birth anniversary celebrations
-
ఘనంగా ములాయం సింగ్ యాదవ్ జయంతి
హైదరాబాద్: సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ 85వ జయంతి వేడుకలను సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 36లోని పార్టీ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ సమాజ్‌వాదీ పార్టీ నేత దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. అనంతరం నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, నీలోఫర్, నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్‌యాదవ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ములాయం సింగ్ యాదవ్ ఎంతో ఖ్యాతిని గడించారని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేందుకు కృషి చేస్తామని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సమాజ్‌వాదీ పార్టీని బలోపేతం చేసేందుకు త్వరలోనే అన్ని నియోజక వర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో పార్టీ ప్రభుత్వంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండోరా సమితి అధ్యక్షులు మదిరె నర్సింగ్‌రావు మాదిగ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం అజాద్ జయంతి వేడుకలకు సీఎం వైఎస్ జగన్
-
అక్కినేని.. నీకెవరు సాటిరాని!
తెలుగునాట సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు జన్మించి నేటితో 99 ఏళ్లు నిండాయి. సెప్టెంబర్ 20న 1924లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఆయన జన్మించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 20వ తేదీకి 100 ఏళ్లు నిండుతాయి. ఈ రోజు నుంచే ఆ శకపురుషుడి శతవసంత వేడుక ఆరంభమైంది. ప్రపంచమంతా, వాడవాడలా విశేష వేడుకలు మొదలయ్యాయి. విగ్రహాల ఆవిష్కరణలు, ప్రత్యేక సంచికలు, ఛాయాచిత్రాల విశిష్ట ప్రచురణల కోలాహలం మొదలైంది. తెలుగు జన హృదయ సామ్రాజ్యలను దోచుకున్న 'నటసామ్రాట్' అక్కినేని. ఆయనే అనేకసార్లు అన్నట్లుగా ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. తానే చెక్కుకున్న అద్భుతమైన శిల్పం. తానే గీసుకున్న అందమైన 'చిత్రం'. ఏ కాలేజీ చదువులు చదవని విద్యాధికుడు, ప్రపంచాన్ని, జీవితాన్ని విశ్వవిద్యాలయంగా భావించి, జీవించిన నిత్య అధ్యయన శీలి. చదువులంటే ఎంతో ఇష్టం.చదువుకున్నవారంటే అంతులేని గౌరవం. తను రాసిన 'అ ఆలు..' చదివితే చాలు. అతనెంతటి ఆలోచనాపరుడో తెలుస్తుంది. ఆ జీవితాన్ని సమీక్షిస్తే తెలుస్తుంది, ఆయనెంతటి సాధకుడో! అది ఒక ప్రయోగశాల. తొమ్మిది పదుల నిండు జీవితాన్ని పండించుకున్న పూర్ణ యశస్కుడు, కళాప్రపూర్ణుడు. భారతీయ చలనచిత్ర జగతిలో ఆయన వేసిన పాత్రలు అజరామరం. సాంఘిక సినిమాలు ఆయన ప్రత్యేకం. ముఖ్యంగా మహాకవులు, వాగ్గేయకారులు,మహాభక్తులు, కళాకారుల పాత్రలకు పెట్టింది పేరు. కాళిదాసు,తెనాలి రామకృష్ణ ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. జయదేవుడు, విప్రనారాయణుడు ఈయనే ఏమో! అని భ్రమ కలుగుతుంది. చాణుక్యుడు అచ్చూ అలాగే ఉంటాడేమో అని అనుకుంటాం. "స్పర్ధయాన్ వర్ధతే విద్య" అనే ఆర్యుల వాక్కు అక్కినేనికి నూటికి నూరుపాళ్లు సరిపోతుంది. ఎన్టీఆర్ వంటి విద్యాధికుడు, పరమ ఆకర్షణా స్వరూపుడు అటువైపు ఉండగా, తన ఉనికిని కాపాడుకుంటూ.. తన విశిష్ట ముద్ర వేసుకోడానికి, ఎంత తపన పడ్డాడో? జగ్గయ్య వంటి చదువరులు, భానుమతి వంటి గడసరులు, సావిత్రి వంటి ప్రతిభామణులు ఉన్న కాలంలో, దీటుగా నిలబడడానికి ఎన్ని ధీరోదాత్తమైన ఆత్మదీపాలు వెలిగించుకున్నారో! అడుగడుగునా,ఆణువణువునా తనను తాను భద్రంగా కాపాడుకోవడానికి,గెలుపుగుర్రంపై స్వారీ చేయడానికి చెప్పలేనంత తపన పడ్డారు. ఆ తపనే తపస్సు. హైస్కూల్ విద్య కూడా దాటని అక్షరాస్యతతో, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ వంటి మహాకవుల పాత్రలు వేయడం బహు సాహసం, వేసి గొప్పగా మెప్పించడం బహు ఆశ్చర్యచకితం. నిజజీవితంలో దైవభక్తి ఎరుగని మనిషి, పరమ భక్తులైనతుకారాం,విప్రనారాయణలుగా జీవించిన తీరు అనన్య సామాన్యం. అమరశిల్పి జక్కనగా ఆయన వేసిన ముద్ర ఆయనకే చెల్లింది. తెలుగు సినిమాలో డాన్సులు మొదలు పెట్టిన మొట్టమొదటి హీరో ఆయనే. ద్విపాత్రాపోషణం ఆయనతోనే మొదలైంది.'నవరాత్రి' సినిమాలో ఏకంగా తొమ్మిది పాత్రలు పోషించారు. ఆయనే తొలి నవలా నాయకుడు కూడా. ఇక ప్రేమికుడు, భగ్నప్రేమికుడు పాత్రలు ఆయనకే చెల్లాయి. 'దేవదాసు'గా ఆ విశ్వరూపాన్ని చూడవచ్చు. హీరోకు ఆయన ఒక స్టైల్ తీసుకొచ్చారు.ఆ హెయిర్ కట్, ఆ మీసకట్టు,డ్రెస్‌ను కొన్ని లక్షలమంది అనుకరించారు. ఆయన స్టైల్ కొన్ని తరాలను శాసించింది. కృష్ణా జిల్లాలోని గుడివాడ దగ్గర ఎక్కడో రామాపురం/ వెంకటరాఘవాపురం అనే కుగ్రామంలో జన్మించారు. దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. పల్లెల్లో పొలాల్లో పనిచేసుకుంటూ, నాటకాలలో చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ నటప్రస్థానాన్ని ప్రారంభించారు. స్త్రీ పాత్రలు వేసి,తొలినాళ్ళల్లోనే అందరినీ ఆకర్షించారు. పాటలు, పద్యాలు పాడి డాన్సులు వేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఘంటసాల బలరామయ్య చలువతో తన ప్రగతి భవనానికి మెట్లు కట్టుకున్నారు. వెండితెరపై ఏడు దశాబ్దాలు 16 ఏళ్ల వయస్సులోనే (1940)'ధర్మపత్ని'తో సినిమా రంగంలో అడుగుపెట్టారు. 20ఏళ్ల ప్రాయంలోనే 'సీతారామ జననం'(1944)తో మొట్టమొదటగా కథానాయకుడిగా అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇక తిరిగి చూసుకోలేదు. అప్రతిహతంగా ఏడు దశాబ్దాల పాటు మహాప్రస్థానం సాగింది. తొమ్మిది పదుల వయస్సులోనూ 'మనం'లో జీవించి మెప్పించారు. జీవితంలో తుదిశ్వాస వరకూ నటించిన అరుదైన చరిత్రను లిఖించుకున్నారు. కె విశ్వనాథ్‌కు దర్శకుడిగా అవకాశం నటుడుగా విజృంభించడమే కాక,'అన్నపూర్ణ' బ్యానర్లో ఆణిముత్యాల వంటి ఎన్నో సినిమాలను నిర్మించారు. తెలుగునేలపై చిత్రపరిశ్రమ ప్రభవించడానికి కృషిచేసి, సాధించినవారిలో అక్కినేనివారిది అగ్రశ్రేణి. కె.విశ్వనాథ్‌లో దర్శకత్వ ప్రతిభ ఉందని తొలిగా గుర్తించినవారు అక్కినేని నాగేశ్వరావు. కేవలం గుర్తించడమే కాక 'ఆత్మగౌరవం' సినిమాకు దర్శకుడుగా అవకాశమిచ్చి.. ప్రోత్సహించినవారు కూడా ఆయనే. ఎక్కడ ప్రతిభ, పాండిత్యం ఉంటే అక్కడ గుర్తించి, ఆ ప్రతిభామూర్తులను ప్రోత్సహించి, గౌరవించిన కళాహృదయుడు, ప్రతిభా పక్షపాతి అక్కినేని.మహాదాత కూడా. కాలేజీ కోసం ఉన్నదంతా దానం గుడివాడలో కళాశాల నిర్మాణానికి, అప్పుడు తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇచ్చివేసిన త్యాగశీలి. తన ప్రతిభ పట్ల, రేపటి పట్ల అచంచలమైన విశ్వాసంతో అంతటి దానం చేశారు. ఆ కాలేజీకి అక్కినేని నాగేశ్వరావుపేరు పెట్టుకున్నారు. కేవలం గుడివాడ కాలేజీకే కాదు.. ఆంధ్రా యూనివర్సిటీ మొదలు ఎన్నో విద్యాలయాలకు భూరి విరాళాలు ఇచ్చారు. ఎందరికో, ఎన్నింటికో గుప్తదానాలు కూడా చేశారు. ఆర్ధిక క్రమశిక్షణను కాపాడుకుంటూనే, పాత్రత ఎరిగి దానం చేసే విజ్ఞత ఆయన సొత్తు.'అపాత్రాదానం' చేయకూడదన్నది ఆయన నియమం. తన విజ్ఞాన పరిధులను విశేషంగా విస్తరించుకోడానికై కవులు,మేధావులతో గడిపేవారు. సత్ సాంగత్యంలో గడపడం ఆయన నిత్యకృత్యం. 50 ఏళ్లకే గుండె ఆపరేషన్ 50 ఏళ్ల వయస్సులోనే గుండె దెబ్బతిన్నది. అమెరికాలో ఆపరేషన్ చేయించుకొని పునరుత్తేజం పొందారు. అప్పటి నుంచి జీవనశైలిని ఎంతో మార్చుకున్నారు. తన శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకోడానికి ఋషి వలె కృషి చేశారు. గుండె చాలా తక్కువ శాతం మాత్రమే పనిచేసేది. అచంచలమైన మనోధైర్యం, విచక్షణతో హృదయాన్ని ధృడంగా నిలుపుకున్నారు. ఆ తీరు అన్యులకు సాధ్యపడదు. సునిశితమైన పరిశీలన, చురుకైన చూపులు, పాదరసం వంటి మెదడు, నిలువెల్లా రసికత, గుండెనిండా పట్టుదల, నిత్య కృషీవలత్వం అక్కినేని సుగుణాలు,సులక్షణాలు. క్రమశిక్షణకు మారుపేరు అకడమిక్‌గా తాను పెద్ద చదువులు చదువుకోలేదనే స్మృతితో పిల్లలను బాగా చదివించారు. చదివించడమే కాక,ఎంతో క్రమశిక్షణతో పెంచారు. శ్రమ విలువ తెలియాలన్నది ఆయన సూక్తి. సినిమా జీవితంలోనూ, నిజ జీవితంలోనూ తన బలాలు,బలహీనతలు బాగా ఎరిగి నడుచుకున్నారు. తాను ఎక్కడ రాణించగలనో తెలిసి అక్కడ విజృంభించారు. ఎచ్చట గెలవలేనో ఎరిగి అచ్చట విరమించుకున్నారు. రాజకీయాల్లో అనేకసార్లు అవకాశాలు వచ్చినా చిరునవ్వుతో తప్పించుకున్నారు. కానీ,రాజకీయాలను సునిశితంగా పరిశీలించడం ఎన్నడూ మానలేదు. రాజకీయ నాయకులతో విస్తృతంగా సంబంధాలను పెంచుకున్నారు. ఆయనకి అదొక 'ఆట'విడుపు. సాధించని అవార్డులు లేవు ఆయన నటించిన సినిమాలు, నిర్మించిన సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించి రికార్డ్ సృష్టించాయి.నటుడుగా ఆయన పొందని సత్కారాలు లేవు, ఆయనను చేరని బిరుదులు లేవు. పద్మశ్రీ నుంచి పద్మవిభూషణ్ వరకూ,కళాప్రపూర్ణ నుంచి కాళిదాసు సమ్మాన్ వరకూ, డాక్టరేట్ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే వరకూ ఆన్నీ వరించాయి. ఒక్క 'భారతరత్న' తప్ప, ఘనమైన గౌరవాలన్నీ దక్కించుకున్నారు. 'అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్' స్థాపించారు. దాదా సాహెబ్ ఫాల్కేతో సమానమైన పురస్కారాలను ప్రతి ఏటా చలనచిత్ర ప్రతిభామూర్తులకు సమర్పించాలని సంకల్పం చేసుకున్నారు. దేవానంద్ మొదలు రేఖ వరకూ ఎందరో ప్రజ్ఞాప్రముఖులు 'ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు'ను అందుకున్నారు. అక్కినేని మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయం. "బండరాళ్లను సైతం అరగించుకో గలిగిన వయసులో డబ్బులు లేవు. డబ్బులున్న నేడు వయస్సు లేదు" అంటూ జీవనసారాన్ని చెప్పిన తత్త్వవేత్త అక్కినేని. అక్కినేని వలె జీవించడం, జీవితాన్ని సాధించడం అందరికీ సాధ్యపడేది కాదు. నిన్న మొన్నటి వరకూ మన మధ్యనే నడచి వెళ్లిన అక్కినేని 'అమరజీవి'గా అనంతమైన కాలంలో అఖండగా వెలుగుతూనే ఉంటారు. రచయిత: మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
నేడు సితార పుట్టినరోజు.. ఆ పిల్లల కోసం గొప్ప మనసు చాటుకుంది
సూపర్ స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టి సితార బర్త్‌డే నేడు (జూలై 20). ఈ సందర్భంగా మహేశ్ తన కూతురికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. '11వ పడిలోకి అడుగు పెట్టిన నా చిన్నారి పాపకు బర్త్‌డే శుభాకాంక్షలు. నా ప్రపంచంలో నువ్వే స్టార్‌వి. నువ్వు ఏదైనా సాధించగలవు. అని మహేష్ అన్నారు. మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కుమార్తెగానే కాకుండా తను ఇప్పుడు ఒక స్టార్‌గా గుర్తింపు పొందింది. కానీ నేడు తన పుట్టినరోజును ఎంతో ఆలోచనాత్మకంగా జరుపుకుంది. ఇప్పటికే స్టార్‌గా ఉన్న సితార.. బర్త్‌డేను విలాసవంతమైన సంబరాలకు పోకుండా ఇలా మహేష్‌బాబు ఫౌండేషన్‌లోని యువతులతో చాలా సాధారణంగా సెలబ్రేట్ చేసుకుంది. దీంతో సోషల్‌మీడియా నుంచి ఆమెకు చాలా ప్రంశంసలతో పాటు శుభాకాంక్షలు అందుతున్నాయి. సితార పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో, సితార మహేష్ బాబు ఫౌండేషన్‌లోని యువతులను కలుసుకోవడం, వారితో కేక్ కట్ చేయడం వంటివి ఉన్నాయి. అక్కడ ఉన్న వారందరికి పింక్ కలర్లో ఉన్న సైకిళ్లను సితార బహుమతిగా ఇచ్చింది. వీడియో షేర్ చేస్తూ నమ్రత ఇలా తెలిపింది. 'ఇప్పుడు ఆ చిన్నారులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వారందరికి పాఠశాల కేవలం సైకిల్ దూరంలో ఉంది. నీలో ఆలోచనాత్మకత ,ఇతరులపై ప్రేమను చూపించే పెద్ద హృదయం ఉంది. నీ అద్భుతమైన ప్రయాణంలో ఇలాంటి అర్థవంతమైన జ్ఞాపకాలను మరెన్నో సృష్టించాలని కోరుకుంటున్నాను.' అని సితారకు నమ్రత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. పీఎంజే జ్యువెలరీ యాడ్‌లో సితార నటించగా, అందుకు సంబంధించిన ఫోటోలను బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. ఈ ప్రకటనలో నటించేందుకుగానూ సితార కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఓ ఇంటర్వ్యూలో తన తొలి పారితోషికంపై స్పందించిన సితార. తనకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను చారిటీకి ఇచ్చానంది సితార. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఆదర్శనీయంగా నిలిచిన మహేశ్‌బాబు అడుగుజాడల్లోనే సితార కూడా నడుస్తోందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అమెరికాలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 74వ జయంతి వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. జులై 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు భారీగా తరలివచ్చారు. అమెరికాలో పర్యటిస్తోన్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.‘జోహార్ వైఎస్సార్.. వైఎస్సార్ అమర్‌రహే’’ అంటూ నినదించారు. మహానేత అందించిన పథకాలను గుర్తుచేసుకున్నారు. గౌతంరెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పరిపాలనలో వైఎస్సార్ తన దైన ముద్ర వేశారు. తనకు ఇచ్చిన అధికారం పేదలకు సేవ చేసేందుకే తప్ప.. దర్పం ప్రదర్శించేందుకు కాదని చేతల్లో చూపించారు వైఎస్సార్. చరిత్రలో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచిపోతారు. తన నడవడిక, గొప్ప మనసు, మంచి నిర్ణయాలతో వైఎస్సార్ చెరగని ముద్ర వేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో మేలు జరిగింది. రేషన్ షాపుల్లో రెండు రూపాయలకే కిలో బియ్యంతోపాటు, ఇతర నిత్యావసరాల్ని కూడా తక్కువ ధరకే అందించారు. వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందించారు. ఇళ్లు లేని పేదల కోసం ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కడప రత్నాకర్, అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విశ్వసనీయతకు చిరునామా వైఎస్సార్ మాత్రమే. ఇచ్చిన ఏ హామీ అయినా తీర్చేవరకు విశ్రమించలేదు వైఎస్సార్. అయిదున్నర కోట్ల మంది ప్రజలకు పేదవాళ్లకు అందాల్సిన పథకాలు 99% అమలు చేసిన ఘనత నాడు వైఎస్సార్‌ది, నేడు వైఎస్ జగన్‌ది. భారత రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముద్ర వేసిన ఘనత వైఎస్సార్‌ది, వైఎస్ జగన్‌దే. రైతులు బావుండాలంటే పంటలు పండాలి. ప్రతి పంటకూ నీరు అందాలంటే ప్రాజెక్టులు కట్టాలన్న తప్పనతో జలయజ్ఞాన్ని ప్రారంభించి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి ఫలితాలు చూపించిన మహానేత వైఎస్సార్. మేడపాటి వెంకట్, ఏపీ NRT అధ్యక్షులు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే కీలక రంగాలపై దృష్టి సారించి వాటిని అమల్లోకి తెచ్చి చూపించిన నాయకుడు వైఎస్సార్. రైతుల కోసం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ దాని వల్ల లక్షలాది మంది అన్నదాతలకు మేలు జరిగి ఆత్మహత్యలు తగ్గిపోయాయి. పేదలకు ఆర్థిక స్తోమత లేక వైద్య చికిత్స పొందలేకపోయిన వారిని పాదయాత్రలో చూసి ప్రతి పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందేలా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ వైద్యం అందేందుకు తెచ్చిన 108 అంబులెన్స్ పథకాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. నిరుపేదలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు ప్రతీ చోట కనిపిస్తోందంటే అది వైఎస్సార్ ఘనతే. రమేష్ రెడ్డి వల్లూరి, వైఎస్సార్సిపి కన్వీనర్, ఉత్తర అమెరికా నాయకుడు ఎవరైన.. పార్టీ ఏదైనా.. రాజకీయాలు చేయండి. ఒక హామీ ఇవ్వండి కానీ దాన్ని మరిచిపోవద్దు. అది అమలు అయ్యేవరకు అంతే స్థాయిలో కష్టపడండి. మీరిచ్చే హామీలు ఓట్ల కోసం కాదని తమ పరిపాలనతో గుర్తుచేసిన నాయకులు ఇద్దరు. ఒకరు మహానేత, ఉమ్మడి రాష్ట్రానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్. మరొకరు నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్సార్. అలాంటి నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పుణ్యం. 2003-04లో పాదయాత్ర ద్వారా నాడు వైఎస్సార్, అలాగే 2018-19లో వైఎస్ జగన్ ప్రజల కోసం నడిచారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని తీర్చారు. 2024లో వైఎస్ జగన్ పెట్టుకున్న 175/175 లక్ష్యాన్ని వంద శాతం చేరుకుంటారని, ప్రజలు మరోసారి అద్భుత విజయాన్ని కట్టబెడతారని బలంగా నమ్ముతున్నాం. వాషింగ్టన్ డీసీలో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల వీడియో ఈ కింద చూడవచ్చు -
వైఎస్సార్ జయంతికి ఆస్ట్రేలియాలో భారీ ఏర్పాట్లు
ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అన్ని ప్రధాన నగరాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు జూమ్ ద్వారా ఆస్ట్రేలియాలోని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. -
ఘనంగా అంబేడ్కర్ 133వ జయంతి
సాక్షి, చైన్నె: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతిని శుక్రవారం వాడవాడల్లో ఘనంగా నిర్వహించారు. రాజకీయ పక్షాల నేతలు అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి, పుష్పాంజలితో నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో సమత్తువ దినోత్సవంగా అధికారిక వేడుకలు జరిగాయి. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో వాడవాడల్లో ఉన్న ఆయన విగ్రహాల్ని ఆయా ప్రాంతాల్లోని సంఘాలు, రాజకీయ పక్షాల ప్రతినిధులు ముస్తాబు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాయకులు, సంఘాల ప్రతినిధులు తరలివచ్చి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అలాగే, ఆయా విగ్రహాల వద్ద ఉంచిన అంబేడ్కర్ చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. డీఎంకే, రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో సమత్తువ ( సమానత్వం) దినోత్సవం అంబేడ్కర్ జయంతి వేడుక నిర్వహించారు. సీఎం నివాళి.. ఆర్ఏ పురంలోని అంబేడ్కర్ స్మారక మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. సీఎం ఎంకే స్టాలిన్, మంత్రి శేఖర్‌బాబు, ఎం సుబ్రణియన్ , కేఎన్ నెహ్రు ఏవి వేలు, సెంజి మస్తాన్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, వీసీకే నేత తిరుమావళవన్, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత సెల్వ పెరుంతొగై, చైన్నె కార్పొరేషన్ మేయర్ ప్రియ నివాళులర్పించారు. అంబేడ్కర్ విగ్రహ వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి సీఎం స్టాలిన్ పుష్పాంజలి ఘటించారు. సేలంలో జరిగిన కార్యక్రమంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతి పక్ష నేత పళణిస్వామి అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. తేనీలో మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం, చైన్నె కలెక్టరేట్ ఆవరణలో జరిగిన వేడుకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, టీ నగర్‌లోని నివాసంలో జయలలిత నెచ్చెలి శశికళ అంబేడ్కర్ చిత్రపటానికి అంజలి ఘటించారు. -
అణగారిన వర్గాల సాధికారతే ధ్యేయం
జైపూర్: ‘‘సమాజంలో అణగారిన వర్గాల సాధికారతే మా ప్రభుత్వ ధ్యేయం. అందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వంచిత్ కో వరీయత (పీడితులకు తొలి ప్రాధాన్యం) నినాదంతో సాగుతున్నామన్నారు. శనివారం రాజస్తాన్‌లో భిల్వారా జిల్లా మాలాసేరీ డుంగ్రీలో గుజ్జర్ల ఆరాధ్యుడు శ్రీదేవనారాయణ్ ఆధ్యాత్మిక వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ప్రపంచ దేశాలు ఆశలు, ఆకాంక్షలతో భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ తన బలాన్ని, అధికారాన్ని ప్రదర్శిస్తోంది, అంతర్జాతీయ వేదికలపై శక్తిని నిరూపించుకుంటోంది’’ అన్నారు. పొరపాట్లను సరిదిద్దుకుంటున్న ‘నవ భారత్’ స్వాతంత్య్ర పోరాటంతోపాటు ఇతర ఉద్యమాల్లో గుజ్జర్ల పాత్ర మరువలేనిదని మోదీ ప్రశంసించారు. వారికి చరిత్రలో తగిన గుర్తింపు దక్కకపోవడం దురదృష్టకరమని అన్నారు. ‘‘గత పొరపాట్లను ‘నవ భారత్’ సరిదిద్దుకుంటోంది. దేశాన్ని సిద్ధాంతపరంగా విచ్ఛిన్నం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా విఫలమయ్యాయి. నాగరికత, సంస్కృతి, సామరస్యం, శక్తి సామర్థ్యాల వ్యక్తీకరణే భారత్’’ అన్నారు. దేశ ఐక్యతను భగ్నం చేసే వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మన వారసత్వం మనకు గర్వకారణం వేలాది సంవత్సరాల భారతదేశ ప్రయాణంలో సామాజిక బలం గణనీయమైన పాత్ర పోషించిందని నరేంద్ర మోదీ వివరించారు. మన వారసత్వం మనకు గర్వకారణమని, బానిస మనస్తత్వం నుంచి బయటపడాలని ఉద్బోధించారు. దేశం పట్ల మనం నిర్వర్తించాల్సిన విధులను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని కోరారు. ‘‘ప్రజాసేవకు శ్రీదేవనారాయణ్ ప్రాధాన్యమిచ్చారు. ఆయన కమలంలో ఉద్భవించారు. భారత్ సారథ్యం వహిస్తున్న జి–20 లోగోలో కమలం ఉంది. బీజేపీ ఎన్నికల గుర్తయిన కమలంతో నాకెంతో అనుబంధముంది. గుజ్జర్ సామాజిక వర్గంతోనూ చక్కటి స్నేహ సంబంధాలున్నాయి’’ అన్నారు. ఐక్యతా మంత్రమే విరుగుడు న్యూఢిల్లీ: ప్రజల మధ్య విభేదాలు, అంతరాలను సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఎన్నడూ విజయవంతం కాబోవని మోదీ అన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప గ్రౌండ్లో ఎన్సీసీ ర్యాలీనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘దేశ పునర్వైభవ సాధనకు ఐక్యతే ఏకైక మార్గం. అన్నింటికీ అదే ఏకైక విరుగుడు. యువత తన ముంగిట ఉన్న అపార అవకాశాలను వాడుకోవాలి’’ అన్నారు. ఎన్సీసీ 75వ వ్యవస్థాపక దినం సందర్భంగా ముద్రించిన 75 రూపాయల నాణేన్ని, కవర్‌ను విడుదల చేశారు. -
ఘనంగా కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్.. సుమన్‌కు జీవనసాఫల్య పురస్కారం
కోడిరామకృష్ణ.. ఆయన ఒక లెజండరీ డైరెక్టర్. ఆయన తీసిన సినిమాలలో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ప్రేక్షకులు మెచ్చే సినిమాలెన్నో తీసి శతాదిక చిత్ర దర్శకునిగా జయకేతనం ఎగురవేసిన తను జీవితంలో 10 నంది అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,2012 లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులను స్వీకరించారు. లెజండరీ దర్శకుడు కోడిరామకృష్ణ జయంతిని పురస్కరించుకొని భారత్ ఆర్ట్స్ అకాడమీ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎబిసి ఫౌండేషన్ అండ్ వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త, నటుడు సుమన్, గజల్ శ్రీనివాస్, సీనియర్ నటి దివ్యవాణి, నటుడు నిర్మాత, అశోక్ కుమార్, నిర్మాత వాకాడ అప్పారావు, చికోటి ప్రవీణ్, బి. ప్రవీణ్ కుమార్ లతో చాలామంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవారంగం, నాటక రంగం, సినిమా రంగం ఇలా వివిధ రంగాలలో ప్రతిభను చూపిన సుమారు 30మందికి ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ అవార్డులను అందజేశారు. హీరో సుమన్‌కు కోడిరామకృష్ణ జీవన సౌఫల్య పురస్కారం అవార్డుతో పాటు లెజండరీ అవార్డు ను బహుకరించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమం అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. 'నాకు లైఫ్ ఇచ్చింది కోడి రామకృష్ణ గారే. ఈ రోజు తనపేరుతో జీవన సౌఫల్య పురస్కారం అవార్డును అందుకోవడం సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను' అని అన్నారు నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త మాట్లాడుతూ.. 'మనిషి బతికున్నప్పుడు అందరూ దగ్గరుంటారు. అయితే అయన లేకున్నా ఆయనతో ఏ విధమైన సహాయ సహకారాలు అందుకోక పోయినా ఆయన తీపి గుర్తులు ప్రేక్షకులకు తెలియజేయాలని అతని పేరు మీద కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తున్న రామ సత్యనారాయణ గ్రేట్' అని పేర్కొన్నారు. నటుడు నిర్మాత, అశోక్ కుమార్ మాట్లాడుతూ.. 'నేను చెవిలో పువ్వు సినిమా కు నిర్మాతగా ఉన్నపుడు కోడిరామకృష్ణ గారిని కలవడం జరిగింది. అప్పుడు తను నాకు భారత్ బంద్ సినిమాలో మంచి వేషం ఇస్తాను చెయ్యమని చెప్పాడు. నేను చేయలేను నాకు భయం అన్నా వినకుండా నాతో చేయించడంతో నేను నటుడుగా పరిచయమయ్యాను. మహా దర్శకులైన కోడిరామకృష్ణ గారు ఎందరో ఆర్టిస్టులను తీర్చిదిద్దారు. యం.యస్. రెడ్డి, అంకుశం సినిమాలో రామిరెడ్డి, క్యాస్టూమ్ కృష్ణ వీరంతా నటులు కాదు వీరంతా వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నా కూడా వారిని నటులుగా బిజీ చేసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు . అటువంటి మహానుభావుడి వల్లే నేను భారత్ బంద్ తరువాత నటుడుగా బిజీ అవ్వడం జరిగింది. అంటే ఒక మనిషి లైఫ్ ను కెరియర్ ను ఎలా టర్న్ చెయ్యచ్చో తెలిసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు. ఆయన్ను ఇంకా గుర్తించుకొని మా రామ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు ఆయనకు మరొక్కసారి అభినందనలు తెలుపుతున్నాను. మనిషి ఉన్నా లేకున్నా స్నేహం చిరకాలం ఉంటుంది అని గుర్తు చేసిన వ్యక్తి రామ సత్యనారాయణ' అని తెలిపారు. -
ఎవరేం తినాలో కూడా బీజేపీనే చెబుతోంది: కేటీఆర్
-
మంత్రి కేటీఆర్ ఇన్స్పిరేషనల్ స్పీచ్
-
ఆయన జీవితంలో ఎన్ని సింగిడీలో!
