హైదరాబాద్: సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ 85వ జయంతి వేడుకలను సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 36లోని పార్టీ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ సమాజ్‌వాదీ పార్టీ నేత దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.
అనంతరం నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, నీలోఫర్, నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్‌యాదవ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ములాయం సింగ్ యాదవ్ ఎంతో ఖ్యాతిని గడించారని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేందుకు కృషి చేస్తామని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సమాజ్‌వాదీ పార్టీని బలోపేతం చేసేందుకు త్వరలోనే అన్ని నియోజక వర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో పార్టీ ప్రభుత్వంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండోరా సమితి అధ్యక్షులు మదిరె నర్సింగ్‌రావు మాదిగ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment