chairman
-
ఈ పదవి నా బాధ్యతను మరింత పెంచింది: దిల్ రాజు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు(వెంకట రమణ రెడ్డి) బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయనను ప్రభుత్వం ఈ పదవిలో నియమించగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవకాశమిచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు.తెలుగు సినిమా పూర్వ వైభవం తీసుకురావడానికి అందరి సహకారం అవసరమని దిల్ రాజు అన్నారు. తెలంగాణా సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి వచ్చిన తర్వాతనే గుర్తింపు వచ్చిందని.. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ పదవి నా బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తానని దిల్ రాజు హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.కాగా.. ఈ రోజు దిల్ రాజు పుట్టినరోజు కావడం మరో విశేషం. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వచ్చే ఏడాది పొంగల్‌కు విడుదల కానున్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు చిత్రానికి కూడా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
ధన్‌ఖడ్‌పై అవిశ్వాసం..జరిగేది ఇదే..!
సాక్షి,ఢిల్లీ: ఉపరాష్ట్రపతి,రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. అవిశ్వాస తీర్మానంపై దాదాపు 70 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అవిశ్వాస తీర్మానానం అంశంలో కాంగ్రెస్ లీడ్ తీసుకుంటోంది. కాంగ్రెస్ సభ్యులతో చైర్మన్ రాజ్యసభలో వ్యవహరిస్తున్న తీరు వల్లే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు చెబుతున్నారు.అధికార బీజేపీ సభ్యులకు చైర్మన్ కావాలనే కాంగ్రెస్-సోరోస్ లింకులపై నినాదాలు చేయడానికి అవకాశాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే తీర్మానం ఆమోదం పొంది ఉపరాష్ట్రపతి దన్ఖడ్ను తొలగించాలంటే పార్లమెంట్ ఉభయసభల్లో అవిశ్వాస తీర్మానం మెజారిటీ ఓట్లతో నెగ్గాల్సి ఉంటుంది. అధికార ఎన్డీఏతో పోలిస్తే ఇండియా కూటమికి పార్లమెంట్ ఉభయసభల్లోనూ మెజారిటీ లేకపోవడంతో ఈ తీర్మానం నెగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే తమ తీర్మానంతో ఇండియా కూటమి సభ్యులంతా మళ్లీ ఒక్కటై రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం అంశంలో విజయం సాధిస్తామని విపక్షాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.కాగా, ప్రొసీజర్ ప్రకారం అవిశ్వాస తీర్మానం ముందు రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలని రాజ్యాంగం చెబుతోంది. అయితే ఈ పార్లమెంట్ సెషన్ డిసెంబర్ 20తో ముగుస్తుండడంతో తీర్మానం అసలు సభలోకి వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. కేవలం చైర్మన్ తీరును దేశ ప్రజల ముందు ఎండగట్టాలనే వ్యూహంతోనే ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందన్న మరో వాదనా వినిపిస్తోంది.ఒకవేళ రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. తర్వాత ఏం జరుగుతుంది..?చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ఒకవేళ రాజ్యసభలో ప్రవేశ పెట్టారనే కాసేపు అనుకుందాం. ఇక్కడ తీర్మానం సింపుల్ మెజారిటీతో ఆమోదం పొందాలి. అప్పుడే తీర్మానం లోక్‌సభకు వెళుతుంది. అక్కడికీ వెళ్లిందనుకుందాం.. తీర్మానం.. అక్కడా సింపుల్ మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇంత జరిగితేనే ధన్‌ఖడ్ పదవిని కోల్పోతారు. నిజానికి నోటీసు ఇచ్చినప్పటి నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలంటే 14 రోజుల టైమ్ రాజ్యాంగ నిబంధన. ఇక్కడ ఆ నిబంధనను ఇండియా కూటమి పాటించలేదు. సెషన్ మరో 10 రోజులుందనగా నోటీసు ఇచ్చింది. దీంతో తీర్మానం అసలు రాజ్యసభకే వెళ్లదని తెలుస్తోంది. ఒక వేళ వెళ్లినా ఏ సభలోనూ ఇండియా కూటమికి సింపుల్ మెజారిటీ లేదనే విషయం తెలిసిందే. -
రాజ్యసభలో నోట్ల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: కరెన్సీ నోట్ల వ్యవహారం శుక్రవారం రాజ్యసభను కుదిపేసింది. అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం, మాటల యుద్ధంతో దుమారం రేగింది. పరస్పర విమర్శలతో వాతావరణం వేడెక్కింది. ఉదయం సభ సమావేశమవగానే చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అభిõÙక్ మను సంఘ్వీ సీటు నుంచి రూ.500, రూ.100 నోట్ల కట్ట దొరికినట్టు ప్రకటించారు. ‘‘గురువారం సభ వాయిదా పడ్డాక భద్రతా సిబ్బంది రోజువారీ తనిఖీలో 222 నంబర్ సీటు వద్ద నోట్ల కట్ట దొరికింది. అది తెలంగాణ నుంచి ఎంపికైన సంíఘ్వీకి కేటాయించిన స్థానం. అవి అసలైనవో, నకిలీవో తెలియదు. నిబంధనల ప్రకారం దీనిపై విచారణకు ఆదేశించా. దీన్ని సభ ముందుంచడం నా బాధ్యత. కనుక మీ దృష్టికీ తీసుకొస్తున్నా’’ అని వివరించారు. ‘‘అవి తమవేనని ఎవరైనా చెబుతారేమోనని చూశా. కానీ ఇప్పటికైతే ఎవరూ ముందుకు రాలేదు. ఇలా నోట్ల కట్టలను కూడా ఎక్కడో పెట్టి మర్చిపోయేన్ని డబ్బులున్నాయేమో మరి!’’ అన్నారు. చైర్మన్ ప్రకటన సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కాంగ్రెస్ సభ్యులు ఏకంగా సభలోకే నోట్ల కట్టలు తెస్తున్నారంటూ బీజేపీ ఎంపీలు విమర్శలకు దిగారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. చైర్మన్ సింఘ్వీ పేరు చెప్పడాన్ని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. విచారణ జరగకుండానే నేరుగా సభ్యుని పేరు బయట పెట్టి ఆయన గౌరవం తగ్గిస్తారా అంటూ ఆక్షేపించారు. అందులో తప్పేముందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ప్రశ్నించారు. ఏ సభ్యుని సీట్లో నోట్లు దొరికాయో చెబితే అభ్యంతరపెట్టడం ఎందుకన్నారు. ‘‘ఇలా సభలోకి నోట్ల కట్టలు తేవడం సరికాదు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిందే’’ అన్నారు. పార్లమెంటులోకి రసాయనాలు వెంట పెట్టుకుని వచి్చన ఉదంతాలను ధన్‌ఖడ్ గుర్తు చేశారు. ‘‘అందుకే విద్రోహ నివారణ తనిఖీలు కఠినంగా జరగాలన్నది నా ఉద్దేశం. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఆ కోణంలోనే పకడ్బందీగా రోజువారీ తనిఖీలు జరుగుతున్నాయి’’ అని వివరించారు. ‘‘సదరు సభ్యుడు గురువారం సభకు హాజరయ్యారు. ఆయన పేరు ప్రస్తావించినంత మాత్రాన విచారణపై ప్రభావమేమీ చూపదు’’ అని చెప్పారు. ఇది సభ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయమని సభా నాయకుడు జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. ‘‘దీనిపై విపక్ష సభ్యులు తలో అభిప్రాయం వెలిబుచ్చడం సరికాదు. అంతా ఒక్కతాటిపైకి వచ్చి దీన్ని ఖండిస్తూ తీర్మానం చేద్దాం’’ అని సూచించారు. ‘‘కొన్ని అంశాలపై చర్చ కోసం అత్యుత్సాహం చూపిస్తారు. ఇలాంటి కొన్ని అంశాలనేమో దాచేసే ప్రయత్నం చేస్తారు’’ అంటూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. వాటిని ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఆ అలవాటు అధికార పక్షానిదే తప్ప తమది కాదన్నారు. అధికార పక్ష ఎంపీలను కేంద్ర మంత్రులే తమపైకి ఉసిగొల్పుతున్నారని తిరుచ్చి శివ (డీఎంకే) ఆరోపించారు. ‘‘వాటిని నేను కళ్లారా చూశాను. ఇది ఎంతవరకు సమంజసం?’’ అని ప్రశ్నించారు. దాంతో సభలో మరింత గందరగోళం నెలకొంది. దర్యాప్తుకు తాము అడ్డుచెప్పడం లేదని ఖర్గే స్పష్టం చేశారు. సభలో ప్రత్యేకంగా చర్చ అవసరం లేదని మాత్రమే చెబుతున్నామన్నారు. ‘‘ఈ రోజు నోట్లు దొరికాయి. రేపు ఇంకేమీ దొరుకుతాయో తెలియడం లేదు’’ అని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సిందేనన్నారు. పరిస్థితి సద్దుమణిగాక జీరో అవర్ కొనసాగింది.గ్లాస్ సీలింగ్ వేయాలేమో: సింఘ్వీ నోట్ల వ్యవహారంపై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని సింఘ్వీ మండిపడ్డారు. గురువారం రాజ్యసభకు వచి్చనప్పుడు తన వద్ద కేవలం ఒకే ఒక్క రూ.500 నోటుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘నేను మూడు నిమిషాలే సభలో ఉన్నా! మధ్యాహ్నం 12.57 గంటలకు సభలో ప్రవేశించా. ఒంటిగంటకే సభ వాయిదా పడింది. 1:30 దాకా క్యాంటీన్లో ఉండి వెళ్లిపోయా’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఇంకొకరి సీటు వద్ద నోట్ల కట్ట ఎలా వేస్తారు? ఇకపై గంజాయి వంటివి కూడా పెడతారేమో. ఇకపై సభ్యులు ఎవరి సీటుకు వారు వైర్ ఫెన్సింగో, గ్లాస్ సీలింగో ఏర్పాటు చేసి, దానికి తాళం వేసి కీస్ తమతో పాటు ఇంటికి తీసుకెళ్లాలేమో!’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘దీనిపై విచారణ జరగాలి. భద్రతా వైఫల్యముంటే ఆ విషయాలూ వెలుగులోకి రావాలి’’ అని సింఘ్వీ డిమాండ్ చేశారు. -
టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం.. సర్కార్ ఉత్తర్వులు జారీ
-
టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (టీజీపీఎస్సీ)గా ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశంను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం(నవంబర్30) ఉత్తర్వులు జారీ చేసింది.బురర్రా వెంకటేశం నియామకానికి సంబంధించిన ఫైల్‌పై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులవ్వడంతో ఇప్పుడున్న అన్ని పోస్టులకు రాజీనామా బుర్ర వేంకటేశం రాజీనామా చేయనున్నారు.ఇప్పటికే ఈయన వీఆర్ఎస్ అప్లై చేయడంతో దానికి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. డిసెంబర్ 2న వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు. టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులవడం వల్ల సంతోషంగా ఉందని వెంకటేశం తెలిపారు. -
డిగ్రీ కోర్సుల గడువు విద్యార్థుల ఇష్టం
న్యూఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు నిర్ధిష్ట గడువు ఉంటుంది. డిగ్రీ కోర్సులు సాధారణంగా మూడేళ్లలో పూర్తవుతాయి. తమ వెసులుబాటును బట్టి కోర్సుల గడువును తగ్గించుకొనే లేదా పెంచుకొనే అవకాశం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఇలాంటి ఐచ్ఛికాన్ని విద్యార్థులకు ఇవ్వడానికి వీలుగా ఉన్నత విద్యా సంస్థలకు అనుమతి మంజూరు చేయబోతున్నట్లు విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) చైర్మన్ జగదీష్ కుమార్ చెప్పారు. యాక్సిలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఏడీపీ), ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఈడీపీ)ను ఆఫర్ చేసే విషయంలో ప్రామాణిక నియమావళికి యూజీసీ ఇటీవల ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రజల నుంచి సలహాలు సూచనలు ఆహ్వానించనున్నారు. ప్రామాణికమైన గడువు కంటే తక్కువ వ్యవధిలో లేదా ఎక్కువ వ్యవధిలో పూర్తి చేసినప్పటికీ ఆయా డిగ్రీలను సాధారణ డిగ్రీలుగానే పరిగణిస్తారు. ఉన్నత చదువులు లేదా ఉద్యోగ నియామకాలకు అవి యథాతథంగా చెల్లుబాటు అవుతాయి. -
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా ఇండిగో కో-ఫౌండర్
ఇండిగో కో-ఫౌండర్ 'రాకేష్ గంగ్వాల్' అమెరికాలోనే ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జులైలో బోర్డులో మెంబర్‌షిప్‌గా చేరిన గంగ్వాల్.. ఇటీవల 108 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 900 కోట్లు) విలువైన షేర్స్ కొనుగోలు చేశారు.కొత్త బోర్డు కమిటీ అధ్యక్షుల పేర్లతో పాటుగా గంగ్వాల్ స్వతంత్ర బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని ప్రకటించింది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ తిరిగి బలమైన ఆర్థిక పనితీరుకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రెసిడెంట్, సీఈఓ బాబ్ జోర్డాన్ సహకారం కూడా ఉంటుందని గంగ్వాల్ పేర్కొన్నారు.సెప్టెంబరు 30, అక్టోబరు ప్రారంభంలో గంగ్వాల్ 3.6 మిలియన్ షేర్లను సౌత్‌వెస్ట్‌లో కొనుగోలు చేశారు. ఒక్కో షేరుకు 29 డాలర్ల నుంచి 30 డాలర్ల మధ్యలో ఉన్నాయి. మొత్తం పెట్టుబడి 108 మిలియన్ డాలర్లు. గంగ్వాల్ వరల్డ్‌స్పాన్ టెక్నాలజీస్‌కు చైర్మన్ & సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఈయన ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్ధి. 2022లో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీని స్థాపించారు. -
బీమాలోకి మరిన్ని కంపెనీలు రావాలి
ముంబై: ఇన్సూరెన్స్‌లో ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలున్న నేపథ్యంలో మరిన్ని దిగ్గజ సంస్థలు ఈ రంగంలోకి రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ దేబశీష్ పాండా సూచించారు. కొత్త సంస్థలు మార్కెట్లో ప్రవేశించేందుకు వీలుగా నిబంధనలను కూడా సరళతరం చేశామని సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ‘‘మేమైతే అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశాం. కంపెనీలే మరింత సమయం కోరుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కన్సాలిడేషన్ కన్నా మార్కెట్లో మరిన్ని సంస్థలు వచ్చేలా చూసేందుకే ఐఆర్డీఏఐ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. భారత బీమా రంగంలో అవకాశాలను గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించేందుకు ఇటీవలే జపాన్, యూరప్, అమెరికాలో రోడ్‌షోలు నిర్వహించామని వెల్లడించారు. మరోవైపు, స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యేలా మరిన్ని సంస్థలను ఐఆర్డీఏఐ ప్రోత్సహిస్తోందని పాండా చెప్పారు. దీనితో పారదర్శకత పెరుగుతుందని, అంతిమంగా షేర్హోల్డర్లు అలాగే పరిశ్రమకు ప్రయోజనం చేకూరగలదని పేర్కొన్నారు. దేశీయంగా 140 కోట్ల మంది పైగా జనాభా ఉన్న నేపథ్యంలో మొత్తం బీమా సంస్థలు డెభ్భైకి పైగా ఉన్నా .. ఇంకా వ్యాపార అవకాశాలు ఎక్కువే ఉన్నాయని పాండా చెప్పారు. జీఎస్టీ తగ్గింపు వార్తలపై నేరుగా ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ బీమా పాలసీలు అందరికీ అందుబాటు స్థాయిలో ఉండేలా చూడాలనేదే ఐఆర్డీఏఐ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే, పన్నుల తగ్గింపు ఒక్కటే దీనికి పరిష్కారం కాదని తెలిపారు. -
ఇదేం కమిషన్?
సాక్షి, హైదరాబాద్: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తొలిదశలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాల్సిన కమిషన్‌ను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. విద్యా కమిషన్ కోసం ఏర్పాటు చేసిన సలహా మండలి సభ్యులు ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలాంటి హేతుబద్ధత లేకుండా, తమను సంప్రదించకుండానే సభ్యులుగా చేర్చారని కొందరు సభ్యులు మండిపడుతున్నారు.సలహా మండలిలో చేరేదే లేదని ఇప్పటికే ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారని.. మరో ఇద్దరు ఇదే బాటలో ఉన్నారని తెలిసింది. మరోవైపు కమిషన్ చైర్మన్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కమిటీ ఏర్పాటు చేసినా.. ఎలాంటి మౌలిక సదుపాయాలు ఇవ్వకపోవడం, సలహాదారుల ఎంపికలో తనకు ప్రమేయమే లేకపోవడాన్ని ఆయన జీర్ణించుకోవడం లేదని తెలిసింది. విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి అన్నీ తానే అయి నడిపిస్తుండటమే దీనికి కారణమని విద్యాశాఖ వర్గాలు చెప్తుండటం గమనార్హం. ఇవేం నియామకాలు? విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. చైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించింది. చాలా రోజుల తర్వాత కమిషన్‌కు ముగ్గురు సభ్యులను నియమించింది. వాస్తవానికి విద్యా రంగంలోని వివిధ విభాగాల నుంచి సభ్యుల నియామకం జరగాలని కొన్ని నెలల క్రితం జరిగిన మేధావుల సమావేశంలో సీఎంకు పలువురు సూచించారు. కానీ ఒక కార్పొరేటర్, అధికార పారీ్టకి చెందిన ఓ స్కాలర్ సహా మరో వ్యక్తిని సభ్యులుగా నియమించడంపై విమర్శలు వచ్చాయి. దీనివల్ల సభ్యులు రాజకీయ కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుందని.. విద్యా రంగంలో పారదర్శకంగా సంస్కరణలు చేపట్టలేమనే అభిప్రాయాలు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే విద్యా కమిషన్‌కు సలహా కమిటీ సభ్యులుగా ప్రొఫెసర్ హరగోపాల్ సహా పలువురు ప్రొఫెసర్లను నియమించారు. అయితే ఈ నియామకాలు విద్యా కమిషన్ పరిధిలో జరిగి ఉంటే బాగుండేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం కొందరి సూచనల మేరకు సలహా కమిటీని సీఎం వేశారని అంటున్నారు. సలహా కమిటీ కేవలం ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని.. అలాంటప్పుడు విద్యా కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. సంస్కరణలు సాధ్యమేనా? విద్యా కమిషన్‌పై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.. విద్యా రంగంలో సంస్కరణల దిశగా అడుగులు వేయడం లేదని సలహా కమిటీలో నియమితులైన సభ్యుడొకరు మండిపడ్డారు. కర్నాటకలోనూ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారని, ఆ కమిషన్ మొత్తం 14 సబ్ కమిటీలను వేసుకుందని.. వాటి ద్వారా మార్పులకు శ్రీకారం చుడుతోందని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ రాజకీయ, సామాజిక కోణంలోని వారినే ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చారని.. సాంకేతిక విద్య, అంగన్వాడీ, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో నిపుణులను భాగస్వామ్యం చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అంతేగాకుండా అసలు విధులేమిటో చెప్పలేదని, ఏం సలహాలివ్వాలి, ఎవరికి ఇవ్వాలనే స్పష్టతా లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యా కమిషన్‌కు ఆదిలోనే తలపోట్లు తప్పేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
సొంత హోటల్లో టాటా చేసిన పనికి ఫిదా!
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఐబీఎస్ సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ వీకే మాథ్యూస్.. టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర సంఘటలను పంచుకున్నారు.రతన్ టాటా వ్యక్తిత్వంలో తనకు బాగా నచ్చేది ఆయన మానవత్వం అని, దీంతోపాటు ఆయనలో హాస్య చతురత కూడా ఉందని మాథ్యూస్ చెప్పారు. రతన్ టాటా ఉన్నారంటే ఎంతటి సీరియస్ వాతావరణాన్ని అయినా తన హాస్యంతో తేలికపరచగలరని పేర్కొన్నారు.తానెవరో తెలియకుండా..“యూఎస్ పర్యటనలో రతన్ టాటాతో కొంత సమయం గడిపే అవకాశం నాకు దొరికింది. ఆ సందర్భంగా జరిగిన రెండు సంఘటనలు నాకు ఎప్పుడూ గుర్తంటాయి” అని వాటి గురించి వెల్లడించారు మాథ్యూస్.ఒక రోజు న్యూయార్క్‌లోని టాటా సొంత హోటల్లో వీరిద్దరూ అల్పాహారం చేశారు. అయితే రతన్ టాటా ఓనర్‌గా తన దర్పం ప్రదర్శించలేదని, అసలు తానెవరో అక్కడి సిబ్బందికి చెప్పలేదని మాథ్యూస్ గుర్తుచేసున్నారు. ఇదే ఆయన నిరాడంబరతకు నిదర్శనమని చెప్పారు.“అదే రోజు తరువాత నేను, నా కుటుంబం మరొక రెస్టారెంట్‌కి వెళ్లగా అక్కడ రతన్ టాటా కనిపించారు. ఆయన బిల్లును స్వయంగా తన క్రెడిట్ కార్డ్‌తో చెల్లించడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. అది ఆయన ఎంత సింపుల్‌గా ఉంటారో తెలియజేసింది” అని మాథ్యూస్ గుర్తుచేసున్నారు.మరో కోణంఇక రతన్ టాటాలో ఉన్న మరో కోణం ఆయన హాస్య చతురత. "తన ట్రేడ్‌మార్క్ హాస్యంతో రతన్ టాటా నన్ను, 'నేను నిన్ను వెంటాడుతున్నానా, లేక నువ్వు నన్ను వెంటాడుతున్నావా?' అన్నారు. ఆ తేలికైన వ్యాఖ్య పరిస్థితితో సంబంధం లేకుండా ఇతరులతో కనెక్ట్ అయ్యే ఆయన స్వభావాన్ని తెలియజేసింది” అని మాథ్యూస్ వివరించారు. -
TG: పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల- నీలి శ్రీనివాసులుమహబూబ్ నగర్- మల్లు నర్సింహారెడ్డివికారాబాద్- శేరి రాజేష్ రెడ్డినారాయణ పేట్- వరాల విజయ్ కుమార్కామారెడ్డి- మద్ది చంద్రకాంత్ రెడ్డి, సంగారెడ్డి- గొల్ల అంజయ్యవనపర్తి- జీ గోవర్థన్రంగారెడ్డి జిల్లా- ఎలుగంటి మధుసూదన్ రెడ్డికరీంనగర్ జిల్లా- సత్తు మల్లయ్య నిర్మల్ జిల్లా- సయ్యద్ అర్జుమాండ్ అలీరాజన్న సిరిసిల్ల జిల్లా- నాగుల సత్యనారాయణ గౌడ్ -
ఏబీసీ చైర్మన్‌గా రియాద్ మాథ్యూ
న్యూఢిల్లీ: పత్రికల సర్క్యులేషన్‌ను మదింపు చేసి.. ధ్రువీకరించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ)కి చైర్మన్‌గా మలయాళ మనోరమకు చెందిన రియాద్ మాథ్యూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024–25 సంవత్సరానికి ఆయన ఏబీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. చీఫ్ అసోసియేట్ ఎడిటర్ అయిన మాథ్యూ మలయాళ మనోరమ గ్రూపు డైరెక్టర్ కూడా. మాథ్యూ పీటీఐ వార్తా సంస్థ బోర్డులో కూడా 2009 నుంచి డైరెక్టర్‌గా ఉన్నారు. కరుణేష్ బజాజ్ (ఐటీసీ) డిప్యూటీ ౖచైర్మన్‌గా ఎన్నిక కాగా, మోహిత్ జైన్ కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. యాడ్ ఏజెన్సీల ప్రతినిధి విక్రమ్ సఖుజా కోశాధికారిగా తిరిగి ఎన్నికయ్యారు. 2024–25 సంవత్సరానికి ఏబీసీ మేనేజ్మెంట్ కౌన్సిల్‌లోని సభ్యుల వివరాలు.. పబ్లిషర్స్ ప్రతినిధులు: రియాద్ మాథ్యూ (మలయాళ మనోరమ), ప్రతాప్ జి.పవార్ (సకాల్ పేపర్స్), శైలేష్ గుప్తా (జాగరణ్ ప్రకాశన్ లిమిటెడ్), ప్రవీణ్ సోమేశ్వర్ (హెచ్‌టి మీడియా లిమిటెడ్), మోహిత్ జైన్ (బెన్నెట్, కోల్మన్ అండ్ కంపెనీ లిమిటెడ్), ధ్రువ ముఖర్జీ (ఏబీపీ ప్రైవేట్ లిమిటెడ్), కరణ్ దర్దా (లోక్మత్ మీడియా ప్రై. లిమిటెడ్), గిరీష్ అగర్వాల్ (డీబీ కార్ప్ లిమిటెడ్). ప్రకటనకర్తల ప్రతినిధులు: కరుణేష్ బజాజ్ (ఐటీసీ లిమిటెడ్), అనిరుధ హల్దార్ (టీవీఎస్ మోటర్స్ కంపెనీ లిమిటెడ్), పార్థో బెనర్జీ (మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్). యాడ్ ఏజెన్సీల ప్రతినిధులు: శ్రీనివాసన్ కె.స్వామి (ఆర్కే స్వామి లిమిటెడ్), విక్రమ్ సఖుజా (మాడిసన్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్), ప్రశాంత్ కుమార్ (గ్రూప్ ఎం మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్), వైశాలి వర్మ (ఇనీíÙయేటివ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్), సేజల్ షా (పబ్లిక్స్ మీడియా ఇండియా గ్రూపు). -
స్టాండింగ్ కమిటీల ఏర్పాటు కొలిక్కి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభకు సంబంధించి వివిధ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల కూర్పు ఓ కొలిక్కి వచి్చనట్లు తెలుస్తోంది. లోక్‌సభ పరిధిలోని 16, రాజ్యసభ పరిధిలోని 8 విభాగాల స్టాండింగ్ కమిటీల్లో తమకు కనీసంగా 5 కమిటీలకు ఛైర్మన్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వచి్చంది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్లు కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, కె.సురేశ్, జైరాం రమేశ్ తదితరులతో చర్చించారు. 5 కమిటీలతో పాటు, కమిటీల్లో అత్యంత కీలకమైన హోంశాఖను కాంగ్రెస్ కోరింది. అయితే హోంశాఖను అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. లోక్‌సభ స్టాండింగ్ కమిటీల్లో మూడింటికి ఓకే చెబుతూనే.. విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృధ్ధి– పంచాయతీరాజ్, వ్యవసాయం వంటి కీలక విభాగాల స్టాండింగ్ కమిటీలకు కాంగ్రెస్ ఎంపీలను ఛైర్మన్లుగా నియమించేందుకు అంగీకరించింది. ఇక రాజ్యసభ కమిటీల్లో విద్యా శాఖను అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ వర్గాలు సోమవారం దీన్ని ధృవీకరించాయి. -
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్‌గా 'సతీష్ కుమార్'
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఇండియన్ ఆయిల్) చైర్మన్‌గా 'సతీష్ కుమార్ వడుగిరి' ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థకు అధిపతిగా నేడు బాధ్యతలు చేపట్టారు. శనివారం పదవికి రాజీనామా చేసిన ఎస్ఎం వైద్య స్థానంలో సతీష్ కుమార్‌ను నియామకమైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది.2021 అక్టోబరు నుంచి డైరెక్టర్ (మార్కెటింగ్)గా పనిచేస్తున్న సతీష్ కుమార్.. తన ప్రస్తుత పాత్రను కొనసాగిస్తూనే ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. ఈయన 2022 అక్టోబర్ నుంచి ఒక సంవత్సరం పాటు డైరెక్టర్ (ఫైనాన్స్)గా కూడా పనిచేశారు.35 సంవత్సరాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అభివృద్ధికి సతీష్ కుమార్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయనకు ఇండియన్ ఆయిల్ మారిషస్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్ అయిన ఇండియన్ ఆయిల్ పెట్రోనాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, బహుళజాతి చమురు కంపెనీలతో పనిచేసిన విస్తృత అనుభవం ఉంది.సతీష్ కుమార్ నాయకత్వంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గత మూడు సంవత్సరాలలో రికార్డు స్థాయి వృద్ధి సాధించింది. సంస్థ తన రిటైల్ అవుట్లెట్లను ఆధునీకరించింది, కొత్త బాట్లింగ్ ప్లాంట్లు, టెర్మినల్‌లను ప్రారంభించింది. హైవే రిటైల్ ప్రదేశాలలో సౌకర్యాలను ప్రవేశపెట్టింది.మార్కెటింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు సతీష్ కుమార్.. మధ్యప్రదేశ్ & ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మార్కెటింగ్ నెట్‌వర్క్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్‌గా పనిచేశారు. తన కెరీర్లో LPG వినియోగదారుల కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY), బీఎస్-6 ఫ్యూయల్ ఇంప్లిమెంటేషన్ మొదలైన కీలక వ్యాపార కార్యక్రమాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. -
మేం చెప్పిన వారే చైర్మన్
సాక్షి అమరావతి/ సాక్షి, నెట్వర్క్: పాఠశాలలు, విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్య కమిటీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ–ఎస్ఎంసీ) ఎన్నికలు పూర్తి ఏకపక్షంగా జరిగేలా అధికార టీడీపీ నేతలు యథేచ్ఛగా దౌర్జన్యకాండ సాగించారు. తాము చెప్పిన వారినే చైర్మన్ చేయాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించినప్పటికీ, ఆ మేరకు అధికారికంగా ప్రకటించకుండా అడ్డుపడ్డారు. పోలీసుల కనుసన్నల్లోనే ఎన్నికలు జరిగినప్పటికీ టీడీపీ నేతల రౌడీయిజాన్ని వారు ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. 24 జిల్లాల పరిధిలోని 40,781 పాఠశాలలకు గాను 40,150 (98.45%) పాఠశాలల్లో గురువారం టీడీపీ మూకల దౌర్జన్యం మధ్య ఎన్నికలు పూర్తయ్యాయి. 631 పాఠశాలల్లో వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. ఎన్నికలు నిర్వహించని పాఠశాలలకు రీ షెడ్యూల్ ప్రకటించినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఈ నెల 17న ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.అడుగడుగునాదౌర్జన్యం» వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం కమలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సభ్యులందరూ చిట్టిబోయిన కవితను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఇంతలో అదే గ్రామానికి చేందిన టీడీపీ నేత వడ్డమాను సుధర్శన్‌రావు, మరి కొంత మంది పాఠశాలకు వచ్చారు. మోపూరి పార్వతి అనే మహిళను చైర్మన్‌గా చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రహ్మంగారి మఠం మండలంలో పలు పాఠశాలల్లో తల్లిదండ్రులతో సంబంధం లేకుండా టీడీపీ నేతలే చైర్మన్లను నియమించారు. » శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం మలుగూరు ప్రాథమిక పాఠశాలలో వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు లావణ్య పూర్తి మెజార్టీతో గెలిచారు. అయినా ఆమె గెలుపును అధికారికంగా ప్రకటించకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. రెండవసారి ఎన్నిక జరపాలని పట్టుబట్టారు. దీంతో 30 మంది సభ్యుల్లో 22 మంది లావణ్యకు మద్దతు తెలిపారు. అయినా టీడీపీ నాయకులు హెచ్ఎంతో గొడవ పెట్టుకున్నారు. సమాచారం అందుకుని అక్కడకు వచ్చిన రూరల్ సీఐ కూడా టీడీపీ నాయకులకే మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికను శుక్రవారం నాటికి వాయిదా వేశారు. » ధర్మవరం రూరల్ మండలం రేగాటిపల్లి మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో టీడీపీ వర్గీయులు మాత్రమే పాఠశాలలోకి ప్రవేశించి, ఇతరులెవ్వరూ లోపలకు రాకుండా అడ్డుకున్నారు. పలువురు పాఠశాల బయట గొడవ చేయగా, ఎన్నికను వాయిదా వేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సొంతూరు తోపుదుర్తి గ్రామంలో డీఎస్పీ శివారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వైఎస్సార్సీపీ మద్దతుదారులైన తల్లిదండ్రులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి పంపకుండా అడ్డుకున్నారు. టీడీపీ మద్దతుదారులను సభ్యులుగా ఎన్నుకున్న తర్వాత వీరిని లోపలికి అనుమతించారు. » డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పెద్ద దళితవాడ మండల పరిషత్ పాఠశాలలో వైఎస్సార్సీపీ మద్దతుదారు గెలుపొందినా, టీడీపీ నేతల హెచ్చరికలతో టీడీపీ మద్దతుదారు గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటి కేశవరం ప్రాథమిక పాఠశాలలో వైఎస్సార్సీపీ మద్దతుదారు గుడాల వసంతకుమార్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే ఎస్ఐ ఆనందకుమార్ జోక్యం వల్ల టీడీపీ మద్దతుదారు పి.