ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన అభిషేక్ బోయినపల్లికి ఊరట లభించింది. సోమవారం ఆయనకు సుప్రీంకోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. అభిషేక్‌కు ఈ ఏడాది మార్చి 6న సుప్రీం కోర్టు.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆయన మధ్యంతర బెయిల్‌ను పొడగిస్తూ వచ్చింది.
తాజాగా అభిషేక్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీ కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. “కేసులోని మిగతా నిందితులందరూ బెయిల్‌పై ఉన్నారు. ఈ విషయం అంత వివాదాస్పదం ఏం కాదు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మేం అభిషేక్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నాం’’ అని తీర్పు ఇచ్చింది.
బెయిల్ కోసం షరతులు విధించటంపై ట్రయల్ కోర్టు జడ్జికి అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది.2023, జూలై 3వ తేదీన ఢిల్లీ హైకోర్టు అతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అభిషేక్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. మార్చిలో అభిషేక్ సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా.. దానిని చివరిసారిగా ఆగస్టులో పొడిగించింది.
Comments
Please login to add a commentAdd a comment