caused
-
చితి నుంచే నీళ్లడిగిన అవ్వ!
సేలం: అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో అవ్వ బతికిన ఘటన తిరుచ్చిలో కలకలం రేపింది. వివవారు.. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో మరుంగాపురి సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన వ్యక్తి పంపైయ్యన్ (72). ఇతని భార్య చిన్నమ్మాల్ (62). వీరు పూలతోట నిర్వహిస్తున్నాడు. ఈనెల 16న చిన్నమ్మాల్ అకస్మాత్తుగా విషం తాగింది. చుట్టుపక్కల వారు చిన్నమ్మాల్‌ను తురవంకురిచ్చిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో చేసేదిలేక చిన్నమ్మాల్‌ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువెళ్లారు. మార్గం మధ్యలో చిన్నమ్మాల్ మృతి చెందినట్టు భావించిన బంధువులు ఆమెను ఇంటికి కాకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. బంధువులు విలపిస్తూ అక్కడికి చేరుకున్నారు. శ్మశానవాటికలో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తర్వాత చిన్నమ్మాల్ శరీరాన్ని దహనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆమెను కట్టెలు పేర్చిన చితిపై పడుకోబెట్టారు. ఆ సమయంలో చిన్నమ్మాల్‌పై బంధువులు పడి బోరున విలపించారు. అప్పుడు అకస్మాత్తుగా చిన్నమ్మాల్ తనపై పడి ఏడుస్తున్న బంధువులు ఒకరి చెయ్యి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడ ఉన్న వారంతా దిగ్భ్రాంతి చెందారు. తర్వాత అంబులెన్స్‌ను రప్పించి తిరిగి చిన్నమ్మాల్‌ను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యం చేస్తున్నారు. #DINAMANI | இறுதிச் சடங்கில் உயிருடன் எழுந்த மூதாட்டியால் பரபரப்பு!#trichy #shocking #funeral #notdead pic.twitter.com/xE7L1OOhts— தினமணி (@DinamaniDaily) November 19, 2024VIDEO CREDITS: DinamaniDaily -
వరంగల్ జిల్లాలో బాల్య వివాహం కలకలం
-
తిరుమలలో ‘డ్రోన్’ కలకలం
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం డ్రోన్ కెమెరా కలకలం రేపింది. శేషాచలంతోపాటు తిరుమలకొండ మీద ఉద్యాన వనాల అభివృద్ధి కోసం నెల రోజులుగా డ్రోన్ కెమెరాతో అధికారులు సర్వే చేస్తున్నారు. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ నాలుగు మాడ వీధులు, సమీప ప్రాంతాలు మినహా మిగిలిన అటవీ, కాటేజీ ప్రాంతాల్లో ఈ సర్వే చేసుకునేందుకు టీటీడీ అనుమతినిచ్చింది. ఏపీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ నేతృత్వంలో బెంగళూరుకు చెందిన జాతీయ విపత్తుల నివారణ సంస్థ (ఎన్డీఆర్ ఎఫ్) నిపుణుల బృందం ఈ సర్వే నిర్వహిస్తోంది. డ్రోన్ కెమెరాను పక్షి ఢీకొనడంతో సిగ్నల్స్ తెగిపోయి డ్రోన్ కెమెరా స్థానిక శేషాద్రినగర్‌లోని ఓ చెట్టుపై ఇరుక్కుంది. స్థానికుల సమాచారంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. -
గుంటూరు జిల్లాలో కల్తీ కలకలం
-
ఐవోసీలో జాబ్.. ఐఎస్ఐఎస్కు మార్కెటింగ్!
-
ఆ హెలికాప్టర్‌ను కూల్చింది ఓ పక్షి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కాట్రా ప్రాంతంలో సోమవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి ఓ పక్షి కారణమని తెలుస్తోంది. హెలికాప్టర్‌కు ఓ పక్షి తగలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఘటనా స్థలంలో పక్షి మృతదేహం లభించిందని, ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించామని జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మలా సింగ్ తెలిపారు. సింగిల్ ఇంజన్‌తో కూడిన ఈ హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఒక్కసారిగా పక్షి తగలడంతో అది అదుపు తప్పి కూలిపోయిందని అంటున్నారు. ఈ ప్రమాదంలో సిబ్బంది సహా, ఏడుగురు మరణించారు. వారిలో ముగ్గురు ఢిల్లీకి చెందినవారు కాగా, ఇద్దరు జమ్మూకు చెందినవారని అధికారులు గుర్తించారు. ఈ విమానం హిమాలయన్ హెలీ సర్వీస్‌కు చెందినది. దైవదర్శనానికి వైష్ణోదేవి బయల్దేరిన తమ కుటుంబసభ్యులు మరణించడంపై వారి బంధువులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.