take charge
-
ఏపీ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనిత
-
ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతల స్వీకరణ
-
బాధ్యతలు స్వీకరించిన పలువురు కేంద్ర మంత్రులు
ఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని మోదీ సహా పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణం చేసిన మంత్రులకు నిన్న (సోమవారం) మంత్రిత్వ శాఖలు కేటాయించబడ్డాయి.Priority areas for Jaishankar in Modi 3.0 government: Border stability with China, cross-border terror solution with PakistanRead @ANI Story | https://t.co/bSVWKuPFfA#Jaishankar #MEA #India #China #Pakistan pic.twitter.com/kmHQatgmbf— ANI Digital (@ani_digital) June 11, 2024 దీంతో మంగళవారం పలువురు కేంద్ర మంత్రులు తమ మంత్రిత్వ శాఖ బాధ్యతులు స్వీకరించారు. విదేశాంగ శాఖ మంత్రిగా ఎస్. జయశంకర్ బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ బాధ్యతలు స్వీకరించించారు.#WATCH | Delhi: Suresh Gopi takes charge as Minister of State (MoS) in the Ministry of Tourism. pic.twitter.com/qaolUiCV3Y— ANI (@ANI) June 11, 2024 అదేవిధంగా పెట్రోలియం శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరి, పెట్రోల్ శాఖ సహాయ మంత్రిగా సురేష్ గోపి, అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి భూపేంద్ర యాదవ్ మంత్రులు బాధ్యతలు స్వీకరించారు.#WATCH | Delhi: Manohar Lal Khattar takes charge as the Minister of Power. pic.twitter.com/HmaLfC9BUv— ANI (@ANI) June 11, 2024సమాచార, ప్రసార మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు. #WATCH | Delhi: Ashwini Vaishnaw takes charge as Information and Broadcasting (I&B) Minister pic.twitter.com/gf4QMPvuo6— ANI (@ANI) June 11, 2024 కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు. అమిత్ షాకు స్వాగతం పలికిన సహాయ మంత్రులు బండి సంజయ్, నిత్యానంద రాయి. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శివరాజ్ సింగ్ చౌహన్, కిరణ్ రిజీజు, జ్యోతిరాధిత్యసిందియా, జేపీ నడ్డా. -
బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్లు
-
Bhumana Karunakar Reddy Photos: టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి (ఫొటోలు)
-
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకారం నేడు
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 7 గంటలకు చార్మినార్ శ్రీభాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేశాక.. అంబర్‌పేటలో మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం బషీర్‌బాగ్‌లోని శ్రీకనకదుర్గ దేవాలయంలో పూజలు చేస్తారు. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ఉదయం 11.45 గంటలకు పార్టీ కార్యాలయంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్ హాజరవుతారు. -
ఏపీఎఫ్డీసీ ఛైర్మన్‌గా పోసాని బాధ్యతలు.. ఆయన ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లక్ష్మీపార్వతి, చల్లా మధుసూధన్‌రెడ్డి, పైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి, కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో ఈ బాధ్యతలు చేపట్టానని తెలిపారు. ‘‘11 ఏళ్లుగా నాకు సీఎం జగన్ తెలుసు. జనంలో నుంచి పుట్టిన నాయకుడు వైఎస్ జగన్. ఈ పదవితో సినీ పరిశ్రమకు ఎంత మేలు చేస్తానో తెలీదు కానీ.. కీడు మాత్రం చేయను. కచ్చితంగా సినీ ఇండస్ట్రీకి సేవ చేస్తా’’ అని పోసాని కృష్ణమురళి అన్నారు. ఇప్పుడు ఆ బాధ్యత పోసానికి వచ్చింది: పేర్ని నాని ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, సీఎం జగన్‌కు పోసాని కృష్ణమురళి ఆత్మీయులు. జగన్ కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి పోసాని అని అన్నారు. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలని సీఎం ఆకాంక్షించారు. వంద ఎకరాల్లో స్టూడియోలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎఫ్డీసీ ద్వారా నిర్వహించాలని సంకల్పం ఉంది. ఇప్పుడు ఆ బాధ్యత పోసానికి వచ్చిందని పేర్ని నాని పేర్కొన్నారు. శుభ పరిణామం: నిర్మాత సి.కల్యాణ్ పోసాని ఎఫ్డీసీ ఛైర్మన్ కావడం శుభపరిణామం అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. సీఎం జగన్ ఆలోచనలు కృష్ణమురళి కచ్చితంగా అమలు చేస్తారు. సినీ ఇండస్ట్రీని విశాఖకు తీసుకెళ్లాలని సి.కల్యాణ్ అన్నారు. చదవండి: 'అలా అయితే.. కె విశ్వనాథ్ సగం హైదరాబాద్ కొనేసేవారు' -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. ఈడీ జేడీగా రోహిత్ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: ఈడీ జాయింట్ డైరెక్టర్‌గా రోహిత్ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. దినేష్ పరుచూరి స్థానంలో నూతన జేడీగా రోహిత్ ఆనంద్ నియమితులయ్యారు. దినేష్ కొచ్చికి బదిలీ అయ్యారు. సంచలనాత్మక ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి హైదరాబాద్ ఈడీ విచారణ జరుపుతున్న క్రమంలో కొత్త అధికారి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: సిట్‌ను కాదని సీబీఐకి ఎందుకు? -
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు.. ఆయన ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, తనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారని, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘‘2024లో ప్రజలు మళ్లీ సీఎం జగన్‌కు పట్టం కట్టడం ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ మనసున్న నాయకుడు...ప్రజలకు ఏం కావాలో అన్నీ చేస్తున్నారు. రోడ్ల విస్తరణ అనేది అన్ని చోట్లా జరిగేదే.. అందరం అభివృద్ధిని కాంక్షించాలి. ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు హర్షించాలి’’ అని అలీ అన్నారు. చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా? -
గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రాజన్న దొర బాధ్యతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకి అనుగుణంగా గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. గురువారం ఆయన సచివాలయంలోని రెండవ బ్లాక్ లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, లాభసాటి వ్యవసాయం వైపు గిరిజనులని ప్రోత్సహిస్తామని.. విద్య, వైద్యం గిరిజనులకి అందేలా అన్ని ఐటీడీఎ పరిధిలో ఏరియా ఆసుపత్రులని నిర్మాణం చేస్తున్నామని.. ప్రతీ మండలానికి రెండు కళాశాలలు నిర్మిస్తామని రాజన్నదొర అన్నారు. చదవండి: మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు రాజకీయ నేపథ్యం: 1985లో 21 ఏళ్ల వయస్సులో జీసీసీలో జూనియర్ మేనేజర్‌గా చేరి ఉమ్మడి ఆంధ్రలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన ఆయన 2004లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. 2004లో కాంగ్రెస్ తరఫున సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయినా.. తనపై గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ గిరిజనుడు కాదని కోర్టులో నిరూపించి 2006లో ఎమ్మెల్యేగా అవకాశం పొందారు. 2009లో కాంగ్రెస్ తరఫున, 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. -
మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు
సాక్షి, అమరావతి: జల వనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని నాలుగవ బ్లాక్‌లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రిగా అవకాశం ఇవ్వడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన జలయజ్ణాన్ని పూర్తి చేస్తానని తెలిపారు. ఏపీలో అన్ని ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి రైతులకి నీరందించడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటానన్నారు. చదవండి: వ్యవసాయ మంత్రిగా కాకాణి బాధ్యతలు.. తొలి రెండు సంతకాలు వాటిపైనే.. ‘‘పోలవరం చాలా కీలక ప్రాజెక్ట్.. ఏపీకి వరం. పోలవరంతో రైతులందరికీ మేలు జరుగుతుంది. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తా. పోలవరంపై అడ్డంకులను అధిగమిస్తాం. పోలవరంపై రీడిజైనింగ్ చేయడానికి పరిస్థితులు ఎందుకు వచ్చాయి. డయా ఫ్రమ్ దెబ్బతిన్న సందర్బాలు ఏ ప్రాజెక్ట్‌లోనూ లేవు. గత ప్రభుత్వ తప్పిదాలే కారణం. డయా ఫ్రమ్‌తో ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయడానికి 2100 కోట్ల అంచనా అవుతుందని నిపుణులు అంటున్నారు. పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది. చంద్రబాబు తప్పిదాలే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం. స్పిల్ వే పూర్తి కాకుండా డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం హడావుడిగా పూర్తి చేసి బిల్లులు డ్రా చేసేశారు. చంద్రబాబు ధన దాహం వల్ల.. పోలవరాన్ని డబ్బు కోసం ఉపయోగించడం వల్లే ఈ దుస్ధితి. గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దేవినేని ఉమా కూడా దీనికి కారణం. చంద్రబాబు, ఉమలు ఈ జాతికి సమాధానం చెప్పాలని’’ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు రాజకీయ నేపథ్యం: కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్‌గా పనిచేశారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1989లో రేపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున సత్తెనపల్లి నుంచి పోటీచేసి ఓటమిపాలైన ఆయన 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
వ్యవసాయ మంత్రిగా కాకాణి బాధ్యతలు.. తొలి రెండు సంతకాలు వాటిపైనే..
సాక్షి, విజయవాడ: వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం.. రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇర్రిగేషన్ అవకాశం కల్పించే ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. 3,500 ట్రాక్టర్లని వైఎస్సార్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైల్‌పై రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'వ్యవసాయ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.43 వేల కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించాం. సీఎం జగన్ రైతు పక్షపాతి. రూ.20 వేల కోట్లకు పైగా రైతు భరోసా కింద ఇప్పటివరకూ నగదు బదిలీ చేశాం. గన్నవరలో స్టేట్ సీడ్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆర్బీకేల ద్వారా రైతుల అవసరాలు తీర్చేలా పీఏసీ ఖాతాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించాం. రైతుల నగదు లావాదేవీలు కూడా ఆర్బీకేలలో జరిగేలా చర్యలు చేపట్టాం. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని' ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. చదవండి: (మంత్రిగా గుడివాడ అమర్నాథ్ బాధ్యతలు.. తొలి సంతకం దానిపైనే..) -
మంత్రిగా గుడివాడ అమర్నాథ్ బాధ్యతలు.. తొలి సంతకం దానిపైనే..
సాక్షి, విజయవాడ: పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను గెలిపించి ఈ స్ధానంలో కూర్చోబెట్టే అవకాశం ఇచ్చిన అనకాపల్లి ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. గురుతరమైన బాద్యత నాపై సీఎం ఉంచారు. రాష్ట్రానికి మంచి చేస్తా.. బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తాను. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ విషయంలో ఏపీకి మంచి జరిగే విధంగా కృషి చేస్తా. ఏపీలో పారిశ్రామిక అభివృద్ది చేస్తా. ఐటీకి చిరునామాగా ఉన్న విశాఖ నుంచి వచ్చిన వ్యక్తిగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది చేస్తా. విశాఖకి ఐటీ ఆద్యుడైన దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తా. చెన్నై, బెంగుళూరు, ముంబయి లాంటి నగరాలతో పోటీ పడగల అవకాశం ఉన్న నగరం విశాఖపట్నం. పారిశ్రామిక అభివృధ్దికి, పెట్టుబడులకి అనుకూలమైన రాష్ట్రం ఏపీ. 900 కి.మీలకు పైన తీరప్రాంతం, జాతీయ రహదారులు, నాలుగు పోర్టులు ఉన్న రాష్ట్రం మనది. దేశంలోనే గొప్ప పరిపాలనాదక్షుడైన సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పనిచేయడం అదృష్టం. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సేవలను కూడా ఈ సందర్బంగా గుర్తించుకోవాలి.. ఆయన ఆశయాలని కొనసాగిస్తాను అని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టుకి అవసరమైన భూసేకరణలో భాగంగా రైతులకి ఇచ్చే రూ.8కోట్ల పరిహారంపై తొలి సంతకం చేశారు. చదవండి: (YSRCP: 2024 ఎన్నికలే లక్ష్యంగా కొత్త టీమ్ రెడీ) -
దేవాదాయశాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ బాధ్యతలు
సాక్షి, విజయవాడ: దేవాదాయశాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా బాద్యతలు స్వీకరించా. నాకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. నాపై పెట్టిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తా. దేవాదాయశాఖ అంటే సంక్లిష్టమైనది. ప్రస్తుతం దేవాలయాల్లో కొనసాగిస్తున్న సేవల కన్నా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాను. అధికారులతో సమీక్షించి వారి సలహాలతో ముందుకెళ్తా. ప్రసాద్ స్కీమ్‌లో అన్ని ప్రముఖ దేవాలయాలని అభివృద్ధి చేస్తాం. చారిత్రాత్మకమైన ఆలయాలు ఏపీలో చాలా ఉన్నాయి. ఏపీలో టెంపుల్ టూరిజం సరిగా లేదు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రత్యేకయాప్ తయారు చేసి టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం. వీఐపీల కోసమే ఆలయాలు లేవు. భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తాం. ప్రొటోకాల్ ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని ఆలయాలకి సిబ్బంది కొరత అధిగమించడానికి అదనపు సిబ్బందిని తీసుకోవడానికి సీఎం దృష్టికి తీసుకెళ్తాం. చదవండి: (విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన) ఆలయాలలో అవినీతి అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఆలయాల ఆస్తులు, రికార్డులు డిజిటలైజేషన్ చేయాలి. భగవంతుడు ఆస్థులని రక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఒకే ఆలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని బదిలీలు చేయాల్సిన అవసరం ఉంది' అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. -
మంత్రిగా మేరుగ నాగార్జున బాధ్యతలు
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళితుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయనని.. అంబేద్కర్ ఆలోచన, జగ్జీవన్‌రావు కాన్సెఫ్ట్‌తో ఆయన పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులు ఎవ్వరికీ అన్యాయం జరగకూడదని సీఎం ఆలోచన అని మంత్రి అన్నారు. చదవండి: డిప్యూటీ సీఎంగా నారాయణ స్వామి బాధ్యతలు రాజకీయ నేపథ్యం: ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో ఉమ్మడి 2007–09లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడుగా పనిచేశారు. 2009, 2014 ఎన్నికల్లో వేమూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2019లో ఇదే నియోజకవర్గం నుంచి నక్కా ఆనందబాబుపై గెలుపొందారు. -
గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: గృహనిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '31 లక్షల మందికి ఇళ్లు కట్టే శాఖకి సీఎం జగన్ నన్ను మంత్రిగా చేశారు. పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేస్తున్నారు. విశాఖపట్నంలో అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం ఫైల్‌పై తొలి సంతకం చేశాం. లక్ష మంది విశాఖ పేదలకు ఇళ్లు కట్టిస్తాం. గతంలో ఇంటి నిర్మాణానికి 90 సిమెంట్ బ్యాగ్‌లు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు 140 సిమెంట్ బస్తాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. పాదయాత్రలో ప్రతి గ్రామంలో జగనన్నకి పేదలు కష్టాలు చెప్పారు. ఆ కష్టాలను చూసి ఈ రోజు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. పేదలకు సేచురషన్ పద్దతిలో ఇళ్లు కట్టిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం జగన్ అధిక గుర్తింపు ఇచ్చారు. సామాజిక న్యాయం చేస్తున్న ఏకైక సీఎం జగనన్న' అని మంత్రి జోగి రమేష్ అన్నారు. చదవండి: (లేడీ సింగం: అవినీతి పోలీస్ అధికారుల వెన్నులో వణుకు) -
ఏపీ స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉషాశ్రీచరణ్ బాధ్యతలు
-
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషశ్రీ చరణ్
సాక్షి, తాడేపల్లి: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉషశ్రీ చరణ్ బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ మహిళనైన నాకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా నాకు అవకాశం ఇచ్చారు. బీసీలను అందరూ ఓట్ బ్యాంక్‌లా చూశారు. కానీ సీఎం జగన్ బీసీ, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మహిళా పక్షపాత ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం అదృష్టం. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. మహిళలకు ఇప్పటి వరకూ ఎవరూ ఇవ్వని 50శాతం రిజర్వేషన్ ఇచ్చారు. మహిళలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు, ఆసరా, చేయూత ఇచ్చారు. మహిళా సాధికారత అన్ని రంగాల్లోనూ సాధించేలా సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు' అని మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. చదవండి: (హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా: తానేటి వనిత) -
సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఆర్కే రోజా
సాక్షి, అమరావతి: పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధిశాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బుధవారం తాడేపల్లె క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కుటుంబసమేతంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ఆశీస్సులు అందుకున్నారు. మంత్రి మాట్లాడుతూ తనకు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. జగనన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రజాసేవ చేస్తానని స్పష్టం చేశారు. అన్న ఆశీస్సులే అండగా టూరిజం డెవలప్మెంట్కు చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్ ఉన్నారు. చదవండి: (టీడీపీ, తోక పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: మంత్రి ఆర్కే రోజా) -
టీడీపీ, తోక పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: మంత్రి ఆర్కే రోజా
సాక్షి, అమరావతి: ఏపీని గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని మంత్రి ఆర్కే రోజా అన్నారు. సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పర్యాటకశాఖ మంత్రిగా రోజా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పర్యాటకశాఖ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఏపీలో టూరిజానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన సంస్కరణలతోనే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ‘టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం పై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. రాష్ట్రంలో అనేక పర్యాటక వనరులున్నాయి.వాటిని గుర్తించి అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుతాం. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటాం. సీఎం జగన్ పాలనను పక్క రాష్ట్రాలలో సైతం ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడతాం. టీడీపీ, తోక పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.’ అని తెలిపారు. రాజకీయ నేపథ్యం: 1999లో టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004లో నగరి నియోజకవర్గం, 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచారు. 2019 నుంచి 2021 వరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా బా«ధ్యతలు నిర్వర్తించారు. -
AP: కార్మిక మంత్రిగా గుమ్మనూరు జయరాం బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఏపీ కార్మిక మంత్రిగా గుమ్మనూరు జయరాం బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. బీసీలంతా ఎప్పటికీ సీఎం జగన్‌కి అండగా ఉంటారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు సీఎం అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నారని, ఇందుకోసం ప్రత్యేక బిల్లు తెచ్చారని గుర్తు చేశారు. కార్మికులకు ఈఎస్ఐ ద్వారా వైద్యం అందించడంతో పాటు ఈ-ఔషధ ద్వారా పాదర్శక విధానం తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య యజ్ఞం రాజకీయ నేపథ్యం: 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆలూరులో పాటీచేసి ఓటమి పాలయ్యారు. 2012లో వైఎస్సార్సీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో ఆలూరు నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. -
రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ బాధ్యతలు
సాక్షి అమరావతి: రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ సచివాలయంలో మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు, ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: తండ్రి, తనయుడి కేబినెట్లలో ఆ నలుగురు.. ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా.. బాధ్యతలు స్వీకరణ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రవాణా శాఖ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 998 కొత్త బస్సులను ఆర్టీసీలోకి తీసుకొచ్చామన్నారు. కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. ప్రజలకు మరింత రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తిరుమలలో కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ కష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారని.. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ అన్నారు. మంత్రి విశ్వరూప్ రాజకీయ నేపథ్యం.. 1987లో కాంగ్రెస్ నాయకుడిగా పినిపే విశ్వరూప్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998 ఉప ఎన్నికల్లో, 1999 సాధారణ ఎన్నికల్లో ముమ్మిడివరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2004లో అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. 2019లో వైఎస్సార్పీసీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలి కేబినెట్లో ఉన్న విశ్వరూప్‌ను రెండోసారి కేబినెట్లోకి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్నారు. -
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్లో శుక్రవారం సజ్జనార్ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. సజ్జనార్ అంతకుముందు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్ సీపీగా పని చేసి నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009లో దేశంలోనే సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసులో సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జనార్ గతంలో సీఐడీ, ఇంటిలిజెన్స్ విభాగాల్లో పని చేశారు. చదవండి: లవ్ మ్యారేజ్ జంట మూడు నెలలకే తట్టుకోలేక.. చదవండి: కలెక్టరేట్లో గన్‌మెన్‌గా భర్త.. రోడ్డుపై విగతజీవిగా భార్య -
రేపు సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన 9 మంది న్యాయమూర్తులు రేపు( మంగళవారం) ఉదయం 10.30కు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తీ జస్టిస్ ఎన్వీ రమణ.. కొత్త న్యాయమూర్తులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇటీవల సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులను నియమిస్తూ.. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం గెజిట్ విడుదల చేసింది. చదవండి: సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే! కొత్త జడ్జిలుగా జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రవికుమార్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఏఎస్ ఒకా, జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు. కొత్తగా 9 మంది నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, బార్ నుంచి ఒకరు ఉన్నారు. సుప్రీం కోర్టుకు కొత్త జడ్జిగా నియమితులైన జస్టిస్ హిమా కోహ్లీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన విషయం తెలిసిందే. చదవండి: టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే తన్మయ్ ఘెష్ -
Cyberabad CP: బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. సైబరాబాద్ ఐటీ కారిడార్ భద్రత, సైబర్ క్రైమ్స్, రోడ్ సేఫ్టీలపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. అదే విధంగా, సిటిజెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తామని తెలిపారు. సైబరాబాద్ లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని కంటిన్యూ చేస్తూ.. తెలంగాణా పోలీస్ కి మంచి పేరు తీసుకోస్తామని తెలిపారు. చదవండి: సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ, ఆర్టీసీ ఎండీగా నియామకం -
బాధ్యతలు స్వీకరించిన కొత్త కేంద్ర మంత్రులు
-
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి
-
ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్‌గా కుంభా రవిబాబు బాధ్యతలు స్వీకరించారు
-
ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్‌గా కుంభా రవిబాబు బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్‌గా కుంభా రవిబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 32 లక్షల మంది గిరిజనుల కల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని తెలిపారు. ఎస్టీ కమిషన్ ఏర్పాటుతో ఆదివాసీల పక్షపాతిగా నిలిచారన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసీల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. గతంలో అటకెక్కిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కుంభా రవిబాబు వెల్లడించారు. చదవండి: ఉగాదికి విద్యాశాఖ పోస్టుల భర్తీకి క్యాలెండర్ పూలింగ్.. ప్రపంచంలోనే పెద్ద స్కామ్ -
ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఛీప్ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ‘ఆ వాహనాలు.. ముంబై తర్వాత ఏపీలోనే..’) అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన లక్ష్యం మేరకు పోలవరం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అన్ని ఇబ్బందులను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని, ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులంతా పనిచేస్తామని సీఎస్ ఆదిత్యనాథ దాస్ తెలిపారు.(చదవండి: ఏపీ హైకోర్టు సీజే నియామకం; నోటిఫికేషన్ జారీ) సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఆదిత్యానాథ్ దాస్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీ చీఫ్ సెక్రటరీ అదిత్యానాథ్ దాస్, పదవీ విరమణ చేసిన మాజీ సీఎస్ నీలం సాహ్ని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులయిన సంగతి తెలిసిందే. -
బాధ్యతలు చేపట్టిన మంత్రి శంకర్ నారాయణ
సాక్షి, అమరావతి: మంత్రి శంకర్ నారాయణ బుధవారం రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సదర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని ఎదుర్లంక- జి.ముళ్లపాలెం రహదారి కొత్త వంతెన పనులకు సంబంధించిన ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ్ మాట్లాడుతూ.. ఆర్ అండ్ బి శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తనకు ఆర్ అండ్ బి శాఖ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల అమలులో తనను ముఖ్య భాగస్వామిని చేశారని పేర్కొన్నారు. మొదటి సారిగా గెలిచిన తనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఈ రోజు కీలక శాఖలు ఎస్సీ, ఎస్టీ బలహీన, మైనారిటీ వర్గాలకు కేటాయించారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు వేల కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు గాను రూ. 6400 కోట్లతో ఎన్డీబితో చేసుకున్న ఒప్పందంపై మొదటి సంతకము చేశానని పేర్కొన్నారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అదే విధంగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లాలోని డోన్‌లో బాలికల రెసిడెన్సియల్ స్కూల్, బేతంచెర్లలో బాలుర రెసిడెన్సియల్ స్కూల్‌ను జానియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసే ఫైళ్లపై మంత్రి వేణుగోపాలకృష్ణ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. తను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన వరాలన పంచుతానని తెలిపారు. తమకు గుర్తింపు లేదని ఆత్మ నూన్యతతో ఉన్న బలహీనవర్గాలకు సీఎం వైఎస్ జగన్ పాలనలో గుర్తింపు ఉంటుందన్నారు. బలహీన వర్గాల సంఘల నాయకుల సమస్యను సరైన రీతిలో పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రి శంకర్ నారాయణ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్ నారాయణకు కేటాయించారు. (గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా జకియా ఖానమ్, రవీంద్రబాబు) -
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్
-
ఇకపై ఆ సర్టిఫికెట్ అవసరం లేదు: ధర్మాన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకపై నాలుగేళ్ల పాటు చెల్లుబాటు అయ్యేవిధంగా దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకం నిలబెట్టేలా పనిచేస్తానని తెలిపారు. బియ్యం కార్డు ఉన్న వారికి ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని ఆయన ప్రకటించారు. అర్హులైన వారికి ఆగస్టు 15న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి దాదాపు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. (కలలో కూడా ఊహించలేదు) భూ సమస్యలు, తగాదాల సత్వర పరిష్కారానికి ఫ్రెండ్లీ రెవెన్యూ వ్యవస్థకు శ్రీకారం చుడతామని తెలిపారు. రాష్ట్రంలో మూడో అతిపెద్ద ఉద్యోగుల శాఖ అయిన రెవెన్యూలో అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పనులు జరిగేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ‘‘బీసీలకు అగ్రతాంబూలం వేసిన దార్శనికుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం ఉత్తరాంధ్ర బీసీలకు, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. రెవెన్యూ కార్యాలయాల ద్వారా అందే సేవలు గ్రామ, వార్డు సచివాలయల ద్వారా ప్రజలకు సత్వరమే అందేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రం మొత్తం భూమిని రీ సర్వే నిర్వహించి రికార్డులను నవీకరించనునట్లు’’ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. (కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు) -
సేవలకు సిద్ధం
సంక్షేమం ఇక పారదర్శకం కానుంది. ప్రతి ఇంటికీ పథకాలు చేరువ కానున్నాయి. ఇందుకోసం దేశంలోనే వినూత్న రీతిలో వలంటీర్ల వ్యవస్థను రాష్ట్రప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన 10,853మందికి శిక్షణ నిచ్చి రంగంలోకి దింపుతున్నారు. ఈ నెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీరు విధుల్లో చేరనున్నారు. అప్పటినుంచి తమకు కేటాయించిన 50 కుటుంబాలకు పథకాలు చేరువ చేయడం... పింఛన్, రేషన్ వంటివి ఇంటికే చేరవేయడం... వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొత్తగా లబ్ధిదారుల ఎంపికలోనూ వీరు కీలకంగా వ్యవహరించనున్నారు. లక్కవపుకోట(శృంగవరపుకోట): ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పారదర్శకంగా సక్రమంగా లబ్ధిదారులకు చేరువ చేసేందుకు... నిరుద్యోగ నిర్మూలనకు... రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను రూపొందించారు. దీనికోసం జిల్లాలోని 34 మండలాల్లో 10,853 మంది గ్రామ వలంటీర్లను ఎంపిక చేసి వారికి పూర్తి శిక్షణనిచ్చారు. నవరత్నాలు, పంచాయతీ వ్యవస్థ పనితీరు, ప్రజలతో ఎలా మెలగాలి తదితర అంశాలపై మూడు రోజుల పాటు శిక్షణనిచ్చారు. ప్రభుత్వ పాలన, వ్యవస్థల పనితీరు తెలుసుకోవడానికి 128 పేజీలతో కూడిన కరదీపికను ముద్రించి ప్రతీ వలంటీర్‌కు అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వలంటీర్లు ఈ నెల 15వ తేదీ నుంచి అధికారికంగా విధుల్లో చేరనున్నారు. వలంటీర్ల విధులు, బాధ్యతలు.. -కేటాయించిన 50 కుంటుంబాల పూర్తి సమాచారం సేకరించడం. -బేస్‌లైన్ సర్వే ఆధారంగా వ్యక్తిగత, సామాజిక అవసరాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడం. -కేటాయించిన 50 కుటుంబాలు పొందుతున్న పథకాలు, ప్రయోజనాలపై సమాచారం నమోదు చేయడం -సచివాలయాల్లో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు నిర్వహించే సమావేశాలకు హాజరు కావడం. -తమకు కేటాయించిన కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడడం. -మద్యపానం, బాల్యవివాహాల నివారణలో సహాయసహకారాలు అందించడం. -కేంద్ర, రాష్ట్ర పభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం. -కుల, మత, వర్గ, లింగ, రాజకీయాలకు అతీతంగా అర్హత కల్గిన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను చేరవేయడం. -గ్రామాల్లో కొత్తగా ప్రవేశించిన వ్యక్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచాయితీ దృష్టికి తీసుకెళ్లడం వలంటీర్ల సేవలపై నిఘా.. వలంటీర్లకు నెలకు రూ. 5వేలు గౌరవ వేతనం గ్రామపంచాయతీల ద్వారా అందజేస్తారు. నిధులు పంచాయతీలకు ప్రభుత్వమే సమకూరుస్తుంది. గ్రామవలంటీర్ల పనితీరును ఏంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షిస్తారు. నివేదికలను ప్రతీ నెల కిందిస్థాయి అధికారులు ఎంపీడీఓకు అందిస్తారు. ఆ నివేదికలపై కలెక్టర్ సమీక్షిస్తారు. వలంటీర్ పనితీరు సక్రమంగా లేకపోతే తగిన మార్గనిర్దేశం చేసి మెరుగు పడేలా చేస్తారు. బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తే తొలగిస్తారు. అందించాల్సిన సేవలు: -నెలవారీ పింఛన్లు, రేషన్ సరకులు నేరుగా ఇంటికే తీసుకెళ్లి అందజేయడం, ఇమాన్, మ్యూజిన్లు, చర్ఛి పాస్టర్లకు నెలవారీ వేతనాలు అందించడం. -ఏడాదికోసారి విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్మెంట్, అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, చేతివృత్తుల వారికి ఆర్థి క సాయం, వేట నిషేధ సమయంలో మత్య్స కారులకు పరిహారం, చిరు, వీధి వ్యాపారులకు వడ్టీలేని ఆర్థిక సహాయం అందించడం. -అవసరమైనప్పుడు ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, అన్నిరకాల ధ్రువపత్రాలు, వివిధ కార్పొరేషన్ల నుంచి ఆర్థిక సహాయం. వైఎస్సార్ బీమా, గొర్రెలు, పశువులకు బీమా, వైఎస్ఆర్ పెళ్లికానుక మంజూరు ఉత్తర్వులివ్వడం, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇళ్ల స్థలాల పంపిణీ, విద్యుత్ కనక్షన్లు, భవన నిర్మాణ అనుమతులు, తాగునీటి కుళాయిల కనెక్షన్లు ఇప్పించడం వంటి సేవలందించాలి. -ప్రభుత్వం అందించే పథకాలు, అర్హతలు, ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు తన పరిధి లోని 50 కుంటుంబాలకు అవగాహన కల్పిం చడం, పారిశుద్ధ్య పనులు చేయించడం, ప ర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా చేయడం. బాధ్యతతో పనిచేయాలి.. వలంటీర్‌గా ఎంపికైనవారు ఇదేదో ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా భావించి పనిచేయాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రతీ 50 కుంటుంబాలకు చేరవేయాలి. ఒత్తిడికి తలొగ్గకూడదు, పారదర్శకంగా, నీతివంతంగా పనిచేయాలి. ఈ ఆవకాశాన్ని వలంటీర్లు దుర్విని యోగం చేస్తే తొలగించక తప్పదు. – కడుబండి శ్రీనివాసరావు, శృంగవరపుకోట ఎమ్మెల్యే గ్రామ వలంటీర్ల వ్యవస్థ ప్రయోజన కరమే.. గ్రామ వలంటీర్ వ్యవస్థ ప్రజలకు ప్రయోజన కరంగా వుంటుంది. ఇంత వరకు ప్రభుత్వ పరంగా ఏ పనిచేయాలన్నా పంచాయతీ కార్యదర్శులపైనే పెడుతున్నాం. వారికి పనిఒత్తడి వల్ల అశించిన మేరకు ఫలితాలు సాధించలేక పోతున్నాం. 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రజలకు, గ్రామ సచివాలయానికి మధ్య వారధిలా పనిచేసే ఏర్పాటు చేయడం మంచి ప్రయత్నమే. – బి.కల్యాణి, ఎంపీడీఓ, లక్కవరపుకోట ఉపాధి లభించింది.. చదువులు పూర్తిచేసుకుని తల్లిదండ్రులకు భారంగా ఉన్న మాలాంటి వారికి వలంటీర్ ఉద్యోగం ఊరటనిచ్చింది. నేను గ్రామ వలంటీర్ శిక్షణ పూర్తి చేసుకున్నాను. ప్రభుత్వం అప్పగించిన సేవలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను. – పిల్లల గోపి, తామరాపల్లి, లక్కవరపుకోట మండలం బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తా.. నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వలంటీర్ పోస్టుకు దరఖాస్తు చేయగా ఎంపికయ్యాను. ఇప్పటికే మాకు రెండు రోజులపాటు శిక్షణచ్చారు. నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తాను. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తాను. – ఎస్.కె.ఫిరోజ్, లక్కవరపుకోట -
మంత్రిగా భాధ్యతలు స్వీకరించిన కొడాలి నాని
-
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు
సాక్షి, హైదరాబాద్: రోడ్లు, రవాణాశాఖ మంత్రిగా వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ డీ–బ్లాక్‌లో తన చాంబర్లో సాయంత్రం 4 గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నుంచి అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి (టీఎంయూ), హన్మంత్ ముదిరాజ్, గోవర్ధన్ (టీజేఎంయూ), రాజిరెడ్డి, బాబు (ఈయూ) తదితరులు మంత్రిని సన్మానించారు. అధికార పార్టీ నాయకులు, అనుచరుల కోలాహలంతో ఆయన చాంబర్ సందడిగా మారింది. అనంతరం రోడ్లు–భవనాలు, ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ నూతన మంత్రిగా నిరంజన్‌రెడ్డి గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమైఖ్య రాష్ట్రంలో వ్యవసాయం కుదేలు అయిపోయిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. దూరదృష్టితో ప్రాజెక్టులను నిర్మించిన కేసీఆర్ రైతులను రాజులుగా చూడటమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిపై ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మించలేదని, ఇప్పుడు కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోందన్నారు. రైతుబంధు దేశంలోనే గొప్ప పథకమని, దీని వల్ల రైతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. -
పార్టీ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బుధవారం పార్టీ ప్రధాన కార్యలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తూర్పు యూపీ ఇన్‌ఛార్జ్‌గా ఆమె సోదరుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ జనవరి 23న నియమించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని అక్బర్ రోడ్ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ చాంబర్ పక్కనే ప్రియాంక కార్యాలయం ఏర్పాటు చేశారు. కాగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రియాంక గురువారం తొలి అధికారిక సమావేశంలో పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన వ్యూహాలను రూపొందించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లతో జరిగే సమావేశానికి ప్రియాంక హాజరుకానున్నారు. వాద్రాకు బాసట మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఎదుట హాజరైన తన భర్త, వాణిజ్యవేత్త రాబర్ట్ వాద్రాకు ప్రియాంక సంఘీభావం తెలిపారు. కుటుంబానికి అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. ఈడీ విచారణ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. వాద్రాను ఈడీ కార్యాలయం వద్ద డ్రాప్ చేసిన అనంతరం నేరుగా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న ప్రియాంక పార్టీ బాధ్యతలు స్వీకరించారు. కాగా వాద్రాకు ఈనెల 16 వరకూ మధ్యంతర బెయిల్‌ను ఢిల్లీ కోర్టు మంజూరు చేసింది. -
సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన శుక్లా
-
సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన శుక్లా
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఇటీవల నియమితులైన 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రిషి కుమార్ శుక్లా సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ పోలీస్ మాజీ చీఫ్ శుక్లాను శనివారం నూతన సీబీఐ డైరెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. సీబీఐ చీఫ్‌గా శుక్లా రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. మధ్యప్రదేశ్ డీజీపీగా వ్యవహరిస్తున్న శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ సీబీఐ చీఫ్‌గా ఎంపిక చేసింది. కాగా ఈ ఏడాది జనవరి 10న సీబీఐ చీఫ్‌గా తొలగించబడిన అలోక్ వర్మ స్ధానంలో శుక్లా నూతన బాధ్యతలు చేపట్టారు. సీబీఐలో ఉన్నతాధికారులు అలోక్ వర్మ, రాకేష్ ఆస్ధానాల మధ్య విభేదాల పర్వంతో ఇరువురు అధికారులపై కేంద్రం వేటువేసిన సంగతి తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులతో సీబీఐ చీఫ్‌గా తిరిగి నియమించబడిన అలోక్ వర్మను ప్రభుత్వం ఫైర్ సర్వీసుల డీజీగా బదిలీ చేయడంతో ఆయన ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేశారు. మరోవైపు రాకేష్ ఆస్ధానాను సీబీఐ నుంచి తప్పించిన ప్రభుత్వం వేరే మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది. -
ఈసీ చీఫ్‌గా సునీల్ అరోరా
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా సునీల్ అరోరా ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అరోరాను సీఈసీగా నియమించారు. ఓపీ రావత్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్ధానంలో అరోరా ఈసీ పగ్గాలు స్వీకరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, హరియాణా, జమ్మూ కశ్మీర్, సిక్కిం, ఒడిషా, మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అరోరా సారథ్యంలో జరగనున్నాయి. పదవీవిరమణ చేసిన ఐఏఎస్ అధికారి అయిన సునీల్ అరోరా గతంలో కేంద్ర సమాచార ప్రసార, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శిగా వ్యవహరించారు. ఆర్థిక, జౌళి మంత్రిత్వ శాఖతో పాటు ప్రణాళిక సంఘంలోనూ కీలక బాధ్యతల్లో అరోరా పనిచేశారు.1999-2002 మధ్య అరోరా పౌరవిమానయాన శాఖ సంయుక్త కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సునీల్ అరోరా ఆరేళ్ల పాటు కొనసాగుతారు. -
కనకదుర్గ ఆలయ ఈఓగా పద్మ బాధ్యతల స్వీకరణ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి కార్యనిర్వహణాధికారి(ఈఓ) గా ఐఏఎస్ అధికారిణి ఎం.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి దయ వలనే ఈవో పోస్టు వచ్చిందని, అమ్మే ముందుండి తనను నడిపిస్తోందని చెప్పారు. శాస్ర్తాలకు విరుద్ధంగా కాకుండా భక్తులకు ఉపయోగపడేలా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తానన్నారు. ఎవరి పని వారు చేసుకుంటే ఇబ్బందులు ఏమీ ఉండవని వ్యాఖ్యానించారు. మిగతా ఆలయాల్లో ఏవిధంగా అభివృద్ధి ఉందో ఆవిధంగా చేయాలని అమ్మవారు కలలోకి వచ్చి సూచించారని తెలిపారు. ఆ విధంగా నడుచుకుంటూ ఇంద్రకీలాద్రిపై అభివృద్ది కార్యక్రమాలు చేపడతానని పద్మ హామీ ఇచ్చారు. -