కొందరి జీవితాన్ని బయోపిక్‌గా రీల్‌కు ఎక్కించాలన్నా, బయోగ్రఫీగా అక్షరబద్దం చేయాలన్నా సులువు కాదు. సూర్యాపేటలో 1922 ఫిబ్రవరి15న కల్లు గీసే ముత్తిలింగం –గోపమ్మలకు పుట్టిన బొమ్మగాని భిక్షం సమాజ సేవ బహుముఖీనం. జీవించిన 90 ఏండ్లూ ఆయన ఆరడుగుల ఎర్రజెండా... బడుగు జనుల విముక్తి ఎజెండా. ఆయన అనుభ వాల్ని కొంపెల్లి వెంకట్ మాట–ముచ్చటగా తీసు కొచ్చిండు. ‘‘ఇంత ఉద్యమ చరిత్రలో ఎన్నడూ కంట కన్నీరు కార్చి నోణ్ణి కాదు. నేను ఆ రోజుల్లో అన్క్వశ్చన్డ్ లీడర్ని రా నాయనా! ప్రజా ఉద్యమాలు ఎల్లప్పుడూ ఉంటాయి. వాళ్ళలో లీనం గావాలే, అన్ని థాట్స్ హ్యుమాన్ బీయింగ్‌కు అవ సరం...’’ ఇవన్నీ జీవన చరమాంకంలో ఆయన వలపోత, కలబోత. ఇందులో ఎన్ని సింగిడీలో! ఆయన పార్లమెంట్ ఎన్నికలకు మా నాయన, సుద్దాల హన్మంతుతో పాటు గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థులుగా మేమూ పాల్గొన్నాం. హిమాయత్‌నగర్‌లో మఖ్దూమ్ భవన్‌కు ముగ్గుబోయక ముందు మా ఇంట్లో ఎన్నోసార్లు సేద తీరినప్పుడూ, ఉపన్యాసం ఇచ్చినప్పుడూ అట్లా తదేకంగా చూడడం నా జీవితంలో కలి గిన గొప్ప అవకాశం. ఆయన నల్ల గొండ పార్లమెంట్‌కు మళ్ళీ 1996లో పోటీ చేసినప్పుడు... జల సాధన కోసం జలఖడ్గం విసిరినట్లుగా తెలంగాణ ఆర్తి చెప్పడానికి 480 మంది అభ్యర్థుల్ని దుశర్ల సత్యనారాయణ, మేము నిలబెట్టినం. 89 ఏళ్ల వయస్సులో తొంటి విరిగి ఇన్ఫెక్షన్తో పోరా డుతూ 2011 మార్చి 26న ఆయన చని పోయిండ్రు. అదే రోజు నల్లగొండ జిల్లా సంగెంలో రాత్రి తెలంగాణ ఆట–పాట– మాట సభ నిర్వహించుకొని నేను, సాంబ శివుడు తిరిగి వస్తూ పొద్దున అంత్యక్రియలకు హాజరవుదామని అనుకున్నాం. దారిలో సాంబశివుడు హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న సాంబశివుణ్ణి ఆసుపత్రికి, ఇంటికి తరలించే పనిలో ధర్మభిక్షం చివరి చూపు కరువయింది. 15 ఫిబ్రవరి 2021లో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రారంభమయిన శత జయంతి వార్షికోత్సవాలు, 2022లో నేడు రవీంద్ర భారతిలో ముగుస్తాయి. -చెరుకు సుధాకర్ వ్యాసకర్త ఇంటిపార్టీ అధ్యక్షుడు -
అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకలు
-
దేశవ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి ఉత్సవాలు
-
వైఎస్సార్ జయంతి.. ఆహార పదార్థాల వితరణ
న్యూజెర్సీ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ప్రవాస భారతీయులు 800 డాలర్ల విలువైన ఆహార పదార్థాలను డెలావేర్ ఫుడ్ బ్యాంక్‌కి డోనేట్ చేశారు. నాటా బోర్డ్ డైరెక్టర్, వైఎస్సార్సీపీ కమిటీ సభ్యులు సంగంరెడ్డి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు చంద్ర దొంతరాజు, అమరవాది శ్రీనివాస్, జనార్దన్, శ్రీనివాసరెడ్డి కేసవరపు, రమణ కొట్ట, నిరంజన్, హరి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వై యస్ ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన YSRCP నేతలు
-
PV Narasimha Rao: ఇంతింతై వటుడింతై అన్నట్లుగా..
సాక్షి, మంథని(జగిత్యాల): ఇంతింతై వటుడింతై అన్నట్లుగా.. లక్నేపల్లి అనే ఒక కుగ్రామంలో పుట్టి, రాజకీయ పరమపదసోపానంలో ఒక్కో మెట్టును అధిగమించి భారత ప్రధానిగా అత్యున్నత స్థానాన్ని అధిష్టించిన అపర చాణక్యుడు పీవీ నరసింహారావుకు నేడు శత జయంతి. 1921 జూన్ 28లో జన్మించిన పీవీ 1957లో మొట్టమొదటిసారిగా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఈ ప్రాంత ప్రజల మదిలో కదలాడుతూనే ఉన్నాయి. పీవీ శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మంథని నుంచే ప్రారంభం విద్యాభ్యాసం అనంతరం న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించేందుకు వచ్చిన పీవీ, స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో మొదట 1952లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అటు తర్వాత 1957లో మొదటిసారిగా మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వరుసగా 1962, 1967, 1972 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రిగా సేవలందించిన ఆయనను కాంగ్రెస్ అధిష్టానం 1972లో ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడంతో 1977 వరకు పనిచేశారు. ఆ తర్వాత హన్మకొండ నుంచి రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. 1984లో హన్మకొండ, మహారాష్టలోని రాంటెక్ నుంచి ఎంపీగా పోటీ చేయగా హన్మకొండలో ఓటమి చవిచూసినా, రాంటెక్‌లో విజయం సాధించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఆయన అపార అనుభవాన్ని గడించారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు గాడితప్పిన భారత ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రపంచ ముఖచిత్రంలో మన దేశ ఖ్యాతిని నిలబెట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ. 1991లో భారత ఆర్థిక నిల్వలు తరిగిపోయి ప్రధాని చంద్రశేఖర్ హయాంలో బంగారం నిల్వలను విదేశాల్లో తనఖా పెట్టాల్సిన పరిస్థితుల్లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పీవీ ఆర్థిక నిపుణుడు మన్మోహన్‌సింగ్‌కు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించాడు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నూతన ఆర్థిక సంస్కరణలకు తెర తీశారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా అభివృద్ధి చెందేందుకు దోహద పడ్డాడు. కేంద్రీయ విద్యాలయాలు. భూసంస్కరణలు, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు లాంటి అనేక సంస్కరణలకు రూపకర్త అయిన పీవీ చిరస్మరణీయుడు. ప్రధానిగా పీవీ 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్న పీవీని ప్రధాని పదవి వెతుక్కుంటూ వచ్చింది. దేశంలో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ రావడంతో ప్రధానిగా పీవీ పేరునే పార్టీ పెద్దలు ప్రతిపాదించారు. పీవీనే ప్రధాని పదవికి అర్హుడని ఏకగ్రీవంగా మద్దతు తెలుపడంతో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరు నెలల్లో కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసి, 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1991 నుంచి 1996 వరకు ప్రధానిగా పనిచేశారు. ప్రధానిగా దేశంలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించిన పీవీ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. చదవండి: Jagananna Colonies: 3 రోజుల్లో లక్షల ఇళ్లు -
అనంతపురంలో వైఎస్సార్ జయంతి వేడుకలు
-
'కళాకారులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ర్టం'
సాక్షి, విశాఖ : పద్మభూషణ్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ 90వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, తెలుగు భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సమావేశంలో లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ..కర్ణాటక సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తెచ్చినవారు తెలుగువారని ప్రశంసించారు. మంగళంపల్లి 400 రచనలు చేశారని పేర్కొన్నారు. కళాకారులను ఆదుకుంటాం : అవంతి శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా మారుమూల ప్రాంతంలో జన్మించిన మంగళంపల్లి ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. చరిత్రలో మంగళంపల్లి పేరు నిలిచిపోతుందన్నారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం ఆయన జయంతి వేడుకలను సాధారణంగా నిర్వహిస్తున్నామని దక్షిణాది రాష్ర్టాల్లో సంగీతాన్ని పరిచయం చేసింది మన తెలుగువాళ్లే అని కొనియాడారు. విద్యతో పాటు సంగీతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని, కళాకారులకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. కళాకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు. -
రైతు నేస్తం
-
రైతు బాగే రాష్ట్రం బాగు
‘‘నాన్నగారి రక్తం నాలో ఉంది. రైతన్నలకు నేను తోడుగా ఉంటానని ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. ప్రాజెక్టుల గురించి తెలిసిన వ్యక్తిని, కరువు ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని. ఆ ప్రాజెక్టులు, నీటితో రైతుల జీవితాలు పూర్తిగా బాగుపడుతాయని తెలిసిన వ్యక్తిని. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ఆ ప్రాజెక్టుల నుంచి డబ్బులు ఎలా గుంజాలి అనే ఆలోచన చేయం, ప్రాజెక్టుల్లో నీళ్లు ఎలా పారించాలనే ఆలోచన మాత్రమే చేస్తామని సగర్వంగా చెబుతున్నా’’ సాక్షి ప్రతినిధి కడప: అన్నదాతలు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం రైతన్నల శ్రేయస్సును కాంక్షించే ప్రభుత్వమని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ‘రైతు దినోత్సవం’ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లోనే రైతాంగం సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. రాబోయే మరో సంవత్సరంలో మరెన్నో చర్యలు ప్రారంభించబోతున్నామని తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా, రైతులకు బకాయిల చెల్లింపు వంటి విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. సీఎం జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘దివంగత మహానేత, నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డికి రైతుల పట్ల ఎలాంటి ప్రేమ ఉండేదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి మైక్ ఇచ్చినా వైఎస్సార్ గురించి నా కంటే బాగా చెబుతారు. రైతుల సంక్షేమం విషయంలో ఎందాకైనా ముందుకెళ్లడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధికారంలోకి రాగానే నెల రోజుల్లోనే అన్నదాతల కోసం ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకానికి శ్రీకారం చుట్టాం. మన ప్రభుత్వంలో ఈ సంవత్సరం కేవలం రైతులకు రూ.84,000 కోట్ల రుణాలు అందించాలని నిర్ణయం తీసుకున్నాం. పంటలు రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో తిరిగి చెల్లిస్తే వాటిపై వడ్డీ కట్టాల్సిన పనిలేదు. కడప జిల్లాలో జూన్ 1 నుంచి జూలై 7వ తేదీ దాకా అంటే 47 రోజుల్లో రైతన్నలకు రూ.1,000 కోట్ల పంటలు రుణాలు అందించాం. పంట రుణాలు ఇకపై సున్నా వడ్డీకే అందుబాటులోకి వస్తాయి. రైతన్నల కోసం తీసుకున్న మరో నిర్ణయం.. పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా. ఇప్పటికే వెసులుబాటు ఉన్న 60 శాతం ఫీడర్లలో దీన్ని అమలు చేస్తాం. అధికారుల సూచనల మేరకు మిగిలిన 40 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి రూ.1,700 కోట్లు వెంటనే విడుదల చేశాం. అలాగే ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు సరఫరా చేస్తున్నాం. ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ పథకానికి కూడా శ్రీకారం చుట్టాం ఇన్సూరెన్స్ ప్రీమియం సొమ్మును రైతుల తరపున ప్రభుత్వమే చెల్లిస్తుంది ప్రభుత్వమే ఇన్సూరెన్స్ సొమ్మును రాబట్టి, రైతన్నలకు అందజేస్తుంది. ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ పథకం కింద 55 లక్షల మంది రైతుల తరపున 1.38 కోట్ల ఎకరాలకు గాను అక్షరాలా రూ.2,164 కోట్ల బీమా ప్రీమియాన్ని ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయబోతున్నాం. అధికారంలోకి రాగానే శనగ రైతులపై తోడుగా ఉండేందుకు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున ఇవ్వబోతున్నాం. ఎకరాకు 6 క్వింటాళ్లు అంటే ప్రతి ఎకరాకు రూ.9,000 చొప్పున రైతన్నల చేతిలో పెట్టబోతున్నాం. శనగ రైతులను ఆదుకోవడానికి అధికారంలోకి వచ్చి నెల తిరక్కముందే రూ.330 కోట్లు కేటాయించాం. పామాయిల్ రైతులకు అండగా ఉండడానికి రేట్లను పూర్తిగా సవరించాం. తెలంగాణలో రైతులకు లభిస్తున్న ధరలే మన రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు దక్కేలా చర్యలు తీసుకున్నాం. దానివల్ల ప్రభుత్వంపై రూ.80 కోట్ల భారం పడుతున్నా ఫర్వాలేదని భావించి సంతకం చేశాం. బాబు నిర్లక్ష్యం వల్లే విత్తనాల కొరత ఖరీఫ్ సీజన్ మొదలయ్యే నాటికి రైతులకు విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలి. ఇందుకోసం గత ఖరీఫ్ సీజన్ అయిపోయిన వెంటనే నవంబర్ నెల నుంచే చర్యలు తీసుకోవాలి. మే నెల వచ్చే సరికి విత్తనాలను సిద్ధం చేసి పెట్టుకోవాలి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. విత్తనాలకు సంబంధించిన రూ.384 కోట్ల బకాయిలను సైతం చెల్లించలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే విత్తనాలకు సంబంధించిన రూ.384 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశా. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, విత్తనాలు కోనుగోలు చేసి, ప్రతి రైతుకూ అందజేయండి అని చెప్పా. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రూ.960 కోట్ల బకాయిలను తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు చెల్లించలేదు. మనం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చంద్రబాబు చేసిన తప్పిదాన్ని సరి చేశాం. రైతులకు రూ.960 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. రైతులకు ఇప్పటికే రూ.300 కోట్లు చెల్లించేశాం. బాధిత రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు రాయలసీమ ప్రాంతం. చంద్రబాబు పాలనలో కరువు వచ్చినా రైతాంగాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. 2018 ఖరీఫ్‌లో వచ్చిన కరువుకు సంబంధించి రైతులకు రూ.2,000 కోట్ల పెట్టుబడి రాయితీ(ఇన్పుట్ సబ్సిడీ) సొమ్ము చెల్లించాల్సి ఉండగా, అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదు. మన సర్కారు వచ్చాక నెల రోజులు కూడా తిరక్కముందే రైతుల పక్షపాతిగా ఆ ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను విడుదల చేస్తూ సంతకం చేశాం. అధికారంలోకి రాగానే ట్రాక్టర్లపై రోడ్డు ట్యాక్స్ రద్దు చేశాం. ‘వ్యవసాయ మిషన్’ ఏర్పాటు చేశాం. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం నెలకొల్పుతున్నాం. రైతు ఆత్మహత్య చేసుకున్నా, ప్రమాదవశాత్తూ చనిపోయినా, జరగరానిది జరిగినా మీరే అక్కడికి వెళ్లండి అని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. బాధిత కుటుంబాన్ని ఓదార్చి, రూ.7 లక్షల చెక్కును వారి చేతుల్లో పెట్టండి అని ఆదేశాలిచ్చాం. మనం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ శాఖ మంత్రిని పొగాకు కొనుగోలు కేంద్రాల దగ్గరకు పంపించా. కొనుగోలుదారులతో మాట్లాడి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించే కార్యక్రమాన్ని కేవలం ఈ నెల రోజుల్లోనే చేశాం. ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకానికి శ్రీకారం ఈ సంవత్సరం రైతులకు రూ.84,000 కోట్ల రుణాలు అందిస్తాం రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే వాటిపై వడ్డీ కట్టాల్సిన పనిలేదు 60 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా మిగిలిన 40 శాతం ఫీడర్లలో అమలుకు రూ.1,700 కోట్లు విడుదల ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు సరఫరా ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ పథకం అమలు 55 లక్షల మంది రైతుల తరపున రూ.2,164 కోట్ల బీమా ప్రీమియాన్ని ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుంది రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు శనగ రైతులను ఆదుకోవడానికి రూ.330 కోట్లు విత్తనాలకు సంబంధించిన చంద్రబాబు చెల్లించాల్సిన రూ.384 కోట్ల బకాయిలను చెల్లించాం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రూ.960 కోట్ల బకాయిలు రైతులకు చెల్లింపు 2018 ఖరీఫ్ కరువుకు సంబంధించి రైతులకు రూ.2,000 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల రైతు ఆత్మహత్య చేసుకున్నా ప్రమాదవశాత్తూ చనిపోయినా రైతు కుటుంబానికి రూ.7 లక్షలు రానున్న సంవత్సరంలో ఇంకెన్నో చర్యలు రైతులు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుంది. 62 శాతం జనాభా కష్టాల్లో ఉంటే ఏ రాష్ట్రమూ బాగుండదు. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా రాబోయే సంవత్సరం కాలంలోనే ఇంకెన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. తుపాను వచ్చినా, కరువు వల్ల పంటలు నష్టపోయినా రైతన్నలను ఆదుకోవడానికి రూ.2,000 కోట్లతో ‘విపత్తుల సహాయ నిధి’ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ పథకాన్ని ఈ సంవత్సరం నుంచే అమలు చేస్తాం. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు రబీలోనే సాయం అందజేస్తాం. ‘వైఎస్సార్ రైతు భరోసా’ను తీసుకొస్తున్నాం. పంటల సాగుకు సిద్ధమయ్యే నాటికే మే నెలలోనే పెట్టుబడి కోసం రైతన్న చేతిలో రూ.12,500 పెడతాం. ఈ పథకాన్ని మే నెలలో అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఏడు నెలల ముందే అమలు చేస్తున్నాం. రబీ సీజన్ మొదలయ్యే నాటికి ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీన ప్రతి రైతుకు రూ.12,500 ఇవ్వబోతున్నాం. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా దాదాపు 70 లక్షల రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద అక్టోబర్ 15వ తేదీన రూ.8,750 కోట్లు ఇవ్వబోతున్నామని చెప్పడానికి గర్వపడుతున్నా. దాదాపు 16 లక్షల మంది కౌలు రైతులకు కూడా దీనివల్ల మేలు జరుగుతుంది. ఇంత భారీ మొత్తాన్ని ఒకేసారి రైతుల చేతికి ఇవ్వడం అంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్న భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. భూ యజమానులకు ఉన్న హక్కులను పూర్తిగా కాపాడుతూ కౌలుదారులకు మేలు చేసే విధంగా 11 నెలల పాటు మాత్రమే సాగు ఒప్పందం ఉండేలా కౌలు రైతుల చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నాం. మొదటి ఏడాదే సహకార రంగం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా సహకార రంగంలో ఉన్న చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తాం. ప్రతి నియోజకవర్గంలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఇదే సంవత్సరం చర్యలు తీసుకోబోతున్నాం. ఇక నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభించేలా ప్రభుత్వం నడుం బిగించింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతను తేల్చడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక ల్యాబోరేటరీని తీసుకొస్తున్నాం. నాణ్యతను నిర్ధారించిన తర్వాతే వాటిని గ్రామ స్థాయిలో నేరుగా రైతులకు విక్రయించేలా చర్యలు తీసుకుంటాం. సంవత్సరం తిరక్కముందే మీ గ్రామంలో షాపులు కనిపిస్తాయి. మార్కెట్ కమిటీలకు ఎమ్మెల్యేలు గౌరవ చైర్మన్లు నియోజకవర్గాల్లో పంటల పరిస్థితి ఏమిటి? అక్కడ రైతుల కష్టాలేంటి? ఆ జిల్లాలోపంటల ధరలు ఎలా ఉన్నాయి? పంటలకు ఎలాంటి గిట్టుబాటు ధరలు కల్పించాలి? అనే దానిపై సూచనలు తీసుకోవడానికి మార్కెట్ కమిటీలకు ఇకపై ఎమ్మెల్యేలనే గౌరవ చైర్మన్లుగా నియమిస్తామని సగర్వంగా చెబుతున్నా. ఎమ్మెల్యేలు రైతులతో నేరుగా భేటీ అవుతారు. పంటలు, ధరల పరిస్థితిని స్వయంగా తెలుసుకుంటారు. తమ నియోజకవర్గంలో పండిన ఫలానా పంటకు ఫలానా మేర గిట్టుబాటు ధర కల్పించాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆ నియోజకవర్గంలో పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు విడుదల చేస్తుంది. ‘నాఫెడ్’ను ఏర్పాటు చేసి, ఐదు కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కనీస మద్దతు ధర కల్పించేందుకు ఈ సంవత్సరం చర్యలు తీసుకుంటున్నాం. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200 రిగ్గులు కొనుగోలు చేసి, ప్రతి రైతన్నకు ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమాన్ని ఇదే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం. గోదావరి నీటితో మన పొలాలు సస్యశ్యామలం గోదావరి జలాలు మన కళ్ల ముందే వృథాగా సముద్రంలో కలిసి పోతున్నాయి. గోదావరి జిల్లాలను శ్రీశైలంలోకి తీసుకొస్తే మన ప్రాంతం ఎలా మారిపోతుందో చెపాల్సిన పనిలేదు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి ఆమోదం తీసుకున్నాం. గోదావరి నీటిని శ్రీశైలానికి తీసుకొచ్చి, రాయలసీమ, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కృష్ణా ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. గోదావరి నీటిని శ్రీశైలానికి, నాగార్జునా సాగర్‌కు తీసుకొచ్చి, కృష్ణా ఆయకట్టును పూర్తిగా స్థిరీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలిగాం అంటే నిజంగా దేవుడు మన వైపు ఉన్నాడని చెప్పడానికి ఇదొక నిదర్శనం. రూ.2,000 కోట్లతో ‘విపత్తుల సహాయ నిధి’ ఏర్పాటు చేయబోతున్నాం. ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద ప్రతి రైతుకు రూ.12,500 అక్టోబర్ 15న రూ.8,750 కోట్ల పంపిణీ భూ యజమానుల హక్కులను పూర్తిగా కాపాడుతూ కౌలుదారులకు మేలు చేసే విధంగా 11 నెలల పాటు మాత్రమే సాగు ఒప్పందం ఉండేలా చట్టాల్లో మార్పులు సహకార రంగంలో ఉన్న చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తాం. ప్రతి నియోజకవర్గంలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతను తేల్చడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక ల్యాబోరేటరీ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి రైతన్నకు ఉచితంగా బోర్లు గోదావరి నీటిని శ్రీశైలానికి తీసుకొచ్చి, రాయలసీమ, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసే కార్యక్రమానికి శ్రీకారం డిసెంబర్ 26న కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కడప జిల్లాలో ఇక్కడికి దగ్గర్లోనే ఒక కలగా మిగిలిపోయిన స్టీల్ ప్లాంట్ కనిపిస్తోంది. డిసెంబర్ 26న అదే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని హామీ ఇస్తున్నా. మూడేళ్లలోనే ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తాం. కందూ నదిపై రాజోలి, జోలదరాశి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నాం. వాటి నిర్మాణానికి ఈ ఏడాది డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తాం. కుందూ నది నుంచి ఎత్తిపోతల ద్వారా తెలుగుగంగ కాలువ గుండా బ్రహ్మంసాగర్‌కు నీటిని తరలిస్తాం. ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ 26న ప్రారంభిస్తాం. దేవుడు దయతలిస్తే గండికోట రిజర్వాయర్‌లో ఈ సంవత్సరం 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు చర్యలు చేపడతాం. -
సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలి
సాక్షి, నిర్మల్అర్బన్: బంజారాల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. జిల్లా కేంద్రం లోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం సంత్ సేవాలాల్ 280వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ చూపించిన మార్గం ఆదర్శనీయమన్నారు. ఆయన బోధనలను అందరూ ఆచరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్పీ శశిధర్‌రాజు, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్లు, డీటీడబ్ల్యూవో శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీవో శ్యాంనాయక్, ఆల్ ఇండియా బంజారా లీగల్ సెల్ అధ్యక్షుడు అమర్‌సింగ్ తిలావత్, జెడ్పీటీసీ విమలాబాయి, సుజాత, పీఆర్‌డీఈఈ తుకారాం, మున్సిపల్ డీఈఈ సంతోష్, నాయకులు రాజేష్‌బాబు, రామునాయక్, నరేష్ జాదవ్, బలరాం నాయక్, రామారావు మహారాజ్, తదితరులున్నారు. సభా వేదికపై అతిథులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా బంజారాలు సంప్రదాయ పద్ధతిన జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. నృత్యాలతో అలరించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్, ఎమ్మె ల్యే రేఖానాయక్, మహిళా ప్రజా ప్రతినిధులు నృత్యాలు చేసి ఉత్సాహపరిచారు. కల్యాణలక్ష్మీ చెక్కులు అందించాలి మహారాష్ట్ర నుంచి ఇక్కడ అనేక ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి కుల సర్టిఫికెట్లు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. చాలా మందికి కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో కల్యాణలక్ష్మీ చెక్కులు అందడం లేదన్నారు. అలాగే ఆర్వోఆర్ పత్రాలను అందజేసి రైతుబంధు, రైతు బీమా పథకాలను వర్తింపజేయాలని కోరారు. – విఠల్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలి ప్రభుత్వం జిల్లా కేంద్రంలో బంజారా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి హామీ ఇచ్చినా ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదని పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని కోరారు. ఏటా సంత్ సేవాలాల్ జయంతి సందర్భం గా ఒక చోట చేరుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. – రేఖా శ్యాంనాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే రూ.5కోట్ల నిధులు విడుదల చేయాలి సేవాలాల్ జయంతికి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు విడుదల చేయాలన్నారు. ఏటా నిర్వహించే జయంతి కార్యక్రమాల్లో సీఎంలు హాజరు కావాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సేవాలాల్ చిత్రపటాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేసి బంజారాల సమస్యలు పరిష్కరించాలన్నారు. – అమర్‌సింగ్ తిలావత్, ఆల్ ఇండియా బంజారా లీగల్ సెల్ అధ్యక్షుడు వేడుకలకు హాజరైన బంజారాలు -
చెన్నైలో ఘనంగా ఘంటసాల 96వ జయంతి ఉత్సవాలు
-
మెల్బోర్న్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
మెల్బోర్న్ : వైస్సార్ సీపీ కన్వీనర్ కౌశిక్ రెడ్డి మామిడి ఆధ్వర్యంలో మెలోబోర్న్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్బంగా కేకు కట్ చేసి ప్రత్యేకంగా రూపోందించిన వైఎస్సార్ ఏవీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలోయూత్ ప్రెసిడెంట్ లోకేష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్చార్జ్ రమ్య యార్లగడ్డ, రాజేష్ శాఖమురి మరియు వైస్సార్ సీపీ అడిలైడ్ నుంచి సతీష్ రెడ్డి కొండ పాల్గొన్నారు. లిబరల్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు రాంపాల్ రెడ్డి, ఏటీఏఐ అధ్యక్షుడు అమరేందర్ అత్తపురం, ఆస్ట్రేలియా బీజేపీ నాయకులు శ్రీపాల్ రెడ్డి , ఆస్ట్రేలియా మూవీ యాక్టర్ మురళి పరిశే పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి..
సాక్షి, అమరావతి, హైదరాబాద్ : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుకున్నాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని కాలరాశాయని పేర్కొంటూ.. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలను అందించారు. చంద్రబాబు సంతలో గొర్రెల్ని, బర్రెల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలను కొని రాజ్యాంగాన్ని అవహేళన చేశారనీ, అందుకనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుకుంటున్నామని కరుణాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై గల అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సీసీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీసీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని భవిష్యత్తును నిర్దేశించిన మహామూర్తి అంబేద్కర్ అని కొనియాడారు.ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరు గారుస్తూ సుప్రీం తీర్పు ఇచ్చినప్పుడు నోరు మెదపని ప్రధాని మోదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా మొసలి కన్నీరు కారుస్తున్నారని రాఘవులు ఎద్దేవా చేశారు.