
తిరుచ్చిలో కలకలం
సేలం: అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో అవ్వ బతికిన ఘటన తిరుచ్చిలో కలకలం రేపింది. వివవారు.. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో మరుంగాపురి సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన వ్యక్తి పంపైయ్యన్ (72). ఇతని భార్య చిన్నమ్మాల్ (62). వీరు పూలతోట నిర్వహిస్తున్నాడు.
ఈనెల 16న చిన్నమ్మాల్ అకస్మాత్తుగా విషం తాగింది. చుట్టుపక్కల వారు చిన్నమ్మాల్‌ను తురవంకురిచ్చిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో చేసేదిలేక చిన్నమ్మాల్‌ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువెళ్లారు. మార్గం మధ్యలో చిన్నమ్మాల్ మృతి చెందినట్టు భావించిన బంధువులు ఆమెను ఇంటికి కాకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. బంధువులు విలపిస్తూ అక్కడికి చేరుకున్నారు.
శ్మశానవాటికలో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తర్వాత చిన్నమ్మాల్ శరీరాన్ని దహనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆమెను కట్టెలు పేర్చిన చితిపై పడుకోబెట్టారు. ఆ సమయంలో చిన్నమ్మాల్‌పై బంధువులు పడి బోరున విలపించారు. అప్పుడు అకస్మాత్తుగా చిన్నమ్మాల్ తనపై పడి ఏడుస్తున్న బంధువులు ఒకరి చెయ్యి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడ ఉన్న వారంతా దిగ్భ్రాంతి చెందారు. తర్వాత అంబులెన్స్‌ను రప్పించి తిరిగి చిన్నమ్మాల్‌ను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యం చేస్తున్నారు.
#DINAMANI | இறுதிச் சடங்கில் உயிருடன் எழுந்த மூதாட்டியால் பரபரப்பு!#trichy #shocking #funeral #notdead pic.twitter.com/xE7L1OOhts
— தினமணி (@DinamaniDaily) November 19, 2024
VIDEO CREDITS: DinamaniDaily