కడిగిన ముత్యం, కవితమ్మా.. మేమంతా నీకు అండగా ఉన్నాం’ అనే ప్లకార్డులతో స్వాగతం పలికారు. నన్ను జగమొండిని చేశారు కవిత జైలు బయట ఉన్న మీడియా, కార్యకర్తలనుద్దేశించి రెండు నిమిషాలు ప్రసంగించారు. ‘ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను, కార్యకర్తల్ని, మీడియాను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఒక తల్లిగా పిల్లల్ని వదిలేసి ఐదున్నర నెలలు ఏనాడూ ఉండలేదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సరైన సమయానికి సరైన సమాధానం చెబుతాను. కష్టకాలంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకూ నా కృతజ్ఞతలు. ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేసీఆర్ బిడ్డను. తెలంగాణ బిడ్డను. కమిట్మెంట్తో పనిచేస్తాను, న్యాయపరంగా ఎదుర్కొంటాను, రాజకీయంగా కొట్లాడతాను. నేను మాములుగా కాస్త మొండిదానిని, మంచిదానిని, నన్ను అనవసరంగా జైలుకు పంపి ఇప్పుడు జగమొండిని చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, బీఆర్ఎస్, కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేయడానికే ఇలా చేశారని మండిపడ్డారు. నేడు 500 కార్లతో భారీ ర్యాలీ కవిత బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు. జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న కవితకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆటోలో కేటీఆర్: కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు కోర్టు బయటకు వచ్చారు. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో మీడియా ప్రతినిధులు వేచి ఉన్నారు. తమతో మాట్లాడాలని మీడియా ప్రతినిధులు వెంటపడుతున్న సమయంలో.. అందరికీ అభివాదం చేస్తూ బయటకు వచ్చారు. ఆ సమయంలో కారు అందుబాటులో లేకపోవడంతో ఓ ఆటో మాట్లాడుకుని దీన్‌దయాల్ మార్గంలోని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. పది నిమిషాలకోసారి కేసీఆర్ ఫోన్ బెయిల్ మంజూరు అని తెలిసినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పది నిమిషాలకోసారి కేటీఆర్, హరీశ్, కవిత భర్త అనిల్‌లకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటిలోగా బయటకు తెస్తారు, కవితమ్మ వెంట ఎవరెవరు ఉంటారు, జైలు వద్దకు ఎప్పుడు వెళతారంటూ కేసీఆర్ ఆరా తీస్తూనే ఉన్నారు. అక్రమంగా జైలులో పెట్టారు కవిత జైలు నుంచి నేరుగా వసంత్‌విహార్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కవిత వెంట కారులో కేటీఆర్, కుమారుడు ఆదిత్య, భర్త అనిల్, పార్టీ నేతలు సునీత లక్ష్మారెడ్డి, మాలోతు కవిత ఉన్నారు. పార్టీ కార్యాలయానికి చేరుకున్న పది నిమిషాలకే పార్టీ నేతలతో కవిత సమావేశమయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసు బోగస్ అని, కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక తనను టార్గెట్ చేసుకుని జైలుకు పంపారంటూ ఆమె నేతలతో చర్చించారు.నోటీసులు, అరెస్టు నుంచి విడుదల దాకా..⇒ 08–03–2023న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కవితకు సమన్లు జారీ చేసింది ⇒ 11–03–2023న ఢిల్లీలో ఈడీ విచారణకు కవిత హాజరు ⇒ 15–03–2023న ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత ⇒ 21–03–2023న తన ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత ⇒ 14–09–2023న కవితకు మళ్లీ నోటీసులు జారీ చేసిన ఈడీ ⇒ 15–09–2023న సమన్ల జారీని పదిరోజులు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ⇒ 15–03–2024న లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్టు చేసిన ఈడీ ⇒ 16–03–2024న ఢిల్లీలోని కోర్టులో హాజరు, రిమాండ్ ⇒ 05–04–2024న కవి తను విచారించేందుకు సీబీఐ పిటిషన్ ⇒ 08–04–2024న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ట్రయల్ కోర్టు ⇒ 11–04–2024న తీహార్ జైల్లో కవితను అరెస్టు చేసిన సీబీఐ ⇒ 12–04–2024న సీబీఐ కోర్టును ఆశ్రయించిన కవిత.. ఆ పిటిషన్‌పై తీర్పు రిజర్వు ⇒ 15–04–2024న కవితకు 9 రోజులు జ్యుడీషియల్ కస్టడీ ⇒ 16–04–2024న బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ⇒ 23–04–2024న మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు ⇒ 14–05–2024న జ్యుడీషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు ⇒ 03–06–2024న జూలై 3 వరకు రిమాండ్ కొనసాగింపునకు ఆదేశం ⇒ 01–07–2024న కవిత బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు ⇒ 03–07–2024న జ్యుడీషియల్ కస్టడీ జూలై 25 వరకు పొడిగింపు ⇒ 22–07–2024న బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు విచారణ వాయిదా ⇒ 05–08–2024న బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు విచారణ మళ్లీ వాయిదా ⇒ 07–08–2024న సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత ⇒ 12–08–2024న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ వాయిదా ⇒ 20–08–2024న బెయిల్ పిటిషన్ వి చారణ మళ్లీ వాయిదా ⇒ 22–08–2024న కవితకు అస్వస్థత.. తీహార్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు ⇒ 27–08–2024న కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. -
