![Posani Krishna Murali Take Charge As AP Film Development Corporation Chairman - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/3/posani-oath1.jpg.webp?itok=cZpD2jkw)
సాక్షి, అమరావతి: ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లక్ష్మీపార్వతి, చల్లా మధుసూధన్‌రెడ్డి, పైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి, కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో ఈ బాధ్యతలు చేపట్టానని తెలిపారు. ‘‘11 ఏళ్లుగా నాకు సీఎం జగన్ తెలుసు. జనంలో నుంచి పుట్టిన నాయకుడు వైఎస్ జగన్. ఈ పదవితో సినీ పరిశ్రమకు ఎంత మేలు చేస్తానో తెలీదు కానీ.. కీడు మాత్రం చేయను. కచ్చితంగా సినీ ఇండస్ట్రీకి సేవ చేస్తా’’ అని పోసాని కృష్ణమురళి అన్నారు.
ఇప్పుడు ఆ బాధ్యత పోసానికి వచ్చింది: పేర్ని నాని
ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, సీఎం జగన్‌కు పోసాని కృష్ణమురళి ఆత్మీయులు. జగన్ కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి పోసాని అని అన్నారు. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలని సీఎం ఆకాంక్షించారు. వంద ఎకరాల్లో స్టూడియోలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎఫ్‌డీసీ ద్వారా నిర్వహించాలని సంకల్పం ఉంది. ఇప్పుడు ఆ బాధ్యత పోసానికి వచ్చిందని పేర్ని నాని పేర్కొన్నారు.
శుభ పరిణామం: నిర్మాత సి.కల్యాణ్
పోసాని ఎఫ్‌డీసీ ఛైర్మన్ కావడం శుభపరిణామం అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. సీఎం జగన్ ఆలోచనలు కృష్ణమురళి కచ్చితంగా అమలు చేస్తారు. సినీ ఇండస్ట్రీని విశాఖకు తీసుకెళ్లాలని సి.కల్యాణ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment