Capturing
-
తల్లిని కెమెరాలో బంధిస్తున్న ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య (ఫోటోలు)
-
మహిళను బంధించి దోపిడీ
మైసూరు: దుండగులు ఓ మహిళను బంధించి దోపిడీకి పాల్పడగా పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. మైసూరులోని శ్రీరాంపురలోని బెమెల్ లేఔట్ 2వ క్రాస్‌లో నివాసం ఉంటున్న జీ రవింద్ర అనే వ్యక్తి ఇంటిలోకి నలుగురు వ్యక్తులు చొరబడి అతని భార్య రంజనిని తాళ్లతో బంధించి బంగారు, వెండి, నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టి శ్రేయస్(22), బెంగళూరుకు చెందిన ప్రవీణ్(32), అవినాశ్(30), రవిచందన్(30)ను అరెస్ట్ చేశారు. రూ.4వేల నగదు, 15 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. వేట కొడవలితో దాడి తుమకూరు: ఓ వ్యక్తిపై వేట కొడవలితో దాడి చేసిన ఘటన తుమకూరు నగర సమీపంలోని బీమసంద్రం వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు... స్థానికంగా ఉంటున్న రంగరాజు (40) అనే వ్యక్తిపై కిరణ్ అనే వ్యక్తి వేట కొడవలితో తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పాతకక్షలతోనే దాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. (చదవండి: పంచాయతీ అధ్యక్షురాలు వీరంగం.. అందరూ చూస్తుండగా చెప్పుతీసుకుని..) -
డామిట్.. కథ అడ్డం తిరిగింది
→రూ.కోటి విలువైన స్థలం కబ్జాకు యత్నం →బోరు తీసి, చురుగ్గా నిర్మాణ పనులు →స్థల రక్షణదారుని ఫిర్యాదుతో బాగోతం బట్టబయలు →కటకటాల పాలైన భూకబ్జాదారు పీఎం పాలెం(భీమిలి): సూమారు రూ.కోటి విలువ చేసే భూమిని దర్జాగా కబ్జా చేయడానికి యత్నించి కథ అడ్డం తిరగడంతో ఓ పెద్దమనిషి కటకటాల పాలయ్యాడు. మధురవాడ నార్త్ జోన్ ఏసీపీ నాగేశ్వరరావు సామవారం సాయంత్రం పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ బండారు మహేశ్వరరావు తన కుమార్తె సుమలతకు పీఎం పాలెం తులసీనగర్ సర్వే నంబరు 53/3లో ప్లాట్ నంబరు 77లో 340 చదరపు గజాల స్థలం గిఫ్ట్‌డీడ్ కింద ఇచ్చారు. ప్రస్తుతం ఆమె భర్తతో పాటు అమెరికాలో ఉంటున్నారు. నగరంలోని పెదవాల్తేరులో నివసిస్తున్న ఆమె మామ చుక్క అప్పలప్రకాశరావు సదరు స్థలం వద్దకు అప్పుడప్పుడూ వస్తూ చూస్తున్నారు. కబ్జాకు స్కెచ్ ఇలా.. ఇదిలా ఉండగా ఈ భూమిని కొట్టేయడానికి అక్కయ్యపాలెంలో నివసిస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన గంధంనేని సూర్యమణిధర్మరాజు కొంతమంది స్థానికుల సహకారంతో పథకం రచించాడు. బండారు మహేశ్వరరావు.. మొయ్యి వాసంతి అనే మహిళకు 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చినట్టు అనామతు పత్రం సృష్టించాడు. సుమారు 10 రోజుల కిందట ఆక్రమించిన భూమిలోకి దర్జాగా ప్రవేశించి బోరు తీయించాడు. అంతటితో ఆగకుండా బేస్మెంట్ నిర్మాణపు పనులు కూడా చేపట్టాడు. విషయం తెలుసుకున్న అప్పల ప్రకాశరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సీఐ కె.లక్ష్మణమూర్తి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సూర్యమణిధర్మరాజును కబ్జా స్థలంలోనే సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రిమాండుకు తరలించామని ఏసీపీ తెలిపారు. -
అయ్యో! తల్లీ!!
ఆకలికాలం ఉత్తరప్రదేశ్‌లో రేపు చివరి విడత పోలింగ్ జరుగుతోంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఈ పోలింగ్ గురించి కాదు. ఎప్పుడో జరిగిపోయిన నాల్గవ విడత పోలింగ్ గురించి! ఆ విడతలో 53 స్థానాలకు పోలింగ్ జరిగింది. వాటిల్లో కల్పి అసెంబ్లీ నియోజకర్గం కూడా ఉంది. అక్కడి నుంచి ఛోటేసింగ్ (బి.ఎస్.పి.), నరేంద్రపాల్ సింగ్ (బి.జె.పి.), ప్రస్తుత ఎమ్మెల్యే ఉమాకాంతి (కాంగ్రెస్) పోటీ చేశారు. ప్రజలకు వీళ్లు ఎలాంటి హామీలు ఇచ్చారో కానీ, ఈ ముగ్గురిలో ఎవరైతే తనకు ఇంత ముద్ద పెడతారో వారికే నా ఓటు అని మూలాదేవి అనే ఓటరు పోలింగ్‌కి ముందే చెప్పేశారు. మూలాదేవిది కల్పి నియోజకవర్గంలోని షేక్‌పూర్‌గూడా గ్రామం. 70 ఏళ్ల ఈ వృద్ధురాలు దాదాపుగా ఆకలితో మరణించే స్థితిలో ఉన్నట్లు అక్కడి కరువు గ్రామాలపై సర్వేచేసిన ‘బుందేల్‌ఖండ్ దళిత్ అధికార్ మంచ్’ అనే ఎన్జీవో ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఒక నిరుపేద... ఆకలిబాధతో కడుపు చేతపట్టుకోవడం మన దేశంలో ఎప్పుడూ ఉండే విషాదమే. కానీ మూలాదేవి వేరు. మీర్జాపూర్ ఎంపీ అయిన ఫూలన్‌దేవి తల్లి ఆమె! అయితే పదిహేడేళ్ల క్రితం ఫూలన్‌ని ఆమె ఎంపీగా ఉన్నప్పుడే ఆమె విరోధులు ఢిల్లీలో కాల్చి చంపారు. అప్పటి నుంచి మూలాదేవి ‘పూలన్ తల్లి’గా ప్రత్యేక హోదాను కోల్పోయారు. ఉన్న కొద్దిపాటి భూమినీ కబ్జాదారులు తన్నుకుపోయారు. మూలాదేవి, ఆమె చిన్న కూతురు రామ్‌కలి ఇప్పుడు చిరుగుల డేరాలాంటి పూరి గుడిసెలో ఉంటున్నారు. రామ్‌కలిలో ఫూలన్ పోలికలు ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో లబ్ది పొందడానికి కొన్ని పార్టీలు రామ్‌కలిని స్టేజ్ ఎక్కిస్తుంటాయి. అప్పుడు మాత్రం ఇంతో అంతో ఆమె చేతిలో పెడతుంటాయి. మిగతా అప్పుడు ఆ ఇంట్లో ఈ ఇంట్లో గిన్నెలు కడిగి రామ్‌కలి కొంత డబ్బు సంపాదించుకొస్తుంది. అదే వారి కుటుంబానికి ఆధారం. రామ్‌కలికి టిక్కెట్ ఇస్తానని ములాయం సింగ్ హామీ ఇచ్చారు కానీ, అదీ జరగలేదు. చూడాలి ఇక్కడ ఎవరు గెలుస్తారో? గెలిచినవారు మూలాదేవికి ఇంత ముద్ద పెడతారో లేదో! అధికారంలోకి వచ్చిన వారెవరైనా ముందు చేయవలసిన పని అదే కదా. ‘బందిపోటు రాణి’ ఫూలన్ దేవి -
కార్యదర్శి స్వాహాకారం
► సభ్యులకు ఇవ్వాల్సిన ప్లాట్లు సొంతవారికి ధారాదత్తం.. ► మరికొన్ని ఇతరులకు అక్రమంగా విక్రయం ► రు.5 కోట్ల విలువ చేసే ప్లాట్లు అన్యాక్రాంతం ► ఆ ప్లాట్లలోనే అపార్ట్మెంట్లు నిర్మించి అమ్మకం ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సొసైటీలో స్వాహాకాండ ► అరెస్టరుునా ఆగని దందా.. అధికార పార్టీ నేతల అండ ► విచారణ పేరుతో సాగదీస్తున్న అధికారులు కబ్జాకు కాదేదీ అనర్హం అంటున్నారు కొందరు ప్రబుద్ధులు.. అనడమేంటి.. ఆచరణలోనూ చూపిస్తున్నారు. కంచే చేను మేసిన చందంగా.. సొసైటీ పాలక పెద్దలే ప్లాట్లను అన్యాక్రాంతం చేసి.. ఎడాపెడా స్వార్జనకు పాల్పడుతున్నారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సొంత కుటుంబ సభ్యులకు గిఫ్ట్.. అన్న ముద్దు పేరుతో రెండేసి ప్లాట్లు ధారాదత్తం చేసేశారు. ఆనక వాటిలో అపార్ట్మెంట్లు నిర్మించి ఎంచక్కా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తరహా అక్రమాలకు నగర శివారులోని పీఎంపాలెం పరిధిలో ఉన్న కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సహకార గృహనిర్మాణ సొసైటీ నిలయంగా మారింది. కోట్ల విలువైన ఈ స్వాహాకాండ గురించి వింటే ఎవరైనా ఔరా.. అనక మానరు. విశాఖపట్నం: ఫొటోలో ఈ అపార్టుమెంట్ చూశారుగా.. నగరంలో సొసైటీల స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నాయని చెప్పడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. సెంట్రల్ ఎకై ్సజ్ అండ్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లారుుస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సోసైటీ(నెం.1561) 1971లో సహకార సంఘంగా రిజిస్టర్ ్రఅరుు్యంది. మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) 5వ వార్డు పరిధిలోకి వచ్చే పీఎంపాలెంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలోని సర్వే నెం.359, 360లలో చెరో 10 ఎకరాలు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి చాణక్యపురి లే అవుట్‌గా అభివృద్ధి చేసి సొసైటీ సభ్యులకు ఒక్కొక్కరికి 267 గజాలు చొప్పున సర్వే నెం.359లో 107, సర్వే నెం.360లో 102 ప్లాట్లు కేటారుుంచారు. అదే విధంగా నగరపాలెంలోని అయోధ్యనగర్‌లోని సర్వే నెం.63లో 15, సర్వే నెం.2లో 72 ప్లాట్లు కూడా ఇచ్చారు. అక్కడి వరకు అంతా సజావుగానే సాగినా.. ప్లాట్ల విభజన తర్వాతే అసలు కథ మొదలైంది. ఇష్టారాజ్యంగా తనవారికి కేటారుుంపులు సొసైటీ కార్యదర్శిగా వ్యవహరించిన డబ్బీరు గౌరీశంకరరావు అనే వ్యక్తి కోట్ల రూపాయల విలువైన సొసైటీ ప్లాట్లను సభ్యులకు తెలియకుండా తెగనమ్ము కున్నాడు. అక్కడితో ఆగకుండా సొసైటీ సభ్యులకే కేటారుుంచాల్సిన సర్వే నెం.359లో 94, 95.. సర్వే నెం. 360లో 24, 25, 26, 27 ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా తన కుటుంబ సభ్యులకు గిఫ్టుల పేరుతో కట్టబెట్టేశాడు. మరో రెండు ప్లాట్లను మైనర్లకు అమ్మేశాడు. ఇలా సుమారు రు.ఐదు కోట్లు విలువ చేసే ప్లాట్లు అన్యాక్రాంతమయ్యారుు. ఈ ప్లాట్లలోనే ప్రస్తుతం బహుళ అంతస్తుల భవనాలు శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్నారుు. ఇక సర్వే నెం.2లోని 79 ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో సభ్యులకు కూడా తెలియని పరిస్థితి.రిటైరైన తర్వాత ఇల్లు కట్టుకుని శేష జీవితం హారుుగా గడుపుతామనుకున్న పలువురు సొసైటీ సభ్యులు తమ స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియక తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. పదవి నుంచి తొలగించినా.. సొసైటీ అస్తులకు కస్టోడియన్‌గా వ్యవహరించాల్సిన కార్యదర్శే తమ స్థలాలను అమ్ముకున్నాడని.. సొంతవారికి కట్టబెట్టేశాడని ఆలస్యంగా గుర్తించిన సొసైటీ సభ్యులు అవాక్కయ్యారు. తర్వాత తేరుకొని కార్యదర్శిని తొలగిస్తూ సొసైటీ సమావేశంలో తీర్మానం చేశారు. అరుుతే సొసైటీ తన చేతుల్లో ఉందని, తనను తొలగించే అధికారం సభ్యులకు లేదని గౌరీ శంకరరావు తేల్చిచెప్పడంతో అతనిపై న్యాయపోరాటానికి సభ్యులందరూ సిద్ధమయ్యారు. సెంట్రల్ ఎకై ్సజ్, అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లారుుస్ హౌస్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ఉన్నతాధికారుల దృష్టికి వ్యవహారాన్ని తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించారు. బైలాకు వ్యతిరేకంగా స్థలాల కేటారుుంపులు జరిపినట్లు విచారణలో సహకార శాఖాధికారులు గుర్తించారు. ఈ కేటారుుంపులు అక్రమమేనని కో-ఆపరేటివ్ సోసైటీ ‘51 ఎంకై ్వరీ రిపోర్టు ప్రకారం’ నిర్థారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు గౌరీశంకరరావును అరెస్ట్ కూడా చేశారు. అధికార పార్టీ నేతల అండ మరోవైపు జైలుకు వెళ్లిన వ్యక్తి కార్యదర్శిగా కొనసాగటం చెల్లదంటూ సహకార శాఖ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఆదేశాలిచ్చారు. అరుునా పట్టించుకోని గౌరీశంకరరావు అధికార పార్టీ నేతల అండదండలతో ఈ వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకెళ్లి సాగదీస్తున్నాడని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. చివరికి కోర్టు తప్పుబట్టినా..సహకార శాఖాధికారులు కాదు పొమ్మన్నా సరే పట్టించుకోకుండా సొసైటీకి చెందిన ప్లాట్లలో అక్రమ నిర్మాణాలు సాగిస్తూ అమ్మేసుకుంటున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణకు ఆదేశించాం దీనిపై సహకార శాఖ జారుుంట్ రిజి్ట్రార్ గౌరీశంకర్‌ను వివరణ కోరగా. ఇటీవలే కొంతమంది సొసైటీ సభ్యులు తమకు మరోసారి ఫిర్యాదు చేశారని, ఈ వ్యవహారంపై విచారణ జరపమని జిల్లా రిజి్ట్రార్ను ఆదేశించామన్నారు. జిల్లా రిజి్ట్రార్ సన్యాసినాయుడ్ని వివరణ కోరగా, ప్లాట్ల అన్యాక్రాంతం..అక్రమ నిర్మాణం వ్యవహారం కోర్టులో ఉందన్నారు. కాగా కొత్త కార్యవర్గం కోసం ఎన్నికలు నిర్వహించాలని కార్యదర్శి వ్యతిరేక వర్గీయులు తమను కోరారని.. త్వరలోనే ఇరువర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా గిఫ్టులు డబ్బీరు గౌరిశంకరరావు అనే వ్యక్తి ఈ సొసైటీకి కార్యదర్శిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా తన తమ్ముడి కుమారునికి, తన కూతురికి రెండేసి ప్లాట్లు గిప్ట్గా ఇచ్చారు. ఇలా ఇవ్వడం చెల్లదని సహకార శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. పైగా మరో రెండు ప్లాట్లు మైనర్లకు గిప్ట్ ఇచ్చారు.. అదీ చెల్లదు. వీటన్నిటిలో అపార్టుమెంట్లు నిర్మించి అమ్ముకుంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే పాత కార్యవర్గాన్ని రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి. - డి.సత్యనారాయణ, రిటైర్డ్ ఏడీఈ, విద్యుత్ శాఖ సొసైటీ సభ్యుడు -
‘నయీమ్ భూముల’కు కంచె
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ చెరలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలాప్రాంతాల్లో నయీమ్ పెద్దఎత్తున స్థలాలను కబ్జాలో పెట్టుకున్నాడు. కొన్నిచోట్ల సొంతదారులను చంపుతానని బెదిరించి తక్కువధరకే కొనుగోలు చేయగా, మరికొన్ని చోట్ల నయాపైసా ఇవ్వకుండా ఆక్రమించాడు. ఈ కోవలో కొన్నిప్రాంతాల్లో ప్రభుత్వ భూములనూ స్వాహా చేశాడు. దీనికి రాజకీయ నేతలు, పోలీసు, రెవెన్యూ అధికారులు నయీమ్‌కు సహకరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సిట్ దర్యాప్తులో దాదాపు 1,500 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలను గుర్తించింది. నయీమ్ కుటుంబసభ్యుల పేరునే దాదాపు 800 ఎకరాలున్నట్టు సమాచారం. దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని భూముల వివరాలు వెలుగు చూసే అవకాశముంది. నయీమ్ కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి చట్టపరంగా ఉన్న ఇబ్బందులను పరిశీలించాల్సిందిగా న్యాయశాఖను ఆదేశించినట్టు తెలిసింది. రెవెన్యూ అధికారులు కూడా ఆ భూముల వివరాలపై ఆరా తీస్తున్నారు. వీటిలో ప్రభుత్వ భూములను నేరుగా స్వాధీనం చేసుకోనుండగా, పట్టా భూముల విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండు పడక గదుల ఇళ్లకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న రెండు పడకగదుల ఇళ్ల పథకం ఇంకా ముందుకు కదలటంలేదు. ఒకటి, రెండుచోట్ల మినహా ఎక్కడా ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. దీనికి స్థలాల కొరత ఉంది. ఈ నేపథ్యంలో నయీం కబ్జాలో ఉన్న భూముల్లో రెండు పడక గదుల ఇళ్లకు యోగ్యంగా ఉన్న వాటి వివరాలను అందించాల్సిందిగా ము ఖ్యమంత్రి కార్యాలయం నుంచి రెవె న్యూ అధికారులకు ఆదేశం అందింది. స్థానిక అధికారులు ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమయ్యారు. -
నాకు డబ్బే ముఖ్యం
* స్నేహం గీహం జాన్తానై * నీ ఇంట్లో మగదిక్కు లేకుండా చంపాలనుకున్నా * చిన్ననాటి స్నేహితుడు సోమ రామకృష్ణకు నయీమ్ బెదిరింపులు * నాటి భయంకర రోజులను గుర్తుచేసుకున్న రామకృష్ణ భువనగిరి: ‘‘నేను నక్సలైట్లతో పోరాడుతున్నా.. నాకు డబ్బే ముఖ్యం.. దానికి మించి మరేది నాకవసరం లేదు.. నేను కబ్జా చేసిన భూమిని ప్రభుత్వంతో ఒత్తిడి తెచ్చి తీసుకున్నారు.. నాకు నష్టం జరిగింది.. ఇప్పటి వరకు ఎవరూ ఇలా తీసుకోలేదు. అంతటితో ఆగకుండా మీ తమ్ముడు నాపై ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఆ సంగతి నాకు వెంటనే తెలిసింది. దీంతో మీ ఇంట్లో మగ దిక్కులేకుండా చేద్దామనుకున్నా.. నీవు త్రుటిలో తప్పించుకున్నావు. మీ తమ్ముడ్ని చంపేశాం..’’ అని నయీమ్ తనను బెదిరించినట్టు భువనగిరికి చెందిన సోమ రామకృష్ణ అలియాస్ నవత రాము చెప్పారు. చిన్నతనంలో నయీమ్, ఈయన స్నేహితులు. కొన్నాళ్ల తర్వాత ఓ భూమి విషయంలో ఈయనను సైతం నయీమ్ బెదిరించాడు. రామకృష్ణ సోమవారం తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నా తమ్ముడి తల కోసి చంపాడు.. నయీమ్, నేను స్థానిక డిగ్రీ కళాశాలలో చదువుకున్నాం. అప్పట్నుంచే స్నేహితులం. మా ఇంటికి వచ్చేవాడు. చదువుకునే సమయంలో చురుగ్గా ఉండేవాడు. పాములతో భయపెట్టేవాడు. ఆయన సోదరిని నల్లగొండలో దగ్గరి బంధువు ప్రేమ పేరుతో మోసం చేశాడు. అప్పుడు పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తే న్యాయం జరగలేదు. దీంతో ఆగ్రహించి ఆలేరు దళంలో చేరాడు. ఆ తర్వాత నాకు కలువలేదు. 