అచ్చియ్యమ్మ ఒక్క ఓటు మెజార్టీతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. » తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో.. కమిటీలో లేని వారిని ఎలా అభ్యర్థిగా నియమిస్తారని వైఎస్సార్సీపీ నేతలు నిలదీయడంతో టీడీపీ నేతలు గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. » సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ముందుగానే తమకు అనుకూలమైన వ్యక్తుల పేర్లను ఇచ్చి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారు. దీంతో పోటీలో నిలబడాలనే ఆశతో వచ్చిన పలువురు తల్లిదండ్రులు నిరాశతో వెనుదిరిగారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలంలోని గంగమాంబపురం జెడ్పీ హైస్కూల్లో టీడీపీ మద్దతుదారును ఏకపక్షంగా ఎంపిక చేశారు. » గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైఎస్సార్సీపీ బలపరిచిన బూసి ఏసుమరియమ్మ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీంతో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని, వారి మద్దతుదారులు ఎన్నికైనట్లు ప్రకటించారు. » విశాఖ జిల్లా చంద్రంపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరులు ప్రధానోపాధ్యాయుడి చాంబర్లో తిష్టవేసి మొత్తం వ్యవహారం వారికి అనుకూలంగా నడిపించారు.» శ్రీకాకుళం జిల్లా జలుమూరు బాలికల ఉన్నత పాఠశాలలో వైఎస్సార్సీపీకి చెందిన కింజరాపు పద్మ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీన్ని సహించలేని స్థానిక టీడీపీ నేత మునుకోటి దామోదరరావు.. పోలీసులు తమకు సహకరించలేదని పోలీసు స్టేషన్‌పై దాడికి యత్నించారు. -
ఎస్బీఐ ఛైర్మన్ నియామకానికి కేంద్రం ఆమోదం
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్ శెట్టి) నియామకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఆర్థిక సేవల విభాగం పంపిన ప్రతిపాదనకు నియామకాల క్యాబినెట్ కమిటీ (ఏసీసీ) ఆమోదముద్ర వేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడైంది.ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న దినేశ్ కుమార్ ఖారా ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఆయన స్థానంలో శెట్టి బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన శెట్టి ప్రస్తుతం ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్లలో అత్యంత సీనియర్‌గా ఉన్నారు. బీఎస్సీ చేసిన ఆయన 1988లో ప్రొబేషనరీ ఆఫీసరుగా ఎస్బీఐలో తన కెరియర్ ప్రారంభించారు. మరోవైపు, ప్రస్తుతం డీఎండీగా ఉన్న రాణా అశుతోష్ కుమార్ సింగ్‌ను ఎస్బీఐ ఎండీగా కేంద్రం నియమించింది. ఎస్బీఐలో ఒక ఛైర్మన్, నలుగురు ఎండీలు ఉంటారు.ఇదీ చదవండి: పండగ సీజన్లో శనగపప్పు ధరలకు రెక్కలు -
తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా వ్యహరించమని టెక్ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కోరినట్లు సీఎం తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని.. రెండు, మూడు రోజుల్లో తన నిర్ణయం చెబుతానని పేర్కొన్నట్లు తెలిపారు. అయితే మరో రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్రా.. వర్సిటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.Anand Mahindra to be chairman of Young India Skills University.- CM Revanth Reddy📍New Jersey, USA #RevanthReddyinUSA#RevanthReddy• @revanth_anumula pic.twitter.com/cFjjqzG4Oi— Team Congress (@TeamCongressINC) August 5, 2024 ఆనంద్ మహేంద్ర..ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆయన ఒక ఇన్స్పిరేషన్.ఈ దేశ యువత ఎవరైనా తమ స్కిల్ ను ప్రదర్శిస్తే ఆ ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో పెట్టి వారిని ప్రోత్సహించడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు.అటువంటి వ్యక్తిని తెలంగాణలో ఏర్పాటు కాబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ… pic.twitter.com/2pnRjKlkB1— Telangana Congress (@INCTelangana) August 5, 2024కాగా రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్ఖాన్పేట్లో స్కిల్ డెవలప్మెంట్ (వృత్తి నైపుణ్యాభివృద్ధి) యూనివర్సీటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. రూ.100 కోట్లతో 57 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీకి ఆగస్టు 1న సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఇందులో 17 కోర్సులను అందుబాటులోకి తేనున్నారు.తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆనంద్ మహీంద్ర ఒక ఆదర్శవంతమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ దేశ యువత ఎవరైనా తమ స్కిల్‌ను ప్రదర్శిస్తే ఆ ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో పెట్టి వారిని ప్రోత్సహించడంలో ఆయన ముందు వరుసలో ఉంటారని తెలిపారు. అటువంటి వ్యక్తిని తెలంగాణలో ఏర్పాటుకాబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మనన్‌గా సీఎం ఎంపిక చేయడం మంచి నిర్ణయమని కొనియాడుతున్నారు. -
పరిశోధనలతో సమాజానికి మేలు
(వివేకానంద్ తంగెళ్లపల్లి) ; పరిశోధనలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ స్పష్టం చేశారు. యువత పరిశోధనా రంగంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. ఎంత ఎక్కువ మంది పరిశోధనా రంగంలోకి వస్తే అంత ఎక్కువగా దేశానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగదీశ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. తగినంత మంది అధ్యాపకులు ఉండాలి ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని జగదీశ్‌కుమార్ అన్నారు. వీరి నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి నాణ్యమైన పరిశోధనలు ఆశించలేమని. కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే వారు నిబద్ధతతో పని చేయలేరని అభిప్రాయపడ్డారు.విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి తగిన విధంగా ఉంటే పరిశోధనల్లో ఆటోమేటిక్‌గా నాణ్యత పెరుగుతుందని స్పష్టం చేశారు. చాలా వర్సిటీల్లో శాశ్వత సిబ్బందిని నియమించకుండా, కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు కదా! అనే ప్రశ్నకు బదులిస్తూ..