కవితకు బెయిల్ ఆలస్యమైనా.. న్యాయం గెలిచింది: బీఆర్ఎస్ నేతలు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది.కవిత బెయిల్‌పై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. బెయిల్ విషయంలో కుమ్మక్కయ్యారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అయిదునెలలుగా ఒక ఆడబిడ్డ జైల్లో ఇబ్బంది పడిందని, అన్యాయంగా కవితను జైల్లో పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.. సుప్రీంకోర్టు తీర్పును కించపరిచే విధంగా దానికి రాజకీయాలు ముడి పెట్టి దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు.సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తున్నారని, కేంద్రమత్రిగా ఉండి బండి సంజయ్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడిన వ్యాఖ్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్‌పై కేసులు వేస్తామని, బెయిల్‌ను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారని విమర్శించారు. కోర్టులో జరిగిన వాదనలు సమాజం చూసిందని, ఈబీ, సీబీఐ వరి కనుసన్నల్లో నడుస్తున్నాయనేది దేశం మొత్తం తెలుసని అన్నారు. బెయిల్ రావడం ఆలస్యమైనా.. న్యాయం గెలిచిందన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. నిజం ఆలస్యంగా గెలుస్తుందని నిరూపితమైందని తెలిపారు. రాజకీయ నేతలు ఈ కేసులో లేకపోతే 15 రోజుల్లో బెయిల్ వచ్చేదని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నారు కాబట్టే జైల్లో పెట్టారని ఆరోపించారు. ఢీల్లి లిక్కర్ కేసులో ఒక్క రూపాయి రికవరీ చేయలేదని, సౌత్ గ్రూప్ అని పేరు పెట్టి అహంకారంతో వ్యవహరించారని మండిపడ్డారు.‘చార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత జైల్లో ఎందుకు ఉండాలని కోర్టు అడిగింది. అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆ ప్రశ్నకు నీళ్లు నమిలారు. మహిళలకు బెయిల్ విషయంలో కొన్ని చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. ఢీల్లి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్‌కు అసలు తెలివి ఉందా? సుప్రీంకోర్టులో లాయర్లు పార్టీల తరపున ఉండరు. ముకుల్ రోహత్గీ బీజేపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్‌గా ఐదేళ్ళు పని చేశారుకేంద్ర హోంశాఖా సహాయ మంత్రి హోదాను బండి సంజయ్ కాపాడుకోవాలి. మేము బాంఛన్ అంటే కవిత ఎప్పుడో బయటకు వచ్చేది. చట్ట ప్రకారం కొట్లాడదామనే మేము ముందుకు వెళ్ళాము. స్త్రీలను ఇబ్బంది పెట్టిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోలేదు. బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మపై కేసులు లేకుండా చేసి సీఎంను చేశారు.ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఈడీ కేసులు ఎందుకు నడవడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో బీజేపీలో చేరిన ఎంతో మంది నేర చరితలపై విచారణ జరగడం లేదు. బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారు. కవితపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపిత కేసు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే కుట్ర చేశారుబండి సంజయ్ తెలంగాణలో 750 కోట్ల సివిల్ సప్లై స్కాం పై ఎందుకు మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వ సివిల్ సప్లై శాఖ పై ఎందుకు దృష్టి పెట్టలేదు. తెలంగాణ ఆడబిడ్డ బెయిల్ వస్తే ఎందుకింత అక్కసు?- మాజీ మంత్రిగంగుల కమలాకర్. -
కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మనీలాండరింగ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. కేజ్రీవాల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం తీర్పునిచ్చారు.కాగా సీబీఐ కేసులో ఇంతకుముందు విధించిన కస్టడీ గడువు నేటితో ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. మరోవైపు కేజ్రీవాల్ తోపాటు మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన నాల్గో అనుబంధ ఛార్జీషీట్ పైన కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. దీనిపై సెప్టెంబర్ 3న విచారణ జరగనుంది.కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కేసులో బెయిల్ లభించినా సీబీఐ కేసులో బెయిల్ రానందున ఆయన తిహార్ జైల్లోనే ఉంటున్నారు.