2009లో భువనగిరి మండలం ముత్తిరెడ్డి గూడెం వద్ద మా దగ్గరి బంధువు రాజ్‌కుమార్‌కు చెందిన 50 ఎకరాల స్థలంలో 11 ఎకరాల స్థలం కబ్జా పెట్టాడు. దీంతో అతడు అప్పటి ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. దగ్గరి బంధువు కావడంతో నేను కూడా ఆయనతో వెళ్లాను. దీంతో స్పందించిన ప్రభుత్వం కబ్జాలో ఉన్న స్థలాన్ని తిరిగి ఇప్పించింది. ఈ విషయంలో నేను.. రాజ్‌కుమార్‌కు సహకరించానని ఆగ్రహంతో 2010 నవంబర్ 29న నాపై భువనగిరి శివారులోని మాస్కుంట వద్ద నయీమ్ అనుచరులు హత్యాయత్నం చేశారు. కొద్దిలో తప్పించుకున్నా. ఈ విషయాన్ని అప్పటి ఎస్పీకి తమ్ముడు రాధాకృష్ణ, నేను కలిసి ఫిర్యాదు చేశాం. అయితే అక్కడ ఉన్న పోలీస్ ఒకరు నయీమ్‌కు సమాచారం అందించాడు. దీంతో కక్ష పెంచుకున్న నయీమ్ అరు నెలల తర్వాత హైదరాబాద్‌లో ఉంటున్న నా తమ్ముడు రాధాకృష్ణను ఇంటి వ ద్దే నయీమ్ అనుచరులు తల కోసి దారుణంగా చంపారు. దీంతో భయంతో వణికిపోయిన మా కుటుంబం ప్రాణాలు దక్కించుకోవడానికి ఎలాగైనా నయీమ్‌ను కలిసి రాజీ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కొందరు స్నేహితులు నయీమ్‌తో గొడవ ఎందుకని హితవు చెప్పారు. అప్పటికే పలుమార్లు నయీమ్ నుంచి పిలుపు వచ్చింది. స్నేహాన్ని గుర్తు చేసినా వినలేదు.. 2011లో నేను, నయీమ్‌ను రహస్య ప్రాంతంలో కలిశా. మా తమ్మున్ని ఎందుకు చంపావని అడిగితే ముత్తిరెడ్డిగూడెంలో కబ్జా చేసిన భూమి విషయం, పోలీస్‌లకు చేసిన ఫిర్యాదు విషయాలను చెప్పాడు. ‘మీ కుటుంబంలో మగదిక్కు లేకుండా చేయాలనుకున్నా. కానీ నీవు తప్పించుకున్నావు. నాకు కలిగిన నష్టం భర్తీ చేసుకునే వరకు వదిలేది లేదు’ అని హెచ్చరించారు. చదువుకునే రోజుల్లో చేసిన స్నేహం, అప్పటి మధుర క్షణాలు, కలిసిమెలిసి తిరిగిన పలు విషయాలు గుర్తు చేస్తే.. ‘అవన్నీ నాకు అవసరం లేదు. నేను కబ్జా చేసిన 11 ఎకరాల భూమి విషయంలో జరిగిన నష్టం పూడ్చాలి. లేదంటే ఇప్పటికే నీ తమ్ముడు చనిపోయాడు. నీతోపాటు నీ కుటుంబ సభ్యులు , నీ రక్త సంబంధీకులు ఎవరు మిగలరు. నీ ఇష్టం..’ అని బెదిరించాడు. దీంతో విధిలేక ఉన్న అస్తులు, బంగారం తెగనమ్మి, అప్పులు తెచ్చి పెద్ద మొత్తంలో చెల్లించి బయటపడ్డాను. అలాగే నాకు దగ్గరి బంధువు ఎన్నారై ఇండియాలో స్థిరపడదామని భునగిరికి వస్తే నయీమ్ బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేశాడు. దీంతో అతను అమెరికా తిరిగి వెళ్లిపోయాడు. ఇప్పటికైనా నయీమ్‌ను ఎన్కౌంటర్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేరు. కానీ కోల్పోయిన అస్తులు, డబ్బులు బాధితులకు తిరిగి ఇప్పిస్తే జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటాం. -
టీఅర్ఎస్ నేత కామం కబ్జా
-
ప్రజాస్వామ్యం ఖూనీ!
పోలీసులను ఆయుధంగా మార్చుకున్న దేశం రాజ్యాంగేతరశక్తిగా ముఖ్యనేత, ఆయన తనయుడు జిల్లాలో కొనసాగుతున్న అణచివేత...అరాచకాలు ఆ రెండు నియోజకవర్గాల్లో ఆ ఇద్దరు చెప్పిందే శాసనం రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పదవిలో ఉంటూ సమాజంలో ఆటవిక పాలన కొనసాగిస్తున్న వైనంపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ వైపు ప్రపంచమంతా కంప్యూటర్ యుగంలో దూసుకుపోతున్నా మరో వైపు అణచివేత, అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాకు చెందిన ముఖ్య నేత, ఆయన తనయుడు రాజ్యాంగేతరశక్తిగా మారి ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారు. పోలీసులను ఆయుధంగా మలచుకొని తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. జిల్లాలోని ఆ రెండు నియోజకవర్గాల్లో వారు చెప్పిందే శాసనం. కన్ను పడితే కబ్జానే.. వ్యాపారమైనా, భవన నిర్మాణమైనా, చివరకు లాటరీ తగిలినా ఆయనకు కప్పం కట్టాల్సిందేనంటున్నారు. - సాక్షి, గుంటూరు గుంటూరు : జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేత, ఆయన తనయుడు సాగిస్తున్న అరాచక పాలన చూస్తే భీతిల్లాల్సిందే. దౌర్జన్యాలు, బెదిరింపులు, కబ్జాలు, అక్రమ రవాణా, నెలవారీ వసూళ్లు ఇలా పలు రకాల నియంతృత్వ పోకడలు అనుసరిస్తూ వివిధ వర్గాలను పీల్చిపిప్పి చేస్తున్నారు. వీరి వ్యవహారశైలికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం భయకంపితులవుతున్నారు. వ్యాపారులు సైతం కలవరపాటుకు గురవుతున్నారు. నరకాసుర కోటగా .... అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నరసరావుపేటను సరకాసుర కోటగా మార్చేశారు. సత్తెనపల్లిని సర్వ నాశనం చేసేశారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ఎవరైనా సరే ముఖ్యనేత తనయుడు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ఆయనకు కావాలంటే సొంత భూమినైనా వదిలేసి వెళ్లాల్సిందే. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో కేబుల్ నెట్వర్క్ నడుపుతున్న వారిని బెదిరించి తమ కనెక్షన్లు మాత్రమే ఉండాలంటూ నిర్వాహకులకు హుకుం జారీ చేశారు. నరసరావుపేట పట్టణంలో ఏడాది కిందట జీసీవీని తనకు అప్పగించాలంటూ ఆదేశించారు. అందుకు అంగీకరించకపోవడంతో తన గూండాలను పంపి దాడులకు తెగబడ్డారు.కార్యాలయంపై దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. నేటికీ ఆ కేసులో ఒక్క నిందితుడిని కూడా గుర్తించని పరిస్థితి. ఎన్‌సీవీని నిర్వీర్యం చేయాలనే... పట్టణంలో నడుస్తున్న ఎన్‌సీవీని సైతం నిర్వీర్యం చేసి తన చానల్ మాత్రమే ఉండాలనే పథక రచన చేశారు. ఎన్సీవీ నుంచి కనెక్షన్లు తీసుకుంటున్న కేబుల్ ఆపరేటర్లను ఒక్కొక్కరినీ బెదిరిస్తూ తమ వైపున కు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిత్యం కేబుల్ వైర్లు కట్ చేయడం.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంత చేసినా ఎన్సీవీ యాజమాన్యం లొంగకపోవడంతో సోమవారం సాయంత్రం ఎన్సీవీ కార్యాలయంపై తన గూండాలతో దాడి చేయించి వైర్లు కట్ చేయడమే కాకుండా కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు కళ్లు తెరిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు విన్నవిస్తున్నారు. -
స్వరాజ్య మైదానాన్ని కాపాడండి
► ఇప్పటికే కబ్జాకు గురైన భూములపై చర్యలు తీసుకోండి ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ► అడుసుమిల్లి జయప్రకాశ్ పిటిషన్ విచారణకు స్వీకరణ హైదరాబాద్: విజయవాడలోని స్వరాజ్య మైదానం స్థలాలు కబ్జాకు గురవుతున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం స్పందించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ మునిసిపల్ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. స్వరాజ్ మైదాన్‌కు చెందిన స్థలాలు కబ్జాకు గురికాకుండా చూడాలని హైకోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇప్పటికే ఏవైనా స్థలాలు కబ్జాకు గురై ఉంటే వాటి విషయంలో చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. స్వరాజ్ మైదాన్ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అడుసుమిల్లి జయప్రకాశ్ గతేడాది పిల్ దాఖలు చేశారు. సోమవారం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, స్వరాజ్ మైదాన్ భూముల్లో భారీ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని, దీనిపై సర్కారు దృష్టి సారించడం లేదన్నారు. అక్రమ నిర్మాణాలు లేవని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీచేసి విచారణ వాయిదా వేసింది. -
వివరాల్లేకుండా సమావేశానికొస్తారా?
అధికారులపై హౌస్ కమిటీ ఆగ్రహం హైదరాబాద్: ప్రభుత్వ భూముల అక్రమ అమ్మకాలు, కబ్జాలపై పూర్తి వివరాల్లేకుండా సమావేశానికి హాజరైన అధికారులపై హౌస్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం శనివారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. సమావేశంలో గతంలో ఏపీఐఐసీకి కేటాయించిన భూము లు, అందులో జరిగిన అక్రమాల్ని సమీక్షించా రు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్, హన్మకొండ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని అసైన్డు భూములపై సమీక్ష జరిగింది. అయితే, అధికారులు వీటిపై పూర్తి వివరాల్లేకుండా సమావేశానికి హాజరయ్యారు. దీంతో వచ్చే సమావేశానికి అన్ని వివరాలతో రావాలని హౌస్ కమిటీ సభ్యులు వారిని ఆదేశించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. జీఓ 58, 59 ద్వారా బడా బాబుల భూములను క్రమబద్ధీకరించవద్దన్నారు. ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు మాత్రమే ప్రయోజం చేకూరేలా నిర్ణయాలుండాలన్నా రు. ప్రభుత్వ భూములను ఏ ప్రయోజనం కోసం ఇచ్చారో, దానికోసమే వినియోగించాలని, లేనిపక్షంలో వాటిని వెనక్కి తీసుకోవాలన్నారు. కమిటీ సభ్యుల్లో ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, ఎన్వీవీఎస్ ప్రభాకర్, మిరాజ్ హుస్సేన్, రేఖానాయక్, ఎమ్మెల్సీ రాములు నాయక్ సమావే శానికి హాజరయ్యారు. -
కబ్జాపై కన్నెర్ర
చెరువు ఆక్రమణపై కాపుశెట్టివానిపాలెం గ్రామస్తుల ఆందోళన విజయనగరం-అనకాపల్లి రహదారిపై బైఠాయింపు.. ట్రాఫిక్ జామ్ అనకాపల్లిరూరల్: అనకాపల్లి మండలంలోని రేబాక పరిధిలో ఉన్న కాపుశెట్టివానిపాలెంలో చెరువు కబ్జాపై గ్రామస్తులు ఆగ్రహించారు. ఆక్రమణదారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం విజయనగరం-అనకాపల్లి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గ్రామంలో 13.72 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉందని, చెరువును ఆనుకుని ఓ వ్యక్తి క్రషర్‌ను నిర్విహ స్తూ చెరువును ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. చెరువు స్థలాన్ని సొంత జాగా కింద పాస్‌బుక్, అడంగల్ సృష్టించినట్లు పేర్కొన్నారు. విజయనగరం రాజులు దానంగా ఇచ్చిన భూమిలో చెరువు ఉందని, చెరువు స్థలంపై క్రయ, విక్రయాలకు ఎలాంటి ఆస్కారం లేదని, గతంలో ఈ చెరువులో ఉపాధి పనులు కూడా జరిగాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అది జిరాయితీ భూమి అయితే అప్పట్లో ఉపాధి పనులు ఎందుకు నిర్వహించారో చెప్పాలని ప్రశ్నించారు. చెరువు కింద వంద ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపారు. ఆ చెరువును కప్పివేస్తే భూములన్నీ బీడువారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో అక్కడ నుంచి గ్రామస్తులు నేరుగా రెండు లారీల్లో తహసీల్దారును కలిసేందుకు అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడకు వెళ్లి ధర్నా చేయగా తహశీల్దార్ కార్యాలయం వద్ద ఒక్కసారిగా అలజడి నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామీణ పోలీసులు పహారా కాశారు. తర్వాత తహశీల్దార్ కృష్ణమూర్తి వచ్చి కాపుశెట్టివానిపాలెం గ్రామస్తులతో మాట్లాడారు. రికార్డులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. ఆందోళనలో గ్రామస్తులు మంత్రి సత్యనారాయణ, కాపుశెట్టి అర్జునరావు, కె.రమణబాబు, బొద్దపు కోటేశ్వరరావు, కరణం నాగసాయిరాం, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భూమి కొట్టేశారు బోర్డు పెట్టేశారు!
కాపులుప్పాడలో వైద్యుడి భూమి దురాక్రమణ నకిలీ డాక్యుమెంట్లు, వారసులను పుట్టించిన ఘనులు రూ.3 కోట్లకు పైగా విలువైన భూమిలో కబ్జాదారుల పాగా ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీసు విభాగాలు నగరంలో ఆయనో ప్రముఖ వైద్యుడు. తన వారసుల కోసం ఎప్పుడో పాతికేళ్ల క్రితం కొంత స్థలం కొనుగోలు చేశారు. కొంత కాలం అందులో వ్యవసాయం చేయించినా ఆ తర్వాత దాన్ని ఖాళీగా వదిలేశారు.ఇటీవలి కాలంలో నగరంలో భూములు బంగారంగా మారాయి. ఈ వైద్యుడి భూమి ధర కూడా కోట్లకు పెరిగింది. సహజంగా అది కబ్జాదారులను ఆకర్షించింది. అంతే.. కొద్దిరోజుల క్రితం ఆ భూమిలో ఒక బోర్డు ప్రత్యక్షమైంది. ఆ భూమి తమదంటూ గౌతమ్ అనే వ్యక్తి పేరుతో వెలసిన ఆ బోర్డు చూసి వైద్యుడు అవాక్కయ్యారు. అందులో ఉన్న నెంబరుకు ఫోన్ చేస్తే రైతుల నుంచి కొనుగోలు చేశామని చెప్పి అవతలి వ్యక్తి ఫోను పెట్టాశారు.అప్పటి నుంచీ సదరు వైద్యుడి పరిస్థితి ఎక్కే గడప.. దిగే గడప అన్నట్లు తయారైంది. భూమికి సంబంధించి తన వద్ద ఉన్న దస్తావేజులు పట్టుకొని తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్, పోలీస్‌స్టేషన్.. ఇలా అన్నిచోట్లకు వెళ్లి మొరపెట్టుకున్నా.. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కారణం.. కబ్జాదారులకు రాజకీయ పెద్దల ప్రాపకం ఉండటమే!.. విశాఖపట్నం : భూమే బంగారంగా మారిన విశాఖ నగరంలో కోట్ల విలువైన స్థలాల కబ్జాలు.. డబుల్, త్రిబుల్ ఎంట్రీలతో రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదు. రిజిస్ట్రేషన్ సమయంలో భూమి అసలు వారసులు, పట్టాదారులు ఎవరన్నది నిర్థారించుకోకుండానే ఎడాపెడా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. దీంతో అసలు పట్టాదారులు అన్యాయమైపోతున్నారు. ఓ ప్రముఖ వైద్యుడికే ఇలాంటి అన్యాయం జరిగిందంటే.. ఇక సామాన్యుల భూములకు రక్షణ ఎక్కడుంటుంది!. రెండున్నర దశాబ్దాల క్రితం.. నగరంలో ప్రముఖ వైద్యుడైన బి.బాలచంద్రుడు 1991లో కాపులుప్పాడ సర్వే నెం.29-3లో 47 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఒకప్పుడు ఆ భూమి కొల్లి అప్పయ్య, గుడ్ల తమ్మయ్యల ఉమ్మడి యాజమాన్యంలో ఉండేది. అప్పయ్య కుమారులు కొల్లి యర్రయ్య, రామస్వామిల నుంచి ఇరవైమూడున్నర సెంట్లు, తమ్మయ్య కుమారుడు రామ్మూర్తి నుంచి మరో ఇరవైమూన్నర సెంట్లు చొప్పున సింగవరపు సుధాకర్ కొనుగోలు చేశారు. ఆయన నుంచి బాలచంద్రుడు కొనుగోలు చేసి.. తనతో పాటు తన భార్య కమలాదేవి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చాలా కాలం పాటు ఆ భూమిలో వ్యవసాయం కూడా చేయించారు కూడా. నకిలీ వారసులతో నాటకం నగరం పెరగడంతో భూములు, స్థలాల రేట్లు పెరిగి బంగారంలా మారాయి. కాపులుప్పాడలోని బాలచంద్రుడి స్థలం విలువ కూడా కోట్లకు పెరిగింది. దాంతో కబ్జాదారులు దానిపై కన్నేశారు. కొల్లి అప్పయ్య వారసులంటూ లేని 23 మందిని సృష్టించారు. తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయించారు. వారి నుంచి ఈ భూమి కొనుగోలు చేసినట్లు చెబుతున్న ఓ వ్యక్తి.. ఆ స్థలం తనదేనంటూ బోర్డు కూడా పెట్టేశారు. విషయం తెలిసి బాలచంద్రుడు తన స్థలంలో పాతిన బోర్డుపై ఉన్న ఫోన్ నెంబరుకు ఫోన్ చేశారు. తాను అక్కడి రైతుల నుంచి ఆ స్థలం కొన్నానని అవతలి వ్యక్తి సమాధానమిచ్చారు. 1991లోనే తాను కొనుగోలు చేసి, చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిని తన ప్రమేయం లేకుండా అతనెలా కొన్నాడో వైద్యుడికి అర్ధం కాలేదు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు దీనికి కొద్ది రోజుల ముందే బాలచంద్రుడు మండల తహశీల్దార్‌ను కలిసి ఆన్లైన్ పట్టాదారు పాసుపుస్తకానికి దరఖాస్తు చేశారు. కానీ ఆ స్థలం తనదంటూ మరో వ్యక్తి కూడా వచ్చారని, ఇద్దరూ న్యాయస్థానంలో తేల్చుకోవాలని సూచించి తహశీల్దార్ తప్పించుకున్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ భీమునిపట్నం పోలీసులను ఆశ్రయించారు. వారు ఇంత వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కనీసం తప్పుడు రిజిస్ట్రేషన్ అయినా ఆపుదామని స్థానిక సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి సర్వే నెంబర్ 29-3లోనిది తనకు, తన భార్యకు చెందిన భూమి అని, ఈ సర్వే నెంబర్‌పై రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఎవరైనా వస్తే చేయవద్దని విన్నవించారు. ఆక్కడా తహశీల్దార్ కార్యాలయంలో వచ్చిన సమాధానమే వచ్చింది. భూమి తమదేనని తెలిపే అన్ని పత్రాలను ఈ మూడు చోట్లా ఆయన సమర్పించారు. కానీ ఏ ఒక్కరూ వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. కనీసం వాటి వివరాలు పరిశీలించడానికి కూడా పూనుకోలేదు. దీనికి కారణం కబ్జాకు పాల్పడిన వారికి రాజకీయ పెద్దల అండదండలుండటమేనని తెలుస్తోంది. నాలుగైదుసార్లు వెళ్లాం మా భూమిని కాపాడమని సీఐ అప్పలనాయుడుకి ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు తీసుకున్నట్లు రసీదు కూడా ఇవ్వలేదు. నాలుగైదుసార్లు ఆయన చుట్టూ తిరిగాం. చూస్తాం చేస్తాం అంటూ పట్టించుకోలేదు. చివరికి మా స్థలంలో ఎవరో ఏకంగా బోర్డు పాతేశారు. మా సర్వే నెంబర్‌పై ఎవరైనా రిజిస్ట్రేషన్‌కు వస్తే చేయవద్దని రిజిస్ట్రార్‌కు పిటిషన్ ఇచ్చాం. ఆయన రిజిస్ట్రేషన్ ఆపడం కుదరదన్నారు. ఆన్లైన్ పాసుపుస్తకం ఇమ్మని తహశీల్దార్ రామారావుకు దరఖాస్తు చేశాం. వివాదంలో ఉన్నదానికి ఇవ్వలేమని కోర్టులో తేల్చుకోమని ఆయన చేతులు దులుపుకున్నారు. ఇంక మాకు న్యాయం చేసేదెవరు. - బలుసు బాలచంద్రుడు, బాధితుడు ఆ సమస్య లేదనుకున్నాం తన భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ బలుసు బాలచంద్రుడు అనే వ్యక్తి నాలుగైదు నెలల క్రితం మా స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే మా సిబ్బంది ఆయనను తీసుకుని ఆ భూమి వద్దకు వెళ్లారు. సరిహద్దులు వేయించి, ఏదైనా సమస్య వస్తే చెప్పమన్నాం. అయితే ఆ తర్వాత బాలచంద్రుడు మా వద్దకు రాలేదు. సమస్య లేదనుకుని ఊరుకున్నాం. కబ్జా జరిగినట్లు ఆయన వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. - టి.అప్పలనాయడు, సీఐ, భీమిలి. -
కబ్జాలపాటి
శాతవాహన కళాశాల స్థలం కబ్జాకు వ్యూహం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎగ్జిబిషన్‌కు అనుమతి ఫిర్యాదు చేసినా స్పందించని అధికార యంత్రాంగం అధికార పార్టీ పెద్దల ప్రమేయం అమరావతి : విజయవాడ నగరంలో అధికార పార్టీ నేతల కబ్జాలు మితిమీరుతున్నాయి. కంటికి కనిపించిన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న అధికార పార్టీ పెద్దలు... ఇప్పుడు ప్రైవేటు స్థలాల పైనా కన్నేశారు. సర్వోత్తమ న్యాయస్థానం ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ అధికార పార్టీ నేతలు సాగిస్తున్న కబ్జాల పర్వానికి ‘శాతవాహన కళాశాల’ స్థల వివాదం ప్రత్యక్ష ఉదాహరణ. ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటం, వారికీ కబ్జాలో వాటా ఇస్తుండటంతో.. అధికార పార్టీ నేతల కబ్జాలను చూస్తూ ఊరుకోవాల్సిందేనంటూ అధికార యంత్రాంగానికి హుకుం జారీ చేస్తుండటం గమనార్హం. వివాదం తేలే వరకు శాతవాహన కళాశాల స్థలం విషయంలో యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలను ధిక్కరించి అధికార పార్టీ నాయకులు స్థలాన్ని కబ్జా చేయడానికి ఒక్కో అడుగూ వేస్తూ పోతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. వివాదం తేలే వరకు ఎలాంటి కార్యకలాపాలూ ఆ స్థలంలో నిర్వహించడానికి వీల్లేకపోయినా.. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి శాతవాహన కళాశాల కమిటీ కార్యదర్శి హోదాలో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అనుమతి ఇవ్వడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఏకపక్షంగా ఎగ్జిబిషన్‌కు ఎలా అనుమతి ఇస్తారంటూ స్థలం అసలు యజమాని అభ్యంతరం చెప్పినా.. అధికార పార్టీ నేతలు లక్ష్యపెట్టలేదు. దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరించారని బెజవాడలో ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసి న్యాయం చేయండి మహాప్రభో.. అంటూ జిల్లా కలెక్టర్ మొదలు అధికార యంత్రాంగాన్ని వేడుకున్నా... ప్రభుత్వ పెద్దలకు భయపడి అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ‘ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టారు.. తర్వాత స్థలాన్ని కబ్జాచేసి పారేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలకే దిక్కులేకపోతే ఎలా? అధికార యంత్రాంగం ఏమీ చేయలేకపోతే.. ఎవరికి చెప్పుకోవాలి’ అంటూ బాధితులు అధికారుల వద్ద వాపోయినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. వివాదం ఇదీ.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు-11లో ఉన్న 5.10 ఎకరాల భూమిని దుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి 1974లో విక్రయించడానికి స్థలం యజమాని బోయపాటి శ్రీనివాస అప్పారావు ‘షరతులతో కూడిన ఒప్పందం’ చేసుకున్నారు. పట్టణ గరిష్ట భూ పరిమితి చట్టం నుంచి తప్పించుకోవడానికి వీలుగా సొసైటీతో ఒప్పందం చేశారు. ఒప్పందం జరిగింది కానీ.. భూమిని సొసైటీకి అప్పజెప్పడం కానీ, విక్రయ రిజిస్ట్రేషన్ కానీ చేయలేదు. భూమిని తమకు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వమని కోరుతూ 1991లో సొసైటీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భూమిపై సొసైటీకి హక్కులేదని సివిల్ కోర్టు తీర్పు చెప్పింది. జిల్లా కోర్టు కూడా ఈ తీర్పునే సమర్థించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన న్యాయపోరాటంలో అప్పారావు గెలిచారు. తాము చెల్లించిన సొమ్ము వడ్డీ సహా చెల్లించమని సొసైటీ చేసిన డిమాండ్‌కు అప్పారావు సానుకూలంగా స్పందించడంతో.. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. ఈ మేరకు లోక్ అదాలత్ అవార్డు కూడా ఇచ్చింది. సొసైటీకి అప్పారావు రూ.9 లక్షలు చెల్లించారు. ఆలపాటి రాజా ఎంట్రీ... వివాదాస్పద స్థలంపై 2011లో టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ కన్నుపడింది. దీంతో సొసైటీ కార్యదర్శిగా ఉన్న కామేశ్వరరావు రాజీనామా చేయడం, తర్వాత రోజే సొసైటీ కార్యవర్గ సభ్యుడిగా, కార్యదర్శిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్నికవడం చకచకా జరిగిపోయాయి. సొసైటీ కార్యదర్శి మార్పు చెల్లదంటూ మాజీ కార్యదర్శి జగపతిరావు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆయన వాదనతో కోర్టు ఏకీభవించింది. సొసైటీ కార్యదర్శిగా ఆలపాటి రాజా నియామకం/నామినేషన్ చెల్లదని తీర్పు చెప్పింది. సొసైటీ కార్యదర్శిగా కొనసాగడానికి అవకాశం లేకపోవడంతో.. అదే సొసైటీ నడుపుతున్న శాతవాహన కళాశాల కార్యదర్శి/కరెస్పాండెంట్‌గా ఆయన తెరపైకి వచ్చారు. ఏదో రకంగా సొసైటీని గుప్పెట్లో పెట్టుకొని స్థలాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. భూమి యజమాని, సొసైటీ మధ్య రాజీ కుదరలేదని, ఫోర్జరీ సంతకాలు చేశారంటూ సొసైటీ కార్యదర్శి కామేశ్వరరావు మళ్లీ కేసు దాఖలు చేశారు. ఈ కేసు వేయడం వెనక ఆలపాటి రాజా ఉన్నారని సమాచారం. ఈ కేసును హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ భూమి యజమాని అప్పారావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూమి విషయంలో తుది తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో రద్దయిపోయింది దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న శాతవాహన కళాశాలను కార్యదర్శి, కరస్పాండెంట్‌గా టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను ఎంపిక చేయడం నిబంధనలకు విరుద్ధమని, సొసైటీ సభ్యుల్లోనూ తీవ్ర విభేదాలున్నాయని, సొసైటీ కార్యవర్గాన్ని రద్దు చేసి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వివాదాలు ముగిసే వరకు ప్రత్యేక అధికారికి సొసైటీ బాధ్యతలను స్పెషల్ ఆఫీసర్‌కు అప్పగించాలని అడ్వకేట్ జనరల్‌తో పాటు ఉన్నత విద్యా శాఖ న్యాయవాది కూడా ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో శాతవాహన కళాశాల యాజమాన్యాన్ని రద్దు చేసి, బాధ్యతను కలెక్టర్‌కు అప్పగిస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సునీత దావ్రా 2015 మార్చి 17న ఉత్తర్వులు (జీవో-84) జారీ చేశారు. ఏం జరిగిందో.. ఏమో.. సరిగ్గా 10 రోజులకు జీవో-84ను పక్కన (అబేయన్స్‌లో) పెడుతూ మరో ఉత్తర్వును (జీవో-97) జారీ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన పలుకుబడితో ఉత్తర్వులను రద్దు చేయించారని ఉన్నత విద్యాశాఖలో ప్రచారం జరుగుతోంది. ఎగ్జిబిషన్‌కు అనుమతి సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ సొసైటీ, కళాశాల యాజమాన్యం వివాదాస్పద స్థలాన్ని ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. స్థలం తమ చేతుల్లో ఉందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెప్పుకోవడానికి, ఆ మేరకు ఆధారాలు సంపాదించుకోవడానికి వీలుగా అధికార బలంలో ఎగ్జిబిషన్ నిర్వహణకు స్థలాన్ని ఇచ్చారని, సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడాన్ని ప్రశ్నిస్తూ అప్పారావు ప్రభుత్వ యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసినా.. ప్రభుత్వ పెద్దలకు భయపడి అధికారులు స్పందించడం లేదు. -
స్మశాన వాటిక కబ్జా
- దళితుల ఆందోళన జహీరాబాద్ టౌన్: తమకు ప్రభుత్వం ఇచ్చిన స్మశాన వాటిక స్థలం కబ్జా అవుతోందంటూ గ్రామస్తులు ధర్నాకు పూనుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని బుర్దిపాడ్ గ్రామంలోని దళితులకు ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం మూడెకరాల స్థలాన్ని సర్వే నంబర్ 83లో స్మశాన వాటిక కోసం కేటాయించింది. అయితే, ఈ స్థలం ఆనుకుని ఉన్న రైతులు దానిని కొద్దికొద్దిగా కలుపుకుంటున్నారు. దీనిపై దళితులంతా కలసి శుక్రవారం మధ్యాహ్నం జహీరాబాద్‌కు తరలివచ్చారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. స్మశాన వాటికను కబ్జాదారుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. స్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేసి ఇస్తామని డిప్యూటీ తహశీల్దార్ దశరథ్ హామీ ఇచ్చారు. సోమవారం తహశీల్దార్ అనిల్, ఆర్ఐ. షఫీ, సర్వేయర్లు గ్రామానికి వస్తారని తెలపటంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. -
మాన్యం.. దైన్యం..!
♦ ఆలయ భూములను పరిరక్షించాలి ♦ ప్రజావాణిలో విజ్ఞప్తి చేసిన సామాజిక కార్యకర్త సంగారెడ్డి జోన్: ఆలయ భూములను కొందరు కబ్జాదారులు, అధికారుతో మిలాఖతై కాజేశారని, సమాచార హక్కు చట్టం ద్వారా సాధించుకున్న తీర్పును అమలు చేయకపోవడమే కాకుండా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఓ సామాజిక కార్యకర్త జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజావిజ్ఞాప్తుల దినోత్సవాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. ఏజేసీ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ వర్షిణి, డీఆర్వో దయానంద్ వివిధ శాఖల అధికారులు ప్రజాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా హత్నుర మండలం చిక్‌మద్దూర్ అభయాంజనేయ స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని , అట్టి భూములను పరిరక్షించాలని సామాజిక కార్యకర్త ప్రవీణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బాధ్యులను శిక్షించాలి.. బాల్య వివాహాన్ని అడ్డుకుందనే అనుమానంతో దాయాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జహీరాబాద్ మండలం ఖాసీంపూర్కు చెందిన వడ్ల నర్సమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఆమె హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, జిల్లా కార్యదర్శి మల్లేశ్వరి ఏజేసీకి వాసం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. పట్టాపాస్‌పుస్తకాలు ఇప్పించండి.. మాజీ మిలిటెంట్ అయిన తన భర్త సుందరయ్య 2004లో తూప్రాన్ డీఎస్పీ ఎదుట లొంగిపోయారని, పునరావాసం కింద సర్వే నం. 283లో అయిదెకరాల భూమి సాగుచేసుకుంటున్న తనకు పట్టా పాస్‌బుక్‌లను మంజూరు చేయాలని వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామానికి చెందిన భూదమ్మ విజ్ఞప్తి చేశారు. నష్ట పరిహారం ఇప్పించండి.. నిమ్జ్ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన నర్సమ్మ, యాదమ్మ, గోపమ్మలు వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని సర్వే నం. 125లోని భూములను ప్రభుత్వం సేకరిస్తున్నందున తమకు నష్టపరిహారం ఇప్పించాలన్నారు. తన పట్టాభూమిలో ఉన్న సర్వే నెంబర్ 39,40లోగల రోడ్డుకు ఇరువైపులా ఉన్న వేప, మామిడి, రేగు చెట్లను నరికివేయటం వలన సుమారు రూ.2లక్షలు నష్టపోయానని తనకు న్యాయం చేయాలని జహీరాబాద్ మండలం మొగుడంపల్లికి చెందిన బక్కారెడ్డి విజ్ఞప్తి చేశారు. శిక్షణ ఇప్పించండి.. జీఆర్ఈ టోఫెల్లో శిక్షణ పొందిందేకు తనకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందజేయాలని చిన్నకోడూరు మండలం మాచపూర్కు చెందిన గాజుల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న అర్జీలను బుట్టదాఖలు చేయడమే కాకుండా అనేక అక్రమాలకు పాల్పడుతున్న సంగారెడ్డి మున్సిపల్లోని ఆర్ఐ వెంకట్రావ్, టీపీఎస్ రాజేంద్రప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డిలోని సాయి మాణిక్యనగర్ కాలనీ చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. హన్ములవాసికుంట అభివృద్ధి పనులను ఆయకట్టు రైతులకు అప్పగించాలని శివ్వంపేట మండలం పిల్లుట్లగ్రామానికి చెందిన రైతులు బాలయ్య, లక్ష్మయ్య, లచ్చయ్య కోరారు. ఎన్ఆర్ఇజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ అనేక అక్రమాలకు పాల్పడుతూ పని చేసిన కూలీలకు కాకుండా పని చేయని వారికి హాజరు వేస్తూ బీదర్ నుంచి కార్యకలాపాలు చేపడుతున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాల్కల్ మండలం వాల్గి గ్రామస్తులు ఆశోక్, నర్సింహా పిర్యాదు చేశారు. మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయంలో ఆరు సంవత్సరాలుగా డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న ఎండీ షకీర్ అలీని బదిలీ చేయాలని సామాజిక కార్యకర్త మహ్మద్ నిజామొద్దీన్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. -
చెరువు శిఖం.. మాయం
