
మైసూరు: దుండగులు ఓ మహిళను బంధించి దోపిడీకి పాల్పడగా పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. మైసూరులోని శ్రీరాంపురలోని బెమెల్ లేఔట్ 2వ క్రాస్‌లో నివాసం ఉంటున్న జీ రవింద్ర అనే వ్యక్తి ఇంటిలోకి నలుగురు వ్యక్తులు చొరబడి అతని భార్య రంజనిని తాళ్లతో బంధించి బంగారు, వెండి, నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టి శ్రేయస్(22), బెంగళూరుకు చెందిన ప్రవీణ్(32), అవినాశ్(30), రవిచందన్(30)ను అరెస్ట్ చేశారు. రూ.4వేల నగదు, 15 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.
వేట కొడవలితో దాడి
తుమకూరు: ఓ వ్యక్తిపై వేట కొడవలితో దాడి చేసిన ఘటన తుమకూరు నగర సమీపంలోని బీమసంద్రం వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు... స్థానికంగా ఉంటున్న రంగరాజు (40) అనే వ్యక్తిపై కిరణ్ అనే వ్యక్తి వేట కొడవలితో తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పాతకక్షలతోనే దాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
(చదవండి: పంచాయతీ అధ్యక్షురాలు వీరంగం.. అందరూ చూస్తుండగా చెప్పుతీసుకుని..)
Comments
Please login to add a commentAdd a comment