ఇది చాలా పెద్ద సమస్య అని, రాష్ట్రాల గవర్నర్లు, ప్రభుత్వాలకు ఈ విషయంలో తాము చాలాసార్లు లేఖలు రాశామని చెప్పారు. తమ పరిధిలో ఉన్నంత వరకు తాము ప్రయతి్నస్తున్నామని, గత వారంలో కూడా దీనిపై చర్చించామని తెలిపారు. ఇప్పటికైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. న్యాక్ గుర్తింపు తీసుకోవాలి తెలంగాణ సహా ఎక్కడైనా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందే విషయంలో ఎప్పటికప్పుడూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ వారికి అవగాహన కలి్పస్తున్నామని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని జగదీశ్‌కుమార్ తెలిపారు. న్యాక్ గుర్తింపు కోసం ముందుకు రావాలని విద్యా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అలా రాకపోతే సమాజానికి మేలు చేయని వారిగానే పరిగణించాల్సి వస్తుందని, నాణ్యమైన విద్యను అందించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఉద్యోగం కోసం పీహెచ్డీ చేయకూడదుపరిశోధనా రంగంలోకి ఎక్కువ మంది యువత రావాలనే ఉద్దేశంతోనే.. పీజీతో సంబంధం లేకుండా నాలుగేళ్ల డిగ్రీ తర్వాత పీహెచ్డీ చేసే వెసులుబాటు కల్పించామని జగదీశ్‌కుమార్ వెల్లడించారు. ఈ విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో విజయవంతంగా అమలవుతోందని, ఇక్కడ కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. పీహెచ్డీ చేసిన వారికి జీవనోపాధి కష్టమవుతోందనే అభిప్రాయంపై మాట్లాడుతూ..‘పీహెచ్డీ అంటే ఏదో ఉద్యోగం కోసం చేసే కోర్సు కాదు. రీసెర్చ్‌పై ఆసక్తి (ప్యాషన్) ఉంటేనే ఈ రంగంలోకి రావాలి. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పీహెచ్డీ చేయాలి. అంతేకానీ ఉద్యోగం కోసం మాత్రం రావొద్దు. ఉద్యోగమే కావాలనుకుంటే పీజీ తర్వాత ఏదైనా వేరే కోర్సు చేసి స్థిరపడటం మంచిదని నా అభిప్రాయం..’అని చెప్పారు. -
‘విద్యుత్’ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బి.లోకూర్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ నిర్ణయాలపై ఏర్పాటైన విచారణ కమిషన్‌కు కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో విచారణ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి స్థానంలో ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ నిర్వహించి నివేదిక సమరి్పంచడానికి ప్రభుత్వం జస్టిస్ లోకూర్‌కు 3 నెలల గడువును విధించింది.జస్టిస్ లోకూర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గౌహతి హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు. కాగా, నామినేషన్ల ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్ సంస్థకు అప్పగించడంతోపాటు ఛత్తీస్‌గఢ్‌తో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం కుదుర్చుకోవడంపై పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ మూడు నిర్ణయాల్లో చోటుచేసుకున్న అవకతవకతలపై విచారణ జరిపి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నిర్ధారించాలని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ఇప్పుడు ఇదే మార్గదర్శకాలు జస్టిస్ లోకూర్ కమిషన్‌కు కూడా వరిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయాల్లో పాత్ర ఉన్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్ రావు, ఇంధన శాఖ కార్యదర్శులు, ఇతర అధికారులకు జస్టిస్ నరసింహా రెడ్డి గతంలో నోటీసులు జారీ చేసి వారి నుంచి రాతపూర్వకంగా వాంగ్మూలాన్ని స్వీకరించారు.విచారణ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసి నివేదికను సైతం రూపొందించారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ సందర్భంలో జస్టిస్ నరసింహా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చేసిన వాŠయ్‌ఖ్యలను కారణంగా చూపుతూ విచారణ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, జూలై 1న కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచి్చంది.హైకోర్టు తీర్పును కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, జస్టిస్ నరసింహారెడ్డిని మార్చి విచారణను యథావిధిగా కొనసాగించవచ్చని ఈ నెల 16న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మదన్ బి.లోకూర్‌ను నియమించడంతో విద్యుత్ నిర్ణయాలపై విచారణ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది. -
‘తల్లీ నిర్మల’.. ఖర్గే మాటలతో రాజ్యసభలో నవ్వులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం(జులై 24) బడ్జెట్‌పై చర్చ సందర్భంగా నవ్వులు పూశాయి. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ను ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ‘మాతాజీ’ అని సంబోధించారు.వెంటనే చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ జోక్యం చేసుకుని ఆమె మీకు కూతురులాంటిది అని ఖర్గేను ఉద్దేశించి అన్నారు. దీంతో సభ్యులంతా ఒక్కసారిగా విరగబడినవ్వారు. కేంద్ర బడ్జెట్లో ఈసారి కేవలం బిహార్, ఏపీల ప్లేట్లలోనే జిలేబి, పకోడి వడ్డించారని, మిగతా రాష్ట్రాల ప్లేట్లన్నీ ఖాళీగానే ఉన్నాయని ఖర్గే అన్నారు. ఇంతలో ఆర్థిక మంత్రి నిర్మల మాట్లాడతారని చైర్మన్ ఖర్గేతో అన్నారు. మాతాజీ నిర్మల మాట్లాడడంలో మంచి నేర్పరి..నేను మాట్లాడడం అయిన తర్వాత ఆమెను మాట్లాడమనండి అని ఖర్గే చైర్మన్‌ను కోరారు. దీనికి స్పందించిన చైర్మన్ ఆమె మీకు కూతురులాంటిది అనడంతో సభలో నవ్వులు పూశాయి. -
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
విద్యుత్ కమిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
టీటీడీ.. మాకే కావాలి! పట్టుబడుతున్న టీడీపీ, జనసేన