ఇప్పటికే 40 ఎకరాలు కబ్జా పోటీపడి వాలుతున్న అక్రమార్కులు తాజాగా మూడెకరాల ఆక్రమణకు యత్నం అంతుచిక్కని రెవెన్యూ అధికారులు మౌనం పరకాల : పరకాల పట్టణ నడిబొడ్డున ఉన్న విలువైన భూమిపై కబ్జాదారులు కన్నేశారు. దామెర చెరువు శిఖం భూమిపై రెక్కలు కట్టుకుని వాలుతున్నారు. అసలు శిఖం భూమా.. లేక పట్టా భూమా అనే విషయం రెవెన్యూ అధికారులు వెల్లడించకపోవడంతో ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నారుు. శిఖం భూమిని రక్షించాలని పలువురు నేరుగా ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడం చూస్తే వీరి పాత్రపైనా అనుమానాలు కలుగుతున్నారుు. గతంలో కబ్జాకు గురైన భూమిని వెలికి తీయడంలో వెనుకంజ వేసిన అధికారులు ఇప్పుడు మరో ఆక్రమణ జరుగుతుంటే కూడా నోరు మెదపడం లేదు. కాకతీయుల కాలంనాటి దామెర చెరువు శిఖం భూమి రోజురోజుకూ తగ్గిపోతోంది. రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 604లో దామెర చెరువు శిఖం భూమి 103 ఎకరాల 20గుంటలు ఉంది. కానీ, ఇప్పుడు సుమారు 40 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. అక్రమార్కులు దర్జాగా కబ్జా చేయడంతో 2012లో అప్పటి జారుుంట్ కలెక్టర్‌కు పట్టణ ప్రజలు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో స్వయంగా జేసీ దామెర చెరువు వద్దకు వచ్చి విచారణ జరిపారు. 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించి నోటీసులను సైతం అందించారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు గానీ నోటీసుల విషయం అటకెక్కింది. ట్యాంక్‌బండ్ పనులతో తెరపైకి.. పట్టణం క్రమంగా విస్తరిస్తుండడంతో దామెర చెరువు ఆయకట్టు కింద నివాస ప్రాంతాలు వెలిశాయి. పారకం లేక చెరువులోనే నీళ్లు నిల్వ ఉంటున్నారుు. సమ్మర్ స్టోరేజీగా ఉపయోగించాలని చాలా రోజుల నుంచి ప్రజలు కోరుతూ వస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో దామెరు చెరువు అభివృద్ధికి తొలి అడుగు పడింది. మినీ ట్యాంకుబండ్‌గా తీర్చిదిద్దడం కోసం రూ.3.80కోట్లు మంజూరయ్యాయి. రెవెన్యూ అధికారులు హద్దులు నిర్ణయించి ఇరిగేషన్ అధికారులకు అప్పగిస్తే పనులు చేయాలి. కానీ తూతూమంత్రంగా సర్వేను చేసి అప్పగించడంతో తరుచూ వివాదం తలెత్తుతోంది. చెరువు శిఖంలో తమ భూమి ఉన్నదని కొందరు అంటున్నారు. గజం భూమికి వేలల్లో ధర పలుకుతుండడంతో అక్రమార్కులు ఏదో సాకుతో శిఖంపై వాలుతున్నారు. తాజాగా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దామెర చెరువు భూమిలో తమకు మూడు ఎకరాల భూమి ఉందని బుధవారం పూడిక మట్టితో నింపడం ప్రారంభించడంతో స్థానికులు అడ్డుకున్నారు. చెరువు మధ్యలోకి పోయి మరీ మట్టిని పోసి చదును చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయూన్ని స్థానికులు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. చివరకు కలెక్టర్‌కు సమాచారం అందించడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు మట్టి పోయవద్దని నిలిపివేశారు. ఇప్పటికైనా చెరువు భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
అడవులూ అన్యాక్రాంతం!
9 జిల్లాల్లో 29,318 ఎకరాల అటవీ భూముల కబ్జా హైదరాబాద్: వేలాది ఎకరాల భూములు ఆక్రమణ దారుల హస్తగతం అవుతున్నాయి. అంగ, అర్థ, రాజకీయ బలం ఉన్న వ్యక్తులు కనిపించిన చోటల్లా కబ్జా చేసేస్తున్నారు. వీటిల్లో అడవులను నరికేసి ఆక్రమించుకున్న భూములు కొన్నయితే.. మైదాన ప్రాంతాల్లో ఉన్న భూములు మరికొన్ని. పేదలు, గిరిజనులు పోడు వ్యవసాయం కోసం భూములు దున్నుకుంటే హంగామా సృష్టించి భయభ్రాంతులకు గురిచేసే అటవీ అధికారులు.. బడా వ్యక్తులు కబ్జా చేసుకున్న వందల ఎకరాల గురించి పట్టించుకోలేదు. తాజాగా ‘తెలంగాణకు హరిత హారం’ ప్రాజెక్టులో భాగంగా కబ్జాదారుల చెరలో ఉన్న అటవీ భూముల వివరాలను జిల్లాల వారీగా అటవీ శాఖ సేకరించింది. హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో 29,318.37 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది. ఈ భూములను 2,431 మంది ఆక్రమించుకున్నట్లు అధికారులు తేల్చారు. ఇందులో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ల్లోనే 25 వేల ఎకరాలకు పైగా ఉన్నాయి. స్వాధీనానికి అటవీ శాఖ కసరత్తు వ్యవసాయ అవసరాల కోసం పేద రైతులు, గిరిజనుల అధీనంలో ఉన్న భూములు మినహాయించి, 10 ఎకరాలకుపైగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోని భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం అటవీ శాఖను ఆదేశించింది. దీంతో 12,508 ఎకరాల అటవీ భూములను జిల్లా పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ రికార్డుల్లో ఉంది. ఇందులో ఖమ్మంలో అత్యధికంగా 10,064, ఆదిలాబాద్‌లో 1,671, నిజామాబాద్‌లో 708 ఎకరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో కబ్జాదారుల చేతిలో ఉన్న 64.32 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని మొక్కల పెంపకానికి సిద్ధం చేశారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో భూములు ఆక్రమించిన పలువురిపై పీడీ చట్టం కింద కేసులు కూడా నమోదు చేయడం గమనార్హం. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న 12 వేల ఎకరాల్లో భారీ ఎత్తున మొక్కలు నాటాలని అటవీ శాఖ నిర్ణయించింది. అటవీ శాఖకు చెందిన భూముల విషయంలో రెవెన్యూ విభాగంతో కూడా వివాదాలున్నాయి. దీంతో అటవీ భూముల వివాదంపై సర్వే జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. -
కబ్జా కోరల్లో బుడమేరు
ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు గజం రూ.20 వే లకు విక్రయం రామకృష్ణాపురం, ఇందిరానాయక్ నగర్లో ఆక్రమణలు పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు విజయవాడ : బుడమేరు కబ్జా కోరల్లో చిక్కుకుంది. విజయవాడ 53వ డివిజన్ పరిధిలోని రామకృష్ణాపురం ప్రాంతంలో ఈ కబ్జా దర్జాగా సాగిపోతోంది. ఏకంగా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. ఇప్పటికే 40 ప్లాట్లు అమ్మేశారు. గజం రూ.20 వేలు వంతున ఒక్కో ప్లాటు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల చొప్పున విక్రయించేశారు. కొనుగోలు చేసినవారు ప్రహరీలు కట్టుకోవటం, మట్టి తోలి బుడమేరును పూడ్చేయటం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందిరానాయక్ నగర్ ప్రాంతంలోనూ బుడమేరును కబ్జా చేసి ప్లాట్ల అమ్మకాలు చేపట్టినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యే అండ! నగరంలోని ఒక టీడీపీ ఎమ్మెల్యే అండతో ఈ అక్రమ తంతు యథేచ్ఛగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయనకూ వాటాలు వెళుతున్నాయని సమాచారం. బుడమేరు కాలువలో డ్రెయినేజీ నీరుతో పాటు వరద నీరు కూడా వస్తుంది. సత్యనారాయణపురం పైభాగానికి వచ్చేసరికి వెడల్పు సుమారు అర కిలోమీటరు వరకు ఉంటుంది. ఇక్కడే ఈ కబ్జాలు జోరుగా జరుగుతున్నాయి. రానురానూ కాలువను పూడ్చి ఇళ్లు కట్టుకుంటున్నారు. పలు ప్రాంతాలకు ముప్పు వరదల సమయంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చినప్పుడు భగత్‌సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, పాయకాపురం, ప్రకాష్ నగర్లు మునకకు గురవుతుంటాయి. కబ్జాలు ఎక్కువ కావడంతో బుడమేరు మార్గం కుంచించుకుపోవటమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుత కబ్జాలతో ముంపు తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
కన్నుపడితే కబ్జా..!
ఖాళీ స్థలాలు మింగేస్తున్నారు.. కొండలను కాజేస్తున్నారు రాష్ట్ర కబ్జాదారుల ఖిల్లాగా మారుతున్న జిల్లా బడా నేతలు, ఉన్నతాధికారుల అండ విశాఖపట్నం: నగరం, దాని చుట్టుపక్కల భూములు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. చట్టాన్ని లెక్కచేయకుండా స్థానికులను బెదిరించి కోట్లు గడిస్తున్నారు. ముఖ్యంగా కబ్జాదారులకు మధురవాడ పరిసర ప్రాంతాలు స్వర్గధామంగా మారాయి. కొండలు, జేఎన్ఎన్యూఆర్ఎం గృహ సముదాయాలను ఆనుకుని ఉన్న స్థలాలు.. ఇలా ఒక్కటేమిటి ఏ ప్రాంతం చూసినా అంతో ఇంతో ఆక్రమణకు గురవుతూనే ఉంది. ఐటీ పార్కులు రావడం, నగరంలో స్థలాలు కరువవ్వడంతో ఇటు నివాసానికి, అటు వాణిజ్యానికి అనువైనవిగా శివారు ప్రాంతాలు మారుతున్నాయి. విద్యాసంస్థలు కూడా ఈ ప్రాంతాలకే విస్తరిస్తుండటం వల్ల ఇక్కడ భూమి బంగారమైంది. దీంతో కబ్జాదారులు కొత్త కొత్త పద్ధతులను అవలంబించి ఇక్కడి స్థలాలను కబ్జా చేస్తున్నారు. కొండలను కూడా వదలం లేదు. విశాఖలో కొండలపై ఇళ్లు సర్వసాధారణం. వాటినీ సొమ్ము చేసుకుంటున్నారు వీరు. భూ కబ్జాలను అరికట్టడానికంటూ నాలుగేళ్ల క్రితం ఏర్పడిన డాక్యుమెంట్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీం (డీఎఫ్ఐటీ) ఎక్కడా కనిపించడం లేదు. ఈ విభాగం ఒకటుందని కూడా సామాన్యులకు తెలియదు. ఇటీవల జిల్లా అధికారులతో సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు నగరంలో పెరుగుతున్న భూ కబ్జాలు, రౌడీయిజం విషయంలో అధికారులపై మండిపడ్డారు. వాటిని అరికట్టకపోతేచర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే భూ కబ్జాదారులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని భావిస్తున్న నగర పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్‌కు సీఎం మాటలు బలాన్నిచ్చాయి. కబ్జాలకు పాల్పడే నేరస్థుల చిట్టాలు తెప్పించి వారిలో అత్యంత ప్రమాదకరమైన వారిని గుర్తించే పనిని కొందరు అధికారులకు అప్పగించారు. ఇదే సమయంలో ఆక్రమణలకు గురైన భూములను క్రమబద్ధీకరించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడం అధికారులను ఇరకాటంలో పడేసింది. దీంతో ఏం చేయాలో తెలియక, ఇటు పీడీ యాక్ట్ ప్రయోగించలేక పోలీసు ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు. కబ్జాదారులు బాగుంటే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చనుకునే కింది స్థాయి పోలీసు సిబ్బంది మాత్రం ఈ విషయంలో సంబరపడుతున్నారు. నగరంలో భూ కబ్జాలపై ఉక్కు పాదం మోపకుంటే తర్వాత నిలుచోవడానికి కూడా నేల మిగలదని విశాఖవాసులు కలవరపడుతున్నారు. -
పెద్దచెరువు కాలువనూ ఆక్రమించారు!
చిన్నకోడూరు : కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా పెద్దచెరువు కాలువనే కబ్జా చేసి లక్షలాది రూపాయల విలువైన నీటిపారుదల భూములు రియల్ వ్యాపారులు కబ్జా చే శారు. ఈ సంఘటన మండల పరిధిలోని ఇబ్రహీంగనర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని రాజీవ్ రహదారికి పక్కన విలువైన భూములు ఉన్నాయి. ఇదే సమయంలో రోడ్డు విస్తరణ జరగడంతో రియల్ వ్యాపారం జోరందుకుంది. ఈ క్రమంలో ఇబ్రహీంగనర్ పెద్దచెరువు కట్టుకాలువపై కన్నేసిన రియల్ వ్యాపారులు కాలువను చదును చేసి కబ్జా చేశారు. ప్రస్తుతానికి ఎకరాకు రూ. 40 లక్షల ధర పలుకుతుండడంతో కట్టు కాలువకు చెందిన 25 గుంటలను వ్యాపారులు యథేచ్ఛగా ఆక్రమించారు. దీంతో పెద్దచెరువుపై ఆధారపడిన గ్రామ రైతులకు ఈ కబ్జా సాగునీటి ప్రవాహానికి ఆటంకంగానే మారనుందని చెప్పాలి. సంబంధిత కట్టు కాలువ కబ్జాను నియంత్రించి అధికారులు సమగ్రమైన చర్యలు చేపట్టి భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న అధికారులు స్పందించక పోవడంతో సదరు భూములు అక్రమార్కులు దర్జాగా ఆక్రమిస్తున్నారని వాపోతున్నారు. కబ్జాదారుల చెర నుంచి ఆ భూములు రక్షించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై తహశీల్దార్ పరమేశంను వివరణ కకోరగా ఇబ్రహీంనగర్ పెద్ద చెరువు కాలువను పరిశీలించి కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటాం. -
ప్రభుత్వ భూమిలో ‘ప్రైవేటు' పట్టా
ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. సర్కారు స్థలమైతే ఏకంగా పట్టాలనే సృష్టిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు రోజుకో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. వీటిని తలదన్నే రీతిలో తాజాగా సోమవారం మంథనిలో ఓ భూబాగోతం బయటపడింది. ఖాళీ స్థలంతో పాటు ఆర్డీవో వసతిగృహం, రెండు ప్రభుత్వ కార్యాలయాలున్న స్థలాన్ని పట్టా, రిజిస్ట్రేషన్ చేసుకుని దానిని మరో ముగ్గురికి అమ్మినట్టు రిజిస్ట్రేయడంతో పాటు దానిని ఆన్లైన్లో నమోదు చేసిన తీరు అధికారులనే నివ్వెరపర్చింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు కూపీ లాగుతున్నారు. మంథని : మంథని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట 108 సర్వే నంబరులో 36 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో సుమారు 18 గుంటల్లో ఆర్డీవో వసతిగృహం, మరో రెండు కార్యాలయాల పక్కా భవనాలు నిర్మించారు. మిగిలిన 18 గుంటల్లో నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘానికి కేటాయించారు. ఈ సంఘానికి కేటాయించిన భూమిలో ఇటీవల ప్లాట్లు చేస్తుండడంతో అనుమానం వచ్చిన ఉద్యోగులు సంబంధిత అధికారులను సంప్రదించారు. అధికారులు దీనిపై ఆరా తీయగా.. ఈ 36 గుంటల భూమి ముస్కె రాజు అనే వ్యక్తి పేరిట పట్టా అయిన విషయం బయటపడింది. సదరు పాసు పుస్తకాలు ఆన్‌లైన్‌లోనూ నమోదయ్యాయి. మరింత లోతుగా ఆరా తీస్తే.. ఈ భూమిని మరో ముగ్గురికి విక్రయించడంతో పాటు వారి పేరిట రిజిస్ట్రేషన్ అయిన విషయం వెలుగుచూసింది. ఈ ప్రాంతంలో గుంట స్థలానికి రూ.6-8 లక్షల ధర పలుకుతోంది. అంటే ఈ భూమి విలువ సుమారు 3కోట్లు. ఎలా జరిగింది..? ఫోర్జరీ సంతకాలతో పాసుపుస్తకాలను సృష్టించడం ఈ మధ్యకాలంలో పెద్ద కష్టమేమీ కాకపోయినా ఆన్లైన్ నమోదు మాత్రం అంత ఆషామాషీ కాదు. రైతు తన పేరును ఆన్లైన్లో నమోదు చేయాలని తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే.. వీఆర్వో ధ్రువీకరించిన అనంతరం తహశీల్దార్ తన డిజిటల్ సంతకం ద్వారా నమోదు చేస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా గతంలో తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్లు మంథని ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఈ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది. విచారణ వేగవంతం ప్రభుత్వ స్థలం ఓ ప్రైవేటు వ్యక్తి పేరిట పట్టా, రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. సబ్‌రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందో వివరాలు సేకరించి అక్కడ సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరి పాత్ర ఉందనే కోణంలో అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ప్రభుత్వ వెబ్సైట్లో అక్రమంగా పాస్‌బుక్‌లు నమోదు చేయడాన్ని సైబర్ నేరంగా భావించి ఆ దిశగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే పట్టా, రిజిస్ట్రేషన్ రద్దు చేయించి సదరు బాధ్యులపై చర్యలకు కఠిన చర్యలకు సిద్ధమైనట్టు తెలిసింది. పాస్‌బుక్ ఆధారంగానే రిజిస్ట్రేషన్ పట్టాదారు పాస్‌బుక్, ఆన్లైన్ నమోదు రికార్డుల ఆధారంగానే మేం రిజిస్ట్రేషన్ చేశాం. భూమి వివరణలో పట్టా ఉండడమే కాకుండా పట్టాదారు, అనుభవదారు ఖాతాలో యజమాని పేరు నమోదైంది. అన్ని ఆధారాలున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయకపోతే తమను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇందులో మాత తప్పేమీ లేదు. - మురళీకృష్ణ, సబ్ రిస్ట్రార్, మంథని పూర్తిగా ప్రభుత్వ భూమే.. మంథని ఎంపీడీవో కార్యాలయం ఎదుట 108 సర్వే నంబర్లో ఉన్న 36 గుంటల భూమి ప్రభుత్వానిదే. ఈ భూమి అక్రమంగా పట్టా కావడం అయి, పాస్‌బుక్ జారీ కావడం, ఆన్‌లోన్‌లో నమోదవడం, రిజిస్ట్రేషన్ చేయడంపై వివచాణ జరుపుతున్నాం. దీనికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం. - జల్ల సత్తయ్య, తహశీల్దార్, మంథని