జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్ ప్రశాంతి
సాక్షి, నిర్మల్‌అర్బన్: బంజారాల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. జిల్లా కేంద్రం లోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం సంత్ సేవాలాల్ 280వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ చూపించిన మార్గం ఆదర్శనీయమన్నారు. ఆయన బోధనలను అందరూ ఆచరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్పీ శశిధర్‌రాజు, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్లు, డీటీడబ్ల్యూవో శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీవో శ్యాంనాయక్, ఆల్ ఇండియా బంజారా లీగల్ సెల్ అధ్యక్షుడు అమర్‌సింగ్ తిలావత్, జెడ్పీటీసీ విమలాబాయి, సుజాత, పీఆర్‌డీఈఈ తుకారాం, మున్సిపల్ డీఈఈ సంతోష్, నాయకులు రాజేష్‌బాబు, రామునాయక్, నరేష్ జాదవ్, బలరాం నాయక్, రామారావు మహారాజ్, తదితరులున్నారు.
సభా వేదికపై అతిథులు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా బంజారాలు సంప్రదాయ పద్ధతిన జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. నృత్యాలతో అలరించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్, ఎమ్మె ల్యే రేఖానాయక్, మహిళా ప్రజా ప్రతినిధులు నృత్యాలు చేసి ఉత్సాహపరిచారు.
కల్యాణలక్ష్మీ చెక్కులు అందించాలి
మహారాష్ట్ర నుంచి ఇక్కడ అనేక ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి కుల సర్టిఫికెట్లు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. చాలా మందికి కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో కల్యాణలక్ష్మీ చెక్కులు అందడం లేదన్నారు. అలాగే ఆర్‌వోఆర్ పత్రాలను అందజేసి రైతుబంధు, రైతు బీమా పథకాలను వర్తింపజేయాలని కోరారు. – విఠల్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలి
ప్రభుత్వం జిల్లా కేంద్రంలో బంజారా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి హామీ ఇచ్చినా ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదని పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని కోరారు. ఏటా సంత్ సేవాలాల్ జయంతి సందర్భం గా ఒక చోట చేరుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. – రేఖా శ్యాంనాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే
రూ.5కోట్ల నిధులు విడుదల చేయాలి
సేవాలాల్ జయంతికి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు విడుదల చేయాలన్నారు. ఏటా నిర్వహించే జయంతి కార్యక్రమాల్లో సీఎంలు హాజరు కావాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సేవాలాల్ చిత్రపటాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేసి బంజారాల సమస్యలు పరిష్కరించాలన్నారు. – అమర్‌సింగ్ తిలావత్, ఆల్ ఇండియా బంజారా లీగల్ సెల్ అధ్యక్షుడు
వేడుకలకు హాజరైన బంజారాలు
Comments
Please login to add a commentAdd a comment