నూజివీడు ఇన్చార్జి ఆర్డీవోగా చక్రపాణి
నూజివీడు: స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం ఇన్చార్జి ఆర్డీవోగా గుడివాడ ఆర్డీవో ఎం.చక్రపాణిను నియమించారు. చక్రపాణి బుధవారం నూజివీడు సబ్‌కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రజల పనులను త్వరితగతిన చేయాలన్నారు. ఫైళ్లు పెండింగ్ ఉండటానికి ఏ మాత్రం వీల్లేదన్నారు. ఒక పని గురించి ప్రజలను పదేపదే కార్యాలయం చుట్టూ తిప్పుకోవద్దన్నారు. అలా తిప్పుకోవడం వల్ల కార్యాలయానికి, అధికారికి, సిబ్బందికి చెడ్డపేరు వస్తుందన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడి, వారు అడిగిన విషయాలకు సరైన వివరణ ఇవ్వాలన్నారు. నూజివీడు తహసీల్దారు దోనవల్లి వనజాక్షి ఆర్డీవోకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కార్యాలయ ఇన్చార్జి ఏవో కాకుమాను స్లీవజోజి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఈపీడీసీఎల్ సీఎండీగా నాయక్
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) సీఎండీగా ముదావత్ ఎం.నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖలోని కార్పొరేట్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు డైరెక్టర్లు బి.శేషుకుమార్, టి.వి.ఎస్.చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.రమేష్‌ప్రసాద్‌లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీజీఎంలు, జీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఇతర ఉద్యోగులతో పాటు విద్యుత్ ఉద్యోగుల యూనియన్ల ప్రతినిధులు కొత్త సీఎండీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విలేకరులతో నాయక్ మాట్లాడుతూ ఐదు జిల్లాల్లో నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలను సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేస్తామని తెలిపారు. -
ఇన్చార్జి డీపీఆర్వోగా వనమోహనరావు
మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లా పౌరసంబంధాలశాఖ ఇన్చార్జి అధికారిగా సోమవారం సలాది వనమోహనరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీపీఆర్వోగా పనిచేసిన గోవిందరాజులు జూలై 31వ తేదీన పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో విజయవాడ డివిజనల్ పీఆర్వోగా పనిచేస్తున్న వనమోహనరావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం మోహనరావు గోవిందరాజులు నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్వోలు శ్రీనివాస్, అలీ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జయలలిత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం తమిళనాడు సచివాలయంలో జయలలిత బాధ్యతలు చేపట్టారు. శనివారం జయలలిత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు 28 మంత్రులు ప్రమాణం చేశారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు ఆర్థిక శాఖ కేటాయించారు. -
సమాచార శాఖ కమిషనర్‌గా బీపీ ఆచార్య
హైదరాబాద్ సిటీ: సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్‌గా బీపీ ఆచార్య బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన ప్రణాళిక, పర్యాటక శాఖల ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రదీప్ చంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వున్నారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి నుంచి ప్రభుత్వం ఆయన్ను ఆర్థిక శాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. -
బాధ్యతలు స్వీకరించిన పార్థసారధి
హైదరాబాద్ సిటీ: తెలంగాణ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా పార్థసారధి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కొన్ని ఫైళ్లను పరిశీలించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జరిగిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఆ బాధ్యతల్లో పనిచేసిన పూనం మాలకొండయ్యకు వీడ్కోలు పలికారు. -
లోకాయుక్త సోదాలు
ఐదుగురు అధికారుల ఇళ్లపై దాడులు ఓ ఐఎఫ్ఎస్ అధికారి ఇంటిపై కూడా సాక్షి, బెంగళూరు : అక్రమ మార్గంలో ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు ఐదుగురు ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో లోకాయుక్త ఏక కాలంలో గురువారం సోదాలు నిర్వహించింది. ప్రతి ఒక్కరూ అదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వివరాలను కర్ణాటక లోకాయుక్త అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్.ఎన్ సత్యనారాయణరావు మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి హరికుమార్ ఝా మైసూరు సేల్స్ ఇంటర్ నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతని వద్ద రూ.2.17 కోట్ల స్థిరాస్తులు, రూ.48.42 లక్షల చరాస్తులు ఉన్నాయి. వీటి విలువ నిందితుని సంపాదన కంటే దాదాపు 100 రెట్లు అధికం. ప్రజాపనుల శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్న బీఎల్ రవీంద్రబాబు, అతని కుటుంబ సభ్యుల పేరుపై రూ.8.23 కోట్ల విలువైన భవంతులు, పొలాలు, ఇంటిస్థలాలు ఉన్నాయి. వీటితో పాటు రూ.2.48 కోట్ల బంగారు, వెండి, నగదు ఉన్నట్లు లోకాయుక్త సోదాల్లో బయటపడ్డాయి. అతని సంపాదన కంటే 324 రెట్ల ఎక్కువ ఆస్తులున్నట్లు తేలింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డెరైక్టర్‌గా (ఫైనాన్స్) విధులు నిర్వర్తిస్తున్న పద్మనాభన్ వద్ద రూ.2.96 కోట్ల స్థిర, రూ.19.50 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. అతని సంపాదనతో పోలిస్తే 107 రెట్ల ఆస్తులు అధికంగా ఉన్నట్లు తేలింది. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్‌లో అసిస్టెంట్ సెక్రెటరీగా పని చేస్తున్న ఆర్ భాస్కర్ కలిగి ఉన్న స్థిర, చరాస్తుల విలువ అతని సంపాదన కంటే 127 రెట్లు ఎక్కువగా ఉంది. రాష్ట్ర అబ్కారీ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసమూర్తి వద్ద 207 రెట్ల ఆక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.