చైర్మన్ పదవి కోసం పట్టుబడుతున్న టీడీపీ, జనసేన
టీడీపీ నుంచి రేసులో అశోక్ గజపతిరాజు, వేమిరెడ్డి ప్రశాంతి, రఘురామ
నాగబాబు కోసం పావులు కదుపుతున్న జనసేన
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవి కోసం కూటమి పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు ఆ పదవి కోసం గట్టిగా పట్టుపడుతున్నారు. టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, వేమిరెడ్డి ప్రశాంతి, రఘురామకృష్ణరాజు రేసులో నిలవగా.. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ పారీ్టకి చెందిన సీనియర్ నేత ఎవరికైనా ఆ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అశోక్ గజపతిరాజు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుమార్తె అదితికి అవకాశం కలి్పంచి.. తాను పోటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆయనకే ఈ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన పూర్తికాలం ఆ పదవి కోసం సమయం కేటాయించకపోవచ్చని, అలాగే అందరికీ అందుబాటులో ఉండడం కష్టమనే అభిప్రాయం టీడీపీ నేతల్లో నెలకొంది.
ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం.. స్పీకర్ పదవి ఆశించినా అదీ రాకపోవడంతో ఆయన తనకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా రేసులో ఉన్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డామని.. తమకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
నాగబాబు కోసం ఒత్తిడి!
టీడీపీలోనే టీటీడీ చైర్మన్ పదవి కోసం ఎంతో మంది ఆశలు పెట్టుకోగా.. దాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు జనసేన పార్టీ పావులు కదుపుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకు ఆ పదవి ఇవ్వాల్సిందేనని జనసేన పార్టీ చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఖాయమైనట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అనంతరం ఆ ప్రచారాన్ని ఖండించిన నాగబాబు.. అధికారిక ప్రకటన వస్తేనే ఇలాంటి వాటిని నమ్మాలన్నారు. దీంతో నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవిపై ఆశ ఉన్నట్లు బయటపడింది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైన నాగబాబు.. సర్దుబాటులో భాగంగా ఆ సీటును వదులుకున్నారు. దీంతో అన్నకు ఏదైనా మంచి పదవి ఇప్పించాలనే ఉద్దేశంలో పవన్‌కళ్యాణ్ ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే టీటీడీ చైర్మన్ పదవిని అడుగుతున్నట్లు సమాచారం. నెల రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉన్నా కూడా ఆ పదవికి ఉన్న ప్రాధాన్యత.. పోటీ నేపథ్యంలో చంద్రబాబు ఏమీ తేల్చట్లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీటీడీ బోర్డులో కూడా తమ పారీ్టకి చెందిన వారిని సగం మందిని నియమించాలని జనసేన కోరుతున్నట్లు తెలిసింది. బీజేపీ కూడా మూడుకు తగ్గకుండా తమ వారిని బోర్డులో సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేస్తోందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment