భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గతేడాది జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ విషాద ఘటనలో 290 మందికి పైగా మృతిచెందారు. ఈ ప్రమాద ఘటన కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు ఒరిస్సా హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
నిందితులు మొహమ్మద్ అమీర్ ఖాన్, అరుణ్ కుమార్ మహంత , పప్పు యాదవ్‌లను జులై 7, 2023న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ).. ప్రమాదం జరగడానికి నిర్లక్ష్యం వహించిన కారణంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఆదిత్య కుమార్ మోహపాత్ర నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్.. ఒక్కొక్కరికి రూ.50 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది.
షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు 2 జూన్, 2023న బాలాసోర్‌లోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘనటలో 290 మందికి పైగా మరణించగా.. సుమారు 1,200 మందికి పైగా గాయపడ్డారు.అయితే.. ఉన్నత స్థాయి రైల్వే విచారణలో ప్రమాదానికి ప్రధాన కారణం.. తప్పు సిగ్నలింగ్ అని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment