accused
-
సత్వర విచారణ నిందితుడి ప్రాథమిక హక్కు: సుప్రీం
న్యూఢిల్లీ: కేసుల్లో వేగంగా విచారణ జరగడం, కోర్టు నుంచి సాధ్యమైనంత త్వరగా తీర్పు పొందడం నిందితుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అండర్ ట్రయల్స్‌ను నిరవధికంగా నిర్బంధంలో ఉంచడం సరికాదని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ల ధర్మాసనం పేర్కొంది. బిహార్‌లో నాలుగేళ్లకు పైగా కస్టడీలో ఉన్న వ్యక్తికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణ ఇప్పట్లో పూర్తయే అవకాశం కనిపించడం లేదు గనుక బెయిలిస్తున్నట్టు వెల్లడించింది. -
రియల్టర్ రమేష్ హత్య కేసు: నిందితుడు రాణా పరార్
సాక్షి,హైదరాబాద్: స్థిరాస్తి వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాణా కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. అక్టోబర్ 4వ తేదీన హైదరాబాద్‌లోని పోచారం ఐటీకారిడార్ ఠాణా పరిధి సంస్కృతి టౌన్ షిప్లో నివాసం ఉంటున్న రియల్టర్ రమేష్ కుమార్ భార్య నిహారిక, ప్రియుడు రాణాల చేతులో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం నిందితులు రమేష్‌కుమార్ మృతదేహాన్ని కారులో కర్ణాటకు తరలించారు. అక్కడ నిహారిక మరో ప్రియుడు నిఖిల్ రెడ్డితో కలిసి కొడుగు జిల్లా సుంటికుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని కాఫీ తోటలో మృతదేహాన్ని ముక్కలు చేసి నిప్పు పెట్టిన నిందితులు పారిపోయారు. నిందితులను సీసీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించిన సుంటికుప్ప పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం నిందితులను 10రోజుల కస్టడీకి తీసుకున్నారు. సీన్ రీ కన్స్ట్రషన్ కోసం అక్టోబర్ 30వ తేదీన నిందితులను పోచారం ఐటీకారిడార్ ఠాణాకు తీసుకువచ్చారు. దర్యాప్తు లో భాగంగా రెండు రోజుల పాటు ఇక్కడనే ఉండేందుకు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న బృందావనం హోటల్లో 6 గదులను అద్దెకు తీసుకున్నారు. తెల్లవారుజామున నిందితుడు రాణా కానిస్టేబుల్ హరీష్ మొబైల్ తీసుకుని పారిపోయాడని ఎస్ఐ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం స్థానిక పోలీసులతో పాటు కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారు.ఇదీ చదవండి: స్నేహితుడితో కలిసి భర్తను చంపిన భార్య -
బాలాసోర్ దుర్ఘటన కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గతేడాది జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ విషాద ఘటనలో 290 మందికి పైగా మృతిచెందారు. ఈ ప్రమాద ఘటన కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు ఒరిస్సా హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.నిందితులు మొహమ్మద్ అమీర్ ఖాన్, అరుణ్ కుమార్ మహంత , పప్పు యాదవ్‌లను జులై 7, 2023న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ).. ప్రమాదం జరగడానికి నిర్లక్ష్యం వహించిన కారణంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఆదిత్య కుమార్ మోహపాత్ర నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్.. ఒక్కొక్కరికి రూ.50 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది.షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు 2 జూన్, 2023న బాలాసోర్‌లోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘనటలో 290 మందికి పైగా మరణించగా.. సుమారు 1,200 మందికి పైగా గాయపడ్డారు.అయితే.. ఉన్నత స్థాయి రైల్వే విచారణలో ప్రమాదానికి ప్రధాన కారణం.. తప్పు సిగ్నలింగ్ అని తేలింది. -
సిద్ధిఖీ హత్య కేసులో కొత్త కోణం.. హంతకుల దగ్గర పెప్పర్ స్ప్రే!
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పరారైన మూడవ నిందితుని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాల్పులకు ముందు నిందితులు పెప్పర్ స్ప్రే వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ కేసులో పట్టుబడిన నిందితులిద్దరినీ అక్టోబర్ 24 వరకు పోలీసు కస్టడీకి పంపారు.ముంబై క్రైమ్ బ్రాంచ్ నిందితులిద్దరి నుంచి రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకుంది. నిందితులు తమ వెంట పెప్పర్ స్ప్రే కూడా తీసుకొచ్చారు. ఒక నిందితుడు గాలిలోకి పెప్పర్ స్ప్రే వెదజల్లి కాల్పులు జరపబోతుండగా, మూడో నిందితుడు(పరారీలో ఉన్న) శివకుమార్ నేరుగా కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన సమయంలో బాబా సిద్ధిఖీ వెంట ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. ఆకస్మిక దాడిలో వారు ఏమీ చేయలేకపోయారు.ఈ కేసులో బిష్ణోయ్ గ్యాంగ్ తరపున హత్యకు బాధ్యత వహించినట్లు ప్రకటించిన షుబు లోంకర్ సోదరుడు ప్రవీణ్ లోంకర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షుబు లోంకర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులకు ప్రవీణ్ లోంకర్ ఆశ్రయం కల్పించాడు. బాబా సిద్ధిఖీతో పాటు అతని కుమారుడు జీషన్ సిద్ధిఖీని కూడా చంపాలని ఆదేశాలు అందాయని పోలీసులకు పట్టుబడిన నిందితులు విచారణలో తెలిపారు. డీసీపీ క్రైమ్ బ్రాంచ్ దత్తా నలవాడే తెలిపిన వివరాల ప్రకారం అరెస్టయిన నిందితులిద్దరి నుంచి 28 లైవ్ కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: సల్మాన్‌కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య? -
లోకో పైలట్ హత్య కేసు: నిందితుడు చిక్కాడు
విజయవాడ, సాక్షి: విజయవాడలో లోకో పైలట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు బిహార్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే అనుమానాస్పదంగా ఉన్న దేవ్కుమార్ను లోకో పైలట్ ప్రశ్నించాడు. దీంతో ఇనుపరాడ్‌తో లోకో పైలట్‌పై నిందితుడు దాడి చేశాడని రైల్వే ఏసీసీ రత్న వెల్లడించారు. మచిలీపట్నం వద్ద నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లో విధుల్లో ఉన్న లోకో పైలట్‌ను ఓ ఆగంతకుడు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. షంటింగ్ లోకో పైలట్‌గా పని చేస్తున్న డి.ఎబినేజర్ (52) గురువారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా నైజాంగేటు సమీపంలోని ఏటీఎల్‌సీ కార్యాలయం నుంచి ఎఫ్–క్యాబిన్ వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు.రాడ్‌తో పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలైన ఎబినేజర్ అపస్మారక స్ధితిలో రైలు ట్రాక్‌పై పడిపోయాడు. దూరం నుంచి దీనిని గమనించిన మరో లోకో పైలట్ వృధ్వీరాజ్ పరుగున అక్కడికి వచ్చారు. సమీపంలో ఉన్న వారితో కలిసి ఎబినేజర్‌ను రైల్వే హాస్పటల్‌కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ప్రైవేటు హాస్పటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.విజయవాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాలలోని సీసీ టీవీ ఫుటేజ్‌ల ద్వారా దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. ఆ వ్యక్తే నైజాంగేటు సెంటర్లో ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను గంజాయి మత్తులో ఈ దాడులకు పాల్పడుతుండవచ్చని చెబుతున్నారు.చదవండి: అందరూ చూస్తుండగానే ప్రాణాలు తీశాడు -
అత్యాచార నిందితునిపై మూక దాడి.. హత్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో మూక దాడి ఘటన చోటుచేసుకుంది. అత్యాచారం, హత్య నిందితునిపై కొందరు దాడి చేసి హత్య చేశారు.అక్టోబరు 4న బాధితురాలు పొలాల్లో ఆవులు, మేకలను మేపేందుకు వెళ్లిన సమయంలో అత్యాచార ఘటన జరిగిందని మృతురాలి కుటుంబీకులు చెబుతున్నారు. పొలాల నుంచి ఆమెను కొందరు ఎత్తుకెళ్లారని, ఆ తర్వాత మహిళ వివస్త్రగా కనిపించిందని, ఆమెకు విషం ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.ఈ ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు నిందితుని ఇంటిపై దాడి చేసి, అతడిని బయటకు తీసుకుచ్చి దాడి చేశారు. మహిళలు, పురుషులు నిందితునిపై వెదురు కర్రలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకునేలోపే నిందితుడిని స్థానికులు చావబాదారు. పోలీసులు నిందితుడిని ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు బాధితుడు అప్పటికే మరణించాడని తేల్చిచెప్పారు.ఇది కూడా చదవండి: HYD: బైక్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి -
మతంతో సంబంధం లేదు.. ఆ నిర్మాణాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రోడ్లు, జలాశయాలు, రైలు ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన ఏ మత సంబంధ కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మత విశ్వాసాల కంటే ప్రజల భద్రతే అత్యంత ముఖ్యమని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు, స్థలాల్లో బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ మంగళవారం విచారణ జరపింది.ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ లౌకిక (సెక్యూలర్) దేశమని.. మతాలతో సంబంధం లేకుండా ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్తో చర్యలు అందరికీ ఒక్కటేనని పేర్కొంది. మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయని తెలిపిన ధర్మాసనం.. వీటికి ఆన్లైన్ పోర్టల్ కూడా ఉండాలని తెలిపింది. వాటిలో డిజటలైజ్ రికార్డులు అందుబాటులో ఉంచడం ప్రజలు అన్నీ తెలుసుకోగలరని వెల్లడించింది.గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రప్రభుత్వాల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉండటమే బుల్డోజర్ చర్యను ఎదుర్కోవడానికి కారణమా అని ధర్మాసనం ఆయన్ను అడగ్గా.. ‘కచ్చితంగా కాదు. అత్యాచారం, ఉగ్రవాదం వంటి ఘోరమైన నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు. ఒక్కరోజు ముందు నోటీసు జారీ చేసి ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోం. ముందే చట్టాన్ని అతిక్రమంచి ఉంటేనే చర్యలు తీసుకొంటాం’ అని తెలిపారు.అలాగే ఒకటీ రెండు సంఘటనల ఆధారంగా న్యాయస్థానం ఓ అంచనాకు రావద్దని కోరారు. ఒక వర్గానికి సంబంధించిన కొన్ని ఉదంతాల ఆధారంగా కోర్టు ఆదేశాలు జారీ చేడంపై తాము ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ..‘ మనది సెక్యూలర్ దేశం. మా మార్గదర్శకాలు మతం, జాతి, వర్గాలకు అతీతంగా ఉంటాయి. అందరికీ వర్తిస్తాయి. ఇక ఆక్రమణల విషయానికి వస్తే మేము ఇప్పటికే చెప్పాం. రోడ్డు, ఫుట్‌పాత్, జలాశయం, రైలు పట్టాపై ఏదైనా మత సంబంధమైన నిర్మాణం ఉంటే అది దర్గా, గుడి, మసీదు, గురుద్వారా ఏదైనా.. ప్రజలకు ఆటంకంగా మారకూడదు. అక్రమ నిర్మాణాల విషయంలో మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒక్కటే చట్టం వర్తిస్తుంది’ అని వ్యాఖ్యానించింది. చదవండి:MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఏదైనా నేరంలో ఉండటమే వ్యక్తి ఇంటిపై బుల్డోజర్ చర్యలు తీసుకోవడానికి ఆధారమా..? అని ఆయన్ను బెంచ్ ప్రశ్నించింది. దీనికి మెహతా స్పందిస్తూ.. ‘‘కచ్చితంగా కాదు. అత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు. ఒక్కరోజు ముందు నోటీసు జారీ చేసి ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోం. ఇది ముందే జరిగిఉంటేనే చర్యలు తీసుకొంటాం’’ అని పేర్కొన్నారు. ఇక యూన్ రిపోర్టర్ సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ ఇళ్ల లభ్యతపై వాదనలు వినిపించగా.. దీనికి సొలిసిటర్ జనరల్ మెహతా అభ్యంతరం చేశారు.‘ఈ విషయాన్ని అంతర్జాతీయకరించాల్సిన అవసరం లేదని, మన రాజ్యాంగానికి, దేశ న్యాయస్థానాలకు తగినంత శక్తి ఉందన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ ఏజెన్సీ జోక్యం అవసరం లేదు’’ అని పేర్కొన్నారు.పిటిషనర్లలో ఒకరి తరఫు సీనియర్ న్యాయవాది సియు సింగ్ వాదిస్తూ.. బుల్డోజర్ చర్యను నేరాల నిర్మూలన చర్యగా ఉపయోగించకూడదనేది తన ఏకైక ఉద్దేశమని అన్నారు. మైనారిటీలపై బుల్డోజర్ చర్య చాలా తక్కువగా ఉంటుందని మెహతా అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘వారు ఒకరు ఇద్దరు లేరని.. 4.45 లక్షలు ఉన్నారని తెలిపింది.చివరగా.. కూల్చివేతలకున ఏరారోపణలు ఆధారం కూకూడదని, పౌర నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో మాత్రమే కూల్చివేతలు జరగాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదన్న గతంలో జారీ చేసిన మధ్యంతరు ఉత్తర్వులను పొడిగించింది -
మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్
భువనేశ్వర్: బెంగళూరులో సంచలనం సృష్టించిన మహలక్ష్మి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు ముక్తి రంజన్ రాయ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఒడిషాలోని తన సొంత ఊరికి పారిపోయిన అతను.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళను చంపి ముక్కలుగా నరికి ఫ్రిడ్జిలో దాచిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ కేసులో ముక్తీ రంజన్ రాయ్‌ను తొలి నుంచి అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో భద్రక్(ఒడిషా) జిల్లా పాండి గ్రామానికి పారిపోయిన రాయ్.. సమీపంలోని కూలేపాడు గ్రామానికి వెళ్లి ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఘటనా స్థలంలో ఓ స్కూటీ, అందులో నోట్ బుక్ ఉన్నాయని ఒడిషా పోలీసులు చెబుతున్నారు. అందులో మహాలక్ష్మిని తానే చంపానని, ఆ బాధతోనే బలవనర్మణానికి పాల్పడుతున్నట్లు ముక్తి రంజన్ రాయ్ రాసినట్లు నోట్ దొరికిందని తెలిపారు. అయితే.. బెంగళూరు పోలీసులు దీనిని ధృవీకరించుకోవాల్సి ఉంది. గత శనివారం ఫ్రిజ్‌లో ఉన్న శవం వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. అయితే చాలా తొందరగానే బెంగళూరు పోలీసులు ఈ కేసును చేధించగలిగారు. సెప్టెంబర్ 1 నుంచి మహాలక్ష్మి మాల్‌కు వెళ్లడం లేదు. అదే రోజు నుంచి ముక్తి కూడా పనికి వెళ్లలేదు. బహుశా హత్య సెప్టెంబర్2వ తేదీనే జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి(26) బెంగళూరులోని ఓ మాల్లో పని చేస్తోంది. భర్త నుంచి ఆమె దూరంగా ఉంది. ఈ క్రమంలో మాల్లోనే పని చేస్తున్న ముక్తి రంజన్‌కు దగ్గరైంది. అయితే గత కొంతకాలంగా మహాలక్ష్మి.. మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని భర్త హేమంత్ దాస్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రియురాలిపై కోపం పెంచుకున్న ముక్తి రంజన్.. ఆమెను కిరాతకంగా హత్య చేసి ఉంటాడని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
బద్లాపూర్ నిందితుడి ఎన్కౌంటర్.. పోలీసులకు హైకోర్టు ప్రశ్నలు
ముంబై: బాద్లాపూర్ లైంగిక వేధింపుల నిందితుడి కస్టడీ మరణంపై బాంబే హైకోర్టు ముంబై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడి ఎన్కౌంటర్ అనుమానాలకు తావిస్తోందని.. ఈ సంఘటనను ఎన్‌కౌంటర్‌గా పేర్కొనలేమని పేర్కొంది. నిందితుడు అక్షయ్ షిండేను జైలు నుంచి బయటకు తీసుకొచ్చినప్పటి నుంచి శివాజీ ఆస్పత్రిలో మరణించినట్లు ప్రకటించే వరకు సీసీటీవీ ఫుటేజీని తమకు సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన కేసులో నిందితుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో నిందితుడు అక్షయ్ శిండేపై.. అతడి మొదటి భార్య వేధింపుల కేసు పెట్టింది.అయితే ఈ కేసులో ప్రశ్నించేందుకు పోలీసులు నిందితుడిని కారులో తీసుకొని తాలోజా జైలు నుంచి బద్లాపూర్ బయల్దేరారు. ఈ క్రమంలో పోలీస్ అధికారి చేతిలో నుంచి తుపాకీ లాక్కొని ఎస్కార్టింగ్ పోలీసు బృందంపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. అతడు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.తీవ్రంగా గాయపడిన షిండేను ఛత్రపతి శివాజీ మహరాజ్ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనలో ఏఎస్ఐ నీలేష్ మోరే, ఇన్స్పెక్టర్ సంజయ్ షిండేలు గాయపడ్డారని చెప్పారు. అయితే ఇదంతా అబద్దమని, తన కొడుకునే పథకం ప్రకారమే హతమార్చారని ఆరోపిస్తూ నిందితుడు తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.. ఈ సందర్భంగా పోలీసులకు న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. నిందితుడు కాల్చిన ఆ రెండు బుల్లెట్లు ఎక్కడ..? అంటూ ప్రశ్నించింది. ‘ఇది నమ్మడం కష్టం. ప్రాథమికంగా ఫౌల్ ప్లే కనిపిస్తుంది. ఒక సామాన్యుడు రివాల్వర్ లాగా పిస్టల్‌ను కాల్చలేడు. ఏ టామ్, డిక్, హ్యారీ చేయగలడు, బలహీనమైన వ్యక్తి పిస్టల్‌ను లోడ్ చేయలేడు.’ పోలీసుల కథనాన్ని నమ్మడం కష్టంగా ఉంది. నిందితుడు పోలీసులపైకి మూడు బుల్లెట్లు కాల్చారని మీరు చెప్పారు. ఒక్కటే పోలీసులను తాకింది. మిగతా రెండు బుల్లెట్ల ఏమయ్యాయి. పోలీసు అధికారి సంజయ్ షిండే నిందితుడి తలపై కాకుండా కాళ్లు లేదా చేతులపై గురిపెట్టి ఉండాల్సింది. వాహనంలో ఉన్న నలుగురు అధికారులు ఒక్క వ్యక్తిని అధిగమించలేకపోయారంటే ఎలా నమ్మాలి? అతడేం భారీ మనిషికాదు. మీరు సులభంగానే అతడిని అడ్డుకొని ఉండొచ్చు. దీనిని ఎన్కౌంటర్ అని అనలేం. అలాగే ఇంతవరకు కేసు పత్రాలు సీఐడీకి ఎందుకు అప్పగించలేదు. ఏ దర్యాప్తులో అయినా సమయం కీలకం. ఆలస్యం అవుతుంటే ప్రజల్లో అనుమానాలు వస్తాయి’ అని కోర్టు ప్రశ్నించింది. పోలీసుల చర్యను అనుమానించడం లేదు కానీ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. -
పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి
జమ్మూ: 2019 పుల్వామా ఉగ్రదాడి నిందితుడు జమ్ముకశ్మీర్‌లోని జమ్మూ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందాడు. ఇతని వయస్సు 32 ఏళ్లు. ఈ సమాచారాన్ని ఓ అధికారి మీడియాకు తెలిపారు. 32-year-old accused in 2019 Pulwama terror attack dies of heart attack in Jammu hospital: Officials— Press Trust of India (@PTI_News) September 24, 2024 2019లో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శ్రీనగర్-జమ్ము హైవేపై లెత్పోరా సమీపంలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఐఈడీతో పేలుడుకు పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందగా, పలువురు గాయపడ్డారు. వీరంతా సీఆర్పీఎఫ్లోని 54 బెటాలియన్‌కు చెందినవారు. పేలుడు ధాటికి బస్సు ధ్వంసమైంది. ఈ ఆర్మీ కాన్వాయ్ జమ్ము నుంచి శ్రీనగర్‌కు వెళుతుండగా ఆ ఘటన చోటుచేసుకుంది.ఇది కూడా చదవండి: శ్రీనగర్ లాల్‌చౌక్ కోసం మామ- మేనల్లుడు పోటీ -
బెంగాల్లో మరో దారుణం.. నర్సుపై వేధింపులు, అనుచిత ప్రవర్తన!
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరవకముందే ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో నైట్‌షిఫ్టులో ఉన్న నర్సు వేధింపులను ఎదుర్కోవడం కలకలం రేపుతోంది. వివరాలు.. బీర్భం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఛోటోచక్ గ్రామానికి చెందిన అబ్బాస్ ఉద్దిన్ అనే వ్యక్తికి జ్వరం రావటంతో అతడిని కుటుంబసభ్యులు నిన్న రాత్రి 8.30 గంటలకు హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఆ వ్యక్తిని పరీక్షించిన డాక్టర్లు సెలైన్ ఎక్కించడం కోసం వార్డుకు తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న ఓ మహిళా నర్సు రోగికి సెలైన్ బాటిల్ ఎక్కిస్తుండగా అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె హాస్పిటల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సెలైన్ ఎక్కిస్తున్న సమయంలో ఆ వ్యక్తి.. తనను అభ్యంతరకంగా తాకడంతో పాటు అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు నర్సు ఆరోపించారు. ఆ రోగి అసభ్య ప్రవర్తనతో తాను భయభ్రాంతులకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హాస్పిటల్ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ చేరుకున్న ఇలంబజార్ పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.ఇటీవల కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో చోటు చేసుకున్న హత్యాచార ఘటన తర్వాత వైద్యులు, సిబ్బంది నైట్ షిఫ్ట్‌లో పనిచేయడానికి వెనకాడుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఘటనలో అరెస్ట్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌కి ఇటీవల పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనపై బెంగాల్లో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు.. డాక్టర్లు రక్షణ కోసం ఇటీవల సుప్రీం కోర్టు నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
మనీలాండరింగ్ కేసైనా బెయిల్ ఇవ్వాల్సిందే : సుప్రీం కోర్టు
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసుల్లోను బెయిల్ అనేది ఒక రూల్ అని, జైలు మినహాయింపుగానే ఉండాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్ కేసులో కస్టడీలో ఉన్నప్పుడు నిందితుడు దర్యాప్తు అధికారికి ఇచ్చిన నేరారోపణ ప్రకటన సాక్ష్యంగా అంగీకరించేందుకు వీలుకాదని పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనుచరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రేమ్ ప్రకాష్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.మనీష్ సిసోడియా బెయిల్ తీర్పు విషయంలో కూడా.. పీఎంఎల్ఎ (మనీలాండరింగ్ నిరోధక చట్టం)లో బెయిల్ ఒక నియమం, జైలు మినహాయింపు అని తాము చెప్పినట్లు జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది.ఇక.. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో నిందితురాలు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన మరుసటి రోజు ప్రేమ్ ప్రశాష్ బెయిల్ మంజూరు అయింది. మరోవైపు.. ఈ నెల ప్రారంభంలో మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు కూడా సుప్రీం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు:‘ హత్యాచార’ నిందితుడి తల్లి..
దేశానికి రాజైనా తల్లికి కొడుకే చట్టానికి, సమాజానికి క్రూరుడైనా తల్లికి బిడ్డే అని ఆమె మాటలు వింటే అర్ధమవుతుంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య, ఈ నేరానికి సంబంధించి సివిల్ వాలంటీర్‌ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రూరమైన సంఘటన దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది, భారతదేశం అంతటా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ నేపధ్యంలో ఈ హత్యాచారానికి పాల్పడ మృగాడి తల్లి మాత్రం తన బిడ్డ ఎంతో మంచివాడని చెబుతోంది. అంతేకాదు ఘటన జరిగినప్పటి నుంచి తన కుమారుడిని చూడలేదని నిందితుడి తల్లి చెప్పింది. సమాజం వెలివేసింది...‘‘నా కుమార్తెలు ఎవరూ ఇంటికి రాలేదు. పరిచయస్తులు నలుగురూ నన్ను విడిచిపెట్టారు’’అని సంజయ్ రాయ్ తల్లి తాజాగా ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘‘నా కొడుకును కలవడానికి నన్ను ఎవరూ తీసుకెళ్లలేదు. నా కోడలు, నా కూతుళ్లు ఇప్పుడు ఎవరూ రావడం లేదు. కోర్టులో ఎలా అప్పీల్ చేయాలో నాకు తెలియదు ’’అని ఆమె చెప్పింది. తనకు అన్నం వండిపెట్టడంతో సహా రాయ్ తనని చక్కగా చూసుకునేవాడంది. ‘‘నాకు చాలా అందమైన కొడుకు, అందమైన కుటుంబం ఉండేది. నా భర్త మరణంతో, ప్రతిదీ మారిపోయింది, నా అందమైన కుటుంబం ఇప్పుడు ఓ జ్ఞాపకం మాత్రమే’’ అంటూ ఆవేదనగా చెప్పింది.సంజయ్ రాయ్ కళాశాల గ్రాడ్యుయేట్ అని ఎన్సిసి కార్ప్‌లో కూడా భాగమని అతని తల్లి వెల్లడించింది. ‘‘సంజయ్ బాక్సింగ్ నేర్చుకున్నాడు. అతని తండ్రి చాలా కఠినంగా క్రమశిక్షణతో ఉండేవాడు. బహుశా నేను ఇంకా కఠినంగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు’’ అని తల్లి చెప్పింది.భార్య చనిపోవడంతోనే దారి తప్పాడు...సంజయ్ రాయ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు నిందితుడు తాగిన మత్తులో తరచూ అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చేవాడని ఇరుగుపొరుగు వారు తెలిపారు. అతని ‘దుష్ప్రవర్తన‘ కారణంగా అతని మునుపటి ముగ్గురు భార్యలు అతనిని విడిచిపెట్టారని వారు చెబుతున్న విషయాలని అతని తల్లి ఖండించింది. తన కొడుకు ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించలేదని చెప్పింది. ‘‘సంజయ్ మొదటి భార్య మంచి అమ్మాయి. వారిరువురూ సంతోషంగా ఉండేవారు. అకస్మాత్తుగా, ఆమెకి క్యాన్సర్ వచ్చింది. దాంతో వారి ఆనందం తాత్కాలికంగా మారింది’’ అని ఆమె గుర్తుచేసుకుంది. ఇష్టమైన భార్య దూరం కావడంతో రాయ్ డిప్రెషన్లోకి వెళ్లాడని మద్యం తాగడం ప్రారంభించాడని అయితే ఆ అలవాటును తాను అంగీకరించలేదని ఆమె పేర్కొంది. ‘‘ఒకరోజు బాగా మందు తాగి వచ్చాడు.. బాధపడకు, మనం వేరొకరిని చూద్దాం’ అని తాను ఓదార్చానని... భార్య దూరమైతే విచారం కలగడం సహజం. కానీ మద్యం తాగవద్దని, టీ తాగమని చెప్పానని వివరించింది. అతను మా కుటుంబంలోని ప్రతి ఒక్కరి మాట వినేవాడు, ’’అంటూ ఆమె గుర్తు చేసుకుంది.ఆ రాత్రి తిండి తినకుండా వెళ్లాడు...హాస్పిటల్లో రాయ్ కార్యకలాపాల గురించి తనకు తెలియదని అతను తన అనుమానాలను పెంచేలా అసాధారణంగా ఎప్పుడూ ప్రవర్తించింది లేదని ఆమె నొక్కి చెప్పింది. అతను ఎప్పుడూ అనుమానం వచ్చేలా ఏమీ చేయలేదు, కాబట్టి తాను అప్రమత్తంగా లేనని తెలిపింది. ‘ ఘటన జరిగిన రోజు రాత్రి అతను డిన్నర్ చేయలేదు, ’నేను ఆసుపత్రికి వెళ్తున్నాను’ అని మాత్రం నాకు చెప్పాడు,‘ అన్నదామె. తన కొడుకు ప్రమాదకరం కాదని చెప్పింది. ‘‘ఎవరైనా అతనిని ఇరికించినట్లయితే, ఆ వ్యక్తి శిక్షించబడతాడు. లేక నా కొడుకే నేరం చేసి ఉంటే, దేవుడు అతన్ని శిక్షిస్తాడు’’ అంటూ స్పష్టం చేసింది. కొడుకుని కలిసే అవకాశం వస్తే.. ‘నేను అతనిని కలిస్తే ’బాబూ, ఎందుకు ఇలాంటి పని చేసావు?‘ అని అడుగుతానంటూ ఆమె చెప్పింది. -
బాలికపై అత్యాచారం.. కాల్పుల్లో నిందితునికి గాయాలు
ఉత్తరప్రదేశ్‌లో మరో అత్యాచార ఉదంతం వెలుగు చూసింది. డియోరియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 41 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల బాలికపై అత్యాచార నేరానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక పాల ప్యాకెట్ కొనేందుకు ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు. నిందితుడు దుకాణదారునికి తెలిసినవాడేనని పోలీసులు తెలిపారు. బాధిత బాలిక ఆర్తనాదాలు విన్న స్థానికులు ఆ చిన్నారిని కాపాడి, ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు.ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ సంకల్ప్ శర్మ తెలిపారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాగా అత్యాచార నిందితుడు సైఫుల్లాను పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లగా, అతడు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై, ఎన్కౌంటర్ జరిపారు. పోలీసులు నిందితుని కాలిపై కాల్పులు జరిపారు. తరువాత నిందితుని నుంచి పిస్టల్, కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోల్ కతా డాక్టర్ ఘటన.. నిందితుడికి లై-డిటెక్టర్ టెస్ట్
-
కోల్ కతా డాక్టర్ ఘటన.. నిందితుడికి లై-డిటెక్టర్ టెస్ట్
-
కలకత్తా ట్రైనీ డాక్టర్ కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
కలకత్తా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా మహిళా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సీబీఐ కస్టడీ ముగియడంతో నిందితునికి కట్టుదిట్టమైన భద్రత నడుమ కలకత్తాలోని సెల్డా క్రిమినల్ కోర్టు జడ్జి ముందు శుక్రవారం(ఆగస్టు23) హాజరుపరిచారు.దీంతో కోర్టు నిందితునికి 14 రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు నిందితుడిని జైలుకు తరలించారు. ఇటీవల కలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యంత దారుణంగా లైంగికదాడి జరిపి హత్య చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. -
అయోధ్యలో బాలికపై గ్యాంగ్‌రేప్..నిందితుడి దుకాణాల కూల్చివేత
అయోధ్య: అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడి నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొయీద్ ఖాన్ అనే వ్యక్తి దుకాణ సముదాయాన్ని జిల్లా అధికా రులు గురువారం కూల్చి వేశారు. పురాకలంధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భదర్సానగర్‌లో మొయీద్ ఖాన్ బేకరీ నడుపుతున్నాడు. మొయీద్‌తోపాటు అతడి పనిమనిషి రాజు ఖాన్ ఓ బాలికపై రెండునెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దురాగతాన్ని వారు వీడియో తీశారు.బాలిక గర్భం దాల్చినట్లు తేలడంతో జూలై 30న పోలీసులు మొయీద్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ఆగస్ట్ 3న అతడు నడిపే బేకరీని నేలమట్టం చేశారు. చెరువు స్థలం కబ్జా చేసి దానిని నిర్మించినట్లు అధికారులు అంటున్నారు. తాజాగా, గురువారం మొయీద్ ఖాన్‌కు చెందిన దుకాణ సముదాయాన్ని కూల్చి వేశారు. దానిని ప్రభుత్వ స్థలంలో నిర్మించాడన్నారు. ఆ సమయంలో భవనం ఖాళీగానే ఉందని చెప్పారు. కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. మొయీద్ ఖాన్ సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు, ఫైజాబాద్ ఎంపీ అవధేశ్ ప్రసాద్ అనుచరుడని బీజేపీ నేతలతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపిస్తున్నారు. -
ప్రియురాలి కోసం సొంత సంస్థకే కన్నం
కాచిగూడ: ప్రియురాలి కోసం సొంత సంస్థకే కన్నం వేసిన ఉద్యోగిని ఆదివారం నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుల్తాన్‌బజార్ ఏసీపీ కె.శంకర్, ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ బషీర్‌బాగ్ చంద్రనగర్‌కు చెందిన మర్రి సాయి లక్ష్మణ్ (35) గత 8 ఏళ్లుగా బషీర్‌బాగ్‌లోని శ్రీ సిద్ధి వినాయక్ జువెలర్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో స్టాక్ ఇంచార్జిగా పనిచేస్తున్నాడు. గత రెండు నెలల క్రితం సాయి లక్ష్మణ్ డ్యూటీకి రాకుండా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో షాపు యజమానికి అనుమానం వచ్చి అడిట్ నిర్వహించాడు. అందులో 28 తులాల బంగారం మిస్సింగ్ అయినట్లు గుర్తించాడు. దీంతో అనుమానం వచ్చిన యజమాని లక్షయ్ అగర్వాల్ నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని సాయి లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో తానే దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. 28 తులాలతో పాటు 8 తులాల డైమండ్ నెక్లెస్ దొంగిలించి మణప్పురం గోల్డ్‌లోన్‌లో తాకట్టు పెట్టినట్లు తెలిపారు. దొంగిలించిన బంగారాన్ని విక్రయించి తన ప్రియురాలితో దేవస్థానాలు, ఇతర ప్రదేశాలు తిరిగినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి 3 తులాల బంగారంతో పాటు మణప్పురంలో తాకట్టు పెట్టిన డైమండ్ నెక్లస్‌ను రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా డీఐ డి.నాగార్జున, డీఎస్ఐ జి.వెంకటేష్, పోలీసు సిబ్బంది కె.అభిలాష్, సీహెచ్ అరుణ్‌కుమార్, ఎం.సురేష్, ఎస్.సంతోష్ చారీ, పి.విష్ణు మూర్తిలను ఏసీపీ అభినందించారు. -
కోల్‌కతా వైద్యురాలి కేసు.. పోలీసులకు చుక్కలు చూపిస్తున్న నిందితుడు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణంపై జూనియర్ వైద్యులు, నర్సులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. మరోవైపు ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో డాక్టర్‌పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితుడు సంజయ్ రాయ్ అసలు ఆసుపత్రి ఉద్యోగి కాదని వెల్లడైంది. కానీ ఆసుపత్రిలోని అన్ని బిల్డింగ్‌లలో తరుచూ తిరుగుతుంటాడని తేలింది. అతడు కోల్‌కతా పోలీసులతో కలిసి పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. 2019లో కోల్‌కతా పోలీసుల డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్‌లో వాలంటీర్‌గా చేరాడు. తర్వాత పోలీసు సంక్షేమ విభాగానికి మారాడు. అనంతరం ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని పోలీసు అవుట్‌పోస్ట్‌కు మారాడు. అక్కడ క్యంపస్లోని బిల్డింగ్‌లలో అన్ని విభాగాల్లో ప్రవేశించడానికి అతడికి అనుమతి ఉంది.ఈ క్రమంలోనే సంజయ్ రాయ్ పలు అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అడ్మిషన్ కోసం, రోగుల బంధువులకు సైతం ప్రభుత్వాసుపత్రిలో పడక దొరక్కపోతే దగ్గర్లోని నర్సింగ్‌హోమ్‌లలో ఏర్పాటు చేసేదుకు డబ్బులు వసూలు చేసేవాడని తేలింది. సంజయ్ అధికారిక పోలీస్ కానప్పటికీ తన పరిచయాలను ఆసరాగా చేసుకొని కొన్నిసార్లు పోలీస్ బ్యారక్‌లోనే ఉండేవాడు. కోల్ కతా పోలీస్ అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి తిరిగేవాడు. అతని బైక్‌కు కూడా కేపీ(కోల్‌కతా పోలీస్) అనే ట్యాగ్ ఉంది. ఇతర పౌర వాలంటీర్లకు తనను తాను కోల్‌కతా పోలీస్ సిబ్బందిగా పరిచయం చేసుకునేవాడు.ఏం జరిగింది?కోల్‌కతాలో ఆర్జీ కర్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి అర్ధనగ్న స్థితిలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఆమెపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారణ అయింది. నిందితుడు సంజయ్‌రాయ్‌ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడికి ఆగస్టు 23 వరకు పోలీసు కస్టడీ విధించారు.కావాలంటే ఉరి తీయండి..ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం పోలీసులు రాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చేసిన నేరాన్ని నిందితుడు అంగీకరించాడు. అయితే అతనిలో ఏమాత్రం తప్పు చేసిన పశ్చాత్తాపం కనిపించలేదు. అంతేగాక మీకు కావాలంటే నన్ను ఉరి తీయండంటూ పోలీసులపైకి రుబాబుగా ప్రవర్తించినట్లు తెలిసింది. అతని మొబైల్ ఫోన్ నిండా అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అత్యవసర భవనంలోకి ప్రవేశించడం కెమెరాలో రికార్డయ్యింది. కొన్ని గంటల తర్వాత అదే భవనంలో వైద్యురాలి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం రాత్రి అతడి విరిగిన ఇయర్‌ఫోన్ వైద్యురాలి హత్య జరిగిన సెమినార్ రూమ్‌లో దొరికింది. అదే అతడిని పట్టించింది. ఎమర్జెన్సీ భవనంలోకి వెళ్తున్నప్పుడు బ్లూటూత్ డివైజ్ అతని మెడలో ఉంది. కానీ అతను బయటకు వచ్చేసరికి అది కనిపించలేదు. మృతదేహం పక్కన ఉన్న హెడ్సెట్ కూడా అతని ఫోన్‌తో పెయిర్ చేసి ఉంది.మహిళా డాక్టర్‌పై హత్యాచారం చేసి తర్వాత నిందితుడు తాపీగా గదికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయినట్లు తేలింది. తెల్లారిన తర్వాత తన దుస్తులపై రక్తపు మరకలను శుభ్రం చేసుకున్నట్లు తెలిసింది, అయితే అతని షూస్‌కు అంటిన రక్తపు మరకల ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. .అయిత ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. సంజయ్ రాయ్‌కు ఇదివరకే నాలుగు పెళ్లిళ్లు అవ్వగా.. ముగ్గురు భార్యలు అతడిని వదిలి వెళ్లిపోగా. నాలుగో భార్య గత ఏడాది మరణించింది. ఎవరీ పోలీస్ పౌర వాలంటీర్లుఈ వాలంటీర్లు ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు ప్రతిస్పందనతో సహా వివిధ పనుల్లో పోలీసులకు సహాయం చేయడానికి నియమించినన కాంట్రాక్టు సిబ్బంది. నెలకు దాదాపు రూ.12,000 చెల్లిస్తుంటారు. అయితే ఈ వాలంటీర్లకు సాధారణ పోలీసు సిబ్బందికి ఉండే సౌకర్యాలేవి ఉండవు -
‘మరీ ఇంత క్రూరత్వమా’..! కలకత్తా డాక్టర్ ఘటనపై కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కోల్‌కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల రెసిడెంట్ డాక్టర్‌పై ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాచారం, హత్య జరిగినట్లు ఆరోపణలు రావడం దిగ్భ్రాంతిని కలిగించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం(ఆగస్టు12) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు.‘బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ,స్నేహితులకు నా సానుభూతి. ఇది భరించాల్సిన అంశం కాదు. మరీ ఇంత క్రూరత్వానికి ఒడిగట్టిన వారెవరిని వదిలిపెట్టకూడదు. ప్రభుత్వం నేరస్థుడిని పట్టుకోవడంతోపాటు బాధితులకు న్యాయం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.ఘటనపై నిరసన తెలుపుతున్న వైద్యులకు నా సంఘీభావం. ఆసుపత్రుల్లో వైద్యులు సురక్షితంగా ఉండలేకపోతే, మన ఆడపిల్లలు ఎక్కడైనా సురక్షితంగా ఉంటారా’అని కేటీఆర్ ప్రశ్నించారు. -
బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
బెంగళూరులోని పీజీ హాస్టల్లో ఓ యువతిని అతి దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఘటన జరిగిన మూడు రోజులకు మధ్యప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని నగరానికి తీసుకున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.కాగా బిహార్‌కు చెందిన 24 ఏళ్ల యువతి కృతి కుమారిని ఓ దుండగుగు అర్థరాత్రి హాస్ట్‌లోకి చొరబడి కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. బెంగళూరులోని రద్దీగా ఉండే కోరమంగళలోని పీజీ హాస్టల్లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. అయితే బాధితురాలికి నిందితుడు ముందుగానే పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఓ ప్రైవేటు కంపెనీ పనిచేస్తున్న కృతికి.. హాస్ట్‌లో తన రూమ్మెట్కు ప్రియుడు అని వెల్లడైంది. తన రూమ్మెట్, ఆమె ప్రియుడు ప్రతిసారి ఉద్యోగం విషయంలో గొడవపడేవారిని, వీరి విషయంలో కుమారి జోక్యం చేసుకోవడంతో గొడవలు పెద్దగా అయినట్లు సమాచారం. అయితే ప్రియుడికి దూరంగా ఉండాలని కృతి తన రూమ్మెట్కు సలహా ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు.. ఆవేశంతో ఆమెను చంపడానికి హాస్ట్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది.ఈ దారుణ హత్యకు సంబంధించిన దృశ్యాలు హాస్టల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ముందుగా నిందితుడు కుమారి రూమ్ తలుపు తట్టడం, ఆమె డోర్ తీయగానే బలవంతంగా కారిడార్లోకి లాక్కెళ్లాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. యువతిని గొడకు నెట్టి తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ఆమెపై పలుమార్లు దాడి చేశాడు. మెడపై కత్తితో పదే పదే పొడిచాడు. దీంతో తీవ్రగాయాలతో ప్రాణాలు వదిలింది.యువతి కేకలు విన్న మిగతా హాస్టల్ మహిళలు భయటంతో బయటకు పరుగులు తీశారు. వారిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేయడగా.. పోలీసులు వచ్చే సరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిన తాజాగా అతుపులోకి తీసుకున్నారు. -
దిల్సుఖ్ నగర్ పేలుళ్ల నిందితుడు మక్బూల్ మృతి
హైదరాబాద్, సాక్షి: దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో సయ్యద్ మక్బూల్ (52) మృతి చెందాడు. అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు చర్లపల్లి జైలు అధికారులు ప్రకటించారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు పని చేసిన సయ్యద్ మక్బూల్.. దేశవ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో పాల్గొన్నాడని ఎన్ఐఏ నిర్ధారించింది. ఈ క్రమంలో ఢిల్లీ కోర్టు అతనికి జీవిత ఖైదు కూడా విధించింది. అయితే.. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు విచారణ నిమిత్తం ట్రాన్సిట్ వారెంట్ మీద అతన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి మక్బూల్ చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 6.45 గంటలకు ఆనంద్ టిఫిన్స్‌తో పాటు బస్టాండ్‌లో పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 17 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ జంట బాంబుల కేసును మూడేళ్లపాటు విచారణ చేసిన ఎన్ఐఏ.. 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు నిర్ధారించింది. అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఎజాజ్ షేక్, మక్బూల్ దోషులుగా తేల్చారు. ప్రధాన నిందితుడైన యాసిన్ భత్కల్ పాకిస్థాన్‌లో తలదాచుకోగా.. మిగిలిన నిందితులు చర్లపల్లి జైల్లో ఉన్నారు. వీరిలో మక్బూల్ ఇప్పుడు అనారోగ్యంతో చనిపోయాడు. అయితే.. ఇక.. మహారాష్ట్రకు చెందిన ముక్బూల్ బాంబులు తయారు చేసేవాడు. ఎన్ఐఏ అతన్ని అరెస్ట్ చేసిన టైంలో.. ఢిల్లీ పాటియాలా కోర్టు ఆవరణలో తెలుగు మీడియాను చూస్తూ.. తాను మూడు నెలల్లో జైలు నుంచి బయటకు వస్తానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. -
హత్రాస్ ఘటన: లొంగిపోయిన ప్రధాన నిందితుడు
యూపీలోని హత్రాస్‌లో సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందారు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ ఢిల్లీలో లొంగిపోయాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు మధుకర్‌ను యూపీ పోలీసులకు అప్పగించినట్లు సుప్రీంకోర్టు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.రాజస్థాన్, హర్యానాతో పాటు యూపీలో మధుకర్ కోసం హత్రాస్ పోలీసులు వెదుకులాట సాగించారు. మధుకర్ లొంగిపోయిన తర్వాత అరెస్టు చేశారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్లో చీఫ్ సేవాధర్ మధుకర్ మాత్రమే నిందితునిగా ఉన్నాడు. అతనిపై రూ.లక్ష రివార్డు ప్రకటించారు. మధుకర్ ఢిల్లీలో వైద్య చికిత్స పొందుతున్నాడని న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. మధుకర్‌పై నేరపూరిత నరహత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు ఇండియన్ జస్టిస్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఆగ్రా జోన్ ఏడీజీ అనుపమ్ కులశ్రేష్ట్ మాట్లాడుతూ త్వరలోనే ఈ కేసుపై సిట్ తుది నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో 132 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. మరోవైపు నారాయణ్ సాకార్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా ప్రమేయంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఎఫ్ఐఆర్లో భోలే బాబా పేరు లేదు. కాగా దర్యాప్తునకు ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్ హత్రాస్‌కు చేరుకుంది. -
ముప్పై ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు
ముంబై: ముప్పై ఏళ్ల క్రితం నాటి ముంబయి అల్లర్ల కేసులో పరారీలో ఉన్న ఓ నిందితుడు ఇప్పుడు మళ్లీ చిక్కాడు. అతడు గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. 1993లో ముంబయిలో అలర్లు చెలరేగాయి. అల్లర్ల సమయంలో చట్టవిరుద్ధంగా మనుషులను పోగు చేసిన కేసుతోపాటు ఓ హత్యలో సయ్యద్ నాదిర్ షా అబ్బాస్ ఖాన్ (65) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై విడుదలైనప్పటి నుంచి కనిపించకుండా పోయి పరారీలో ఉన్నాడు. దీంతో కోర్టు అతడిని చట్టపరంగా పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సెంట్రల్ ముంబయి సేవ్రీలోని నిందితుడి ఇంటికి పోలీసులు అనేకసార్లు వెళ్లినా అతడు ఎక్కడున్నాడో కనుక్కోలేకపోయారు. చివరకు బంధువుల ఫోన్ల రికార్డులను పరిశీలించగా ఆచూకీ లభ్యమైంది. జూన్ 29న అతడు తన ఇంటికి వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వలపన్ని అతడిని అరెస్టు చేశారు. 1993 కేసులో నిందితుడిని తాజాగా మళ్లీ అరెస్టు చేశామని, కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందనియ పోలీసులు తెలిపారు