grants bail
-
జనసేన కిరణ్ రాయల్‌కు షాక్
సాక్షి, తిరుపతి: జనసేన కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మికి బెయిల్ మంజూరైంది. లక్ష్మికి జైపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కిరణ్ రాయల్ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ గత కొద్దిరోజులుగా న్యాయ పోరాటం చేస్తోన్న బాధితురాలు లక్ష్మిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.సోమవారం మీడియా సమావేశం పెట్టిన లక్ష్మి.. కిరణ్ రాయల్ ఆగడాల్ని ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. అయితే, ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో రంగ ప్రవేశం చేసిన రాజస్థాన్ పోలీసులు.. చెక్‌బౌన్స్ కేసంటూ లక్ష్మిని అరెస్ట్ చేశారు. కిరణ్ రాయల్ రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా.. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆమె ఆత్మహత్యాయత్నం కూడా చేసింది.ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్‌రాయల్ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి రెండు రోజుల క్రితం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే.. జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.ఇదీ చదవండి: తన వెనుక పవన్ ఉన్నాడని కిరణ్ రాయల్ బెదిరించేవాడులక్ష్మి తనపై సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడాన్ని జీర్ణించుకోలేని కిరణ్‌రాయల్ ఇంతకుముందే మీడియా సమావేశంలో లక్ష్మిపై ఆరోపణలు చేస్తూ.. రెండురోజుల్లో జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయబోతున్నారని చెప్పారు. అదే జరగడంతో.. ఆ విషయాన్ని ఆయన ముందే ఎలా చెప్పగలిగారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను బిట్‌కాయిన్ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని లక్ష్మి ఆరోపించారు. ఒంటరి మహిళను అన్యాయంగా వేధిస్తున్నారు. ఇది న్యాయమేనా? అని కన్నీరు పెట్టుకున్నారు. -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్
పుణే: హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలెదుర్కొంటున్న కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిలిచ్చింది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం రాహుల్ వర్చువల్‌గా హాజరు కావడంతో ఎంపీ/ ఎమ్మె ల్యేల ప్రత్యేక కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ జోషి ఈ మేరకు కోర్టుకు ష్యూరిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 18వ తేదీన తదుపరి విచారణ ఉంటుందని, ఈ కేసులో ప్రత్యక్షంగా రాహుల్ హాజరయ్యే అవసరం లేకుండా కోర్టు మినహాయింపు ఇచ్చిందని లాయర్ మిలింద్ చెప్పారు.ఇదీ చదవండి: కోల్డ్ కాఫీ చేసిన రాహుల్ గాంధీ, వైరల్ వీడియో -
ఢిల్లీ వక్ఫ్ బోర్డు కేసు: ఆప్ నేత అమానతుల్లా ఖాన్‌కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అమానతుల్లా ఖాన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమానతుల్లా ఖాన్, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. వెంటనే అమానతుల్లాను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఇక..ఆయనపై విచారణ జరపడానికి అవసరమైన అనుమతి లభించలేదని పేర్కొంది. సప్లిమెంటరీ చార్జిషీట్లో పేరున్న మరియం సిద్ధిఖీపై కేసును కొనసాగించడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. అమానతుల్లా ఖాన్‌కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు అంగీకరించగా, అవసరమైన అనుమతులు లేకుండా విచారణ కొనసాగదని కోర్టు తెలిపింది. అవసరమైన అనుమతి పొందిన తర్వాత, ఛార్జ్ షీట్‌ను పరిగణలోకి తీసుకోవచ్చని పేర్కొంది. -
బాలాసోర్ దుర్ఘటన కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గతేడాది జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ విషాద ఘటనలో 290 మందికి పైగా మృతిచెందారు. ఈ ప్రమాద ఘటన కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు ఒరిస్సా హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.నిందితులు మొహమ్మద్ అమీర్ ఖాన్, అరుణ్ కుమార్ మహంత , పప్పు యాదవ్‌లను జులై 7, 2023న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ).. ప్రమాదం జరగడానికి నిర్లక్ష్యం వహించిన కారణంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఆదిత్య కుమార్ మోహపాత్ర నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్.. ఒక్కొక్కరికి రూ.50 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది.షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు 2 జూన్, 2023న బాలాసోర్‌లోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘనటలో 290 మందికి పైగా మరణించగా.. సుమారు 1,200 మందికి పైగా గాయపడ్డారు.అయితే.. ఉన్నత స్థాయి రైల్వే విచారణలో ప్రమాదానికి ప్రధాన కారణం.. తప్పు సిగ్నలింగ్ అని తేలింది. -
హత్య కేసు: గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు బెయిల్
ముంబై: జయశెట్టి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు ఉపశమనం లభించింది. 2001 సంవత్సరం నాటి జయశెట్టి హత్య కేసులో చోటా రాజన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు పడింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ రేవతి మోహితే డేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్లతో కూడిన డివిజనల్ బెంచ్ జీవిత ఖైదు శిక్షను రద్దు చేసి.. లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. మే 30, 2024న ముంబైలోని ప్రత్యేక మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కోర్టు రాజన్‌కు జీవిత ఖైదు విధించింది.Bombay High Court has given bail to Gangster Chhota Rajan in the 2001 Jaya Shetty murder case. He was convicted and sentenced to life in this case earlier this year. Divisional bench of Justice Revati Mohite Dere and Justice Prithviraj Chavan has given him bail for Rs 1 lakh. pic.twitter.com/pCzVYHY8IJ— ANI (@ANI) October 23, 2024సెంట్రల్ ముంబైలోని గామాదేవి ప్రాంతంలో గోల్డెన్ క్రౌన్ హోటల్‌ను జయాశెట్టి అనే మహిళ నిర్వహిచేవారు. అయితే.. 2001, మే 4న హోటల్లో ఉన్న సమయంలో ఆమెను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్యచేసి పారిపోయారు. ఈ హత్య కేసు విచారణలో చోటా రాజన్ చేయించినట్లు తేలింది. ఆమెను హత్య చేయడానకి ముందు చోటా రాజన్ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్ల వెలుగులోకి వచ్చింది. దీంతో తనకు చోటా రాజన్ నుంచి ప్రాణహాని ఉందని జయా శెట్టి పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు సెక్యూరిటీ కల్పించారు. ఎలాంటి హాని లేదని పోలీసులు కొన్ని సెక్యూరిటీ ఉపసంహరించుకున్నారు. సెక్యూరిటీని తొలగించిన రెండు నెలలకే జయా శెట్టి హత్యకు గురికావటం తీవ్ర కలకలం రేపింది.చదవండి: 2006 Fake Encounter Case: 18 ఏళ్ల నాటి కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు -
ఢిల్లీ లిక్కర్ కేసు: అభిషేక్ బోయిన్‌పల్లికి ఊరట
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన అభిషేక్ బోయినపల్లికి ఊరట లభించింది. సోమవారం ఆయనకు సుప్రీంకోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. అభిషేక్‌కు ఈ ఏడాది మార్చి 6న సుప్రీం కోర్టు.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆయన మధ్యంతర బెయిల్‌ను పొడగిస్తూ వచ్చింది.తాజాగా అభిషేక్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీ కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. “కేసులోని మిగతా నిందితులందరూ బెయిల్‌పై ఉన్నారు. ఈ విషయం అంత వివాదాస్పదం ఏం కాదు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మేం అభిషేక్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నాం’’ అని తీర్పు ఇచ్చింది.బెయిల్ కోసం షరతులు విధించటంపై ట్రయల్ కోర్టు జడ్జికి అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది.2023, జూలై 3వ తేదీన ఢిల్లీ హైకోర్టు అతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అభిషేక్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. మార్చిలో అభిషేక్ సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా.. దానిని చివరిసారిగా ఆగస్టులో పొడిగించింది. -
వైఎస్ వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడి (ఏ5)గా సీబీఐ పేర్కొన్న డి.శివశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తు సీబీఐ కోర్టుకు సమర్పించాలని, ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరు కావాలని, కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోవద్దని, కోర్టులో విచారణ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించొద్దని ఆదేశించింది. అలాగే పాస్‌పోర్టు ట్రయల్ కోర్టుకు సమర్పించాలని, విచారణలో కోర్టుకు సహకరించాలని, ఎలాంటి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడవద్దని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డిని సీబీఐ 2021లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి జైలులో ఉంటున్న ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గత సంవత్సరం సెప్టెంబర్ 19న సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, సీబీఐ వద్ద ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే అరెస్టు చేసిందని, బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపి, సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వర్రావు, సీబీఐ తరఫున స్పెషల్ పీపీ అనిల్ థన్వర్ వాదనలు వినిపించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినందున శివశంకర్‌రెడ్డి నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఏళ్లుగా జైలులో ఉంచడం సరికాదు నిందితులనే పేరుతో ఏళ్ల తరబడి జైలులో ఉంచడం సరికాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పలు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయని తెలిపారు. నిందితుని తరపు న్యాయవాది వాదనలతో పాటు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం నిందితులకు కూడా హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. నిందితుని తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘2021 అక్టోబర్ 26న సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో శివశంకర్‌రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు లేవు. హంతకుడు దస్తగిరి (ఏ4)ని అప్రూవర్‌గా పేర్కొన్నారు. అతను చెప్పిన స్టేట్మెంట్లో శివశంకర్‌రెడ్డిపై ఆరోపణలు చేశాడు. 2022 జనవరి 31న దాఖలు చేసిన తొలి మధ్యంతర అభియోగపత్రంలో శివశంకర్‌రెడ్డిని ఏ5గా చేర్చారు. కేసులో ఇరికించడానికే నిందితుడిగా చేర్చారు. దస్తగిరి చెప్పిన సెక్షన్ 161, 164 స్టేట్మెంట్లలో పరస్పర విరుద్ధ అంశాలున్నాయి. కేసు తీవ్రతను గుర్తించని ట్రయల్ కోర్టు కీలక నిందితుడు దస్తగిరికి ముందస్తు బెయిల్ ఇచ్చి విడుదల చేసింది. హత్య, సాక్ష్యాల చెరిపివేతలో శివశంకర్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. అయినా 2021 నవంబర్ 17 నుంచి జైలులో ఉంచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. 55 ఏళ్ల శివశంకర్‌రెడ్డి వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. భుజానికి కూడా ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరం. దీని మెడికల్ రిపోర్టును కూడా అందజేశాం’ అని కోర్టుకు వివరించారు. -
టీడీపీ నేత పట్టాభికి బెయిల్..
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత పట్టాభికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శనివారం విచారణ జరిపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పట్టాభి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనకు విజయవాడలో కోర్టు గురువారం 14 రోజుల రిమాండ్ విధించటంతో మచిలీపట్నం జైలుకు తరలించారు. అక్కడ నుంచి ఆయన్ని శుక్రవారం ఉదయం ప్రత్యేక వాహనంలో పోలీస్ భద్రత మధ్య రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకెళ్లిన సంగతి విదితమే. చదవండి: నారా వారి తాజా చిత్రం ‘36 గంటలు’.. సిగ్గు చచ్చింది -
దిశారవికి బెయిల్: కుటుంబీకులను చూసి కంటతడి
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా చర్యలు చేపట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవికి బెయిల్ లభించింది. రూ.లక్ష పూచీకత్తుగా చెల్లించి బెయిల్ పొందాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. టూల్ కిట్ కేసులో దిశ రవి అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు కోర్టుకు హాజరయ్యే సమయంలో కుటుంబసభ్యులను చూసి దిశా రవి భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి దిశా రవి సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు తెలిపిందని.. గణతంత్ర దినోత్సవం రోజు రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేసినట్లు దిశ రవిపై అభియోగాలు నమోదయ్యాయి. టూల్ కిట్ పేరుతో పక్కా ప్రణాళికతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుందని దిశ రవిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని నివాసంలో 22 ఏళ్ల దిశా రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు మంగళవారం ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విచారణ సందర్భంగా ధర్మాసనం ‘అసలు టూల్‌కిట్ ఏమిటి’ అని ప్రశ్నించింది. ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తూ దిశా రవికి కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే రూ.లక్ష పూచీకత్తు చెల్లించడం దిశా రవికి కష్టతరమని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఇదే కేసులో నిఖితా జాకబ్, శంతను ములుక్‌లను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి గతంలోనే బెయిల్ మంజూరైంది. -
నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమం
లాహోర్ : పనామా పేపర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లాహోర్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యం కారణంగా మెడికల్ పర్మిటెన్స్ కింద నవాజ్ షరీఫ్‌కు లాహోర్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు అధికారులు షరీఫ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నవాజ్ షరీఫ్‌కు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. -
గోరఖ్‌పూర్ ఘటన : కఫీల్‌ఖాన్‌కు బెయిల్
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరఖ్‌పూర్ 63 మంది చిన్నారుల మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ కఫీల్‌ఖాన్‌కు అలాహాబాద్ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గత ఏడాది ఆగస్ట్‌లో బీఆర్డీ మెడికల్ కాలేజిలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత కారణంగానే పిల్లలు మృతి చెందారన్న ఆరోపణలతో మెదడు వాపు వ్యాధి నివారణ (ఏఈఎస్) విభాగానికి అధిపతిగా ఉన్న కఫీల్‌ఖాన్ జైలు పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి పూర్తిగా విషమించడంతో ఏప్రిల్ 19న కఫీల్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా ఆసుపత్రికి తరలించారు. కఫీల్ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా తన భర్తకు బెయిల్ మంజూరైన సందర్భంగా కఫీల్‌ఖాన్ భార్య డాక్టర్ షబీస్తాన్ఖాన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తన భర్తకు జైల్లో ఉండగా గుండెపోటు వచ్చినా కూడా జైలు అధికారుల సరైన వైద్యం అందించలేకపోయారని, తన భర్త పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం తగిన సమయంలో నిధులు మంజూరు చేయకపోవడం వల్లనే ఆసుపత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుందని, ప్రభుత్వ తప్పిదాన్ని తనపై మోపారని డాక్టర్ కఫీల్‌ఖాన్ కూడా ఆరోపించారు. గోరఖ్‌పూర్‌లో ఘటనను ప్రధాన ఆయుధంగా చేసుకున్న ప్రతిపక్షాలు సీఎం యోగిపై తీవ్ర విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. -
నటుడు వినోద్‌కుమార్‌కు బెయిల్ మంజూరు
బెంగళూరు : హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న బహుభాషా నటుడు వినోద్‌కమార్ అళ్వాస్కు మంగళవారం కోర్టులో బెయిల్ లభించింది. తనను బెదిరించడమే కాకుండా హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ వినోద్‌పై ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు విచారణ చేపట్టిన పుత్తూరు జిల్లా ఐదవ అదనపు సెషన్స్ కోర్టు మంగళవారం విచారణ చేసి బెయిల్ మంజూరు చేసింది. గత నెల 16న వినోద్‌కుమార్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. -
లాలూ ప్రసాద్ కు బెయిల్ మంజూరు