అయ్యో! తల్లీ!! | special story to Phoolan Devi family | Sakshi
Sakshi News home page

అయ్యో! తల్లీ!!

Published Mon, Mar 6 2017 11:14 PM | Last Updated on Mon, Jul 30 2018 8:10 PM

ఫూలన్‌దేవి తల్లి మూలాదేవి, చెల్లి రామ్‌ కలి, ఆమె పిల్లలు - Sakshi

ఫూలన్‌దేవి తల్లి మూలాదేవి, చెల్లి రామ్‌ కలి, ఆమె పిల్లలు

ఆకలికాలం
ఉత్తరప్రదేశ్‌లో రేపు చివరి విడత పోలింగ్‌ జరుగుతోంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఈ పోలింగ్‌ గురించి కాదు. ఎప్పుడో జరిగిపోయిన నాల్గవ విడత పోలింగ్‌ గురించి! ఆ విడతలో 53 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. వాటిల్లో కల్పి అసెంబ్లీ నియోజకర్గం కూడా ఉంది. అక్కడి నుంచి ఛోటేసింగ్‌ (బి.ఎస్‌.పి.), నరేంద్రపాల్‌ సింగ్‌ (బి.జె.పి.), ప్రస్తుత ఎమ్మెల్యే ఉమాకాంతి (కాంగ్రెస్‌) పోటీ చేశారు. ప్రజలకు వీళ్లు ఎలాంటి హామీలు ఇచ్చారో కానీ, ఈ ముగ్గురిలో ఎవరైతే తనకు ఇంత ముద్ద పెడతారో వారికే నా ఓటు అని మూలాదేవి అనే ఓటరు పోలింగ్‌కి ముందే చెప్పేశారు.

మూలాదేవిది కల్పి నియోజకవర్గంలోని షేక్‌పూర్‌గూడా గ్రామం. 70 ఏళ్ల ఈ వృద్ధురాలు దాదాపుగా ఆకలితో మరణించే స్థితిలో ఉన్నట్లు అక్కడి కరువు గ్రామాలపై సర్వేచేసిన ‘బుందేల్‌ఖండ్‌ దళిత్‌ అధికార్‌ మంచ్‌’ అనే ఎన్జీవో ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఒక నిరుపేద... ఆకలిబాధతో కడుపు చేతపట్టుకోవడం మన దేశంలో ఎప్పుడూ ఉండే విషాదమే. కానీ మూలాదేవి వేరు. మీర్జాపూర్‌ ఎంపీ అయిన ఫూలన్‌దేవి తల్లి ఆమె! అయితే పదిహేడేళ్ల క్రితం ఫూలన్‌ని ఆమె ఎంపీగా ఉన్నప్పుడే ఆమె విరోధులు ఢిల్లీలో కాల్చి చంపారు. అప్పటి నుంచి మూలాదేవి ‘పూలన్‌ తల్లి’గా ప్రత్యేక హోదాను కోల్పోయారు. ఉన్న కొద్దిపాటి భూమినీ కబ్జాదారులు తన్నుకుపోయారు. మూలాదేవి, ఆమె చిన్న కూతురు రామ్‌కలి ఇప్పుడు చిరుగుల డేరాలాంటి పూరి గుడిసెలో  ఉంటున్నారు. రామ్‌కలిలో ఫూలన్‌ పోలికలు ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో లబ్ది పొందడానికి కొన్ని పార్టీలు రామ్‌కలిని స్టేజ్‌ ఎక్కిస్తుంటాయి.

అప్పుడు మాత్రం ఇంతో అంతో ఆమె చేతిలో పెడతుంటాయి. మిగతా అప్పుడు ఆ ఇంట్లో ఈ ఇంట్లో గిన్నెలు కడిగి రామ్‌కలి కొంత డబ్బు సంపాదించుకొస్తుంది. అదే వారి కుటుంబానికి ఆధారం. రామ్‌కలికి టిక్కెట్‌ ఇస్తానని ములాయం సింగ్‌ హామీ ఇచ్చారు కానీ, అదీ జరగలేదు. చూడాలి ఇక్కడ ఎవరు గెలుస్తారో? గెలిచినవారు మూలాదేవికి ఇంత ముద్ద పెడతారో లేదో! అధికారంలోకి వచ్చిన వారెవరైనా ముందు చేయవలసిన పని అదే కదా.


‘బందిపోటు రాణి’ ఫూలన్‌ దేవి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement