తమకు ప్రభుత్వం ఇచ్చిన స్మశాన వాటిక స్థలం కబ్జా అవుతోందంటూ గ్రామస్తులు ధర్నాకు పూనుకున్నారు.
- దళితుల ఆందోళన
జహీరాబాద్ టౌన్: తమకు ప్రభుత్వం ఇచ్చిన స్మశాన వాటిక స్థలం కబ్జా అవుతోందంటూ గ్రామస్తులు ధర్నాకు పూనుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని బుర్దిపాడ్ గ్రామంలోని దళితులకు ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం మూడెకరాల స్థలాన్ని సర్వే నంబర్ 83లో స్మశాన వాటిక కోసం కేటాయించింది. అయితే, ఈ స్థలం ఆనుకుని ఉన్న రైతులు దానిని కొద్దికొద్దిగా కలుపుకుంటున్నారు. దీనిపై దళితులంతా కలసి శుక్రవారం మధ్యాహ్నం జహీరాబాద్‌కు తరలివచ్చారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. స్మశాన వాటికను కబ్జాదారుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. స్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేసి ఇస్తామని డిప్యూటీ తహశీల్దార్ దశరథ్ హామీ ఇచ్చారు. సోమవారం తహశీల్దార్ అనిల్, ఆర్‌ఐ. షఫీ, సర్వేయర్‌లు గ్రామానికి వస్తారని తెలపటంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.