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవి కోసం కూటమి పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు ఆ పదవి కోసం గట్టిగా పట్టుపడుతున్నారు. టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, వేమిరెడ్డి ప్రశాంతి, రఘురామకృష్ణరాజు రేసులో నిలవగా.. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ పారీ్టకి చెందిన సీనియర్ నేత ఎవరికైనా ఆ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అశోక్ గజపతిరాజు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుమార్తె అదితికి అవకాశం కలి్పంచి.. తాను పోటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆయనకే ఈ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన పూర్తికాలం ఆ పదవి కోసం సమయం కేటాయించకపోవచ్చని, అలాగే అందరికీ అందుబాటులో ఉండడం కష్టమనే అభిప్రాయం టీడీపీ నేతల్లో నెలకొంది.ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం.. స్పీకర్ పదవి ఆశించినా అదీ రాకపోవడంతో ఆయన తనకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా రేసులో ఉన్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డామని.. తమకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. నాగబాబు కోసం ఒత్తిడి! టీడీపీలోనే టీటీడీ చైర్మన్ పదవి కోసం ఎంతో మంది ఆశలు పెట్టుకోగా.. దాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు జనసేన పార్టీ పావులు కదుపుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకు ఆ పదవి ఇవ్వాల్సిందేనని జనసేన పార్టీ చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఖాయమైనట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అనంతరం ఆ ప్రచారాన్ని ఖండించిన నాగబాబు.. అధికారిక ప్రకటన వస్తేనే ఇలాంటి వాటిని నమ్మాలన్నారు. దీంతో నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవిపై ఆశ ఉన్నట్లు బయటపడింది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైన నాగబాబు.. సర్దుబాటులో భాగంగా ఆ సీటును వదులుకున్నారు. దీంతో అన్నకు ఏదైనా మంచి పదవి ఇప్పించాలనే ఉద్దేశంలో పవన్‌కళ్యాణ్ ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే టీటీడీ చైర్మన్ పదవిని అడుగుతున్నట్లు సమాచారం. నెల రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉన్నా కూడా ఆ పదవికి ఉన్న ప్రాధాన్యత.. పోటీ నేపథ్యంలో చంద్రబాబు ఏమీ తేల్చట్లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీటీడీ బోర్డులో కూడా తమ పారీ్టకి చెందిన వారిని సగం మందిని నియమించాలని జనసేన కోరుతున్నట్లు తెలిసింది. బీజేపీ కూడా మూడుకు తగ్గకుండా తమ వారిని బోర్డులో సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేస్తోందని సమాచారం. -
ఎస్బీఐ ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి!.. కేంద్రానికి తెలుగువ్యక్తి పేరు సిఫారసు
ఎస్బీఐ కొత్త ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని.. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) సిఫారసు చేసింది. ఈ పదవి కోసం ప్యానల్ ముగ్గురుని ఇంటర్వ్యూ చేసి చల్లాను ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదించింది. పనితీరును దృష్టిలో ఉంచుకుని ఈయన పెరుగు ప్రతిపాదించినట్లు ఎఫ్ఎస్ఐబీ పేర్కొంది.ఎస్బీఐ కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ప్రతిపాదించినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత ఛైర్మన్‌గా ఎవరనేది అధికారికంగా వెలువడుతుంది.Recommendation for the position of Chairman in State Bank of India. Official Announcement onhttps://t.co/AEcyakCCQ9 pic.twitter.com/29NdHpGjAL— Financial Services Institutions Bureau (@FSI_Bureau) June 29, 2024ప్రస్తుతం ఎస్బీఐ ఛైర్మన్‌గా దినేశ్ కుమార్ ఖారా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన 2020 అక్టోబర్ 7న ఎస్బీఐ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అయితే ఈయన పదవీకాలం గత ఏడాది అక్టోబర్‌లోనే ముగిసింది. కానీ కేంద్రం మళ్ళీ మళ్ళీ పొడిగించింది. కాగా ఈయన ఆగష్టు 28వరకు ఎస్బీఐ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆ తరువాత ఈ స్థానంలోకి కొత్త ఛైర్మన్ వస్తారు.ఇక చల్లా శ్రీనివాసులు శెట్టి విషయానికి వస్తే.. ఈయన ప్రస్తుత గద్వాల జిల్లా పెద్దపోతుల పాడులో జన్మించారు. అక్కడే ప్రాధమిక విద్యను పూర్తి చేసి.. ఆ తరువాత హైస్కూల్, ఇంటర్మీడియట్ గద్వాల్లో పూర్తి చేశారు. ఆ తరువాత అగ్రికల్చర్ పూర్తి చేశారు. ఈయన 1988లో ఎస్బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా తన వృత్తి ప్రారంభించారు. బ్యాంకింగ్ రంగంలో ఈయనకు సుమారు 36 సంవత్సరాలు అనుభవం ఉంది. -
రంగారెడ్డి: డీఈవో లేట్.. జడ్పీ ఛైర్మన్ క్లాస్
సాక్షి, రంగారెడ్డి: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. ఛైర్మన్ అనితా హరినాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ శశాంక, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విద్య, వైద్యంపై అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అయితే, డీఈవో సమావేశానికి ఆలస్యంగా రావడంపై జడ్పీ ఛైర్మన్ క్లాస్ తీసుకోగా, సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులందరికి డీఈవో బహిరంగ క్షమాపణ చెప్పారు. స్కూల్ యూనిఫామ్స్ విషయంలో చర్చ వల్ల ఆలస్యమైందని డీఈవో వివరణ ఇచ్చారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఆపరేషన్ థియేటర్లు, భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో వైద్యుల కొరత ఉందంటూ మండిపడ్డారు. విద్య, వైద్యంలో అధికారుల డిప్యూటేషన్ల రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.డిప్యుటేషన్ల రద్దు కుదరదంటూ కలెక్టర్ వివరించారు. మీ సమస్యను సంబందిత శాఖకు సమగ్రంగా వివరించాలని సూచించారు. డిప్యుటేషన్ల విషయంలో అనేక ఒత్తిళ్లు ఉంటాయని కలెక్టర్ అన్నారు. కందుకూరు మెడికల్ కళాశాల రద్దు కాలేదని.. మెడికల్ కళాశాలకు వేరే ప్రాంతంలో స్థలం కోసం చూస్తున్నామని డీఎంహెచ్‌వో తెలిపారు.